ఎవరో వీరెవరో… కలవని ఇరు ప్రేమికులా..? విడిపోని యాత్రికులా..? వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే… ఊపిరొక్కటేలే… ఒక శ్వాసలా, నిశ్వాసలా… ఆటాడే విధే ఇదా ఇదా, కలవడం ఎలా..? కలా..? రాసే ఉందా..? ఈ రాతలే, దోబూచులే…… ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలోని ఓ పాట ఇది… ఇప్పటిదాకా మీరు చదివింది పాటలోని మొదటి భాగం… ఇరుప్రేమికులు అంటాడు, కలవరు అంటాడు, విడిపోని యాత్రికులు అంటాడు… మళ్లీ వెంటనే దారొకటే, కానీ దిక్కులు […]
#istandwithsuriya …. జైభీమ్ వివాదంలో హీరో సూర్యకు నెటిజనం భారీ మద్దతు…
నిజానికి ఇదొక నాటకం… ప్రతివాడూ ఏ సినిమాలో ఏముందో వెతకడం, ఓ పాయింట్ పట్టేసుకోవడం, గెలకడం, మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎమోషన్స్ రెచ్చగొట్టడం… మరీ అర్థంపర్థం లేని విషయాలనూ వివాదంలోకి లాగడం, ఓ లీగల్ నోటీస్ పంపించడం, తరువాత సంప్రదింపులు, బేరాలు గట్రా… అవి పెద్దగా పనిచేయడం లేదని ఈమధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు… ఆ సినిమా బాధ్యుడి మీద దాడి చేస్తే లక్ష, ఒక్కో దెబ్బకు వెయ్యి రూపాయలు… ఇలా రేట్లు, టారిఫ్ ప్రకటిస్తున్నారు… సోషల్ […]
RRR… సీఎం జగన్ తెలిసితెలిసీ ఆ తప్పెందుకు చేస్తాడు..?
అబ్బెబ్బె… నో, నో… మేం అస్సలు కోర్టుకు పోవడం లేదు… పోయే ఉద్దేశమే లేదు… కాకపోతే మా సినిమాకు జరగబోయే నష్టంపై సీఎంను కలుస్తాం, పరిష్కారం చూపమని అడుగుతాం……… ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య ట్విట్టర్లో అధికారికంగానే పోస్ట్ చేశాడు ఇలా..! ఇండస్ట్రీలో మామూలు వ్యక్తిని కదిలించినా సరే… ‘‘అవును కదండీ, టికెట్ల ధరలు తగ్గిస్తే నిర్మాతలకు నష్టం కాదా..? లవ్ స్టోరీ సినిమాయే చూడండి, తెలంగాణలో మంచి వసూళ్లు, ఏపీలో నష్టాలు… దానయ్య అడిగేది సబబే కదండీ’’ […]
ఈ అఖండ బాలయ్య పంచ్ డైలాగ్ జగన్ పైనేనా..?
బోయపాటి…. మితిమీరిన హీరోయిజాన్ని చూపిస్తాడు… బాలయ్య… అచ్చం బోయపాటికి తగిన హీరో… ఇప్పటికీ అదే టెంపర్, అదే స్టయిల్… సినిమాల్లో ఎవడెన్ని ప్రయోగాలైనా చేసుకోనీ, తన సినిమాలు మాత్రం సూపర్ హీరోయిజంతో దద్దరిల్లాల్సిందే… బ్లడ్డు, బ్రీడు టైపు పంచ్ డైలాగులు పడాల్సిందే… అవీ ఎంజాయ్ చేసేవాళ్లు ఉంటారు, అది వేరే కథ… అయితే పొలిటికల్ పంచులు వేయడం బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో తొలిసారి కావచ్చు బహుశా… రాబోయే అఖండ అనే సినిమా ట్రెయిలర్ రిలీజ్ అయ్యిందిగా… అందులో […]
అమ్మో… అమ్మే…! టాప్ రేటెడ్ తెలుగు డైలాగుల్లో బహుశా ఇదే నంబర్వన్..!
….. By……. Bharadwaja Rangavajhala………… అమ్మో అమ్మే …! మాయాబజార్ సినిమాలో శశిరేఖ రూపంతో శయ్యాగృహంలో పడుకుంటాడు ఘటోత్కచుడు. కాస్త అస్తవ్యస్తంగా బోర్లా పడుకుని ఉంటాడు. ఇంతలో … చెలికత్తెలు వచ్చి నిద్రలేపే ప్రయత్నం చేస్తారు. శశిరేఖ రూపంలోకి మారిన తొలిరోజే కావడంతో ఘటోత్కచుడికి చప్పున తను ఎక్కడున్నదీ స్ఫురించదు. తన గొంతుతో స్పందించే ప్రయత్నం చేస్తాడు. కళ్లు తెరిపిడి పడ్డ తర్వాత కాస్త ఈ లోకంలోకి వచ్చి … నెమ్మదిస్తాడు. అయినా పూర్తిగా నిద్ర వదలదు […]
చంద్రబోసూ… నీపాటకన్నా నీ వివరణ మహా ‘చెడ్డనాటు’గా ఉందబ్బా…!!
సహజమే… ఏ పాటల రచయితకైనా తను రాసిన పాటంటే సొంత బిడ్డ… తనకే ముద్దు… సమర్థించుకుంటాడు… కోవాలి… అయితే అది అన్నిసార్లూ కాదు… కొన్నిసార్లు నోరు మూసుకోవాలి… అదే ఉత్తమం… ఈ విషయం దిగుదిగుదిగునాగ అని ఓ బూతు పాట కుమ్మేసిన అనంత శ్రీరాంకు తెలుసు, ఏంది పిల్లగా, ఓ భక్తి పాటను, ఇలా ఓ బూతుపాటను చేసేశావ్ అని ఫేస్బుక్లో జనం బూతులు తిడితే ఇక సైలెంట్ అయిపోయాడు… తనకు తెలుసు, తన ఆత్మకు తాను […]
కథ, జానర్ వోకే… కానీ కాయ పండలేదు, వంట ఉడకలేదు… కొట్టేసింది…
సమస్య ఎక్కడొస్తున్నదంటే… తెలుగు టీవీ సీరియళ్ల దర్శకుల్లాగే కొందరు సినిమా దర్శకులు కూడా తమకు అన్నీ తెలుసనుకుంటారు… లాజిక్కులు వదిలేస్తారు, అసలు వాళ్లకు సబ్జెక్టు తెలిస్తేనేమో తాము లాజిక్కులకు దూరంగా వెళ్తున్నామనే స్పృహయినా ఉండేది… సీబీఐ, రా, ఎన్ఐఏ పాత్రలు అనగానే సూపర్ హీరోల్లాగా చిత్రీకరించేయడం వరకూ వోకే, కానీ వాళ్ల ఆపరేషన్లు ఎలా ఉంటాయో కనీసం బేసిక్స్ తెలుసుకుంటే బాగుంటుంది… ఏ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర పది నిమిషాలు టైం తీసుకున్నా అర్థమయ్యేలా చెప్పగలరు… నిజానికి […]
డిఫరెంట్ స్టోరీ… ఆనంద్ గుడ్ డెసిషన్… ప్చ్, పూర్ ప్రజెంటేషన్…
అప్పట్లో పుష్పక విమానం ఓ సంచలనం… సింగీతం దర్శకత్వం, కమల్ హాసన్ నటన, అమల అందం… అబ్బే, అవి కాదు… అసలు మాటల్లేని సినిమా… ఏ భాష ప్రేక్షకులు చూసినా అర్థమవుతుంది… మంచి టెంపో బిల్డప్ చేస్తూ చివరి దాకా భలే నడిపిస్తారు కథను… అలనాటి మంచి టైటిళ్లను కూడా భ్రష్టుపట్టించడం కూడా ఇప్పటి ట్రెండ్… ఆ పని ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా చేశాడు… నేములో నేముంది, సినిమా బాగుంటే సరిపాయె అనుకుంటాం, పైగా విజయ్ […]
గిరిజన ఆరాధ్యులకు అవమానం… రాజమౌళి ‘క్రియేటివ్ లిబర్టీ’ తప్పుదోవ…
ఒక మిత్రుడు ఇన్బాక్సుకు వచ్చి మరీ నిలదీశాడు…. నాటు మోటు పాట మీద ఏదేదో రాశావు, నువ్వేం రాశావో నీకు తెలుసా అసలు అని…! నిజమే… తెలుగు సినిమాను మార్కెట్పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిని కదా అనాల్సింది… చారిత్రిక పాత్రలను వెకిలి చేసి, సినిమాటిక్ లిబర్టీ పేరిట అవమానించే ఆ దర్శకుడిని కదా అనాల్సింది… మనదే తప్పు… కాపీ డైరెక్టర్ అంటే చాలామందికి కోపం… కాపీ డైరెక్టర్ కానివాడెవ్వడు అని ఎదురు ప్రశ్నిస్తారు… అదేదో విజయశాంతి […]
నాటు… ఘాటు… మోటు… ఫాఫం చంద్రబోస్… ఏం రాశాడో తనకైనా తెలుసా..?!
