Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బన్నీ బ్రాండ్ మూవీ… ఒక పక్కా కమర్షియల్ ప్రజెంటేషన్…

December 5, 2024 by M S R

pushpa2

. పుష్ప సీక్వెల్ మీద అనేక వివాదాలు… జాప్యం, దర్శకుడితో విభేదాలు, కంపోజర్ పంచాయితీలు, రీషూట్లు… అన్నింటికీ మించి అడ్డగోలు టికెట్ రేట్లు… ఈమధ్యకాలంలో ఇంత హైప్ క్రియేట్ చేయబడిన సినిమా మరొకటి లేదేమో… సరే, ఆ కథలన్నీ ఎలా ఉన్నా… సినిమా ఎలా ఉంది… సినిమాలో చెప్పుకున్నట్టు ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్ రేంజులో ఉందా..? ఎంత వద్దనుకున్నా ఖచ్చితంగా పుష్ప ఫస్ట్ పార్ట్‌తో పోలిక తప్పకుండా వస్తుంది… దానికి సీక్వెలే కదా ఇది… స్థూలంగా సినిమా […]

ప్రీమియర్ షోల రద్దు అట… ఇక పుష్ప విలాపమేనా పుష్పా…

December 4, 2024 by M S R

pushpa2

. బహుశా ఎవడికీ సానుభూతి కూడా ఉండదేమో,., పుష్ప2 ప్రీమియర్ షాలు పలుచోట్ల రద్దవుతున్నాయనే వార్తలతో… సినిమా తీసినవాడికే నమ్మకం లేదు, నటించినవాడికీ నమ్మకం లేదు… రీషూట్లు… మ్యూజిక్ వాడిని మార్చేశారు… సుదీర్ఘ జాప్యం… ఎన్నో ఎన్నో మైనస్ పాయింట్లు… పాటలకు హైప్ రాలేదు… చివరకు శ్రీలీల ఐటమ్ డాన్సు మీద ఆశలు… తీరా చూస్తే ఆ పాట కూడా మైనస్… కానీ ఫ్యాన్స్ పిచ్చి మీద నమ్మకం… పిచ్చి ప్రేక్షకుల మీద నమ్మకం… ఆర్టిఫిషియల్ హైప్ […]

నో డైలాగ్స్… పైగా నెగెటివ్ రోల్… ఐదే నిమిషాల భలే పాత్ర…

December 4, 2024 by M S R

megastar

. తాయారమ్మ బంగారయ్య . సినిమా టైటిలే కాదు ; సినిమా అంతా వాళ్ళదే . టైటిల్ పాత్రల్లో సత్యనారాయణ, షావుకారు జానకిలు అదరగొట్టేసారు . ఆడంబరాలతో , ఇగోలతో , స్వాతిశయంతో పాడయిపోయిన కాపురాలను రిపేర్ చేసే కధాంశంతో చాలా సినిమాలే వచ్చాయి . కానీ , ఈ సినిమా కధని దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు చాలా పకడ్బందీగా వ్రాసుకున్నారు . అంతే బిర్రుగా స్క్రీన్ ప్లే , అందుకు తగ్గట్లుగానే దర్శకత్వం వహించారు . […]

‘లక్కీ’ భాస్కర్‌లు నిజజీవితాల్లో ఉండరు… వాళ్లు సినిమాల్లో కథల్లోనే…

December 3, 2024 by M S R

lucky bhaskar

. లక్కీ భాస్కర్… సినిమా కథ కాబట్టి హీరోకు అనుకూలంగా రాసుకున్నారు. ఏ స్థాయిలో అంటే సినిమా మొత్తం మాట్లాడని హీరో తండ్రి కొడుకు సమస్యల్లో ఉన్నాడని అర్ధం చేసుకొని తొలిసారి నోరు విప్పుతాడు. ఆర్ధిక శాఖలో ఫ్రెండ్ & RBI గవర్నర్ Ex Girl Friend ఉన్న తండ్రులు నిజ జీవితంలో ఏ భాస్కర్కు తండ్రిగా దొరకరు.. హర్షద్ మెహతాను వాడుకొని BR (Bank receipt) & Stocks rigging కథ రాసుకున్నారు కానీ దాని […]

