నాలుగు గంటలపాటు టీవీ9లో కేసీయార్ సాగించిన డిబేట్ అనబడే ఏకపాత్రాభినయం ఎట్టకేలకు ముగిసింది… రోజూ కేటీయార్, హరీష్ చెబుతున్నవే తప్ప ఒక్క కొత్త పాయింటూ లేదు.., తన వైఫల్యాలను, తన అక్రమాలను మొరటుగా సమర్థించుకోవడమే తప్ప… మరేమీ కొత్తగా అనిపించలేదు… ఒకటీరెండు ఉదాహరణలతో అందులోని డొల్లతనం చెప్పుకోవచ్చు… మిగతా అన్నమంతా చూడనక్కర్లేదు… మోడీ దుర్మార్గాలు, రేవంత్ వైఫల్యాలు, కక్షసాధింపుల కేసులు గట్రా సరే… మళ్లీ ఎన్నికలొస్తే మళ్లీ నువ్వు గెలిచి ముఖ్యమంత్రి అవుతాననే ఆశ, ఆకాంక్ష కూడా […]
చిరునవ్వుతో పురస్కారం ఇస్తూ ఈమె… చిరాకుతో ఒకాయన అప్పట్లో…
Sai Vamshi…. చిరునవ్వుతో ఆమె.. చిరాకు పెడుతూ ఆయన… అబ్బే, ఫోటో చూసి ఆయన వెంకయ్యనాయుడు అనుకునేరు సుమా… మనం చెప్పుకునే ఆయన వేరు… నిన్న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పద్మ పురస్కారాలు అందించారు. జాతీయ స్థాయిలో అందించే అవార్డుల కార్యక్రమాలను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాను. అందులో మనకు తెలియని రంగాల్లోని వ్యక్తులు, వారి ప్రతిభ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ద్రౌపది ముర్మూ చాలా ప్లజెంట్‌గా ఉంటారు. గతంలో రాష్ట్రపతిగా ఉన్న […]
వయస్సుదేముంది..? వారసుడయితే సరి… కుర్చీ ఎక్కించడమే…!!
ఠాక్రే కాలం నుంచీ శివసేన నినాదం… జై భవానీ వీర శివాజీ… ఆ శివాజీని స్తుతించడం, మరాఠీ సంస్కృతికి పట్టం, భవానీ ఆరాధన శివసైనికుల బాధ్యతగా నూరిపోశాడు ఠాక్రే… బీజేపీ బీజేపీ అంటుంటారు గానీ బీజేపీకన్నా హార్డ్ కోర్ హిందుత్వవాాది ఠాక్రే… ఆ పార్టీ బలమే అది… ఎప్పుడైతే తమ భావజాలానికి పూర్తి విరుద్ధంగా నడుచుకునే కాంగ్రెస్, ఎన్సీపీతో కలిశారో… కేవలం అధికారం కోసం నాటి ఠాక్రే ఐడియాటజీకి నీళ్లొదిలారో అప్పట్నుంచే పతనం ఆరంభమైంది… కేడర్ డిమోరల్ […]
ఇది ఒక వ్యక్తి అవమానమే కాదు… ఒక వృత్తిని, ఒక కులాన్ని అవమానించడం…
ఆంధ్రప్రదేశ్… యు.కొత్తపల్లి మండలం… మూలపేట గ్రామం… ఆచెల్ల సూర్యనారాయణమూర్తి శర్మ అనే పురోహితుడు ఒక పెళ్లి జరిపించడానికి వెళ్లాడు… అక్కడ కొందరు ఆకతాయిలు తనను అవమానిస్తూ, రకరకాల గేలి చేస్తూ… తలపై ఓ సంచీ బోర్లించారు… పసుపు, కుంకుమలు నెత్తి మీద పోశారు… వాటర్ పాకెట్లు చల్లారు… చేతికందినవి ఆయన మీదకు విసిరేశారు… ఇదీ సంఘటన… ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది… సహజంగా బ్రాహ్మణ వ్యతిరేకత బాగా జీర్ణించుకున్న వ్యక్తులు ఆనందంతో కామెంట్లు పెడితే, మిగతావాళ్లు […]
ప్రధాని ఇందిరాగాంధే… ఆమె పాలనా రథానికి ముగ్గురు సారథులు…
ఎందరో ప్రధానులు దేశాన్ని పాలించినప్పటికీ… ఇప్పటివరకూ భారత్ ను ఎవ్వరూ పాలించని విధంగా.. ఇప్పటివరకూ ఒకే ఒక్క మహిళా ప్రధానిగా అభినవ దుర్గ అనిపించుకున్న పేరు ఇందిరాగాంధీ. అయితే, ఇందిరాగాంధీ పాలనా చతురత.. ఎమర్జెన్సీ వంటి చీకటి కోణాలను కొత్తగా చెప్పుకోవడం చర్వితచరణమే. కానీ, ఇందిర వెంట నడిచిన ఓ ఇద్దరు కీలక సివిల్ సర్వెంట్స్… ఓ నాన్ సివిల్ సర్వెంట్.. వారి మధ్య నెలకొన్న ప్రొఫెషనల్ పోటీ.. కచ్చితంగా కాస్తా ఆసక్తికరం.. చెప్పుకోవాల్సి విషయం. ఒకరు […]
వరల్డ్ వార్-3… ఇరాన్ వ్యూహాల్లో చైనా… బిత్తరపోయిన ఇజ్రాయిల్ కూటమి…
WW-3 అప్డేట్… ! ఇరాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! రష్యాకి తన సత్తా చూపిస్తున్న ఉక్రెయిన్! ******** 19-04-2024 తెల్లవారు ఝామున 2 నుండి 3 గంటల మధ్య ఇజ్రాయెల్ ఇరాన్ లోని 9 టార్గెట్స్ మీద మిస్సైల్స్ తో దాడి చేసింది. ఇరాన్ లోని ఇస్ఫహాన్ (Isfahan) నగరంలో ఉన్న ఎయిర్ బేస్ మీద డ్రోన్లు, మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలుస్తున్నది. ఇస్ఫాహన్ నగర శివార్లలో ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఉంది, […]
సానుభూతి నాటకాలు నిజంగానే వోట్ల పంటను పండిస్తాయా..?
Murali Buddha……. ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరగగానే అది సానుభూతి కోసం ఆడిన డ్రామా అని టీడీపీ వర్గం , ఇది బాబు జరిపిన కుట్ర అంటూ వైయస్ఆర్ వర్గం పరస్పరం మాటల దాడులు జరుపుకుంటున్నారు … నిజంగా సానుభూతి నాటకాలు వోట్ల పంట పండిస్తాయా…? రాజకీయ సానుభూతి ఆరోపణలతో ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద సానుభూతి రాజకీయ ఎత్తుగడలు గుర్తుకు వచ్చాయి … 1999 ఎన్నికల్లో వాజ్ […]
డబ్బా పాలు డబ్బా పాలే… నెస్లే వారి ఫుడ్ అయితే అక్షరాలా అంతే…
ఈమధ్య బోర్న్‌విటా హెల్త్ డ్రింక్ అన్ హెల్తీ పాలసీల గురించి మాట్లాడుకున్నాం కదా… ఈ డ్రింకుల్లోని కంటెంటు ప్రమాదాల గురించి సోషల్ మీడియాయే బయటపెట్టింది… నెస్లే… ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కంపెనీ… ప్రధానంగా పిల్లల ఆహారాల ఉత్పత్తుల సంస్థ… దానిపై దుమారం రేగుతోంది… శిశువులకు, చిన్న పిల్లలకు నెస్లే ఫుడ్ (సెరిలాక్ తరహా ఫుడ్) పెడుతుంటారు ప్రపంచవ్యాప్తంగా… ఐతే రూల్స్‌కు విరుద్ధంగా ఈ సంస్థ కొన్ని దేశాల్లో ఫుడ్‌లో చక్కెర శాతాన్ని పెంచి అమ్ముతోందని తాజా ఆరోపణ… […]
బీభత్సమైన కవరేజీ… కంటెంటు కాదు, ఆ 29 ఫోటోల పబ్లిషింగ్…
ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… 29 మంది నక్సలైట్లు మరణించిన చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ వార్త… దండకారణ్యం మీద నక్సలైట్ల పట్టు సడలడానికి కారణాలు సహా, దాదాపు 80 వేల బలగాలతో సాగుతున్న యాంటీ నక్సల్స్ ఆపరేషన్ వివరాల్ని ఏకరువు పెట్టింది ఆ వార్త… బాగానే ఉంది… సరే, ఆ కథనం జోలికి మనం పోవడం లేదు ఇక్కడ… కానీ ఆ వార్తకు 29 మంది మృతుల ఫోటోలు చిన్న చిన్నగా యాడ్ చేశారు… బ్లాక్ అండ్ వైట్ అయినా […]
ఐరనీ… తండ్రి తెలంగాణ పోరాట వీరుడు… భర్త గ్యాంగ్‌స్టర్ కమ్ పొలిటిషియన్…
ఉత్తరప్రదేశం దాకా వెళ్లిన మన పొలిటిషయన్స్ కొత్తేమీ కాదు… జయప్రద పేరు ఉదాహరణకు ఉండనే ఉందిగా… కానీ శ్రీకళారెడ్డి అనే పేరు, ఆమె బయోడేటా కాస్త ఆసక్తికరంగా ఉంది… ప్రస్తుతం ఆమె జాన్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేస్తోంది… నిజానికి ఆమె ఆమధ్య బీజేపీలో చేరింది… హుజూర్నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తెలంగాణలోనే పోటీచేస్తుందని అందరూ అనుకున్నారు… ఆమెది తెలంగాణే… తండ్రి జితేందర్‌రెడ్డి, తను నల్గొండ డీసీసీబీ అధ్యక్షుడిగా చేశాడు, హుజూర్నగర్ నుంచి గతంలో ఇండిపెండెంటుగా […]
ప్రజాస్వామ్యం వద్దు, రాజరికమే కావాలి… ఓ హిందూ దేశంగా ఉందాం…
ఇండియాను హిందూ దేశంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? అది సాధ్యమేనా..? ప్రజలు ఆమోదిస్తారా..? ఇవన్నీ చర్చల్లో ఉండే ప్రశ్నలు… జవాబులు కష్టం… కానీ నేపాల్‌లో మాత్రం ఈ దిశలో ప్రజలే ఉద్యమిస్తున్నారు… ఇది ఆసక్తికరమైన పరిణామం… కానీ ఇండియన్ మీడియా ఈ వార్తలకు ఏమీ ప్రయారిటీ ఇవ్వడం లేదు… మొన్న ఖాట్మండులో భారీ ప్రదర్శన జరిగింది… వేలాది మంది మార్చ్ నిర్వహించారు… ఒక దశలో ఈ ఆందోళనలు ప్రధాని కార్యాలయ ముట్టడి ప్రయత్నాలతో అదుపు తప్పే పరిస్థితి […]
కేసీయార్ ఇజ్జత్‌కు మరక… ఆ భాష మార్చుకోవాలని ఈసీ చురక…
నిరోధ్‌లు, పాపడాలు అమ్ముకుని బతకాలంటూ సలహాలిస్తున్నాడు ఓ కాంగ్రెస్ నాయకుడు అని చెబుతూ, కుక్కల కొడుకులు అనే పదం వాడాడు… నీటి సామర్థ్యం గురించి తెలియని లత్కోరులే ఈ పరిస్థితికి కారణం అన్నాడు… చవట, దద్దమ్మల పాలన వల్లే ఈ దుస్థితి… బోనస్ గనుక ఇవ్వకపోతే మీ గొంతుల్ని కోసేస్తం, చంపేస్తం… ఇదీ శ్రీమాన్ కేసీయార్ సారు గారి భాష… పైగా నిన్న ఎక్కడో మాట్లాడుతూ లిల్లీపుట్ గాళ్ల ప్రభుత్వం, లిల్లీపుట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషేమిటి..? […]
ఒక వైరల్ ఫెయిల్యూర్ స్టోరీ… 12 ప్రయత్నాల సివిల్ సర్వీస్ పరీక్ష…
యూపీఎస్సీ 2003 రిజల్ట్స్ వచ్చాయి… ర్యాంకులు కొట్టి, సివిల్ సర్వీసులో చేరబోతున్నవారి మొహాల్లో, ఆ కుటుంబాల్లో ఆనందం… ఇంటర్వ్యూల దశ దాటలేని దురదృష్టవంతుల్లో మళ్లీ నిరాశ… ఫస్ట్ ర్యాంకర్ నుంచి బోలెడన్ని ర్యాంకుల దాకా… మీడియాలో, సోషల్ మీడియాలో బోలెడన్ని సక్సెస్ స్టోరీలు… అర్హులే అభినందనలకు… మరి ఒకటీ అరా మార్కులతో విఫలమైన వాళ్ల ఫెయిల్యూర్ స్టోరీలు ఎవరు చెప్పాలి… అవి కదా అసలు అందరికీ తెలియాల్సినవి… ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలిస్తే కదా లక్షల మందికి […]
మళ్లీ వార్తల్లోకి దేవయాని..! కాంబోడియాకు పంపించేసినా ఊరుకోదు..!!
దేవయాని ఖోబ్రగడె… పేరు గుర్తుందా..? చాన్నాళ్లయింది కదా ఆమె వార్తల తెర మీదకు రాక… ఎస్, మళ్లీ వచ్చేసింది… ఈసారి డిఫరెంటుగా… ఆమె ప్రస్తుతం కాంబోడియా ఇండియన్ ఎంబసీలో రాయబారిగా పనిచేస్తోంది కదా… అక్కడి నూతన సంవత్సరం రోజున ఆ దేశప్రజల ఖ్మేర్ సంస్కృతికి సంబంధించిన అప్సర వేషధారణ చేసి, ఆ దేశప్రజలకు శుభాకాంక్షలు చెప్పింది… ఆ ఫోటో షూట్‌ను ఇండియన్ ఎంబసీయే అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది… స్థూలంగా చూస్తే వోకే… బాగుంది… ఆమె […]
హమ్మయ్య… ఆ రాముల వారి కల్యాణాన్నే ఈసారి ఆపేయమనలేదు…
అధికారులకే పూర్తి పెత్తనం ఇస్తే పేనుకు పెత్తనం ఇచ్చినట్టే అనేవాడు మా మిత్రుడు… ఎన్నికల అధికారులను నిశితంగా గమనించండి, ఆ వ్యాఖ్య నిజమేనని అంగీకరిస్తారు ఎవరైనా… 4650 కోట్లు పట్టుకున్నారట దేశవ్యాప్తంగా… అంటే రోజుకు 100 కోట్లు… సిగ్గులేని మీడియా ప్రశంసిస్తూ రాసుకొచ్చింది… అసలు ఎన్నికల కోడ్ అమలు తీరు మీద ఈ భజన వార్తలేమిటో అర్థం కాదు… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూశాం కదా, రికార్డుల అంకెల కోసం పోలీసులు, ఎన్నికల అధికారులు స్వాధీనం […]
ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ రెడీ… ఇరాన్‌తో కయ్యం మరింత ముదిరింది…
WW-3 అప్డేట్… అనుమానించినట్లుగానే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది శనివారం రాత్రి పూట! 1. ఇరాన్ 300 కామికాజ్ (ఆత్మాహుతి) డ్రోన్లు ఇజ్రాయెల్ మీదకి ప్రయోగించింది. వీటిలో ఒక్కటీ కూడా ఇజ్రాయెల్ లో పడకుండానే ఆకాశంలో ఉండగానే కూల్చేసింది ఐరన్ డోమ్! రెండు డ్రోన్లు ఇజ్రాయెల్ లోని ఎడారి ప్రాంతంలో పడ్డాయి. 2. 110 బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఇరాన్ ప్రయోగించగా 103 మిసైళ్ళని ఇజ్రాయెల్ యారో (Arrow Air Defence System) ఎయిర్ డిఫెన్స్ […]
ఆశ్చర్యమే..! బిడ్డ కవిత దగ్గరకు ఈరోజుకూ కేసీయార్ ఎందుకు పోవడం లేదు..?
ఆసక్తికరమైన ప్రశ్నే… కవితను ఈడీ, సీబీఐలు అరెస్టు చేసి, ఏకంగా తీహార్ జైలుపాలు చేసినా సరే… ఈరోజుకూ ఆమెను కేసీయార్ పరామర్శించలేదు… అరెస్టు దగ్గర్నుంచి ఈరోజు వరకూ కేటీయార్, హరీష్, ఆమె భర్త, లాయర్ తదితరులు తప్ప కేసీయార్ మాత్రం తెర మీద కనిపించడం లేదు… ప్రచార సభల్లో కూడా కవిత అరెస్టు, కేసుల గురించి ప్రస్తావించడం లేదు… ఆమె బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి… అసలే ఈడీ కేసు సీరియస్… పైగా సీబీఐ ఎంటరైంది… రెండు […]
పూర్తిగా చదవండి… మన రాళ్ల దాడుల వార్తల నడుమ ఈ కథనం మీకు కనిపించకపోవచ్చు..!!
ప్రతీకారం అంటే ఇజ్రాయిల్ గూఢచార విభాగం ఏజెంట్లు… మొసాద్… వరల్డ్ ఫేమస్… తమ దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన ఎవరినైనా, ఎంత కాలమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఖతం చేయడం దాని స్పెషాలిటీ… రష్యన్ గూఢచార విభాగం కేజీబీకి కూడా దాదాపు అదే చరిత్ర ఉంది… మరి మన దేశంలో లెక్కలేనన్ని విద్రోహచర్యలకు పాల్పడుతుంటారు కదా అనేకమంది అంతర్గతంగా, బయటి నుంచి.,. మరి మనకు చేతకాదా..? ఇది కదా ప్రశ్న… మన గూఢచార విభాగం మొత్తాన్నే నిర్వీర్యం […]
అటూ ఇటూ తిరుగుతూ… ఆ రాయి ప్రమాదవశాత్తూ జగన్‌కు తగిలింది…
జగన్ మీద రాయితో దాడి జరిగింది… నుదుటి మీద గాయం కనిపిస్తోంది… దాని తీవ్రత ఎంతో తేల్చడానికి వైద్యులు ఆరోగ్యపరీక్షలు చేస్తున్నారు… ఒకరోజు ప్రచారసభలు ఆపేసింది వైసీపీ… ఇవన్నీ వార్తలు… ఒక ముఖ్యమంత్రి మీద రాయితో దాడి జరగడం అనేది తీవ్ర విషయమే… ఐతే… పొలిటికల్ సీజన్ కదా… ఎక్కడ జగన్‌కు సానుభూతి మైలేజీ వస్తుందేమో అనుకుని టీడీపీ ఠారెత్తింది… ఎహె, ఇదంతా చేయించుకున్న దాడి అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు… వోకే, అది పొలిటికల్ అవసరం అనుకుందాం… […]
వరల్డ్‌వార్3 అప్డేట్… ఇరాన్ యుద్ధనగారా… వెల్కమ్ అంటున్న ఇజ్రాయిల్…
WW3 అప్డేట్! ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాం.. ఇరాన్! ఇరాన్ నుండి వచ్చే మిస్సైల్ కోసం ఎదురు చూస్తున్నాం..ఇజ్రాయెల్! గత రెండు రోజులుగా అంతర్జాతీయంగా పరస్పర ఛాలెంజ్ లతో వేడెక్కిన వాతావరణం! **** ఏప్రిల్ 1,2024. గాజాలో హమాస్ తీవ్రవాదులను మట్టు పెడుతూ అడపా దడపా అటు లెబనాన్, సిరియా ల మీద కూడా దాడులు చేస్తూ వస్తున్నది ఇజ్రాయెల్! లెబనాన్ లో ఉన్న హెజ్బొల్ల తీవ్రవాదులు IDF కి గట్టి పోటీ ఇస్తున్నారు గత అయిదు […]
- « Previous Page
- 1
- …
- 39
- 40
- 41
- 42
- 43
- …
- 155
- Next Page »