ధా… రా… ణా… హా… ఛే… నో… రా… హా… ధా… రా… య… జ… చౌ… రౌ… రా… ఏ… …. ఈ అక్షరాల్ని ఓసారి పాడటానికి ప్రయత్నించండి… పోనీ, మీకిష్టమున్న ట్యూన్లో… బీభత్సం, క్రౌర్యం, భీకరం గట్రా వినిపించాలి… అబ్బే, రావడం లేదా..? ఎక్కడో, ఏ ఒడిశా మారుమూల గ్రామంలోనో, అమావాస్య, చీకటిపూట, భీతిగొలిపే స్మశానంలో, ఏ మంత్రగాడు దార్కాయో కాష్మోరాను పిలుస్తున్నట్టుగా… ఏదో క్షుద్రశక్తిని ఆవాహన చేస్తున్నట్టుగా ఉన్నాయా..? ఛ, తప్పు… ఇది […]
అయ్యా… త్రివిక్రముడా… ఏడో తరగతి సాంఘిక శాస్త్రం చదువు ఒక్కసారి…
మన ప్రేక్షకులంటే మన దర్శకులకు మరీ చిన్నచూపు… మేమే సర్వజ్ఞులం, మేమేం చెబితే అదే వేదం, ఎడ్డి ప్రేక్షకులకేం తెలుసు అనుకుంటారు… దీనికి తగ్గట్టు మాటల మాంత్రికుడు గట్రా బిరుదులతో మీడియా, తోటి ఇండస్ట్రీ పర్సనాలిటీలు భుజకీర్తులు తొడిగేసరికి… ఏమో, నిజమేనేమో, మేం మహాతోపులమే కావచ్చు సుమా, లేకపోతే ఇంతమంది ఎలా భజిస్తారు అని మరింతగా కిక్కెత్తిపోతుంది… త్రివిక్రమ్ శ్రీనివాస్ బీమ్లానాయక్ సినిమాలో ‘‘గజినీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు, వాడి మీద నెగ్గినవాడి […]
కచ్చా బదంలాగే… ఇది హలామిత్తీ హబీబో… అర్థాలు అక్కర్లేని అరబిక్ కుత్తు…
దళపతి విజయ్… అనగా కమాండర్ విజయ్ కొత్త సినిమా పేరు బీస్ట్… అనగా మృగం… ఐనా ఈమధ్య తమిళ సినిమాలకు గమ్మతి పేర్లు పెడుతున్నారుగా… వలిమై, బిగిలు, ఈటీ, బీస్ట్… ఎన్నన్ని కొత్త ఆప్ట్ పేర్లు దొరుకుతయ్, కానివ్వండి… విషయం ఏమిటంటే… అలాంటి పేరే ఉన్న మరో సినిమా… కేజీఎఫ్-2 తో పోటీ… ఢీ… ఒకటి తమిళం, మరొకటి కన్నడం… ఇప్పుడు ప్రతిదీ పాన్ ఇండియాయే కదా… తెలుగులో కూడా డబ్ చేసి వదులుతున్నారు… కేజీఎఫ్ ఫస్ట్ […]
కశ్మీరీ ఫైల్స్ నిర్మాతల టైగర్ ఫైల్స్..! తెలుగు రాబిన్‌హుడ్ బయోపిక్..!!
