Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పవర్ రుచి మరిగిన షిండే… అదే మహారాష్ట్ర రాజకీయాల్లో చిక్కుముడి…

December 2, 2024 by M S R

shinde

. ఒకసారి అధికారం రుచి చూస్తే? ఆ రుచి మనిషి రక్తం రుచిమరిగిన పులి కంటే ప్రమాదకరమైనది! మహారాష్ట్ర రాజకీయం పులికంటే ప్రమాదకరంగా ఉంటుంది! దేశ ఆర్ధిక రాజధాని, రాష్ట్ర రాజధాని అయిన ముంబై మీద అధికారం చెలాయించిన వాళ్లకి ఆ అధికారం లేకపోతే జీవితం ఉండదు అనేంతగా విరక్తిని కలగచేస్తుంది! ఉద్ధవ్ ఠాక్రే, ఏకనాథ్ షిండే పరిస్థితి అలానే ఉంది. ఉమ్మడి శివసేనగా ఉన్నప్పుడు స్వంతంగా మెజారిటీ ఎప్పుడూ రాలేదు. విడిపోయాక ఇక ఎక్కడ వస్తుంది? […]

వాడు… 100 కాదు, 10000 కోట్లు సంపాదించినా మనం పీకేదేమీ లేదు…

December 1, 2024 by M S R

corruption

. సిగ్గుపడదాం… నిజంగానే ఓ సమూహంగా, ఓ సమాజంగా మూకుమ్మడిగా సిగ్గుపడదాం… అలా సిగ్గుపడటానికి నామోషీ అక్కర్లేదు… మనం సిగ్గుపడటానికి పక్కాగా అర్హులం… మాదచ్చోద్ ప్రభుత్వ విధానాలు… వాటికి పుట్టిన బ్యూరోక్రాట్టు… తోడుగా పుట్టిన రాజకీయ నాయకులు… సవతి పుత్రులుగా ఉన్నతాధికారులు… ఎవరూ తక్కువేమీ కాదు… ఈ వ్యవస్థలో బతుకుతున్నందుకు ఉమ్మడిగా సిగ్గుపడదాం… ఎహె, సిగ్గుపడడానికి ఏముంది, ఇది లోకసహజం, అధికారులు, నాయకులు, మీడియా, లీగల్ సిస్టం ఎవరు సంపాదించడం లేదూ అంటారా… ఎస్, అందుకే అందరమూ […]

రష్యాకు తలబొప్పి… సిరియాపై తిరుగుబాటుదారుల పట్టు…

December 1, 2024 by M S R

ww3

. WW3 అప్డేట్ 5… సిరియా మళ్ళీ సంక్షోభంలోకి వెళ్ళబోతున్నది! సిరియాలోని రాజధాని డమాస్కస్ తరువాత రెండో పెద్ద నగరం అయిన అలెప్పీ తిరుగుబాటు దారుల చేతిలోకి వెళ్లిపోయింది! వాణిజ్యపరంగా కీలకమైన అలెప్పో నగరం మూడురోజులలోనే ప్రభుత్వ తిరుగుబాటుదారుల వశం అయ్యింది! టర్కీ సైన్యం సిరియా తిరుగుబాటు దారులకి అండగా నిలబడి దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది! బ్రిక్స్ లో చేరడానికి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చేసిన విజ్ఞప్తిని భారత్ వీటో చేస్తే, అది పుతిన్ సమర్థించాడు అనే […]

ఇరాన్‌కు రష్యన్ జెట్ ఫైటర్స్… యుద్దం ఇంకా ముదురుతోంది…

November 30, 2024 by M S R

air fighters

. WW3 అప్డేట్ 4…  రష్యా 12 సుఖోయ్ Su – 35 ఫైటర్ జెట్స్ ను ఇరాన్ కి అందచేసింది! ఇది పెద్ద విషయమే! పోయిన సంవత్సరం ఇరాన్ తనకి Su – 35 ఎయిర్ సూపీరియారిటి ఫైటర్ జెట్స్ కావాలని అడిగింది! అఫ్కోర్స్! పుతిన్ కి కూడe ఇరాన్ సురక్షితంగా ఉండడమే కావాలి! కానీ Su -35 లని వీలున్నంత తొందరగా ఇరాన్ కి ఇవ్వడం పుతిన్ కి సాధ్యం కాదని యూరోపు దేశాలు భావించాయి! కానీ […]

19 భాషల్లో పాటలు… అనితరసాధ్యం… సిసలైన పాన్ఇండియా సింగర్…

November 30, 2024 by M S R

vani jayaram

. పంథొమ్మది భాషలు 20 వేల పాటలు… వేలాది భక్తి పాటలు, ప్రైవేటు ఆల్బమ్స్… నిజానికి ఈ సంఖ్య కాదు వాణిజయరాం గాత్రమాధుర్యాన్ని, విశిష్టతను పట్టించేది… ఆమె పాడిన పాటలు ఆమె ఏమిటో చెబుతాయి… 11 సంగీత ప్రధానమైన పాటలున్న స్వాతికిరణం సినిమా కోసం విశ్వనాథ్ నిర్మొహమాటంగా ఆమెనే ఎంచుకున్నాడు… ఆమె పాటంటే, పాడే పద్ధతి అంటే అందరికీ అంత నమ్మకం… ఆ గొంతులో ఆ శ్రావ్యత… ఆనతి నీయరా హరా… శివానీ, భవానీ… తెలిమంచు కురిసింది… […]

లగే_చర్ల… దిలా_వార్‌పూర్… ఇంతకీ ఓడింది ఎవరు..? గెలిచింది ఎవరు..?

November 30, 2024 by M S R

ithanol

. మహాభారతంలో వినిపించే ఓ ప్రశ్న జగత్ ప్రసిద్ధం … ద్రౌపది కురుసభకు వేసిన ప్రశ్న… ధర్మరాజు తనను జూదంలో ఓడిన విషాదంపై వేసిన ప్రశ్న… నన్నోడి తన్నోడెనా..? తన్నోడి నన్నోడెనా..? లగచర్లలో భూసేకరణ రద్దు అనే వార్తలో సర్కారు నిర్ణయం చదివాక చటుక్కున మెదిలిన ప్రశ్న అదే… నిజానికి స్థూలంగా భూసేకరణ మొత్తం రద్దు అని కాదు… ఫార్మా కోసం భూసేకరణ రద్దు, కానీ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ఉంటుంది… దానికి విడిగా వేరే భూసేకరణ […]

అద్రి మారుతోంది… అది మన గుట్టగా కనిపిస్తోంది… ఆకర్షిస్తోంది….

November 29, 2024 by M S R

ygt

. మన దరిద్రపు రాజకీయ వ్యవస్థలో… ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో… అది ప్రతిపక్షంలోకి వెళ్లిపోయి, వేరే పార్టీ అధికారంలోకి వస్తే…. సాధారణంగా నెగెటివ్ ధోరణిలో వెళ్తుంది… పాత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆలోచిస్తుంది… ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు పంపించడానికి ప్రయత్నిస్తుంది… నేనిక్కడ విస్తృత పరిధిలోకి వెళ్లడం లేదు, ఈ స్పేస్ సరిపోదు… తెలంగాణకు సంబంధించి..! యాదగిరిగుట్టకు సంబంధించి… దానికి చిన జియ్యర్ మోస్ట్ కంట్రవర్షియల్ కేరక్టర్ (నేనిక్కడ పీఠాధిపతి వంటి విశిష్ఠ విశేషణాలేవీ […]

అదొక భస్మాసుర దేశం… మన నెత్తినే చేతులు పెడుతోంది…

November 28, 2024 by M S R

bangla

. Act of Jo Biden! జనవరి 20 లోపు ఎంత చేయవచ్చో అంత చేసేయాలని ఆత్రంతో ఉన్నారు జో బిడెన్ అధికారులు! ఎటూ జనవరి 20 తరువాత చేయడానికి ఏమీ ఉండదు అని తెలిసీ చెస్తున్నారు అంటే తెగించారు అన్నమాట! జో బిడేన్, జార్జ్ సోరోస్ 80 పైబడిన వయసులో ఉన్నారు కాబట్టి కేసులు, విచారణ అయిపోయేసరికి బతికి ఉండరు! అందుకే చేయగిలిగినంత చేస్తున్నారు భయం లేకుండా! అది బంగ్లాదేశ్ రాజధాని ఢాకా… బంగ్లాదేశ్ యూనివర్శిటీ […]

ఏపీ ప్రభుత్వ నిర్ణయం భేష్… ఐతే ఆ ఆలోచనల్ని విస్తరిస్తే బెస్ట్…

November 28, 2024 by M S R

. నిజమే… భూతంలా పెరిగిపోతున్న గంజాయిని అడ్డుకోవాల్సిందే… ఏపీ కూటమి ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం ఆలోచనలు, చర్చలు, నిర్ణయాలు బాగున్నాయి… గంజాయి సాగు, రవాణా, విక్రేతలకు సంక్షేమ పథకాల్ని ఆపేయాలనేది ప్రధాన నిర్ణయం… ఐతే, ఉపసంఘం తమ ఆలోచనల్ని మరింత విస్తరిస్తే బాగుంటుంది… ఎలాగంటే..? 1) సంక్షేమ పథకాల్ని నిలిపివేయడం అనేది కేవలం గంజాయి నేరగాళ్లకే కాదు… కిడ్నాప్, మర్డర్, దేశద్రోహం తదితర సీరియస్ నేరాల్లో ఉన్న వాళ్ల కుటుంబాలకు కూడా ఆపేయాలి… ప్రజాధనాన్ని క్రిమినల్స్‌కు పంచడం […]

హిజ్రా రూల్..! వ్యవస్థీకృత మాఫియాగా ట్రాన్స్‌జెండర్ల వసూళ్లు..!!

November 27, 2024 by M S R

hizda

. హైద్రాబాద్ లో వీళ్ళ న్యూసెన్స్ మాములుగా వుండదు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని పెళ్ళి కూతురు ఎక్కాల్సిన బస్సులో బట్టలిప్పదీసుకుని ముందే ఎక్కికూర్చున్నారు , ఆ డిమాండ్ డబ్బులిస్తే అప్పుడు దిగి వెళ్ళిపోయారు… . ఇదీ ఓ మిత్రుడి పోస్ట్ ఫేస్బుక్‌లో…. హహహ… ఇక్కడ నవ్వును సూచించే అక్షరాలు అత్యుక్తి కావచ్చుగాక… కానీ నాట్ ఓన్లీ హైదరాబాద్… ప్రతిచోటా ఉంది… మామూలుగా లేదు… అదొక మాఫియా… పక్కా ఆర్గనైజ్డ్ యవ్వారం… ఓ వార్త కనిపించింది… గృహప్రవేశం రోజున […]

ఈ షిండే మరీ మొండికేస్తే బీజేపీ మరో షిండేను వెతుకుతుంది…

November 26, 2024 by M S R

ms

. మహాయుతిలో చీలిక అనివార్యమా..? ఈ కోణంలో చాలా వార్తలు కనిపిస్తున్నాయి… ఎందుకంటే..? దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ ఆలోచన… కానీ మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఏకనాథ్ షిండే మళ్లీ తనే ముఖ్యమంత్రి అవుతానంటున్నాడు… పార్టీలు గెలిచిన సీట్ల సంఖ్యతో సంబంధం లేదనీ వాదిస్తున్నాడు… ఇవీ ఆ వార్తల సంక్షిప్త సారాంశం… 1) ఫడ్నవీస్ రెండున్నరేళ్లు, షిండే మరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని ఓ ప్రతిపాదన… 2) ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, షిండే, అజిత్ పవార్ డిప్యూటీ […]

మహారాష్ట్ర ఎన్నికలు… బాగా పేలిన బీజేపీ పొలిటికల్ స్లోగన్స్…

November 24, 2024 by M S R

maharashtra

. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అలయన్స్ మహాయతి విజయం సాధించింది! మహారాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్య – 288 మెజారిటీకి కావాల్సిన సీట్లు 145 మహాయతి : 234 సీట్లు గెలుచుకుంది. మహా వికాస్ అఘాఢి : 48 సీట్లు గెలుచుకుంది! బీజేపీ గెలిచిన సీట్లు : 132       2019 లో 105 —-+27 శివసేన – షిండే : 57                 2019 […]

నిజమే… జగన్ మీద ప్రతీకారానికి చంద్రబాబుకు చాన్స్ దొరికింది..!!

November 24, 2024 by M S R

jagan

. సో… అమెరికాలో ఆదానీపై నమోదైన కేసు ఆధారంగా జగన్ మీద కేసు పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైపోతోంది… ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్త పలుకు చదివితే అర్థమయ్యేది అదే… తను మునుపటి చంద్రబాబు కాదు, జగన్ ఆ అయిదేళ్లూ చంద్రబాబుకు చుక్కలు చూపించాడు… కటకటాల్లో వేశాడు… అదే సిట్యుయేషన్ జగన్‌కు క్రియేట్ చేయాలనే ప్రతీకార వాంఛ సహజం… పాత సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ బెయిల్ రద్దుకు ఢిల్లీ ద్వారా ప్రయత్నించవచ్చు అనే ఊహాగానాలు సాగాయి… […]

ఈసారి ఎన్నికల్లో అతి పెద్ద లూజర్… ది గ్రేట్ సునీల్ కనుగోలు..!!

November 23, 2024 by M S R

sunil kanugolu

. నేను ఫస్ట్ నుంచీ ఓ వాదనకు కట్టుబడి ఉన్నాను… ఈ సోకాల్డ్ ఎన్నికల వ్యూహకర్తలు, వాళ్ల విజయాలు ఉత్త బోగస్… ఈరోజుకు కూడా నాది అదే స్టాండ్… జస్ట్, స్థూలంగా చెప్పుకుంటూ పోదాం… లోతుల్లోకి అక్కర్లేదు… ఎందుకంటే, ఎన్నికల వ్యూహాలు అనేదే పెద్ద స్కామ్, ఫేక్, అబ్సర్డ్… ఏపీలో మొన్న పీకే లేడు… అసలు పీకే తన ఐప్యాక్‌తోనే డీలింక్ అయిపోయాడు.,.. కానీ పెంచి పోషించిన తన ఒడిశా రిషి టీం అదే తరహాలో పనిచేసింది… […]

గుడిలో పెళ్లిళ్లపై నిషేధం… పురాతత్వ శాఖ బుర్రలు అంటే అంతే…

November 23, 2024 by M S R

ontimitta

. ఆంధ్రప్రదేశ్ ‘భధ్రాద్రి’గా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఓ అభ్యంతరకర ఆదేశాలకు ‘తెర’ లేచింది. దేశంలోని ప్రతి హిందూ ఆలయంలో శుభకార్యాలు, వివాహ వేడుకలు, దీపోత్సవాలు జరగటం ఆనవాయితీ. అయితే ఒంటిమిట్ట కోదండ రామాలయంలో అవన్నీ ‘బంద్’ కావడం పట్ల భక్తులు ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించుకోవాలి. లేదంటే ఆ ఆలయ ప్రాశస్త్యాం కోల్పోయే ప్రమాదం ఉంది. అసలేం జరిగిందంటే..? ‘ఆంధ్రుల భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో […]

ఓ హిమాలయ పల్లెలో వెలుగులు నింపిన సోషల్ మీడియా పోస్టు..!

November 23, 2024 by M S R

a village

. ఆ ఊరికి.. అతనే థామస్ అల్వా ఎడిసన్! ఆ ఊరి చీకట్లలో వెలుగులు నింపిన సోలార్ వెలుగు.. ఆ టీచర్! ఉపాధ్యాయుడంటే.. కేవలం బళ్లో పాఠాలు చెప్పేవాడే కాదని… అంతకుమించి సమాజాన్నీ చైతన్యవంతం చేసేవాడని నిరూపించాడు. సమాజానికేది అవసరమో దాన్ని గుర్తించి.. వారి బతుకుల్లోని అంధకారాన్ని పారద్రోలి వెలుగులు నింపాడు. అది భారత సరిహద్దు ప్రాంతం. మయన్మార్ బార్డర్ లోని నాగాలాండ్ లోని షిన్యూ అనే ఓ మారుమూల గ్రామం. ప్రతీ ఏడూ దేశానికి దీపావళి […]

జార్ఖండ్ రిజల్ట్…! ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా సరే ఈ దురవస్థ దేనికి..?

