22 జనవరి… అంటే మొన్న… మొన్నటికి అక్కినేని మరణించి ఎనిమిదేళ్లు… సాధారణంగా జయంతికో, వర్ధంతికో మీడియా ఒకింత నివాళి అర్పించి, సొసైటీ వారిని స్మరించుకునేలా చేస్తుంటుంది… కానీ అక్కినేనికి ఆ నివాళి దక్కినట్టుగా కనిపించలేదు… నిజానికి మరణించేనాటికి తెలుగు సినిమా వయస్సు 83 ఏళ్లు అయితే, అందులో 75 ఏళ్లు అక్కినేనితో సంబంధం ఉన్న కాలమే… అంటే ఒకరకంగా అక్కినేని చరిత్ర, తెలుగు సినిమా చరిత్ర… ఎంత పాపులారిటీ ఉన్నా సరే, కన్నడ రాజకుమార్లాగే రాజకీయాల్లోకి రాలేదు… […]
కొత్తదేమీ కాదు… అప్పుడెప్పుడో మొదలై మళ్లీ కదిలింది… ఇంతకీ ఎవరీ వృింద..?!
కృష్ణ విృంద విహారి… అసలు సినిమా పేరే చాలామందికి నచ్చలేదు… పైగా ఇది కొత్త సినిమా ఏమీ కాదు… అప్పుడెప్పుడో స్టార్టయి, ఆగిపోయి, కాస్త కదిలి, మళ్లీ ఆగిపోయి, ఇప్పుడు మళ్లీ కదులుతోంది… మామూలుగానే వృంద అనే పేరు ఎవరికీ తెలియదు… పైగా వృంద అని రాస్తే సరిపోయేది… దానికి విృంద అని రాయడం దేనికో..? సరే, నేములోనేముందిలే అనుకుని వదిలేస్తే… నాగశౌర్య కొత్త లుక్కుతో కనిపిస్తున్నాడు… తన బర్త్‌డే సందర్భంగా ఈ లుక్కు ఏదో రిలీజ్ […]
పులుపు భాష, నాకుడు భాష… లేదా నరుకుడు భాష… ఐనా ఆస్కార్ రాదేంట్రా బాబూ..?!
మరక్కర్… మలయాళం సినిమా… పాన్ ఇండియా మూవీ, పలు భాషల్లో రిలీజ్ చేశారు… ఓ సముద్రవీరుడి కథను వీసమెత్తు అశ్లీలం లేకుండా, బూతు పాటలు లేకుండా, గలీజ్ సీన్స్ లేకుండా నీట్‌గా, భారీగా ప్రజెంట్ చేశారు…. జైభీం… తమిళ సినిమా… ఓ కమర్షియల్, పాపులర్ హీరో అయి ఉండీ, ఓ సోషల్ ఇష్యూను హైలైట్ చేస్తూ, పాత రియల్ సంఘటనల్నే సూర్య ఇంప్రెసివ్‌గా ప్రజెంట్ చేశాడు… తులమెత్తు అశ్లీలం కనిపించదు సినిమాలో…! రెండూ వేర్వేరు జానర్లు… కానీ […]
అత్తా అనొద్దట, అక్కా అనొద్దట… ఆది మాత్రం ఏమైనా అనొచ్చునట అనసూయను..!!
అనసూయకు బాగా కోపమొచ్చింది… అవును, ఆమె అంతే… ఇతర సెలబ్రిటీల్లాగా ఎవరేమైనా ట్రోలింగుకు దిగితే మూసుక్కూర్చోవడం కాదు, ఈమె మాటకుమాట సమాధానమిస్తుంది… అవసరమైతే కేసు పెట్టి, తాటతీస్తానురోయ్ అని బెదిరించగలదు కూడా… ప్రత్యేకించి ఆమె బట్టల మీదో, వేసే వేషాల మీదో కామెంట్స్ గనుక చేస్తే ఆమెకు చర్రుమంటుంది… అసహనంతో ఊగిపోతుంది… ఈమధ్య ఇన్‌స్టాలో AMA session (ask me anything) లో ఓ నెటిజన్ అడిగాడు… ‘‘నిన్ను ఆంటీ అని పిలవాలా..? అక్క అని పిలవాలా..?’’ […]
ఆహా… బాలయ్య ఓ గుడ్ హోస్ట్… మహేశ్‌బాబు ఎపిసోడ్‌కు హ్యూమన్ టచ్…
నిజం చెప్పాలంటే బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ అనే షోను హోస్ట్ చేయడం నాకూ నచ్చలేదు మొదట్లో… హీరోలు టీవీ షోలు చేయడం ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తారనీ, తమ పాపులారిటీని సుస్థిరం చేసుకుంటారనీ భావించేవాళ్లలో నేనూ ఒకడిని… నాని, జూనియర్, నాగార్జున తదితరుల బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు షోల హోస్టింగును అందుకే ఇష్టపడ్డాను… చిరంజీవి ఇందులో ఫ్లాప్… ఐనాసరే, బాలయ్య ఆహాలో షో చేయడం నచ్చలేదు… ఎందుకంటే..? టీవీ వేరు, ఓటీటీ వేరు… […]
ఆ వెగటు పాటతో ఇక డ్యూయెట్స్ పూర్తిగా మానేసిందిట వాణిశ్రీ..!!
Bharadwaja Rangavajhala…………. అనగనగనగా ఎదురులేని మనిషి అనబడే అశ్వనీదత్ సినిమా షూటింగు జరుగుతోంది. అందులో ఎన్టీఆర్ కథానాయకుడు. వాణిశ్రీ హీరోయిన్ను… కృష్ణా ముకుందా మురారీ అనే ఓ ఆకతాయి పాట షూటింగు జరుగుతోంది. షాట్ గ్యాప్ లో వాణిశ్రీగారు ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి … అన్నగారూ … ఆ పాటలో డాన్స్ మాస్టర్ చూపిస్తున్న మూమెంట్స్ గమనించారా … చాలా దుర్మార్గం గా ఉన్నాయనిపించింది నాకు … మీరు కాస్త ఆ డైరక్టర్ ని పిల్చి చెప్తే బాగుంటుంది కదా […]
సమంత మైండ్ ఫ్యాన్స్‌కు ఓ సుడోకు పజిల్… తాజాగా మరొకటి…
మీరు జాగ్రత్తగా గమనించండి… సెలబ్రిటీల సోషల్ మీడియా పోస్టులే కొన్ని వార్తల్ని పట్టిస్తాయి… ప్రత్యేకించి బ్రేకప్పుల్ని పట్టించేవి వాళ్ల సోషల్ మీడియా ఖాతాలే… ఇండస్ట్రీలో వినిపించే సమాచారాన్ని బట్టి న్యూస్ ప్లాట్‌ఫారమ్స్ రాస్తేనేమో వెంటనే ఖండఖండాలుగా ఖండిస్తుంటారు… కానీ వాళ్లే తమ ఖాతాల ద్వారా బయటపడిపోతుంటారు… సమంత, చైతూ విభేదాలు, విడిపోయి బతుకుతున్న తీరు ఎప్పుడు లోకానికి తెలిసింది..? ఎప్పుడో తెలుసు..? చాలామంది రాశారు… కానీ ఎప్పుడైతే సమంత తన పేరు పక్కన అక్కినేని అనే పదాన్ని […]
దిగ్దర్శకులు శ్రీశ్రీశ్రీ రాజమౌళి గారి దివ్యసముఖమునకు రాయునది ఏమనగా…
అల్లూరి సీతారామరాజు కథను దారుణంగా వక్రీకరించారనీ, ఒక ఆరాధ్యుడైన వ్యక్తి చరిత్రకు తప్పుడు బాష్యాలు చెబుతున్నారనీ మొన్న ఎవరో కోర్టులో ఆర్ఆర్ఆర్ సినిమా మీద కేసు వేశారని చదివాను… అదేరోజు సోషల్ మీడియాలో ఓ వీడియో కనిపించింది… కంటికింపుగా ఉంది… తమ ఆచారాల్ని, తమ నమ్మకాల్ని, తమ దేవుళ్లని కొన్ని మానవసమూహాలు పదిలంగా కాపాడుకునే తీరు అబ్బురంగా కూడా ఉంది… గోండులు నాగోబా జాతర కోసం గోదావరి గంగను తీసుకురావడానికి వెళ్లే దృశ్యం అది… ముందుగా ఆ […]
ఇప్పటి నిర్మాతలకు ‘‘అన్ని విద్యలూ తెలుసు’’… ఒకప్పటి నిర్మాతలు వేరు ఫాఫం…
Bharadwaja Rangavajhala………… పాపం నిర్మాతలు … ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే నాయనా … మరి ఆ యొక్క 1975 మార్చి పదహారో తారీఖున మద్రాసు పాండీబజార్ లో ఉండినటువంటి రాజకుమారి సినిమా హాలులో … ఆ యొక్క వైవి రావ్ ఉన్నాడు కదా … దరిమిలా నిర్మాతా … అంతకు ముందు డిటెక్టివ్ నవలల పత్రిక నడిపేవాడూ అతనూ … రోటీ అని మన్మోహన్ దేశాయ్ తీసిన .. రాజేశ్ ఖన్నా మరియూ ముంతాజూ […]
‘‘మీ తమ్ములుంగారికి సంగీత జ్ఞానం ఉందిట, చేయించుకొండి, మేమెంత..?’’
Bharadwaja Rangavajhala……….. దానవీరశూర కర్ణ విడుదలై నలభై ఐదు ఏళ్లయ్యిందని టీవీ 9 ఛానల్లో ఉదయం చూశాను. బానే ఉంది కానీ … ఆ సినిమాకు మొదట అనుకున్న సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు అనే విషయం చెప్తూ అనివార్య కారణాల వల్ల తప్పుకున్నారు అన్నారు . రాజేశ్వర్‌రావు గారు చేసిన ఓ ట్యూన్ వరుస కొంచెం సవరిస్తే బాగుండు అని త్రివిక్రమ రావు గారు అభిప్రాయపడడంతో సాలూరి వారు విరమించుకున్నారు… మర్నాడు ఎన్టీఆర్ ఫోన్ చేసి, […]
పేద్ద గన్ను పట్టుకుని… వాయించడానికి వచ్చేశాడు మరో ‘హీరో’…
నిఖిల్ గౌడ… మాజీ ప్రధాని దేవగౌడ మనమడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు… ఆ కుటుంబ రాజకీయానికి వారసుడు… ఆమధ్య సుమలత మీద జనతాదళ్ (ఎస్) తరఫున పోటీచేసి, ఓడిపోయాడు… పొలిటిషియన్ మాత్రమే కాదు, సినిమా హీరో… 4 సినిమాల్లో హీరో… జాగ్వార్ అని తెలుగులో కూడా వచ్చింది… రెండు పడవల మీద కాళ్లు వేసి, కథ నడిపిస్తూ ఉంటాడు… ఉదయనిధి స్టాలిన్… ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు, కరుణానిధి మనమడు… ప్రస్తుతం ఎమ్మెల్యే, డీఎంకే యూత్ వింగ్ […]
విఠలాచార్య..! జానపదం తీయాలంటే తిరుగులేని పేరు… ఎకానమీ దర్శకుడు…
Bharadwaja Rangavajhala…………… జై విఠలాచార్య…. విఠలాచార్య ఈ పేరు వినగానే చిన్నప్పుడేమిటి ఇప్పుడూ పూనకం వచ్చేస్తుంది. మా స్కూల్ డేస్ లో క్లాసురూమ్ లో విఠలాచార్య ప్రభావంతో రైటింగ్ పాడ్ ను డాలుగా పట్టుకుని చెక్క స్కేలును కత్తిగా చేసుకుని చేసిన యుద్ధాలన్నీ గుర్తొచ్చేస్తాయి. కాస్త హయ్యర్ క్లాసులకొచ్చాక విఠలాచార్య మీద బోల్డు సెటైర్లేసేవాళ్లం. మా చిగులూరి శ్రీనివాస్ అయితే అట్టలాచార్య అనేవాడు. అంతా సెట్టింగుల్లోనే కానిచ్చేస్తాడనేది వాడి ఆరోపణ. ఇక విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలకైతే […]
సూపర్ మచ్చి హీరోయిన్..! తెలుగు వెండితెరకు మరో కన్నడకస్తూరి..!
ఆమధ్య హీరోయిన్ కావాలంటే తమిళ, మలయాళ ఇండస్ట్రీ వైపు చూసేవాళ్లు… నటన తెలుసు, కష్టపడతారు, కమిటెడ్‌గా వర్క్ చేస్తారు, అందంగా ఉంటారు… ఇండస్ట్రీ పట్ల హంబుల్‌నెస్ కనిపిస్తుంది… తరువాత ఏమైంది..? కన్నడ కస్తూరి తెలుగు తెరను ఆవరించేసింది… అసలు బుల్లితెర హీరోయిన్లందరూ వాళ్లే… నిజానికి వాళ్లు కూడా బాగా చేస్తున్నారు… వెండితెరకూ వాళ్లే కనిపిస్తున్నారు… రష్మిక ఇప్పుడు ఎంత టాపో తెలుసు కదా… తాజాగా రచిత రామ్… చిరంజీవి అల్లుడు ‘విజేత’ సినిమా తరువాత తాజాగా సూపర్ […]
మరీ మేలిమిరకం బంగారమేమీ కాదు… జస్ట్, వన్ గ్రామ్ బంగార్రాజు మాత్రమే…
నిజానికి ఈ పండక్కి రావడం నాగార్జునకు ఆనందాన్ని, విజయాన్ని అందించాలి… థియేటర్లలో వేరే పెద్ద సినిమాలేమీ లేవు… హిట్ సినిమాలు పుష్ప, అఖండ మెల్లిగా పాతబడిపోయాయ్… ఓటీటీల్లోకి కూడా వచ్చేస్తున్నయ్… పండుగపూట సినిమాను చూడాలనుకునేవాళ్లకు బంగార్రాజు ఓ చాయిస్… నాగార్జున, రమ్యకృష్ణ, చైతూ, కృతిశెట్టి… సరదాసరదాగా సాగే కథ… గతంలో ఆరేళ్ల క్రితం హిట్టయిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్… దర్శకుడు కల్యాణ కృష్ణ కూడా పెద్ద ప్రయోగాల జోలికి ఏమీ పోలేదు… రిస్క్ లేని […]
తెలుగు తెరకు మరో వారసుడు నిర్బంధంగా రుద్దబడుతున్నాడు..!
నిర్మాతలు, దర్శకులు, పెద్ద హీరోలు తమ వారసులను ప్రేక్షకుల మీద రుద్దుతారు… వాళ్లు ప్రేక్షకుల తలలపైకి, సారీ, బుర్రల్లోకి ఎక్కి డాన్సులు చేస్తుంటారు… ఏం చేస్తాం మన ఖర్మ… ఒక్కడికీ నటన తెలియదు, వాచికం తెలియదు, బేసిక్స్ తెలియవు… దేభ్యం మొహాలు వేసుకుని, డాన్సులుగా పిలవబడే నాలుగు పిచ్చి గెంతులు నేర్చుకుని, ఆ ఫైట్లు వంటి రెండు సర్కస్ ఫీట్లు చేసేసి, ఇక సినిమా రంగాన్ని ఉద్దరిస్తున్నట్టే హైపులు, ప్రచారాలు, మీడియా పిచ్చి రాతలు… కొందరు నిలబడతారు, […]
బలిసి కొట్టుకోడంలో తప్పేం ఉందిరా బ్లడీ ఫూల్… బాగా ముదిరింది…
సినిమా టికెట్ల వ్యవహారం అక్షరాలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వైఎస్సార్సీపీ పార్టీ నడుమ పంచాయితీగా తయారైంది… ఎవరైనా సినిమా ప్రముఖుడు టికెట్ల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తే చాలు, వైసీపీ బ్యాచ్ విరుచుకుపడిపోతోంది… మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరూ తిట్టేస్తున్నారు… హీరోలకు నిర్మాతలు దోచిపెడుతున్న తీరు నుంచి హీరోల రెమ్యునరేషన్ల దాకా ప్రస్తావించేస్తున్నారు… సాధారణంగా సినిమావాళ్లు రాజకీయ నాయకుల జోలికి, ప్రభుత్వం జోలికి వెళ్లి ఏ విమర్శలూ చేయరు… జగన్ నిర్ణయం తమకు నష్టదాయకమే అయినా ఇండస్ట్రీలో […]
ఈసడించుకున్న సౌత్ హీరోలనే… అలుముకుని హారతులు పడుతున్నారు…
పుష్ప… 300 కోట్ల కలెక్షన్లు అనే అంకె కాదు ఆశ్చర్యపరిచింది… హిందీలో 80 కోట్ల దాకా చేరుకున్నాయి పుష్ప కలెక్షన్లు అనే పాయింట్ విశేషంగా కనిపిస్తోంది… హిందీ బెల్టులో అనేక ప్రాంతాల్లో కోవిడ్ ఆంక్షలతో థియేటర్లు సగం సగమే నడుస్తున్నయ్… ఐనా సరే, ఒక డబ్బింగ్ సినిమా స్ట్రెయిట్ హిందీ సినిమాను మించి దున్నేస్తోంది… రణవీర్ సింగ్ 83 సినిమా 90 కోట్ల దాకా కలెక్ట్ చేసిందని అంచనా… అంటే ఓ స్ట్రెయిట్ సినిమాకు దీటుగా మన […]
సూపర్ స్టార్ కృష్ణ విశ్వప్రయత్నం చేసీ చేసీ ఓడిపోయిన ‘ప్రాజెక్టు’..!!
సాధారణంగా మస్తు బ్యాక్ గ్రౌండ్ ఉండి, వారసులుగా తెర మీదకు అడుగుపెట్టే నటులకు కొన్ని మినహాయింపులు ఉంటయ్… పెద్దగా నటన తెలియకపోయినా, అసాధారణ ప్రతిభ చూపకపోయినా చల్తా… అభిమానులు ఉంటారు, ఎలాగోలా మార్కెట్ చేసేసి, చలామణీ చేసే శక్తులు ఇండస్ట్రీలో ఉంటయ్… ఫలానా హీరో కొడుకు, ఫలానా దర్శకుడి కొడుకు, ఫలానా నిర్మాత కొడుకు అంటూ ప్రేక్షకులు కూడా చూస్తూ, భరిస్తూ, పోనీలే పాపం అనుకుంటారు… ఐనాసరే, చాలామంది వారస హీరోలు క్లిక్ కాలేరు… నటన మరీ […]
ఫాఫం సునీల్..! ఈ ‘మంగళం సీను’ ప్రయాణానికి దశ లేదు, దిశ లేదు..!!
పర్సులు గుల్ల చేసుకుని, థియేటర్లకు వెళ్లి, సినిమా చూసే ఆసక్తి లేనివాళ్లు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో పుష్ప సినిమాను చూడటానికి నిన్న, మొన్న ఎగబడ్డారు… అచ్చంగా సినిమా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో… ఇరగ్గొట్టేశాడు… అనేక పాత్రలు వస్తుంటయ్, పోతుంటయ్… ఇక ఏపాత్రకూ ఏమాత్రం ప్రయారిటీ ఉండదు… రావురమేష్, అనసూయ, సునీల్ తదితరులు కూడా..! సినిమా చూస్తుంటే సునీల్ మీద జాలేస్తుంది… ఆ మంగళం సీను పాత్ర మీద కాదు, సునీల్ అనే నటుడి మీద..!! […]
అతిథి దెయ్యమో భవ…! మెంటల్ డిజార్డర్ అని మెంటల్ ఎక్కించావుగా బ్రో..!!
పదేళ్ల సినిమా ప్రయాణం… పేరు ఆది… సాయికుమార్ వంటి నటుడి వారసత్వం… కాస్త వాచికం, నటన తెలిసిన మెరిట్… చూడచక్కని రూపం… అబ్బే, ఇవన్నీ ఎవరిక్కావాలి..? ఆల్రెడీ ఇంకో ఆది ఉన్నాడు, తనకూ కెరీర్ భారీ ఎత్తుపల్లాలు… ఈ ఆది కూడా అంతే… ఒక్కటంటే ఒక్కటీ ‘ఇది నా సినిమా’ అని చెప్పుకునే సినిమా లేదు ఇప్పటికీ…! ప్రయత్నలోపం ఏమీ లేదు… కానీ ఇండస్ట్రీలో పనిచేసే అంశాల్లో ప్రతిభ ఒకశాతమే… మిగతా 99 శాతం బ్యాక్ గ్రౌండ్, […]
- « Previous Page
- 1
- …
- 98
- 99
- 100
- 101
- 102
- …
- 117
- Next Page »