Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇలాంటి వ్యాఖ్యల్ని మన భారతీయ నేతల్లో ఒక్కరైనా చేయగలరా..?

September 15, 2023 by M S R

vivek

నిజంగా ఆది కాస్త ఆలోచనలో పడేసే వార్త… ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా మాట్లాడితే ద్రోహిలా లెక్కేసే రోజులు ఇవి… ఇక పార్టీలు, నాయకులైతే వాళ్ల మెప్పు కోసం నానా పాట్లూ పడుతుంటారు… ప్రభుత్వ ఉద్యోగులకు కోపం వస్తే మన ప్రభుత్వం ఉంటుందా..? మన పార్టీకి పుట్టగతులుంటాయా టైపు మథనం ఉంటుంది నాయకుల్లో… నిజం చెప్పాలంటే… పనిలేని ప్రభుత్వ విభాగాలు ఎన్నో, ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియదు, ఎందుకు ప్రజాధనాన్ని జీతాలుగా చెల్లించాలో తెలియదు… ప్రజా సంక్షేమానికి నిధులున్నా […]

టీవీ9… తెలుగులో చతికిలపడినా సరే… జాతీయ స్థాయిలో కాస్త ఊరట…

September 14, 2023 by M S R

బార్క్

తాజా రేటింగుల్లో ఏ న్యూస్ చానెల్ పరిస్థితి ఏమిటి..? అప్పుడప్పుడూ జర్నలిస్టు సర్కిళ్లే కాదు, బ్యూరోక్రాట్లు, పొలిటిషియన్లు, ఉద్యోగుల్లో కూడా ఈ ఆసక్తి ఏర్పడుతుంది… రోజూ చానెళ్లను ఫాలో అయ్యేవాళ్లకు మరీనూ… తెలుగు చానెళ్లలో ఎన్టీవీ, టీవీ9 నడుమ పోటీ ఉండి, గొప్పగా చెప్పుకునే టీవీ9 బాగా చతికిలపడిపోయి, మళ్లీ లేవడం లేదు… అసలు మిగతా చానెళ్ల సిట్యుయేషన్ ఏమిటి..? ఈ రెండు చానెళ్లతో పోలిస్తే మిగతావి ఏ ప్లేసుల్లో ఉన్నాయి..? నో డౌట్… ఎన్టీవీ తన […]

చంద్రబాబుకు ఈ లాయర్‌ను సజెస్ట్ చేసిన మహానుభావులెవరో గానీ… ఫాఫం…

September 14, 2023 by M S R

luthra

ఫాఫం చంద్రబాబు… కాలం ఎదురు తిరగడం అంటే ఇదే… జాతీయ రాజకీయాల్లో చక్రాలు గిరగిరా తిప్పిన ఆయనకు ఇప్పుడు చెప్పలేని దురవస్థే… జగన్ కేసుల్లో పెట్టేయడం, అరెస్టు చేయడం, ఏసీబీ కోర్టు కూడా క్వాష్‌కు అంగీకరించలేదు, రిమాండ్ రిపోర్టుకు వోకే చెప్పింది, రిమాండ్‌కు పంపించేసింది… చివరకు హౌజ్ రిమాండ్‌కూ నో చెప్పింది… ఇంకా కేసులున్నయ్, అవి వరుసగా పైన పడుతుంటయ్… అనవసరంగా ‘ఏం పీకగలవ్ జగన్’ అని సవాల్ చేసి తప్పు చేశానేమో అనుకుంటూ ఉండవచ్చు బహుశా […]