ఎన్టీయార్ ఐదు పాత్రల మూవీ… టీవీల్లో వచ్చినప్పుడు చూడాల్సిందే…

December 3, 2024 by M S R

ntr

. ఎన్టీఆర్ 57 వ పుట్టినరోజున 1979 మే 28 వ తారీఖున ఈ శ్రీ మద్విరాటపర్వము సినిమా విడుదలయింది . అప్పటివరకు మూడు పాత్రల్ని వేసిన NTR ఈ సినిమాలో నాలుగు పాత్రలను పోషించారు . శ్రీకృష్ణుడు , దుర్యోధనుడు , కీచకుడు , అర్జునుడు . బృహన్నలది కూడా అదనపు పాత్రగా పరిగణిస్తే అయిదు పాత్రలు . అప్పటికి అదో సంచలనం . ఆ రికార్డుని పది పాత్రలు వేసి కమల్ హాసన్ బ్రేక్ […]

కొంచెం మోదం – కొంచెం ఖేదం … ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ – వెబ్ సీరీస్

December 3, 2024 by M S R

freedom

. Vijayakumar Koduri …… కొంచెం మోదం – కొంచెం ఖేదం ……. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ – వెబ్ సీరీస్ ********** కొంత కాలం క్రితం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ‘క్రౌన్’ వెబ్ సీరీస్ (బ్రిటీష్ రాజరిక వ్యవస్థ చరిత్ర ఆధారంగా తీసిన వెబ్ సీరీస్) చూసినపుడు, మనదేశంలో కూడా ఇట్లా తీయదగిన అనేక చరిత్రలు వున్నాయి కదా అనిపించింది. ఇటీవల ‘సోని లివ్’ లో ప్రసారమవుతున్న ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ వెబ్ […]

సూక్ష్మదర్శిని..! పొరుగింటి రహస్య ఛేదనలోకి దిగిన ఓ గృహిణి…!

December 3, 2024 by M S R

sookshmadarshini

. ఈమధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో భారీ సక్సెస్ కొట్టినవి అమరన్, సింగం అగెయిన్, భూల్ భులయ్యా-3 … అంటే 300 కోట్లు దాటి వసూళ్లు… తరువాత లక్కీ భాస్కర్ 100 కోట్లు దాటింది… తన బడ్జెట్‌తో పోలిస్తే క సినిమా కూడా సక్సెసే ఒకరకంగా… అన్ని భాషా చిత్రాల్లోనూ హిట్స్ ఇవే… ఇవి గాకుండా మరో మలయాళ చిత్రం అందరినీ ఆకర్షిస్తోంది… సినిమా పేరు సూక్ష్మదర్శిని… కామెడీ క్రైమ్ థ్రిల్లర్… మలయాళ రచయితలు కథల్ని ఎంత కొత్తగా, […]

తనదీ ఓ సినిమా కథే… కాదు, అంతకు మించి… ఓ సక్సెస్ స్టోరీ…

December 3, 2024 by M S R

irani

. గోల్ ఏం లేదు. బతకడానికి ఎక్కడవకాశం దొరికితే అక్కడ పని చేస్తూ వచ్చాడు. కానీ, చివరకు నటనలో మాత్రం విభిన్నమైన శైలిని కనబర్చాడు. కొన్ని పాత్రలు అనుకున్న స్థాయిలో కుదరాలంటే.. వాటిని తాను మాత్రమే చేయగలనని నిరూపించాడు. అలా ఒక వెయిటర్ నుంచి.. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ గా.. అక్కడి నుంచి బాలీవుడ్ వైవిధ్య నటుడిగా ఎదిగిన బొమన్ ఇరానీ పుట్టినరోజు నిన్న… అందుకే, అతగాడి గురించి ఓ నాల్గు మాటలైనా చెప్పుకోవాల్సిన రోజు… సినిమా నటీనటులుగా […]

బాయ్‌కాట్ పుష్ప… ఎందుకు పెరుగుతోంది ఈ వ్యతిరేకత..?!

December 2, 2024 by M S R

pushpa2

. మునుపెన్నడూ లేని వ్యతిరేకత అల్లు అర్జున్ మీద కమ్ముకుంటోంది… అది పుష్ప-2 సినిమాకు సంబంధించి… పనిలోపనిగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ వ్యతిరేకతలో కొంత తనూ మూటగట్టుకుంటోంది… అబ్బే, చిన్న విషయం, తెలంగాణ ప్రభుత్వం మీద ఇదేం పనిచేస్తుంది అనేవాళ్లూఉంటారు… నో, చిన్న చిన్న అసంతృప్తులు, వ్యతిరేకతలే అక్యుములేట్ అవుతాయి… 1) సన్నీ లియోన్ ప్రోగ్రాం రద్దు చేసిన పోలీసులు పుష్ప-2 ప్రిరిలీజ్ ఫంక్షన్ కోసం సాగిలబడుతున్నారు… ఇదేం న్యాయం..? 2) ట్రాఫిక్ ఆంక్షలు… భారీగా […]

తలబిరుసు కాదు… తలదించుకునేది కాదు.,. స్మిత కొన్ని వాస్తవాలు…

December 2, 2024 by M S R

silk

. నిజంగా సిల్క్ స్మిత గురించి నిజాలు తెలుసా అందరికీ..? ఇంటిమేట్ సీన్లు, కేబరే డాన్సులు, వ్యాంప్ తరహా పాత్రలతో ఓ ఉర్రూతలూగించిన కేరక్టర్ నిజజీవితం ఏమిటో తెలుసా అందరికీ..? ఈ ప్రశ్నకు సమాధానం లేదు… విద్యాబాలన్ నటించిన డర్టీ పిక్చర్ చూసి అదే నిజజీవిత చరిత్ర అనుకుంటున్నారు అందరూ… కానీ కాదు… అది జస్ట్, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నానా చెత్తా రంగరించిన చరిత్ర… అందులో విద్యబాలన్ ఓ పాత్ర… నిజానికి ఆమె ఎవరు..? తెలుగు మహిళ… […]

పిల్లాడి కోసం నాలుగు సిజేరియన్లు… నలుగురూ ఆడపిల్లలే…

December 2, 2024 by M S R

mucharla

. నేను తెలుగమ్మాయిని. ఉత్తరాది వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకు నలుగురు ఆడపిల్లలు. ఉత్తరాది అయినా, దక్షిణాది అయినా ఆడపిల్లల మీద వివక్ష ఉంటుంది. ఒక అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న వారు “ఎవరు పుట్టినా ఫర్లేదు” అంటారు. కానీ చాలామందికి అబ్బాయే పుట్టాలని ఉంటుంది. బయటికి చెప్పరు. చెప్తే వాళ్ల మీద వివక్ష ముద్ర వేస్తారని భయం. ఎవరు పుట్టినా ఫర్లేదు అనే వారిలో 90 శాతం మందికి అబ్బాయి పుట్టాలనే […]

ఆమే పాడింది… ఆమే ఆడింది… అదీ బర్మాలో… హిట్ కొట్టింది…

December 2, 2024 by M S R

rangoon rowdy

. చిలకా గోరింక (1966) సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన కృష్ణంరాజు 100 వ సినిమా 1979 లో వచ్చిన ఈ రంగూన్ రౌడీ సినిమా . ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది . ఈ సినిమాలో జయప్రద ఒక పాట తానే పాడి డాన్స్ చేస్తుంది . పుట్టిన ఊరు చిట్టగాంగ్ పెట్టిన పేరు బిందు అనే పాట . రజనీకాంత్ లాగా కనిపించే నళినీకాంత్ అనే నటుడు ఈ సినిమా ద్వారానే […]

తన మొదటి సినిమా క్వాలిటీపై కనీసం చిరంజీవి దృష్టిపెట్టాలి కదా…

December 1, 2024 by M S R

megastar

. చిరంజీవి నటించిన మొదటి సినిమా . 1979 లో వచ్చిన ఈ పునాదిరాళ్ళు సినిమా చిరంజీవికి అద్భుతమైన పునాదిని వేసింది . పల్లెటూర్లలో పెత్తందార్ల దాష్టీకం మీద కుప్పలకుప్పలు సినిమాలు ఈ సినిమా ముందూ వచ్చాయి , తర్వాతా వచ్చాయి . సినిమా సక్సెస్ అయ్యేది కానిదీ ఆడియన్సుకు ఎలా ప్రెజెంట్ చేసారు అనేదాన్ని బట్టి ఉంటుంది . ఆడియన్సుకు పట్టేలా ఈ సినిమాను ప్రెజెంట్ చేసారు . టైటిల్సులోనే నిర్మాతలు సినిమా ఉద్దేశం చెప్పేసారు […]

అమ్మా నయనతారా… ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావు..!!

