మంత్రి కొడాలి నాని పలు సందర్భాల్లో వాడే భాష, సంయమనం కోల్పోయి చేసే వ్యాఖ్యలపై అభ్యంతరాలు ఉంటయ్, ఉండాలి… కానీ తను చాలాసార్లు ఎక్స్టెంపర్గా నిజాలే చెబుతాడు… కడుపులో ఉన్న భావాన్ని కక్కేస్తాడు… ఎమోషన్ కంట్రోల్ అనేది ఉండదు… అది తన తత్వం… నిజానికి పేకాట కేసులకు సంబంధించి తను నిన్న చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ ఉన్నట్టు అనిపించడం లేదు… తన వ్యాఖ్యలను పీకీ గీకీ ఏదో పెంట చేయాలని ప్రయత్నించడమే తప్ప విపక్షాలకు అందులో గిట్టుబాటు […]
రేవంత్ కేంద్రంగా… తెలంగాణ పెద్ద తలల ‘రాజీ’కీయం… అనూహ్యం…
రాజకీయ నాయకులు…. ఎప్పుడు కలిసిపోతారో, ఎందుకు కలిసిపోతారో, ఏ పాయింట్ వద్ద రాజీ కుదురుతుందో.., లేదా… ఏ ఇష్యూ మీద తన్నుకుంటారో అర్థం కాదు… అన్నీ తెరవెనుక మార్మిక యవ్వారాలు… అంతిమంగా జనం అమాయకులు…! నిజానికి బోలెడు ఉదాహరణలు మనకు నిత్యరాజకీయాల్లో కనిపిస్తూనే ఉంటయ్… కొన్ని సంకేతాలు స్పష్టాస్పష్టంగా మీడియా ధోరణిలో కనిపిస్తుంటయ్… మొన్న టెన్‌టీవీలో కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి సుదీర్ఘ డిబేట్ చూసిన చాలామందికి ఓపట్టాన జీర్ణం కాలేదు… ఆమధ్య మీకు గుర్తుందా..? సీఎం ఆఫీసు […]
తన ఎజెండా అగ్గిపుల్ల గీయడమే..! తను ఊహించినట్టే ఎదురుదాడి, తిట్లు..!!
ఏమన్నాడు బండి సంజయ్..? ‘‘ఏపీలో ఒక మతం రాజ్యమేలుతుంది… బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలి… దుబ్బాక, గ్రేటర్ ఫలితాలే తిరుపతిలో పునరావృతం అవుతాయి… వైసీపీ రెండే కొండలు అంటుంది… ఏడుకొండల వాడా గోవిందా అనేది బీజేపీ సిద్ధాంతం… తిరుపతి ఉపఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది… వైసీపీ ప్రభుత్వం మూటామూల్లె సర్దుకునేలా తరిమికొడతాం… ఏపీ దేవాదాయ శాఖ పూర్తి ప్రక్షాళన అవసరం… హిందువుల కానుకల్ని కూడా ఈ ప్రభుత్వం దారిమళ్లిస్తోంది… […]
స్వామీ! వ్యాక్సిన్ వస్తే కరోనా పోతుందా? శిష్యా! కరోనా పొతే, వ్యాక్సిన్ వస్తుందా?
వ్యాక్సిన్లు ఎన్ని రకములు? అవి ఏవి? వాటి గుణదోషములను వర్ణింపుము? అన్న పది మార్కుల ప్రశ్నకు ఇది సమాధానం కాదు. వ్యాక్సిన్ల తొందరపాటు, అయోమయం, అస్పష్టత, గందరగోళం మీద మరింత గందరగోళం, భయపెట్టే సమాధానం. కాబట్టి వ్యాక్సిన్ల మీద- ప్రత్యేకించి కరోనా వ్యాక్సిన్ మీద ఇప్పటికే స్పష్టత, ధీమా ఉన్నవారు ఇక్కడితో చదవడం ఆపేయవచ్చు. చదివి మరింతగా భయపడతామేమో అనుకునేవారు కూడా ఇక్కడితో చదవడం ఆపేయడం మంచిది. వ్యాక్సిన్లు ప్రధానంగా నాలుగు రకాలు. ఆ సాంకేతిక వివరాలకు […]
కేసీయార్ ఇక ‘‘మై హోం’’ అనలేడా..? త్వరలో అది ‘‘ఆరెంజ్ హోం’’ అవుతోందా..?!
ఓ వార్తను సీపీఎం వారి నవతెలంగాణ పత్రిక మరీ కనీకనిపించనట్టుగా… వేద్దామావద్దా అన్నట్టుగా… సర్లె, వేసిచూద్దాంలే అని సాహసించినట్టుగా పబ్లిష్ చేసింది… అదేమిటయ్యా అంటే..? ప్రముఖ వ్యాపారి మైహోం జూపల్లి రామేశ్వరరావు బీజేపీలో చేరబోతున్నాడు… ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేస్తున్నారు అనేది ప్రధాన సారాంశం… నిజానికి పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… తెలుగు రాష్ట్రాల్లో ధనిక సెక్షన్ మాత్రమే బీజేపీకి కావాలి… రాకపోతే సీబీఐ, ఈడీ, ఐటీ అని బెదిరించగలదు కూడా… బీజేపీకి కార్పొరేట్లే కావాలి… […]
అందుచేత అన్ని గుళ్ల ధర్మకర్తలు రాత్రిళ్లు విగ్రహరక్షణకు బయల్దేరాలహో…!!
ఓ మిత్రుడి సోషల్ వాల్ మీద కనిపించింది… సారాంశం ఏమిటంటే..? ‘‘నువ్వు-నేను’’ అనే హిట్ సినిమా… అందులో ఓ సన్నివేశం… క్లాస్ రూం… కమెడియన్ సునీల్ లేచి నిలబడి ఏదో చెబుతుంటే, ఓ అమ్మాయి తన మొహం చాటుచేసుకుంటూ… ‘మూసుక్కూచోరా పూలచొక్కా’ అంటుంది… ఎవరన్నారో తెలియదు సునీల్‌కు… ‘‘ఇక్కడ ఎవరో నన్ను పూలచొక్కా అన్నారు, లెక్చరర్ వచ్చి నాకు క్షమాపణ చెప్పేదాకా ఊరుకునేది లేదు’’ అని కస్సుమంటాడు… ‘‘ఓహోహో, ఇది మరీ బాగుంది… కొత్త టెన్షన్లు పెట్టకు […]
ఈయనేం పోలీసు..? అసలు ఎంత నామర్దా..? ఎంత నామోషీ..? శిక్షించాలె…!!
అమీన్ సాబ్… అంటే సబ్ ఇన్స్పెక్టర్… ఎంత ఖదర్ ఉండాలె… గబ్బర్‌సింగ్ లెక్క ఎంత అధికారం ఉండాలె… అరె, మరీ గిట్ల చేసుకుంట, మొత్తం పోలీసు అనే పదానికే నామర్దా… నామోషీ… ఎంత ఫ్రెండ్లీ పోలీస్ అని పెద్ద పోలీసులు చెప్పగానే, ఇంత అరాచకమా..? అబ్బే, పోలీస్ అనే పదానికే అవమానం… అసలు ఏందివయ్యా నువ్వు..? అంత కడక్ కడక్ ఖాకీ డ్రెస్సు వేసుకున్నవ్… చేతికి లాఠీ ఇచ్చిండ్రు… పైగా గన్ ఉంది… ఎంత జోష్ ఉండాలె […]
సీపీఎం చేస్తే సూపర్… బీజేపీ చేస్తే బ్లండర్… అసలు పంచాయితీ ఏంటంటే..?
ఏదైనా చిన్న తీగె దొరికితే చాలు…. పీకిపీకి పెంట చేయడమే…! కేరళలో క్రిస్టియానిటీ చాలా ఎక్కువ తెలుసు కదా… రెండు పెద్ద చర్చిలున్నయ్… మలంకర అర్దోడాక్స్ ఒకటి, మరొకటి జాకోబియన్ సిరియన్… ఒక్క జాకోబియన్ చర్చి పరిధిలో కేరళలోనే దాదాపు వెయ్యి చర్చిలు, వేల కోట్ల ఆస్తులున్నయ్… దీన్నుంచి అప్పుడెప్పుడో… 1934లో మలంకర గ్రూపు విడిపోయింది… అప్పట్నుంచీ చర్చిలపై, ఆస్తులపై తగాదాలు నడుస్తూ ఉన్నయ్… ఇదీ అసలు కథ… అన్ని వివాదాలను కోర్టులు, స్థానిక పెద్ద మనుషులు […]
అయ్యా మోడీజీ… ఈ ఫాస్టాగ్ దరిద్రం మా నెత్తిన దేనికి తండ్రీ..?!
అప్పుడెప్పుడో కేసీయార్ అన్నట్టు గుర్తు…! ‘‘మోడీ జనానికి కనెక్ట్ కాడు’’… అది అక్షరాలా నిజం… దేశప్రజలకు వీలైనంత రిలీఫ్ ఇవ్వాలనే ఆలోచన ఏ కోశానా ఉండదు మనిషికి… పక్కా కార్పొరేట్ ధోరణి… ఎవడెలా చస్తే మనకేంటి అన్నట్టుగానే ఉంటుంది… మరేం చేస్తాం, ఒక్క దీటైన నాయకుడూ ప్రతిపక్షంలో ఉంటే కదా.., తెలంగాణలో దీటైన ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం కేసీయార్‌కు బలం ఎలాగో… జాతీయ స్థాయిలో ఎవరూ లేకపోవడం మోడీ బలం… అంతే… కానీ అదే జనరంజక పాలనకు […]
ఏం చెప్పావు స్వామీ..? ఫ్రీ వైద్యం కోసమే ఎంపీ పోస్టులో కొనసాగుతావా..?!
నిజానికి ఆయన రాజకీయాల్లో ఏమీ తెలియని అమాయకుడేమీ కాదు… తను సోషల్ వర్క్‌లో పీజీ చేశాడు… ఒకప్పుడు అహ్మద్ పటేల్ స్ట్రాంగ్ హోల్డ్ అయిన గుజరాత్, భరూచ్ స్థానం నుంచి 1998 నుంచి ఎంపీగా గెలుస్తూనే ఉన్నాడు… అంతకుముందు ఎమ్మెల్యే… ఒక దశలో కేంద్ర గిరిజన మంత్రిగా కూడా పనిచేశాడు… వయస్సు 63 ఏళ్లు…. పార్టీ బీజేపీ… ఎవరి గురించి ఇదంతా అంటారా..? ఆయన పేరు మాన్సుక్భాయ్ ధన్జీభాయ్ వాసవ… సింపుల్‌గా అందరూ వాసవ అని పిలుస్తారు… […]
డిస్టర్బింగ్ ఫోటో..! జగన్ సర్కారు ఏం చేస్తోంది..? జవాబు దొరకని ప్రశ్న..!
హిందువులపై… హిందూ సంస్కృతిపై… హిందూ మతంపై… దాడులు ఈరోజు కొత్తేమీ కాదు… హిందూ జాతినే సమూలంగా నిర్మూలించన్నంత కసిగా జరిగిన దాడులు కూడా ఉన్నయ్… జరుగుతూనే ఉంటయ్… అది కాదు, జగన్ ప్రభుత్వం వచ్చాక ఏపీలో అకస్మాత్తుగా హిందూ వ్యతిరేక శక్తులు బలం పుంజుకోవడం అనేది హిందూ మతాభిమానులకు కలవరం కలిగిస్తున్న పరిణామం… ఆల్రెడీ హిందూ పరిరక్షణ సంఘాలు రాష్ట్రంలో జోరుగా మతమార్పిళ్లు సాగుతున్నాయనీ, క్రిస్టియానిటీ చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోందని ఆరోపిస్తున్నాయి… అదుగో అక్కడ అలా […]
వచ్చాడయ్యో స్వామీ..! ఆయన ఉద్యమిస్తానంటే జగన్ సర్కారులో దడ…
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని రోజులూ… ఓ శాలువా కప్పుకున్న పెద్దమనిషి అన్ని టీవీలలో భీకరంగా వాదించేవాడు… బొచ్చెడు గణాంకాల్ని ఏకరువు పెట్టేవాడు… సరే, సత్యవాణి దగ్గర్నుంచి గజల్ సీను, లగడపాటి, అశోక్‌బాబు దాకా బోలెడుమంది… ఈ చలసాని శ్రీనివాస్ కూడా అలాంటి వారిలో ఒకరులే అనుకునేవాళ్లు తెలంగాణ ఉద్యమకారులు… కొన్ని సంస్థలు, సంఘాలు ఉంటయ్… వాటి పుట్టుక ఎప్పుడో, వాటి నిర్మాణం ఏమిటో, ఏం ఉద్యమాలు నిర్మించారో, ఊరూరా ఏం చైతన్యాన్ని రగిలించారో, ఆయా కమిటీల్లో ఎవరెవరున్నారో […]
ఈ కృత్రిమ సూర్యుడు… ప్రపంచగతినే సమూలంగా మార్చేయబోతున్నాడు…
టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది… కరోనా వంటి ప్రాణాంతక వైరసులు ఉప ఉత్పత్తుల్లాగా ప్రపంచం మీద విరుచుకుపడుతున్నా సరే… ఆ దుష్ట చైనీయుడు ప్రపంచానికే ఓ శాపంగా మారినా సరే… టెక్నాలజీ ఆగదు… మనిషి రోజురోజుకూ కొత్తది కనిపెడుతూనే ఉంటాడు… అదే మనిషి ప్రగతికి బాటలు వేస్తోంది… దాన్నెవడూ ఆపలేడు… అయితే ప్రకృతి ఇవన్నీ బ్యాలెన్స్ చేసేలా రోజురోజుకూ కొత్త విపత్తుల్ని ప్రయోగిస్తూనే ఉంటుంది… అది వేరే సంగతి… ఆమధ్య మనం ఓ వార్త చదివాం… మన దిక్కుమాలిన […]
ఈటల సమక్షంలోనే… కేసీయార్ సంధించాల్సిన కొన్ని ప్రశ్నలివి…
బ్యూరోక్రాట్ల పాలనలో చిక్కిన తెలంగాణ..! చాలా పెద్ద మాట నిజానికి… కానీ జరుగుతున్నది అదే… నిర్ణయాలు తీసుకునేది కేసీయార్ లేదా ఉన్నతాధికారులు… అంతే… రాజకీయంగా నష్టం వాాటిల్లితేనే కేసీయార్ ఏదో ఓ దశలో కడిగేసుకుంటాడు… అనేక విషయాల్లో ఆయన యూటర్న్‌కు అదే కారణం… ఆ దిద్దుబాటను కూడా ఆయన అధికారగణం సరిగ్గా చేయనివ్వరు… ఆ తీరూ గమనించాం… తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమించిన అనేక నోళ్లు కూడా కిక్కుమనవు… ఒకటి ఆశ్చర్యం అనిపించేది ఏమిటంటే… తెలంగాణ పిల్లలకు […]
రజినీకాంత్..! కొబ్బరికాయ కొట్టకముందే గుమ్మడికాయ కొట్టేశాడు దేనికి..?
రజినీకాంత్ రాజకీయ వైరాగ్యం మీద రకరకాల విశ్లేషణలు వస్తూనే ఉంటయ్… జోకులు పేలుతూనే ఉంటయ్… కోట్ల మంది అభిమానులు నిరాశపడొచ్చు… ఈలోపు హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద ఊహాగానాలు నడుస్తూ ఉంటయ్… కమల్‌హాసన్ ఫ్యాన్స్ లోలోపల ఆనందించవచ్చు… కానీ అనేక ఏళ్లుగా ఒకడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్న రజినీకాంత్ ‘‘రోబో’’ సినిమాలో చిట్టి తనంతటతానే డిస్మెంటల్ అయిపోయినట్టుగా…. ఓ భారీ సినిమాకు కొబ్బరికాయ కొట్టకముందే గుమ్మడికాయ ఎందుకు కొట్టాడు..? ( కార్టూనిస్ట్ […]
ఇళయరాజా..! ఓ పంచాయితీ గోక్కున్నాడు… మాటమర్యాద పోయాయ్…
ఇళయరాజా… ఈయన జగమెరిగిన సంగీత దర్శకుడు… స్వరకర్త… అయితేనేం..? లౌకిక, వ్యవహారిక అంశాల్లో ఆ పేరుప్రఖ్యాతులేమీ ఉపయోగపడవు కదా… ఎల్వీ ప్రసాద్ ఉన్నప్పుడు మద్రాసులోని తన స్టూడియోలోని ఓ గదిని ఇళయరాజాకు కేటాయించాడు, వాడుకో బ్రదర్ అన్నాడు… రూం నంబర్ వన్… దాన్ని ఇళయారాజా రికార్డింగ్ థియేటర్ అని పిలిచేవారు… మూడున్నర దశాబ్దాల క్రితం నాటి మాట ఇది… అప్పట్లో ఈయన ఫుల్ బిజీ… స్టూడియో బిజీ… బోలెడు సినిమాలు… రికార్డింగులు, సిట్టింగులు… ఈయన అవసరం వాళ్లకుంది… […]
యూటర్న్ బాషా..! బీపీ పెరిగిందంటే చాలు… కొత్త పార్టీగీర్టీ ఉల్టాపల్టా….
ఏయ్… ఎవడ్రా అదీ… మా వకీల్ సాబ్ గురించి మళ్లీ మాట్లాడుతున్నారు…? ఆయ్ఁ……… ఆ రజినీకాంత్ అంటే 70 దాటాడు… అసలు కమల్‌హాసనే 66 దాకా వచ్చాడు… వాళ్లకూ మా యాభయ్యేళ్ల పవన్ దేవుడితో పోలిక పెడుతున్నారు..? తాటతీస్తాం… ఈ నానీలు, డాడీలు, జగన్లూ జాన్తానై… ఆఫ్టరాల్ మా నాగబాబు అన్న, మా నాదెండ్ల మనోహర్ దోస్త్ చాలు… మా పార్టీని గెలుపు తీరాలకు తీసుకుపోవడానికి… సరే, సరే… ఈ మాటలేమిలే గానీ… రజినీకాంత్ అనబడే ఓ […]
కేసీయార్ సారూ… తెలంగాణ రాష్ట్రమొచ్చినా ఈ సీట్ల నష్టం తప్పదా..?
తెలుగు ప్రజల్లో ప్రాంతీయ చిచ్చు పెట్టినవి ఏమిటి..? ఉద్యోగాలు, అడ్మిషన్లు… ఎవరు స్థానికుడు, ఎవరు స్థానికేతరుడు అనే పంచాయితీలే… జై ఆంధ్రను, జై తెలంగాణను రగిలించాయి… మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది కూడా హైదరాబాద్ ఫ్రీజోన్ అనే తగాదాతోనే…! చివరకు విడిపోయాం… ఎవరి బతుకు వాళ్లదే… కాదు, విభజన తగాదాలు సాగుతూనే ఉంటయ్… ఉన్నయ్… పోతిరెడ్డిపాడు పొక్కను ఇంకా తవ్వీ తవ్వీ, నీళ్లను జగన్ ఎత్తుకెళ్తానంటున్నాడు… నిధులు మాయమైపోయి రెండున్నర లక్షల కోట్ల అప్పు చేతికొచ్చింది… […]
సారు కొనడు… అంతే… ఎలాగైనా, ఎక్కడైనా అమ్ముకొండి… ఇలా కూడా…!!
మీ ఇష్టమొచ్చిన చోట పంట అమ్ముకొండి… నేనయితే కొనను, ఇప్పటికే చేతులు కాలినయ్… అసలు పంటలు కొనడం ప్రభుత్వం పనే కాదు… ఊళ్లల్లో కొనుగోలు కేంద్రాల్ని మూసేయండి………. ఇదే కదా, కేసీయార్ నిర్ణయం… అదే కదా చెప్పింది… సరే, వ్యాపారులు సరైన ధరకు కొనరు, అసలు కొన్నిసార్లు ఏ ధరకూ కొనరు… మరోవైపు మిత్తీలు, ఖర్చులు తరుముతుంటాయి… మరి రైతు ఏం చేయాలి..? హహహ… దానికి మార్గం సారు గారి సొంత పత్రిక నమస్తే తెలంగాణ రాసేసింది […]
కేసీయార్‌కు క్రెడిట్స్ ఇవ్వరు సరే… కానీ మంచి మార్పును గుర్తించాలి కదా…
కేసీయార్ ఏదో గొప్ప సాధించాడు అని రాయడానికి మనసొప్పకపోతే పోనీ… కానీ నిజాన్ని రాయాలి కదా…! ఆనందపడే ఓ సామాజిక మార్పును తెలియజెప్పాలి కదా..! కేసముద్రంలో ఒక కుటుంబం ఆడపిల్లను కన్న తమ కోడలికి అపూర్వంగా స్వాగతం పలికిన వార్తను దాదాపు అన్ని పత్రికలూ వేశాయి… (అందులోని విశేషాన్ని గుర్తించలేని ఓ పెద్ద దరిద్రం తప్ప)… అది దేనికి సూచిక..? తెలంగాణ సమాజం ఆడపిల్లను మహాలక్ష్మిగానే భావిస్తోంది… ఆడపిల్ల అని తెలుసుకుని అబార్షన్లు చేయడాలు, పుట్టగానే చంపేయడాలు […]