దుబ్బాక అభ్యర్థి, బీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసుల ప్రకటన ఆశ్యర్యపోయేలా చేసింది… వీళ్లు మనకు తెలిసిన తెలంగాణ పోలీసులేనా అనేది ఆ విస్మయం… అందరూ అని కాదు, కానీ చాలామంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికార్లు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్న కాలమిది… ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా సరే… ఒకరిద్దరు కేసీయార్ కాళ్లను మొక్కుతున్న సీన్లు, ఒకాయన ఏకంగా పార్టీలో చేరి రిచ్చెస్ట్‌గా అవతరిస్తున్న సీన్లూ చూశాం, చూస్తున్నాం… అనేక సందర్భాల్లో నిజాల్ని దాచేసి, కేసీయార్ […]
మళ్లీ ఫోన్ల హ్యాకింగ్ లొల్లి… రాహుల్ పీఎం ఐనాసరే… ట్యాపింగులు తప్పవు…
మళ్లీ మొదలుపెట్టారు… రాహుల్ గాంధీ అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టేసి, మా ఫోన్లు హ్యాక్ అవుతున్నయ్, ఐనా సరే, ఏం చేసుకుంటారో చేసుకొండి, డోన్ట్ కేర్, నా ఫోన్ ఇవ్వమన్నా ఇస్తాను అంటూ భీకరమైన ప్రకటనలు జారీ చేశాడు… కేటీయార్, రేవంత్ సహా పలు బీజేపీ విపక్షనేతలు కూడా వంత పలికారు… శశిధరూర్, అఖిలేష్, ఏచూరి, మహువా ఇవే ట్వీట్లు చేశారు… తమకు యాపిల్ అలర్ట్ మెసేజులు వచ్చాయి కాబట్టి మా ఫోన్లన్నీ హ్యాకింగ్ చేస్తున్నట్టే అని […]
పండుగలా చంద్రబాబు విడుదల… కానీ నిజంగానే ‘సత్యం గెలిచిందా..?’
చంద్రబాబుకు బెయిలొచ్చింది… టీడీపీ శ్రేణులు పండుగ చేసుకున్నాయి… నిజంగానే చంద్రబాబు ఊహించనంతగా తన కుటుంబసభ్యులు, నాయకులు, కార్యకర్తలు, కొన్నిచోట్ల జనం, సానుభూతిపరులు భారీ స్థాయిలో స్వాగతం పలికారు… ఇక ఏబీఎన్, టీావీ5, ఈటీవీ కూడా సంక్రాంతి జరుపుకున్నాయి… ఇవన్నీ సహజమే… ఇన్నేళ్ల ప్రజాజీవితంలో ఎప్పుడూ కోర్టు మెట్లు ఎక్కనివాడు, జైలు గుమ్మం దాటనివాడు హఠాత్తుగా పలు కేసుల్లో ఇరుక్కుని, 50 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉండాల్సి రావడం ఏపీ రాజకీయాల తీరును చూస్తే పెద్ద ఆశ్చర్యం […]
రోత రాజకీయం… సిద్ధాంతాల్లేవ్, రాద్ధాంతాలే… వెగటు వాసనల స్వార్థాలే…
టికెట్టు దొరక్కపోతే వెంటనే జంప్… ఎవడు టికెట్టిస్తే వాడే బాస్… డప్పు ట్యూన్ మారుతుంది అంతే… నాకు టికెట్టు ఇవ్వరా, నా కొడుక్కి ఇవ్వు, నా బిడ్డకు ఇవ్వు, లేదంటే ఇద్దరికీ ఇవ్వు… లేకపోతే ఆ పార్టీ వాడు పిలుస్తున్నాడు, కండువా చేంజ్ అంతే… సిద్ధాంతాల్లేవ్, రాద్దాంతాల్లేవ్… ఒకటే సిద్ధాంతం, టికెట్ కావాలి, నిలబడాలి, ఎమ్మెల్యే అయిపోవాలి… కబ్జాలు, అక్రమ సంపాదన, సెటిల్మెంట్లు, మైనింగ్… వాట్ నాట్… ఏదంటే అది చేసుకోవచ్చు… అన్ని పార్టీల్లోనూ ఇదే తీరు… […]
టిపికల్ ఇండియన్ పొలిటిషియన్ తరహాలో పుతిన్ తాజా వ్యాఖ్యలు…
పార్ధసారధి పోట్లూరి ….. యూదులు రష్యాలో మాత్రమే సురక్షితంగా ఉండగలరు…. పుతిన్ తాజా వ్యాఖ్య… సగటు భారతీయ రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుతూ, ఎలా ప్రవర్తిస్తారో అచ్చంగా అలానే ప్రవర్తిస్తున్నాడు పుతిన్! వివరాలలోకి వెళ్లేముందు… ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావిస్తాను… మాస్కోలో నివాసం ఉండే యూదుల మత పెద్ద (Cheif Rabbi) పించాస్ గోల్డ్‌స్మిత్ (Pinchas Goldschmidt) పుతిన్ స్పెషల్ మిలటరీ ఆపరేషన్ మొదలు పెట్టగానే రష్యాని వదిలి వెళ్ళిపోయాడు 2022 డిసెంబర్ లో ! అక్టోబర్ 25. పుతిన్ రష్యా […]
రేవంత్ జపం..! నమస్తే తెలంగాణ హెడ్డింగుల్లో అదే పేరు పదే పదే…!!
రేవంత్ చేతిలో పార్టీ ఖతం… అబ్దుల్లా సోహెల్ … ఫస్ట్ పేజీ కొట్లాటల కాంగ్రెస్… రేవంత్ బేరాలపై విమర్శలు… ఫస్ట్ పేజీ రేవంత్ తీరు దారుణం… విష్ణవర్ధనరెడ్డి ధ్వజం… ఐదో పేజీ రేవంత్ దమ్ముంటే రా, చూసుకుందాం… సుభాష్ రెడ్డి… ఐదో పేజీ కుక్క నోట్లో రేవంత్ మూతి… పాల్వాయి స్రవంతి… ఐదో పేజీ రేవంత్ నీ బాగోతం బయటపెడతా… విజయకుమార్‌రెడ్డి… ఐదో పేజీ రేవంత్ స్వలాభానికి కాంగ్రెస్ నాశనం… ఐదో పేజీ రేవంత్ దగా చేశాడు… […]
తప్పంతా ఇసుకదే… ఉన్నచోట నిలవదు, అటూఇటూ కదిలింది, మేడిగడ్డ కుంగింది…
మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణం “కుట్ర” అంటూ మొన్నటివరకూ గగ్గోలు పెట్టిన అధికార యంత్రాంగం, జనాల్లో నవ్వులపాలవుతున్నామని గ్రహించి “కుట్ర” కాదు అని బహిరంగంగా ప్రకటించాల్సి వచ్చింది. ******* ఈ ప్రకటన వచ్చి ఒక్కరోజు ముగియకముందే, బ్యారేజీ కుంగడానికి కారణం కింద ఉన్న “ఇసుక కదలడమే” అంటూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ స్థాయి గల ఒక ఐఏఎస్ అధికారి ఈ ప్రకటన చేయడం ప్రభుత్వాన్ని మరింత నవ్వులపాలు చేస్తున్నది. ఇక్కడ డిజైన్ లోపం కానీ, నిర్మాణ లోపం […]
ఆ ఎనిమిది మందిలో మన తెలుగువాడు కూడా…! ఖతార్ వదిలేసేనా..?!
Nancharaiah Merugumala…. ఖతార్ లో మరణశిక్ష పడిన 8 మంది భారత నేవీ మాజీ సిబ్బందిలో తెలుగు అధికారి పాకాల సుగుణాకర్! ఇజ్రాయెల్ తరఫున అత్యంత సంపన్న అరబ్ దేశంలో గూఢచర్యం నిజమైతే అది పెద్ద నేరమే! ………………………… అత్యంత సంపన్న పెట్రో అరబ్ దేశం ఖతర్ సైనిక దళాలకు సేవలందించే ఒక ప్రైవేటు కన్సల్టెన్సీ కంపెనీలో పనిచేస్తున్న 8 మంది భారత నేవీ రిటైర్డ్ ఉన్నతోద్యోగులకు గురువారం అక్కడి కోర్టు మరణ శిక్ష విధించిందనే వార్త […]
సమస్య పది పిల్లర్లది కాదు… మొత్తం బ్యారేజీది… ఇదీ టెక్నికల్ వివరణ…
బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుకు “కుట్ర” కారణం కాదనీ, కొన్ని పిల్లర్ల కింద ఇసుక కొట్టుకు పోవడం వల్ల (Under Tunnelling), ఆ పిల్లర్లు కుంగిపోయాయనీ, ఆ పిల్లర్ల వరకు, అంటే సుమారు 10 పిల్లర్లు, మళ్ళీ కడితే సరిపోతుందని మన ఇంజనీర్-ఇన్-చీఫ్ గారు సెలవిచ్చారు. కానీ ఇంజనీర్ గారు సెలవిచ్చినట్టు కింద నున్న ఇసుక కొట్టుకపోవడమే పిల్లర్ల కుంగుబాటుకు కారణమైతే మొత్తం బ్యారేజీని మళ్ళీ కొత్తగా కట్టాల్సి ఉంటుంది. ********************* ఎందుకంటే…? మామూలుగా బ్యారేజీ కట్టేటప్పుడు నది […]
కోకాపేట భూములు… ఇదొక అంతులేని రియల్ వేలం వెర్రి…
Artificial Auction: ఈమధ్య ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ కోకాపేట ఎకరా వందకోట్ల రూపాయలు పాట పాడుకుంది. ఆ భూమి తనకు తానుగా ఆ విలువ కట్టుకుని…మార్కెట్ వేలం సాహిత్యానికి ఆ రాగం రేటు స్వరాలు కట్టుకోలేదు. రియల్ఎస్టేట్ రారాజ నిలయ సంగీత విద్వాంసులు కృత్రిమంగా అలాంటి స్వరాలు కట్టి పాటలు పాడుకున్నారని…తరువాత శంకరపల్లి వేలం పాటల్లో పాడిన వంకరాభరణ రాగాల వల్ల తేలిపోయింది. భారతదేశంలో బాంబే, ఢిల్లీతో పాటు ఎక్కడా లేనంత ఎక్కువ ధరకు భూములు అమ్ముడు పోతున్నాయని భ్రమ కలిగించడంలో […]
అసలు తప్పులు బీజేపీ హైకమాండ్వి… కోమటిరెడ్డి మీద ఏడ్పులు దేనికి..?
నిన్నంతా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీ జంప్ మీద బోలెడు వార్తలు… టీవీల్లో, పత్రికల్లో, పత్రికల డైనమిక్ ఎడిషన్లలో, సోషల్ మీడియాలో ఊదరగొట్టేశారు… తనేదో పెద్ద రాష్ట్ర స్థాయి నాయకుడైనట్టు… వెంటనే విశ్లేషణలు… ఒక నాగం, ఒక కోమటిరెడ్డి, ఒక జిట్టా ఎట్సెట్రా ఎవరినీ బీజేపీ కాపాడుకోలేదనీ, డీకేఅరుణ, కొండా, వివేకా ఎట్సెట్రా కీలకనేతలు కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్లోకి పారిపోతున్నట్టు రాతలు… కొందరైతే మరీ ముందుకెళ్లి, అసలు కోమటిరెడ్డి బీజేపీలోకి రావడమే ఓ కోవర్టు ఆపరేషన్ అని తేల్చేశారు… […]
జస్ట్, కాస్త ఇసుక కొట్టుకుపోయి పిల్లర్లు కుంగాయట… వీళ్లు మన ఇంజినీర్లు..!!
మేడిగడ్డ బరాజ్‌లోని ఏడో బ్లాకు పిల్లర్లన్నీ మార్చాల్సిందే, కాఫర్ డ్యామ్ తప్పదు… ఒక వార్త పిల్లర్లలో నిలువు పగుళ్లు రావడం ఏమిటో కేంద్ర బృందానికీ అర్థం గాక విస్తుపోయారు… మరో వార్త ఇదే కాదు, మొత్తం ప్రాజెక్టుల సేఫ్టీ, క్వాలిటీపై టెక్నికల్ దర్యాప్తు అవసరం… ఇంకో వార్త మొత్తం కాలేశ్వరం ప్రాజెక్టు డిజైన్, ఖర్చు, క్వాలిటీలపై సమగ్ర శోధన కావాలి… ఇదో వార్త . ఇలాంటి వార్తలెన్నో తెలంగాణ సమాజాన్ని షాక్‌కు గురిచేస్తుంటే… మొదట ప్రభుత్వ వర్గాలు […]
ఇజ్రాయిల్, హమాస్ యుద్ధంపై చైనా యూ టర్న్… నమ్మి భంగపడిన రష్యా…
పార్ధసారధి పోట్లూరి ……. మధ్యప్రాచ్యం మంట! పార్ట్ -6……. అమెరికా మరో క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ని తూర్పు మధ్యధరా సముద్రంలోకి పంపింది!ఇరాన్ కనుక హమాస్ కి మద్దతుగా దిగితే ఎదుర్కోవడానికి ! So! మధ్యధరా సముద్రం దాదాపుగా అమెరికన్ నేవీ పర్యవేక్షణ కిందకి వచ్చినట్లుగా భావించాలి! మరో వైపు మిగిలిన నాటో దేశాలు కూడా తమ డిస్ట్రాయర్స్ , ఫ్రిగేట్స్ ని మధ్యధరా సముద్రంలోకి పంపించాయి ఇజ్రాయెల్ కి మద్దతుగా! *************** అయితే పుతిన్ కి […]
సగం మ్యాచులు ముగిసే సమయానికి వరల్డ్ కప్‌లో ఏ జట్టు పొజిషన్ ఏమిటంటే…
Nationalist Narasinga Rao …….. #iccworldcup2023 సగం టోర్నమెంట్ ముగిసింది… ఒక్కొక్క టీమ్ తొమ్మిదేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా 5 మ్యాచ్ లు అయిపోయాయి.. ఈరోజు ఆసీస్ నెదర్లాండ్స్ మధ్య, రేపు ఇంగ్లాండ్ శ్రీలంకల మధ్య ఐదో మ్యాచ్ ఉంది ఆసీస్ కు ఇది కూడా కీలక మ్యాచ్ … ఏదైనా అద్భుతం జరిగి నెదర్లాండ్స్ గెలిస్తే నాలుగో స్థానం కోసం హోరాహోరీ తప్పదు… నార్మల్ గా ఆస్ట్రేలియా గెలిస్తే పెద్ద అంచనాల్లో మార్పు ఉండదు […]
మేడిగడ్డ జూడ మేలిమై ఉండును… స్తంభముల తీరు జూడ కుంగి ఉండును…
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు వెనుక ఏ కుట్ర, విద్రోహం లేవని ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖరే స్పష్టం చేశాడు… తరువాత అరగంటాగంటకే ఆయన ప్రకటన మారిపోయింది… ఫోరెన్సిక్, క్లూస్ టీమ్స్ నివేదికల తరువాతే నిర్ధారణకు వస్తామని మరో ప్రకటన వచ్చింది… అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాల ఒత్తిడితో తను మాట మార్చేశాడని..! ఎస్, లక్ష కోట్ల కాలేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో చాలా లోపాలున్నాయనే విమర్శలు ఈనాటివి కావు… అవినీతి ఆరోపణలు సరేసరి… కానీ ఎలాగైతేనేం, […]
అబ్బో… ఆ గుర్తు ధర వెయ్యి ఎకరాలా..? రోడ్ రోలర్ అంత నష్టం చేస్తుందా..?
పార్టీ, అభ్యర్థుల పేర్లను చదవలేని నిరక్షరాస్యత, తగ్గిపోయే వృద్ధుల కంటిచూపు, ఎన్నికల గుర్తును సరిగ్గా గుర్తుపట్టి వోటు వేయలేని అమాయకత్వం… ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతా ఒక గుర్తు అనుకుని మరో గుర్తుకు వోట్లేయడం, కొన్నిచోట్ల భీకరమైన పోటీ ఉన్నప్పుడు ఈ తప్పుడు వోట్ల ఫలితంగా గెలుపూవోటములు అటూఇటూ మారిపోయిన ఉదాహరణలూ బోలెడు… పర్ఫెక్ట్ ఉదాహరణలు… సైకిల్ గుర్తుకు మోటార్ సైకిల్ గుర్తుతో జరిగిన నష్టం… అలాగే కేసీయార్ పార్టీకి రోడ్ రోలర్ గుర్తుతో […]
డూప్ పుతిన్స్… సేమ్ హిట్లర్ బాటలో… ఎవరు ఒరిజినలో చెప్పడం కష్టం…
పార్ధసారధి పోట్లూరి ……. మధ్యప్రాచ్యం మంట-పార్ట్-5… పుతిన్ చైనా పర్యటన కొన్ని చేదు నిజాలు! పుతిన్ చైనాలో ఒకరోజు పర్యటించాడు… బీజింగ్ ఎయిర్పోర్ట్ లో పుతిన్ కి ఘన స్వాగతం లభించింది! ఊరుపేరు లేని ఒక మంత్రిని పుతిన్ ని ఆహ్వానించడానికి పంపించాడు జింగ్పింగ్ ఎయిర్ పోర్ట్ కి! రెండూ మిత్ర దేశాలే! ఇంతలో ఎంత మార్పు? రష్యా అధ్యక్షుడుగా పుతిన్ నియంత! కానీ జింగ్పింగ్ ని శాశ్వత అధ్యక్షుడిగా అక్కడి సెంట్రల్ పార్టీ నియమించింది. ఉక్రేయిన్ […]
ఈయన చెబితే ఒడిశా సీఎం చెప్పినట్టే… అంత పవర్ సెంటర్… ఇంతకీ ఎవరీయన..?
ఫోటోలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు ఉన్న వ్యక్తి పేరు వి.కె.పాండ్యన్… ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు చర్చకు వస్తోంది… ఎందుకంటే..? ఆయన ఇప్పుడు ఒడిశాకు యాక్టింగ్ సీఎం అట… అబ్బే, నవీన్ పట్నాయక్ ఎవరికీ అంత అవకాశం ఇవ్వడు అంటారా..? కాదు, ఇస్తున్నాడు, ఇచ్చాడు… ఎవరీ పాండ్యన్..? ఈయన తమిళనాడుకు చెందినవాడు… 2000 ఐఏఎస్ బ్యాచ్… ఒడిశా కేడర్… 2007లో గంజాం కలెక్టర్… అప్పట్నుంచే పట్నాయక్ దృష్టిలో పడి, క్రమేపీ దగ్గరయ్యాడు… అక్కడో ఇక్కడో […]
డైనమిక్ ఎడిషన్లు… స్మార్ట్ ఎడిషన్లు… డిజిటల్ ఎడిషన్లు… అన్నీ ఈ-పేపర్లే…
నిన్న ఓ వార్త… వాట్సపు గ్రూపుల్లోనే విస్తృతంగా కనిపించింది… అవును, అది వాట్సపు గ్రూపుల్లోనే… ప్రింట్ చేసిన పత్రికలో కాదు… నిజమే, రాబోయే రోజుల్లో వాట్సపు గ్రూపులు, ఫేస్బుక్కులు, ఈ-పేపర్లు, వెబ్ ఎడిషన్లు, స్మార్ట్ ఎడిషన్లు మాత్రమే ఉండబోతున్నాయి… పత్రికలు కాదు… ఆ సంధి దశే ఆ వాట్సపు గ్రూపుల్లో కనిపించిన వార్త… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే… ఆంధ్రప్రభ ఇకపై రోజూ రెండుసార్లు స్మార్ట్ ఎడిషన్లను విడుదల చేస్తుందట… మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం మరొకటి… వాళ్లు […]
ఆ రోజులు తిరగబడ్డయ్… అంతటి అజంఖాన్ కుటుంబానికి జైలు…
పార్ధసారధి పోట్లూరి …… ఉత్తరప్రదేశ్ : అజామ్ ఖాన్ తో పాటు అతని. భార్య, కొడుకుకి 7 సంవత్సరాల కారాగార శిక్ష పడ్డది! ఉత్తరప్రదేశ్ రాజకీయానికి వస్తే 90 వ దశకంలో ములాయం సింగ్ యాదవ్, అజాం ఖాన్ పేర్లు ప్రముఖంగా వినపడేవి, కనపడేవి! అజాం ఖాన్ అంటే సమాజ్ వాదీ పార్టీ లేదా లాల్ టోపీ పార్టీగా అభివర్ణించేవారు! అప్పటి ముఖ్యమంత్రి ములాయoసింగ్ యాదవ్ తరువాత నంబర్ 2 అజాం ఖాన్ . అఖిలేష్ యాదవ్ […]
- « Previous Page
- 1
- …
- 52
- 53
- 54
- 55
- 56
- …
- 149
- Next Page »