Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరో అజిత్ 100 శాతం ఓ డిఫరెంట్ కేరక్టర్… ఏకంగా ఆర్మీ కంట్రాక్టే దక్కింది…

August 10, 2023 by M S R

అజిత్

రెండేళ్ల క్రితం మనం ముచ్చటలోనే చెప్పుకున్నాం… హీరో అజిత్ గురించి… ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం మళ్లీ వచ్చినట్టుంది… ఆ పాత పోస్టు యథాతథంగా ఓసారి చదవండి ముందుగా… అజిత్… అసలు ఈయన హీరో ఏమిటో అర్థం కాదు… ఎందుకు చెప్పుకుంటాడో కూడా తెలియదు… అసలు హీరో అంటే ఎలా ఉండాలి..? అందులోనూ ఓ ఇండియన్ హీరో… అదీ సౌతిండియా హీరో అంటే ఏ రేంజ్ ఉండాలి… ఫ్యాన్స్ గీన్స్ హంగామా రెచ్చిపోవాలి, చచ్చిపోవాలి… కానీ తనకు […]

జైలర్ సినిమాకు ఇద్దరు హీరోలు… 1) రజినీకాంత్ 2) అనిరుధ్…

August 10, 2023 by M S R

jailer

జాకీష్రాఫ్, శివరాజకుమార్, మోహన్‌లాల్… హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాపులర్ హీరోలు… స్టార్లు… ఇదంతా ఆయా భాషల్లో మార్కెటింగ్, వసూళ్ల అడ్వాంటేజ్ కోసం, ఆయా రాష్ట్రాల నేటివిటీని కృత్రిమంగా అద్దే ప్రయాస… సరే, తెలుగులో, తమిళంలో సేమ్ రజినీకాంత్ చాలు… అఫ్‌కోర్స్ సునీల్ ఉన్నాడు… రమ్యకృష్ణ ఉంది, తమన్నా ఉంది… ఐతేనేం… సినిమా మొత్తం రజినీకాంత్ హీరోయిజం చుట్టూ తిరుగుతుంది… మిగతావాళ్లు ఆయా భాషల్లో హీరోలు కావచ్చు, ఈ సినిమాకు వచ్చేసరికి జీరోలు… ఎవరికీ పెద్ద ప్రాధాన్యమున్న […]

చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ..? తమ్ముడి కోసం నేరుగా రంగంలోకి అన్న…!!

August 8, 2023 by M S R

చిరంజీవి

ఒకటి గుర్తుందా..? చిరంజీవి సతీసమేతంగా వెళ్లి జగన్‌ దంపతులను కలిశాడు… జగన్ సాదరంగా ఆహ్వానించి, చిరంజీవి చెప్పిన టికెట్ రేట్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటాను అన్నాడు… తమ్ముడు పవన్ కల్యాణ్ మీద జగన్‌కు ఎంత కోపం ఉన్నా సరే, అన్న చిరంజీవి పట్ల సుహృద్భావంతోనే వ్యవహరించాడు… ఒక దశలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను చీల్చడానికి చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేస్తాడనీ ఊహాగానాలు వినవచ్చాయి… తరువాత చిరంజీవి ఏం చేశాడు..? ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు, నాగార్జున […]

మోహన్‌బాబన్నయ్యా… మీ తమ్ముడు గద్దర్ సినిమాలకు డైలాగులు కూడా రాసేవాడా..?

August 8, 2023 by M S R

mohan babu

‘‘భోళాశంకర్ ప్రిరిలీజ్ ఫంక్షన్‌‌లో కనీసం గద్దర్‌కు సంతాపం ప్రకటించే సంస్కారం కూడా లేదా చిరంజీవికి..?’’ అని ఓ మిత్రుడు ఆగ్రహపడిపోయాడు… పోనీలే, తమ్ముడు పవన్ కల్యాణ్ నివాళి అర్పించాడు కదా… నా అన్న ప్రజాయుద్ధనౌక పేరిట ఒకటీరెండు స్మరణ వీడియోలు కూడా రిలీజ్ చేసినట్టున్నాడు… మోహన్‌బాబు కూడా అక్కడికి వెళ్లాడు… కానీ ఏమన్నాడు..? గద్దర్ తమ్ముడట… తమది అన్నాదమ్ముల అనుబంధం అట… 49లో పుట్టిన గద్దర్ 52లో పుట్టిన మోహన్‌బాబుకు తమ్ముడెట్లా అయ్యాడు… పైగా గద్దర్ అందరినీ […]