November 30, 2024 by M S R

nayantara

. సాదా సీదా ఫెయిరీ టేల్… నయనతార – బియాండ్ ఫెయిరీ టేల్ నయనతార నెట్ ఫ్లిక్స్ చిత్రం చూస్తే ఏమనిపించింది? చాలామందికి ఏ మసాలాలూ లేని మామూలు సినిమా అనిపించింది. ఒకప్పుడు సినీతారల జీవితాల గురించి ఎంత ఆసక్తి ఉన్నా, వారు చెప్పేవే బయటకి వచ్చేవి. పబ్లిసిటీ అవసరం కాబట్టి అప్పుడప్పుడు అక్కరలేని స్టోరీలు కూడా వండి వార్చేవారు. అవి కూడా సినిమా పత్రికలలోనే. వారి కుటుంబం, పిల్లలు చాలా అరుదుగా కనిపించేవారు. సోషల్ మీడియా ప్రవేశంతో […]

19 భాషల్లో పాటలు… అనితరసాధ్యం… సిసలైన పాన్ఇండియా సింగర్…

November 30, 2024 by M S R

vani jayaram

. పంథొమ్మది భాషలు 20 వేల పాటలు… వేలాది భక్తి పాటలు, ప్రైవేటు ఆల్బమ్స్… నిజానికి ఈ సంఖ్య కాదు వాణిజయరాం గాత్రమాధుర్యాన్ని, విశిష్టతను పట్టించేది… ఆమె పాడిన పాటలు ఆమె ఏమిటో చెబుతాయి… 11 సంగీత ప్రధానమైన పాటలున్న స్వాతికిరణం సినిమా కోసం విశ్వనాథ్ నిర్మొహమాటంగా ఆమెనే ఎంచుకున్నాడు… ఆమె పాటంటే, పాడే పద్ధతి అంటే అందరికీ అంత నమ్మకం… ఆ గొంతులో ఆ శ్రావ్యత… ఆనతి నీయరా హరా… శివానీ, భవానీ… తెలిమంచు కురిసింది… […]

సీఎం సార్… సినిమా టికెట్ల రేట్లను మార్కెట్‌కు వదిలేస్తే పోలా..!!

November 30, 2024 by M S R

pushpa2

. మార్కెట్‌లో కిలో బియ్యం ధర ఎంత..? రేషన్ బియ్యం జస్ట్, కిలోకు రూపాయి… అన్నపూర్ణ కార్డు ఉంటే ఫ్రీ… బయట కావాలన్నా 11 రూపాయలు ధర… సన్నబియ్యం సోనా మశూరి కావాలంటే 55, సుగర్ ఫ్రీ అనే డొల్ల ప్రచారమున్న బియ్యమైతే 70, 80… జైశ్రీరాం, హెచ్‌ఎంటీ అయితే ఒక ధర… లాంగ్ గ్రెయిన్ ఒక ధర, బాస్మతి మరో ధర… బ్రాండ్‌ను బట్టి వేర్వేరు… చివరకు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయనే బ్లాక్ రైస్ ఎట్సెట్రా […]

మలినమైన ఆ శారద దేహం గంగలో స్వీయ నిమజ్జనం…

November 30, 2024 by M S R

sarada

. ఇది అచ్చంగా శారద సినిమా . మూడోసారి ఊర్వశి అవార్డును శారదకు తెచ్చిపెట్టిన సినిమా . మొదటి రెండు ఊర్వశి అవార్డులు మళయాళ సినిమాల్లో నటించినందుకు వచ్చాయి . మూడోది మాత్రం 1979 లో వచ్చిన ఈ నిమజ్జనం తెలుగు సినిమాలో నటించినందుకు వచ్చింది . గూడ్స్ బండి స్పీడులో నడుస్తుంది సినిమా . ఆరోజుల్లోనే డబ్బులు రాలేదు . అవార్డులు మాత్రం బాగా వచ్చాయి . ఇప్పటి తరం వారు చూడలేరేమో ! తండ్రి […]

హత్య జరిగింది… హతుడెవరో తెలియదు… భలే కేసు, భలే సినిమా…

November 28, 2024 by M S R

hatya

. హతుడు తెలీదు .. హత్య మాత్రం జరిగింది .. ఎలా .. చూడాలంటే … నాడి చూసే వైద్యుడి కన్నా అనుభవజ్నుడైన కాంపౌండర్ మేలన్నది ఒక నానుడి. అలాగే కొత్తగా చేరిన ఎస్సై కన్నా సర్వీసులో ఉన్న కానిస్టేబుల్ మిన్న. కోర్టుల్లో వాదించే ప్లీడర్ల కన్నా అక్కడే పాతుకుపోయిన గుమస్తా వెయ్యి రెట్లు గొప్పోడు. ఎందుకంటే వాదోపవాదాలు.. అభ్యంతరాలు.. క్రాస్ ఎక్జామినేషన్లు.. తీర్పులు.. చట్టంలో లొసుగులు.. ఎవిడెన్సులు.. సాక్ష్యాల తారుమారు.. ఇలా అతని అనుభవంలోకి వచ్చేవి […]

ఆ నర్సు గుర్తుపట్టకపోయి ఉంటే… ఓ అనామకుడిగానే ‘వెళ్లిపోయేవాడు’…

November 27, 2024 by M S R

Kulasekhar

. కొన్ని జీవితాలు… అవీ సినిమా జీవితాలు… సినిమా కథలను మించి ఉంటాయి… విషాదమే కాదు, విచిత్రంగా ముగుస్తుంటాయి… కులశేఖర్ జీవితం ఓ పర్‌ఫెక్ట్ ఉదాహరణ… ఓ వ్యక్తి ఒంటరిగా అమీర్‌పేటలో దారెంట నడుస్తూ పోతుంటాడు… హఠాత్తుగా కుప్పకూలిపోతాడు… స్థానికులు ఎవరో 100 నంబర్‌కు ఫోన్ చేస్తే, పోలీసులు వచ్చి, గుర్తుతెలియని వ్యక్తిగా నమోదు చేసుకుని, గాంధీ హాస్పిటల్‌లో చేర్పిస్తారు… అక్కడా పేరు లేని రోగిగా నమోదు… ఎవరు పట్టించుకుంటారు..? అదే రాత్రి మరణిస్తాడు… అనామకుడిగానే మార్చురీకి […]

కొణిదెల సురేఖ..! అలనాటి రామాయణంలోని ఆ సురేఖ పాత్ర…!!

November 26, 2024 by M S R

mega

. కైక చేసిన తప్పుకు.. లక్ష్మణుడు ఐశారామాలని, భార్యని ఒదిలి అన్నా వదినలకు సేవ చేస్తానని అడవులకు వెళ్ళిపోయాడు. పెద్దన్న రాముడికి తన తల్లి వల్ల అన్యాయం జరిగిందని బాధపడ్డ భరతుడు రాజప్రాసాదాన్ని ఒదిలి పన్నెండేళ్ళు ఊరి బయట గుడిసె కట్టుకుని కటిక నేలన జీవిస్తూ రాజ్యపాలన చేసాడు. భరతుడికి అండగా శత్రుఘ్నుడు నిలబడి తమ్ముడి కర్తవ్యం నిర్వర్తించాడు.. కౌసల్యా తనయుడు రాముడు అడవులకు పోయిన బాధ ఒకటైతే.. తప్పుచేసిన కైకేయిది మరొక బాధ.. కానీ ఏ […]

  • « Previous Page
  • 1
  • …
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
  • …
  • 113
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మైథిలి ఠాకూర్..! బీహార్ బరిలో ఓ జానపద స్వరం భాస్వరమై..!!
  • నితిశ్ ఇక తోక జాడించలేడు..! బీజేపీకి ఈసారి ఫుల్ ‘బీహారీ ఖుషీ’ ఇదే…
  • కాంత..! తెలుగు ప్రేక్షకుడికి కనెక్ట్ కాని ఓ తొలితరం సూపర్ స్టార్ కథ..!
  • బీజేపీ అట్టర్ ఫ్లాప్ షో..! రీజన్స్ ఏమిటి..? బాధ్యులు ఎవరు..?
  • అరయగ కర్ణుడీల్గె…! కేటీయార్ ఓటమి… జనంలోకి రాని కేసీయార్ ఓటమి..!!
  • గెలిచింది రేవంత్…! ఓడింది కేటీయార్…! ఓ కొత్త కాంగ్రెస్ కనిపించింది…!!
  • దేశం రక్షింపబడింది..! మరింత బీమార్ గాకుండా రాష్ట్రమూ రక్షింపబడింది…
  • దీనక్క పాటలో సొంగకారిన పదాలు… దీనక్క ఏం రాస్తున్నారు భయ్యా…
  • ‘శ్రీబాగ్ భవన్’ అలా కాపాడబడింది… ఆ రక్షణ వెనుక కూడా ఓ కథ…
  • గాన చారుశీల సుశీల..! తిరుగులేని గళమాధుర్యం… స్వర సౌందర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions