Akula Amaraiah……… 1879 డిసెంబర్ 30, హిల్స్ కౌంటీ, టెక్సాస్… *డియర్ ఫాదర్, నేను నా వ్యవసాయ క్షేత్రానికి చేరా. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నా. పొలమంతా తిరిగి చూశా. మీరు చెప్పినట్టే చేస్తున్నా.. ఈ ఏడాది మొక్కజొన్న, పత్తి మంచి దిగుబడి వచ్చేలా ఉన్నాయి. తక్షణం నాకు వ్యవసాయ పనివాళ్లు కావాలి…..*. ఏమిటిదనుకుంటున్నారా? సుమారు 150 ఏళ్ల నాడు వ్యవసాయానికి సంబంధించి ఓ కుమారుడు తండ్రికి రాసిన లేఖ అలా సాగుతుంది. మనం కరెంటు బిల్లులు, ప్రామిసరీ నోట్లు […]
‘‘నా చీరె… నా కొప్పు… నా పాట… ఆ నైట్ క్లబ్బులను భలే మార్చేశాయి…’’
ప్రజలందరి ఎదుట నా మొదటి ప్రదర్శన నా తొమ్మిదో ఏట… అప్పటికే మ్యూజిక్ కెరీర్ వేటలో ఉన్న నా అక్కలు నన్ను హమీద్ సయానీ ఆఫీసుకు తీసుకెళ్లారు… తద్వారా సిలోన్ రేడియోలో ఓవల్టీన్ అమెచ్యూర్ అవర్ ప్రోగ్రామ్‌లో పాడే అవకాశం వచ్చింది… చిన్నతనం, బెరుకు, భయంతో ఆ పాట మరిచిపోయాను… వా అంటూ ఆరున్నొక్క రాగంలో ఏడుపు అందుకున్నాను… ‘‘నావరకు అది ఓ ముఖ్యమైన లర్నింగ్ అనుభవం… రెండోసారి మళ్లీ అదే ప్రోగ్రామ్‌లో పాడాను… Itsy Bitsy […]
తెలుగు మాట్లాడే నేరం శిక్షార్హం… మాతృభాష‘దినం’… పాపం శమించుగాక…
దక్షిణాది నాలుగు భాషల్లో తెలుగు ప్రధానమయినది. అయితే మిగతా మూడు భాషలకంటే ముందు అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మాత్రం తెలుగుకే. తెలుగు నామరూపాల్లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే- ఖచ్చితంగా ఇంకో రెండు వందల ఏళ్ళల్లో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు. మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో కానీ- ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది శాతం […]
చివరకు ఉర్దూ షాయిరీలను కూడా వదలని మన క్షుద్రానువాద పైత్యం…
పత్రికల్లో వచ్చేవి అందరూ అన్నీ చదువుతారని కాదు… ఎవరి జానర్ వాళ్లు సెలక్ట్ చేసుకుని చదివి, మిగతావి వదిలేస్తుంటారు… సహజం… కానీ పత్రికల సండే మ్యాగజైన్లు వేరు… సాహిత్యం, సృజన పాళ్లు ఎక్కువ… అసలు ఇక్కడే పాత్రికేయం జాగ్రత్తగా ఉండాలి… ఇవి అందరూ చదవరు… కానీ చదివేవాళ్లు కీన్‌గా ఉంటారు… ప్రతి పదాన్నీ జాగ్రత్తగా చూస్తారు… తప్పును పట్టుకుంటారు… ప్రత్యేకించి అనువాదాల దగ్గర మరీనూ… అనువాదం ఈనాడు పైత్యంలా మక్కీకిమక్కీ ఉండొద్దు… ఒరిజినల్ స్పిరిట్, భావం చెడిపోకుండా […]
నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా డుగ్గుడుగ్గుమని… ఈ అందాల దునియానే సూపిత్తపా…
నాకు బుల్లెట్ ప్రయాణం అంటే తెగ మోజు… ఝామ్మని దూరప్రాంతాలకు వెళ్లేవాడిని… కానీ 2011లో… ఒకసారి నా భార్య లీలకు కాలు ఫ్యాక్చరైంది… నాకేమో స్ట్రోక్ వచ్చింది… ఇద్దరమూ మంచానపడ్డాం… బుల్లెట్‌కు దుమ్ముపట్టింది… ‘బుల్లెట్ మీద అటూఇటూ తిరగడం కాదు, కనీసం బుల్లెట్ నడిపించాలనే ఆలోచనే నీ మనస్సు నుంచి తుడిచెయ్’ అని డాక్టర్ గట్టిగానే హెచ్చరించాడు… ఆయనకు తెలుసు నేను బుల్లెట్ మీద ఎక్కువ శాతం బజారులోనే బతుకుతూ ఉంటానని… నాకు కొంచెం బాగైంది… అంతే, […]
పాన్ మసాలాల్లో ఇవి బాహుబలి రేంజ్… కాదంటే త్రిశూలంతో పొడుస్తాం…
Om Namah Shivaya: మహాశివరాత్రి రోజు ఎప్పటిలా తెల్లవారకముందే లేచి ట్రెడ్ మిల్, వ్యాయామం పూర్తి చేసి… తలుపు తెరిచి… గుమ్మం ముందు పాలు, న్యూస్ పేపర్లు తీసుకున్నాను. శివరాత్రి గురించి అన్ని పత్రికల్లో వ్యాసాలు, వార్తలను చదివితే పండగపూట పుణ్యమయినా వస్తుందనుకుని మొదట అవే చదివాను. శివరాత్రి వ్యాసాలకంటే ‘ఈనాడు’లో పాన్ బహార్ వారి శివరాత్రి శుభాకాంక్షల ఫుల్ పేజీ రంగుల ప్రకటన నన్ను చాలా అయోమయానికి గురి చేసింది. నిజానికి శివుడిని అర్థం చేసుకోవడానికి శివుడే జ్ఞానమివ్వాలి. […]
ఐదో తరగతి డ్రాపవుట్… మాయమైపోయిన 500 ఊళ్ల జాడల్ని పట్టుకున్నాడు…
అతను ఓ చరిత్రకారుడు కాదు, పురావస్తు అధికారి కాదు… కనీసం రీసెర్చ్ స్కాలర్ కూడా అసలే కాదు… సాహిత్యకారుడు కూడా కాదు… ఆ కేటగిరీల్లోని వాళ్లు చేయని పనిని, చేయలేని పనిని, చేతకాని పనిని 42 ఏళ్ల మనిమేల శివశంకర్ చేస్తున్నాడు… ఇంతకీ ఆయన ఏమిటో తెలుసా…? అయిదో తరగతి డ్రాపవుట్… ఓ గుంటూరులోని ఓ ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ఆఫీసులో హమాలీ… తనకున్న స్పేర్ టైమ్‌లో (దొరికేదే తక్కువ) పాత శాసనాలు, పుస్తకాలు, చారిత్రిక ఆధారాల వెంబడి […]
ఈ కథ సిగరెట్ పీకలు, కాలిన చర్మంతో మొదలవుతుంది… ఆమె చెప్పుకుపోతోంది…
ఈ కథ సిగరెట్ పీకలు, కాలిన చర్మంతో మొదలవుతుంది… సరే, నా మాటల్లోనే చెబుతాను… ‘‘ఓ శుక్రవారం రాత్రి నేను నా రేడీయో స్టూడియోలో కూర్చున్నాను… ఆరోజు నాది లైవ్ షో… అంటే కాలర్స్ నుంచి ఫోన్ కాల్స్ తీసుకుని మాట్లాడటం, సమస్యలుంటే ఏవో పరిష్కారాలు చెప్పడం, అనుభవాలు షేర్ చేసుకోవడం వంటివి సాగుతాయి ఆ షోలో… ఓ కాల్ వచ్చింది… లేడీ వాయిస్… మెత్తగా, గుసగుసలాడుతున్నట్టుగా, మెల్లిగా వస్తోంది వాయిస్… ఎవరైనా వింటారేమోనని చెవుల్లో చెప్పే […]
బాధేసింది ఇలాంటి బిడ్డ లేనందుకు… సంతోషం, నా ఇంటి కోడలు ఆమె…
మా అబ్బాయి రోహన్ తన్విని నాకు పరిచయం చేసినప్పుడే అనుకున్నాను… అర్థం చేసుకున్నాను… ఆమె తన గరల్ ఫ్రెండ్ అని..! గరల్ ఫ్రెండ్ అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు వాడు… కానీ నాకు అర్థమవుతుంది కదా… జాన్‌తా హుఁ అప్‌నే బేటే కో… ఆమెను చూడగానే ఎందుకో అనిపించింది తను మా కుటుంబంలో సరిగ్గా ఇమిడిపోతుందని… నాకు బాగా గుర్తుంది… మేం మొదటిసారిగా కలిసినప్పుడు నా కాళ్లకు దండం పెట్టింది తను… అంతేకాదు, తన బాగా మాట్లాడుతోంది… పద్ధతిగా… […]
శిలలు ద్రవించి ఏడ్చినవి… జీర్ణములైనవి తుంగభద్రలో… (పార్ట్-2)
Talking Stones: “శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో పల గుడిగోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుం పులకు చరిత్రలో మునిగిపోయిన దాంధ్రవసుంధరాధిపో జ్వల విజయ ప్రతాప రభసంబొక స్వప్న కథా విశేషమై”….. తెలుగు పద్య ప్రేమికులకు బాగా పరిచయమయిన, ఎంతో ఇష్టమయిన పద్యమిది. ఈ పద్యం చదివి, విని, అర్థం చేసుకుని ఇప్పటి హంపీ శిథిలాల్లో ఆకాశం అంచులు తాకిన అప్పటి విజయనగర వైభవాన్ని ఊహించుకున్న వేనవేల మందిలో నేనూ ఒకడిని. కావ్యం ఎప్పుడూ శ్రీకరంగా, మంగళంతో […]
ప్రపంచ వినోద రాజధానిలో ఓ మైనపు బొమ్మల కొలువు… చూస్తే అచ్చెరువు…
Akula Amaraiah……… మైనపు బొమ్మా, నువ్వెవరమ్మా! బొమ్మకు ప్రాణం పోసిన టుస్సాడ్స్.. లాస్ వెగాస్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఎలా ఉందంటే….. చూపు చుక్కల్లో ఉన్నా కాళ్లు నేలమీదుండాలిగా.. లండన్ పోతానో లేదో, పోయినా కారల్ మార్క్స్ సమాధీ, మేడమ్ టుస్సాడ్స్ మైనపు బొమ్మల మ్యూజియం చూస్తానో లేదో… మబ్బుల్ని చూసి ముంతలో నీళ్లు వొలకబోసుడెందుకు? ఉన్నది చూస్తే పోలా! అనుకుంటూ లాస్ వెగాస్ టుస్సాడ్స్ మ్యూజియం బిల్డింగ్ ముందాగాను. నా మది కనిపెట్టిన మమ్మాయి దీప్తి.. […]
ఈనాడు స్పూర్తితో క్షుద్ర అనువాద ‘గీతం’… మీకు ‘కార్యశాల’ అంటే తెలుసా..?
కొత్తగా చాట్‌జీపీటీ వచ్చింది కదా… అంతకుముందు నుంచే గూగుల్ ట్రాన్స్‌లేషన్స్ తరీఖ చూస్తున్నాం కదా… మరీ కొత్తగా బాడ్ రాబోతోంది కదా… ఇవి గాకుండా మైక్రోసాఫ్ట్ అనువాదం వంటివీ ఉన్నాయి… నిజానికి ఏదీ సరైన అనువాదం కాదు, పైగా నవ్వు పుట్టించే అనువాదాలు… అన్నీ ఈనాడు అనువాదాల తరహాయే… ఈనాడులో వచ్చే అనువాద పదాలను చదివి మనం ఎన్నిసార్లు పకపకా నవ్వుకున్నామో కదా… అప్పుడప్పుడూ ఈనాడును చూసి సాక్షి, ఆంధ్రజ్యోతి, కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా వాతలు […]
శివాయ విష్ణు రూపాయ- శివరూపాయ విష్ణవే..! ఔను, అన్నీ రూపాయల లెక్కలే..!
Pronunciation:దేవ- ఆదాయ రెండు పదాలు సవర్ణదీర్ఘ సంధిగా కలిస్తే దేవాదాయ అవుతుంది అని అనుకుంటారు. వ్యాకరణంలో సంధి పని ముగిసిన చోట సమాసం పని మొదలవుతుంది. దేవాదాయ అంటే దేవుడికి ఆదాయం అని అనుకుంటారు. దేవుడి వల్ల ఆదాయం, దేవుడి పేరుతో ఆదాయం అని విభక్తులను భక్తి నుండి వేరుచేసి అర్థం చేసుకుంది లోకం. “శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే” అంటే శివుడు- విష్ణువు ఒకటే అని అర్థం. శివుడు డబ్బుకు విలువ ఇవ్వడు […]
ఆరు బయట బహిరంగ గణేశుడు… అటవీమాత ఒడిలో కొలువైన దోస దేవుడు…
సాధారణంగా గుడి అంటే..? దేవుడు ఎవరైతేనేం..? సాధారణంగా గర్భగుడి, మంటపం, ప్రహారీ, ధ్వజస్థంభం, గంటలతోపాటు హుండీలు ఉంటాయి… పెద్ద గుళ్లయితే భక్తులను దోచుకోవడానికి స్పెషల్ టికెట్లు, కాస్త ప్రహారీ పక్కనే రకరకాల ఆర్జిత సేవల టికెట్లు అమ్మే ‘దుకాణాలు’ కనిపిస్తాయి… క్యూలైన్ల నిర్మాణాలు కూడా..! హనుమంతుడి గుళ్లూ అంతే… కాకపోతే హనుమంతుడు పేదవాళ్ల దేవుడు కదా, ఎక్కడైనా సరే వాటిని కట్టేస్తారు… ఎర్రగా చందనం పులిమిన విగ్రహం, రాముడికి దండం పెడుతున్నట్టుగా మూర్తి, ఓ చిన్న స్లాబుతో […]
పిల్లల కడుపులు నిండాలంటే… నేను స్టంట్స్ చేయాల్సిందే… గాయాలా, జానే దేవ్…
నాకు అప్పటికి ఎనిమిదేళ్లు… పెళ్లిళ్లలో నీళ్లు పంచేదాన్ని… వచ్చిన ప్రతి ఒక్కరి వద్దకూ వెళ్లి నీళ్ల గ్లాసు అందించాలి… రోజుకు 40 రూపాయలు సంపాదించేదాన్ని… ఓ పెళ్లి సందర్భంగా ఒకాయన పరిచయమయ్యాడు… ఒక సినిమా కోసం నాకు జూనియర్ ఆర్టిస్టులు కావాలి, వస్తారా అనడిగాడు… పెళ్లిళ్లలో రకరకాల పనులు చేసే టీం అంతా వోకే అన్నాం… అలా పరిచయం అయ్యాను నేను ఇండస్ట్రీకి… డబ్బు బాగానే వస్తోంది… సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టును… పెళ్లిళ్లలో వర్క్ మాత్రం మానేయలేదు… […]
గడిచిన యవ్వనపు జాడల కోసం… గడియారం వెనక్కి తిప్పే ఓ యయాతి…
45 to 18: “దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!” అన్నాడు ధూర్జటి. వయసు పెరిగేకొద్దీ పళ్లు ఊడడం, శరీర కాంతి తగ్గడం, ముడుతలు పడడం, జుట్టు తెల్లబడడం, రోగాలు పలకరించడం, మన మొహం మనమే గుర్తు పట్టలేనంతగా మారిపోవడం సహజం. ఎన్ని యాంటీ ఏజింగ్ క్రీములు మొహానికి దట్టించినా- వయసును ఆపగలమా? అరవైలో ఇరవై వయసు ఎవరికైనా వచ్చేనా? “ఎలుకతోలు […]
ఒకే నెత్తురు… 485 మంది ఒకేచోట గెట్‌టుగెదర్… అపూర్వం ఆ భేటీ…
ఒక ఫోటో అపురూపం అనిపించింది… ఈరోజుల్లో అది అరుదు… అసలు కాలేజీలు, స్కూళ్ల అల్యుమని, అంటే ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగులు ఆర్గనైజ్ చేయడానికే నానా పాట్లు పడాలి… ముగ్గురో నలుగురో అందరి అడ్రస్సులు సేకరించి, మాట్లాడి, మీటింగుకు రమ్మని ఒప్పించి, భోజన ఏర్పాట్లు చేస్తే 50 నుంచి 60 శాతం మంది వస్తారు… సరే, అదొక సంబరం… మన యాంత్రిక జీవనాల్లో పెద్ద రిలాక్స్, ఆత్మానందం… అలాంటిది ఒకే నెత్తురు… పది మంది తోబుట్టువుల కుటుంబాలు, వాళ్ల […]
అల్పాహారాలు, ప్రధానాహారం… వెరసి ఓ భోజనం… వెరయిటీ ఫార్ములా ఇది…
నిన్న పునీత్ రాజకుమార్ ఫుడ్ వ్లాగర్ కృపాల్‌తో కలిసి భోంచేసిన వీడియో చూశాం కదా… మరో వీడియో చెప్పాల్సిందిగా పాఠకుల కోరిక… అన్నీ మనం ఎందుకు ప్రమోట్ చేస్తాంలే గానీ… ఈ వీడియో మాత్రం కాస్త ఇంట్రస్టింగ్ అనిపించింది… నాలుగేళ్ల క్రితం వీడియో, 10 లక్షల వ్యూస్ ఉన్నయ్… అసలు కృపాల్ పాపులారిటీకి ఈ వ్యూస్ సంఖ్య తక్కువే… కాకపోతే ఓల్డ్ వీడియో కదా, అప్పట్లో ఇదే పెద్ద సంఖ్య… ఫుడ్ వీడియోలు చేసే వ్లాగర్లకు కృపాల్ […]
నమ్మ అప్పు… మళ్లీ మళ్లీ గుర్తొస్తాడు… 3 కోట్ల వ్యూస్‌తో కృపాల్ ఫుడ్ వీడియో…
అనుకోకుండా 3 కోట్ల వ్యూస్ ఉన్న ఒక ఫుడ్ వీడియో చూడబడ్డాను… జస్ట్ రెండేళ్లలో… కృపాల్ అమన్న తెలుసు కదా… వెరీ ఫేమస్ ఫుడ్ వ్లాగర్… మన గుండు నగల వ్యాపారిలాగే ఇతనూ గుండుతోనే కనిపిస్తాడు… ఎక్కువగా కర్నాటక రెస్టారెంట్ల పరిచయం చేస్తుంటాడు… అదుగో ఆయన వీడియో ఇది… 3 కోట్లు అనే అంకె ఒకటి ఆశ్చర్యపరిస్తే… అప్పటి స్టార్ హీరో నమ్మ అప్పు పునీత్ రాజకుమార్ ఒక దగ్గరి స్నేహితుడిలా తనతో కలిసి, అనేక విషయాల్ని […]
వర్క్ ఫ్రమ్ హోమ్… సర్వీస్ ఎట్ హోమో… ఇంటి దగ్గరకే స్మశానవాటిక…
ఇప్పుడంతా ఇంట్లోనే… ఇంటికే… థియేటర్ ఇంటికే వచ్చింది… హాస్పిటల్ ఇంటికే వస్తోంది… షాపింగ్ మాల్ ఇంటికే వచ్చేస్తోంది… పనిచేసే ఆఫీసు కూడా ఇంటికే వచ్చి పనిచేయించుకుంటోంది… కేసినోలు, మసాజ్ సెంటర్లు ఎట్సెట్రా ఎట్సెట్రా… ఏదైనా సరే, జస్ట్, మ్యాటర్ ఆఫ్ వన్ క్లిక్… వన్ కాల్… చిన్న కబురు పెడితే చాలు, ప్రపంచమే ఇంటికొస్తోంది… మనీ మ్యాటర్స్… దట్సాల్… మరి మనిషి మరణిస్తే కాటిదాకా ఎందుకు వెళ్లడం…? కాల్ చేస్తే, వల్లకాడే తరలి రాదెందుకు..? ఇంటి దగ్గరే […]
- « Previous Page
- 1
- …
- 10
- 11
- 12
- 13
- 14
- …
- 26
- Next Page »