స్వాతి వీక్లీలో ఏముంటుంది..? ఏమీ ఉండదు… కానీ సరసమైన కథ ఉంటుంది… ఆ వీక్లీ హిట్టయింది దాంతోనే… ఒక సమరం ప్రశ్నలు-సమాధానాలు, ఒక సరసమైన కథ… వాటిల్లో చర్చించబడేవి సరసమైన అంశాలే… చెప్పుకునేవి శృంగారానికి సంబంధించిన విషయాలే… అయితేనేం..? అవేవీ ఒక కనిపించని గీత దాటవు… అందుకే రంజింపచేస్తయ్, రక్తికట్టిస్తయ్… బోల్డ్ కంటెంట్‌పైనే బోలెడు సంగతులు చెబుతయ్… గతంలో సంభోగాల్ని, అక్రమ సంబంధాల్ని వర్ణిస్తూ పచ్చిపచ్చిగా కథల్ని పబ్లిష్ చేసిన చిన్న చిన్న పుస్తకాలు దొరికేవి మార్కెట్లో… […]
కాబట్టి కామ్రేడ్స్… వయోవృద్ధ హీరోలపై రివ్యూలు రాసేటప్పుడు జాగ్రత్త…
సపోజ్, పర్ సపోజ్… సరదాగా… ఓ చిన్న ఊహ… చిరంజీవి ఈ వయస్సులోనూ యంగ్ స్టెప్పులేసిన అమ్మడూ లెట్స్ డు కుమ్ముడూ పాట గురించి ప్రస్తావిస్తూ… హబ్బ, మీరూ, మీ పక్కన మీ మనమరాలు కాజల్ భలే ఉన్నారండీ అని ఎవరైనా సినిమా విమర్శకుడు రాస్తే…! ఎఫ్2 సినిమాలో వెంకటేష్, తమన్నాల విషయంలో గానీ… మన్మథుడు2 సినిమాలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జోడిపై గానీ… పైసా వసూల్ సినిమాలో బాలయ్య, ముస్కాన్‌పై గానీ… పోనీ, మరేదో […]
ఓహో, ఆయనేనా శంకరాభరణం శంకరశాస్త్రి పాత్రకు ప్రేరణ… మరి ఆ శిష్యుడు..?!
………. By….. Amarnath Vasireddy………. శంకరాభరణం : ఈ సినిమా గురించి తెలియని తెలుగు వారుండరు. ఇది సినిమా రివ్యూ కాదు. ఒక వ్యక్తిత్వంపై సమీక్ష. నేను ఈ సినిమా చూసేనాటికి లోకజ్ఞానం తెలియని బాలుడు. అటుపై సినిమా పూర్తిగా చూసే అవకాశం దక్కలేదు. పొద్దునే యూట్యూబ్ లో మొత్తం సినిమా చూసాను. సినిమా గొప్పతనం గురించి, కర్ణాటక సంగీతం గురించి ఇక్కడ రాయడం లేదు. సూర్యకాంతి మొక్కకు సూర్యుడి పరిచయం అవసరం లేదు. చెప్పాలనుకున్నది శంకరశాస్త్రి […]
ఎన్టీవోడు ఎగరాలె, చక్రవర్తి కొట్టాలె, వేటూరి రాయాలె, బాలు పాడాలె… అదీ లెక్క..!
….. By…… Bharadwaja Rangavajhala………… పాటసారి… వేటూరి కృష్ణాజిల్లా, పెదకళ్ళేపల్లి గ్రామంలో వేటూరి ప్రభాకరశాస్త్రుల తమ్ముడి కొడుకుగా 1936 జనవరి 29 వ తేదీన జన్మించిన వేటూరి సుందరరామ మూర్తి తెలుగు సినీ పాటలతోటలోకి విచిత్రంగా ప్రవేశించాడు. తోటమాలిగా మారతాడని… అందమైన, అద్భుతమైన పాటల సేద్యం చేస్తాడని ఆనాడు ఎవరూ ఊహించి ఉండరు. ఆయనే ఓ పాట రాశారు … పాటల తోటలో ఆమని పూటలో ఎక్కడికి వెడతావూ ఏదీ కాని వేళలో .. వచ్చిపో మా […]
ఇంటిపేరు చేంబోలు… తెరపేరు సిరివెన్నెల… ఐనా సీతారావుడికి ఏపేరైతేనేం..?!
