ఒక వార్త… ‘‘బాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా రూపొందించిన ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా థియేటర్లలోనే కాదు… ఓటీటీలోనూ రికార్డుల వర్షం కురిపించింది… డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబరు 29న విడుదలైన ఈ మూవీ మూడు రోజుల్లోనే 2023 ఏడాది రికార్డులు మొత్తాన్ని తుడిచిపెట్టేసి, అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన సినిమాగా రికార్డుల్లో చోటు సంపాదించుకుంది…’’ నిజమేనా..? ఓటీటీలో ఎందరు చూశారు..? ఎన్ని నిమిషాల వ్యూయింగ్ టైమ్ రికార్డయింది..? ఆయా ప్లాట్‌ఫారాలు స్వయంగా ప్రకటించాల్సిందే తప్ప థర్డ్ పార్టీకి […]
‘కాపీ కొట్టు… కుర్చీ మడతపెట్టు… ఇప్పుడు ట్రెండ్ అదే మాస్టారూ…’
అబ్బే, సినిమా ఇండస్ట్రీలో… బ్యాక్ గ్రౌండ్, లక్కు, టైమ్, ట్రెండ్, సక్సెస్… ఇవే ప్రధానం… అంతే తప్ప మెరిట్‌కు, సెంటిమెంట్‌కు, ఎమోషన్‌కు పెద్ద విలువ లేదు… ఇదొక దిక్కుమాలిన ఇండస్ట్రీ అంటూ ఎంత సముదాయించుకుంటున్నా సరే, ఒక సంగీత దర్శకుడి బహిరంగ కోరిక కాస్త చివుక్కుమంటూనే ఉంది… Yanamandra Venkata Subrahmanya Sharma… అలియాస్ మణిశర్మ… వయస్సు 60… పెద్ద స్టార్లు ఒక సినిమా ఇవ్వండబ్బా… ఒకటి డీఎస్పీకి, ఒకటి తమన్‌కు, ఒకటి నాకు… వర్క్‌లో వైవిధ్యం […]
ఓసోస్, ఈ ఉప్మా పాత్రకు నయనతారా…? స్త్రీముఖి, యాంకరాంటీలు సరిపోరా..?!
అనేక రకాల టీవీ షోలలో, ఓటీటీ షోలలో అట్టర్ ఫ్లాప్ షోలు ఏమిటో తెలుసా..? మాస్టర్ చెఫ్ వంటి వంటలపోటీల షోలు… కానీ యూట్యూబ్‌లో మాత్రం వంటల పోటీల వీడియోలు సూపర్ హిట్… మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పచ్చిపులుసు కాయడం ఎలా అనే వీడియోకు కూడా ఒకటీరెండు మిలియన్ల వ్యూస్… మన దేశంలో ఇలాంటి వీడియోల్లో, అంటే స్ట్రీట్ ఫుడ్, హోటల్ టూర్స్ వీడియోల్లో షార్ట్ వీడియోస్ దగ్గర నుంచి లెంతీ వీడియోస్ దాకా… అన్నీ […]
జస్ట్, ఒక్కసారి… తెలుగు వృద్ధ హీరోలను ఈ వేషంలో ఊహించుకొండి…
మలయాళ వెటరన్ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త పోస్టర్ చూశారు కదా… భ్రమయుగం అనే సినిమా తాలూకు పోస్టర్… అందులో తన పాత్ర ఆహార్యం అదిరిపోయింది… మెడలో రుద్రాక్షలు… తలపై కొమ్ములతో కూడాన కిరీటం… దేవతావతరంలో కళ్లు… అన్నీ మమ్ముట్టిని చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాయి… ఇక ఆ పాత్ర కూడా చాలా బాగుంటుందని చెబుతున్నారు… ఎప్పుడో వందల ఏళ్ల క్రితం నాటి కేరళ స్టోరీ… నాగరికత అంతగా లేని ఆ రోజుల్లోని ఓ కథ… అందులోనూ […]
అనుపమ…? లేడీ అర్జున్‌రెడ్డి..? ఆమె నుంచి ఊహించని ‘సీన్’…
ఆమధ్య యానిమల్ సినిమాలో రెచ్చిపోయిన ఓ వ్యాాంప్ కమ్ సెకండ్ హీరోయిన్ కేరక్టర్… ‘తృప్తి’గా ఓ కామెంట్ చేసింది… ‘‘అబ్బే, ఆ సీన్లు తీసినప్పుడు నలుగురమే ఉన్నాం, చాలా కంఫర్ట్ వాతావరణంలో షూట్ చేశారు, మొదట్లో మా అయ్యా అవ్వా బాధపడ్డారు…’’ అని ఏదేదో చెప్పింది… కోట్ల మంది చూసే సీన్లు వోకేనట, కాకపోతే షూటింగ్ సమయంలో కెమెరామన్, తను, హీరో, దర్శకుడు ఉంటే చాలునట… ఫాఫం… బట్టలిప్పి బరిబాతల కనిపించినా… బోల్డ్, ఇంటిమేట్ సన్నివేశాల్లో ఇరగదీసినా… […]
Parking… చిన్న చిన్న ఇగోలే పెద్ద పెద్ద సమస్యలవుతాయి… ఇదే సినిమా…
Gopalakrishna Cheraku…. ఇగో – మనషిని రాక్షసుడిగా మార్చే సాధనం! మొన్నామధ్య ఓ చౌరస్తాలో సిగ్నల్ పడ్డా కూడా హారన్ కొట్టాడంటూ ఇగో హర్ట్ అయిన ఓ ఇద్దరు అర్ధగంట పాటు రోడ్డుపై వాగ్వాదానికి దిగారు.. చివరికి అక్కడున్న జనాలు విసుక్కోవడంతో బలవంతగా ఎవరి వాహనాలు వారు ఎక్కి వెళ్ళిపోయారు.. ఆ ఇద్దరికి ఇగో హర్ట్ అవడం వల్ల అర్దగంటపాటు రోడ్డు పై ట్రాఫిక్ జామ్ ,జనం ఇబ్బంది., చివరికి వారికి కూడా మెంటల్ డిస్ట్రబెన్స్ , […]
ఆ నాటు పాటకే ఆస్కార్ వచ్చినప్పుడు… ఈ ‘మడత’కు చాన్స్ రాదా…
మడత పెట్టి కుమ్మిన పాట! మడతోద్భవ సందర్భం:- రెండు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని వెళ్లిపోతున్న త్రివిక్రమ్ ను సరస్వతీ పుత్ర రామజోగయ్య, సంగీత పుత్ర థమన్ రెండు చేతులు పట్టుకుని ఆపారు. సందర్భానికి ఉదాత్తమైన పాట కావాలని కోరుకున్న త్రివిక్రమ్ కు ఉదాత్తమైన సాహిత్యం ఇస్తానని సరస్వతీపుత్ర, అంతే ఉదాత్తమైన సంగీతం ఇస్తానని సంగీత పుత్ర ఇద్దరూ హామీ ఇచ్చారు. అప్పుడు పుట్టిందే మడత పెట్టి పాట! జ్ఞానం ప్రవచించిన మడత:- త్రివిక్రమ్ సైన్స్ చదువుకున్నవాడు. సాహిత్యం […]
Kurchi song … సరస్వతీ పుత్రుడు పాట కంటెంట్ ‘మడతపెట్టేశాడు’…
వార్నీ… తమన్ సినిమా పాటల ట్యూన్లు యథేచ్ఛగా కాపీ చేస్తాడని అందరూ చెబుతుంటారు… కాకపోతే తన మార్క్ చిన్న చిన్న మార్పులు చేస్తాడు, ఎవరికీ దొరకకుండా… ఐనా దొరికిపోతుంటాడు… అది వేరే సంగతి,.. కానీ మరీ ఈ ట్యూన్ అయితే మక్కీకిమక్కీ దింపేశాడు… అదేనండీ గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే ఓ బూతు పాట ఉంది కదా… దాని సంగతే… ఇప్పటికే ఆ బూతును యథాతథంగా వాడుకున్న తీరుపై విమర్శలు తెలిసిందే కదా… ఇక […]
బూతులకూ పేటెంట్ రైట్స్ ఉండును… సినిమాల్లో వాడితే డబ్బులూ రాలును…
మీకు తెలిసిన ఘాటు, వెరయిటీ బూతులు ఉంటే… ముందుగానే ‘‘కుర్చీ మడతపెట్టి… దెం–’’ తరహాలో ఏదో ఓ వీడియోలో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పెట్టేసుకొండి, పోనీ, యూట్యూబ్‌లోనే ఏదో ఓ పిచ్చి చానెల్ ద్వారా జనంలోకి తీసుకెళ్లండి… తలకుమాసిన చానెళ్లు బోలెడు, ఎవడైనా రికార్డు చేసి, అప్లోడ్ చేసేస్తాడు… ఎందుకు అంటారా..? భలేవారే… ఇప్పుడు బూతులకు కూడా డబ్బులొస్తున్నయ్… ఆశ్చర్యపడుతున్నారా..? భలేవారండీ మీరు… మొన్నామధ్య ఒక ముసలాయన… పేరు కాలా పాషా… ఏదో ఇంటర్వ్యూలో తన […]
Pooja Hegde…! ఈమె కాళ్ల మీదేనా అంతటి సిరివెన్నెల కలం పారేసుకున్నది..?!
మొన్నొక వార్త… స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మహేశ్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకుందనీ… తరువాత రవితేజ సినిమా ‘మిస్టర్ బచ్చన్’ నుంచి తీసివేయబడిందనీ…! తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా 40 శాతం వరకూ పూర్తయ్యాక మరీ అంతటి పాపులర్ హీరోయిన్ తప్పుకుందనే సమాచారం ఆశ్చర్యపరిచింది… సరే, ఏవో బలమైన కారణాలు ఉండే ఉంటాయి… అసలు గుంటూరు కారం సినిమా జర్నీయే అంత సజావుగా అనిపించడం లేదు… మరి రవితేజ సినిమా […]
తమన్‌కు సిగ్గు లేదు సరే… త్రివిక్రమ్‌కు ఏమైంది..? ఇదా మహేశ్‌కు ఇచ్చే పాట..?!
సైట్లను, యూట్యూబ్‌ను ఫాలో అయ్యే తెలుగు వాళ్లకు ఇది పరిచయమే… ఓ అనామక ముసలాయన ఏదో సందర్భంలో ‘‘కుర్చీ మడతపెట్టి దెం– మెడలు ఇరుగుతయ్…’’ పాఠకులకు అర్థమైంది కదా… రాసుకోవడానికి, అనుకోవడానికే ఇబ్బందికరమైన పదం, వ్యక్తీకరణ… కానీ చాలా పాపులరైపోయింది… మరి ఇప్పటి ట్రెండ్ అలా పాడైంది… మింగితే, గువ్వ వంటి పదాల్ని సోషల్ మీడియా బాగా పాపులర్ చేసింది… హైపర్ ఆది వంటి కమెడియన్లు ఇంకా ప్రాచుర్యంలోకి తెచ్చారు… అదొక పైత్యపు పిశాచ భాష… సరే, […]
దర్శకుడిని తరిమేసి… నిర్మాతే మెగాఫోన్ పట్టి… రీళ్లు చుట్టేసినట్టున్నాడు…
హేమిటీ… నేతాజీ సుభాష్ చంద్రబోస్ కథా..? అబ్బే, ఆయన ఉన్నప్పటి కథ, ఆయనకు కాస్త లింకున్న కథ… ఆయన బయోపిక్కు కాదు… అంటే ఆ పాతకాలం సినిమాయా..? ఇంట్రస్టింగు… అవును, అప్పుడెప్పుడో 1945 బాపతు కథ… ఓహ్, అయితే కథేమిటో… ఓ జమీందారు బిడ్డ, ఆమె హత్య… అది చేధించడానికి డెవిల్ అనబడే ఓ ఏజెంట్‌ను నియమిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం… సదరు హతురాలి బంధువు తగుల్తుంది… తరువాత మరో ఆపరేషన్లోకి పయనం… అక్కడక్కడా కొన్ని ట్విస్టులు… గుడ్, […]
వాటీజ్ దిస్ సుమా..? ఇదా నీ టేస్ట్..? ఇదేనా నీ కొడుకు లాంచింగ్ సినిమా..?!
పద్ధతి అంటే సుమ… సుమ అంటే పద్ధతి… అంటారు అందరూ… పద్ధతి లేని వాతావరణం గనుకే ఆమె సినిమాలు చేయదు, కానీ సినిమా ఫంక్షన్లు ఆమె తప్ప ఇంకెవరూ చేయరు ఆల్మోస్ట్… ఇన్ని వందల ప్రోగ్రామ్స్ చేసినా సరే ఒక్క పొల్లు మాట, ద్వంద్వార్థపు మాట రానివ్వదు తన నోటి నుంచి… అలాంటి పద్ధతి కలిగిన యాంకర్ సుమ ఎందుకు పద్ధతి తప్పింది..? తన కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్గమ్ సినిమా చూశాక అందరికీ […]
అత్యంత చెత్త రికార్డు… 2023లో సూపర్ డూపర్ బంపర్ డిజాస్టర్ సినిమా…
ఫలానా హీరో సినిమా వారం రోజుల్లో 500 కోట్లు కుమ్మేసింది… ఒక వార్త… రష్యా, జపాన్, చైనా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో వందల కోట్లు సంపాదించింది… నెట్ ఇంత..? గ్రాస్ ఇంత..? ఇలాంటి వార్తలు బోలెడు చదువుతుంటాం కదా… వాటిల్లో అధికశాతం ఫేక్ ఫిగర్సే ఉంటాయి… చాలా సినిమాలకు సంబంధించి థియేటర్లకు ఇచ్చే వాటా పోను బయ్యర్‌కు మిగిలేది తక్కువే… మరీ హిట్టయితే తప్ప… థియేటర్ డబ్బు, శాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్, పైగా పలు […]
చలిచలిగా ఉందిరా ఒయ్రామా ఒయ్రామా… ‘హుషారుగా వణికించే’ పాటలివి…
Bharadwaja Rangavajhala……. చలి చంపుతున్న ఛమక్కులో…. చలి తత్వ గీతమాలిక… చలికాలం అంటేనే రొమాంటిక్ కాలం అని అర్ధం. సినిమా డ్యూయట్లలో రొమాన్స్ కే పెద్ద పీట కనుక కవులు, దర్శకులు కూడా చలిపాటలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వరసలో తెలుగు సినిమాల్లో వచ్చిన వెచ్చదనాల వెతుకులాటల గీతాల గురించి లెచ్చర్ చెప్తన్నానన్నమాట … రగ్గులు కప్పుకుని వినండి … చలిని అడ్డం పెట్టుకుని సాహిత్య విలువల్ని దెబ్బతీయకుండానే ఆహ్లాదకరమైన రొమాన్స్ అందించడం అనేదేదైతే ఉందో […]
‘సేటూ, ప్రాణాలు పోతాయని డబ్బుల్లేకపోయినా తిన్నాను… ఇక నీ దయ..’
ముంబైలోని ఓ చిన్న హోటల్… ఓ మనిషి వచ్చాడు, విపరీతంగా తిన్నాడు… మనిషి తిండి మొహం చూడక ఎన్నాళ్లయిందో అన్నట్టున్నాడు… అలాగే తింటున్నాడు… తన దగ్గర నయాపైసా లేదు… వెయిటర్ బిల్లు తీసుకొచ్చాడు… ఈ మనిషి ఆ బిల్లు తీసుకుని నేరుగా కౌంటర్ మీద కూర్చున్న సేటు వద్దకు వెళ్లాడు… ‘‘సేటూ, నా దగ్గర పైసా లేదు, రెండు రోజులుగా ఏమీ తినలేదు, ఇలాగే ఉంటే ఏమైపోతానో అని భయమైంది… అందుకే వచ్చి తిన్నాను… ప్రాణాలు నిలుస్తాయి […]
తెలుగులోకి జోరుగా ప్రవహిస్తున్న తమిళ శృతులు, కన్నడ ఆలాపనలు…
స్టార్ తెలుగు సినిమా అనగానే గుర్తొచ్చే సంగీత దర్శకులు డీఎస్పీ, తమన్… కాపీలు కొట్టినా, సొంత ట్యూన్లు కొట్టినా, హిట్లతో అదరగొట్టినా ఆ రెండు పేర్లేనా..? అప్పుడప్పుడూ కీరవాణి… అంతేనా..? మంగళవారం సినిమా చూస్తూ కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ భేష్ అనుకుంటున్నప్పుడు ఈ సందేహమే కలిగింది… కాంతారతో సూపర్ హిట్టయిపోయిన ఈ మ్యూజిషియన్కు ఇప్పుడు ఊపిరి సలపనంత పని… చేతిలో దాదాపు ఆరేడు సినిమాలున్నయ్… రెహమాన్‌లు, ఇళయరాజాల్ని ఎప్పుడో దాటేసి, చాలా మైళ్లు ముందుకెళ్లిపోయిన అత్యంత […]
పాయల్ రాజ్‌పుత్… ఆ పాత్ర చేయడమే ఓ సాహసం… అవార్డుకు అర్హురాలు…
పాయల్ రాజ్‌పుత్… ఈ పేరు వినగానే ఆర్ఎక్స్ 100 అనే ఓ చిన్న సినిమాలో ఓ బోల్డ్ కేరక్టర్ వేసిన ఓ నటి గుర్తొస్తుంది… తరువాత ఏవో రెండు మూడు ఐటమ్ సాంగ్స్, పెద్దగా క్లిక్ కాని హీరోయిన్ గుర్తొస్తుంది… కానీ ఆమె తొలి దర్శకుడు అజయ్ భూపతి ఆమెను అలా వదిలేయలేదు… మహాసముద్రం సినిమా సమయంలో హీరోయిన్గా తీసుకోకపోయినా తన సినిమాకు ఆమె టచ్ లేకుండా వదిలేయలేదు… తరువాత మంగళవారం సినిమా… ఆమే ప్రధాన పాత్ర… […]
సలార్ ప్రభాస్‌తో మళ్లీ బాలీవుడ్ మాఫియా కొత్త ఆటలు… తొక్కగలదా..?!
షారూక్ ఖాన్ డన్కీ సినిమా రిలీజ్ మొదట్లో ప్రభాస్ ఆర్ సౌత్ మీద కుట్రపన్ని భంగపడిన బాలీవుడ్ మాఫియా మళ్లీ స్టార్ట్ చేసింది… ఆల్ ఆఫ్ సడెన్ చెప్పాపెట్టకుండా మల్టీప్లెక్సుల్లో డన్కీ షోలు స్టార్టయ్యాయి… అసలు డన్కీకి పట్టించుకున్నవాడే లేడు, చూసేవాడు లేడు, అడ్డగోలు ఫ్లాప్… ఆ కోపం అంతా ప్రభాస్ సలార్ మీద చూపిస్తున్నది ఆ మాఫియా… దానికి కారణముంది… బాహుబలి తరువాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అన్నీ ఫ్లాపులే… దాంతో ప్రభాస్ పనైపోయింది అనుకుని […]
‘‘హోస్ట్‌గా నాగార్జున వేస్ట్..’’ ఘాటు వ్యాఖ్యలతో ఓ తింగరి పిల్ల తెంపరితనం…
ఆ షో ముగిశాక కూడా వార్తల్లో ఉంటోంది రకరకాల కారణాలతో… బాగా నెగెటివిటీని మూటగట్టుకున్న రన్నరప్ అమర్దీప్ ఏమైపోయాడు..? జాడలేడు, పత్తాలేడు… ఒక వార్త… ప్రియాంక జైన్ పెళ్లి త్వరలో, ఆ ప్రియుడితోనే… ఇంకో వార్త… అంబటి అర్జున్ ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషిస్తున్నాడు… మరో వార్త… 250 కోట్లతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నానని పాత బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ ప్రకటన… మరొక వార్త… నన్ను డీఫేమ్ చేసి, కుట్రలు పన్నిన యూట్యూబర్ల అంతుచూస్తానని పల్లవిప్రశాంత్ భీషణ […]
- « Previous Page
- 1
- …
- 38
- 39
- 40
- 41
- 42
- …
- 117
- Next Page »