లక్నో ఐపీఎల్ టీం అధినేత (లక్నో సూపర్ జెయింట్స్) సంజీవ్ గోయెంకా హైదరాబాద్ ఐపీఎల్ టీం మీద ఘోరంగా ఓడిపోయాక తమ టీంలోని క్రికెటర్ కేఎల్ రాహుల్ మీద అరిచాడు, కేకలేశాడు, బహిరంగంగానే తూలనాడాడు… అందరూ చూశారు… రోజంతా మీడియా, సోషల్ మీడియా దీన్నే చర్చించింది… రాహుల్, అలా తిట్లు తింటావేమిట్రా, ఛల్, రిజైన్ చేయి, సిగ్గు లేదా, వెళ్లిపో అంటూ బోలెడు సలహాలు… తను ఆల్రెడీ ఒక ఒప్పందంలో బందీ అయ్యాడని తెలియదు పాపం… అలా […]
కొన్ని మోడీ మాత్రమే చేయగలిగాడు… కానీ కొన్నింటిలో సారు గారు ఫ్లాప్…
ఈరోజు పొద్దున అన్ని పత్రికల్లోనూ ఒక బీజేపీ యాడ్… ఫస్ట్ పేజీ… అందులో ఉన్నదేమిటయ్యా అంటే… అందరికీ ఉచిత వైద్యం, అవ్వాతాతల ఆరోగ్యానికి మన మోడీ గ్యారంటీ… 5 లక్షల వరకూ ఉచిత వైద్యం అనేది ఆ ప్రకటన సారాంశం… ఇది పాజిటివ్ ప్రచారం… కాంగ్రెసోళ్లు గెలిస్తే ముస్లింలకు మన ఆస్తులు పంచుతారు, పుస్తెలు కూడా మిగలనివ్వరు, అయోధ్య గుడికి బాబ్రీ లాక్ వేస్తారు దాకా ప్రధాని నెగెటివ్ ప్రచారం వెళ్లిపోయింది ఈసారి… అఫ్కోర్స్, రాజ్యాంగం రద్దు, […]
ఇంట్రస్టింగే… ఓ స్టార్ హీరో వెంట సినిమా ఇండస్ట్రీ నడవడం లేదెందుకు…?
ఎక్కడో చదివినట్టు గుర్తు… పవన్ కల్యాణ్ మరీ జబర్దస్త్ రేంజ్ నాయకుడైపోయాడు అని… కారణమేందయ్యా అంటే… పిఠాపురంలో జబర్దస్త్ బ్యాచ్ కమెడియన్లే ప్రచారంలో కనిపిస్తున్నారు అని… సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా మద్దతు రావడం లేదు, ఇక చిరంజీవి చెప్పినట్టు తను అందరివాడు ఎలా అయ్యాడు అని ఆ వార్త ప్రశ్నించింది… తమ్ముడే కాబట్టి చిరంజీవి ఓ వీడియో సందేశం ఇచ్చాడు, అయిపోయింది… మర్యాదకు రాంచరణ్ కూడా దాన్ని షేర్ చేశాడు, ఒడిసింది ముచ్చట… నాగబాబుకు ఎలాగూ […]
ఒకటే దురద… ఎంత గోకినా తగ్గని ఎగ్జిమా… ఎవడు మమ్మీ వీడు..?
అందరిలోనూ ఒకటే ప్రశ్న… కమెడియన్ ఆలీ పాపులర్ ప్రశ్న ఒకటి ఉంది తెలుసు కదా… ఎవడు మమ్మీ వీడు..? ఎస్, అదే ప్రశ్న, అలాగే… ఇదెందుకు ఇప్పుడు బలంగా తెర మీదకు వచ్చిందంటే..? 82 ఏళ్ల ఈ ఎగ్జిమా పేషెంట్, అనగా ఎంత గోకినా తగ్గని దురద… కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లేలా ఎప్పుడూ ఏదో పెంట పెట్టేసే ఈయన్ని ఆ పార్టీ నాయకులెవరూ ఎందుకు ఇన్నేళ్లుగా భరిస్తున్నారు..? కాంగ్రెస్ రాజకుటుంబం, అనగా గాంధీ కుటుంబం కూడా […]
పిచ్చి కూతల పిట్రోడా… దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారట…
శ్యామ్ పిట్రోడా… కాంగ్రెస్ పార్టీకి ఓ గుదిబండలా మారాడు … తనను ఎందుకు వదిలించుకోలేకపోతుందో ఏమో కాంగ్రెస్ పార్టీ..! ఎన్నికల కీలక దశలో ఆయన చేసే వ్యాఖ్యలు పార్టీకే నష్టం కలిగిస్తున్నాయి… వాటి లోతుల్లోకి, ఆయన ఉద్దేశాల్లోకి ఎవరూ వెళ్లేంత సీన్ ఉండదు పోలింగ్ వేడిలో… ఎదుటి పార్టీ అమాంతం ఆయన వ్యాఖ్యల్ని అందుకుని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తోంది… అబ్బే, అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు, పార్టీకి సంబంధం లేదు, మేం సమర్థించడం లేదు అనే […]
రాజకీయ వారసత్వమా మజాకా… రాటుదేలడం, నిలబెట్టుకోవడం పెద్ద టాస్క్…
వారసత్వం… రాజకీయాల్లో అత్యంత ప్రధానమైన పదం ఇది… మగ వారసులు ఉన్న తండ్రులకు పర్లేదు… ఎంత చదువుకున్నా, ఎక్కడ కొలువులు చేస్తున్నా పట్టుకొచ్చి రాజకీయాల్లోకి ప్రవేశపెట్టి, పదును పెడతారు తండ్రులు… మరి రాజకీయాల్లో ఉన్నంత ఆస్తి, పెత్తనం, వైభోగం, బలగం, బలం మరే రంగంలోనూ దక్కవు కదా… పైగా కావల్సినంత సంపాదించుకునే చాన్స్… ఎంత తవ్వుకుంటే అంత… అందుకే కుటుంబ పార్టీల్లో ఎక్కువగా మగ వారసత్వమే అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది… శరద్ పవార్ అజిత్ పవార్‌ను […]
కేజ్రీవాల్ కేసుల్లో పీటముడి… ఇక ఏకంగా ఎన్ఐఏ దర్యాప్తు తెరపైకి…
కేజ్రీవాల్ కేసుల్లో కొత్త ట్విస్టు.,. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హఠాత్తుగా తెర మీదకు వచ్చాడు… కేజ్రీవాల్ మీద ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించాడు… మరింత బిగుసుకుంటోంది కేజ్రీవాల్ మెడ చుట్టూ… ఊపిరాడకుండా… నిజానికి బీజేపీ ప్రభుత్వం లేట్ చేసింది… ఖలిస్థానీ శక్తులకు మద్దతుగా నిలిచిన కేజ్రీవాల్‌ను ఇన్నాళ్లూ ఉపేక్షించింది… చివరకు ఆప్ ఆ శక్తుల మద్దతుతో పంజాబ్‌లో పాగా వేసేదాకా కళ్లు తెరవలేదు… సాక్షాత్తూ తన కాన్వాయ్‌ను ఓ ఫ్లయి ఓవర్ మీద రెండు మూడు […]
ఇంట్రస్టింగు తీర్పు… అత్యాచారం తప్పుడు కేసుకూ అదే జైలుశిక్ష…
ఒక కేసు… ఉత్తరప్రదేశ్‌లోని బరేలి… బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ తన కూతురిపై అత్యాచారం జరిగిందని 2019, డిసెంబరులో ఫిర్యాదు చేసింది… కూతురి వయస్సు 15 ఏళ్లు… అజయ్ అలియాస్ రాఘవ్ ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి, మత్తుపదార్థాలు ఇచ్చి అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు సారాంశం… దీనిపై కేసు పెట్టారు పోలీసులు, అమ్మాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, అత్యాచారం నిజమేనని అమ్మాయి వాంగ్మూలం ఇచ్చింది… విచారణ సా-గు-తూ-నే ఉంది… సదరు నిందితుడు నాలుగున్నరేళ్లు విచారణ […]
ఓహో… అయ్య కూడా ఆటగాడే… ఏం డర్టీ ఫ్యామిలీరా బాబూ…
2700 డర్టీ వీడియోలతో బట్టబయలైన ప్రజ్వల్ రేవణ్న డర్టీ చరిత్ర దేశవ్యాప్తంగా ఓ సంచలనం… చివరకు చెల్లి వరుస అమ్మాయిని, వృద్ధురాళ్లను, పనిమనుషులను కూడా వదలని కామాంధుడు… కర్నాటక ప్రభుత్వం దొరికాడు కదాని వెంటనే కేసులు నమోదు చేసి, సిట్ ఏర్పాటు చేయగానే జర్మనీ పారిపోయాడు… ఇదంతా తెలుసు కదా… డిప్లమాటిక్ పాస్‌పోర్టు మీద దేశం దాటిపోయాడు… పట్టుకుని తీసుకురావడానికి లుక్ అవుట్ నోటీసులు మన్నూమశానం ఏదో ప్రొసీజర్ నడుస్తోంది… ఆ జేడీఎస్ పార్టీతో పొత్తు కూడినందుకు […]
కీలకవేళ… కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరే బయటపడిపోతున్నారు…
మూడో దశ ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక్కొక్కరూ బయటపడుతున్నారు! West Bengal కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదురీ. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ ఆర్విందర్ సింగ్ లవ్లీ! ******* ముందుగా వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదురి ఏమన్నాడు అంటే…: వెస్ట్ బెంగాల్ ఓటర్లకి నా విజ్ఞప్తి ఏమిటంటే మీరు బిజేపికి ఓటు వేయండి. TMC కి కాంగ్రెస్ కి ఓటువేయొద్దని కోరుతున్నాను అని… కాంగ్రెస్ లో ఉన్న తికమకకి నిదర్శనం ఇది! ఎంత […]
కేసీయార్ టీవీ9 ఇంటర్వ్యూకు అంత ధూంధాం రేటింగులేమీ లేవ్…!!
చాన్నాళ్లయింది కదా తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్ గురించి చెప్పుకుని… ఎన్నికల సీజన్ కదా… అన్ని చానెళ్లూ బిజీ బిజీ… ఇప్పుడు గిరాకీ ఎక్కువ కదా…! కొన్ని ఇంట్రస్టింగ్ అబ్జర్వేషన్స్ కనిపిస్తున్నాయి… ఈమధ్య ఎన్టీవీ, టీవీ9 గుంపు ఇంటర్వ్యూల మీద మోజు చూపిస్తున్నాయెందుకో… ఒకటేమో తన వారితోనే ప్రశ్నలు అడిగిస్తుంటే మరొకటి వేరేవాళ్లనూ తీసుకొచ్చి అడిగిస్తోంది… ఎందుకోగానీ జర్నలిస్టు సర్కిళ్లలో కూడా దీనిపై పెద్ద పాజిటివ్ టాక్ వినిపించడం లేదు… ఇంటర్వ్యూయర్ గట్టివాడైతే ఒక్కడు చాలు, అవసరమైన […]
పెళ్లి తంతు పద్ధతి ప్రకారం జరిగితేనే దానికి పెళ్లిగా చట్టబద్ధత..!!
అప్పట్లో ఓ సినిమా వచ్చింది… కృష్ణంరాజు హీరో కావచ్చు… పెళ్లంటే పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.. మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. అని ఓ పాట అందులో… సూపర్ హిట్ పాట… ఇవన్నీ ఉంటేనే పెళ్లి జరిగినట్టా..? గత అక్టోబరులో అలహాబాద్ హైకోర్టు తీర్పు అదే చెప్పింది దాదాపుగా… ఇప్పుడు సుప్రీంకోర్టూ చెప్పింది తాజాగా… కోర్టు ఏమన్నదంటే..? ‘‘పెళ్లి అనేది ఓ పవిత్రబంధం… కేవలం పెళ్లి రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన సరిపోదు, అది రుజువు మాత్రమే, కానీ సంప్రదాయ […]
ఉమ్మడితనంలోనూ విడివిడితనం… యెల్లో కూటమి మర్యాదలే వేరు…
రాజకీయాల్లో తెర వెనుక చాలా మర్మాలుంటయ్… కానీ తెరపై కనిపించేదే వోటరుకు ప్రధానం… దాన్ని బట్టే తన అభిప్రాయాల్ని ఏర్పరుచుకుంటాడు… ఏపీ పాలిటిక్స్ సంగతే తీసుకుందాం… గత ఎన్నికల ముందు మోడీ ఓడిపోతాడని భ్రమపడి, తప్పుడు అంచనాలతో… ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకుని, మోడీ మీద నానా దుర్భాషలాడి, కాంగ్రెస్‌తో జతకట్టి, దానికి డబ్బులిచ్చి, చివరకు భంగపడిన చంద్రబాబు తరువాత ఏం చేశాడు..? జగన్ తొక్కడం నుంచి రక్షణ కోసం అదే మోడీ దయ కోసం, చూపు […]
సంకీర్ణ కేంద్ర సర్కారట..! జగన్ తప్ప ఎవరున్నారు నీతో దొరవారూ..!?
సరే, సరే… నువ్వన్నట్టే కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అనుకుందాం కాసేపు… నీ నాలుగు రోజుల ఆనందాన్ని ఎందుకు కాదనాలి..? బీజేపీకి 200 సీట్లు కూడా రావు… సరే, అలాగే కానివ్వు… అదేమీ ప్రాంతీయ, కుల, కుటుంబ పార్టీ ఏమీ కాదు కదా దుకాణం మూసేసుకోవడానికి..? రెండు సీట్ల దగ్గర కూడా షట్ డౌన్ కాలేదు, దాన్నలా కాసేపు వదిలేద్దాం… తెలంగాణ కోసం ఉధృతంగా పోరాడిన నిష్కళంక యోధుడు, నిజాయితీ వ్యాపారి, నిఖార్సయిన మనిషి నామా నాగేశ్వరరావుకు […]
యెల్లో కూటమికి గాజు గ్లాసు గండం..! పగిలిన గ్లాసు ప్రమాదమే సుమీ..!!
తెలుసుగా… గాజు గ్లాసు పగిలేకొద్దీ పదునెక్కిద్ది… అన్నట్టుగా ఆమధ్య ఏదో పదునైన సమర్థన పత్రికల్లో చదివినట్టు గుర్తు… ఇప్పుడు హఠాత్తుగా అదే గుర్తొచ్చింది… ఎందుకంటే..? ఏపీలో కొందరు ఇండిపెండెంట్లకు జనసేన గాజు గ్లాసు గుర్తు కేటాయించారు… అవును, ఇప్పుడు ఆ పగిలిన గాజు ముక్కలు పదునెక్కి ఠారెత్తించనున్నాయి… జనసేనను మాత్రమే కాదు, ఆ కూటమినే..! పగిలేకొద్దీ పదునెక్కిద్ది అనే డైలాగ్‌కు కౌంటర్‌గా… తాగిన గ్లాసు సింకులో ఉండాలి, పేపర్ గ్లాసయితే డస్ట్ బిన్లో ఉండాలి అని వైసీపీ […]
డర్టీ కొడుక్కి డర్టీ తండ్రి డర్టీ సమర్థన… బీజేపీ చొక్కాకు డర్టీ మురికి…
ప్రజ్వల్ రేవణ్న అనే ధూర్తుడి ఫోటో కూడా చూపించడానికి మనసొప్పడం లేదు… బలుపు అనే పదం సరిగ్గా వర్తిస్తుంది… ఈ మాటలు చదువుతుంటే చాలా హార్ష్ అనిపించినా సరే, అనడానికి సందేహించనక్కర్లేదు… అధికారం, డబ్బు, ఆ కుటుంబనేపథ్యం ద్వారా కొందరిని ఆవరించే బలుపుకి ప్రజ్వల్ ఓ బలమైన ఉదాహరణ… అనేక వీడియోలు… లైంగిక ఆరోపణలు… ఎందరో బాధితులు… దాదాపు 3 వేల వీడియోలు బయటకొచ్చాయి… చివరకు సోదరి వరుస లేడీస్‌ను కూడా వదల్లేదట ఈ కామాంధుడు… లైంగికంగా […]
పప్పు పప్పు అని ఎవరినీ వెక్కిరించకండి… ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధం…
రాజకీయాల్లో గానీ, ఇతర ఫీల్డ్స్‌లో గానీ… మందబుద్దులు కొందరిని పప్పు పప్పు అంటుంటారు గానీ… ఎగతాళి చేస్తారు గానీ… పప్పు పప్పే… మాంసాహారంకన్నా పోషకాల్లో దిట్ట, కొన్ని అంశాల్లో మాంసాహారంలోని మైనస్ పాయింట్లు కూడా పప్పులో ఉండవు… సో, శ్రేష్టమైనది పప్పే… నీళ్లలాగా ఏ కూరగాయతోనైనా ఎంచక్కా కలిసిపోగలదు… స్టార్టర్, మెయిన్ కోర్స్, పులుసు… ఏం చేయాలనుకున్నా పప్పు పప్పే… హబ్బా… ఓ జాతీయ నేతను, ఓ ప్రాంతీయ నేతను ఉద్దేశించి చెప్పడం లేదు… నిజంగానే పప్పు […]
శారీ పాలిటిక్స్..! బాబాయ్ మీదుగా యెల్లో చీరె దాకా ‘‘ప్రచార విజ్ఞత..!!
దేశమంతా ఎన్నికల ప్రచారం ఒక తీరు… ఏపీ పాలిటిక్సు మాత్రం మరో తీరు… బూతులు, తిట్లు, ఎద్దేవా, వ్యక్తిత్వ హననం స్థాయి కూడా దాటిపోయి చివరకు కట్టుకున్న చీరెల దాకా వచ్చింది పరిస్థితి… నాకు మీరు ఇచ్చిన గత అయిదేళ్ల పాలనకాలంలో నేను ఇది చేశాను, మళ్లీ గెలిపిస్తే ఇంకా ఇది చేస్తాను అని హుందాగా చెప్పుకుంటే సరిపోయేది కదా, కానీ జగన్ ఎటెటో వెళ్లిపోతున్నాడు… జగన్ రాష్ట్రానికి ఇదుగో ఈ ద్రోహాలు, నష్టాలు చేశాడు, గతంలో […]
అమాయక తెలంగాణ కమ్మలు ఈయనలో బాబును చూసుకుంటున్నారట…
CM రేవంత్ రెడ్డికి తెలంగాణ కమ్మ కుల సమాజం బహిరంగ లేఖ! అని ఓ వాట్సప్ పోస్ట్ బాగా సర్క్యులేటవుతోంది… సరే, బోలెడన్ని చాన్సులు రావాలని ప్రతి కులానికీ ఉంటుంది… కొందరికి టికెట్లు ఇస్తే కులం ఉద్దరింపబడుతుందనేది ఓ పెద్ద భ్రమ… కొన్ని కుటుంబాలు మాత్రం సంపాదించుకుంటాయి… అంతే… కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ, తెలుగుదేశం అంటే కమ్మ పార్టీ, బీఆర్ఎస్ అంటే వెలమ పార్టీ, జనసేన అంటే కాపు పార్టీ… ఇలా బోలెడు ముద్రలున్నాయి కదా… […]
ఎక్కడో సుదూరాన… ఓ ఒంటరి ద్వీపంలో… పతంజలి మందుల కార్ఖానా…
బాబా రాందేవ్ పతంజలి వ్యవహారం ఇప్పుడు పతాకశీర్షికలకెక్కుతున్న నేపథ్యంలో… ఆయన వ్యాపారం వెనకున్నవారెవరు… వారు వ్యాపారంలో భాగస్వాములవ్వడమే కాకుండా.. రాందేవ్ కు ఏమేం గిఫ్ట్ గా ఇచ్చారనే అంశాలన్నీ జనబాహుళ్యంలో చర్చకొస్తున్నాయి… సుప్రీం ఆగ్రహం, బహిరంగ క్షమాపణ ప్రకటనలు, ఆ కేసు వివరాల్లోకి ఇక్కడ పోవడం లేదు… ఎక్కడో సుదూరంగా ఉన్న ఓ చిన్న దీవి పతంజలి ఫ్యాక్టరీగా మారిన తీరు, దాని వెనుక ఉన్న దాతల గురించి మాత్రమే చెప్పుకుందాం… అందులో ప్రధానంగా అందరి దృష్టీ […]
- « Previous Page
- 1
- …
- 21
- 22
- 23
- 24
- 25
- …
- 141
- Next Page »