Nancharaiah Merugumala…………….. కశ్మీర్ ఫైల్స్ ‘పాపం’ టైగర్ నాగేశ్వరరావుతో కడిగేసుకోవచ్చని గుర్తించిన అగర్వాల్స్..? మూడు దశాబ్దాల నాటి కశ్మీరీ పండితుల బలవంతపు వలసలు, ఇంకా తీరని వారి కష్టాలపై సినిమా తీసిన వివేక్ అగ్నిహోత్రి, పల్లవీ జోషీ దంపతులకు పెట్టుబడులు అందించిన అభిషేక్ అగర్వాల్, ఆయన అన్న తేజ్ నారాయణ్ అగర్వాల్ ఇప్పుడు స్టువర్ట్పురం పెద్ద దొంగగా మా తరం వారికి సుపరిచితుడైన ‘టైగర్’ నాగేశ్వరరావుపై తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో సినిమా నిర్మిస్తున్నారనే […]
R – Rusted… R – Ruined… R – Ruptured… మూడార్లు అనగా సూక్ష్మంగా అంతే…
……. Opinion of Katta Srinivas…….. సెల్యులాయిడ్ చరిత్రకి చెదలు పట్టించగలడా? R-Rusted R- Ruined R- Ruptured… మూడార్లు ఇప్పటికి చూడటం కుదిరింది. రెండు తెలుగు రాష్ట్రాలను, సినిమా ఇండస్ట్రీ రెండు పెద్ద కుటుంబాలను బాలన్స్ చేయడం గురించో, కళ్ళ ముందటి కనికట్టు కలెక్షన్స్ గురించో బ్లా బ్లా బ్లా చెప్పలేను, కానీ కరోనా తర్వాత గుంపులో కలిసే, కరువు తీర్చే మార్గమనో.., సమాజాన్ని బ్రతికిస్తోందో, సమాజం మీద బ్రతుకుతుందో, సినిమా ఇండస్ట్రీకి ఇది కొత్త […]
ఆర్ఆర్ఆర్ Vs రాధేశ్యాం..! డెస్టినీకి ఓ పర్ఫెక్ట్ ఉదాహరణ… ఎలాగంటే..?!
రాధేశ్యామ్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో పెట్టేశారుగా… ఆ కథలో ప్రధానమైన చర్చ డెస్టినీ… అంటే, విధిరాత… దాన్నెవడూ తప్పించలేడు అనే జనాభిప్రాయానికి భిన్నంగా… మనిషి బతుకు చేతుల్లో కాదు, చేతల్లో ఉంటుందనే విషయం చెప్పడానికి దర్శకుడు విఫలప్రయత్నం చేశాడు… శుద్ధ తప్పు… చేతల్లో ఏముంది..? చేతుల్లోనే ఉంది… అందుకే సినిమా మునిగిపోయింది… ఆ సినిమాలో టైటానిక్‌లాగే… జ్యోతిష్యం 99 శాతం సైన్స్ కావచ్చుగాక, కానీ ఆ ఒక్క శాతం విధిరాత నుంచి తప్పించుకుంటారు, వాళ్లే చరిత్ర సృష్టిస్తారు […]
ఈటీవీ బుర్రలు వెలిగాయి… మూడో స్థానదరిద్రం దేనికో బోధపడింది…
ఈటీవీ ఎందుకు మూడో స్థానంలో కొట్టుకుంటోంది… అసలు రెండో స్థానంలో ఉన్న జీతెలుగు ప్రోగ్రామ్సే పెద్ద నాసిరకం… ఐనాసరే, ఈటీవీ రోజురోజుకూ చివరకు జీతెలుగుతో కూడా ఎందుకు పోటీపడలేకపోతోంది… ఏవేవో రియాలిటీ షోలు చేస్తుంటారు… ఆ బూతు జబర్దస్త్ ఉండనే ఉంది, చివరకు ఈటీవీ న్యూస్‌ను కూడా వినోదాల జాబితాలో కలిపేశారు… ఐనా ఆ వెలితి ఎందుకు..? ఆలోచించగా, చించగా వాళ్లకు బోధపడింది ఏమిటంటే..? మన సీరియళ్లను ప్రేక్షకులు ఇష్టపడరు, దేకరు… అందుకే ఈ దురవస్థ అనేది […]
కొత్త ట్రెండ్ గురూ… నెత్తి మీద పిచ్చుకగూడు… అడ్డదిడ్డంగా పెంచేయాలంతే…
డీజే టిల్లు… ఓటీటీలో పడేశారుగా… కాస్త నెమరేస్తుంటే కొన్ని విశేషంగా కన్పించినయ్… అబ్బే, థమన్ బీజీఎం గురించి కాదు, టిల్లూ టిల్లూ అని సూపర్ హిట్ అయిన ఎంట్రీ సాంగ్ ట్యూన్, టోన్, మ్యూజికే సినిమా చివరిదాకా కొట్టి ఇడిశిపెట్టిండు… అఖండకు ఏం కష్టపడ్డడో తెలియదు గానీ టిల్లుకు మాత్రం అలవోకగా, అనాయాసంగా సరదాగా కొట్టిపడేశాడు… ఆ దర్శకుడెవరో గానీ ఎక్కడా ‘అతి వేషాలు’ ప్రదర్శించలేదు… సాఫీగా నడిపించాడు కథను… అసలు కథ, మాటలు, హీరో, ఎట్సెట్రా […]
‘‘లక్కీగా సెంట్రల్ లాక్ పడలేదు… డోర్స్ ఓపెనయ్యాయి… బతికిపోయాను…’’
‘‘నేను అప్పుడు రాధిక వాళ్లదే ఓ తమిళ సీరియల్లో చేస్తున్నాను… అమ్మవారి గెటప్… కుట్రాలంలో షూటింగ్, అది ఫినిష్ చేసుకుని, టాటా సఫారీలో బెంగుళూరు వెళ్తున్నాం… మధ్యలో మీనాక్షి హోటలో, మరొకటో ఆపుకుని లంచ్ చేశాం… ఆ టైమ్‌లో నేను ఏదో ఫోన్ మాట్లాడుతూ డోర్ తీయడానికి ప్రయత్నించాను… కానీ డ్రైవర్ లాక్ చేసుకుని ఎక్కడికో వెళ్లాడు… ఎవరైనా కారు లాక్ తీయడానికి ప్రయత్నిస్తే అరుస్తుంది కదా… అప్పట్లో అదొక అలర్ట్ సిస్టం ఉండేది… అది కుయ్ […]
RRR…! చరిత్రకు ఎంత నష్టదాయకం..? అసలు ఇది ద్రోహమేనా..? ఏది అసలు చరిత్ర..?!
……. By… Sridhar Bollepalli……….. ఏది చరిత్ర? ఆర్.ఆర్.ఆర్. సినిమా విడుదలయ్యాక ఆ సినిమా బాగోగుల గురించి జరుగుతున్న చర్చలో భాగంగా కొందరు మిత్రులు అందులో వున్న historical inaccuracies గురించి మాట్లాడారు. చాలా మంచి కోణం అది. సినిమాటిక్ లిబర్టీ పేరుతో చరిత్రని వక్రీకరించడం కరెక్ట్ కాదు అన్న వాదనతో నేను 100% ఏకీభవిస్తున్నాను. కానీ, యిదే సందర్భంలో నాకు వున్న కొన్ని సందేహాలని వ్యక్తం చేయకుండా వుండలేకపోతున్నాను… ఆర్ ఆర్ ఆర్ అనేది ఒక […]
‘ఆన్లైన్’ మీదా అల్లు అరవింద్ గ్రిప్… ఏదీ వదలడు, Real Mega Player…
అల్లు అరవింద్… తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద తన పట్టు మరింత పెరగబోతోంది… ఇప్పటికే బడా నిర్మాత, పెద్ద ఎగ్జిబిటర్, ఏకైక తెలుగు ఓటీటీ, ఎట్సెట్రా… అన్నింటికీ మించి కొడుకు బన్నీ హీరోగా ఎక్కడికో వెళ్లిపోయాడు… ఇవన్నీ గాకుండా మెగాక్యాంప్తో చుట్టరికం… కాదు, కాదు, ఇప్పుడు అల్లుయే పెద్ద క్యాంప్… పవన్, నాగబాబులతో పెద్ద సత్సంబంధాలు లేకపోయినా… చిరంజీవి సొంత బావే… గతంలోలాగా బలమైన ఆర్థికబంధాలు లేకపోయినా హార్ధికబంధాలు పదిలం… తను నిర్మాత కదా… వ్యాపారి… సైలెంట్ […]
ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు… ఆదిపురుషుడూ అంతే… ఆలస్యం అనివార్యం…
అందరూ రాజమౌళి తన సినిమాను లేటుగా నిర్మిస్తాడు, సంవత్సరాలు తీసుకుంటాడు అంటారు గానీ… పెద్ద సినిమాలు తీసే దర్శకులు దాదాపుగా అందరూ అంతే… ఇలా కొబ్బరికాయ కొట్టేసి, ఏ అయిదారు నెలలకో గుమ్మడి కాయ కొట్టేయడం కుదరదు… అసలు ప్రిప్రొడక్షన్ వర్కే బోలెడు ఉంటుంది… ఒకసారి బ్యానర్ కుదిరాక, ఇక దర్శకుడు, హీరో, హీరోయిన్, సంగీత దర్శకుడు, ఇతర నటీనటులు, కెమెరా, ఎడిటర్ గట్రా సెలక్షన్స్ అయ్యేవరకు రోజులు గడుస్తూనే ఉంటయ్… సాంగ్స్ రికార్డింగ్, షూటింగ్ సరేసరి.., […]
తెలుగు హీరోలు ఎలుగ్గొడ్లు అట… వీడెవడో చాలా దూరం వెళ్లిపోయాడు…
Prasen Bellamkonda…… టూమచ్….. సినీ సమీక్షకు కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దులు మీరడానికి కూడా కొన్ని పరిమితులుంటాయి. వాటిని కూడా దాటేసాడితడు. నిజం చెప్పాలంటే సినిమాను సమీక్షించినట్టుగా కాక రాజమౌళి మీద వ్యక్తిగత పగ పెట్టుకుని మూడార్లను వీధి కుళాయి దగ్గర తిట్టుకున్న పద్దతిలో వ్యాఖ్యానం చేసాడు. సినిమా బాగుండకపోతే దాన్ని విమర్శించడానికి చాలా పద్ధతులున్నాయి. ఆ పరిధి లోపల తిట్టొచ్చు. ఆ పద్ధతులను కాదని కూడా మర్యాదగా తిట్టొచ్చు. కానీ ఇతను మరీ మితిమీరాడు. భావ స్వేచ్చ […]
బయట జూనియర్, రాంచరణ్ దోస్తీ… ఆర్ఆర్ఆర్కు అలా యూజ్‌ఫుల్…
నిజంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఏమీ నచ్చలేదా..? ఎందుకు నచ్చలేదు..? ఆ ఇద్దరు హీరోల ధోరణి బాగుంది… నటన గురించి చర్చ వదిలేయండి… ఫ్యాన్స్ విమర్శలు, రచ్చ గట్రా కూడా వదిలేద్దాం… నటనలో వాళ్లిద్దరిలో ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు… కాస్త జూనియర్ ఎన్టీయార్ అనుభవం వల్ల కావచ్చుగాక, తన ఎమోషన్స్ పలికించడం, డైలాగ్ డిక్షన్ కంపేరిటివ్‌గా బెటర్… రంగస్థలం తరువాత రాంచరణ్ నటనలో మెచ్యూరిటీ లెవల్ ఇంకాస్త పెరిగింది… అయితే ఒక మల్టీస్టారర్ […]
తెలుగు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లడం అంటే ఇది కాదేమో..!!
…. రివ్యూయర్ :: Prasen Bellamkonda……… నిజంగా రాజమౌళి తెలుగు సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళారా. తెలుగు సినిమా స్ధాయిని ఎక్కడికో పెంచేసారా. అసలు ఇంకో లెవెల్ కు తీసుకెళ్లడం అంటే ఏమిటి. వెయ్యి స్క్రీన్ ల మీద ఆడించడమేనా. ఐదు వందల కోట్ల పెట్టుబడితో రెండు వేల కోట్లు రాబట్టడమేనా. పాన్ ఇండియా మూవీ అని పేరుపెట్టి అన్ని భాషల్లో రిలీజ్ చేసుకోవడమేనా. ప్రభుత్వాలను మంచి చేసుకుని టికెట్ రేట్లను నాలుగైదు రెట్లు పెంచుకుని […]
అయ్య బాబోయ్… ఏం సినిమా తీశావు రాజమౌళీ… నీ బుర్రే ఓ అబ్బురం….
నిజానికి ఏమీ చెప్పుకోవద్దు… చరిత్రకు వక్రబాష్యం చెబుతూ, చరిత్రపురుషుల కథను వంకరబాట పట్టిస్తూ… కొత్తతరం ఇదే అసలు చరిత్ర అనుకుని తప్పుదోవ పట్టేలా, ఓ చరిత్రకు ద్రోహం చేసిన సినిమా గురించి అస్సలు చెప్పుకోవద్దు… 2000, 3000, 4000, 5000 దాకా బెనిఫిట్ షో టికెట్ల ధరలు… పేదప్రజల ఆరాధ్య సీఎం జగన్ పెంచిన అడ్డగోలు ధరలు… నిరుపేద ప్రజల సీఎం కేసీయార్ పెంచిన ఔదార్యపు ధరలు… ఆ ఫుల్ కమర్షియల్ దందాకు అందరూ దాసోహం అంటున్న […]
అసాధ్యం..! ఆ ఇద్దరితో రాజమౌళి సినిమాకు చాన్సే లేదు… ఉండదు..!!
ఓ మెయిన్ స్ట్రీమ్ పత్రికే… రజినీకాంత్, కమల్‌హాసన్‌తో రాజమౌళి ఓ సినిమా చేయబోతున్నాడని రాసిపారేసింది… బహుశా ఏదో యూట్యూబ్ చానెల్లో చూసి ఇన్‌స్పయిర్ అయిపోయి ఉంటుంది… ఆర్ఆర్ఆర్ సినిమా హైప్ క్రియేటై ఉంది.., ఫిలిమ్ ఇండస్ట్రీలో మొత్తం రాజమౌళి పేరు మారుమోగిపోతోంది… బాహుబలి రికార్డులు, ఈ సినిమాకైన 400 కోట్ల ఖర్చు, వేలాది థియేటర్లలో అయిదారు భాషల్లో రిలీజ్… సహజంగానే సినిమా మీద అసాధారణమైన అంచనాల్ని పెంచుతాయి… ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం గుళ్లు, చర్చిలు, […]
ప్చ్, పుష్ప..! బన్నీ తన పాత టీవీ రికార్డు మళ్లీ బద్దలు కొట్టలేకపోయాడు..!!
పుష్ప… మొన్నటి పదమూడో తారీఖు, ఆదివారం, మంచి ప్రైమ్‌టైమ్‌లో మాటీవీ ప్రసారం చేసింది… ఏ ఇల్లు చూసినా ఆ సినిమాయే… టీవీ ముందు నుంచి కదల్లేదు ఎవరూ… అసలే సూపర్ హిట్ సినిమా.., పాటలు దేశమంతటా హిట్… ఇంకేముంది..? ఇంటిల్లిపాదీ టీవీల ముందు కొలువు దీరారు… ఈసారి రేటింగ్స్‌లో బన్నీ కొత్త రికార్డు క్రియేట్ చేసినట్టే అనుకున్నారు అందరూ… పైగా అది మాటీవీ… రేటింగ్స్ ‘‘సాధించడంలో’’ దిట్ట… నిజంగానే రీచ్ ఎక్కువో, ఇంకేం చేస్తుందో తెలియదు గానీ […]
షేమ్ షేమ్ తెలుగు మేల్ సింగర్స్… ఇజ్జత్ తీసేసిన కీరవాణి…
నో డౌట్… ఎస్పీ బాలు రేంజుకు పాడగలిగే గాయకులు లేకపోవచ్చుగాక… బాలు అంటే బాలు… అంతే… కానీ తనను సరిగ్గా అనుకరించగలిగి, తనకు ఎంతోకొంత దగ్గరకు వెళ్లగలిగి, పాడగలిగేవాళ్లే లేరా ప్రస్తుతం..? సరే, లేరనే అనుకుందాం… కానీ ఒరిజినల్ ఒరిజినలే… ఒక పాటను రీమిక్స్ చేసినప్పుడు అచ్చు ఒరిజినల్లాగే ఉండాలని ఏముంది..? రీమిక్స్‌లో కొత్తదనం ఉండాలి కదా… ఆ పాతదనమే ప్రదర్శించే పక్షంలో ఆ పాత పాటనే వాడేసుకుంటే పోలా..? ఈ ప్రశ్నలు ఎందుకొస్తున్నాయంటే… జూనియర్ ఎన్టీయార్, […]
83 మూవీ..! వరల్డ్ కప్ ఫైనల్ కాదు కదా, లీగ్ మ్యాచ్ స్థాయిలో కూడా లేదు..!
సినిమా బాగుందని చాలామంది రివ్యూలు రాశారు… పోస్టులు పెట్టారు… కానీ పుష్ప ధాటికి తట్టుకోలేదు… నిజంగా పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది సినిమా… థియేటర్లలో ఎప్పుడో విడుదలైనా రీసెంటుగా నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టారు… వాస్తవంగా సినిమా థియేటర్లలో పెద్దగా కలెక్షన్లను సాధించలేదు… క్రికెట్‌ను కూడా ఓ మతంగా భావించే దేశం అదే క్రికెట్ వరల్డ్ కప్ మీద తీసిన 83 సినిమాను ఎందుకు పెద్దగా ఆదరించలేదు..? ఎక్కడుంది లోపం…? బేసిక్‌గా 83 అనే టైటిల్ ఓ అబ్సర్డ్… రాసుకున్న కథలో […]
- « Previous Page
- 1
- …
- 93
- 94
- 95
- 96
- 97
- …
- 118
- Next Page »