ఫాఫం, రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్ల తప్పేమీ లేదు… మాంచి జోష్, ఎనర్జీ, కోఆర్డినేషన్తో స్టెప్పులేశారు… ఇలాంటి డాన్సులకు ఇద్దరివీ మంచి ఫ్లెక్సిబుల్ బాడీస్… అయితే ఒక కుమ్రం భీం, ఒక అల్లూరి ఎక్కడ కలుస్తారో, ఆ మోడరన్ ప్యాంట్లూ షర్టులు బూట్లేమిటో, ఈ స్టెప్పులేమిటో, వీటిని చూసి ఆ విదేశీ మహిళ ఆనందంతో పొంగిపోవడం ఏమిటో…. ఏమోలెండి, అంతా రాజమౌళి కథ, మన ప్రాప్తం… ఎక్కడికో, ఎవరికో, ఏ కాలానికో, ఏ లింకులో పెట్టేసి, జనాన్ని మాయ […]
జై సుమక్క..! పోస్టర్లోనే రోళ్లు పగిలిపోతే… ఇక ఫుల్ సినిమాలో ఏ రేంజ్ బీభత్సమో..!!
మోషన్ పోస్టర్ అంటారు… సినిమా గురించి సంక్షిప్త పరిచయం అన్నమాట… సీనియర్ మోస్ట్ యాంకర్ సుమ ఓ ఊరి పెద్దగా కనిపించడం, రోకలి తాకగానే రోలు పగిలిపోవడం…. హహహ… సుమా… పోస్టర్లోనే ఇంత నవ్వించావంటే… ఎస్, ఖచ్చితంగా ఈ సినిమాలో నువ్వు ఇంకా నవ్వులు పూయించడం గ్యారంటీ… అసలు టీవీ తెర మీద, ఫంక్షన్లలో నిన్ను చూడగానే నవ్వొస్తుంది… నీ స్పాంటేనిటీ, నీ పంచులు, నీ నవ్వులు ఆహ్లాదాన్ని ఇస్తాయి… నవ్విస్తాయి… క్యాష్ గానీ, మరో టీవీ […]
పోరి, వయ్యారి, మగసిరి… కొన్ని పదాలు మరిచిపోయావేంఆచార్య అనంత శ్రీరాం…?!
పద్మావతీ పద్మావతీ, నీ ఎర్రని మూతి, చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి, దాంతో నీ పనైపోయింది అధోగతి…….. ఈ డైలాగ్ గుర్తుందా మీకు..? చూడాలని ఉంది అనే సినిమాలో చిరంజీవి, సౌందర్యల మధ్య ఓ సంభాషణ… భలే కామెడీ… బాగా పాపులర్ కూడా…! ఒకరకంగా సెటైర్ మన కవిత్వం తీరుపై…!! మరి అదే ధోరణి అదే చిరంజీవి తాజా సినిమాలోని ఓ పాటలో ఉంటే..? ఆహా, ఓహో అని చప్పట్లు కొట్టాలా… […]
ఈ అర్థం లేని హెడేక్ ఫైట్లు ఇంకా ఎన్నిరోజులు చూడాలి విశాల్..?!
సినిమా అంటేనే ఓ దందా… కమర్షియల్ లెక్కలు చూసుకోవాల్సిందే… లేకపోతే ఇండస్ట్రీలో ఉండలేరు, నెత్తిన బట్టేసుకుని పారిపోవాలి… అయితే ఆ కమర్షియల్ లెక్కలు కూడా ఓ కథలో ఇమడాలి… సినిమా అంతా కన్నీళ్లు పారించినా, డిష్యూం డిష్యూం మోతమోగించినా, రొమాంటిక్ సీన్లు దట్టించినా జనం చూడరు… మరీ ఇప్పటితరం ప్రేక్షకులు మన సినిమా మార్కు సూపర్ మ్యాన్ ఫైట్లను చూడటం ఎప్పుడో మానేశారు… కాకపోతే మన హీరోలకు ఇంకా సమజైతలేదు… మొన్న గోపీచంద్ సినిమా ఏదో వచ్చింది, […]
మంచిరోజులు ఎక్కడొచ్చాయి..? తెలుగు ఇండస్ట్రీకి ఇదేం శాపంరా భయ్…!!
అసలు దర్శకుడు మారుతి అంటేనే మొదటి నుంచీ వెగటు… అడల్ట్ కామెడీ సినిమాలు తీసేవాడు మొదట్లో… సరే, తన టేస్టు అదే అనుకుని ప్రేక్షకులు కూడా ఫోరాభయ్ అని తేలికగా తీసుకున్నారు… తరువాత ట్రాక్ మార్చాడు… ఏదో ఓసీడీ అని, మతిమరుపు అని కొత్త కాన్సెప్టులు తీసుకుని కథలల్లాడు… ఏవో సినిమాలు తీశాడు, పర్లేదు, మారుతి మారాడురోయ్ అనుకున్నారు ప్రేక్షకులు… కానీ తనలో పెద్ద మెచ్చుకోదగిన క్రియేటివిటీ, మన్నూమశానం ఏమీ లేదనే సందేహం అలాగే ఉండిపోయింది… దానికి […]
ఇండస్ట్రీకే పెద్దన్నవు..! మరీ ఇంతగా జారిపోయావేమిటన్నా..? వదిలేస్తే పోలా…!!
కెరీర్ ఉచ్చదశలో ఉన్నప్పుడు, ఇక దిగడమే ఎక్కే నిచ్చెనలేమీ లేనప్పుడు… రిటైర్మెంట్ ప్రకటించగలవాడు, ఆ దశను గుర్తించగలవాడు గొప్పోడు… రాజకీయాలు గానీ, సినిమాలు గానీ, క్రికెట్ గానీ… అది ఏరంగమైనా సరే, ఇక మనం గుదిబండలం కాబోతున్నాం అనే స్పృహ తెలిసినవాడే గొప్పోడు… లేదంటే జనమే తిరస్కరిస్తారు… అది ఏ రేంజ్ సెలబ్రిటీకైనా వర్తిస్తుంది… సూపర్ స్టార్ రజినీకాంత్కు ఇంకా ఆ సోయి రాలేదు… ఒకవైపు అదే తమిళంలో జైభీమ్ వంటి మంచి మంచి ప్రయోగాత్మక, జన […]
పాపం పసివాడు..! బాల్యం కరిగిపోయేసరికి ఇండస్ట్రీ అలా వదిలేసింది..!!
………. By….. Bharadwaja Rangavajhala……………. పాపం పసివాడు… అతని పేరు రాము. అది కేవలం సినిమా కోసం పెట్టుకున్న పేరే … అసలు పేరు చాంతాడంత ఉందనీ మనం వేసేది ఎటూ చైల్డ్ రోల్సే కాబట్టి అంత పేరు ఎబ్బెట్టుగా ఉంటుందనీ తలంచి రాము చాలనుకున్నాడు. అయినప్పటికీ అసలు పేరు చుక్కల వీర వెంకట రాంబాబు. అయ్యిందా, ఇహ ఊరు విషయానికి వస్తే … బెజవాడ. మరి ఆ రోజుల్లో బెజవాడ అంటే తెలుగు సినిమా […]
జై భీమ్..! ఈ సినిమాను ఎందుకు మెచ్చుకోవచ్చునంటే..?
అత్యంత వెనుకబడిన, అణగారిన ఇరులార్ ఆదివాసీ తెగ సంక్షేమం కోసం హీరో సూర్య, జ్యోతిక దంపతులు కోటి రూపాయల విరాళాన్ని పళంకుడి ఇరులార్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు ముఖ్యమంత్రి స్టాలిన్ సాక్షిగా అందించిన ఫోటో, వార్త చూశాం కదా… ఆ ట్రస్టును మాజీ లాయర్, జస్టిస్ చంద్రు నడిపిస్తున్నాడు… ఆ కథనానికి మనం చప్పట్టు కొట్టాం కదా, ఎంత మంచివాడవురా అని మెచ్చుకున్నాం కదా… ఈ వార్తకు నేపథ్యం తను తీసిన జైభీమ్ సినిమా… ఆ సినిమా అమెజాన్లో […]
కేసినో @ ఫామ్ హౌజు..! దిగుదిగుదిగు నాగ… ఆ హీరో నాగశౌర్య చేసిన తప్పేమిటంటే..?
నిజానికి పైపైన చూస్తే ఈ పేకాట దందాలో హీరో నాగశౌర్య తప్పేమీ ఉన్నట్టు అనిపించదు… కానీ మరో కోణంలో చూస్తే తన తప్పులూ కొన్ని కనిపిస్తయ్… అదేనండీ… హైదరాబాద్ శివారులో ఓ ఫామ్ హౌజులో పోలీసులు పేకాట దందాను బ్రేక్ చేసి, 30 మందిని అరెస్టు చేశారనీ, అందులో రాజకీయ నాయకులు, కంట్రాక్టర్లు ఉన్నారనే వార్త… ఇక్కడ కొన్ని అంశాలు ప్లెయిన్గా చెప్పుకోవాలి… హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రిసార్టుల్లో, ఫామ్ హౌజుల్లో డ్రగ్ పార్టీలు, రేవ్ పార్టీలు, […]
టాలీవుడ్ రేంజ్ చాలా పెద్దది… కానీ అవార్డుల జాబితాల్లో జాడే కనిపించదు…
ఓ మిత్రుడు అడిగాడు… ఆస్కార్ ఎంట్రీ కోసం పద్నాలుగు సినిమాల్ని జ్యూరీ పరిశీలనకు తీసుకుంది కదా… అవి ఏవి అని..? చెబుతాను… ఆస్కార్ ఎంట్రీకి పంపించిన తమిళ సినిమా కూళంగల్ గాకుండా… సర్దార్ ఉధమ్ (హిందీ), లైలా ఔర్ సత్త గీత్ (గోజ్రి), షేర్ని (హిందీ), చెల్లో షో (గుజరాతీ), నాయత్తు (మలయాళం), బ్రిడ్జి (అస్సామీ), షేర్ షా (హిందీ), మండేలా (తమిళం), కాగజ్ (హిందీ), అట్ట వేల్ జాలి (మరాఠీ), తూఫాన్ (హిందీ), గోదావరి (మరాఠీ), […]
నీట్ వధువు… ఫెయిర్ వరుడు… క్లీన్ సినిమా…! కొన్ని మెచ్చే అంశాలున్నయ్..!
వరుడు కావలెను… ఈ సినిమా గురించి చెప్పాలంటే కాస్త హీరో నాగశౌర్య అసాధారణ పోకడ గురించి చెప్పాలి… సాధారణంగా తెలుగులో హీరో అంటే అంతా తనే అయిఉండాలి… తనే సినిమాను డామినేట్ చేయాలి… ప్రతి సీనూ తనదే… ప్రతి పంచ్ డైలాగూ తనదే… ఇంకెవరికీ ఏ ప్రాధాన్యమూ ఉండకూడదు… అన్నీ ఉత్తుత్తి సొల్లు పాత్రలే కావాలి…. అలా అనిపిస్తాయి కదా మన తెలుగు సినిమాలు… కానీ ఈ సినిమాలో నాగశౌర్య ఆ భేషజాల జోలికి పోకుండా, ఆ […]
- « Previous Page
- 1
- …
- 102
- 103
- 104
- 105
- 106
- …
- 117
- Next Page »