ఆయనతో పెళ్లి ఎత్తిపోయింది… తర్వాత తనకే అమ్మగా ఓ సినిమా చేశాను…

August 6, 2023 by M S R

శ్రీవిద్య

Sai Vamshi………..   #శ్రీవిద్య ..  జీవితంలో ఒకానొక సమయంలో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడూ ఇష్టపూర్వకంగానో, అయిష్టంగానో కొన్ని సంబంధాల్లోకి తోయబడతారు. అది పెళ్లి కావచ్చు, సహజీవనం కావచ్చు. మరేదైనా కావచ్చు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఓ వ్యక్తి నన్ను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు! మా పెళ్లి దాదాపు ఖరారైంది. ఒకరి ఇంటికి మరొకరు వచ్చి వెళ్తున్నారు. ఆ సమయంలో మేమిద్దరం 22 ఏళ్ల ప్రాయంలో […]

పీహెచ్‌డీ చేస్తుందట..! ఎంట్రన్స్ పాసైంది..! ఈ రంగుల లోకంలోనూ అదే విద్యాసక్తి..!

August 5, 2023 by M S R

పవిత్ర

ముందుగా ఒక వార్త… ‘‘ఇటీవలి కాలంలో సినీ రంగంలో బాగా పాపులరైన మహిళ పవిత్ర లోకేశ్… సీనియర్ నటుడు నరేశ్ తో ఆమె సహజీవనం బాగా వార్తల్లో నలుగుతోంది ఇంకా…!! ఇప్పుడు మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కింది… కన్నడ యూనివర్శిటీ నిర్వహించిన పీహెచ్డీ కామన్ ఎంట్రన్స్ పరీక్షలో ఆమె ఉత్తీర్ణురాలైంది… కన్నడ యూనివర్శిటీ వివిధ విభాగాల కింద పీహెచ్డీ చేయడానికి అవకాశం కల్పిస్తోంది… వివిధ విభాగాల్లో పీహెచ్డీ చేసేందుకు 981 మంది ఎంట్రన్స్ పరీక్ష రాయగా… వీరిలో […]

రావణాసురుడు ఇక్కడా రవితేజను ముంచేశాడు… సాయిధరమ్‌తేజ చాలా నయం…

August 4, 2023 by M S R

RAVITEJA

ప్రేక్షకుడు అంటే అంతే… తనకు నచ్చకపోతే ఎంతటి భారీ తారాగణం ఉన్నా సరే, ఎంతటి హీరో అయినా సరే ఆ సినిమాను పట్టించుకోరు… అలా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలెన్నో… మహేశ్ బాబు, రజినీకాంత్, పవన్ కల్యాణ్, చిరంజీవి తదితర హీరోలున్నా సరే డిజాస్టర్లు ఉన్నాయి… ప్రత్యేకించి జనం టీవీల్లో సినిమాల్ని చూడటం మానేసిన ఈ రోజుల్లో టీవీ రేటింగ్స్ రావడం కష్టసాధ్యమైపోయింది… మరీ మంచి మౌత్ టాక్ వచ్చిన సినిమాలు, థియేటర్లలో హిట్టయిన సినిమాల్నే టీవీల్లో […]

Vodelling Brahma… మరపురాని గాయకుడు కిషోర్ కుమార్…

August 4, 2023 by M S R

kishore

కిషోర్ కుమార్ జయంతి ఇవాళ… 70వ దశకంలో దేశాన్ని ఊపేసిన చలనచిత్ర నేపథ్య గాయకుడు కిషోర్ కుమార్. అప్పటికే రఫీ మహోన్నతమైన గాయకుడుగా విలసిల్లుతున్నారు. 50, 60 దశాబ్దులు రఫీవి ఐతే 70వ దశకాన్ని కిషోర్ కుమార్ ఆక్రమించుకున్నారు. కిషోర్ కుమార్ 1948లోనే జిద్ది సినిమాలో నేపథ్య గాయకుడిగా పరిచయం అయ్యారు. మన దేశ సినిమాల్లో నమోదైన తొలి baritone గాయకుడు కిషోర్ కుమార్! కిషోర్ కుమార్ 1969 నుంచి ఊపందుకున్న గాయకుడైనారు. తలత్, రఫీ, మన్నాడేలలా […]

కళాసేవ అనేది ఓ ట్రాష్… ఇక్కడేదీ ఉచితం కాదు… నేనూ డబ్బిస్తేనే నటిస్తా…

August 4, 2023 by M S R

lakshmi

Sai Vamshi……….   నేనెందుకు ఉచితంగా నటించాలి? … నేను డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నాను. అందులో ఎటువంటి సందేహమూ లేదు. అది చెప్పడానికి నాకేమీ నామోషీ లేదు. ఎవరైనా వచ్చి ‘మా సినిమాలో మీకు అద్భుతమైన పాత్ర ఉంది మేడమ్! చాలా గొప్ప పేరు వస్తుంది. మీరు ఫ్రీగా ఈ సినిమా చేయాలి’ అని అంటే ‘నాకు ఆ క్యారెక్టర్ అక్కర్లేదు’ అని నేరుగా చెప్పేస్తాను‌. నన్ను తెర మీద చూపించి మీరు డబ్బు వసూలు చేస్తున్నప్పుడు […]

పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే చంద్రబాబు, జగన్ పక్కపక్కనే కూర్చుని…

August 3, 2023 by M S R

bro

Padmakar Daggumati………   ఇరవై ఏళ్లకిందట ఒకసారి ఏదో చిన్న వీక్లీలో ఒక అప్రధానమైన పేజీలో ఐన్‌స్టీన్ ఫోటోతో ఏదో విశేషం కనపడితే చదివాను. అది నన్ను భలే ఆకర్షించింది. ఏదైనా ఒక విషయం తాలూకు ఖచ్చితత్వం నిర్ధారించడానికి స్థలం, కాలం ప్రాతిపదికన మాత్రమే మనం స్పష్టంగా వివరించగలం. స్థలం విషయంలో చాలావరకు మనం అంతరిక్షం, చంద్రుడు ఇంకా ఇతర గ్రహాల విషయాలలో సైన్స్ సహాయంతో ఖచ్చితత్వం సాధిస్తున్నాము. అయితే కాలం విషయంలో మాత్రం లభించగలిగిన గతం, వర్తమానం […]

క్రాక్… ఊళ్ల పేర్లనూ భ్రష్టుపట్టించాలా..? వేటపాలెం దేనికి ప్రసిద్ధో తెలుసా..?

August 3, 2023 by M S R

crack movie

బ్రో అనే సినిమాలో సంస్క‌ృత పాట గురించి… పార్కిన్సన్ వ్యాధిపై అదే సినిమాలో రాయబడి ఓ డైలాగ్‌పై రెండు కథనాలు చెప్పుకున్నాం కదా… తాజాగా మిత్రుడు Gautham Ravuri క్రాక్ అనే సినిమాలో ఓ ఊరిని ప్రొజెక్ట్ చేసిన తీరుపై, వాస్తవంగా ఆ ఊరు దేనికి ప్రసిద్ధో చెబుతూ రాసిన ఒక పోస్టు ఆసక్తికరంగా చదివించింది… ముందుగా ఆ పోస్టు యథాతథంగా చదవండి ఓసారి… తన కూతురు ఎవరో అబ్బాయితో సినిమా హాల్లో కనిపించిందని జయమ్మ చెప్పగానే ఆవేశంతో ఊగిపోతాడు […]

‘మూడో పెళ్లాం’పై… ‘మళ్లీ పెళ్లి’పై నరేష్ లీగల్ గెలుపు… ఐనాసరే ‘నాలుగో పెళ్లి’కి చిక్కులే…

August 3, 2023 by M S R

ramya naresh

కోర్టు లీగల్ కోణంలో వెలువరించిన తీర్పు సబబే… సీనియర్ నరేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా నిజానికి తన పెళ్లిళ్ల వ్యవహారంలో తన ధోరణిని సమర్థించుకునే ప్రయత్నమే… తన వెర్షన్ జనంలోకి బాగా వెళ్లడానికి తను సినిమా మాధ్యమాన్ని వాడుకున్నాడు… తెలివైన ఆలోచన… తన మూడో పెళ్లాం రమ్య రఘుపతిని విలన్‌గా చిత్రీకరించాడు… ఐతే సినిమా మొదట్లోనే ఈ కథ కల్పితమనే డిస్‌క్లెయిమర్ ఇచ్చేసి, ఒరిజినల్ పేర్లను పోలే కల్పిత పేర్లనే పాత్రలకు పెట్టడంతో బహుశా […]

వాటీజ్ దిస్ బ్రో..? డైలాగ్స్ రాసేప్పుడు కనీస జాగ్రత్త అవసరం లేదా..?

August 3, 2023 by M S R

parkinsons

సినిమాల్లో పాత్రను బట్టి కొన్ని డైలాగ్స్ ఉంటాయి… ఏదో ఓ పాత్ర ఏవో డైలాగ్స్ చెప్పినంతమాత్రాన అవి ఆ దర్శకుడు, కథారచయిత, డైలాగ్స్ రచయిత అభిప్రాయాలేమీ కావు… అర్థం చేసుకోవచ్చు, కానీ కొన్ని డైలాగ్స్ సొసైటీపై ప్రభావం చూపిస్తాయి… ఉదాహరణకు ఏదేని సినిమాలో ఓ డాక్టర్ పాత్రలో ఏదేని వ్యాధి మీద ఏవేవో తెలిసీతెలియని వ్యాఖ్యలు చేయిస్తే, ప్రేక్షకులు వాటిని నిజమేనేమో అని భ్రమపడే ప్రమాదం ఉంది… అందుకే మాటల రచయిత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి… అఫ్‌కోర్స్, దర్శకుడికి […]

బ్రోదిన బ్రోవగ బ్రోచిన బ్రోదర… ఇది ఏ భాష తమన్ బ్రోదర్ …

August 2, 2023 by M S R

bro

ఇది బ్రో సినిమా గురించిన రివ్యూ కాదు, ఒరిజినల్ సినిమాకు అద్దిన రీమేక్ మసాలాల ఘాటు గురించి విశ్లేషణ కూడా కాదు… అందులోని ఒక పాట గురించిన విమర్శ… గీత రచయిత కళ్యాణ్ చక్రవర్తి రాసిన ఈ పాటను అదితి భావరాజు, ఆదిత్య అయ్యంగార్, అద్వితీయ, అనుదీప్, అరుణ్ కౌండిన్యస్, దామిని భట్ల, హారిక నారాయణ్ తదితరులు పాడారు… ‘‘చలనచిత్రం యొక్క ఇతివృత్తానికి నిజం చేస్తూ, ఈ పాట సంస్కృత- స్తోత్ర శైలిలో కాలానికి మరియు మరణానికి […]

సీమ దసరా చిన్నోడు… రీల్స్, షార్ట్స్ నిండా పిల్లలు, ముసలోళ్ల దాకా అవే స్టెప్పులు

July 30, 2023 by M S R

సీమ దసరా

అప్పట్లో బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా అనే పాట భాఘా ఫేమస్ కదా… ఏ పెళ్లి, ఏ ఫంక్షన్ చూసినా అదే పాట… ఇక రీల్స్, షార్ట్స్ అయితే లెక్కే లేదు… యూట్యూబ్ పండగ చేసుకుంది ఆ పాటతో… విచిత్రమేమిటంటే ఆ పాట పాడిన మోహన భోగరాజుకన్నా ఎక్కడో పెళ్లిలో వరుడి ఎదుట ఈ పాటకు డాన్స్ వధువు వీడియో మహా వైరల్ అయ్యింది…   అంతటి వైరల్ తరువాత మళ్లీ తెలుగునాట మరే వీడియో అంతగా క్లిక్ […]

హీరోలూ, దేవుళ్లు కానవసరం లేదు… జస్ట్, మనుషులుగానైనా స్పందించండి…

July 29, 2023 by M S R

వరద

వరద నీరు ముంచెత్తినప్పుడు ఒక బాధ… వరద నీరు తగ్గాక జరిగిన నష్టం చూసుకుని మరో బాధ… పాత వరంగల్ జిల్లాలోని అనేక గ్రామాల పరిస్థితి అదే… ప్రత్యేకించి మోరంచపల్లి వంటి పల్లెలు దారుణంగా దెబ్బతిన్నాయి… అంతెందుకు..? హిస్టారిక్ భద్రకాళి చెరువుకు గండి సహా ఇప్పటికీ అనేక కాలనీలు వరదనీటిలోనే ఉన్నాయి… ఒక్కొక్క ఇంట్లో మూణ్నాలుగు అడుగుల నీరు, బురద… తిరిగి ఈ జీవితాలు యథాస్థితికి రావడానికి ఎంతకాలం పడుతుందో..? ప్రభుత్వ సాయం ఎలా ఉంటుందో అందరికీ […]

పెళ్లిపెటాకులై చాన్నాళ్లయినా సరే… సమంతను వదలని ఆ ఇంటిపేరు…

July 28, 2023 by M S R

samantha

ఫ్యాన్స్ అంటే అంతే… లాజిక్కులకు, వాస్తవాలకు అందదు ఆ అభిమానం… ఉదాహరణకు సమంత రుత్ ప్రభు ఫ్యాన్స్… రెండు మత పద్ధతుల్లో నాగచైతన్యతో పెళ్లయింది… నాగార్జునకు ఇష్టముండే చేశాడా, చైతూ ఒత్తిడి మేరకు తప్పనిసరై తలవంచి అంగీకరించాడా వేరే విషయం… పెళ్లయ్యాక కూడా ఆమె స్వేచ్ఛావర్తన, పోషించిన కొన్ని పాత్రల తీరుతో అక్కినేని కుటుంబం కోపగించింది… చివరకు చైతూ కూడా ఆగ్రహం చెందాడు… ఠాట్, నువ్వూ వద్దు, నీతో సంసారమూ వద్దు అని తరిమేశాడు… నువ్వేమిటోయ్ నన్ను […]

ఔను బ్రో… అసలే ఫ్యాన్స్‌కు దేముడు… పైగా దేముడి పాత్ర… ఫ్యాన్స్‌కు పండుగ…

July 28, 2023 by M S R

bro

జీవితం ఏది, ఎలా ఇస్తే అలాగే స్వీకరించండి… ఇదీ బ్రో సినిమా కథ సారాంశం… ఇది బలంగా చెప్పాలంటే బలమైన ఎమోషన్స్ ఉండాలి సీన్లలో… అవి పండాలి కథనంలో… కానీ అలా కథ మీద, కథనం మీద కసరత్తులు చేస్తే అది తెలుగు సినిమా ఎందుకవుతుంది..? పైగా ఇందులో పవన్ కల్యాణ్ హీరో… అసలే తనను దేముడిగా పరిగణించే భక్తులకు కొదువ లేదు తెలుగు రాష్ట్రాల్లో… ఇక సాక్షాత్తూ తనను దేవుడి పాత్రలో చూపిస్తుంటే, దానికి తగిన […]

ఎహె, బయటికి వచ్చేశాను అని చెప్పకుండా… క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పాలి…

July 22, 2023 by M S R

గుంటూరు కారం

ఆమధ్య చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్న తరువాత త్రిష ఓ పదం వాడింది… పొసగడం లేదు, పడటం లేదు, ఇష్టం లేదు, అబ్బో కష్టం కాబట్టి తప్పుకున్నా వంటి ఏ పదాల జోలికీ పోలేదు… ఎందుకంటే..? మళ్లీ రిలేషన్స్ బాగుండాలి కదా… అందుకని తెలివిగా, మర్యాదగా క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేసింది… అది ఓ బ్రహ్మ పదార్థం వంటి, భ్రమ పదార్థం వంటి పదం… సరిగ్గా ఇదీ దాని నిర్వచనం అని ఎవరూ చెప్పలేరు… కాకపోతే సినిమాల్లో ఎవరైనా […]

కల్యాణరామ్ పరువు తీసిన అమిగోస్.., టీవీక్షకులూ ఫోఫోవోయ్ అనేశారు…

July 20, 2023 by M S R

amigos

నందమూరి కల్యాణరామ్… ఏళ్లకేళ్లు ఎదురు చూడగా చూడగా డగా… ఒక్క హిట్… దాని పేరు బింబిసార… ఆహా, మావాడు కాకపోతే ఇంకెవ్వరూ ఈ పాత్ర పోషించలేరు, సూపర్, బంపర్ అంటూ జూనియర్ ఎన్టీయార్ తెగ మోశాడు… సరే, అప్పట్లో జానపద ఫిక్షన్ కథలు కాస్త ట్రెండ్ కదా… కాస్త కథ ట్రీట్‌మెంట్ కూడా బాగున్నట్టనిపించింది… సినిమా హిట్టయ్యింది… ఇంకేముంది..? కల్యాణరాముడి సూపర్ ఇన్నింగ్స్ స్టార్టయినట్టే అని సైట్లు, యూట్యూబర్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా సహా మోసేశారు… నిజానికి […]

  • « Previous Page
  • 1
  • …
  • 67
  • 68
  • 69
  • 70
  • 71
  • …
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions