ఒకాయన… పేరు ఉజ్వల్ త్రివేదీ… జర్నలిస్టునని చెప్పుకున్నాడు… మరి జర్నలిస్టు కదా, కాస్త ఎడంగా ఆలోచిస్తుంటుంది బుర్ర… ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు… తనకు ముంబై ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అసౌకర్యం కలిగిందట… ఛస్, మోడీ రిజైన్ చేయాల్సిందే… అసలు జీ20 సదస్సు ఎవడు పెట్టమన్నాడు అంటూ ‘యాంటీ మోడీ’ సెక్షన్ తరహాలో రెచ్చిపోయాడు… దేశంలో ఇలాంటి పొలిటికల్, సోకాల్డ్ ఇంటలెక్చువల్ సెక్షన్ ఉంటుంది కదా… ఏదో హోటల్లో టిఫిన్ చేస్తుంటే, సాంబారులో చిన్న బొద్దింక […]
BBC… నీతుల గురివిందకు రాబోయేవి గడ్డురోజులే… నిర్బంధ చందాలిక చెల్లవు…
పార్ధసారధి పోట్లూరి ……… బిబిసికి ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది ? బ్రిటన్ లో బిబిసి చానెల్ ప్రతి ఇంట్లో ఉండాల్సిందే ! మిగతా బ్రిటన్ కి చెందిన ఎంటీటీలతో కలిపి ఏడా కి గాను లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఇలా ఏడాది సబ్స్క్రిప్షన్ ద్వారా ఏటా ఆదాయం వస్తుంది. ఇది కాక బిబిసి స్టూడియోస్ మరియు బిబిసి స్టూడియో వర్క్స్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ది గార్డియన్ పత్రిక ఇచ్చిన సమాచారం మేరకు…. సంవత్సరానికి […]
IPL & Jio… పేరుకు ఉచిత ప్రసారాలే కానీ ఓ తెలివైన వ్యాపార ఎత్తుగడ…
ఎవరో మిత్రుడు ఫేస్‌బుక్‌లోనే చెప్పినట్టు…. ‘‘అసలు కిటుకు అక్కడే ఉంటుంది… అది వినియోగదారుడికి అర్థం కాదు… రిలయెన్స్ వాళ్ల ఎత్తుగడలు ప్రధానంగా అలాగే ఉంటాయి… ముందు చెప్పిన ముచ్చట్లకు కట్టుబడి ఉండరు… ముందుగా మోనాటనీ సాధించి, తరువాత దండుకోవడం మొదలుపెడతారు… ఒక పద్దతికి రిలయెన్స్ ఎప్పుడూ కట్టుబడి ఉండదు… జియో నెట్వర్క్ బిల్లులు మొదట్లో ఎలా ఉండేవి, ఇప్పుడు ఆ ప్యాకేజీల అధిక రేట్లు తెలుస్తూనే ఉన్నాయిగా… ఇప్పుడు ముఖేష్ అంబానీ ఐపీఎల్ ప్రసారాల్ని ఉచితంగా అందిస్తానని […]
టీవీ9ను ఎన్టీవీ కొట్టేస్తే… ఎన్టీవీని టీన్యూస్ కొట్టేసింది… బార్క్ చెప్పేదిదే…
నంబర్ వన్ ప్లేసులోకి రావడానికి హైదరాబాదులో ఈనాడు, సాక్షి తన్నుకుంటున్నాయి… పర్ సపోజ్, ఆ పోటీలోకి హఠాత్తుగా ఎక్కడో నాలుగో ప్లేసులో బిక్కుబిక్కుమంటూ ఉండే నమస్తే తెలంగాణ వచ్చేసి, సాక్షిని పడగొట్టేసి సెకండ్ ప్లేసులోకి వస్తే..? అబ్బే, కష్టమండీ అంటారా..? రాష్ట్ర ప్రసార రేటింగ్స్‌కు సంబంధించి టీవీ9 చానెల్‌ను ఎన్టీవీ కొట్టేసి, నంబర్ వన్ కుర్చీలో కూర్చుని, ఇక టీవీ9కు ఇప్పటిదాకా మళ్లీ కోలుకునే చాన్స్ ఇవ్వడం లేదు… కానీ హైదరాబాదులో మాత్రం ఆది నుంచీ టీవీ9 […]
మన దూరదర్శన్ బ్రిటన్ రాజు మీద అవాకులు రాస్తే ఆ దేశం ఊరుకుంటుందా..?!
పార్ధసారధి పోట్లూరి ………. మనం BBC కి అండగా ఉందాం ! బ్రిటన్ పార్లమెంట్ !….. ‘’We stand up for BBC’’ ! భారత ఆదాయపన్ను శాఖ బిబిసి కార్యాలయాలలో సర్వే చేసిన తరువాత బ్రిటన్ పార్లమెంట్ చేసిన వ్యాఖ్య ఇది ! ‘’ మనం బిబిసికి అండగా ఉందాం ! మనం స్థాపించిన బిబిసి వరల్డ్ న్యూస్ ని సమర్ధించాల్సి ఉంది ! బిబిసి ఎడిటోరియల్ కి ఆ స్వాతంత్ర్యం ఉంది! పార్లమెంట్ అండర్ […]
ఇంతకూ రూప మొగుడేం చేసేవాడు..? రోహిణి సింధూరి శీలంపైనా బురద…!!
కర్నాటకలో ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూపలు కొంగులు నడుముకు చుట్టేసి, జత్తూజుత్తూ పట్టుకుని, వీథి కుళాయిల దగ్గర కొట్టుకుంటున్నట్టే తగాదా పడుతున్నారు కదా… అసలు వాళ్లిద్దరి నడుమ ఎందుకు ఈ పంచాయితీ వచ్చింది..? మరీ ఈ రేంజులో రూప సదరు రోహిణిని ఎందుకు టార్గెట్ చేసింది… ఆమె పట్ల శీలహననానికి ఎందుకు పాల్పడుతోంది…? ఈ ప్రశ్నకు కొద్దికొద్దిగా జవాబులు వస్తున్నాయి… ఒకటేమో ఒక ఆడియో క్లిప్, మరొకటేమో రూప ఫేస్బుక్ పోస్టు… బుధవారం ఓ ఆర్టీఐ […]
పాపం ముగ్గురు ఈనాడు సబెడిటర్లు బలి… అసలు దండించాల్సింది ఎవరిని..?!
నిజంగానే ఓ ముఖ్యమైన వార్త రిపోర్టింగులో పాత ఫోటోల్ని, ప్రజెంట్ ఫోటోలుగా ముద్రించడం ఈనాడు చరిత్రలో అత్యంత అరుదు… వేరే పత్రికల్ని వదిలేయండి… ఈనాడులో ఇలాంటి పాత్రికేయ వృత్తి విషయాల్లో కొంత డిసిప్లిన్ మెయింటెయిన్ చేస్తారు… తప్పులు చేసిన ఉద్యోగులకు తక్షణం తీసిపడేస్తారు… మరి పట్టాభినీ కొట్టారు అనే బ్యానర్ స్టోరీలో జరిగిన తప్పులకు ఎవరిని బలితీసుకున్నారు..? ఏముంది..? పెద్ద తలకాయలన్నీ సేఫ్… అమరావతి డెస్క్ ఇన్‌ఛార్జి రామకృష్ణ, మరో ఇద్దరు సబ్‌ఎడిటర్లను తీసేశారని సమాచారం… ఎందుకంటే… […]
నమస్తే ఆంధ్రప్రదేశ్..! నాటి తెలంగాణ ఉద్యమనేత పెట్టే ఆంధ్రా పత్రిక..!!
ఒక పత్రిక, ఒక టీవీ చానెల్ వోట్లు సంపాదించి పెట్టగలదా..? ప్రొఫెషనల్‌గా నడిపిస్తూనే, ఒక రాజకీయ పార్టీ వైపు మొగ్గుజూపితే ఏమో గానీ, పూర్తిగా పార్టీ రంగు పూసి, జనంలోకి వదిలితే, డంప్ చేస్తే ఆ పార్టీ పట్ల సానుకూలత పెరుగుతుందా..? పోనీ, ప్రత్యర్థుల దుష్ప్రచారానికి కౌంటర్ సమర్థంగా ఇవ్వగలరా..? కేవలం ఓ పార్టీ వాయిస్‌గా మిగిలిపోతుందా..? నమస్తే తెలంగాణకు పత్రికకు అనుబంధంగా బీఆర్ఎస్ పార్టీ, అనగా కేసీయార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట ఓ దినపత్రికను స్టార్ట్ […]
జగన్‌ను, ఆయన సతీమణినీ వివేకా హత్య కేసులోకి లాగే ప్రయత్నాలు..!!
జగన్ బీజేపీతో సఖ్యతతో ఉంటున్నాడు… అది అందరికీ తెలిసిందే… అక్రమాస్తుల కేసులో ఇప్పటికీ తను బెయిల్ మీదే ఉన్నాడు కాబట్టి బెయిల్ రద్దుపై సీబీఐ దూకుడుగా వ్యవహరించకుండా బీజేపీ హైకమాండ్ కాపాడుతోంది అనే ప్రచారం కూడా పొలిటికల్ సర్కిళ్లలో ఉన్నదే… నిజానికి విధేయంగా ఉండటం అనేది జగన్ తత్వంలోనే లేదు, కానీ ఇది తప్పనిసరి కావడంతో బీజేపీతో బాగుంటున్నాడు అనేది ఆ చర్చల సారాంశం… వాస్తవానికి అదే కాదు, వైఎస్ వివేకా మర్డర్ కేసు దర్యాప్తు చేస్తున్న […]
పాత ఫోటోల్ని దంచి కొట్టారు… ఆనక అరుదైన రీతిలో తలదించుకున్నారు…
అప్పట్లో వైఎస్ మీద ఎన్ని రాసినా… ఇప్పుడు జగన్ మీద రాస్తున్నా… ఈనాడు గానీ, ఆంధ్రజ్యోతి గానీ, టీవీ5 గానీ… ఎప్పుడైనా పొరపాటో, తప్పో దొర్లితే వివరణ, ఖండన, క్షమాపణ, సంతాపం, స్పష్టత వంటివేమీ ఉండేవి కావు… అబద్ధాలు రాయకపోతే అది పాత్రికేయం ఎలా అవుతుంది..? అసలు జగన్ మీద రాయకపోతే అది జర్నలిజం ఎలా అవుతుంది..? అనే తెంపరితనం కనిపించేది… మా పొలిటికల్ లైన్ ఇదే, ఏం చేసుకుంటావో చేసుకోపో అనే వైఖరి కనిపించేది… క్రమేపీ […]
రాజులు పోయారు- రాజ్యాలు పోయాయి… వారసత్వ పంచాయితీలు పోవు…
Dynasty & Dispute: రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. రాచరికం పోయి మన చేత, మనకోసం, మన వలన, మన యొక్క, మనకున్, మనమే ఎన్నుకునే ప్రజా ప్రభుత్వాలు వచ్చాయి అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. “ప్రజలే ప్రభువులు- పాలకులు మన సేవకులు” లాంటి వింటే ఒళ్లు పులకించిపోయే ఎన్నెన్నో ప్రజాస్వామిక సర్వసమానత్వ భావనల కొటేషన్లతో ప్రజాస్వామ్య భవనాన్ని మనసుల్లో ప్రతిష్ఠించుకున్నాం. బయట అలాంటి భావనలకు అనుగుణంగానే పార్లమెంటు భవనాలను నిర్మించుకున్నాం. గట్టిగా పదికాలాలు నిలబడాలని పార్లమెంటులో అడుగడుగునా, చుట్టూ స్తంభాలను […]
ప్రెట్టీ రోహిణి సింధూరి… ప్రైవేటు ఫోటోల కోసం నెట్లో తెగ వెతుకులాట…!
ప్రస్తుతం చాలామంది నెట్లో సెర్చ్ చేస్తున్నది ఏమిటో తెలుసా..? రోహిణి సింధూరి ప్రైవేటు ఫోటోలు..! ఎందుకు..? ఐపీఎస్ అధికారిణి రూప కొన్ని రోహిణి ఫోటోలను రిలీజ్ చేసింది… అవన్నీ రోహిణి స్వయంగా మగ అధికార్లకు పంపించిందని ఆరోపించింది… అవి ఎలాంటి ఫోటోలు..? మరీ అసభ్యమైన ఫోటోలు అని ఒక సెక్షన్ మీడియా రాస్తుండగా… అవన్నీ తాను ఫేస్బుక్లో, వాట్సపుల్లో పెట్టిన ఫోటోలేననీ, కానీ వాటిని ఇలా బురద జల్లడానికి వాడుకోవడం నీచమైన పని అని రోహిణి చెబుతోంది… […]
ఓ ముస్లిం టెర్రరిస్టు సంస్థ ఇండియా సాయం కోరుతోంది… చైనా నుంచి రక్షణకు…
పార్ధసారధి పోట్లూరి ……… మమ్మల్ని కాపాడండి భారత్ కి విజ్ఞప్తి చేసిన .. వుయఘర్ ముస్లిమ్స్ ! తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ [TIP] డిప్యూటీ కమాండర్ ‘అబ్దు సలాం అత్ తురకిస్తానీ ‘ ఈ ప్రకటన చేశాడు ! చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ లో ఉన్న వుయ్ఘర్ ప్రాంతంలో ఉన్న ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ ‘ చైనా నుండి మమ్మల్ని విడిపించమంటూ భారత్ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది ! […]
మంగ్లి భక్తిపారవశ్యాన్ని ఈ పాడులోకం ఎప్పుడర్థం చేసుకుంటుందో ఏమో..!!
ఫాఫం… మంగ్లీ ఏమంతా తప్పు చేసిందని..! దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆడింది, పాడింది… భక్తితో పులకించింది… అసలు ప్రతి శివరాత్రికి శివుడి మీద ఓ పాట షూట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుంటుంది… అది భక్తి, అది తాదాత్మ్యత… ఆ భక్తిలో పడి తానేం చేస్తున్నదో తనకే తెలియనంత భక్తి పులకింత… ఈ జర్నలిస్టులకు ఏమీ తెలియదు, ప్రతిదీ వార్తే… ప్రతి విషయాన్ని గోకుతారు… రచ్చ చేస్తారు… ఆయ్ఁ రెండు దశాబ్దాలుగా వీడియో చిత్రీకరణ […]
వందేభారత్ రైళ్లపై పాకిస్థానీ ప్రేమికుల కుళ్లుబోతుతనం… అందుకే రాళ్ల దాడులు…
పార్ధసారధి పోట్లూరి …….. వందే భారత్ రైలు – పాకిస్థాన్ ప్రేమికులు ! వందే భారత్ ట్రైన్ మీద రాళ్ళు రువ్వడం వెనుక ఉన్న అసలు కారణం ! 1947 లో భారత్ నుండి పాకిస్థాన్ వేరుపడిన సందర్భంలో అప్పటికే బ్రిటీష్ వాళ్ళు వేసిన రైల్వే లైన్లు, కట్టిన రైల్వే స్టేషన్లు భారత ఉప ఖండం మొత్తం మీద ఎలా ఉన్నాయో, వాటిని సరిహద్దుల ప్రకారం పంచుకున్నాయి! ఇది చరిత్ర అందరికీ తెలిసిందే ! 1947 తరువాత […]
పార్టీ, ఎన్నికల గుర్తు చేజారగానే… మెదడు పాదాల్లోకి జారిపోయినట్టుంది…
బాల్ ఠాక్రే వారసుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు కేంద్ర ఎన్నికల సంఘం మీద మస్తు కోపమొచ్చింది… సహజమే… తమ నుంచి విడిపోయి, సొంత కుంపటి పెట్టుకుని, తన సీఎం కుర్చీ కూడా లాగేసుకున్న ఏకనాథ్ షిండేకు తమ పార్టీ ఎన్నికల గుర్తును ఇవ్వడం, పార్టీని కూడా అప్పగించిన తీరుతో కుతకుత ఉడికిపోతున్నాడు… మహారాష్ట్రలో అంతటి బలమున్న ఆ శివసేన నుంచి ఇప్పుడు తనే విడిపోయి ఓ చీలికవర్గంగా ఏర్పడినట్టుగా తయారైంది పరిస్థితి… ఖచ్చితంగా ఇది ఉద్ధవ్ […]
సాయన్న సగౌరవ వీడ్కోలుకు సంతాప తుపాకులు గాలిలోకి పేలలేదేం..?!
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు… ఇది మరోసారి చర్చనీయాంశమైంది… హైదరాబాదులో ఈ విషయంలో ఓ పద్దతి లేదు, ఓ ప్రామాణికమూ లేదు… అప్పటికప్పుడు కేసీయార్ ఆలోచనలకు అనుగుణ నిర్ణయాలే అధికారిక విధానం… అంతే… ఒక రామానాయుడి దగ్గర మొదలుపెడితే, ఈమధ్య మనం చూసిన అధికారిక అంత్యక్రియలు… కృష్ణ, కృష్ణంరాజు, హరికృష్ణ, సత్యనారాయణ… వీళ్లంతా ఎవరు..? సినిమాల్లో నటులు… ఫిలిమ్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి, హైదరాబాదులో ఉంటున్నారు గానీ తెలంగాణతో వేరే సంబంధబాంధవ్యాలు ఏమీ లేవు… మరీ తెలంగాణ ఉద్యమకాలం […]
అస్సోం మహిళ… గుజరాత్ వరుడు… కొన్నాళ్లకు ఆమె గురించి తెలిసి నిర్ఘాంతపోయాడు…
గుజరాత్‌లోని పోర్బందర్… ఆయన పేరు విమల్ కరియా… పెళ్లి కాలేదు అప్పటికి… రకరకాల మేట్రిమోనీ సైట్లను చూస్తున్నాడు కానీ ఎవరూ మ్యాచ్ కావడం లేదు… ఇక ఇతర రాష్ట్రాల మ్యాచులు చూడసాగాడు… ఒక అమ్మాయి పాజిటివ్‌గా రియాక్టయింది… ఆమె పేరు రీటా దాస్… ఉండేది అస్సోం రాజధాని గౌహతి… ఇంటరాక్షన్ పెరిగింది… ఆమె తన ప్రొఫైల్‌లో డైవోర్సీ అని రాసుకుంది… ఆ డైవర్స్ సర్టిఫికెట్ నాకు చూపించాల్సిందిగా విమల్ కోరాడు ఆమెను… ఎహె, నా మొదటి పెళ్లి […]
ఫేస్బుక్, ఇన్స్టాలలో కూడా బ్లూబ్యాడ్జిలు… వాచిపోయే నెలవారీ ఛార్జీలు…
ట్విట్టర్ కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ వెరిఫైడ్ అఫిషియల్ ఖాతా అని బ్లూటిక్స్ పెట్టేందుకు ఛార్జీలు ఖరారు చేశాడు కదా… మరి ఫేస్బుక్ వాడు ఎందుకు ఊరుకుంటాడు..? తనదీ అదే బాట… దొంగ ఖాతాల నుంచి మిమ్మల్ని రక్షించేందుకు, మీ ఖాతా వెరిఫికేషన్ జరిగినట్టు చెప్పే బ్లూ బ్యాడ్జ్ ప్రదర్శిస్తామనీ, దానికి కొంత చెల్లించాల్సి ఉంటుందని మార్క్ జుకర్ బర్గ్ తన ఫేస్బుక్ ఖాతాలో ప్రకటించాడు… అయితే ప్రస్తుతం ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మాత్రమే ప్రారంభిస్తున్నారు… […]
ఆదానీకి లిథియం గనులతో లింకేంటి…? హఠాత్తుగా బ్రేకులు ఎందుకు పడ్డాయి..?
పార్ధసారధి పోట్లూరి …….. మోడీ Vs జార్జ్ సోరోస్! అసలు ఇంతకీ లిథియం గనులు తవ్వకం, నిల్వలు, ప్రాసెసింగ్ విషయంలో ఏ దేశం స్థానం ఎక్కడ ఉంది ? ముందు లిథియం అయాన్ బాటరీ జీవితకాలం ఎంత ? 5,000 రీ చార్జ్ సైకిల్స్ గా ఉంది, అంటే హీన పక్షం 6 ఏళ్లు పనిచేస్తుంది! బొలీవియా లో అత్యధికంగా 21 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి. అర్జెంటీనా లో 20, అమెరికాలో 12, చిలీ […]
- « Previous Page
- 1
- …
- 68
- 69
- 70
- 71
- 72
- …
- 146
- Next Page »