మనిషి విధిని గెలవగలడా..? ఎలా గెలుస్తాడు..? జరగాల్సింది ఏదో ముందే రాయబడి ఉన్న తరువాత, ఇక మారేదేముంది..? సో, తన రాతను విధి కూడా మార్చలేదు… ఇది నమ్మకం… గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు… అయితే దీనికి భిన్నంగా, విధిని కూడా గెలవొచ్చు ప్రయత్నిస్తే… అనే కాన్సెప్టు ఓ కల్పన… మంచిదే… కానీ అది బలంగా ప్రజలకు ఎక్కించాలంటే, నమ్మించాలంటే ఎక్సట్రా ఆర్డినరీ ఎఫర్ట్ అవసరం… యమధర్మరాజును తప్పుదోవ పట్టించిన సతీ సావిత్రి రేంజులో జనాన్ని నమ్మించగలగాలి… […]
బాహుబలి-3… అంత సీన్ లేదు, వర్కవుట్ కాదు, రాజమౌళి మాట అబద్ధం…
బాహుబలి-3 అంటూ అందరూ ఏవేవో రాసేస్తున్నారు… అర్జెంటుగా కొత్త కథలు అల్లేస్తున్నారు… దాన్ని బలంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు… ఒకరకంగా ఇప్పుడిది ప్రచారంలోకి రావడం రాజమౌళి బ్లండరే… ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ జరగాల్సినవేళ చర్చను బాహుబలి సీక్వెన్స్ మీదకు తనే ఒకరకంగా మళ్లించాడు… కరెక్టు కాదు… ఏదో భేటీలో ప్రభాస్ సరదాగా అన్నాడు, ఆర్ఆర్ఆర్ సినిమాలో కనీసం అతిథి పాత్రకైనా నన్ను అడగలేదు అని… నిజంగా చేస్తే గీస్తే హీరో పాత్రే, ప్రభాస్‌ను తీసుకోవాలంటే ఇప్పుడు అంత వీజీ కాదు… […]
ది కశ్మీర్ ఫైల్స్… అనూహ్య ఆదరణ… అప్పుడే ఏడ్పులు, పెడబొబ్బలు షురూ…
కశ్మీరీ ఫైల్స్… ఇప్పుడు ఇదొక సంచలనం… హైదరాబాదులో మొన్న 10 షోలు… నిన్న 40 షోలు… రేపు 100 షోలు అట… కుటుంబాలతో వెళ్లి చూస్తున్నారు సినిమాను… హౌజ్ ఫుల్… ఓ మిత్రుడు ఇలా రాసుకున్నాడు ఫేస్బుక్లో… ‘‘సినిమా అయిపోయింది. చాలా మంది ఎమోషనల్ గా ఉన్నారు. ఓ పాతికేళ్ల అమ్మాయి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి వెళ్తోంది. వృద్ధులు బాగా ఎమోషనల్ అయిపోయి సీట్లలో నుంచి త్వరగా లేవడం లేదు. ఎక్స్ ప్రెషన్లు భారంగా ఉన్నాయి. ఉన్నట్టుండి […]
తమన్‌కు బాగా తలకెక్కినట్టుంది సక్సెస్ కిక్కు… శృతి తప్పిపోతున్నాడు…
కాపీ కొడతావా..? కొట్టు..! ఓ టీం పెట్టుకుని, క్రియేటివ్ వర్క్ చేయించి, నీ పేరుతో నీ గొప్పగానే చెప్పుకుంటావా..? చెప్పుకో..! అసలు సరుకు ఏమీ లేకపోయినా, ఇంకేదో కళతో నెట్టుకొస్తున్నావా..? గుడ్, కంటిన్యూ…! సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే అల్టిమేట్… ఎలా సాధించావనేది ఎవడూ చూడడు, ఏం సాధించావనేదే చూస్తారు… విజయాల కిక్కు తలకెక్కినా పర్లేదు, ఇండస్ట్రీ భరిస్తుంది, పిచ్చి విలేకరులు భరిస్తారు, పిచ్చి జనం భరిస్తారు… కానీ ఎన్నాళ్లు..? సంగీత దర్శకుడు తమన్ చాలా సీరియస్‌గా […]
డాళింగ్ పాన్ ఇండియా ప్రభాస్‌కు అభిమానంతో రాయునది ఏమనగా…
