పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్… ఈ సినిమాలతో సౌత్ ఇండియా సినిమాలే కాదు, ఆ హీరోలే పాన్ ఇండియా స్టార్స్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది… ఇన్నేళ్లు ఇండియన్ స్టార్స్ అంటే మేమే అని విర్రవీగుతున్న బాలీవుడ్ స్టార్స్ ఇగో బద్ధలైంది… కడుపులు రగిలిపోతున్నాయి… ఎవడ్రా, ఈ సౌతిండియన్ స్టార్స్, అసలు ఈ పాన్ ఇండియా బాగోతం ఏమిట్రా అని కుతకుతలాడిపోతున్నారు… దీనిమీద వాదోపవాదాలు కూడా నడుస్తున్నాయి కదా… ఓ చిన్న వార్త ఆసక్తికరంగా కనిపించింది… ఆర్మాక్స్ అనే […]
కమర్షియల్ కోణంలోనూ… RRR లో రాజమౌళి చేసిన తప్పులున్నయ్…
Naresh Siramani…….. రాజమౌళి RRR సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చింది అనే దానితోపాటు, ఎంతమంది ప్రేక్షకులు చూసారు అనేది కూడా ముఖ్యమే అని దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. RRR సినిమా, టికెట్ ధరలు పెంచడం వల్ల కలెక్షన్స్ పరంగా పర్వాలేదు కానీ, ప్రేక్షకుల సంఖ్యపరంగా చూస్తే RRR పెద్ద హిట్ ఏమీ కాదని అర్థం అవుతోంది… ఈ సినిమాలో చరిత్ర వక్రీకరణలు, లాజిక్ లేకపోవడాలు అనే అంశాలని పక్కనబెడితే, ఒక కమర్షియల్ సినిమాగా కూడా […]
తప్పేదేముంది..? రష్మిక లెంపలేసుకుని ఫ్యాన్స్‌కు సారీ చెప్పింది..!
మీడియా ఒక కత్తి… దానికి బహుముఖ పదును… సోషల్ మీడియా ఓ కృపాణం… అది మరీ లోతుకు దిగుతుంది… చీల్చేస్తుంది… ప్రత్యేకించి సెలెబ్రిటీలకు సంబంధించి ప్రచారానికి, పాపులారిటీకి ఈ రెండూ ఎలా ఉపయోగపడతాయో… జాగ్రత్తగా లేకపోతే అవే చీరేస్తాయి… మరీ సోషల్ మీడియా విజృంభణ పెరిగాక సెలబ్రిటీలు ‘‘ఒళ్లు దగ్గర’’ పెట్టుకుని వ్యవహరించాల్సిన అనివార్యత ఏర్పడింది… ఏ ఇష్యూ లేకపోతే సోషల్ మీడియా పాతవి తవ్వి మరీ కొత్తగా పెట్రోల్ పోసి, మంటలు రాజేస్తాయి… ప్రత్యేకించి మీడియా […]
మేజర్… నాలుగు నగరాల్లో సీక్రెట్ స్క్రీనింగ్… ఆల్రెడీ లిమిటెడ్ రిలీజ్…
మేజర్ సినిమా మీద హీరో అడవి శేషుకు బాగా హోప్స్ ఉన్నాయి… గూఢచారి సక్సెస్ తరువాత ఎవరు సినిమా పెద్దగా ఆడకపోయినా… ఇప్పుడు రిలీజుకు సిద్ధంగా ఉంది మేజర్ సినిమా… మహేష్ బాబు కూడా దీనికి ఆర్థికంగా అండగా నిలిచాడు… ఫుల్లు ప్రమోషన్ వర్క్ నడుస్తోంది… టీవీ షోలలోకి, చాటింగుల్లోకి శేషు స్వయంగా వెళ్తూ ప్రమోట్ చేసుకుంటున్నాడు… ఇది ఓ రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కాబట్టి సహజంగానే కాస్త ఆసక్తిని క్రియేట్ చేస్తోంది… బెంగుళూరులో […]
చూస్తూనే ఉండండి… 1+1 ఆఫర్లు, డిస్కౌంట్ సేల్స్ కూడా వస్తయ్…
ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ వంటి సినిమాల్ని థియేటర్లలో చూడటానికి ప్రేక్షకుడు కాస్త ఎక్కువ ఖర్చయినా భరించటానికి సిద్ధపడతాడు… అవసరమైతే తన తరువాత సినిమాల బడ్జెట్లో కొత్త పెట్టేసుకుంటాడు… కానీ ప్రతి దిక్కుమాలిన సినిమాను ప్రస్తుత టికెట్ రేట్లతో చూడటానికి ఇష్టపడడు… కాదు, అంతగా భరించే స్థితిలో లేదు మధ్యతరగతి ప్రజానీకం… ఈరోజుకూ లక్షల కుటుంబాలు కరోనా తాలూకు సంక్షోభం నుంచి తేరుకోలేదు… సిట్యుయేషన్ ఇలా ఉంటే… జగన్ మీద ఒత్తిళ్లు తెచ్చి, బతిమిలాడి, దేబిరించి, సాగిలబడి… టికెట్ల […]
వెండి తెరపై ఓ సుదీర్ఘమైన జబర్దస్త్ షో… ఇదోరకం కిచిడీ కామెడీ…
జాతిరత్నాలు, డీజే టిల్లు సినిమాలు తెలుసు కదా… లాజిక్కులు, కథాగమనం, తొక్కాతోలూ ఏమీ పట్టించుకోరు… వాటిల్లో కొన్ని సీన్లు చూస్తుంటే, అరె, ఏందిర భయ్, వీటికన్నా జబర్దస్త్, కామెడీ స్టార్స్, డ్రామా కంపెనీ, క్యాష్, ఢీ వంటి షోలలో స్కిట్స్ బెటర్ కదా అనిపిస్తయ్… ఆ క్షణానికి నవ్వించాయా లేదానేదే ప్రధానం… చివరివరకూ థియేటర్లో ప్రేక్షకుడిని కూర్చోబెట్టామా లేదానేదే ముఖ్యం… ఏవో తోచిన కొన్ని వింత మేనరిజాలు, నాలుగు పంచ్ డైలాగులతో కథ నడిపించేయాలి, అంతే… ప్రేక్షకుడు […]
గుడ్ వెంకటేష్… ట్రెండ్ మాత్రమే కాదు, పరిమితులూ తెలిసిన ‘వ్యాపారివి’…
వెంకటేష్‌ను కొన్ని అంశాల్లో మెచ్చుకోవచ్చు…. ఒక ప్రొఫెషనల్ సినిమా ట్రేడర్ కుటుంబసభ్యుడిగా అక్షరాలా అదే స్పూర్తితో వ్యవహరిస్తాడు… కాకపోతే కుటుంబం, వంశం డప్పుల విషయంలో మినహాయింపు లేదు… అయితే… వయస్సు మీద పడ్డాక ఇంకా కుర్ర చేష్టల అమ్మడూ కుమ్ముడూ తరహా స్టెప్పులు, ఓవర్ హీరోయిక్ వేషాల జోలికి పోవడం లేదు… అంతేకాదు… చాలామంది కుర్ర, అనుభవం లేని హీరోల్లాగా మా సినిమాలు థియేటర్లలోనే విడుదల కావాలనే పిచ్చి పట్టింపులు కూడా ఏమీలేవు… అలాంటోళ్ల వల్ల చాలామంది […]
చెప్పడానికి ఒక్క మంచి మాటా దొరకని సినిమా… RRR పై మరో ఘాటు విమర్శ…
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై చాలా రోజులైంది కదా… మరి ఇప్పుడు నిశిత విశ్లేషణలు వస్తున్నాయెందుకు..? అంతలేసి రేట్లు పెట్టి, ఆ చరిత్ర వక్రబాష్యాన్ని థియేటర్లలో చూడటానికి చాలామంది ఇష్టపడలేదు… ఇప్పుడు ఓటీటీలో వచ్చాక, నడుమ నడుమ పలుసార్లు ఆపేస్తూ ఎలాగోలా సినిమాను చూశామనిపించి, ఇక స్పందిస్తున్నారు… నిర్మొహమాటంగా తమ విమర్శల్ని, అభ్యంతరాల్ని ఎక్కుపెడుతున్నారు… ఆ సినిమా రిలీజ్ సమయంలోనే ఒకటీరెండు గొంతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు… సినిమాలోని ఏయే సీన్లు గతంలో ఏయే సినిమాల్లో కనిపించాయో […]
నచ్చావోయ్ తరుణ్ భాస్కర్… నీ ఓరుగల్లు ఒరిజినాలిటీ చంపుకోలేదు…
ఓ వ్యాన్ వేగంగానే పోతోంది… పెళ్లిచూపులు షూటింగు రోజులు… బ్రేకులు ఫెయిలయ్యాయి… అందులో దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండ, మరో నటుడు దర్శి ఉన్నారు… మొదట్లో విజయ్ ఆందోళన పడ్డాడు… దర్శి, తరుణ్ కిందామీదా పడుతున్నారు… దర్శి లాగితే హ్యాండ్ బ్రేక్ ఏకంగా చేతిలోకి వచ్చింది… లక్కీగా ఓ చెట్టు దగ్గర ఆగింది… అప్పటి విజయ్ కులాసాగా చూస్తున్నాడు… ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాం అనే ఆనందంకన్నా విజయ్ నిమ్మలంగా ఎందుకున్నాడు అనే క్యురియాసిటీ ఎక్కువైందట […]
హమ్మయ్య… RRR చూశాక ఆ చింత కూడా తీరిపోయింది… చదవాల్సిన రివ్యూ…
అందరూ ట్రిపుల్ఆర్ సినిమాను రాజమౌళి ఎంత గొప్పగా తీశాడో చెప్పారు, చెబుతున్నారు… చప్పట్లు కొట్టారు… 1200 కోట్లు సమర్పయామి… కానీ తను ధ్వంసం చేసిన విలువలు, చరిత్ర మాటేమిటి..? ఎందుకోగానీ, జరగాల్సినంత చర్చ జరగడం లేదు… క్రియేటివ్ ఫ్రీడం పరిమితుల మీద, పరిమితుల అవసరం మీద, సినిమాలోని అసహజత్వాల మీద, లాజిక్ రాహిత్యాల మీద పెద్దగా ఫోకస్ లేదు… ఇది సమాజాన్ని ఆవరిస్తున్న జడత్వం అనుకోవచ్చా..? చర్చ నిష్ఫలం అనే అంచనాలతో ఓ నిర్లిప్తతలోకి జారిపోవడమా..? రాయగల […]
మరి కేజీఎఫ్ దర్శకనిర్మాతలపై ఏం కేసు పెట్టొచ్చు అధ్యక్షా..?
ప్రపంచంలోని ఏ దేశమైనా సరే… తమ సార్వభౌమత్వాన్ని కించపరిచేలా, తమ చట్టాల్ని తప్పుపట్టేలా, తమ దేశ పరువు ప్రతిష్ఠల్ని అవమానించేలా… అది సాహిత్యం, సినిమా వంటి ఏ క్రియేటివ్ వర్క్ అయినా సరే, కల్పిత ఊహాగానం అని చెప్పినా సరే అంగీకరించదు… అదేమిటో ఇండియాలోనే అన్నీ చెలామణీ అవుతాయి… వేరే దేశస్థులే కాదు, మన దేశస్థులు ఈ విషయంలో ఇష్టానుసారం వ్యవహరించినా మన ప్రభుత్వానికి ఏమీ చేతకాదు… అంతెందుకు… మన రాజ్యవ్యవస్థ బలాన్ని, టెంపర్మెంట్ను బ్యాడ్ లైట్లో […]
KGF-2… RRR కన్నా డబుల్ చెత్తా నిర్ణయం… 199 ధరేమిట్రా బాబూ…
సింపుల్… ఇకపై ఓటీటీల్లో ఫ్రీగా సినిమాలు చూడవచ్చుననే భ్రమల్ని వదిలేసుకొండి… ఓటీటీల్లో కూడా డబ్బు పిండటం స్టార్టయిపోయింది… అదీ అల్లాటప్పాగా కాదు… థియేటర్ల దోపిడీని మించి…! మొన్ననే కదా ట్రిపుల్ఆర్ చూడాలంటే రాజమౌళి జీ5 ఓటీటీలో 100 రూపాయల టికెట్టు పెట్టాడు, వీరపిండుడు ఎక్కడా వదలడు అని తిట్టుకున్నాం… పైగా దానికీ ఆ ఓటీటీ వార్షికచందాకు ముడిపెట్టాడు… ఇద్దరమూ కలిసి ప్రేక్షకుల్ని కుమ్మేద్దాం అనుకున్నారు రాజమౌళి ప్లస్ జీ5…. అయితే అది క్లిక్ కావడానికి ఎన్ని చిక్కులున్నాయో […]
భానుమతి అయితే ఏంటట..! తప్పులు పాడదా ఏం..? బాలు పట్టేసుకున్నాడు..!!
భానుమతి రామకృష్ణ… నటి, నిర్మాత, దర్శకురాలు, గాయని, రచయిత్రి, సంగీత దర్శకురాలు, స్టూడియో ఓనర్… తెలుగు సినిమా చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం… తండ్రి శాస్త్రీయ సంగీత విద్వాంసుడు… అయితేనేం..? తప్పు పాడొద్దని ఏముంది..? మానవ మాత్రురాలే కదా… ఓ పాత వీడియో చూస్తుంటే… బాలు నిర్మొహమాటంగా ఓ పాటలో ఆమె కొన్ని పదాల్ని ఉచ్చరించిన తీరును తప్పుపట్టాడు… అదీ శాస్త్రబద్ధంగానే… అఫ్కోర్స్, బాలు మాత్రం తప్పులు పాడడా..? బోలెడు… అంతెందుకు తనకు బాగా పేరు […]
రాజమౌళి ‘డబ్బు పిండే’ ప్లాన్ కొత్తదేమీ కాదు… ఈ ప్రయోగంపై డౌట్లున్నయ్…
డబ్బులు పిండుకునే కళలో రాజమౌళి సిద్ధహస్తుడు… కొత్త కొత్త మార్కెటింగ్ ఎత్తుగడల్ని ప్రయోగించి, బాహుబలిని ఆ 2 వేల కోట్ల రేంజుకు తీసుకుపోయాడు… ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతకుమించి పిండుకోవాలని తహతహలాడుతున్నాడు… అందుకే ఇప్పుడు ఓటీటీ ద్వారా కూడా సినిమాకు ‘టికెట్లు’ అమ్మే కొత్త ప్రయోగానికి సిద్ధపడ్డాడు… కాస్త వివరంగా చెప్పుకుందాం… కరోనా అనంతరం ప్రేక్షకులు మరీ హిట్ టాక్ వచ్చిన సినిమాలకు తప్ప, ఇతరత్రా సినిమాల కోసం థియేటర్ల దాకా పోవడం లేదు… టీవీలో లేదా […]
పెద్ద పెద్ద స్టార్ హీరోలున్నారు… కానీ రియల్ నటులు ఎందరు..?!
మమ్ముట్టి… వయస్సు 70 ఏళ్లు… యాభై ఏళ్లుగా తను మలయాళంలో తిరుగులేని హీరో… మోహన్‌లాల్ తనకన్నా పదేళ్లు చిన్న… అప్పుడప్పుడూ మన్నెంపుల్లి, జనతా గ్యారేజీ, మనమంతా ఎట్సెట్రా పాత్రలతో తనను గమనించే అవకాశం లభించింది… కానీ మమ్ముట్టి అప్పుడెప్పుడో ముప్ఫయ్ ఏళ్ల క్రితం తను హీరోగా నటించిన స్వాతికిరణం ఓ క్లాసిక్… తరువాత యాత్ర అని వైఎస్ బయోపిక్‌లో ఓ పార్ట్… మళ్లీ ఇప్పుడు సోనీ యాప్‌లో పెట్టిన పుజు… నటవిశ్వరూపం… ఈ వయస్సులో కూడా ఓ […]
ఔనా, థమన్ భయ్..? నువ్వు చెప్పేది నిజమా..? ఓహో, అలాగా..? అబ్బ ఛా..!
సర్కారువారి పాట మూవీ విక్టరీ పార్టీకి థమన్ ఎందుకు పోలేదు..? బీజీఎం సరిగ్గా లేదనీ, రెండు పాటలు కాపీ ట్యూన్లేననీ మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలొచ్చాయి… ఏపాట దేనికి కాపీయో కూడా సోషల్ మీడియా బట్టలిప్పేసింది… ప్రత్యేకించి సూపర్ హిట్ సాంగ్ కళావతి పల్లవి కొత్తగానే ఉన్నా, చరణాలన్నీ తన పాత పాటలకు కాపీయేననీ నెటిజనం విశ్లేషించింది… తనపై జరుగుతున్న కాపీక్యాట్ ప్రచారంతో డిస్టర్బ్ అయినందువల్లే థమన్ సర్కారువారిపాట పార్టీకి పోలేదని ఓ టాక్… […]
నుదుట తిలకమై వాలుతా… ఆకట్టుకునే ప్లజెంట్ మెలొడీ సాంగ్…
సాధారణంగా సినిమా ప్రమోషన్ అంటే… ముందుగా ఒక పాటకు సంబంధించిన ప్రోమో… మళ్లీ మరో ప్రోమో… తరువాత లిరికల్ వీడియో… ఆ తరువాత మరో పాట… పాటలు హిట్టయితే సినిమాకు హైప్… సో, పాటలు బాగుంటే సినిమాకు బాగా ప్లస్… పుష్ప ఘనవిజయంలో పాటలదే ప్రధాన పాత్ర ఈమధ్య కాలంలో… అయితే ఒక సినిమాకు సంబంధించి భలే ఆశ్చర్యమేసే ఒకటీరెండు విశేషాలున్నయ్… మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ తెలుగులో ఓ సినిమాలో నటిస్తున్నాడు… పేరు సీతారామం… యుద్ధంతో […]
భేష్ మమ్ముట్టి… భేష్ పార్వతి… పరిణతి ప్రదర్శించారు, భళిరా అనిపించుకున్నారు…
వెరీ థిన్ లైన్… పెద్ద లోతైన సమీక్ష కాదు, విశ్లేషణ కాదు… కానీ ఏమాటకామాట… కేరళ తారలు నటనలో పర్ఫెక్ట్… మంచి కమిట్మెంట్… (సినిమా పరిభాషలో కమిట్మెంట్ గురించి కాదు…) మంచి నటన తెలిసిన తారలు… నిజానికి అది కూడా కాదు అసలు విషయం… వివక్ష మీద గొంతెత్తుతారు… స్త్రీద్వేషం మీద, మగ వివక్ష మీద, ఆ పోకడల మీద, వేతనాల్లో తేడా మీద సంయుక్తంగా పోరాడతారు… ఒకరికొకరు సంఘీభావంగా నిలుస్తారు… అదెందుకో కాస్త నచ్చుతుంది… అదే […]
ఆలీ నాలుకకు తీట ఎక్కువే… ఆ కంపుకు అడివి శేషూ మూసుకున్నాడు…
కమెడియన్ ఆలీ నోటికి కాస్త తీట ఎక్కువే… ఏదో ఒక పిచ్చి కూత కూయనిదే నాలుక చల్లారదేమో… గతంలో కూడా ఆలీ బహిరంగ వేదికల మీద చేసిన చిల్లర వ్యాఖ్యలపై బోలెడు కథనాలు వచ్చాయి… ఐనా ఆలీ మారడు… మారలేదు… ప్రైవేటు సంభాషణల్లో వోకే, కానీ పది మందీ గమనించే ప్రోగ్రాముల్లోనూ అదే ధోరణి ఆశ్చర్యకరం… ఏపీ పొలిటిషియన్ కదా, తోటి నాయకుల బూతులతో తన నాలుకకు కూడా మరింత పదును పెట్టుకున్నట్టు కనిపిస్తోంది… ఆలీతో సరదాగా […]
మహేష్ బాబు అర్థరహితమైన వ్యాఖ్య… డ్యామేజీ కంట్రోల్ ప్రయత్నాలు…
మామూలుగా మహేష్ బాబు బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు… ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లలో ఎక్కడైనా సరే మాట తూలడు… వివాదాల జోలికి పోడు… కూల్‌గా, హుందాగా ఉంటాడు… కానీ మొన్న ఓచోట హఠాత్తుగా హిందీ సినిమాలకు సంబంధించి చేసిన వ్యాఖ్య ఇప్పుడు వివాదాన్ని కొనితెచ్చింది… నిజంగానే తన వ్యాఖ్యలు అర్థరహితం… హిందీ సినిమా తనను భరించలేదు అనే వ్యాఖ్య సందర్భరహితం కూడా..! తను ఏ మూడ్‌లో ఉండి, ఏం అనబోయి, ఆ మాటలన్నాడో తెలియదు గానీ, ఆ […]
- « Previous Page
- 1
- …
- 97
- 98
- 99
- 100
- 101
- …
- 126
- Next Page »