ఇంకేముంది..? తెలంగాణ రాష్ట్ర విద్యుత్తును ఆదానీ పరం చేయబోతున్నారు… అని నిన్నటి నుంచీ ఒకటే రచ్చ… బీఆర్ఎస్ మౌత్ పీస్ నమస్తే తెలంగాణ ఓ ఫస్ట్ పేజీ స్టోరీ పబ్లిష్ చేసేసి అయ్యో, అమ్మో, ఇంకేమైనా ఉందా..? పంపుసెట్లకు మీటర్లు పెడతారు, ఉచిత విద్యుత్తు ఉండదు, ఇక వేల కోట్ల వ్యవస్థలపై ఆదానీ గుత్తాధిపత్యం, కృత్రిమ డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకునే ప్రమాదం, సేవలపై అదనపు భారమూ పడొచ్చు అని మొత్తుకుంది… నిజంగా ఆ ప్రమాదం ముంచుకొస్తున్నదా..? […]
వాళ్లెవరు..? ఆ అరాచక శక్తులపై రేవంత్‌రెడ్డి యాక్షన్ ఎందుకు వద్దు..?!
నిన్న రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ కొన్ని వివరాలు చెప్పాడు కదా… ఈరోజు ఆంధ్రజ్యోతిలో తప్ప వేరే పత్రికల్లో రిపోర్ట్ అయినట్టు కనిపించని కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి… సరే, రాజకీయంగా బీఆర్ఎస్ నుంచి తమ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను సమర్థించుకున్నాడు… తప్పదు… అలాంటోళ్ల మీద వెంటనే అనర్హత వేటు వేయాల్సిందేనని బీఆర్ఎస్ ఎంత గాయిగత్తర చేస్తున్నా ఆ ప్రయాసకు, ఆ డిమాండ్లకు అసలు విలువ లేదు… ఎందుకంటే..? నిజంగానే తెలంగాణలో మునుపెన్నడూ లేని […]
ఏం..? తమన్నా జీవితం సింధీ సిలబస్‌లో ఎందుకు ఉండొద్దు…?
ఒక వార్త… కర్నాటకలోని హెబ్బాళలో ఓ హైస్కూల్ ఉంది… అది సింధీల స్కూల్… ఇప్పుడది వివాదంలో ఇరుక్కుంది… ఎందుకంటే..? అది తమ విద్యార్థుల సిలబస్‌లో ఏడవ తరగతి పాఠ్యాంశాల్లో ప్రముఖ సింధీ వ్యక్తుల పేరిట రణవీర్‌సింగ్, తమన్నా భాటియా పేర్లను, వారి వివరాలను చేర్చింది… ఇదీ వివాదం… వెంటనే ఆ స్కూల్లో చదివే విద్యార్థులు ఏకంగా బాలల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు… (అందులో సింధీలే గాకుండా ఇతర పిల్లలూ చదువుతారు)… ఏమనీ అంటే… పలు […]
రెడ్డి ఎమ్మెల్యేలతో కేసీయార్ భేటీ..! నమ్మడం లేదా..? చివరి ప్రయత్నమా..!!
కేసీయార్ తన ఫామ్ హౌజులో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో భేటీలు వేస్తున్నాడు… అరె, భయ్, జెర పార్టీని విడిచిపెట్టి పోకున్రి భయ్… మళ్లీ మనమే అధికారంలోకి వస్తం, మనం మళ్లీ ఉజ్వలంగా వెలిగిపోతం, మీ తోడు, నన్ను నమ్మున్రి అని చెబుతున్నాడు… సరే, కష్టకాలంలో పార్టీని, కేడర్‌ను కాపాడుకోవడానికి తప్పదు, తప్పులేదు… ఐతే… రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఇంకా తొక్కేకొద్దీ… ఏమవుతుంది..? బీఆర్ఎస్ నిజంగానే బలహీనపడుతుంది… దానికి ప్రధాన బలమైన […]
మేఘా కృష్ణారెడ్డి..! ఏకంగా అంబానీలు, ఆదానీలు, వేదాంతలకు పోటీగా..!!
కొన్ని సక్సెస్ స్టోరీలు అనూహ్యంగా ఉంటయ్… అసలు నమ్మలేని రీతిలో… మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రస్థానం కూడా అదే… ఏదో చిన్నా చితకా సబ్ కంట్రాక్టులు చేసుకునే సంస్థ ఈరోజు ఆదానీ, అంబానీ, వేదాంత, టాటాలతో కూడా పోటీపడుతోంది… మేఘా ఓనర్లు ఆల్రెడీ టాప్10 ధనికుల్లో చేరిపోయారు… ఉజ్వలంగా వెలిగిపోతోంది కథ… తాజాగా ఈ సంస్థ ఏకంగా ఓ అణు విద్యుత్తు ప్లాంటు నిర్మాణం కంట్రాక్టు చేజిక్కించుకుంది… న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్నాటకలోని కైగా […]
సాక్షిలో సంస్థాగత భారీ మార్పులు… మారక తప్పని పరిస్థితి ఏర్పడింది..!
సాక్షిలో ఈమధ్య కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి… హైదరాబాద్ సిటీ పాఠకుల్ని టార్గెట్ చేసుకుంది పత్రిక… అటు ఏపీలో గడ్డుకాలం తప్పదు, తెలంగాణలోనూ యాంటీ రేవంత్ లైన్- ప్రొ కేసీయార్ లైన్ ఇంకా పాఠకుల్ని మెప్పించదు… సో, మెట్రో కల్చర్, అన్ని ప్రాంతాల ప్రజలూ ఉన్న మార్కెట్ కీలకమైన హైదరాబాద్‌ను టార్గెట్ చేసుకుంది యాజమాన్యం… గుడ్, దానికి తగ్గట్టే, ఫస్ట్ నిలువు చీలిక పేజీ సిటీ ఆఫ్ బీట్, నాన్ రొటీన్ వార్తల్ని బాగా ప్లాన్ చేస్తున్నారు… అభినందనీయమైన […]
‘వార్త దగ్గరికి నేను వెళ్లినా… నా దగ్గరకే వార్త వచ్చినా… నాకే డబ్బు’
పతంజలి గోపాత్రుడు …. చాలా ఏళ్ళ క్రితం పోస్ట్ ఆఫీస్ లో మిత్రుడి కోసం ఎదురు చూస్తూ ఇండియా టుడే సాహిత్య సంచికలో పతంజలి గోపాత్రుడు చదువుతూ గట్టిగా నవ్వకుండా ఉండలేక పోయాను . భూమి బల్లపరుపుగా ఉంది, నా నమ్మకం నా ఇష్టం అని గోపాత్రుడు వాదిస్తాడు … గుండ్రంగా ఉంది అని ఇతరుల వాదన .. వివాదం కోర్టుకు వెళుతుంది .. గోపాత్రుడిపై గ్రామ పెద్ద విజయం సాధిస్తాడు .. విజయం సాధించిన గ్రామపెద్ద […]
జై పాలస్తీనా..! ఒవైసీ నినాదంతో కొత్త రగడ… తప్పొప్పులపై చర్చ..!!
ఈసారే ఈ విపరీత ధోరణి విపరీతంగా కనిపించింది… లోకసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రకరకాల నినాదాలు చేశారు సభ్యులు… రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగ ప్రతిని అందరికీ చూపిస్తూ ప్రమాణం చేసి, చివరలో జై సంవిధాన్ అన్నాడు… దాన్ని అభ్యంతరపెట్టాల్సిన అవసరం లేదు… కానీ..? ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని అక్కడ ప్రదర్శించాల్సిన అవసరమేముంది..? బీజేపీ నాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ (50 ఏళ్లయిన సందర్భంగా) ని తిట్టిపోస్తోంది… స్పీకర్ కూడా తన ప్రసంగంలో నాటి ఎమర్జెన్సీ రోజుల్ని […]
ప్రొటెం స్పీకర్, స్పీకర్ ఎంపికలో… ఇరుపక్షాలదీ సంకుచిత వైఖరే…
లోకసభలో రెండు పక్షాల నుంచి నిరాశాపూర్వక ప్రవర్తనే కనిపించింది… ప్రొటెం స్పీకర్‌గా సురేష్‌ను నియమించాలని విపక్షం కోరింది… తను దళిత్, సీనియర్… కానీ మోడీ ప్రభుత్వం నో అనేసింది… ఇదేమిటయ్యా, అత్యంత సీనియర్‌ను కదా ప్రొటెం స్పీకర్‌గా నియమించాల్సింది అనడిగింది… నో, నో, సురేష్ ఎక్కువసార్లు గెలిచాడు, కానీ మధ్యలోబ్రేక్ ఉంది, వరుసగా ఏడుసార్లు గెలిచిన భర్తృహరి మహతాబ్ ఉన్నాడు అని చెప్పి హడావుడిగా రాష్ట్రపతి దగ్గర ప్రమాణం చేయించి ప్రొటెం స్పీకర్ చేసేసింది… నిజానికి ఇక్కడ […]
అసలే చిక్కుముడి… కేసీయార్ మరింత బిగుసుకునేలా చేసుకుంటున్నాడా..?
తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేసిన కేసీఆర్ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్న కేసీఆర్ నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందన్న కేసీఆర్ జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ల పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కేసీఆర్ ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగం …… ఇదీ తాజా వార్త… చిక్కుముడి మరింత […]
నయం… ఆంధ్రా మహిళా రెడ్డికి ఐదు పగ్గాలు అని రాయలేదు… గుడ్…
నమస్తే తెలంగాణలో ఓ ప్రధాన వార్త… అందులోనే ఓ బాక్స్ ఐటమ్… వార్త ఎలా ఉందనేది పక్కన పెడితే… ఆ ఐఏఎస్ అధికారిణి పేరును ప్రత్యేకంగా రాస్తేనే నవ్వొచ్చింది… అందులోనే ఆ పత్రిక మార్మికంగా ఏదో చెప్పాలని ప్రయత్నించింది ఫాఫం… ఇదంతా ప్రయాస దేనికి..? నేరుగానే రాయొచ్చు కదా అనిపించింది… ఆమె పేరు ఆమ్రపాలి కాట… విశాఖపట్నం జననం… (ఒంగోలు శివారులోని నరసాపురం అగ్రహారం వాళ్ల సొంతూరు)… తండ్రి ఆంధ్ర యూనివర్శిటీలో అధ్యాపకుడు… ఆయన పేరు వెంకటరెడ్డి… […]
నిజమేనా..? చివరికి ఫేక్ కరెన్సీ ముద్రణలోకి నక్సలైట్లు కూడా..?!
కొన్ని పత్రికలయితే మరీ అప్రధానంగా కవర్ చేశాయి… కొన్ని పర్లేదు… అదేమిటంటే..? నక్సలైట్లు ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్నారనే వార్త… చత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా పోలీసుల ఆరోపణ ఇది… సరే, అనేకసార్లు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం, బదనాం చేయడం కోసం పోలీసులు నక్సలైట్ల మీద పలు ఆరోపణలు చేస్తుంటారు… ఇదీ అలాంటిదే కావచ్చు, కాకపోవచ్చు… కానీ నిజమే అయితే మాత్రం..? ఇన్నేళ్ల వేనవేల త్యాగాల, రక్త పోరాటాల చరిత్రకు మకిలి పట్టినట్టే… కఠినంగా ఉన్నా […]
చెత్త నిర్ణయం..! బ్యూరోక్రాట్లు మంత్రులైతే ఇలాగే ఉంటుంది మరి..!!
నిజమే, మిత్రుడు నారపరాజు నరసింగరాావు చెప్పినట్టు… అయోధ్య కట్టినా, ఆర్టికల్ 370 ఎత్తేసినా, లా అండ్ ఆర్డర్ బాగున్నా, ఇంకేమేం చేసినా సరే… మోడీ నమ్మి పెత్తనాలు ఇచ్చిన బ్యూరోక్రాట్ పొలిటిషియన్లు తీసుకునే నిర్ణయాలు జనంలో వ్యతిరేకతను పెంచుతాయి… కనీసం ప్రధాని కార్యాలయానికి వీటిని సమీక్షించే టైమ్ లేనట్టుంది… 300 నుంచి 240కు ఎందుకొచ్చామో ఓసారి బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి… ఉదాహరణకు ఈ నిర్ణయమే తీసుకుందాం… అశ్విన్ వైష్ణవ్ అనే బ్యూరోక్రాట్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, ఏకంగా రైల్వేలకు […]
కాశికి పోతే కాటికి పోయినట్టు కాదు… ఆ జీవన్ముక్తి క్షేత్రం బాగా మారింది..!!
కాశి… వందలేళ్లుగా హిందూ పురాణాల్లోనూ ప్రస్తావించిన పుణ్యనగరి… జీవితంలో ఒక్కసారైనా కాశికి వెళ్లాలని కోరుకోని హిందువు ఉండడు… (గతంలో, ఇప్పుడు జ్ఞానం విపరీతంగా పెరిగి డిఫరెంటుగా ఆలోచించేవాళ్లున్నారు…) కానీ కాశికి పోతే కాటికి పోయినట్టే అనేవాళ్లు గతంలో… దట్టమైన అడవుల గుండా, కృూరమృగాలు, ప్రతికూల పరిస్థితుల్లో కాశికి చేరుకోవడం అంటేనే కైవల్యమనే దురవస్థ ఆనాడు… కాశీకి వెళ్లి తిరిగి వస్తే ఊరుఊరంతా నీరాజనం పట్టేది… హారతులతో స్వాగతించేది ఒకప్పుడు… అలాంటి చారిత్రిక కాశి ఇన్నేళ్లూ దిక్కూమొక్కూ లేక… […]
ఆయన అక్షర యోధుడట… మరి ఈయన్ని ఏమని పిలుద్దాం…!?
గోరా శాస్త్రి తెలుగు స్వతంత్రకు సంపాదకులు … ఆరుద్రతో త్వమేవాహం రాయించారు ( తెలుగు స్వతంత్రలో )… బైరాగితో నూతిలో గొంతుకలు రాయించారు … డాక్టర్ సి నారాయణ రెడ్డిని ప్రోత్సహించింది వారే … శ్రీశ్రీ ప్రాస క్రీడలు , చలంతో మ్యూజింగ్స్ ఆయనే రాయించారు … కొడవటి గంటితో సినిమా రివ్యూలు , శ్రీదేవితో కాలాతీత వ్యక్తులు ఆయనే స్వతంత్రలో రాయించారు . ఆంధ్రభూమి, డక్కన్ క్రానికల్ రెండింటికి ఇంగ్లీష్ తెలుగు సంపాదకీయాలు రాశారు . […]
చైనా ట్రాప్… ఇండియా పట్టు నుంచి జారిపోతున్న బంగ్లాదేశ్…
మాట్లాడితే చాలు, అమెరికా సామ్రాజ్యవాదం, దుర్నీతి వంటి చాలా పదాలు వాడుతుంటారు చాలామంది… అఫ్కోర్స్, చైనా మత్తులో ఉండి అలా కొన్ని పడికట్టు పదాల్ని వాడేస్తుంటారు… కానీ చైనా కపటం మాత్రం కనిపించదు వాళ్లకు… టిబెట్‌ను గుట్టుచప్పుడు గాకుండా మింగిన ఆ అనకొండకు తన ఇరుగూపొరుగూ దేశాలన్నింటితోనూ తగాదాలున్నయ్… మన ఆక్సాయ్‌చిన్ మింగేయడమే కాదు, అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా గుటుక్కుమనాలనే ఆకలి దానిది… మన చుట్టూ ఉన్న దేశాల్ని తన ట్రాపులో పడేసుకుని, మనల్ని చక్రబంధంలో ఇరికించే […]
సజ్జనార్ సర్… ట్వీట్లు కాదు, సీరియస్‌గానే పనిపట్టండి… సొసైటీ హర్షిస్తుంది…
అందరికీ తెలిసిందే కదా… రీల్స్, షార్ట్స్ పిచ్చిలో పడి బోలెడు మంది ఏవో తిక్క సాహసాలు చేస్తూ ప్రాణాలే కోల్పోతున్నారు… సోషల్ మీడియా మన జీవితాల్లోకి తీసుకొచ్చిన అనేకానేక దుష్ప్రభావాల్లో ఇదీ ఒకటి… మొత్తంగా సొసైటీని సోషల్ మీడియా పొల్యూట్ చేస్తుందనేది నిజం… రీసెంటుగా ఒకడు… అలా రోడ్డు మీదకు వచ్చి ఎదురుగా వేగంగా వస్తున్న బస్సు కింద పడుకున్నాడు… బస్సు అలాగే వెళ్లిపోయింది… వీడు జస్ట్, అలా కాలరెగరేసి, దుమ్ము దులుపుకుని స్టయిల్‌గా తెలుగు సినిమా […]
ఇరకాటంలో ఇజ్రాయిల్… వేగంగా మారుతున్న ప్రపంచ రాజకీయాలు…
ఇజ్రాయెల్ ప్రమాదంలో పడబోతున్నది! ఎప్పుడు అన్నదే ప్రశ్న! కానీ ఈసారి మాత్రం చాలా పెద్దదానికే ప్లాన్ చేసింది ఇరాన్! హెజ్బోల్ల – లెబనాన్! లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్ల టెర్రర్ గ్రూప్ అమెరికాతో ఒప్పందానికి నిరాకరించింది! గాజాలోని రఫా పట్టణం మీద ఇజ్రాయెల్ దాడి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మొదట హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం కోసం డిమాండ్ చేసి తరువాత మాట మార్చి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది! మరోవైపు హేజ్బొల్ల […]
పత్రికల యాడ్ భాష వేరు… సెకండ్, థర్డ్, ఫోర్త్… ఎన్నో మొదటి పేజీలు..!!
పత్రికలో ఫస్ట్ పేజీ… దీనికి ఓ శాంటిటీ ఉంటుంది… ఫస్ట్ పేజీ వార్త అంటే అది ఆ పత్రిక ప్రయారిటీలను చెబుతుంది… ఆయా వార్తల తీవ్రత, ప్రాధాన్యతల్ని కూడా చెబుతుంది… ఇప్పుడంటే ఫస్ట్ పేజీని ఇండికేటర్ల పేజీలను చేసేశారు… అంటే లోపల పేజీల్లో ఏమున్నాయో చెప్పే ‘పట్టిక’లాగా మార్చేశారు… కానీ ఒకప్పుడు ఫస్ట్ పేజీ చదివితే చాలు… ఆరోజు ముఖ్యమైన వార్తలేమిటో అర్థమయ్యేవి… లోపల పేజీలు చదివినా చదవకపోయినా పెద్ద మునిగేదేమీ ఉండదు… కానీ క్రమేపీ ఏమైంది..? […]
JCB Rulers… అప్పుడు ప్రజావేదిక… ఇప్పుడు వైసీపీ ఆఫీసు… సేమ్…
పొద్దున్నే వాట్సప్ న్యూస్ గ్రూపులో ఓ వార్త, కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలతోపాటు కనిపించింది… అది ఇలా ఉంది… . తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత… ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేత ప్రారంభం… పొక్లైన్లు, బుల్డోజర్లతో భవనం కూల్చివేత… శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు… కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ నిన్న హైకోర్టును ఆశ్రయించిన వైయస్సార్సీపీ… చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశం… హైకోర్టు […]
- « Previous Page
- 1
- …
- 15
- 16
- 17
- 18
- 19
- …
- 140
- Next Page »