….. By ……… Sridhar Bollepalli……. డాళింగ్ ప్రభాస్.. వివాదాలకి దూరంగా వుండే మంచి మనిషి. అతని గురించి ఎవరూ నెగటివ్‌గా మాట్లాడుకోవడం మనం విని వుండం. నిజానికి రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్ యింకో హీరోకి వచ్చివుంటే ట్రోలింగ్ నెక్స్ట్ లెవెల్లో వుండివుండేది. కానీ, ప్రభాస్ మీద వున్న పాజిటివ్ యింప్రెషన్ వల్ల.. రాధేశ్యామ్ బాగోలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి చాలా సున్నితమైన పదాలు ఎంచుకుంటున్నారు జనాలు. ఈ కోణంలో ప్రభాస్ అదృష్టవంతుడు. కృష్ణంరాజుకి కొడుకు వరసవ్వడం […]
ఆయనకు ఒకాయనతో… ఆమెకు మరొకామెతో… అదోతరహా మూవీ, బాగానే తీశాడు…
….. Review :: John Kora……. బధాయ్ దో.. (శుభాకాంక్షలు చెప్పండి) ”నిన్ననో మొన్ననో ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట వరకు వెళ్లడానికి మెట్రో ఎక్కిన… స్టార్టింగ్ పాయింటే అయినా ఎల్బీనగర్లో స్టాండింగ్ పొజిషన్లో జర్నీ ప్రారంభించిన… దిల్షుక్నగర్ రాగానే మెట్రో ఫుల్ అయ్యింది… నా వెనుకే ఒక అంకుల్ పొట్టేసుకొని నిలబడ్డాడు… ప్రతీ స్టేషన్లో బ్రేక్ పడ్డ ప్రతీసారి ఆయన పొట్ట నాకు తగలడం… నాకు పరమ కంపరంగా అనిపించడం జరుగుతూనే ఉన్నది… సాటి మనుషులంటే నాకు […]
రాజేంద్రప్రసాద్‌కు అప్పుడర్థమైంది రామోజీ మార్క్ మర్యాద ఏమిటో..!!
చాలా ఏళ్ల క్రితం… రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడే హీరో అవుతున్నాడు… భానుప్రియ మాంచి జోరు మీదుంది… దర్శకుడు వంశీకి ఒకటీరెండు మంచి హిట్లు పడ్డయ్… రామోజీరావు అప్పుడు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ కింద సినిమాలు నిర్మిస్తున్న రోజులు… వంశీకి ఓ సినిమా అప్పగించాడు… పేరు ‘ప్రేమించు పెళ్లాడు’… షూటింగు, ఏర్పాట్లు వంటి వ్యవహారాల్ని బాపినీడు చూసుకునేవాడు… రాజేంద్రప్రసాద్ శ్రీదుర్గ లాడ్జిలో ఉన్నాడు… ఓ సాయంత్రం వంశీ ఉన్న వేరే రూమ్కొచ్చాడు… వంశీ రూమ్ షెల్ఫుల్లో రకరకాల పచ్చళ్ల సీసాలు […]
ఈటీ బ్లండర్… అసలు సూర్య ఈ సినిమా అంగీకరించకుండా ఉండాల్సింది…
చేజేతులా చెడగొట్టుకోవడం అంటే ఇదే..! నిజానికి హీరో సూర్య ఈ సినిమాను ఒప్పుకోవాల్సింది కాదు… మరి ఎందుకు ఈ కథను ఎంచుకున్నాడో తెలియదు… కెరీర్‌కు బురద పూసుకోవడం అంటారు దీన్నే… సూపర్ పాపులారిటీ ఉంది.., జైభీమ్, ఆకాశం నీ హద్దురా ఓటీటీ సినిమా విజయాలు ఈమధ్యే తన ఖాతాలో పడ్డాయి… అందరిలాంటి హీరో కాదు, తెలివైనవాడు, మంచి కథలు-ప్రయోగాలతో ప్రేక్షకుల అభిమానం పొందుతున్నాడు అనే పేరొచ్చింది… ఏం లాభం..? ఓ పాత చింతకాయ పచ్చడిని వడ్డించాడు మనకు… […]
హస్తరేఖలు తిరగబడ్డయ్… విధిరాత వెక్కిరించింది… ఇది ప్రభాస్ సినిమాయా..?!
నిజానికి ఓ సినిమాకు అవసరమైనన్ని ముందస్తు హైప్ పాయింట్లకన్నా చాలా ఎక్కువ… రాధేశ్యామ్… బాహుబలి, సాహో తాలూకు ఇమేజీ నుంచి బయటపడటానికి ప్రభాస్ ఓ పిరియాడిక్, డిఫరెంట్ లవ్ స్టోరీ ఎంచుకోవడం… 300 కోట్లు ఖర్చు చేయడం… విజువల్స్ మీద భారీగా ఖర్చుపెట్టడం… పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్గా ఉండటం… ట్రెయిలర్స్ బ్రహ్మాండంగా హిట్ కావడం… ప్రభాస్ లుక్కే కొత్తగా ఉండటం… అలనాటి దిల్ కా దడ్కన్ భాగ్యశ్రీ తల్లిగా నటిస్తుండటం… విధి, ప్రేమ నడుమ […]
‘‘కొత్త సిగరెట్ డబ్బా నా చేతిలో పడితే తప్ప సెట్‌కు రానేరాను పొండి..’’
1964 నాటి కాలం… గుడి గుంటలు షూటింగ్ సాగుతోంది… అందులో ఎన్టీయార్ హీరో… ఆ పాత్ర బాగా సిగరెట్లు తాగుతూ ఉంటుంది సినిమాలో… నిజానికి రామారావు సాధారణంగా సిగరెట్లు కాల్చరు… కానీ ఏదైనా సినిమాలో సిగరెట్లు కాల్చే పాత్ర ఉంటే మాత్రం రోజుకు రెండు డబ్బాల స్టేట్ ఎక్స్‌ప్రెస్ సిగరెట్లు ఊదేసేవారు… సో, గుడిగంటలు షెడ్యూల్లో ఆయన కోసం రోజూ రెండు డబ్బాల స్టేట్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ సిగరెట్లు తెప్పించి రెడీగా ఉంచేవాళ్లు… ఈ సినిమాకు డూండీ […]
ఈ టికెట్ల కొత్త జీవోకన్నా… ఆ సన్నాఫ్ ఇండియా సినిమా చాలా బెటర్…
మూడు రాజధానుల బిల్లు, సీడీఆర్ఏ చట్టం రద్దు… కానీ త్రిరాజధాని తప్పదు… అదెలా చేస్తారో తెలియదు… దీన్ని యూటర్న్ అనాలా..? డబ్ల్యూ టర్న్ అనాలా..? వీ టర్న్ అనాలా..? ఏమోలెండి… సినిమా టికెట్ రేట్లపై జగన్ ప్రభుత్వ నిర్ణయాలు, అడుగులు సేమ్, అంతే గందరగోళం.,. ఇలాంటి వింత ప్రభుత్వ ఉత్తర్వులు ఈమధ్యకాలంలో రాలేదేమో బహుశా… నవ్వు, జాలి ఒకేసారి పుట్టిస్తుంటయ్ ఇలాంటి జీవోలు… మంత్రులు ఏమన్నారు..? హీరోల రెమ్యునరేషన్‌ను ప్రస్తావించారు, పేదవాడు సినిమాలు చూడొద్దా అనడిగారు, మా […]
హీరోల మాటలే అర్థం కావు… మన ఖర్మానికి హీరోయిన్లూ తయారయ్యారు…
చెప్పేవాడికి వినేవాడు లోకువ… రాసేవాడికి చదివేవాడు లోకువ… సినిమావాడికి ప్రేక్షకుడు లోకువ… హీరోకు, హీరోయిన్‌కు ప్రజలందరూ లోకువ…… పూజా హెగ్డే అనబడే ఓ పొడుగు కాళ్ల సుందరి తెలుగు సినిమాల్లో కూడా నటిస్తుంటుంది… తెలుసు కదా… అల వైకుంఠపురంలో ఆ కాళ్ల దగ్గరే సిరివెన్నెల, అల్లు అర్జున్, తమన్, త్రివిక్రమ్ పొర్లుదండాలు, పొగడదండలు… దాన్నలా వదిలేస్తే… నిన్న రాధేశ్యామ్ సినిమా ప్రమోషనల్ ప్రెస్మీట్లో ఆమె చిలుక పలుకులు ఆశ్చర్యాన్ని, నవ్వును పుట్టించాయి… అఫ్కోర్స్, కాసింత జాలి కూడా..! […]
బీమ్లానాయక్ ఒరిజినల్ ఏం బాగుందని..! జస్ట్, ఇగో క్లాష్ అనే థిన్ లైన్…
Hari Krishna MB…………… అయ్యప్పనుమ్ కోషియుమ్.. మలయాళం కాబట్టి అన్నీ బాగుండాలని ఏం లేదు.. చాలా చెత్తగా తీసిన ‘మరక్కార్’ మూవీ ఆస్కార్ కి వెళ్ళింది… పరమ బోరింగ్ మూవీ… ఆస్కార్ అనేదేమీ గొప్ప స్థాయి కాదు… just చెప్తున్నా…[అమెరికా వాళ్ళు తీసే ప్రతి చెత్త war movie కి దండిగా awards వస్తాయి].. అయినా మరక్కార్ లాంటి మూవీ అక్కడి వరకూ ఎలా వెళ్లిందా అని.. last year వెళ్లుంటే The Great Indian Kitchen […]
భేష్ సూర్యా..! హీరోయిజం అంటే ఏమిటో చెప్పావ్… కొందరిని భలే కొట్టావ్…
‘‘ఆకాశం నీ హద్దురా సినిమాలో పెళ్లాంతో చెంపదెబ్బ తింటాను… డబ్బు అడుగుతాను… జై భీమ్ సినిమాలో తొలి అరగంట అసలు నా పాత్రే కనిపించదు… హీరోయిజం గురించి ఆలోచిస్తే ఆ తరహా సినిమాలు చేయలేం, చేశాను కాబట్టే నాకు గౌరవం దక్కింది……’’ హీరో సూర్య చెప్పిన మాటలు… తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద హీరోలకు చెళ్లుచెళ్లున తగులుతున్నట్టు..! సొంత హీరోయిక్ పోకడలతో చరిత్రకు వక్రబాష్యాలు చెప్పడం, వంకర కథనాలతో చారిత్రిక పోరాటవీరుల కథల్ని భ్రష్టుపట్టించడం, ఒరిజినల్ సినిమాల్లోని […]
గల్లా నుంచి గాలి దాకా… తెరమెరుపు కోసం తహతహ… హీరో అయిపోవాలంతే…
గల్లా నుంచి గాలి దాకా… సినీ కుటుంబమే కానక్కర్లేదు… ఆ వారసత్వమే అక్కర్లేదు… ధన కుటుంబం అయితే చాలు… ఇండస్ట్రీ చుట్టూ చేరుతుంది… జేజేలు కొడుతుంది… వెండితెరపై మరో హీరో ఉద్భవిస్తాడు… డబ్బులు, డబ్బులు… హీరోకు నచ్చిన హీరోయిన్లు, విలన్లు, డైరెక్టర్లు అందరూ వచ్చేస్తారు… నటన, డిక్షన్ మన్నూమశానం ఎవడికి కావాలి..? నాలుగు ఫైట్లు పడ్డాయా… మంచి సాంగులు పడ్డాయా… చాలు, తెరపై హీరోయిజం వర్ధిల్లాలి… ఆకర్షణ… పాపులారిటీ, అమ్మాయిలు, సౌఖ్యాలు, విలాసాలు… వాట్ నాట్… హీరో […]
ఝండ్..! చూడాల్సిన మూవీ… ఎందుకు..? అది చెప్పేదే ఈ రియల్ రివ్యూ…!
….. By…. Chaithanya Pingali ………… ఎక్కడ మొదలు పెట్టాలో తెలీట్లేదు. భాషలో, expression లో unlearning చాలా కావాలి dalit film maker తీసిన సినిమాల గురించి కాని, దళిత్ ఫిల్మ్ గురించి కాని రాయాలి అంటే. but cant resist…. pan indian movie అనేది ఈ కరోనా వచ్చిన నాటి నుండి నానుతోంది కదా అన్ని చోట్లా. అసలు pan indian movie అంటే ఏంటి? pan అంటే అర్థం presence across […]
No Time To Die..? No… Time To Die..! చివరకు చంపేశారు కదరా..!!
బాండ్… జేమ్స్ బాండ్… 25 సినిమాలు… అసలు బాండ్ అంటే ఎలా ఉండాలి..? సిగ్నేచర్ ట్యూన్‌తో గూస్ బంప్స్ మొదలైతే ఎండ్ వరకూ ఎక్కడా థ్రిల్ ఆగొద్దు… మధుబాబు నవలల్లో షాడో పాత్రలాగా… తెలుగు సినిమాల్లో మడత నలగని హీరోలాగా… పేలుళ్లు, కాల్పులు… సముద్ర అంతర్భాగం నుంచి అంతరిక్షం దాకా… ఎడారుల నుంచి మంచుమైదానాల దాకా… బాండ్ అడుగుపెడితే ఆపరేషన్ సక్సెస్ కావల్సిందే… సినిమా చివరలో తను కన్నుగొట్టి, అదో తరహా చిరునవ్వుతో ప్రేక్షకుడికి బైబై చెప్పాల్సిందే… […]
వెండితెరపై ఓ టీవీ సీరియల్..! బోలెడు ఆడ పాత్రలూ, మీకు జోహార్లు..!
తెర నిండుగా ఉంటుంది… బోలెడు పాత్రలు ఫోటోషూట్ కోసం నిలబడ్డట్టుగా వరుసగా నిలబడతారు… పెద్ద ఆసక్తికరంగా ఉండదు కథ… ఏవో నాలుగు సీన్లు… చాలాసార్లు కృతకంగా……. ఏమిటి, టీవీ సీరియళ్ల గురించి చెబుతున్నారా అని అడక్కండి… నేను అచ్చం ఆ టీవీ సీరియల్ వంటి ఓ సినిమా గురించే చెబుతున్నాను… సర్లే, టీవీల్లో వచ్చినప్పుడో, ఓటీటీల్లో ఇచ్చినప్పుడో చూసేస్తాం లెండి అని మూసేయకండి… అరె, వాళ్లు థియేటర్లలో రిలీజ్ చేశారు… చెప్పుకోకపోతే ఎట్లా..? సరే, చెప్పు, చెప్పు…. […]
హీరోలకు అసలు ఫ్యామిలీలు ఉంటే కదా… బామ్మ, మామ్మ పాత్రలు కనబడేది…
Bharadwaja Rangavajhala……………. తెలుగు సినిమా ఆడియన్సుకు హాయ్ … అయ్యా నా పేరు నిర్మల … నన్ను నిర్మలమ్మ అంటారు ఇక్కడ సినిమా ఆడియన్సు. సారీ అనేవాళ్లు … ఆడియన్సే కాదండీ … సినిమా హీరోలూ అందరూ కూడా … మీ మెగాస్టార్ చిరంజీవికి అదే ఇప్పుడు ఆచార్యగా వస్తున్నాడు కదా … ఆయనకి కూడా బామ్మగా నటించాను. ఆయనకేంటి ఆయనతో గొడవ పడతా ఉంటాడు చూడండీ … మోహన్ బాబు, ఆయనకీ బామ్మగా వేశా … […]
ఓహ్… నాగబాబు తెలివైన అడుగు… మంచు విష్ణు ఇదేమని అడగలేడు…
ఫేస్బుక్లో ఓ మిత్రుడి వాల్ మీద ఓ ఫోటో చూస్తే ఆశ్చర్యమేసింది… నిజంగానే ఇంట్రస్టింగ్… విషయమేమిటంటే… ఈమధ్య మంచు విష్ణు తన పర్సనల్ హెయిర్ స్టయిలిస్ట్ నాగ శ్రీను మీద పోలీస్ కేసు పెట్టాడు… 5 లక్షల విలువ చేసే హెయిర్ స్టయిల్ పరికరాలు, సామగ్రిని శ్రీను చోరీ చేశాడనేది అభియోగం… విష్ణుకు పర్సనల్ హెయిర్ స్టయిలిస్ట్, 5 లక్షలకు ఎందుకు కక్కుర్తి పడతాడు అనే డౌట్ వచ్చింది అందరికీ… శ్రీను తనే ఓ వీడియో రిలీజ్ […]
- « Previous Page
- 1
- …
- 94
- 95
- 96
- 97
- 98
- …
- 117
- Next Page »