అనసూయకూ రష్మికి ఎంత తేడా… ఆలోచనల్లో, మాటల్లో, స్పందనల్లో…

September 13, 2023 by M S R

rashmi and anasuya

సరిగ్గా ఏడాది క్రితం ‘ముచ్చట’ పబ్లిష్ చేసిన ఓ స్టోరీ… మరోసారి అదే ధోరణిలో చెప్పుకోవాలనిపించింది… పోనీ, అది గుర్తుచేయాలని అనిపించింది… సరే, ఒక్కసారి ఆ పాత కథనం యథాతథంగా మళ్లీ చదివేయండి… ఇదుగో… ఇద్దరూ బూతు షో జబర్దస్త్ యాంకర్లే మొన్నటివరకూ… అవకాశాల్ని బట్టి సినిమాల్లో బోల్డ్ కేరక్టర్లలో నటించినవాళ్లే… కానీ ఎంత తేడా..? అనసూయ అనసూయే… రష్మి రష్మియే… కొన్ని వేల మంది అనసూయ మీద డిజిటల్ దాడికి దిగితే ఒక్కరంటే ఒక్కరూ టీవీ […]

తనొక్కడే అశ్లీల వీడియోలు చూస్తే… తప్పేమిటి..? అందులో నేరమేమిటి..?

September 13, 2023 by M S R

section 292

మొన్నామధ్య రిలీజైన పుష్ప సినిమాలో ఓ డైలాగ్… ఇదీ నా కాలే, ఇదీ నా కాలే, నా కాలు మీద నా కాలేసుకుంటే… సేమ్… ఓ వ్యక్తి తన మొబైల్‌లో శృంగార, సంభోగ వీడియోలను చూస్తున్నాడు… పోలీసులు పట్టుకుని కేసులు పెట్టారు… అప్పుడు తనేమనాలి… పుష్ప స్టయిల్‌లో అయితే… ‘ఇది నా మొబైలే… ఇది నా బ్రాడ్ బ్యాండే, నా ఖర్చుతో నేను చూస్తుంటే మీకేంటి..? దాదాపు ఇలాంటిదే ఈ కేసు… అసలు మన భారతీయ శిక్షాస్మృతిలోని […]

పార్లమెంటరీ సిబ్బంది యూనిఫామ్ మీద జాతీయ పుష్పాలు… ఇదీ తాజా రచ్చ..!

September 13, 2023 by M S R

uniform

‘‘ప్రతి గుళ్లో దేవుళ్లు అభయహస్తం చూపిస్తుంటారు… భక్తుల్ని దీవిస్తున్నట్టు… అంటే ప్రతి దేవుడూ కాంగ్రెస్ ఎన్నికల గుర్తును ప్రచారం చేస్తున్నట్టేనా..? జాతీయ పతాకం రంగుల్ని తమ పార్టీ పతాకంలో ఉపయోగిస్తారు, అది సమంజసమేనా..? అంతెందుకు..? విపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నాయి… సమర్థనీయమేనా..?’’ … ఇలా ఎప్పుడైనా ప్రశ్నలు మొలకెత్తాయా మీ మెదళ్లలో… లేదా..? అయితే మీకు రాజకీయ స్పృహ లేనట్టు లెక్క… ఆ స్పృహ ఉన్నవాళ్లకు ప్రతిదీ రాజకీయ వివాదంగా తోస్తుంది… విపక్షాలకు […]

ఉదయనిధి ‘సనాతన వ్యాఖ్యలు’… సరైన టైమింగ్, పర్‌ఫెక్ట్ డైవర్షన్ ప్లానింగ్…

September 13, 2023 by M S R

sandmafia

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కదా ఉదయనిధి పిలుపునిచ్చింది… దేశమంతా దాని గురించే మాట్లాడుతోంది కదా… ఇతరత్రా వ్యవహారాలన్నీ పక్కకుపోయి అందరి చర్చా దీనిపైనే కేంద్రీకృతం అవుతోంది కదా… ఎస్, డీఎంకే ఆశించిందే అది… విజయవంతంగా స్టాలిన్ తన ప్రభుత్వ ముఖ్యుల అక్రమాలపై నుంచి ప్రజల చర్చను దారి మళ్లించాడు… కొడుకును ముందుపెట్టి కథ నడిపిస్తున్నాడు… ప్రతిపక్షం ఎఐడీఎంకే బాగా బలహీనపడిపోవడం, మరో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం, బీజేపీకి బలం లేకపోవడం, కాంగ్రెస్ తన గూటిలోనే పదిలంగా ఉండిపోవడం, […]

ఖర్చెక్కువైనా సరే, లాయర్ ఎంత సమర్థుడైనా… కోరిన న్యాయం దక్కాలనేమీ లేదు…

September 10, 2023 by M S R

lawyers

Nancharaiah Merugumala…….   మన గొప్ప తెలుగోళ్లందరికీ ఉత్తరాది (పంజాబీ, పార్సీ, సింధీ) లాయర్లే దిక్కు… అయినా, దక్షిణాదికి ఏదో హిందీవాళ్లు అన్యాయం చేస్తున్నట్టు మనోళ్ల ఏడుపు… చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో బెయిలిప్పించడానికి దిల్లీ పంజాబీ వకీలు లూథ్రా… ……………………………………………………………………………………………………… దక్షిణాది రాష్ట్రాలకు ఏదో అన్యాయం జరిగిపోతోందని, సదువు, సంపదా లేని ఉత్తరాదోళ్లు మన ఐదు ప్రాంతాల జనాన్ని తొక్కి నారతీస్తున్నారని మనం తరచు తెగ బాధపడిపోతుంటాం. కొన్ని రంగాల్లో తమిళులు, మలయాళీలు, కన్నడిగులు, తెలుగోళ్లూ ముందున్న మాట […]

బట్టలిప్పేసి బజారులో నాసామిరంగా… ఆ రెండు పత్రికలే కాదు, సాక్షి సైతం…

September 10, 2023 by M S R

ఈనాడు

హమ్మయ్య బతికించాయి ఆ పత్రికలు… నిన్నటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ధోరణి చూస్తే ఈరోజు పత్రికల ఫస్ట్ పేజీలు, కవరేజీ ఏ రేంజులో ఉంటాయోనని అందరూ అనుమానపడ్డారు… అరెరె, మీరనుకున్నట్టు కేవలం ఆ రెండు పత్రికలు మాత్రమే కాదు… ది గ్రేట్ అధికార సాక్షి సైతం..! ఆ రెండు పచ్చపత్రికలు అంటూ అప్పట్లో వైఎస్ అన్నాడు… ఈనాడు ఆర్థిక మూలాల్ని పెకిలించే పనిలో మార్గదర్శి ఫైనాన్స్‌ను గెలికాడు… రామోజీ ఫిలిమ్ సిటీ దున్నేయాలనుకున్నాడు… ఫాఫం, వర్కవుట్ కాలేదు… […]

అవినీతి తప్పుకాదట… తప్పడం లేదట… చంద్రబాబు తప్పూ ఏమీలేదట…

September 10, 2023 by M S R

aj rk

మామూలు సందర్భాల్లోనే తెలుగుదేశం జెండాను, ఎజెండాను చంద్రబాబుకన్నా, తెలుగుదేశం పార్టీకన్నా ఎక్కువగా మోసే తత్వం ఆంధ్రజ్యోతిది… ఇప్పుడు చంద్రబాబును అరెస్టు చేసిన విశేష సందర్భంలో ఇక ఎలా ఊరుకుంటుంది..? రాధాకృష్ణ తన తాజా కొత్తపలుకు వ్యాసంలో దీన్నే ప్రస్తావించకుండా, జగన్‌ను తిట్టిపోయకుండా, చంద్రబాబుకు భరోసాగా ఉండకుండా ఉండలేడు కదా… అయితే ఈసారి కాస్త ఆశ్చర్యం… జరిగిందేదో మంచికే జరిగింది… ఏం పర్లేదు, ఇదీ ఒకందుకు మంచిదే… అనే ధోరణి తీసుకోవడం విశేషమనిపించింది… ఇదేదో పాజిటివ్ వైబ్ అనుకోనక్కర్లేదు… […]

బాబులీ… ఆనాడు చంద్రబాబు అరెస్టయినప్పుడు ఏం జరిగిందంటే…

September 9, 2023 by M S R

babu

అర్ధరాత్రి ఇంటికి చేరుకొని, ఎప్పటిలానే ఉదయం ప్రధాన రహదారి పైకి వెళ్లి చూస్తే, ఇనుప చువ్వల వెనుక జైలులో బాబు ఉన్న పోస్టర్లు.., బేగంపేట వంటి ప్రధాన రహదారిలో భారీ హోర్డింగ్లను చూసి ఆశ్చర్యం వేసింది . వారి సామర్ధ్యం గురించి తెలియంది కాదు . అప్పటికే వారిని దగ్గర నుంచి ఒకటిన్నర దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాను . అయినప్పటికీ ఆ హోర్డింగ్ లు , పోస్టర్లు చూసి వాళ్ళు మామూలోళ్లు కాదు అనుకున్నాను . […]

స్కిల్ స్కాం ఓ తీగ మాత్రమే… చంద్రబాబు అరెస్టు వెనుక కనిపించని ఎన్నో కోణాలు..!!

September 9, 2023 by M S R

babu arrest

చంద్రబాబు అరెస్టు..! ఇది నిజమేనా..? అసలు ఇది సాధ్యమేనా..? అని చాలామంది ఇప్పటికీ హాశ్చర్యంలోనే ఉన్నారు… స్టేలు తెచ్చుకోవడంలో ప్రసిద్ధుడు, ఏ విచారణనూ తన దగ్గరకు రానివ్వని సమర్థుడు, ఏం చేసినా వ్యవహారాల్ని చట్టపరంగా దొరక్కుండా చేయడంలో నిపుణుడు అంటూ ఇన్నాళ్లూ సాగిన ప్రచారం ఉత్తదేనా..? అంతటి చంద్రబాబు కూడా అరెస్టులకు, కేసులకు అతీతుడు ఏమీ కాదా..? అమరావతి వంటి పెద్ద పెద్ద కేసుల్లో చంద్రబాబును ఫిక్స్ చేస్తారని అనుకుంటూ ఉన్నారందరూ… కానీ చాలామందికి పెద్దగా అవగాహన […]

ఇండియా వర్సెస్ భారత్… ఓ దిక్కుమాలిన చర్చ… నేములోనేముంది..?

September 6, 2023 by M S R

bharat

నిజంగా మోడీ ప్రభుత్వం దేశం పేరు మార్చడానికి నిర్ణయం తీసుకున్నదా లేదా తెలియదు… జస్ట్, ఓ ఆహ్వానపత్రికలో భారత్ అని ప్రస్తావించారు… నిజానికి ఇదేమీ తొలిసారి కాదు, భారత్ అనే పేరు వాడటానికి అడ్డంకులు కూడా ఏమీలేవు… దీనికి రాజ్యాంగ సవరణలు, కొత్త చట్టాలు గట్రా ఏమీ అక్కర్లేదు… రాజ్యాంగం మొదట్లోనే ఇండియా, భారత్ అని రెండు పేర్లూ ఉన్నయ్… ఏది వాడుకున్నా ఏ చిక్కులూ లేవు… ఏ సందర్భంలో ఏ పేరు వాడుకోవాలనేది మన ఇష్టం… […]

చావు తరువాత..? అంతుపట్టనిదేదో ఉంది… ఎడతెగని పరిశోధనలు…

September 6, 2023 by M S R

soul

Soul-Resale: “కన్ను తెరిస్తే ఉయ్యాల; కన్ను మూస్తే మొయ్యాల…” అని జాలాది చాలా లోతయిన విషయాన్ని చాలా సింపుల్ గా తేల్చిపారేశాడు. “కన్ను తెరిస్తే జననం; కన్ను మూస్తే మరణం; రెప్పపాటే కదా జీవితం?”  అని మినీ కవిత రచయిత పేరుతెలియకపోయినా తెలుగులో దశాబ్దాలుగా బాగా ప్రచారంలో ఉంది. “స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్!”  అని ఆకలి రాజ్యంలో సినీ కవి సూత్రీకరించాడు. చావు- పుట్టుకలు రెండూ మనచేతిలో ఉండవు. ఏది మనచేతిలో ఉండదో సహజంగా దానికి అతిన్ద్రియ శక్తులను అంటగడతాం. శాస్త్రం- నమ్మకం […]

ఒక కాబోయే సీఎం పిత్తప్రకోపం… సనాతన ధర్మంపై పిచ్చి కూతలు…

September 3, 2023 by M S R

udayanidhi

‘‘సనాతన ధర్మం కూడా మలేరియా, డెంగీ, ఫ్లూ వంటిదే… సమూలంగా నిర్మూలించాలి…’’ ఇదీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పుత్రరత్నం, కాబోయే ముఖ్యమంత్రిగా భజన చేయించుకోబడుతున్న ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య… పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… ఆ కుటుంబ రాజకీయ వాారసత్వమే ‘దేవుళ్లను బహిరంగంగా చెప్పులతో కొడుతూ ఊరేగించిన నాస్తిక భావజాలాన్ని ఆదర్శంగా తీసుకున్నది…’’ సో, స్టాలిన్ నాస్తిక వ్యాఖ్యలు చేస్తే పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదేమో… అఫ్‌కోర్స్, అన్ని ధర్మాల, అన్ని మతాల ప్రజల పట్ల సమభావం […]

ఫాఫం… ఆంధ్రజ్యోతి ఆశపడింది వేరు… జగన్ పొలిటికల్ అడుగులు వేరు…

September 3, 2023 by M S R

jagan

అడ్డెడ్డె… ఇదేం అన్యాయమప్పా… ఈ జగన్ అటు బీజేపీ వాళ్లతోనూ, ఇటు కాంగ్రెసోళ్లతోనూ దోస్తీ చేస్తున్నాడు… మాయ చేస్తున్నాడు… ఎంత దారుణం..? అసలు సోనియాకు, రాహుల్‌కు రాజకీయం తెలియదు, అందుకే జగన్‌ను నమ్మేస్తున్నారు… ఫాఫం… అందుకే కోరి దగ్గరకు వచ్చిన షర్మిలను సందేహంలో పడేశారు… కాంగ్రెస్‌లో ఆమె చేరిక గందరగోళంలో పడింది… జగన్ డబ్బుతో మేనేజ్ చేసి, కాంగ్రెస్ శిబిరాన్ని లోబర్చుకున్నాడు… అంతేనా..? కాంగ్రెస్ వైపు రాయబేరాలు నడుపుతున్నా సరే జగన్‌కు మోడీ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు… […]

ఇదేం పాత్రికేయం కామ్రేడ్స్..? విద్వేషపు మంటల్లో పెట్రోల్ పోయడం కాదా..?

August 22, 2023 by M S R

cpim

ఎస్… పెద్దగా పాత్రికేయంలో శిక్షణ పొందని, పెద్దగా సాధనసంపత్తి లేని, నిబద్ధత లేని చిన్న చిన్న వాట్సప్ పత్రికల్లో ఏమైనా తప్పులు వస్తే మరీ భూతద్దంలో చూడాల్సిన పనిలేదు… వాటి రేంజ్ అదే… తెల్లారిలేస్తే వాట్సప్ గ్రూపుల్లో ఇలాంటి పత్రికలు బోలెడు… ష్, పెద్ద పెద్ద విలేఖరులుగా గతంలో పలు పోస్టుల్ని ఉద్దరించిన వాళ్ల డిజిటల్ పత్రికలూ ఉంటున్నయ్… ఐతే ఏ పత్రికలైనా సరే కొన్ని పాత్రికేయ ప్రమాణాల్ని పాటించాలి… అలా పాటిస్తేనే వాటిని పత్రికలు అనాలి… […]

ఓ సాంకేతిక హంతకుడి చావుతెలివితేటలు… ఏం ప్లాన్ చేశావురా…

August 22, 2023 by M S R

arsenic poison

Off-line Murder: ద్వాపర యుగం వరకు దేవుళ్లు, రాక్షసులు, మనుషులకు విడి విడిగా డ్రస్ కోడ్ ఉండేది. దేవుళ్లకు కనురెప్పలు మనలాగా పదే పదే పడవు. అనిమేషులు. భూమి మీద కనీసం ఒక అడుగు పైన వారు గాల్లో ఉండాల్సిందే కానీ…భూమి మీద దిగడానికి వీల్లేదు. వారి మొహం వెనుక సూర్య లేదా చంద్ర కాంతి దివ్యంగా వెలుగుతూ ఉంటుంది. రాక్షసులు నల్లగా సింగరేణి బొగ్గు సిగ్గుపడేలా ఉండేవారు. నెత్తిన కొమ్ములు, నోట్లో కోరపళ్లు, వాడి గోళ్లు, చింపిరి జుట్టు, […]

చాయ్ కావాలా నాయనా… ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై కాషాయం కన్నెర్ర… కానీ…

August 21, 2023 by M S R

ప్రకాష్ రాజ్

నిన్న, ఈరోజు తెలంగాణలో ట్రెండింగ్ కొన్ని అంశాలున్నయ్… 1. మహిళల రిజర్వేషన్లకు కేసీయార్ బిడ్డ కవిత అప్పట్లో చేసిన పోరాటం, ఈరోజు ఆరేడుగురు మహిళలకు మాత్రమే కేసీయార్ టికెట్లు ఇచ్చాడు… 2. కేసీయార్ జాబితాలో అత్యధికంగా రెడ్లు, కమ్మలే ఉన్నారు… బీసీలకు పెద్ద మొండిచేయి… 3. కేసీయార్ రెండుచోట్ల పోటీచేయడం… 4. అప్పట్లో ఎమ్మెల్యే రాజయ్య ద్వారా వేధింపులకు గురైన సర్పంచి నవ్య ‘నువ్వు రాజకీయం ఎట్ల చేస్తవో చూస్తా అని చిటికెలు వేస్తూ హెచ్చరించిన వీడియో… […]

రెండు సీట్లలో కేసీయార్ పోటీయా..? జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు పెద్ద సారూ..?!

August 21, 2023 by M S R

kcr

మొత్తానికి బీఆర్ఎస్ అధినేత కేసీయార్‌ను ఒక విషయంలో మెచ్చుకోవాలి… అసలు ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే ఆరేడు మినహా మొత్తం స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఒకేసారి విడుదల చేయడం స్థూలంగా చూస్తే సాహసమే… అది పార్టీ మీద తనకున్న గ్రిప్‌ను సూచిస్తోంది… అంతేకాదు, అభ్యర్థుల ఎంపికలో అందరూ సందేహించినట్టు కేటీయార్, హరీష్‌లు సహా ఇంకెవరినీ వేలు పెట్టనివ్వలేదు… లిస్టులు పైపైన చూస్తే అలాగే అనిపిస్తోంది కదా… కానీ అది నిజం కాదు…. జనరల్‌గా పల్లెల నుంచి, జిల్లాల […]

  • « Previous Page
  • 1
  • …
  • 83
  • 84
  • 85
  • 86
  • 87
  • …
  • 114
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • అదే కథ, అదే పాత్ర… విజయచందర్ సూపర్ హిట్… నాగార్జున ఫ్లాప్…
  • కాళేశ్వరంపై బీఆర్ఎస్ క్యాంప్ ఆపసోపాలు… నానా విఫల సమర్థనలు…
  • కాంతారా బీజీఎం మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
  • సింగరేణి మట్టి కూడా బంగారమే… అత్యంత విలువైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’…
  • ఎందుకు కట్టాలి టోల్..? భలే బాగా చెప్పారు యువరానర్…
  • వేరే గ్రహాల దాకా దేనికి..? ఈ భూమి లోపలే తెలియని ఏవో ప్రపంచాలు…!
  • భలే మ్యాషప్ చేశారబ్బా..! అరుదైన స్వరవిన్యాసాలు, స్వరప్రయోగాలు..!!
  • సింగరేణి అంటే నల్లబంగారమే కాదు… ఇప్పుడిక అసలు బంగారం కూడా..!!
  • అవునూ.., హిందూ ఉత్సవాల వేళ భారత్ మాతాకీ జై అనకూడదా..?!
  • తెలుగు అభ్యర్థి..! ఇండియా కూటమిలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions