మాఫియా, క్రిమినల్స్ అని పదే పదే రాస్తుంటాం మీడియాలో… కానీ మీడియా పర్సన్సే అలా తయారైతే… ప్రజాకంటకులుగా మారితే..! తెల్లారిలేస్తే బోలెడు ప్రభుత్వ శాఖలు, నేరగాళ్లతో జనం అవస్థలు సరేసరి… వాళ్లకు మీడియా తోడైతే ఇక సమాజం దురవస్థ..? ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక వార్త ఈ ప్రశ్నలనే లేవనెత్తుతోంది… ఎలాగూ పెద్ద పెద్ద మీడియా సంస్థలు వందల కోట్లను దండుకుంటూ, వీలైనంత విషాన్ని సమాజంలోకి ఇంజక్ట్ చేస్తూనే ఉన్నాయి… ఇంకోవైపు రూపాయి ఇవ్వనక్కర్లేని కంట్రిబ్యూటర్ల వ్యవస్థ… ఉల్టా […]
జార్ఖండ్ రబ్రీదేవి ఈమేనా..?! కూటమి కాదంటే మరో మహారాష్ట్ర తప్పదా..!!
మహారాష్ట్ర అయిపోయింది కదా… ఇక జార్ఖండ్ మీద బీజేపీ కన్ను పడ్డట్టే అని ‘ముచ్చట’ మొన్నటి జూన్‌లో ఓ స్టోరీ రాసింది… కొందరు నమ్మలేదు… కానీ అప్పటికే గేమ్ స్టార్టయిపోయింది… సీఎం హేమంత్ సోరెన్‌కు అర్థమైంది… వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యాడు… కానీ ఫలించలేదు… మా సంతాల్ ఆడబిడ్డ పేరిట యూపీయే నిర్ణయాన్ని కాదని రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ద్రౌపది ముర్మకు మద్దతు ప్రకటించాడు… అప్పటికే స్టేట్ బీజేపీ గవర్నర్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది… […]
పాత్రికేయం ఇప్పుడే అపవిత్రం అయిపోయిందట… తెగ ఏడ్చేస్తున్నారు…
మళ్లీ మొదలయ్యాయి ఏడుపులు..? తమదే మేధస్సు అని డొల్ల బుర్రలను పదే పదే వాయించుకునే సెక్షన్ శోకాలు పెడుతోంది… ఇండియన్ జర్నలిజానికి కార్పొరేట్ చీడ పట్టిందట… పవిత్రమైన పాత్రికేయం పంకిలం అయిపోయిందట… (అసలు పాత్రికేయం- పవిత్రత అనే పదాలు వింటేనే నవ్వొచ్చే రోజులు కావా ఇవి..?) ఎందుకీ ఆరున్నొక్క రాగాలయ్యా అంటే… ఆదానీ అనే వ్యాపారి ఎన్డీటీవీలో కొన్ని వాటాలను కొనేశాడట… ఇంకేముంది..? అయిపోయింది, జర్నలిజానికి కాలం చెల్లింది అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు రెండు చేతులతోనూ […]
మీడియాను వదలని ఆదానీ… ఎన్డీటీవీ వాటాల కొనుగోలు… త్వరలో పూర్తిగా…
పార్ధసారధి పోట్లూరి ……… కాంగ్రెస్ వలన, కాంగ్రెస్ కొరకు, కాంగ్రెస్ చేత సృష్టించబడ్డ NDTV ఎట్టకేలకి ఆదాని చేతిలోకి రాబోతున్నది. ప్రస్తుతం 28.9% స్టేక్ తీసుకుంటున్నా, దానిని క్రమంగా పెంచుకుంటూ పోతూ, చివరికి తన అధీనంలోకి తీసుకోగల దమ్ము, సత్తా ఉంది ఆదానికి! (ఆసక్తి కూడా ఉంది) గతంలోనే ఈ వార్త వైరల్ అయినా [నేను పోస్ట్ కూడా పెట్టాను ] అలాంటిది ఏదీ లేదంటూ NDTV ఖండించింది కానీ ఆదానీ మాత్రం అవును అని కానీ […]
ఓహ్… జూనియర్, రామోజీలతో అమిత్ షా భేటీల ఆంతర్యం ఇదా..?!
అమిత్ షా ఒకరిని కలిశాడు అంటే… దాని వెనుక ఏదో తన పార్టీ ప్రయోజనం ఉండి ఉంటుంది తప్పకుండా…! ఏ ఎత్తుగడా లేకుండా ఒక్క అడుగు కూడా వేయడు… సో, ఆర్ఆర్ఆర్లో బాగా నటించావని జూనియర్‌ను ఎన్టీయార్‌ను పిలిచి భోజనం పెట్టాడు, ఏదో మర్యాద కోసం రామోజీరావును కలిశాడు అనే ప్రచారాలు అబద్ధం… అంత పనిలేకుండా లేడు అమిత్ షా… ప్రతి భేటీ వెనుక ఓ లెక్క ఉంటుంది… కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే… ఇప్పటిదాకా రామోజీరావు […]
అమెరికా చేసిన తప్పులు… చైనా అనే బ్రహ్మరాక్షసికి కోరలు… తలపట్టుకుంది…
పార్ధసారధి పోట్లూరి ………….. క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో చైనా అన్ని దేశాలకంటే ముందుంది! ఫోటానిక్ క్వాంటమ్ కంప్యూటర్ విభాగంలో మిగతా అన్ని దేశాలకంటే చైనా ముందుంది. 2017 లో మొదటిసారిగా ఫోటాన్లని 73 నుండి 113 వరకు డిటెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలో రెండు వేగవంతమయిన క్వాంటమ్ కంప్యూటర్లని తయారు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నది. వీటిని ఫోటానిక్ మరియు సూపర్ కాండక్టింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ [photonic and superconducting quantum computing] అని పిలుస్తారు. క్వాంటమ్ […]
రామోజీతో సుప్రీంలో ఫైట్… ఫాఫం సాక్షి… KCR పై ఉండవల్లి అసంతృప్తి…
ఆమధ్య ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌ను కలిశాడు… బేసిక్‌గా ఉండవల్లి తెలంగాణ వ్యతిరేకి… జాతీయ రాజకీయ పార్టీ స్థాపన కోసం ఉండవల్లి సలహాల కోసం కేసీయార్ ఆయన్ని రమ్మన్నాడు… జాతీయ రాజకీయాలకూ ఉండవల్లికీ లింకేమిటో, ఉండవల్లి అనుభవమేమిటో మనకు తెలియదు… కానీ ఉండవల్లి ఆ భేటీ తరువాత మస్తు మెచ్చుకున్నాడు… అసలు కేసీయార్ దేశానికి నాయకత్వం వహించే కెపాసిటీ ఉన్నవాడు అని ప్రశంసించాడు… సీన్ కట్ చేయండి… ఉండవల్లి గానీ, అప్పట్లో కేసీయార్ వెంట నీడలా […]
చెప్పుల మోతే బాగాలేదు… రామపాదుకలతో శుష్క సమర్థనేంటి బండన్నా…
సికింద్రాబాద్… ఉజ్జయిని మహాంకాళి గుడి… కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంట తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నాడు… గుడి బయటికి రాగానే హడావుడిగా బండి సంజయ్ అమిత్ షా చెప్పుల్ని వెతికి, పట్టుకొచ్చాడు… కాస్త వంగి విధేయంగా నిలబడ్డాడు… అమిత్ షా కనీసం వారించలేదు… ఇదీ జరిగింది… లంబాచోడా వివరణలు అక్కర్లేదు… జరిగింది బాగాలేదు… హార్డ్ కోర్ బీజేపీ ఫ్యాన్స్‌కు సైతం చివ్వెరపుట్టించేలా జరిగింది… సహజంగానే బీజేపీ అంటే అగ్గిమండుతున్న టీఆర్ఎస్ దీన్ని […]
జొమాటో లెంపలేసుకుంది, సారీ చెప్పింది, వీడియో రిమూవ్ చేసింది..!
జొమాటో… ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండటం, లెంపలేసుకోవడం అలవాటే… ప్రత్యేకించి అది విడుదల చేసే వాణిజ్య ప్రకటనలు, సాగించే ప్రచారానికి సంబంధించిన టీం ఏదో దరిద్రంగా ఉన్నట్టుంది… తాజాగా మరో వివాదం… విషయం ఏమిటంటే..? ఆమధ్య హీరో హృతిక్ రోషన్‌తో ఓ యాడ్ చేయించింది… ‘‘తాలి తినాలని ఉంది, మహాకాళ్ నుంచి తెప్పించాను’’ (రఫ్ అనువాదం)… అని అంటుంటాడు ఆ వీడియోలో… తాలి అంటే తెలుసు కదా, ఓ ప్లేటు భోజనం… సౌతిండియన్ తాలి, నార్త్ ఇండియన్ […]
మద్యం సీసాడియా..! మింగలేక, కక్కలేక కేజ్రీ… కిక్కు దిగినా కిక్కుమనడు..!!
పార్ధసారధి పోట్లూరి ….. రేపో మాపో CBI కానీ, ED కానీ నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది ! ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అంటున్నాడు ఇలా… ! ఇప్పటివరకు కేవలం సిబిఐ మాత్రమే దాడులు చేసింది ఈయన మీద, కానీ మధ్యలో ED పేరును తానే ఎందుకు ఇరికించాడు ? అంటే మనీ లాండరింగ్ చేశాడా ? ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలు ! Delhi Excise Policy 2021… దేశ రాజధానిలో […]
బీజేపోళ్లకు పనీపాటా ఉండదా..? నాన్సెన్స్… బీహారర్ వైపు వెళ్లనివ్వరా..?!
ఈ బీజేపీ వాళ్లకు పనిలేదు, పాటలేదు… ఎప్పుడూ బట్టకాల్చి మీద వేయడమే తెలుసు… అరె, అభివృద్ధికి సహకరించకుండా, ఎప్పుడూ బురదజల్లుడు రాజకీయాలేనా..? ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు… ఫాఫం, 74 ఏళ్లు… ఆ సీఎం నీతిశ్ బీజేపీ ఏదో చేస్తుందని గజ్జున వణికిపోయి, ఈ పాము పక్కలో చేరాడు… ఐనాసరే, నీకెందుకు భయం, నేనున్నాను కదాని అభయం ఇచ్చాడు లాలూ… కానీ ఓపిక లేదు, తరాల తరబడీ ప్రజలకు సేవ చేసీ చేసీ అలిసిపోయాడు… ఐనాసరే, […]
జై కేసీయార్… జైజై టీఆర్ఎస్… మేమిప్పుడు గులాబీ తోకలం…
‘‘మంచి తోకలుగా ఉంటాం… దయచేసి మమ్మల్ని అతికించుకొండి, ప్లీజ్… నమ్మకంగా విధేయంగా ఉంటాం… జెండాలు మోస్తాం, ఎజెండాలు మోస్తాం…’’ అంటూ ఏ ప్రధాన పార్టీ పిలుస్తుందా..? ఎప్పుడు లటుక్కున అతుక్కుపోదామా..? అన్నట్టుగా మారిపోయాయ్ లెఫ్ట్ పార్టీల ప్రస్థానాలు… వ్యంగ్యంగా అనుకున్నా, నిజమైన కమ్యూనిస్ట్, మార్క్సిస్ట్ అభిమానుల్లో ఉన్న ఆవేదనే ఇది… అప్పుడు ఉమ్మడి రాష్ట్రమైనా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలైనా… సొంతంగా ఎదగడానికి చేసే పోరాటం లేదు, ఆ ఆరాటమూ లేదు ఇప్పుడు… ఏదో ఓ పార్టీకి […]
రామోజీ దౌత్యం… బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు డెస్పరేట్ ప్రయత్నాలు…
‘‘ఏమోయ్ మోడీ… చంద్రబాబు నిన్ను వెన్నుపోటు పొడిచి ఉండవచ్చుగాక… యూపీయే ప్రభుత్వంలోకి వస్తుందనే భ్రమల్లో పడి, నీ దోస్తీని తెంచుకుని, సోనియాకు ఆర్థికసాయం చేసి, ఇతర పార్టీలనూ ఆర్గనైజ్ చేసి ఉండవచ్చుగాక… తరువాత బొక్కబోర్లాపడి, తన సొంత రాష్ట్రంలోనే 23 సీట్లకు పరిమితమై మూతిపళ్లు రాలిపోయి ఉండవచ్చుగాక… అంతకుముందే మోడీని తీవ్రంగా వ్యతిరేకించి, రాజకీయ కారణాలతో అంతకుముందు నీతో మళ్లీ దోస్తీ చేసి ఉండవచ్చుగాక… ఐనాసరే, మళ్లీ నీకు చంద్రబాబే శరణ్యం… వెంటనే తనతో దోస్తీ చేసుకో, […]
భారత జలాల్లోకి పాకిస్థానీ యుద్ధనౌక..! ఎందుకు..? ఏ కుట్ర కోసం..?!
Article By పార్ధసారధి పోట్లూరి ……….. ఆలస్యంగా అందిన వార్త ! గత జులై నెల మధ్యలో పాకిస్థాన్ నావీకి చెందిన వార్ షిప్ ఒకటి గుజరాత్ తీరంలోని భారత జలాలలోకి ప్రవేశించింది. అయితే భారత్ కోస్ట్ గార్డ్ కి చెందిన డోర్నియర్ నిఘా విమానం ఒకటి మన దేశ ప్రాదేశిక జలాలలోకి ఏదో నౌక ప్రవేశించి ప్రయాణిస్తున్నట్లు గుర్తించింది. వెంటనే మొదటి డోర్నియర్ నిఘా విమానంకి తోడుగా దగ్గరలోనే ఉన్న ఎయిర్ బేస్ నుండి మరో […]
యువరానర్… ఈ మందులు, పరీక్షల కమీషన్ల కథలన్నీ తవ్వండి… ప్లీజ్…
కరోనా సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ మాట అటుంచితే… ఇప్పటికీ ఒమిక్రాన్ వెరయిటీ వదలడం లేదు… సోకిందని సందేహమొస్తే చాలు, రోగి మెడికల్ షాపు వద్దకు వెళ్తున్నాడు… నాలుగు డోలో-650 తెచ్చుకుంటున్నాడు… వేసుకుంటున్నాడు… నమ్మినా నమ్మకపోయినా రియాలిటీ అదే… మార్కెట్లో బోలెడు పారాసెటిమాల్ టాబ్లెట్లు దొరుకుతాయి… మరి డోలో-650 మీదే ఎందుకు నమ్మకం పెరిగింది..? హైడోస్ అనేనా..? నిజానికి డోలో-650 ప్రిస్క్రయిబ్ చేయాలని సదరు కంపెనీ భారీ ఎత్తున డాక్టర్లకు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదేమో… ఎందుకంటే..? […]
బీజేపీలో పనిలేదు సరే… వెళ్లిపోదామంటే వేరే పార్టీ ఏం మిగిలింది..?!
నిజమే… ఆమెకు పనిచెప్పడం లేదు, ఎక్కడి నుంచి పోటీ చేయాలో క్లారిటీ ఇవ్వడం లేదు… ఆమెను ముఖ్య సమావేశాలకు పిలవడం లేదు… ఆమెను అసలు పార్టీ నాయకురాలిగానే చూడటం లేదు… ఆమెకు తగిన గౌరవం లేదు… ఎస్, విజయశాంతికి తను బీజేపీలోనే ఉన్నానా అనే డౌట్ రోజుకు వేయిసార్లు వస్తూ ఉండవచ్చు బహుశా… అన్నీ నిజాలే… నాణేనికి ఒక కోణం ఆలోచిద్దాం… అది బీజేపీ… ఎవరూ పిలిచి పీటలేసి, కిరీటాలు పెట్టరు… చొరవ తీసుకోవాలి… పైగా ఆమె […]
తెలుగు పత్రికల్లో ఏది పెరుగు..? ఏది మజ్జిగ..? మీరే తేల్చండి..!
తెలుగు టీవీలను కాసేపు వదిలేద్దాం… మరోసారి చెప్పుకుందాం… ట్యాంపరింగుకు అతీతం కాకపోయినా వాటి మంచీచెడూ కొలవడానికి బార్క్ రేటింగ్స్ వస్తుంటయ్ వారంవారం… మరి పత్రికలు, వాటికి అనుబంధంగా ఉండే వెబ్సైట్లు… వాటి పరిస్థితేమిటి..? అసలు పాఠకుడు దేన్ని విశ్వసిస్తున్నాడు..? దేన్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు..? ఏది విశ్వసనీయ పత్రిక..? పోనీ, ఏ వెబ్‌సైట్‌ను పాఠకుడు ఆదరిస్తున్నాడు..? ఎందుకు..? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలే… గతంలో ఏబీసీ అనే సిస్టం ఉండేది… ఏ పత్రిక ఎన్ని కాపీలు అమ్ముతున్నదో ఆడిట్ చేసి, […]
చైనా మీద ఇండియా స్మార్ట్ వార్… ఆ చౌక ఫోన్లు నిషేధిస్తే జింతాక జితా…
ఆర్టికల్ :: పార్ధసారధి పోట్లూరి ….. చైనా మొబైల్ దిగ్గజం జియోమీ [Xiaomi] కష్టాలలో పడ్డది ! చైనా మొబైల్ మార్కెట్ కష్టాలలో ఉందా ? అవును కష్టాలలో ఉంది అని గణాంకాలు తెలుపుతున్నాయి. మెయిన్ లాండ్ చైనాతో సహా విదేశాలకి ఎగుమతి చేసే జియోమీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగా తగ్గాయి. లేటెస్ట్ డాటా ప్రకారం రెండో త్రైమాసిక అమ్మకాలు [స్మార్ట్ ఫోన్లు ] 14.7% పడిపోయాయి. ఇది వరుసగా గత 5 త్రైమాసిక అమ్మకాలతో […]
ఈ పిరికి పెద్దన్నతో ఒరిగేదేంటి..? తమిళ కమలానికి ఫాయిదా ఏంటి..?
మోడీ, అమిత్ షా అత్యంత దూకుడుగా వ్యవహరిస్తూ బీజేపీ పార్టీ, కాషాయ విభాగాలు, పలు రాష్ట్రాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు… వచ్చే ఎన్నికల నాటికి మరింతగా ఆ ఇద్దరి పట్టు పెరగొచ్చు కూడా..! కానీ వాళ్లకు ఏమాత్రం మింగుడుపడని రాష్ట్రాలు ప్రధానంగా రెండు… 1) ఏపీ 2) తమిళనాడు… ఈ రెండు రాష్ట్రాల రాజకీయాల సరళి వాళ్లకు అంతుపట్టడం లేదు… కాస్త డొక్కశుద్ధి, నాయకత్వ లక్షణాలున్న ఒక్క నాయకుడు లేడు… ఏపీని కాసేపు వదిలేయండి, ఆ రాజకీయాలంటేనే బూతులు, […]
భేష్ ప్రశాంత్ నీల్… తెలుగు మూలాలతో బంధాలన్నీ అలాగే పదిలం…
ప్రశాంత్ నీల్… తను దర్శకత్వం వహించిన కేజీఎప్-2 ఎంతటి సంచలనమో తెలిసిందే కదా… 100 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ సినిమా దాదాపు 1200 కోట్లు కలెక్ట్ చేసింది… శాండల్‌వుడ్ నుంచి ఈ రేంజ్ చిత్రం గతంలో ఎప్పుడూ లేదు… ఇంతకీ ఎవరు ఈ ప్రశాంత్ నీల్..? అంతకుముందు ఎవరికీ తెలియదు పెద్దగా, కేజీఎఫ్-2 తరువాత తెలిసింది అందరికీ… ఆయన ఎవరో కాదు, మన తెలుగువాడే అని… మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్న సుభాష్‌రెడ్డి కొడుకే ప్రశాంత్… […]
- « Previous Page
- 1
- …
- 93
- 94
- 95
- 96
- 97
- …
- 149
- Next Page »