పెళ్లిళ్లకు పేరంటాలకు వెళ్లినప్పుడు చీరెలో, జాకెట్ ముక్కలో, ఇతర కానుకలో గిఫ్టులుగా ఇస్తుంటారు… వాటిని ఏం చేస్తారంటే, అలాగే భద్రంగా ఉంచి, పేరంటాలకు తమ ఇంటికి వచ్చే మహిళలకు పెట్టేస్తుంటారు… వాళ్లు ఇంకెవరికో గిఫ్టులుగా ఇస్తుంటారు… ఇదొక సైకిల్… కరెన్సీ టైపు… ఎవరూ వాడరు, కానీ సర్క్యులేషన్లో ఉంటాయి అవి… పెట్టావా, ఎస్ పెట్టాం… అంతే, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటి వాయినం… పాకిస్థాన్ ధోరణి చూస్తే మొదట నవ్వొచ్చింది… తరువాతే జాలేసింది… ఆనక ఈ పేరంటాల గిఫ్టులు […]
ఔనా..? కాశ్మీర్లో లిథియం నిక్షేపాల్ని మనవాళ్లు ఎప్పుడో కనుక్కున్నారా..?
పార్ధసారధి పోట్లూరి ……….. Modi Vs George Soros! Rare Earth Elements or Minerals [REE]- అరుదయిన భూ ఖనిజములు! లిథియం ! రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేదా మినరల్స్ – REE గురుంచి ఆసక్తికరమయిన కధనం ! జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా [GSI] ఇటీవలే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని రియాసి [Reasi District ] జిల్లాలో కల సలాల్ [Salal Village] అనే గ్రామంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నట్లు […]
డియర్ ఠాక్రే… అసలు కుటుంబ పార్టీల వారసత్వాలే అప్రజాస్వామికమోయ్…
Subramanyam Dogiparthi ఏమంటారంటే..? శివసేన సింబల్‌ని అభినవ కలియుగ విభీషణుడు షిండేకు కేటాయించటం ఉధ్ధవ్ ఠాక్రేకు షాక్ అని పత్రికలు వ్రాస్తున్నాయి. నాకు వెంటనే ఇందిరమ్మ రాజకీయ ప్రస్థానం గుర్తుకొచ్చింది. 1952 ఎన్నికల నుండి 1969 వరకూ కాంగ్రెస్ పార్టీ సింబల్ కాడెద్దులు . బ్యాంకుల జాతీయకరణ వంటి సోషలిస్టు నిర్ణయాలు తీసుకున్న తర్వాత , ఆనాడు కాంగ్రెస్ పార్టీలో సిండికేటుగా పిలవబడిన కామరాజు , మొరార్జీ వంటి హేమాహేమీలు ఇందిరమ్మను బయటకి నెట్టేసారు . ఆమె […]
Re-Inventing the Wheel… కొత్త శోధనలకు ఇండియన్ ఎక్స్పర్ట్స్ మొరాయింపు…
Yanamadala Murali Krishna…… ((పెద్ద పోస్ట్… ఓపికగా చదవండి… ఎక్స్పర్ట్ ఒపీనియనూ… భారతీయ శాస్త్రనిపుణులూ…)) ఒక అంశంలో అత్యున్నత విద్యను అభ్యసించిన వారికి… ఆ విషయాన్ని గురించి లోతైన అవగాహనతో పాటు, అంతకుముందు తెలియని కొత్త పరిస్థితి ఎదురైనప్పుడు దానిని ఏ విధంగా పరిష్కరించాలనే మేధ ఉండాలి. శాస్త్ర విజ్ఞాన రంగాలలో భారతీయులకు ఇటువంటి సామర్థ్యం బొత్తిగా ఉండదు. అందుకే మన సాంకేతిక – సేవల రంగాల నిపుణులు… ప్రపంచంలోనే కొన్ని దిగ్గజ సంస్థలకు సారథ్యం వహిస్తున్నప్పటికీ… […]
Nandamuri Tarakaratna… ఇంత త్వరగా వెళ్లిపోవాల్సిన కేరక్టర్ అసలే కాదు…
ఇంత త్వరగా పోవాల్సినవాడు మాత్రం కాదు… నందమూరి తారకరత్న ఆ కుటుంబంలోని వారికి భిన్నం… వయస్సు కూడా నలభైకి చేరలేదు… మనసులో ఏం వేదన రగిలి మనిషిని కాల్చేసిందో, పీల్చేసిందో గానీ బయటికి మాత్రం అందరితో బాగా ఉండేవాడు… సినిమా రంగంలో ఒకవైపు జూనియర్ గానీ, ఈమధ్య కల్యాణరామ్ గానీ హిట్టవుతూ, తను మాత్రం ఎక్కడేసిన గొంగళి అన్నట్టుగానే ఉండటం ఏమైనా పీడించిందా తనను..? బాలయ్య తరువాత తరంలో తనను ఎన్టీయార్ నటవారసుడిని చేయాలని ఆ కుటుంబం […]
ఆంధ్రజ్యోతి డిజిటల్ బాట… డైనమిక్ ఎడిషన్లతో కొత్త ప్రయోగాలు…
రాబోయే రోజుల్లో ఇక పత్రికల ప్రింట్ ఎడిషన్లు కనిపించడం అరుదైపోతుంది… విపరీతంగా పెరిగిన ముద్రణవ్యయం, పెరిగిన జీతభత్యాల భారం, రవాణా ఖర్చు, పంపిణీ వ్యయం తడిసి మోపెడవుతోంది… ఏవో రాజకీయ అవసరాలున్నవాళ్లు తప్ప కమర్షియల్ కోణంలో ఎవరూ కొత్తగా ప్రింట్ జోలికి వెళ్లే అవకాశాల్లేవు ఇక… పైగా పేపర్ కొని చదివేవాళ్ల సంఖ్య కూడా వేగంగా పడిపోతోంది… ప్రతి నిమిషమూ వార్తల్ని అప్డేట్ చేసే సైట్లున్నాయి… సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తోంది… ఎప్పటికప్పుడు ముఖ్యమైన వార్తల్ని మొబైల్ […]
పేరుకు ఆదానీపై ప్రాపగాండా… అసలు టార్గెట్ ప్రధాని మోడీ… ఏమిటీ కథాకమామిషు..?!
పార్ధసారధి పోట్లూరి …….. వేదిక : జర్మనీ లోని మ్యూనిచ్‌లోని హోటల్ బేరిస్చర్ హాఫ్ [Hotel Bayerischer Hof in Munich]… ఫిబ్రవరి 17,శుక్రవారం 2023…. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ [MSC] పేరుతో ప్రతీ సంవత్సరం మ్యూనిచ్ నగరంలో సమావేశాలు జరుగుతూ ఉంటాయి ! ఈ సమావేశాలకి ప్రపంచం నలుమూలల నుండి [రష్యా, చైనా, ఇరాన్, వెనిజులా తప్ప ] రాజకీయ ప్రముఖులు, మిలటరీ అధికారులు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ రోజు నుండి అంటే […]
దిక్కుమాలిన చాట్‌జీపీటీ… మిమిక్రీ శ్రీనివాస్‌ను చంపేసి తమ్ముడికే చెప్పింది…
సరికొత్త టెక్నాలజీ విప్లవం… ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రూపొందిన చాట్‌జీపీటీ ప్రపంచం దిశను, దశను మార్చేయబోతోంది అన్నట్టుగా మోస్తున్నారు దాన్ని… అది సౌకర్యమా..? మనిషి మెదడును మరింత కుంచింపజేయనుందా..? అలెక్సాకు, గూగుల్ సెర్చ్‌కూ దానికీ తేడా ఏమిటి..? అసలు మనిషి ఈ కృత్రిమ మేధపై ఇంకా ఇంకా ఆధారపడితే జరిగే అనర్థాలు ఏమిటి…? అనే ప్రశ్నల మీద చర్చించడం లేదు మనమిక్కడ… గూగుల్ వాడు బాడ్ పేరిట సేమ్ చాట్‌జీపీటీ వంటి ఓ కృత్రిమ మేధతో పనిచేసే ఓ […]
మీకు కారుందా..? తరచూ లాంగ్ డ్రైవ్స్ ఉంటాయా..? ఐతే ఇది మీకోసమే…!
ఒక రోడ్డు ప్రమాదంలో ఔరంగాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు చనిపోయారు. కారు టైరు పగిలిపోవడమే కారణం. కొత్తగా నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేపై ఈరోజుల్లో వాహనాల టైరు పగిలిన ఉదంతాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో రోజూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని అత్యాధునిక రోడ్లపైనే ఎక్కువ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న ఒకరోజు నా మదిలో మెదిలింది. మరియు ప్రమాదానికి ఒకే ఒక కారణం ఉంది, మరియు అది కూడా టైరు పగిలిపోవడం ద్వారా మాత్రమే…! అందరి టైర్లు పగిలిపోయేలా […]
ఈ కుసంస్కార పోకడ, పురావస్తు తవ్వకాలు ఇప్పుడెందుకు మిస్టర్ రాధాకృష్ణా..?!
ఎవరైనా పెద్దమనిషి బర్త్ డే వస్తే… పెళ్లిరోజు వస్తే… ఇంకేదైనా వ్యక్తిగత విశేషం ఉన్నప్పుడు…. మనం ఎంతగా వ్యతిరేకించినా సరే, ఎంత ప్రత్యర్థిత్వం ఉన్నా సరే, అవసరమైతే మౌనంగా ఉంటాం, లేకపోతే ‘‘మంచిగ బతుకుర భయ్, శుభాకాంక్షలు’’ అని చెబుతాం… అది సంస్కారం… అంతేతప్ప, నువ్వు తాగుతావు, తాగుబోతువు, ఆమధ్య నాతోనే చెప్పావు అని గుర్తుచేసి, విద్వేషాన్ని వెదజల్లి, మన కుసంస్కారాన్ని ప్రదర్శించం..! కానీ ఏబీఎన్ రాధాకృష్ణ రూట్ వేరు కదా… అప్పట్లో, అంటే కేసీయార్ తెలంగాణ […]
బీబీసీ- హిండెన్‌బర్గ్ ఉమ్మడి కుట్రేనా..? తెర వెనుక శక్తుల చేతుల్లో ఇవి పావులా..?!
పార్ధసారధి పోట్లూరి ……….. హిండెన్‌బర్గ్- బిబిసి డాక్యుమెంటరీ- ఇల్హాన్ ఒమర్ – 2024 ఎన్నికలలో మోడీని గద్దె దించడానికి ఢిల్లీలో రహస్య సమావేశాలు- లిథియం గనులు-చైనా – ఆదానీ ! వెరసి ఇదొక టూల్ కిట్ ! ది సండే గార్డియన్ పత్రికలో అభినందన్ మిశ్రా మరియు దివ్యేందు మోండల్ [Abhinandan Mishra & Dibyendu Mondol] వ్రాసిన ఆర్టికల్ లోని అంశాలు ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. అది Some PIOs and European officials plan […]
బీబీసీ అంత శుద్దపూసేమీ కాదు బ్రదర్స్… దాని రియల్ ఫేస్ కారు నలుపు…
పార్ధసారధి పోట్లూరి ………. ఇప్పటికే పలు సార్లు తమ ఆదాయపన్ను వివరాల మీద బిబిసికి నోటీసులు ఇచ్చింది ఆదాయపన్ను శాఖ ! మీ ఆదాయ, వ్యయ వివరాల మీద మీరే ఇంకోసారి సమీక్షించుకొని అన్నీ సరిగా ఉన్నాయని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమని… సహజంగానే బిబిసి ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసులని విస్మరించింది ! అసలు నిజం ఇది అయితే బిబిసి మీద ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది అనే వార్తని వ్యాపింప చేయడంలో అన్ని మీడియా హౌస్ […]
ఏం ఈనాడుర భయ్… జగన్ పేరుపైనే దృష్టి… కవిత పేరు పట్టని వైనం…
ఈరోజు మద్యం నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించిందనే వార్త వివిధ పత్రికల్లో విభిన్నరకాలుగా ఫోకసైంది… నమస్తే తెలంగాణ పత్రిక ఎలాగూ మద్యం కేసు వార్తలే రాయదు… దాని దృష్టిలో అసలు మద్యం స్కాం లేదు, దానిపై విచారణల్లేవు, దర్యాప్తుల్లేవు… కేసీయార్ భజన, కీర్తన, డప్పు ఉంటే దానికి చాలు… కేసీయార్ బిడ్డ ఇన్వాల్వయిన కేసు కాబట్టి, కేసీయార్ వ్యతిరేక వార్తలు అక్కర్లేదు కాబట్టి సాక్షి కూడా దానికి జోలికి పెద్దగా పోదు… ఇక ఈనాడులో ‘ఎవరూ బెయిల్‌కు […]
ఇదుగో ఇదుగో… వచ్చె వచ్చె… రవిప్రకాష్ టీవీ రాదు… RTV చర్చ ఆగదు…
అదుగో అదుగో… వచ్చె వచ్చె… అన్నట్టుగా టీవీ9 రవిప్రకాష్ (టీవీ9 తన ఇంటిపేరుగానే ఇంకా ఇంకా గుర్తొస్తుంటుంది) చానెల్ పేరు తరచూ వార్తల్లోకి వస్తుంటుంది… కానీ చానెల్ మాత్రం రాదు… అఫ్కోర్స్, అనుకున్నదే తడవుగా, అలవోకగా కొత్త చానెళ్లను ఆపరేషన్లోకి తీసుకొచ్చినట్టుగా పేరున్న రవిప్రకాష్ తన సొంత చానెల్ తీసుకురావడానికి అడ్డంకులేమిటి..? ఎందుకింత జాప్యం..? మళ్లీ తాజాగా రవిప్రకాష్ సొంత చానెల్ ప్రచార తెరమీదకొచ్చింది… ఆర్ టీవీ పేరిట ఓ లోగో కూడా కనిపిస్తోంది… అంతేకాదు, మ్యాన్ […]
నో బైపాస్, నో స్టెంట్స్, నో ఓపెన్ హార్ట్… జస్ట్, లేజర్ థెరపీ…
గుండెపోట్లకు మెయిన్ కారణం..? గుండెకు రక్తాన్ని తీసుకుపోయే ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడటం… వాటికీ అనేక కారణాలు… ఇన్నాళ్లూ స్టెంట్స్ వేయడం, బైపాస్ సర్జరీ చేయడం, కొన్నిసార్లు ఓపెన్ హార్ట్… ఇలా రకరకాల చికిత్సలు సాగుతున్నాయి… యాంజియోప్లాస్టీ కూడా..! ఇవేవీ అవసరం లేకుండా లేజర్ థెరపీని అందుబాటులోకి తెచ్చినట్టు ఓ డాక్టర్ చెబుతున్నాడు… ఇప్పటికే 55 సక్సెస్ ఫుల్ కేసులు తమ రికార్డుల్లో ఉన్నాయనీ అంటున్నాడు… ఇంట్రస్టింగు కదా… టైమ్స్ నాగపూర్ సెంటర్ నుంచి ఈ న్యూస్ పబ్లిష్ […]
ఇప్పటికీ ఎన్టీవీయే నంబర్ వన్… టీవీ9కన్నా చాలా దూరంలో…
తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్ ఎవరు..? ఆమధ్య టీవీ9ను కొట్టేసి ఎన్టీవీ టాప్ ప్లేసులోకి వెళ్లింది… ఆ ఉక్రోషంతో మరింత బాగా పనిచేసి టీవీ9 మళ్లీ ఎన్టీవీని కొట్టేసి నంబర్ వన్ అయ్యిందా..? ఈ ప్రశ్నలకు సమాధానం దిగువ ఇచ్చిన చార్ట్… టీవీ9 మారదు, మారలేదు… సెన్సేషనలిజం మాత్రమే తమ ఎడిటోరియల్ లైన్‌గా భావించే టీవీలు అంతే… కొన్ని కీలక వార్తల ప్రజెంటేషన్‌లో అదే పాత పైత్యమే కనిపిస్తోంది… ఉదాహరణ, ఓ రేస్ కారులో కూర్చున్నట్టు […]
ఎన్టీయార్ నాణెం కేవలం స్మారకం మాత్రమే… వంద రూపాయల కరెన్సీ కాదు…
ఈనాడులో ఓ వార్త… ఎన్టీయార్ చిత్రంతో వంద రూపాయల వెండి నాణెం అని శీర్షిక… బాగుంది, కానీ లోపల మ్యాటర్లో ప్రముఖ వ్యక్తుల చిత్రాలతో అరుదుగా ఆర్బీఐ విడుదల చేస్తుందని రాశారు… కానీ అరుదేమీ కాదు… కొన్ని సందర్భాల్లో, కొందరు వ్యక్తుల స్మారకార్థం ఇలాంటి స్మారక నాణేల్ని విడుదల చేయడం పరిపాటే… అరుదైన విశేషం ఏమీ కాదు… తన తండ్రి ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందనీ, దీన్ని తమ అదృష్టంగా భావిస్తున్నామనీ ఎన్టీయార్ బిడ్డ పురంధేశ్వరి కాస్త సినిమా […]
బాస్ బిడ్డ చెప్పులు పోయాయి… మూడు రైల్వే విభాగాల 30 రోజుల పరిశోధన…
వావ్… నెల రోజుల సునిశిత పరిశోధన… కోవర్టులు, గూఢచారులు, ప్రత్యేక బలగాలు అన్నీ రంగంలో దిగాయి… మూడు ప్రభుత్వ విభాగాలు ఈ కేసులోనే తలమునకలయ్యాయి… ఇదీ స్పిరిట్… ఇంకా మన మోడీ వందేమాతరం రైళ్లు, బుల్లెట్ రైళ్లు అంటూ జపిస్తున్నాడే గానీ.., తమ రైల్వే విభాగాల అధికారులు, సిబ్బంది అంకితభావాన్ని ఇంకా సరిగ్గా గుర్తిస్తున్నట్టు లేదు… గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) […]
పఠాన్ మూవీ గురించి ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడారంటే …!!
Bharadwaja Rangavajhala………… ప్రధాని మోదీ చాలా గర్వంగా పార్లమెంటులో పఠాన్ సినిమా గురించి మాట్లాడారు. చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత ప్రాపర్ హిట్ లేని షారూఖ్ ఖాన్ పఠాన్ తో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాడు… నిజమే … ఈ సినిమా వసూళ్ల గురించి ప్రధాని మోదీ సాక్షాత్తూ లోక్ సభలో ప్రస్తావించారు. పఠాన్ కాశ్మీర్ లో హౌస్ ఫుల్స్ తో నడుస్తోందన్నారు. శ్రీనగర్ లో ఫలానా ఐనాక్స్ లో అన్ని స్క్రీన్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయన్నారు. […]
నో, నో… 144 ఏళ్లకు ఒక్కసారే ఇంతటి అద్భుతదినం అనేది శుష్కవాదన…
టీవీల్లో కనిపించే… యూట్యూబ్ చానెళ్లలో కనిపించి ఊదరగొట్టే సిద్ధాంతులకు రాద్ధాంతం తప్ప సిద్ధాంతం తెలియదు… అసలేమీ తెలియదు… ప్రేక్షకులను రకరకాల వ్యాఖ్యానాలతో పిచ్చివాళ్లను చేయడం తప్ప…. ఎలాగోలా ఒర్రేవాడు కావాలనేది ఆయా ట్యూబ్ చానెళ్లు, టీవీల సంకల్పం… ఇంకేముంది..? రంగురంగుల పూసల దండలు వేసుకుని ప్రత్యక్షమవుతారు ఈ రాద్ధాంతులు… సాధారణంగా శనిదోషాలు ఉన్నవాళ్లు శనిత్రయోదశి రోజున గుళ్లల్లో శనికి ఆరాధన చేస్తారు… నల్లబట్టలు, నల్లనువ్వులు, నువ్వులనూనె సమర్పణ… మంచిదే… కొందరు ప్రతి శనివారం గుళ్లల్లో నవగ్రహాల్లో ఒకడిగా […]
- « Previous Page
- 1
- …
- 69
- 70
- 71
- 72
- 73
- …
- 146
- Next Page »