Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మిస్టర్ రేవంతుడూ… వెలమలు పాయింట్‌ ఫైవ్‌ కాదు… 10 పర్సెంట్‌…

July 26, 2023 by M S R

velama

పాయింట్‌ ఫైవ్‌ కాదు… 10 పర్సెంట్‌… కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. 2018 ఎన్నికల్లో అక్కడ రెండో స్థానంలో నిలిచిందిన జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతానని వనమా వెంకేటేశ్వర్‌ రావు చెప్పారు. పదవీకాలం ఇంకో మూడున్నర నెలలు ఉన్నది. ఈ కాలం అక్కడ ఎవరు ఎమ్మెల్యే అనేది కోర్టు నిర్ణయించనున్నది. ఇప్పటికైతే హైకోర్టు తీర్పు అంతిమం. ఈ తీర్పుతో తెలంగాణ శాసనసభలో లెక్కలు ఛేంజ్‌ […]

ఈ విషయంలో కరీనాకపూర్‌ను తప్పుపట్టడమే నారాయణమూర్తి తప్పు…

July 26, 2023 by M S R

kareenakapoor

చాలామందికి కరీనాకపూర్ అంటే నచ్చదు… అందులోనూ ప్రత్యేకించి కాషాయ శిబిరానికి… ఆమె పుట్టుక ప్రఖ్యాత కపూర్ ఫ్యామిలీలో… తండ్రి రణధీర్ కపూర్, తల్లి బబిత… కరిష్మాకపూర్ సోదరి… కొన్ని మెచ్చదగిన పాత్రలు కూడా చేసింది… ఆమె సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడం మీద కాదు… తన పిల్లలకు తైమూర్, జెహంగీర్ అనే హిందూ ద్వేషుల పేర్లను, హిందువులపై భీకర దాడుల కారకుల పేర్లను పెట్టుకోవడం మీద హిందుత్వ వాదుల్లో వ్యతిరేకత ఉంది… ఐతేనేం… ఈ విషయంలో […]

సీమ పెళ్లిలో ఎదురుకోవులు… మన విశ్వనగరంలో ట్రాఫిక్ కదలికలు…

July 26, 2023 by M S R

rains

Rain-Ruin: “చినుకులా రాలి…నదులుగా సాగి… వరదలై పోయి…కడలిగా పొంగి…” “గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. అది జోరు వాన అని తెలుసు. ఇవి నీటి సుడులని తెలుసు. జోరు వానలో, నీటి సుడులలో మునక తప్పదని తెలుసు. ఇది ఆశ నిరాశల ఆరాటం. అది చీకటి వెలుగుల చెలాగటం. ఆశ జారినా, వెలుగు తొలిగినా ఆగదు జీవిత పొరాటం” “మేఘమా! దేహమా! మెరవకే ఈ క్షణం. మెరుపులతో పాటు ఉరుములుగా.. […]

కేసీయార్, నేను అసలు గుర్తున్నానా..? మళ్లీ ఎన్నికలొస్తేనే నేను గుర్తొస్తానా..?

July 25, 2023 by M S R

కోనాయపల్లి

వత్సా కల్వకుంట్ల చంద్రశేఖరా… నేను గుర్తుండకపోవచ్చు నీకు… మళ్లీ ఎన్నికలొస్తేనే గుర్తొస్తాను నీకు వోటర్లలాగే… అంతేనా..? నన్ను నేను పునఃపరిచయం చేసుకుంటాను… నన్ను కల్యాణ వెంకటేశ్వరుడు అంటారు… నా ఊరు కోనాయపల్లి… నీ ఒకప్పటి నియోజకవర్గం సిద్దిపేట ప్రాంతంలోనే ఉంటుంది మా ఊరు… గుర్తొచ్చిందా..? కేసీయార్‌కు భద్రాద్రి రాముడు అసలే పట్టడు, శైవ దేవాలయాలు అసలే పట్టవు అంటుంటారు… ఆ ఒక్క యాదాద్రి తప్ప మరేమీ పట్టదు, అంత ప్రేమ యాదాద్రి నరసింహుడి మీద అంటుంటారు… కానీ […]

భార్య మాత్రమే కాదు… ఆమె పెంపుడు కుక్కల పోషణ భారం కూడా భర్తదే…

July 23, 2023 by M S R

maintanance

దీన్ని భేష్ అని మెచ్చుకుందామా..? ఇదేమిటో వెంటనే బుర్రకెక్కక నిర్ఘాంతపోదామా..? ఈనెల 11న ముంబై, బాంద్రాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఓ తీర్పు ఇచ్చాడు… ఓ భర్త తన భార్యతోపాటు ఆమె పెంచుకునే మూడు పెంపుడుకుక్కలకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలని ఆ తీర్పు సారాంశం… ఆగండాగండి… కాస్త కేసు పూర్వాపరాల్లోకి వెళ్దాం పదండి… కోమల్‌సింగ్ రాజపుట్… వర్తమాన వయస్సు 55 ఏళ్లు… 1986లో పెళ్లయింది ఆమెకు… ఇద్దరు బిడ్డలు… ఆ ఇద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు… 2021 నుంచి భార్యాభర్తలకు […]

ఇండియా అనాలోచిత నిర్ణయం… అమెరికాలో మనవాళ్లకు బియ్యం సంక్షోభం…

July 22, 2023 by M S R

sona masuri

Rohini Devi  ……….. ఈ రోజు నేను పడిన అగచాట్లు ఏమని వర్ణించను ? ఎలా వర్ణించను ? ఉదయం లేచి పూజ చేసుకుని వంట అయ్యాక మొక్కలకి నీళ్లు పోసుకుని, మధ్యాహ్నం క్రికెట్ మ్యాచ్ కి వెళ్ళడానికి ఏమి చీర కట్టుకోవాలి అని ఆలోచిస్తుండగా మా బాబు ఆఫీస్ నుంచి మెసేజ్ పెట్టాడు… అప్పుడే NTV లో వచ్చిన ఫ్లాష్ న్యూస్ చదువుతున్నాను ! ఇండియా non బాసుమతి బియ్యం ఇక ఎక్స్పోర్ట్ చేయదని , బియ్యం […]

Cheetahs Dying Declaration… విదేశీ చీతాల మరణవాంగ్మూలమిది…

July 22, 2023 by M S R

cheetahs

Dying Declaration: ప్రపంచ జంతు ప్రేమికులారా! బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని అన్నమయ్య పరవశించి పాడిన సంగతి మీకు తెలియనిది కాదు. చీమ నుండి బ్రహ్మ వరకు ప్రాణం ఏదయినా ప్రాణమే. అన్నిట్లో ఉన్నది ఆ పర బ్రహ్మమే. ఇన్ని మన్వంతరాలలో, ఇన్ని యుగాల్లో ఇలా పులులు మరణ వాంగ్మూలం రాయడం మీకు వింతగా అనిపించవచ్చు కానీ…చరిత్రలో పులి చంపిన లేడి నెత్తురే కాకుండా…సంఘం చంపిన పులుల నెత్తురు కూడా రికార్డ్ కావాలన్న సదుద్దేశంతో బరువెక్కిన గుండెతో పదునెక్కిన గోళ్లతో ఈ […]

తెలుగు మీడియాకు చేతనవుతుందా ఈ మేకప్..? ఉత్త సోది ప్రజెంటేషన్లు మినహా..!

July 21, 2023 by M S R

media

ఫస్ట్ పేజీ మేకప్… ఇది ఎడిటోరియల్ టీం క్రియేటివిటీ, మేనేజ్‌మెంట్ టేస్ట్, పొలిటికల్ లైన్, సమస్య తీవ్రత వంటివెన్నో బయటపెడుతుంది ఫస్ట్ పేజీ… ఫస్ట్ పేజీ పత్రికకు గుండెకాయ… ఈ దిగువ క్లిప్పింగ్ చూడండి ఓసారి… ది టెలిగ్రాఫ్ అని కలకత్తా బేస్డ్ పత్రిక ఫస్ట్ పేజీ ఇది… ఈరోజు ఇది వైరల్… ఎందుకు..? హెడింగ్ వేరే ఉండదు… ఒక మొసలి కన్నీళ్లు ఉంటాయి ఫోటోలో… పక్కన ఈ 56 ఇంచుల చర్మానికి బాధ తెలియడానికి 79 […]

Surrogate Ads… డబ్బు కోసం ఈనాడు ఏదైనా పబ్లిష్ చేయగలదు…

July 21, 2023 by M S R

royal stag

మీడియా, సెలబ్రిటీలు… డబ్బు కోసం దేనికైనా తెగిస్తారు… ఎంత పేరున్న మీడియా అయినా సరే, ఎంత పేరున్న సెలబ్రిటీ అయినా సరే… ప్రత్యేకించి మన తెలుగులో అంతే… ఈనాడులో వచ్చిన ఈ యాడ్ దానికే నిదర్శనం… రోజూ తెల్లారిలేస్తే మస్తు నీతులు చెబుతుంది కదా ఈనాడు… మరి వాణిజ్య ప్రకటనల్లో ఆ నైతికతను ఎందుకు పాటించదు..? మిగతా పత్రికలను వదిలేయండి కాసేపు… వాటికి ఏ నీతులూ వర్తించవు… కానీ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రికగా ఈనాడుకు ఓ బాధ్యతంటూ […]

ఈ ఆంధ్రోడు ఇప్పుడు బయట పడుతున్నడు… ఓ దేవుడా, నువ్వు వింటున్నవా…

July 20, 2023 by M S R

jnjmac

Madhav Singaraju….  దేవుడూ.. ఇదంతా నీకు తెలిసే జరుగుతోందా?! కేసీఆర్‌ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటేనే గానీ ప్రత్యేక తెలంగాణ రాలేదు. 1000 మందికి పైగా హైద్రాబాద్‌ జర్నలిస్టులు 15 ఏళ్లుగా పోరాడుతున్నా కూడా – వారిలో ఒక్కొక్కరుగా 60 మందికి పైగా రాలిపోయారు తప్ప – నేటికీ ఇళ్ల స్థలాలు రాలేదు. డబ్బు కట్టారు. దగా పడ్డారు. వీళ్లంతా నిన్న మొన్నటి జర్నలిస్టులు కారు. సీనియర్‌లు, సీనియర్‌ మోస్ట్‌లు. దాదాపుగా అందరూ తమ పిల్లలకు పెళ్లి […]

సంజయా ఇంకా సమజ్ కాలేదా… ముక్కుసూటిగా వెళ్లావు, నొగలు విరిగినయ్…

July 20, 2023 by M S R

bandi

నేను ఎవరికీ వ్యతిరేకంగా పని చేయలేదు…. అదే అనర్హత ఎవరిపైనా అధిష్ఠానానికి ఫిర్యాదు చేయలేదు… అదే అనర్హత వేదికపై కుర్చీ లేకుండా చేసినా పట్టించుకోలేదు… అదే అనర్హత సీఎం పదవిని ఆశించబోనని ప్రకటించాను… అదే అనర్హత అసెంబ్లీకి పోటీయే చేయబోనని చెప్పాను… అదే అనర్హత అధ్యక్షుడిగా కొనసాగించి ఉంటే గెలిపించేవాణ్ని… అదే అనర్హత ఇప్పటికీ రాష్ట్రంలో విజయావకాశాలు ఉన్నాయి… అదే అనర్హత పార్టీ ప్రకటనలు ప్రొటోకాల్‌ ప్రకారమే ఇచ్చాం… అదే అనర్హత అతిథుల ఫోటో తరువాత నా […]

flexi fight… ఇది ఫ్లెక్సీల కోసం, ఫ్లెక్సీల చేత, ఫ్లెక్సీల రాజ్యం…

July 20, 2023 by M S R

FLEXI FIGHT

I Want Respect:  ప్రజలే ప్రభువులు; ప్రజలే స్వాములు; పాలించేవారు ప్రజలకు సేవకులు; పాలకులు ప్రజలకు కేవలం ప్రతినిధులు- లాంటి ప్రజాస్వామ్య స్వరూప స్వభావాలు, గుణగణాలు పిండి ఒళ్లు పులకించే, గుండె పొంగిపోయే అభ్యుదయ భావనలు, ఆదర్శాలు ఎన్ని చెప్పినా- అవన్నీ…”your freedom ends where my nose begins” అని ఆ ప్రజాస్వామ్య ప్రతినిధి చెప్పనంతవరకే పని చేస్తాయి. ఒకసారి అతడి/ఆమె నోస్ బిగిన్ అయిన తరువాత ప్రజల ఫ్రీడమ్ కు ఆటోమేటిగ్గా ఎండ్ కార్డ్ పడాల్సిందే. అదే ప్రజాస్వామ్యంలో […]

‘సరసం.కామ్‌’కు శ్రీరమణ రాత, మోహన్‌ గీత, వసంత లక్ష్మి అనుసంధానకర్త…

July 19, 2023 by M S R

శ్రీరమణ

Mohammed Khadeerbabu……   సాహితీ సభల్లో మాట్లాడేవారిపై బాగానే జోకులు వేసేవారు శ్రీరమణ. ఏ హెచ్చరికా లేకుండా ఎక్కువ సేపు మాట్లాడేవారి కంటే ‘పెద్దగేం మాట్లాడను అని పాయింట్లు రాసుకున్న చిన్న కాగితమ్ముక్కను బయటకు తీసేవారు ఎక్కువ ప్రమాదకారులు’ అనేవారాయన. ఇలాంటి వారు మైకు ముందుకు రాగానే మనం పలాయనం చిత్తగించాలని హితవు పలికేవారు. ముళ్లపూడి వెంకటరమణ, బాపుగార్లతో సినిమా తీయాలని తలాతోకా తెలియని డబ్బున్న ఆసాములు వచ్చి, తోడు తెచ్చుకున్న బామరిదికి ముళ్లపూడి వారిని చూపిస్తూ ‘ఎవరనుకున్నావు. […]

సునీల్ ఔట్..? సెంథిల్ ఇన్..? రేవంతుడితో సునీల్ గొడవ… ఆ 2 వ్యాఖ్యల చిచ్చు…

July 19, 2023 by M S R

sunil kanugolu

మొన్నొక వార్త బాగా చక్కర్లు కొట్టింది… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్టుగా మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కుమార్ రానున్నాడు అనేది ఆ వార్త సారాంశం… త్వరలోనే ఆయన తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడనీ, 40 మందితో ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నాడట… ఆయన ఎవరు..? పుట్టుక రీత్యా తమిళుడు… కానీ కర్నాటక కేడర్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి… అతని తండ్రి పి. షణ్ముగం రిటైర్డ్ జిల్లా జడ్జి, […]

ఫాఫం నమస్తే తెలంగాణ… చివరకు ఇలా దిగజారి… ఎక్కడో పాతాళ పాత్రికేయం…

July 19, 2023 by M S R

నమస్తే

కాసేపు ఈనాడును పక్కన పెడదాం… కేసీయార్ కోసం నమస్తే తెలంగాణ పత్రిక (పాఠకులు క్షమించాలి, దాన్ని పత్రిక అని సంబోధించినందుకు…), జగన్ కోసం సాక్షి, చంద్రబాబు కోసం ఆంధ్రజ్యోతి అవిశ్రాంతంగా పోతరాజుల్లాగా కొరడాలతో చెళ్లుచెళ్లుమని బజారులో నిలబడి, ఆయా పార్టీల రంగులు రుద్దుకుని, మరీ కొట్టుకుంటాయి కదా… 26 పార్టీలతో ఓ బలమైన బీజేపీ వ్యతిరేక కూటమి ఒకటి తయారైంది… మీటింగులు పెడుతోంది… INDIA అని పేరు కూడా పెట్టుకున్నారు… కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి రచిస్తున్నారు… […]

మరణంలోని అక్షరాల్ని పేరుగా పెట్టుకున్నవాడు… తనకు మరణమా..?

July 19, 2023 by M S R

sriramana

Prasen Bellamkonda……  మరణంలోని అక్షరాలను పేరులోనే పెట్టుకుని దర్జాగా బతికిన మనిషి ఆయనకు మరణమా…. నమ్మకం కుదరక పోవచ్చు కానీ నేను కొన్ని వందల సార్లు చదివిన పుస్తకం శ్రీ రమణ పేరడీలు. నిజం… కొన్ని వందల సార్లు. 80 వ దశకం మొదట్లో అప్పుడప్పుడే తెలుగులో సీరియస్ రచయితలు, కవులనందరినీ చదివిన హాంగోవర్లో ఉండడం వల్ల వాళ్లందరినీ శ్రీ రమణ అనుకరించిన పద్ధతి నాకు అతి పెద్ద ఆశ్చర్యం. ఒక వింత. ఒక మేజిక్. ముఖ్యంగా […]

ఆస్తి యావత్తూ ధారబోసి… 90 ఏళ్ల వయస్సులో ఓ వృద్దురాలి ఒంటరి న్యాయపోరాటం…

July 19, 2023 by M S R

yashoda

(వీవీ రమణమూర్తి… ఎండీ, లీడర్ పత్రిక) నిరుపేదల కళ్ళల్లో వెలుగును చూడాలని తమ యావదాస్తినీ భర్తతో పాటు ధారపోసి రోడ్డున పడ్డ వృద్ధురాలి కథ ఇది. 90 ఏళ్ళ వయసులోనూ ఒంటరి పోరాటం చేస్తూ న్యాయం కోసం కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్న త్యాగమూర్తి కన్నీటి గాథ ఇది. కొంత మంది కుట్రలకు, కుతంత్రాలకు, బలయి పోయిన ఓ మానవతావాది యదార్ధ వ్యధ ఇది. విశాఖ నగరంలోనే కాదు తెలుగు ప్రజలందరికీ చిరకాలంగా కంటికి రెప్ప లాంటి […]

అర శతాబ్దంపాటు అదే చోట, అదే పార్టీ నుంచి… వరుసగా 12 సార్లు ఎన్నిక…

July 18, 2023 by M S R

chandy

Siva Racharla…..   Mass Contact… ప్రజలతో సన్నిహితంగా ఉంటే అనేక సమస్యలను సులభముగా పరిష్కరించవచ్చు అంటారు ఆయన. ప్రజాస్వామ్యానికి కావలసింది సైన్యం, ఆయుధాలు కాదు ప్రజల విశ్వాసం అని నమ్మిన, ఆచరించిన నాయకుడు ఊమెన్ చాందీ . వర్తమాన రాజకీయాల్లో విశ్లేషణకు సరిపడా సరుకు ఉండటం లేదు. సిద్ధాంతం వదిలేసినా తలలు తీసుకుంటాం అన్న మూడు నెలలకే మరో పార్టీలో చేరి పాత పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. జీవితం మొత్తం ఒకే పార్టీలో ఉంటే రాబోయే రోజుల్లో […]

ఇలాంటి ఫేక్ మెసేజులు, కొత్తతరహా మోసాలతో జాగ్రత్త సుమా…

July 18, 2023 by M S R

fraud

Sai Vamshi ……….   ఇలాంటి ‘మోసాలు’ ఉంటాయి.. జాగ్రత్త … PLEASE READ IT.. … నిన్న సాయంత్రం వాట్సాప్‌కి ఓ మెసేజ్ వచ్చింది. మీకు పార్ట్ టైం పని కావాలా అంటూ! జర్నలిజంలోకి రాక ముందు నా బయోడేటా నౌకరీ, లింక్డ్ లాంటి వెబ్‌సైట్లలో పెట్టాను. ఇప్పటికీ నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఇదీ అలాగే వచ్చింది అనుకున్నా! Truecallerలో అదేదో ఇంగ్లీషు పేరు ంంది‌ ‘మీరు సరే అంటే మీ వివరాలు రిజిస్ట్రేషన్ చేస్తాను’ అని మెసేజ్ […]

ఈ కూటముల్లోని 35 పార్టీలకు అసలు పార్లమెంటు ప్రాతినిధ్యమే లేదు…

July 18, 2023 by M S R

elections

దుర్మార్గ బీజేపీని గద్దె దింపాలనే సంకల్పం, ప్రయత్నం విపక్షాల కోణంలో అవసరమే, రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమే… అయితే ప్రస్తుతం ఓ నంబర్లాట నడుస్తోంది అధికార, విపక్షాల నడుమ… 26 పార్టీలు కలిసి మోడీపై యుద్ధభేరీ మోగిస్తాయని కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న దండు… ఎహె, మేం 38 పార్టీలతో మీటింగ్ పెడుతున్నాం అంటున్నాడు బీజేపీ నడ్డా… అసలు కూటమి అని పిలిచే దగ్గరే వస్తోంది చిక్కు… ఉదాహరణకు, విపక్ష కూటమినే తీసుకుందాం… పేరుకు 26 పార్టీలు… వీటిలో టీఎంసీ, […]

  • « Previous Page
  • 1
  • …
  • 70
  • 71
  • 72
  • 73
  • 74
  • …
  • 141
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions