ఖచ్చితంగా వార్తే… సమాచార, ప్రజాసంబంధాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన ఓ ఉన్నతాధికారి, పేరు చంద్రవదన్, ఆంధ్రజ్యోతిని తొక్కేద్దామని ముఖ్యమంత్రి కేసీయార్ 2014లోనే తనకు చెప్పాడని వెల్లడించడం ఖచ్చితంగా వార్తే… పత్రికలు, మీడియాకు సంబంధించి వార్తే… అణిచివేయాలని, ప్రకటనలు ఆపేయాలని ఆదేశించాడని కూడా ఆయన వెల్లడించాడు… ఎప్పుడు..? ఇదే మీడియా సంస్థ నిర్వహించిన ఒక డిబేట్లో పాల్గొని చెప్పాడు… స్వాతంత్య్ర వేడుకలకు కూడా ఏబీఎన్- ఆంధ్రజ్యోతిని పిలవకపోవడంపై అవమానంగా భావించిన ఆంధ్రజ్యోతి ఈ డిబేట్ పెట్టినట్టుంది… సరే, చంద్రవదన్ […]
వ్యూహం… నిజపాత్రల్ని అచ్చంగా తెర మీదకు దింపడంలో వర్మ పర్ఫెక్ట్…
వెగటు సినిమాలు తీయడం దగ్గర్నుంచి ఆషురెడ్డి కాలివేళ్లు చీకడం దాకా రాంగోపాల్‌వర్మ పోకడల్ని చాలామంది ఏవగించుకుంటారు… ఒకనాటి శివ నుంచి అదేదో అరగంట వెబ్ సినిమా దాకా తన పతనం గురించీ చెప్పుకుంటారు… కానీ ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలి… ఏదైనా బయోపిక్ మీద శ్రద్ధ పెడితే పాత్రలకు తగిన నటీనటుల ఎంపిక, వారి వస్త్రధారణ, డైలాగ్స్ వాయిస్ ఓవర్ ఎట్సెట్రా అదిరిపోతాయి… పవన్ కల్యాణ్, చంద్రబాబు పాత్రలు సహా వీరప్పన్ దాకా చాలా పాత్రలు నిరూపించింది ఇదే… […]
ఈ బొమ్మ ఏమిటో గుర్తుపట్టగలరా..?పోనీ, చూడగానే ఎవరు గుర్తొస్తున్నారు..?
నిజమే… నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ సొంత ఆస్తి… తను పబ్లిష్ చేసే కాగితాలే కాబట్టి తన కీర్తనలు, తన భజనలే ఉంటాయి… సహజం, వేరే వాళ్లను మెచ్చుకుంటే అది తనకుమాలిన ధర్మం అవుతుంది కదా… అందుకని పత్రికకన్నా కరపత్రికగానే నడిపిస్తారు దాన్ని… చదివేవాడికీ అదే క్లారిటీ ఉంది… పైగా కేసీయార్ కీర్తికాంత ప్రియుడు కాబట్టి కీర్తనలను మహా ఇష్టపడతాడు… బీఆర్ఎస్ శ్రేణులు చేసే పాలాభిషేకాల దగ్గర్నుంచి స్తుతిస్తోత్రాల దాకా ఎంజాయ్ చేస్తాడు… సరే, అదంతా ఆయనిష్టం… […]
మరో హిందూ గుడిపై దాడి… ఈ కెనడా టాప్ సేఫెస్ట్ కంట్రీస్‌లో ఒకటట..!!
పొద్దున్నే ఓ న్యూస్ వాట్సప్ గ్రూపులో ఓ కంటెంట్… గ్లోబల్ పీస్ ఇండెక్స్ సర్వేలో దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు… టాప్ టెన్ సేఫెస్ట్ కంట్రీస్ తరువాత కెనడా పదకొండో స్థానం… ఇండియా 126వ ప్లేసు… ఆ తరువాతే అమెరికాకు 131వ ర్యాంకు… 146వ ప్లేసులో పాకిస్థాన్, 163వ ర్యాంకుతో అఫ్ఘనిస్థాన్ చివరి ప్లేసు… సరే, వీటి ర్యాంకుల మాటెలా ఉన్నా కెనడా పదకొండో సేఫెస్ట్ కంట్రీ అనే వాక్యం దగ్గర కలం ఆగిపోయింది… ఎందుకంటే… అంతకుముందే మరో […]
ఇంకులో కాలేసిన రాధాకృష్ణ… ఏదేదో రాస్తూ ఎక్కడికో వెళ్లిపోయాడు ఫాఫం…
మహాత్మాగాంధీ మరణించేనాటికి ఆంధ్రజ్యోతి పుట్టిందా..? ఎలాంటి, ఎంత కవరేజీ ఇచ్చిందో తెలియదు గానీ… ఇప్పుడు ఆంధ్రజ్యోతి మాత్రం వివేకా హత్య కేసుకు అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం, స్పేస్, ఎఫర్ట్, బాధ కనబరుస్తోంది… నేతాజీ అదృశ్యం, లాల్ బహదూర్ శాస్త్రి మరణ మిస్టరీ, ఇందిర హత్య, రాజీవ్ హత్య వెనుక ద్రోహచింతన… వీటికన్నా వివేకా హత్య కేసుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది ఆంధ్రజ్యోతి… అఫ్కోర్స్, ఈ కేసులో జగన్ బాగా ఇరుకునపడి ఉన్నాడు గనుక… అదెంత చిక్కుముడిలా మారితే, […]
లేట్ విపక్షాలు… కేసీయార్ ఆల్రెడీ ‘పోలింగ్ కసరత్తు’లోకి దిగిపోయాడు…
కొన్ని పత్రికల్లో వార్తలు చదువుతుంటే నవ్వొస్తుంది… అన్ని పార్టీలూ ఫస్ట్ లిస్టు రెడీ చేసేశాయనీ, త్వరలో ప్రకటించబోతున్నాయనీ, బహుశా ఈ పేర్లు ఫస్ట్ లిస్టులో ఉండవచ్చుననీ రాబోయే తెలంగాణ ఎన్నికల మీద తెగరాసేస్తున్నాయి… టీవీలు, సినిమాల వార్తలకే ప్రాధాన్యం కాబట్టి పెద్దగా వెబ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు రాజకీయాల్ని లైట్ తీసుకుంటున్నాయి, టీవీల్లో పెద్దగా రాజకీయ విశ్లేషణలు చేయగల రిపోర్టర్లకు కొరత కాబట్టి వాటిల్లోనూ పెద్దగా కనిపించడం లేదు… కానీ పత్రికల్లో చాలా వార్తలు వస్తున్నాయి… అవన్నీ […]
నెవ్వర్… మోడీ తన విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టుకు అప్పగిస్తాడా..?
Highhandedness: “Democracy is an anarchy; but there is no better alternative for democracy- ప్రజాస్వామ్యమంత అరాచకమయినది మరొకటి లేదు; దానికి మించిన మెరుగయిన వ్యవస్థ ప్రపంచంలో మరొకటి లేదు” అని ఎవరన్నారో కానీ…ఇప్పుడు భారత సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చూస్తే ఈ “అరాచకం” విమర్శలో ఎంత లోతు ఉందో అర్థమవుతోంది. దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి స్వయం ప్రతిపత్తిగల ఎన్నికల సంఘం ఉంది. దానికి కొన్ని విధి విధానాలు, ప్రత్యేక హక్కులు ఉన్నాయి. అయితే ఆ స్వయం ప్రతిపత్తి […]
గాలి ముద్దు… అనగా ‘ముద్దొచ్చే ప్రజాస్వామ్యం’ అని అర్థం…
Kiss-Chaos: రాజ్యాంగ రచనలో అణువణువునా ప్రజాస్వామ్యమే ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యం వేళ్లూనుకుని…ఎదిగి… శాఖోపశాఖలై విస్తరించి…పూచి…కాయ కాచి…పంట ప్రజల చేతికి అందడమే పరమ ప్రయోజనం. ప్రజాస్వామ్య పరిరక్షణకు చట్ట సభలు దేవాలయాల్లాంటివి. అక్కడ చర్చలు; చర్చోపచర్చలు; ప్రశ్నలు- సమాధానాలు; పార్టీల బాలాబలాలు…అన్నీ ప్రజలకు సంబంధించినవే అయి ఉంటాయి. ఇంతకంటే లోతుగా వెళితే అది ఎన్నికల ప్రక్రియ, చట్టసభల కూర్పు, స్వరూప, స్వభావాలు; విధి విధానాల మీద పోటీ పరీక్షల పాఠం అవుతుంది కాబట్టి ఇక్కడికి వదిలేద్దాం. ప్రజాస్వామ్యంలో ముద్దు ముచ్చట గురించి విడిగా ఎక్కడా […]
చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ..? తమ్ముడి కోసం నేరుగా రంగంలోకి అన్న…!!
ఒకటి గుర్తుందా..? చిరంజీవి సతీసమేతంగా వెళ్లి జగన్ దంపతులను కలిశాడు… జగన్ సాదరంగా ఆహ్వానించి, చిరంజీవి చెప్పిన టికెట్ రేట్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటాను అన్నాడు… తమ్ముడు పవన్ కల్యాణ్ మీద జగన్‌కు ఎంత కోపం ఉన్నా సరే, అన్న చిరంజీవి పట్ల సుహృద్భావంతోనే వ్యవహరించాడు… ఒక దశలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను చీల్చడానికి చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేస్తాడనీ ఊహాగానాలు వినవచ్చాయి… తరువాత చిరంజీవి ఏం చేశాడు..? ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు, నాగార్జున […]
విరోధాభాసం… అబ్బో, తూటా పేల్చిన ఆ తుపాకీయే బాగా కలతపడిందట…
రాజ్యానికి వ్యతిరేకంగా, శ్రామికజనం గొంతుకగా ఏళ్ల తరబడీ పనిచేసిన గద్దర్‌కు అదే రాజ్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం మీద చర్చ సాగుతూనే ఉంది… బుల్లెట్నే నమ్మి, బ్యాలెట్‌ను ధిక్కరించిన గళం చివరకు తనే ఓ సొంత పార్టీ పెట్టిన తీరు మీద చాన్నాళ్లుగా చర్చ సాగుతోంది… గద్దర్ మీద విమర్శలు బోలెడు… అఫ్కోర్స్, తను విమర్శలకు అతీతుడు ఏమీ కాదు… వాళ్లో వీళ్లో దేనికి..? ఏ నక్సలైట్ల కోసం తను అవిశ్రాంతంగా, ప్రాణాలకు తెగించి పనిచేశాడో… […]
నిండూ అమాస నాడూ… ఆడపిల్ల పుట్టినాదీ…. గద్దర్ పాట వెనక కథ…
Taadi Prakash…….. 22 సంవత్సరాల క్రితం… ’విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ ని కలిశాం…నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ ని ఇంటర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం. “నిండూ అమాసా నాడూ”….అనే పల్లవితో మొదలయ్యే ఆ పాట చాలా పాపులర్. ‘జనహర్ష’, ‘విజయవిహారం’ పనులన్నీ చూసే మిత్రుడుదుర్గారెడ్డి గారిని అడిగితే, పాత పేపర్ కటింగ్ పంపించారు. అప్పుడెప్పుడో రాసిన గద్దర్ పాట, దాని వెనుక కథ చదవండి. […]
ఫాఫం ఈనాడు… కొడిగట్టిన పాత్రికేయ స్పూర్తి… చివరకు నమస్తే నయం…
చాలా చాలా గద్దర్ ఫోటోలు, జ్ఞాపకాల నడుమ… జనంపాటగా తను వేసిన అడుగుల నడుమ… అన్నంలో మెరిగెల్లాంటి కొన్ని ఫోటోలు, జ్ఞాపకాలు పంటి కింద కలుక్కుమంటయ్… ఉన్నయ్, గద్దర్ కొన్నేళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు, పోకడలు, వేసే అడుగులపై చాలామందికి చాలా అభ్యంతరాలున్నయ్… ఉంటయ్, ఉండటంలో తప్పులేదు… గుడి పూజారి ఎదుట ‘శెల్ల’ పట్టుకుని, ఆశీస్సుల కోసం కూర్చున్న ఫోటో తను చివరకు ఎలా మారిపోయాడో తెలుపుతుంది… ఆ ఫోటో చూసినప్పుడు ఎలాంటి గద్దర్ ఇలా ఎంతగా మారిపోయాడు […]
కేసీయార్ బడ్జెట్ గొప్పల బట్టలిప్పిన కాగ్… పేరుకే లెక్కల భారీతనం…
‘‘వచ్చే ఏడాది ఎలాగూ ఎన్నికల సంవత్సరం కాదు కదా, మరెందుకు ఇప్పుడు కేసీయార్ నేల విడిచి సాముకు సిద్ధపడ్డాడు..? తెలియదు…! పేరుకు 2.30 లక్షల కోట్ల భారీ బడ్జెట్… అందులో 50 వేల కోట్ల కొత్త అప్పులు… 45 వేల కోట్ల ఆదాయ లోటు… మరెందుకీ అధిక అంచనాలు..? అంకెల గొప్పలు..? పోనీ, సంకల్పానికి దరిద్రం ఎందుకు ఉండాలీ అనుకుందాం… ఐనా మరీ ఇంతటి అధివాస్తవిక బడ్జెట్‌లా అవసరమా..? ఒకవైపు కరోనాతో లక్ష కోట్ల మేరకు నష్టపోయామని […]
భర్తను కోల్పోతే ఆ స్త్రీ గుడికెళ్లే అర్హత కోల్పోతుందా..? దేవుడు వద్దంటాడా..?!
రుతుమహిళల్ని శబరిమల గుడిలోకి అనుమతించడం మీద పెద్ద రచ్చే జరిగింది… ఇది కుల, మత వివక్ష కాదు, లింగవివక్షే అని కోర్టు చెప్పేసరికి, హిందుత్వం మీద దాడికి భలే చాన్స్ దొరికింది అనుకున్న కేరళ సీపీఎం ప్రభుత్వం సింబాలిక్‌గా ఇద్దరు మహిళల్ని తనే పోలీస్ బందోబస్తుతో మరీ ప్రవేశపెట్టింది… ఒక్కో గుడిలో ఒక్కో ఆచారం, పద్దతి ఉంటాయి… కోర్టులు ఏమైనా ఆగమశాస్త్రాల ప్రకారం తీర్పులు చెబుతున్నాయా..? వాళ్లకు ఏం తెలుసు..? ఒక గుడి ఆచారాన్ని యథాతథంగా పాటిస్తే […]
ఇది ఓ కక్షిదారు అవస్థ కథ కాదు… భారతీయ న్యాయవ్యవస్థ కథ…
ఇది ఎవరి కథ..? సోపన్ నర్సింగ గైక్వాడ్ అనే సుదీర్ఘ కక్షిదారు అవస్థ కథా..? లేక భారతీయ న్యాయ వ్యవస్థ కథా..? ఒక్కసారి ఈ వ్యాజ్యం పరిణామ క్రమాన్ని పరిశీలిద్దాం… 1968… సోపన్, వయస్సు 55 ఏళ్లు, మళ్లీ చదవండి, అప్పుడు ఆయన వయస్సు 55 ఏళ్లు… తనది మహారాష్ట్ర… ఒక రిజిష్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ఒక ప్లాట్ కొన్నాడు… కానీ కొన్నాళ్లకే తెలిసింది, దాన్ని తనకు అమ్మిన ఒరిజినల్ ఓనర్ ఏదో బ్యాంకులో తాకట్టు […]
‘మూడో పెళ్లాం’పై… ‘మళ్లీ పెళ్లి’పై నరేష్ లీగల్ గెలుపు… ఐనాసరే ‘నాలుగో పెళ్లి’కి చిక్కులే…
కోర్టు లీగల్ కోణంలో వెలువరించిన తీర్పు సబబే… సీనియర్ నరేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా నిజానికి తన పెళ్లిళ్ల వ్యవహారంలో తన ధోరణిని సమర్థించుకునే ప్రయత్నమే… తన వెర్షన్ జనంలోకి బాగా వెళ్లడానికి తను సినిమా మాధ్యమాన్ని వాడుకున్నాడు… తెలివైన ఆలోచన… తన మూడో పెళ్లాం రమ్య రఘుపతిని విలన్‌గా చిత్రీకరించాడు… ఐతే సినిమా మొదట్లోనే ఈ కథ కల్పితమనే డిస్‌క్లెయిమర్ ఇచ్చేసి, ఒరిజినల్ పేర్లను పోలే కల్పిత పేర్లనే పాత్రలకు పెట్టడంతో బహుశా […]
గాంధీ హిందువు కాడట… సాయిబాబా దేవుడే కాదట… ఎవరీ శంభాజీ భిడే…
శంభాజీ భిడే… ఎవరీయన..? ఈ ప్రశ్న మళ్లీ సెర్చింగులోకి వచ్చింది… గతంలో ఆయన నిర్వహించిన ఓ సభకు ప్రధాని మోడీ హాజరయ్యాడు, అప్పుడూ ఇదే సెర్చింగు… ఇప్పుడు వివాదాల్లోకి నెట్టబడిన సుధామూర్తి ఓసారి ఈయనకు మొక్కింది… అప్పుడూ ఇదే సెర్చింగు… మరి ఇప్పుడు ఎందుకు..? వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనకు కొత్తేమీ కాదు… మహాత్మాగాంధీపై వివాదాస్పద, అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు… 2. కోట్ల మంది పూజించే సాయిబాబా మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు… గాంధీ మీద చేసిన […]
అబ్బా… ఇదేమి వెబ్సైటు..? నామా మీద ఏదో రాయబోయి ఇంకేదో గీకిపడేసి…
మరీ దిక్కుమాలిన వార్త అనలేం… మంచి కోణమే… కానీ రాయడంలో ఫ్లాప్… ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానెల్ గురించి కాదు… ఆంధ్రజ్యోతి సైటులో వచ్చే కొన్ని వార్తలు పాత్రికేయ ప్రమాణాలకు దూరంగా ఉంటాయి ఎందుకో మరి… ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ టీం దాన్నలా గాలికి వదిలేసినట్టుంది… ఉదాహరణకు ఈరోజు రాసిన నామా నాగేశ్వరరావు వార్త… ముందుగా ఆ వార్త సారాంశం చెప్పుకుందాం… అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం నామా నాగేశ్వరరావు పార్లమెంటులో ప్రశ్న వేస్తూ ‘‘కేసీయార్ 750 మంది పంజాబ్, […]
సాకె భారతికి సర్కారీ సాయం… ఆంధ్రప్రభలో ఓ వార్త ఇష్టారాజ్యం…
ముందుగా ఓ వార్త చదవండి… ‘‘సాకే భారతిని యువత రోల్ మోడల్ గా తీసుకోవాలి… అనంతపురం జిల్లా కలెక్టర్ యం.గౌతమి… ప్రభుత్వం తరపున రెండెకరాల పొలం పట్టా అందజేత… కూలి పని చేస్తూ ఎస్కే యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన సాకే భారతికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ యం.గౌతమి పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సింగనమల మండలం నాగలగుడ్డం గ్రామానికి చెందిన సాకే భారతి […]
సారీ డాటర్… నిన్ను ప్రాణాలతో నీ తల్లిదండ్రులకు అప్పగించలేకపోయాం…
అసలు నమ్మబుద్ధి కాలేదు… మన దేశ పోలీసులేనా వీళ్లు..? అసలు ఇది జరిగిందా..? మన పోలీస్ వ్యవస్థలో దీన్ని ఊహించొచ్చా..? తప్పుడు కేసులు, అవినీతి, అక్రమాలు, అరాచకాలకు కేరాఫ్ అనే ఆరోపణలున్న మన పోలీసులు సారీ చెప్పారా..? అందుకే ఒకటికి రెండుసార్లు వార్త చదివి, అదీ సరిపోక కేరళ పోలీసుల ట్విట్టర్ ఖాతా చూస్తే తప్ప నమ్మకం కుదరలేదు… ఐనా ఇంకా ఆశ్చర్యమే… విషయం ఏమిటంటే..? కేరళలో ఓ ఐదేళ్ల బాలిక శుక్రవారం సాయంత్రం నుంచీ కనిపించకుండా […]
- « Previous Page
- 1
- …
- 55
- 56
- 57
- 58
- 59
- …
- 146
- Next Page »