November 23, 2024 by M S R

Kalpana soren

, బీజేపీకి జార్ఖండ్ ఎందుకు చేజారింది..? హేమంత్ సోరెన్ మీద అవినీతి ఆరోపణల్ని జనం ఎందుకు పట్టించుకోలేదు… మోడీషా అక్కడ ఎందుకు ఫెయిలయ్యారు..? రకరకాల సమీకరణాలు… 1) హేమంత్ సోరెన్ మీద అవినీతి ఆరోపణలు చేసి, జైలుపాలు చేసి, కొందరిని తమ క్యాంపులోకి లాగేసి, ఏవేవో శుష్క ప్రయత్నాలు చేసింది బీజేపీ… హేమంత్ సోరెన్ మీద ప్రజల్లో సానుభూతి… బీజేపీ అధికారం కోసం తనను వేధిస్తున్నదని..! అంతే… అంతకుమించి ప్రజలు ఆలోచించరు… ఎందుకంటే..? అవినీతి, అక్రమాలకు అతీతంగా […]

శరద్ పవార్ శకానికి ఫుల్‌స్టాప్… ఠాక్రే క్యాంపు ఖాళీ ప్రమాదం…

November 23, 2024 by M S R

ms elections

. మహారాష్ట్ర ఫలితాలు నిజంగానే బీజేపీకి పెద్ద రిలీఫ్… మోడీ నాయకత్వానికి పెద్ద రిలీఫ్… గత లోకసభ ఎన్నికల్లో బాగా దిగాలుపడిపోయిన కాషాయ కూటమికి పెద్ద రిలీఫ్… మసకబారిన యోగి ప్రతిష్ఠకు యూపీ ఉపఎన్నికల ఫలితాలు పెద్ద రిలీఫ్… వెరసి రాహుల్ నాయకత్వానికి మరో చేదు అనుభవం… కాంగ్రెస్‌తో జతకట్టే పార్టీలకు కూడా అంతే… ఇంకొన్ని కోణాలూ ఉన్నాయి… తరచూ మోడీషాలపై ఉరుముతున్న ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్‌‌కు ఓ లెసన్… సొంత కాషాయ పడవకు చిల్లులు పొడవొద్దు అని […]

అదే జరిగితే… జాతీయ రాజకీయాల్లోనే మార్పులు తథ్యం…

November 22, 2024 by M S R

ms elections

. జార్ఖండ్‌లో ఎవరు గెలిచినా పెద్ద ఫరక్ పడదేమో గానీ… మహారాష్ట్రను వివిధ ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్ట్ చేస్తున్నట్టు బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీసీ పార్టీల మహాయుతి కూటమి గనుక గెలుచుకుంటే అది రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది… యాక్సిస్ మై ఇండియా లేటుగా తన ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసింది… 288 స్థానాలకు గాను ఈ కూటమి 178 నుంచి 200 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది… వోటు షేర్ […]

అమెరికాలోనూ మనవాళ్ల అన్నసంతర్పణ… ఆటాకు అభినందనలు…

November 21, 2024 by M S R

ata

. అమెరికా అయితేనేం…? అక్కడ ఆకలి బతుకులు ఉండవా ఏం..? ఏ దేశం వెళ్లినా ఉంటారు… పేదరికం ప్రతి చోటా ఉండేదే… కడుపులు నింపేవాళ్లదే అసలైన ఔదార్యం… అలా అమెరికాలో మన తెలుగు సంఘం ఒకటి అలాంటి ఆకలి కడుపులు నింపే ప్రయత్నం చేస్తున్న తీరే మన కథనం… అమెరికన్ తెలుగు అసోసియేషన్ పంపించిన నోట్ యథాతథంగా… కడుపు చేత్తో పట్టుకుని ఆ దేశం వెళ్లి, అక్కడ కడుపులు నింపే ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలనే […]

  • « Previous Page
  • 1
  • …
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • …
  • 122
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions