నో… నాటెటాల్… ఏపీ రాజకీయ నాయకులే కాదు… దేశమంతా వాళ్లనే ఆదర్శంగా తీసుకుంటోంది… బూతులు ధారాళంగా ప్రవహిస్తున్నాయి… పాతాళానికి దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారు… ఉదాహరణ కావాలా..? సుప్రియా శ్రీనాథే అని ఓ మహిళ… కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ హెడ్డు… కానీ హెడ్డు సరిగ్గా పనిచేయదు… కంగనా రనౌత్ మీద పిచ్చి కూతలు కూసింది… కంగనా నటించిన ఏదో సినిమాలోని ఓ ఫోటోను పెట్టింది… కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ అనే నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నది […]
ఇది అతి పెద్ద ప్రపంచ ఆరోగ్య సమస్య… లక్షల మందిని మళ్లీ కబళిస్తోంది…
క్షయ… పెరుగుతోంది… ఆందోళనకరంగా… నిశ్శబ్దంగా కబళిస్తోంది… చాలా వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం… కరోనా అనంతర కాలంలో బాగా పడగవిప్పుతున్న వ్యాధి క్షయ… ఒకప్పుడు వ్యాధి సోకితే అంతే సంగతులు… కానీ మంచి పవర్ఫుల్ మందులు, మల్టీ డ్రగ్ థెరపీలు వచ్చాక మనిషి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు… కానీ కనుమరుగు కాలేదు అది… మళ్లీ జూలు విదిలిస్తోంది… ఇది అతి పెద్ద ప్రపంచ ఆరోగ్య సమస్య.,. క్షయ… ఈ పీడ మానవ చరిత్ర మొత్తంలో దాదాపు 100 కోట్ల […]
రాత్రికిరాత్రి బెంగుళూరు బాగా ఉబ్బినట్టు… ఆ కావేరి ఉబ్బిపోదు కదా…
ఈరోజు బెంగళూరు… రేపు ఏ నగరం? కర్ణాటక రాజధాని బెంగళూరు మహా నగరం నీటికి అలమటిస్తోంది. కోటీ నలభై లక్షల జనాభా ఉన్న నగరానికి కావేరీ నది, పాతాళం అంచుల దాకా వేసిన బోర్లు తప్ప మరో ఆధారం లేదు. కొంచెం ఎండలు ఫెళఫెళలాడగానే బోర్లలో నీళ్లు భగీరథుడికి కూడా దొరకవు. గొంతెండిన కావేరి ఇసుక తిన్నెల మీద కవిత్వం రాసుకోవాల్సిందే కానీ…నీరు దొరకదు. దొరికినా బెంగళూరు అవసరంలో ముప్పయ్ శాతానికి మించి వేసవిలో కావేరి నీటిని […]
మరింత దారుణ స్థితికి పుస్తక పఠనం… మల్లాది వారి అనుభవం చదవండి…
ఒకప్పుడు మల్లాది, యండమూరి, యద్దనపూడి, మధుబాబు, యర్రంశెట్టి శాయి వంటి రచయితల సీరియల్స్ మీద పాఠకుల్లో ఓ వెర్రి… నవల రాగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి… వాటి కోసం నిరీక్షించేవారు… అది గత ప్రాభవం… ఏవి తల్లీ నిరుడు కురిసిన అన్నట్టుగా… ఇప్పుడు ఎవరైనా పుస్తకం రాస్తే పబ్లిషర్ దొరకడు, దొరికినా మన సొంత ఖర్చు… ప్రింటింగ్ కాస్ట్ కూడా వెనక్కి రాదు… పబ్లిషర్ వచ్చిన ఆ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడు… తెలుగు రచయితలే అలా […]
ద్రౌపది ముర్ముపై పినరై విజయన్ పిటిషన్… సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేనా..?!
కేరళ ప్రభుత్వం ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీద సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేసింది… విషయం ఏమిటంటే..? ఆమె నాలుగు బిల్లులను పాస్ చేయకుండా తన వద్ద పెండింగ్‌లో ఉంచుకున్నారని..! సరే, ఆ బిల్లులు ఏ అంశాలకు సంబంధించినవీ అనేది పక్కన పెడితే… రాష్ట్రం పంపించిన ప్రతి బిల్లును రాష్ట్రపతి పాస్ చేయాలనేమీ లేదు… రాష్ట్రపతి పరిశీలన, విచక్షణతోపాటు, కేంద్రప్రభుత్వ అభిప్రాయం, రాజ్యాంగబద్ధత, సమాజంపై ప్రభావం వంటి చాలా కారణాలుంటయ్… సరే, సుప్రీంకోర్టులో ఆమెతోపాటు ఆమె సెక్రెటరీ, […]
ఆ 370 సీట్లు గనుక వస్తే… అప్పుడిక మోడీ అసలైన రాజసూయ యాగం..!!
మా చంద్రబాబు మోడీ ఎదుట ఎందుకు మోకరిల్లాల్సి వచ్చిందీ అనే వివరణ ఇచ్చుకోవడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ సుదీర్ఘమైన ‘కొత్త పలుకు’ రాయాల్సి వచ్చింది… రాజీపడకపోతే ప్రాంతీయ పార్టీల నేతలందరూ దెబ్బతినిపోతున్నారు అని బోలెడు ఉదాహరణలూ ఇచ్చి, మోడీ రాజసూయ యాగం చేస్తున్నాడు అని ముక్తాయించాడు… సో, చంద్రబాబుకు తప్పలేదు అని తేల్చేశాడు… అంతేకాదు, మోడీ వ్యక్తిపూజ దేశంలో, బీజేపీలో ఎక్కువైందీ, గతంలో ఇందిరాగాంధీ కూడా ఇలాగే వ్యవహరించి దెబ్బతినిపోయింది అంటూ చురకలు కూడా వేశాడు… సరే, […]
ఇది కదా చదివి పొంగిపోవాల్సిన వార్త! పదిమందికీ షేర్ చేయాల్సిన వార్త!
పోరాడితే పోయేదేమీ లేదు… ఒక తల్లీ కూతుళ్ల సాహసగాథ ఇది కదా చదవి పొంగిపోవాల్సిన వార్త! ఇది కదా చూసి అభినందించాల్సిన వార్త! ఇది కదా పదిమందికి షేర్ చేయాల్సిన వార్త! ఇంట్లో ఈగలకు, దోమలకు, నల్లులకు, బల్లులకు; వీధిలో పిల్లులకు, కుక్కలకు నిలువెల్లా వణికిపోయే మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వార్త ఇది. హైదరాబాద్ బేగంపేట అంటే నగరం నడి బొడ్డు. మధ్యాహ్నం ఒకటిన్నర అంటే పట్ట పగలు. గుమ్మం ముందు ఇద్దరు యువకులు తుపాకీ పట్టుకుని…ఏయ్! కదిలారో […]
అవును… అన్నా హజారే చెప్పినట్టు మద్యం, అధికారం రెండూ మత్తెక్కించేవే…
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను అవినీతి, అక్రమ మద్యం పాలసీల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగానే, నిజంగానే అందరి దృష్టీ ఒక్కసారి ఆయన గురువుగా భావించే అన్నా హజారే మీదకు మళ్లింది… 86 సంవత్సరాల వయస్సున్న ఆయన మొదటి నుంచీ అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నాడు… ఇదే కేజ్రీవాల్ తనతో కలిసి పనిచేశాడు… తరువాత విడిపోయి, ఆప్ పార్టీ పెట్టుకుని, మొదట ఢిల్లీలో, తరువాత పంజాబ్‌లో కూడా అధికారాన్ని సాధించాడు… ఏ అవినీతిపై తను […]
రుద్రకరణ్ ప్రతాప్… ఈయన మరో వేణుస్వామి… ఈడీ అరెస్టులపై మరో చర్చ..!
జ్యోతిష్కులపై ఎప్పుడూ ఓరకమైన విమర్శల దాడి జరుగుతూ ఉంటుంది… సోషల్ మీడియా విజృంభణ తరువాత ఇదింకా ఎక్కువైంది… ప్రత్యేకించి సెలబ్రిటీల జాతకాలను చెప్పే సెలబ్రిటీ జ్యోతిష్కులపై ఈ దాడి ఇంకా తీవ్రంగా ఉంటుంది… అదేసమయంలో ఆ నెగెటివ్ ప్రచారం కూడా వాళ్లు మరింత పాపులర్ కావడానికి ఉపయోగపడుతుంది… మరింత మందికి పరిచయం కావడానికి ఆస్కారమిస్తుంది… సరే, జోస్యాలు నిజమవుతాయ్, అబద్దమవుతాయ్… ఎవరూ ఖచ్చితమైన జోస్యాలు చెప్పలేరు… చెప్పిన జోస్యాల్లో ఎన్ని నిజమయ్యాయ్, స్ట్రయిక్ రేట్ ఎంత అనేదే […]
కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచే ఢిల్లీ సీఎంగా పాలన కొనసాగించగలడా..?
ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత తదుపరి ముఖ్యమంత్రి అవుతుందా..? ఈ ప్రశ్నకు సమాంతరంగా మరో ప్రశ్న ఉంది… కేజ్రీవాల్ జైలులో నుంచే ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తారా..? వరుసగా తొమ్మిదిసార్లు ఈడీ సమన్లకు స్పందించకపోవడంతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు, హైకోర్టులో తనకు ఏమీ రిలీఫ్ దక్కలేదు… అర్ధరాత్రయినా సరే, తమ కేసు వినాలని, కేజ్రీవాల్ అరెస్టును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టు తలుపులు తట్టారు ఆప్ లీగల్ కౌన్సిల్… అరెస్టుకు ఈడీకి అధికారాలున్నయ్, తొమ్మిదిసార్లు […]
మరీ ఆనందంగా ఏమీ లేం… కానీ అంత అధ్వానంగా బతుకుతున్నామా..?!
ఒక దేశవాసి ఆనందంగా ఎప్పుడుంటాడు..? పెద్ద పెద్ద సంక్లిష్ట ప్రాతిపదికలు, బోలెడన్ని శాస్త్రీయ సమీకరణాలు గట్రా లేకుండా… స్థూలంగా, కామన్ సెన్స్‌తో ఆలోచిద్దాం… 1) దేశం బయట నుంచి, అంతర్గతంగా భద్రంగా ఉండాలి… 2) న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ బాగుండాలి… 3) అవినీతి రహిత అధికారగణం ఉండాలి… 4) ఉద్యోగాలు, సరిపడా జీతాలు ఉండాలి… 5) మౌలిక సదుపాయాలు బాగుండాలి… 6) ఆయుఃప్రమాణం బాగా ఉండాలి… 7) వైద్యం, విద్య ప్రభుత్వ పరిధిలో ప్రజలపై భారం పడని […]
రాహుల్ రొట్టె విరుస్తాడు… అది మోడీ చేతి నేతి గిన్నెలో పడుతుంది…
రాహుల్ సెల్ఫ్ గోల్ ‘శక్తి’ … మోడీ ప్రచారాస్త్ర ‘శక్తి’ మెదడులో ఒక ఆలోచన మాటగా బయటికి రావాలంటే పరా; పశ్యంతి, మాధ్యమా, వైఖరి అని నాలుగు దశలు దాటాలి. ఈ నాలుగు రూపాలకు సరస్వతి ఆధారం. మొత్తంగా వాక్కు అగ్ని రూపం. పెదవి దాటిన మాట వైఖరి- ఎదుటివారికి వినపడుతుంది. మిగతా మూడు దశల వాక్కు గొంతులో, మనసులో, నాభిస్థానంలో బయలుదేరినప్పుడు ఎదుటి వారికి వినపడదు. మనతో మనమే స్వగతంలో మౌనంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా లోపల […]
నియంత తన నీడనూ నమ్మడు… ఆంతరంగికుల ఫోన్లనూ వదలడు…
అందరికీ గుర్తుంది కదా… పెగాసస్..! ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసిన ఈ స్పై వేర్‌ను జర్నలిస్టులు, మేధావులు, ప్రతిపక్ష నేతలు, బ్యూరోక్రాట్లు, ఇతర ముఖ్యుల ఫోన్ల ట్యాపింగ్‌కు మోడీ ప్రభుత్వం వాడినట్టు కదా రచ్చ…! స్పై వేర్ వేరు కావచ్చుగాక, దాదాపు ప్రతి రాష్ట్రమూ ట్యాపింగ్, ఫోన్ కాల్స్ స్పైయింగ్ చేస్తూనే ఉంటుంది… ఏపీలో కూడా ఈ స్పై పరికరాల కొనుగోలు అంశమే కదా చంద్రబాబు హయాంలోని ఇంటలిజెన్స్ చీఫ్ మెడకు చుట్టుకుంది…! తెలంగాణలో కూడా ప్రజలందరి […]
ఆ కేసీయార్ హిస్టరీని రిపీట్ చేయడం రేవంత్‌కు ఎందుకు తప్పనిసరి..!!
2014… కేసీయార్‌కు అత్తెసరు మెజారిటీయే… తెలుగుదేశం, కాంగ్రెస్ ఏవో కుట్రలు పన్ని, తెలంగాణ ఏర్పాటుకు ఓ విఫల ప్రయోగంగా చేస్తాయనే భయం కూడా ఉండింది… కేసీయార్ గేట్లు ఎత్తాడు… నిలబెట్టి ఒక్కొక్కరికి ఏం కావాలో అడిగి మరీ అప్పటి టీఆర్ఎస్లోకి లాగేసిండు… ఒక్క కాంగ్రెసో, ఒక్క తెలుగుదేశమో కాదు… టీడీపీ 12, కాంగ్రెస్ 5, వైసీపీ 3, సీపీఐ ఒకటి, బీఎస్పీ ఇద్దరు… గేట్లు దాటి జంప్… ఎందుకు..? ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం… ఎలాగూ ప్రజెంట్ రాజకీయాల్లో […]
అవినీతి కూపంలో ఓ కుటుంబ ఉద్యమ పార్టీ… హబ్బా… ఇది జార్ఖండ్ కథ..!!
ఉద్యమ పార్టీ… ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలకు చిరునామాగా నిలిచి, పోరాటంలో నిలిచి, తరువాత ఫక్తు రాజకీయ పార్టీగా మారి, పదవుల కోసం పాకులాడి… అవినీతి అక్రమాలకు పేరుపడి… ఓ కుటుంబసభ్యుడు అవినీతి కేసుల్లో జైలుపాలై… పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైంది..! హబ్బా… కేసీయార్ పార్టీ గురించి కాదండీ బాబూ… శిబూ సోరెన్ కుటుంబ పార్టీ గురించి..! జార్ఖండ్ ముక్తి మోర్చా… ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడింది… పోరాడింది… తరువాత కేసీయార్ పార్టీలాగే మారిపోయింది అది వేరే సంగతి… […]
ఎలక్టోరల్ బాండ్స్‌ను స్కాం అనాలా..? అసలెక్కడ స్టార్టయింది ఈ యవ్వారం..!!
ఎలెక్టరల్ బాండ్స్ ! పార్ట్ -1 కొండని తవ్వి ఎలుకను పట్టిన వైనం! గతం నుంచి వర్తమానంలోకి వద్దాం! మోహన్ దాస్ కరంచంద్ గాంధీతో మొదలయ్యింది రాజకీయ పార్టీకి పారిశ్రామిక వేత్తల విరాళాలు ఇవ్వడం! ఘనశ్యామ్ దాస్ బిర్లా (GD Birla) గాంధీకి ఆర్థికంగా సహాయం చేశాడు. గాంధీ 1909 లో వ్రాసిన ‘ The Indian Opinion ‘ అనే పుస్తకంలో తనకి ఉదారంగా విరాళం ఇచ్చిన రతన్ జీ జెంషెడ్ జీ గురించి ప్రస్తావించారు. […]
హవ్వ… బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలట… మరిన్నాళ్లూ కాపాడిందెవరు మహాశయా..?!
1) కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోపిడీ, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎం, ఢిల్లీ దాకా కమీషన్లు చేరుతున్నయ్, బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీని చేరాయ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర సహకారం, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ పార్టీల పాత్రే తేలుతోంది….. మోడీ వ్యాఖ్యలు ఇవన్నీ… …. నిజమే, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ అవినీతి పార్టీల పాత్రే తేలుతోంది అనేది కరెక్టే… కుటుంబ పార్టీలు ఖచ్చితంగా దేశానికి చేటు… కానీ బీఆర్ఎస్ అవినీతి మీద గతంలో తప్పనిసరై […]
వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి… మన తెలుగు నీలిమక్క భర్త సై…
Nancharaiah Merugumala ……. సనత్ నగర్ లో మూడో స్థానంలో నిలిచిన తెలుగు బిడ్డ కోట నీలిమ పంజాబీ భర్త, కాంగ్రెస్ ప్రవక్త పవన్ ఖేడా వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీపై పోటీ చేస్తారట! ––––––––––––––––––– రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో యూపీలోని వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీతో కాంగ్రెస్ పార్టీ తరఫున దిల్లీకి చెందిన పవన్ ఖేడా తలపడతారని ఇంగ్లిష్ న్యూజ్ చానల్స్ నిన్నటి నుంచి ఊదరగొడుతున్నాయి. టీవీ చానళ్ల డిబేట్లలో, ఏఐసీసీ ఆఫీసులో జరిగే కాంగ్రెస్ మీడియా […]
మరణించాక కూడా బాలు గొంతు సంపాదించి పెడుతూనే ఉంది..!!
పెద్ద ప్రశ్న..! జవాబు తెలియని ప్రశ్న..! ఒక ప్రఖ్యాత గాయకుడు సంపాదించిన ఆస్తులకు తన కొడుకు వారసుడు అవుతాడేమో చట్టల ప్రకారం, ఆనవాయితీగా వస్తున్న పద్ధతి ప్రకారం..! కానీ మరణించాక తన గొంతుపై వారసత్వం, హక్కులు ఎవరివి..? ఇదెందుకు మళ్లీ తెర మీదకు వచ్చిందీ అంటే..? బాలు గొంతును ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో కీడా కోలా సినిమా కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్, సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌కు బాలు కొడుకు చరణ్ నోటీసులు ఇచ్చాడు, భారీ […]
ఊర్జా… హట్జా… ఉట్జా… మా భాషకు ఈ క్రూడాయిల్ మసాజ్ ఏమిటండీ..!!
ఇండియన్ ఆయిల్ సమర్పిత మోడీ ఊర్జోపక్రమం ! రాముడు అడవికి వెళుతుంటే తల్లి కౌసల్య విశల్యకరణి (ఎముకలు విరిగితే వెంటనే వాటంతటవే అతుక్కోవడానికి చదివే మంత్రం) లాంటి ఎన్నెన్నో రక్షా మంత్రాలు చదివి… నాయనా నీకు పంచభూతాలు, రుతువులు, సంవత్సరాలు, మాసాలు, పక్షాలు, రోజులు, పూటలు, ఘడియలు, విఘడియలు అన్నీ రక్ష కలిగించుగాక అంటుంది. పద్నాలుగేళ్లు లోకాభిరాముడిని చూడకుండా ఎలా ఉండగలనో అని తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఆయనంటే అవతారపురుషుడు. ఆయన్ను ఘడియ ఘడియకు రక్షించడానికి ముందే […]
- « Previous Page
- 1
- …
- 34
- 35
- 36
- 37
- 38
- …
- 149
- Next Page »