నిన్నటి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఫోటోల్లో చాలామందిని ఆకర్షించింది చిరాగ్ పాశ్వాన్… తను ప్రమాణం చేస్తున్నప్పుడు కూడా చప్పట్లు, కేకలు… మొన్న ఎన్డీయే మీటింగులో మోడీ తనను ఆప్యాయంగా హత్తుకుని అభినందిస్తున్నప్పుడే అర్థమైపోయింది ఈసారి చిరాగ్ పాశ్వాన్‌కు ప్రయారిటీ దక్కబోతున్నదని… అంతకుముందే ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది… కంగనా రనౌత్‌తో చిరాగ్ 2011లో ఓ సినిమా చేశాడు… అప్పట్లో వాళ్లిద్దరూ కేవలం సినిమా నటులే… ఆ సినిమా ఫోటోయే ఇప్పుడు వైరల్… ఇప్పుడు […]
మోడీ బోయింగ్ కేబినెట్ 3.0 …. ఏ మంత్రుల ఎంపిక దేనికి..? ఎవరేమిటి..?
మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం ఖచ్చితంగా ఓ రికార్డు… నెహ్రూ కుటుంబేతరుడి ఈ ప్రస్థానం ఖచ్చితంగా దేశ రికార్డుల్లో పేర్కొనదగిందే… కాకపోతే ఈసారి మెజారిటీ తగ్గింది… అనివార్యంగా చంచల మనస్కులైన చంద్రబాబు, నితిశ్ల మీద ఆధారపడాల్సిన దుస్థితి కాబట్టి మోడీ మీద హఠాత్తుగా కాస్త సానుభూతి కూడా మొదలైంది… ఈ నేపథ్యంలో తన మంత్రివర్గం ఎంపిక ఎలా ఉంది..? ఎవరెవరు..? వాళ్ల నేపథ్యాలేమిటి..? ఎందుకు మంత్రులుగా తీసుకోక తప్పలేదు..? అన్నీ సమీకరణాలే… మాజీ ముఖమంత్రులు, పాత మంత్రులు, […]
ఈనాటి భాష ‘ఈనాడు’దే … మెరుగులు దిద్దింది, ప్రామాణికత తెచ్చింది…
ఇప్పుడు పత్రికల్లో, టీ వీల్లో, రేడియోల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రామాణిక భాష అనుకుంటున్నది రాత్రికి రాత్రి గాల్లోనుండి పుట్టినది కాదు. ప్రయత్నపూర్వకంగా ఎవరో ఒకరు పట్టుబట్టి సాధించినది. స్థిరీకరించినది. తొలి తెలుగు జర్నలిజం కాలేజీ ప్రిన్సిపాల్, చరిత్ర పరిశోధకుడు, బహుభాషావేత్త రాంభట్ల కృష్ణమూర్తి (1920-2001) అధ్యయనం ప్రకారం- కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చి జస్టిస్ పార్టీ ఏర్పడింది. జస్టిస్ పార్టీలో ఉన్నవారంతా సామాన్యులు. జస్టిస్ పార్టీ ప్రచారంకోసం ‘జనవాణి’ పత్రికను ప్రారంభించింది. సామాన్యులు సునాయాసంగా చదువుకోవడానికి […]
సమయం సమీపిస్తున్నదని… రామోజీరావు కూడా సిద్ధమైపోయాడు..!!
ఇక దేహం సహకరించడం లేదు… వయస్సు పైనబడుతోంది… అలసట కమ్మేస్తోంది… మనస్సు, శరీరం ఇక సెలవు తీసుకుందాం అంటున్నాయి… టైమ్ సమీపిస్తోంది… అదుగో మరణం నన్ను రమ్మంటోంది…. ఇవే భావాలు తరుముకొచ్చాయేమో… 88 ఏళ్ల రామోజీరావు కొన్నాళ్ల ముందు తన గురించి, తను లేకపోతే తన సంస్థల గురించి, మరణం గురించి చెప్పుకున్నాడు… ‘నా జీవనగమనంలో మబ్బులు ముసురుకుంటున్నాయి, వానగా కురవడానికో, తుపానులా ముంచెత్తడానికో కాదు, నా మలి సంధ్యాకాశానికి కొత్త రంగులు అద్దడానికి’ అన్న కవి […]
పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్… ఒడిశాలో క్షీణావస్థే ప్రబల ఉదాహరణ…
ఎన్ని అనుభవాలు అయినా , ఎన్ని గుణపాఠాలు ఉన్నా పాఠాలేమీ నేర్చుకోని ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ . కాంగ్రెస్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేకపోయిన రాష్ట్రం ఒరిస్సా . ఆఖరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి జానకీ వల్లభ్ పట్నాయక్ . బహుశా ఈతరం వారికి ఆ పేరు కూడా గుర్తు ఉండి ఉండదు . 2000 వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యారు . 24 సంవత్సరాలుగా ఆయనే ముఖ్యమంత్రి . నిరాడంబరుడు […]
ఒక కేసు… ఒక లేఖ… నా జీవిత గమనమే మార్చేసిన రామోజీరావు…
ఈనాడు… రామోజీరావు శ్వాస అది… దాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి ఏ ప్రయోగమైనా, ఏ సాహసమైనా తను ఆల్వేస్ రెడీ… తరువాత కాలంలో చాలా బిజీ అయిపోయి, వేరే వ్యాపారాలు, వ్యాపకాల్లో నిమగ్నమై ఈనాడు బాధ్యతల్ని చాలావరకూ నమ్మకస్తులకు అప్పగించినా… మొదట్లో ప్రతి యూనిట్ తనే స్వయంగా తిరిగేవాడు… రెండుమూడు రోజులు అక్కడే… ప్రతిరోజూ పేపర్ అమూలాగ్రం చదవడం, రెడ్ స్కెచ్‌తో కామెంట్స్ రాయడం… ఆ కామెంట్స్ ఒకరకంగా సిబ్బందికి స్ట్రిక్ట్ ఆర్డర్స్… స్టోరీ బాగుంటే గుడ్ […]
ఇకపై జోస్యాలు చెప్పను… వేణుస్వామి బాటలో ప్రశాంత్ కిశోర్…!!
ప్రశాంత్ కిషోర్‌కు తత్వం బోధపడింది… తను కూడా వేణుస్వామి బాటలోకి వచ్చేసి, ఇకపై జోస్యాలు చెప్పను అంటున్నాడు… అంతేకాదు, లెంపలేసుకుని, సిన్సియర్‌గా క్షమాపణలు చెబుతున్నాను అన్నాడు… అసలేం జరిగింది..? బీజేపీని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు… బలంగా పాతుకుపోయింది… ఈసారి ఎన్నికల్లో 300 సీట్లకు కాస్త అటూఇటూ వస్తాయి చూస్తుండండి… ప్రతిపక్షాలు ఏవేవో ఊహించుకుంటున్నాయి గానీ మళ్లీ బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, 20, 30 ఏళ్ల పాటు బీజేపీని నిలువరించడం కష్టమే… కాంగ్రెస్ రివైవల్ అనేది ఇప్పట్లో […]
సోషల్ ప్రాపగాండా… కోట్లకుకోట్ల ఖర్చు..,పైసా ఫాయిదా లేక ‘మునక’…
ఇటు కేసీయార్… అటు జగన్… ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తల్ని ఎవడూ నమ్మడం లేదనీ, సోషల్ మీడియా ఈ ఎన్నికల్ని డామినేట్ చేస్తుందని అందరు రాజకీయ నాయకుల్లాగే వీళ్లూ గ్రహించారు… అత్యంత భారీ సాధన సంపత్తి ఉన్న పార్టీలాయె… వదిలిపెడతారా..? ఎంత ఖర్చయినా పర్లేదు, తడాఖా చూపిద్దాం సోషల్ మీడియా కోణంలో అనుకున్నారు… కాకపోతే ఎటొచ్చీ వాళ్లు ఈ పనికి ఎంచుకున్న వ్యక్తులు రాంగ్… వాళ్లు ఎంచుకున్న టీమ్స్ రాంగ్… కోట్లకుకోట్లు గుమ్మరించారు… వరదైపారింది డబ్బు… […]
ప్యూర్ పాలిటిక్స్… అనుబంధాలు, ఆత్మీయతలు జస్ట్, ఓ బూటకం…
Murali Buddha….. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం…. బాబు సోదరుడు వైయస్ వైపు – జగన్ సోదరి బాబు వైపు ——- తాతా మనవడు సినిమాలోని అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం అనే పాట చిన్నప్పుడు రోజూ రేడియోలో వినిపించేది . ఆ వయసులో పాటలోని భావం పెద్దగా తెలియక పోయినా ఆ విషాద గీతం బాగా వెంటాడేది . జీవితాన్ని బాగా మథించిన […]
టీటీడీ ఛైర్మన్‌గా టీవీ5 బీఆర్ నాయుడు..? బాబు గ్రాటిట్యూడ్..!
తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది… పాత జగన్ వాసనలన్నీ అధికార యంత్రాంగం నుంచి, నామినేటెడ్ పోస్టుల నుంచి… ప్రత్యేకించి ఖజానాకు వైరసుల్లా ఆశించిన సలహాదారుల నుంచి తొలగించే పని చేస్తాడు చంద్రబాబు… ఎలాగూ తప్పదు, తన వారిని నియమించుకోవాలి కదా… అన్నింటికన్నా ముందు కీలకమైన పోస్టుల్లో ఉన్న అధికారులను వదిలించుకుంటాడు… జవహర్‌రెడ్డి ఆల్రెడీ వెళ్లిపోయాడు, కొత్త సీఎస్ ఎంపిక జరిగిపోయింది… చివరకు టీడీడీ ఈవో, సమాచార కమిషనర్ తదితరులూ మేం వెళ్లిపోతాం అంటున్నారు… అప్పుడే వెళ్లిపోతే ఎలా..? తవ్వాల్సిన […]
బలగం ఉంటే ఓ భరోసా… బలగం అంటే గెలుపుకు ఓ చోదకశక్తి…
Jagannadh Goud…… బలగం (Supporting System) : నా ద్రుష్టిలో మనిషికి మనిషికీ తేడా వాళ్ళ బలగం మాత్రమే ఇంకేది కాదు. ఈ మధ్య గూగుల్ CEO సుందర్ పిచాయ్ మాట్లాడుతూ నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే కారణం నా భార్య అంజలి అని చెప్పాడు. మగవాళ్ళ విజయం వెనక భార్య ఉండోచ్చు, తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు ఇంకెవరైనా ఉండోచ్చు. అదే విధం గా ఆడవాళ్ళకి తల్లితండ్రులు, భర్త లేదా గురువులు ఎవరైనా ఉండొచ్చు. […]
కంగనా జవాను చెంపదెబ్బ… నిజానికి ఇది చాలా సీరియస్ ఇష్యూయే…
బీజేపీ కొత్త ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను ఎయిర్ పోర్టులో ఓ సీఐఎఫ్ జవాను కొట్టింది… ఎందుకు..? గతంలో ఢిల్లీలో ఆందోళనలు చేసిన రైతుల గురించి కంగనా ఏదో కామెంట్ చేసింది గతంలోనే… ఆ ఆందోళనల్లో ఈ సీఐఎస్ఎఫ్ జవాను తల్లి కూడా కూర్చున్నదట… కంగనా కామెంట్ ఈమెలో రగులుతూ ఉండిపోయింది… ఈమె కనిపించగానే ఒక్కటి పీకింది… సమయానికి ఆమె చేతిలో ఏ మారణాయుధమూ లేదు… ఉండి ఉంటే..? రేప్పొద్దున ఇంకెవరో మరెవరికో ఇలాగే తారసపడితే..? ఖచ్చితంగా […]
చిరంజీవి హీరోయిన్ కాదు… బెంగాల్లో *దీదీ నంబర్ వన్* ఆమె..!!
రచన బెనర్జీ… బెంగాల్ విజేతల జాబితాలో పేరు చూడగానే… ఎలాగూ మమత చాలామంది సినిమా తారలకు ఎంపీ టికెట్లు ఇస్తుంది కదా, ఈమె కూడా మనకు తెలిసిన పేరేనేమో అని చెక్ చేస్తే నిజమేనని తేలింది… మనకు బాగా తెలిసిన తార… కాకపోతే మన దరిద్రులు చాలామంది ‘గెలిచిన చిరంజీవి హీరోయిన్’ అని రాసేశారు… ఛ… చిరంజీవి హీరోయిన్ ఏమిటి..? తనతో నటించింది ఒకటే సినిమాలో… బావగారూ బాగున్నారా..? నిజానికి అందులో చిరంజీవితోపాటు గెంతేది, ఎగిరేది, పొర్లే […]
రామజన్మభూమిలో రావణ సంచలనం… గెలిచిన ఏకైక ‘స్వతంత్రుడు’…
చంద్ర శేఖర్ ఆజాద్ అలియాస్ రావణ్ సంక్షుభిత దళిత రాజకీయాలలో సునామీ… కేవలం ముప్పై ఆరేళ్ళ పోరగాడు… తనకు పాతికేళ్ళు ఉన్నప్పుడే దేశం తనని గుర్తించింది… ఒక నిజాయితీ , ఒక మన్నన, జీవితంలో నేర్చుకున్న నాలుగు అక్షరం ముక్కలు తన కడుపు నింపకున్నా, పక్కోడి పళ్ళెంలో మెతుకయి మెరిస్తే చాలు అనుకోని ఒక అడుగు వేసాడు. తనకు అవ్వలు లేరు, అయ్యలు లేరు, రాజకీయ వారసత్వం లేదు… ఇది అన్యాయం అని తోస్తే స్పందించడం మినహా. […]
వాళ్లు బాగానే ఉంటార్రా బాబూ… మీ ప్రాణాలెందుకు తీసుకోవడం..!!
Murali Buddha…… మెచ్యూరిటీ అంటే ? ఒక పార్టీ ఓటమిని తట్టుకోలేక ఒక 28 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు .. దీన్ని ఫేస్ బుక్ లో ఒకరు పోస్ట్ చేస్తే దానికి లాఫింగ్ ఎమోజీతో ఒకరి స్పందన …. జగన్ సోదరికి ఆస్తిలో , అధికారంలో వాటా సరిగా దక్కలేదు అని అన్న ఓటమికి నడుం బిగించింది … తల్లి ఆమెకు మద్దతుగా నిలిచింది … ఎలాగైనా బాబును తిరిగి అధికారంలోకి తీసుకురావాలి అనుకున్న జ్యోతి […]
వాళ్లిద్దరూ ఎప్పటికైనా యూటర్న్ బాపతే… ప్లాన్- బీ బీజేపీకి తప్పదు…
3 కేబినెట్ పదవులు, 2 సహాయ మంత్రులు, ఒక స్పీకర్ కావాలట చంద్రబాబుకు… ఈ డిమాండ్ నిజమో కాదో తెలియదు గానీ, గతంలోలాగే స్పీకర్ పదవిని ఇస్తే బహుశా చంద్రబాబు అంగీకరించవచ్చు… ఎందుకంటే, అక్కడ కేబినెట్ మంత్రుల రూపంలో ఢిల్లీలో వేరే పవర్ సెంటర్స్ ఉండటాన్ని తను ఇష్టపడడు… గతంలో కూడా బాలయోగిని స్పీకర్ చేస్తే ఇంకేమీ అడగలేదు… కాకపోతే సంకీర్ణ ప్రభుత్వం మీదెక్కి స్వారీ చేశాడు… అదెలా ఉంటుందో మోడీ బయట నుంచి చూశాడు… గుజరాత్ […]
అయోధ్య స్థలిలోనే బీజేపీ వోటమి… నిజమే, కానీ ఎందుకిలా..?
హవ్వ… 500 ఏళ్ల కోరిక అయోధ్యలో బాలరాముడి గుడి నిర్మాణం… దాని పేరిట బీజేపీ ఉద్యమాలు చేసి, సీట్ల సంఖ్యను పెంచుకుంది… భవ్యమైన మందిరం కట్టారు… దేశమంతా చందాలు తీసుకున్నారు, అక్షింతలు పంచిపెట్టారు, ఆ ఎమోషన్‌ను ఎన్నికల్లో వాడుకోవాలని అనుకున్నారు… తీరా చూస్తే ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో అయోధ్య గుడి ఉందో ఆ ఫైజాబాదులోనే బీజేపీ ఓడిపోయింది… రాముడి దీవెనలు లేవు అనడానికి, అక్షింతల మహత్తు పనిచేయలేదు అనడానికి ఇదే ప్రబల ఉదాహరణ….. ఇదుగో ఇలా చాలా […]
తెలంగాణలో ఆ తొమ్మిది స్థానాల్లో ఓ ఇంట్రస్టింగ్ అబ్జర్వేషన్…
చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి, జహీరాబాద్ బీబీ పాటిల్, నల్గొండ శానంపూడి సైదిరెడ్డి, నాగర్‌కర్నూల్ పోతుగంటి భరత్ ప్రసాద్, మహబూబాబాద్ సీతారాంనాయక్, సికింద్రాబాద్ దానం నాగేందర్, మల్కాజిగిరి పట్నం సునీతారెడ్డి, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, వరంగల్ ఆరూరి రమేష్…. వీళ్ల ఓటమిలో ఓ పోలిక ఉంది గమనించారా…? అని ఏకరువు పెట్టాడు ఓ మిత్రుడు… వీళ్లందరూ పార్టీలు మారి, ఇన్‌స్టంట్‌గా టికెట్లు తెచ్చుకున్నవారే… వోటర్లు అందరినీ తిరస్కరించారు… వీళ్లకు మినహాయింపు కడియం కావ్య… బీఆర్ఎస్ టికెట్టు ఇచ్చినా […]
కోపమొస్తే వోటరు నిర్దయగా మరీ కౄరంగానే శిక్షిస్తున్నాడు…
2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలయ్యాక… ఫలితాలు వచ్చాక… మరీ 23 సీట్లకు కుదించుకుపోయాక చంద్రబాబు ఆవేదనగా ఓ మాటడిగాడు వోటర్లను… మరీ 23కు పరిమితం చేసేంత ద్రోహం చేశానా నేను ఈ రాష్ట్రానికి అని..! అప్పట్లో చాలామందికి అదే అనిపించింది… పోలింగ్‌కు ముందు పసుపు కుంకుమ వంటి ఏవేవో పథకాలతో (ఖజానా నుంచే) జనానికి డబ్బులు పంచాడు… పోలవరం, అమరావతి పూర్తి చేయలేకపోయాడు గానీ ప్రోగ్రెస్ కనిపించింది… కానీ ఏం ఫలం..? వోటర్లు కొన్నిసార్లు క్రూరంగానే వ్యవహరిస్తారు… సీన్ […]
రాష్ట్రాల వారీ ఫలితాల్లో బోలెడు అనూహ్యాలు… అసాధారణాలు…
జగన్ ఈ రేంజు ఘోర పరాజయం ఎవరూ ఊహించనిదే… చంద్రబాబు కూటమి అఖండ విజయం ఈ స్థాయిలో ఉంటుందని కూడా ఎవరూ అనుకోలేదు… జనంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా సరే, కేసీయార్ మరీ జీరోకు పడిపోతాడనీ అంచనా వేయలేదు… ఇవేనా..? ఈ ఎన్నికల్లో అనూహ్యాలు ఇంకా చాలా ఉన్నాయి… మొదటిది 350 నుంచి 400 వరకు ఎన్డీయే గెలుస్తుందని చెప్పిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అడ్డంగా బోల్తాకొట్టాయి… ఇండియాటుడే- మైయాక్సిస్ ఇండియా సర్వే లీడ్ చేసిన ప్రదీప్ […]
- « Previous Page
- 1
- …
- 23
- 24
- 25
- 26
- 27
- …
- 146
- Next Page »