…… By…… Gottimukkala Kamalakar …….. #లైఫ్_ఆఫ్_సీతారామ్ ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా అంటూ ప్రకటించినవాడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం దండగ..!! ఐనా….., **** అనగనగా ఓ బాధ్యత గల అంకులు ” సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ..!” అంటూ నైరాశ్యంలో పాడుకునేవాడు. అప్పుడప్పుడూ ” తెల్లారింది లెగండోయ్.. కొక్కొరొక్కో..! అంటూ భవిష్యత్తు మీద ఆశ గలిగినా, ” ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ..! ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమీ..!” అంటూ ధైర్యం చెప్పుకున్నా, ఎదురుగా కనిపించే వాస్తవం “అర్ధశతాబ్దపు అన్యాయానిని […]
చప్పట్లే చప్పట్లు… కర్ణన్ చూశాక పదే పదే గుర్తొచ్చే కేరక్టర్… శెభాష్ లాల్…
M.P.మైఖేల్ అలియాస్ లాల్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల నుంచి బాగా అప్లాజ్‌కు నోచుకుంటున్న పేరు… కర్ణన్ సినిమాకు బహుళ ప్రశంసలు వస్తున్నయ్… ఆ ధనుష్‌కూ, ఆ దర్శకుడికి కూడా మంచి అభినందనలే దక్కుతున్నయ్… అదేసమయంలో లాల్ నటనకు కూడా చప్పట్లు పడుతున్నయ్… అర్హుడే… నిజానికి తను కొత్తేమీ కాదు… ఆమధ్య సుల్తాన్‌లో కూడా ఉన్నాడు… సాహోలో ఉన్నాడు… అప్పట్లో పందెంకోడిలో కూడా కనిపించాడు… తన వయస్సు ఎంతో తెలుసా..? 62 ఏళ్లు… ఐనా సరే, అలా కనిపించడు… […]
ఆమె కోణంలో సినిమాను చూస్తే సూపర్… చూడాల్సిన అవసరమూ ఉంది…
………..From Gopi Dara.. Facebook wall….. “The Great Indian Kitchen” (Malayalam Film) @@@ ఆమె మనిషే… స్త్రీని వంటగదికి, పడకగదికి పరిమితం చేసే సమాజం 20వ శతాబ్దంలో కొంత స్పృహ తెచ్చుకుని ఆమెను కాస్త బయటకు రానిచ్చింది. అయితే భద్రత మాత్రం ఇవ్వలేకపోతోంది. ఈ 21వ శతాబ్దంలో కూడా ‘ఆమె’ విషయంలో సమాజం సంస్కారం పొందలేదు. ఇప్పటికీ ఆమెను వంటగదికి, పడకగదికి పరిమితం చేసే కుటుంబాలు చాలా ఉన్నాయి. మహాఅయితే గుమ్మంలో ఊడ్చి ముగ్గేయడానికి, […]
నిజమేనబ్బా..! సినిమాయే కదా, ఎవరైనా తీసేయొచ్చు… ఈ సినిమాలాగే…
బడా బడా నిర్మాత బాబులు, దర్శక బాబులు, హీరో బాబులు, బ్రోకర్ బాబులు, డిస్ట్రిబ్యూషన్ బాబులు, బయ్యర్ బాబులు…. బాబులందరూ కలిసి కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమాను రోగగ్రస్తం చేశారు… అత్యంత పవర్ఫుల్ క్రియేటివ్ కమ్యూనికేషన్ సినిమా… జనానికి చైతన్యాన్ని, జ్ఞానాన్ని మాత్రమే కాదు, అపరిమితమైన వినోదాన్ని కూడా పంచగల మాధ్యమం… ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కొత్త కెరటాలు వస్తున్నయ్… బూజును, పాచిని ఎంతోకొంత కడిగేస్తున్నయ్… ఆ దిశలో ఎవరు కదిలినా చప్పట్లు కొట్టాలనిపిస్తుంది… అలాగని ప్రతి ప్రయోగాన్ని […]
కర్ణన్..! ఒక ధిక్కారపతాక..! తెలుగులో ఇలాంటి మూవీస్ ఎందుకు తీయరు..?!
మహాభారతంలో కర్ణుడు .. క్షత్రియుడా …? శూద్రుడా ? కవచ కుండలాతో కుంతీదేవికి సూర్యుని మహిమతో పుట్టినవాడిని శూద్రుడని ఎలా అంటారు .. పెళ్లికాకుండానే పుట్టాడని అతడిని వదిలేస్తుంది కుంతీమాత.. అలా వదిలేసిన వాడిని శూద్ర కులస్తులు పెంచుకుంటారు .. అయితే ఇక్కడ కర్ణన్ సినిమాలో హీరో క్షత్రియ మాతకు పుట్టిన శూద్రుడు కాదు .. కర్ణుడి మాదిరి కవచ కుండలాలు లేవు … కానీ అతడు అణగారిన వర్గంలో అణిచివేతకు గురైన కులంలో పుట్టినవాడే .. […]
పువ్వులనడుగు… నవ్వులనడుగు… రివ్వున ఎగిరే గువ్వలనడుగు… ఇతనేమిటో…
……… By….. Bharadwaja Rangavajhala……. ఒక వేణువు వినిపించెనూ…. ఘంటసాల తర్వాత తొలినాళ్లలో జూనియర్ అయినా రామకృష్ణ, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం జండా ఎగరేశారు. మరో గాయకుడికి అవకాశం రావడం కష్టంగా మారిన సందర్భం అది. అలాంటి సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన మురళీమోహన్, ప్రసాద్ బాబు లతో పాటు చిరంజీవి లాంటి కొత్త హీరోలకు పాటలు పాడడానికి ఓ గాయకుడు అవసరమయ్యాడు. ఆ లోటును భర్తీ చేసిన వాడు జి.ఆనంద్. గాయకుడుగా ప్రవేశించి సంగీత దర్శకత్వమూ […]
బాలయ్య అంటే ఆ బాలయ్యే కాదు… ఈ బాలయ్యదీ ఓ సక్సెస్ స్టోరీయే..!
….. By…… Bharadwaja Rangavajhala………………. అమృతా ఫిలింస్….. నటులు నిర్మాతలు కావడం క్వైట్ కామన్. తాము అనుకున్న పాత్రలు చేయడం కోసం కొందరు నిర్మాతలుగా మారితే…తాననుకున్న కథలతో చిత్రాలు తీయడానికి నిర్మాణ రంగంలోకి దూకేశారు ఇంకొందరు. నటుడు మన్నవ బాలయ్య సెకండ్ కేటగిరీలోకి వస్తారు. ఇంజనీరింగ్ చదివి సినిమాల్లోకి వచ్చిన బాలయ్య… ఉన్నట్టుండి నిర్మాతగా మారారు. బాలయ్య రాసిన కథలు కొన్ని పత్రికల్లో అచ్చయ్యాయి కూడా. దీంతో తన కథలతోనే స్వంత చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. సక్సస్ […]
ఓ ఊరికథ మాత్రమే కాదు… ఎన్నెన్నో బతుకుకథల్ని ‘తెర‘చి చూపినవాడు…
ఓ ఊరి కథ అంటూ మన ఊరికొచ్చి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పనోరమా విభాగంలో తెలుగు సినిమాకు పట్టం కట్టించిన దర్శకుడు మృణాల్ సేన్. 25వ జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ జాతీయ చలన చిత్ర పురస్కారానికి ఎంపికైన సినిమా ఆ బెంగాలీ దర్శకుడి మెగాఫోన్ తో రూపుదిద్దుకున్న ఓ ఊరికథ. మరి భారత్ గర్వించదగ్గ పేరెన్నికగన్న దర్శకుల్లో ఒకరైన సేన్ పుట్టినరోజున ఆయన సంస్మరణే ఈ యాది. రెగ్యులర్ అండ్ రొటీన్ ప్యాటర్న్ సినిమాను ఆఫ్ […]
నాయట్టు…! ఓ చిన్న లైన్… బిగిసడలని కథనం… భలే తీశావ్ బ్రదరూ…!!
……… by……. Ashok Vemulapalli………. NAYATTU………. కొన్నిసినిమాలు చూశాక ఆ మూడ్ నుంచి చాలా రోజుల వరకూ బయటకు రాలేము.. ఆ సినిమాల ముగింపు కూడా ప్రేక్షకులకే తేల్చుకోండని వదిలేస్తాడు డైరెక్టర్.. వ్యవస్థలో ఉండే లోపాలు, కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యాధ్వేషాలు అన్నీ కొన్ని సందర్భాల్లో మనిషి మీద రిఫ్లెక్ట్ అవుతాయి.. బయటి శతృవులు చేసే దాడి ముందే తెలిస్తే మనం కూడా ఆయుధాలతో సిద్దంగా ఉండి ఎదుర్కోవచ్చు.. కానీ ఇంట్లోనే శతృవులు ఉంటే ఎప్పుడు, ఎలా దాడి […]
అరె, గిదేం సినిమార భయ్..? గిట్ల తీసి పాడుచేసిన్రు… ఇంకా ఏకాలంలో ఉన్నర్ర భయ్..?!
మనం వేస్టనవసరంగా తెలుగు సినిమాల్ని, తమిళ సినిమాల్ని.., మన క్షుద్ర హీరోల పిచ్చి చేష్టల్ని, సూపర్ మ్యాన్ ఫైట్లని, తలతిక్క గెంతుల్ని, దిక్కుమాలిన కథల్ని, తోలుబొమ్మల హీరోయిన్లను, చెత్తచెత్త పాటల్ని చూసేస్తూ… తెగతిట్టేసుకుంటున్నాం, జుట్లు పీకేసుకుంటున్నాం… వీళ్లెప్పుడు మారతారో కదా అని తెగకన్నీళ్లు కార్చేస్తున్నాం గానీ…….. ది గ్రేట్ సల్మాన్ ఖాన్ నటించినట్టనిపించేసిన, ది గ్రేటర్ ప్రభుదేవా దర్శకత్వించిన, ది గ్రేటెస్ట్ జీగ్రూపు విడుదలించిన రాధే అనే సినిమా చూస్తే మన బాధ ఇట్టే మాయమైపోతుంది… మన […]
థాంక్యూ బ్రదర్… గంటన్నరతో ఆపేశావ్ సినిమా… నీకు భూతదయ ఎక్కువే…
‘‘గతంలో కాస్త సిన్సియర్ రివ్యూలు పెట్టే కొన్ని సైట్లు కూడా పర్లేదు అనేసరికి… నమ్మి మోసపోయి… థాంక్యూ బ్రదర్ అనే సినిమా చూడటం స్టార్ట్ చేశా… కాసేపటికే అర్థమైంది… వాళ్లు కూడా యాడ్స్‌తో మేనేజ్ చేయబడుతూ, డప్పు రివ్యూలు రాస్తున్నారు అని… మరీ ఈ సినిమా షార్ట్ ఫిలిమ్‌కు కాస్త ఎక్కువ సినిమా మాత్రమే అని… నిజానికి షార్ట్ ఫిలిమ్స్ కొందరు బాగా తీస్తున్నారు… మరీ ఇది ఏ కోవలోకీ రాదు… ఓటీటీ అంటే దొరికిన స్క్రాప్ […]
యండమూరి రాక్షసుడు సినిమాలో ఈ ముసలాడు గుర్తున్నాడా మీకు..?
Bharadwaja Rangavajhala………………. రాక్షసుడు ముసలోడి కథ… రుద్రవీణ సినిమాలో చుట్టూపక్కల చూడరా కుర్రవాడా అంటూ చిన్నప్పటి చిరంజీవికి దిశానిర్దేశం చేస్తాడు ఓ వృద్దనటుడు. ఆయన్ని చిరంజీవి అభిమానులు అంతకు ముందే చూశారు. రాక్షసుడు చిత్రంలో దీవిలో చిరంజీవి నాగబాబులతో పారిపోవడానికి ప్రయత్నించేది ఈ వృద్దుడే. నిజానికి అంతకు ముందు తెలుగునాట విడుదలై అద్భుతమైన విజయం సాదించిన అపరిచితులు అనే కన్నడ డబ్బింగు సినిమాలోనూ వాసుదేవరావు తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అపరిచిత అనే కన్నడ సినిమాను ఆ […]
Ad Infinitum..! తెలుగు సినిమాయే… ఓ సైన్స్, క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్… కానీ…!?
ఆశ్చర్యం వేసింది… అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదలైంది..? మామూలు సోది, సొల్లు చిత్రాలకే బోలెడంత ప్రమోషన్ యాక్టివిటీ ఉంటుంది కదా… ఈ సినిమాను చడీచప్పుడు లేకుండా ఎందుకు రిలీజ్ చేశారు..? సినిమా బాగుంటే జనం చూస్తారు కదా అనే ధీమాయా..? కానీ కనీస స్థాయి పబ్లిసిటీ అయినా అవసరం కదా… నిజమే, ఈమధ్య మీడియా మీట్లు, స్పెషల్ ఇంటర్వ్యూల ‘‘ఖర్చు’’ విపరీతంగా పెరిగింది సరే.., పోనీ, సోషల్ మీడియాను వాడుకోవచ్చు కదా… థియేటర్ల నుంచి ఎప్పుడు […]
బిడ్డ అత్తింటికి దారేది..? ఓ కొత్త కథ… కాదులే, రేషన్ బియ్యానికి పాలిష్ చేశాం…
Gottimukkala Kamalakar…………………….. బిడ్డింటికి బాటేది…? బొమ్మన్ ఇరానీ వాచిపోయిన కాళ్లతో కుంటుతూ కుంటుతూ వెళ్లి రావు రమేష్ ఇంటి తలుపు తట్టాడు.పెళ్లి కాని ప్రదీప్ వెళ్లి తలుపు తీసి ఆశ్చర్యంగా చూస్తూ ” ఎవరూ…?” అని అడిగాడు. “ఇది కోర్టుకెప్పుడూ వెళ్లని లాయర్ రావు రమేష్ గారి ఇల్లే కదండీ..? ఆయనకో హోటల్ ఉంది, అది తాకట్టులో ఉందీ..!” అంటూ మెల్లగా కళ్లద్దాలు తీస్తూ కళ్లు చికిలిస్తూ ఏదో చెప్పబోయాడు బొమ్మన్. “య్యా…! కమిన్” అంటూ షాన్ […]
Yutham Sei…. మిస్కిన్ సినిమా అంటే ఓ రేంజ్… అందరికీ ఎక్కవు… ఎక్కితే దిగవు…
Ashok Vemulapalli…………………. “యుద్దం సెయ్”………. తమిళ దర్శకుడు మిస్కిన్ సినిమా ఇది .. ఆయన మాత్రమే ఇలా తీయగలడు అనిపించుకోగలిగిన వాళ్లలో అతను ఒకడు .. ఆఖరికి వీధి లైట్ కిందే సినిమా షాట్ తీసేస్తాడు .. చీకట్లోంచే కెమేరాని రన్ చేస్తాడు .. మిస్కిన్ కి ఒక ప్రత్యేక కేటగిరీ ఫ్యాన్స్ ఉంటారు.. క్రైం , సైకిక్ స్టోరీ లైన్ తో మిస్కిన్ తీసే సినిమాలు చూడటానికి హాలీవుడ్ లో క్రిస్టఫర్ నాలెన్ సినిమా చూడటానికి […]
సబ్జెక్టు ఒకటే… ఫార్మాట్లు వేరు… ఫైనల్‌గా సినిమాపై వెబ్ సీరీసే గెలిచింది…
జూనియర్ బచ్చనంత పాప్యులారిటీ లేకున్నా ది బిగ్ బుల్ సినిమా కన్నా… ప్రతీక్ గాంధీ నటించిన స్కామ్ 1992 వెబ్ సీరీస్ ఎందుకు బాగుందంటే… వంద కారణాలు కనిపిస్తాయి. రెండింటికీ స్ఫూర్తి బిగ్ బుల్ హర్షద్ మెహతానే. మరెందుకు అభిషేక్ బచ్చన్ ది బిగ్ బుల్ కన్నా… ప్రతీక్ గాంధీ స్కాం 1992కు ప్రశంసలు దక్కుతున్నట్టు…? ఇదే నిజమని… ఇలాగే అందరూ ఆలోచించాలని… అనుకోవాలని కాకుండా ఓ కోణంలో జరిగిన విశ్లేషణగానే చూడాలని కోరుతూ… స్టాక్ మార్కెట్… […]
- « Previous Page
- 1
- …
- 104
- 105
- 106
- 107
- 108
- …
- 112
- Next Page »