Bp Padala…. మిడిల్ క్లాస్ మెలొడిస్… హఠాత్తుగా ఆ సినిమా గురించి అందరూ రాస్తున్నారు… కానీ అది వదిలేసి , గుంటూరు పట్టణం, దాన్ని అలుముకొన్న తేట భాష , గమ్మత్తు లయతో కూడిన యాస ( ఆ మాటకొస్తే ప్రతీ యాసా ఓ ప్రత్యేకమైన రాగమని నమ్ముతాను నేను, వినగలిగే విచక్షణ ఉంటే ) , ట్రాఫిక్కుతో గజిబిజి వీధులు, మరీ ముఖ్యంగా శంకర్ విలాస్ తట్టిలేపిన జ్ఞాపకాల తుట్టెలో నుండి జాలువారిన కొన్ని తేనె […]
గుండె తడిని తాకే పాట..! నిశ్శబ్దాన్ని ఆలపించే మంగళంపల్లి పాట..!
నిజానికి పాపులర్ సినిమా పాటల మీద కూడా మనవాళ్లు గతం నుంచీ పెద్ద విమర్శో, విశ్లేషణో పట్టించుకోరు… ఇప్పుడంటే ఓ కొత్త సినిమా పాట రాగానే, అదెంత చెత్తగా ఏడ్చినా సరే, మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర్నుంచి టీవీలు, సైట్లు, ట్యూబర్లు ఒకటే డప్పు దంచి కొడుతున్నారు… భాష రాని సిధ్ శ్రీరాంకూ నీరాజనాలు పలుకుతున్నారు… కానీ ఇంతకుముందు అసలు సినిమా పాటను ఓ సాహిత్యంగానే పరిగణించేవాళ్లు కాదు… రాసేవాళ్లు, కంపోజ్ చేసేవాళ్లు, ఆడేవాళ్లు, ఆడించేవాళ్లు, పాడేవాళ్లు, […]
హేపీ మెన్స్ డే బావా… ఇక్కడ పులుసు మరుగుతోంది, తరవాత కాల్ చేస్తా…
Gottimukkala Kamalakar…… సరికొత్త సీసాలో పాత సింగిల్ మాల్టు: నేను: బావా..! ఇవాళేదో ఇంటర్నేషనల్ మెన్స్ డే అటగా..? సాయంత్రం కలుద్దామా..? వాడు: చూస్తాలేరా..! ఇప్పుడే చెప్పలేను. నేను: ఏం చేస్తున్నావ్..? వాడు: పనిమనిషి స్కూటీ సర్వీసింగ్ కి ఇచ్చిందట. రాలేనని మా ఆవిడకి వాట్సాప్ లో మెసేజెట్టింది..! నేను: నీకెందుకు చెయ్యలేదు…? వాడు: నా దగ్గర తన జియో సిమ్ నంబరుందిరా..! అది మా ప్రైవేట్ చాట్ కే. అపార్టమెంట్ వాట్సాప్ గ్రూపులో ఎయిర్ టెల్ […]
జస్ట్ రిలాక్స్… మీకొక చిన్న సరదా పరీక్ష… ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకాలి…
ఒక తెలుగు సినిమా పాట… ఓ పాత అగ్ర హీరో… బెల్ బాటమ్ పాంటు, బ్లేజర్, షూస్, టోపీ ధరించి ఎగురుతున్నాడు… వాటిని స్టెప్పులు అంటారు… పక్కనే జయప్రదో, శ్రీదేవో ఫాఫం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎగురుతోంది… సగం సగం బట్టలు… మంచుకొండల్లో హీరోకు కార్గిల్ దుస్తులు… హీరోయిన్ వంపుసొంపులు కనిపించాలి కాబట్టి అరకొర దుస్తులు… అంతేనా..? ఒకే పాటలో నాలుగైదుసార్లు హీరో గారి కాస్ట్యూమ్స్ ఛేంజ్… అదేమంటే ఫ్యాన్స్ రకరకాల డ్రెస్సుల్ని ఇష్టపడతారుట… హీరోయిన్ […]
బస్ జర్నీలో బడా చోర్… ఓ సినిమాటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ…
Gottimukkala Kamalakar…… బస్సు జడ్చర్ల మునావర్ హోటల్ దగ్గర ఆగింది. “టిఫిన్, మీల్స్, రోటీ, టీ, టాయిలెట్ అన్నీ కానియ్యొచ్చు. బస్సరగంటాగుతుంది. దిగాల్సార్.. దిగాల..! మళ్లీ అనంతపురం జంక్షను దాకా ఆగదు. దిగాల్దిగాల..!” అంటూ కేకేస్తూ తన డోర్లోంచి దిగాడు డ్రైవరు. బస్సులో ప్యాసింజర్లు ఒక్కొక్కరే తోసుకుంటున్నట్టు దిగసాగారు. నేనింట్లోనే సుష్టుగా తినేసా. బయటి తిండి జనరల్ గా తినను. రేపెలాగూ బెంగుళూరులో తప్పదు. ఓ రెండు నిమిషాలు అలాగే కూర్చుని జనం దిగే హడావిడి అయిపోయాక […]
కొవ్వు లేని సబ్బు కోసం ఓ పరిశోధన… సింథాల్ పుట్టుక, పేరు వెనుకా ఓ కథ…
పార్ధసారధి పోట్లూరి …….. సింథాల్ సబ్బు గురించి తెలియని వారు ఉండరు ! సింథాల్ సబ్బు గురించి ఆసక్తికరమయిన కధ ఉంది ఈ సబ్బు వాడకంలోకి రావడం వెనుక ! ఇప్పుడంటే ఎవరయినా స్వంతంగా ఇంట్లోనే సబ్బు తయారు చేసుకోవడానికి వీలుగా అన్ని రకాల పదార్ధాలు ఫార్ములాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి సబ్బు తయారుచేయడం పెద్ద పనా అని అనవచ్చు. కానీ అదే 1930 లలో సబ్బు తయారుచేసే ఫార్ములా అతి రహస్యంగా ఉండేది. కేవలం బ్రిటన్, […]
తులసిదళం వచ్చి నలభయ్యేళ్లు… మన సాహిత్యంలో క్షుద్రం ఏమైనా తగ్గిందా..?!
నిన్న యండమూరి వీరేంద్రనాథ్ జన్మదినం అట కదా… ఈ 74 ఏళ్ల వయస్సులో కూడా ఆయన్ని ఆడిపోసుకున్నారు… క్షుద్రరచయిత అన్నారు… అలా గుర్తుచేసుకున్నారు చాలామంది సోషల్ మీడియాలో… మరీ ప్రత్యేకంగా తులసిదళం అనే నవలను ఉదాహరణగా తీసుకుని…! ఎస్, యండమూరి మీద బోలెడు విమర్శలున్నయ్… మనమూ చాలాసార్లు చెప్పుకున్నాం… వ్యక్తిత్వ వికాసం నవలల్ని కూడా రాసి, ఎడాపెడా సొమ్ము చేసుకున్న తన వ్యక్తిత్వం మీదే బొచ్చెడు ఆరోపణలు… నిందలు, మరకలు… దాన్నలా వదిలేస్తే తులసిదళం అనే నవల […]
ఆ చెంచాలేమిటోయ్… మీకోసం నరకంలో ప్రత్యేక శిక్షలు ఉంటయ్…
ట్విట్టర్‌లో ఎవరో ఒకరి మీద పడాలి… లేకపోతే ఏమీ తోచదు… ట్రోలింగ్ స్థాయిలో కాకపోయినా ఎవరితోనైనా ఆడుకోవాలి… ఈ ధోరణి ఈమధ్య బాగా పెరిగిపోయింది… కొన్నింటిని అనవసరంగా హ్యాష్ ట్యాగ్ క్యాంపెయిన్లకు తీసుకుపోతారో మనం ఇంతకుముందే ‘దృష్టిఐఏఎస్’ కథనంలో చెప్పుకున్నాం కదా… ఇది చాలా తక్కువ రేంజ్… మనమూ నవ్వుకోవచ్చు… ట్రోలింగ్ కాదు, సరదా వ్యాఖ్యలు… ఓలా క్యాబ్ నెట్‌వర్క్ తెలుసుగా… దాని ఫౌండర్ పేరు భవీష్ అగర్వాల్… ప్యూర్ నార్త్ ఇండియన్… పంజాబీ హిందూ ఫ్యామిలీ… […]
ప్రతి జీవికి ఓ తోడు… సరైన సాహచర్యంలోనే జీవితానికి పరిపూర్ణత, పరిపుష్టత…
హరి క్రిష్ణ ఎం. బి….. ఈమధ్య చాలా ఎక్కువగా వినిపించే ధోరణి ఏంటంటే – మరీ ముఖ్యంగా యువతలో – పెళ్లి ఎందుకు? దాని బదులు సింగల్ గా లైఫ్ లీడ్ చేయడం, కొత్త కొత్త ప్రదేశాలు చూడడం, – షార్ట్ టర్మ్ కమిట్మెంట్స్ తో బతికెయ్యొచ్చు కదా – అంటున్నారు… కొంత మంది పెద్దలు/పేరెంట్స్ కూడా – పెళ్లి చేసుకుని ఎవరు సుఖపడ్డారు? పెళ్లి అయిన ఆడా మగా ఒకరి మీద ఒకరు కుళ్ళు జోకులు […]
132 డిగ్రీలు నడుం వంచి… గుమ్మానికి ఆనుకుని నిలిచి… ఏవో ఎదురుచూపులు…
వాణిశ్రీ ముగ్గుబుట్ట విగ్గెట్టుకునీ, ముదురు గులాబీరంగు లిప్ స్టిక్ మందంగా వేసేసుకునీ, కనుబొమ్మల మధ్య ఎర్రని కుంకంబొట్టూ, కాస్త పైన లేత గులాబీరంగు సింగార్ తిలకం, ఆపైన పాపిడి మొదట్లో అంగారుకుంకుమా పెట్టేసుకునీ, కళ్లకూ కనుబొమ్మలకూ, కనురెప్పలకూ అయిటెక్స్ కాటుక రాసేసుకునీ మిగిలిన మొహమ్మీద దట్టంగా రంగూ, పౌడరూ పులిమేసుకునీ దీనంగా గుమ్మంలోకి చూస్తూ శిల్పంలా ఓచెయ్యి పైకి గుమ్మం కేసి పెట్టి, ఇంకో చెయ్యి నడుమ్మీద పెట్టి, ఆ నడుమును ఆంటీక్లాక్ వైజ్ గా నూటాముప్ఫైరెండు […]
వాయిఖ్… కింగ్ ఫిషర్ బిర్యానీ, కింగ్ ఫిషర్ చాయ్ అంటే ఇవా..?!
మీకు ‘కింగ్ ఫిషర్’ బిర్యానీ, ‘కింగ్ ఫిషర్’ ఛాయ్ అంటే తెలుసా? బిర్యానీ తిన్నప్పుడు కస్టమర్లు వదిలేసిన బిర్యానీ రైస్, ముక్కలు, బొక్కలు అన్నింటిని ఒక గిన్నెలో కలెక్ట్ చేసి పెడతారు. రెండు మూడు గంటల్లోనే పెద్ద గిన్నె నిండా ఎంగిలి బిర్యానీ, ముక్కలు తయారవుతాయి. అలాగే ‘ఛాయ్’ కప్పులలో మిగిలిన కొన్ని ఛాయ్ చుక్కలను ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసి పెడతారు. తర్వాత, ఈ బిర్యానీ రైస్ ను ప్లేట్లలోకి సర్ది దాని పైన కొంచం […]
వావ్… మన కోహినూర్‌ను వాపస్ తీసుకురావడానికి భలే వీజీ ప్లాన్…
మన చుట్టూ ఆవరించిన ఉన్న అనేక సమస్యల్ని వర్తమాన వ్యవహారాలతో లింక్ చేసి జోకులు వేసి నవ్వుకోవడం ఆరోగ్యకరమైన హాస్యం… ఎవరినీ కించపరచాల్సిన అవసరం లేదు… మన క్రికెటర్ ఆశిష్ నెహ్రా, రిషి సునాక్ పోలికలతో వచ్చిన బోలెడు మీమ్స్ అలాంటివే… సరదాగా నవ్వుకోదగినవి… నెహ్రా అంటే గుర్తొచ్చింది… సాక్షి వాడైతే ఏకంగా ప్రధాని మోడీ, నెహ్రా కలిసి ఉన్న ఓ ఫోటోను సైటులో పెట్టిపారేశాడు… (సునాక్ ఫోటోల్లో కలిపేశాడు… పబ్లిష్ చేసేముందు ఎవరు నెహ్రాయో, ఎవరు […]
అడవి సమస్తం శిగమూగే అద్భుత కాంతార ఇది… లక్షల స్త్రీలు దేవతలవుతారు…
Kandukuri Ramesh Babu……… #కాంతారా #మేడారం #సామాన్యశాస్త్రం శిగమూగే దేవత…. ‘కాంతారా’ చిత్రం గురించిన అనేక సమీక్షలు చదువుతుంటే ‘మేడారం ఒక దేవత, కనువిప్పు’ పేరిట రాసిన వ్యాసం పంచుకోవాలనిపించింది…. విశ్వాసాల ఆధారంగా దైవత్వం ప్రధానంగా ఒక కళా రూపం నేపథ్యంలో ఆ సినిమా చిత్రించినట్లు చదువుతుంటే ఈ వ్యాసం పంచుకోవాలి అనిపించింది. అలాగే మన దగ్గర కథలను తీసుకుని దర్శకులు అద్భుతమైన సినిమాలు తీయడంలో ఎందుకు విఫలం చెందుతున్నరని కూడా చర్చిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాసం ఎందుకైనా పనికి […]
నచ్చావోయీ నాగేస్పర్రావూ… ఎస్, తక్కువేమి తమ్మీ… తగ్గేదేల్యా…
ఫేస్‌బుక్‌లో Siddharthi Subhas Chandrabose వాల్ మీద పోస్టు ఇది… చాలామంది షేర్ చేయడంతో మన న్యూస్‌ఫీడ్‌లో కూడా బాగానే కనిపిస్తోంది… బాగా కనెక్టయింది… అల్టిమేట్… కడుపు నింపుతున్న, చేస్తున్న పనిపట్ల గౌరవం, బతుకుతున్న బతుకు పట్ల గౌరవం, మది నిండా ఆనందం… ఈ క్షణం నాది… ఎంత మంచి ధోరణో కదా… సరే, ఆ పోస్టు యథాతథంగా మీరూ చదవండి ఓసారి… మొన్న బిజీ సమయంలో ఉండవల్లి సెంటర్లో కళ్లకు చారడేసి కూలింగ్ గ్లాసులు పెట్టుకుని చెప్పులు కుట్టే […]
వాళ్లు ఓ బేబీకి ఆర్డర్ పెట్టారు… ఫర్టిలిటీ ఫ్యాక్టరీ వన్‌ప్లస్‌వన్ డెలివరీ ఇచ్చింది…
డియర్, కంపెనీ వాళ్లు ఫోన్ చేశారు… ఈరోజే ‘డెలివరీ’ ఇచ్చేస్తారట… ఆల్‌రెడీ ఫ్యాక్టరీలో డెలివరీ అయిపోయిందట… ఇంటికి వెళ్దామా..? నేను షూటింగ్ ఆపేసి బయల్దేరాను…. ఖరీదెక్కువ కదా, పనివాళ్లకు, వాచ్‌మెన్‌కు, సెక్యూరిటీ గార్డులకు ఇవ్వరట… నీకో గుడ్ న్యూస్, మనం ఒక్కటే కదా ఆర్డరిచ్చింది, ఒకటి బోనస్ ఇస్తున్నారు… వావ్… వన్ ప్లస్ వన్… కానీ నేనేమో ఇక్కడ షూటింగులో బిజీ డియర్.., సరే, ఓ గంటాగి బ్రేక్ తీసుకుని వస్తా, మళ్లీ అరగంటలో సరి చూసుకుని, […]
ఆఫ్టరాల్ సహస్రావధానివి… ఐతే ఏంటట..? గట్టిగా లెంపలేసుకుని, క్షమాపణ చెప్పు…
ఏమయ్యా గరికపాటీ…? నువ్వు ఏపాటి..? నీ విద్వత్తు ఏపాటి..? ఒక్కసారిగా గట్టిగా చెంపలు వాయించుకో… తప్పు నీదే… తప్పు అంగీకరించడం ఉత్తమ మానవధర్మం… అదీ నువ్వే ఏదో ప్రవచనంలో చెప్పినట్టు గుర్తు…! ఆఫ్టరాల్ నువ్వెంత..? ఓకే, నువ్వు అవధానివి, సహస్రావధానివి… అయితే ఏంటట..? అనేక పురాణాలను, ఆధ్యాత్మిక గ్రంథాలను ఔపోసన పట్టావు… సో వాట్..? వాటిని జీవననైపుణ్యాలకు జతచేసి, వేలాదిమందికి నాలుగు మంచిమాటలు చెబుతుంటావు… అంతే కదా… 14 పుస్తకాలు రాశావు, నీ సాహిత్యంపైనే రెండు పీహెచ్డీలు, […]
డియర్ అనంతం… నజభజజజర కాదోయీ, మత్తేభం అంటే సభరనమయవ…
మసజసతతగ… మసజసతతగ… పంజా ఎత్తి కొడితే పగిలిపోద్దిరా… కోరలు దిగినాయంటే నరకలోకమేరా… పులి, పులి, పులి… చారల్లేని పులి వీడేరా… అడవికే రారాజు వీడేరా… ఆ శ్వాసే తుఫాను గాలిలా, ఆ చూపే పెద్ద తోపురా… మసజసతతగ… మసజసతతగ……. ఈ పాటను ఎవరైనా స్టార్ హీరో మీద చిత్రీకరణకు వాడుకుంటానంటేనే అమ్మాలి… లేకపోతే దాని రేంజ్ చిన్నబోతుంది… అసలే హీరోను మనం శార్దూలంలా చూపిస్తున్నాం… బిల్డప్పులకే సూపర్ బిల్డప్పు ఇస్తున్నాం కదా… ఛఛ లైట్‌గా తీస్తే బాగోదు… […]
నేనూ వస్తున్నా… తెలుగు తెరపైకి రియల్ హైబ్రీడ్ ఫారిన్ పిల్ల…
చందమామ మోము, చారడేసి కళ్లు, దొండపండు పెదవి, పండునిమ్మ పసిమి, కడలి అలల కురులు, కానరాని నడుము… అని ఆత్రేయ కల్యాణి రాగాన్ని ఓ కన్నెపడుచుగా ఇలాగే కలగంటాడు ఏదో సినిమాలో…! ప్చ్, కష్టమే… ఇదీ అందం అని నిర్ధారించే కొలతలేముంటయ్..? చూసే కళ్లను బట్టి కదా సొగసు..! కావ్యం రాసేవాడి కలల సుందరిని బట్టి కావ్యనాయిక లక్షణాలుంటయ్… మన నిర్మాతలకు, మన దర్శకులకు, మన వీరోలకు పర్ఫెక్ట్ కావ్యనాయికలు మాత్రం దొరకడం లేదు… అన్వేషిస్తూనే ఉన్నారు… […]
బుల్లెట్ పెళ్లికొడుకు చేసిన తప్పేముంది..? ఎందుకిలా వెక్కిరింతలు..?!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ వార్త ఇది… ఏదీ అంటే… హైదరాబాద్ నగర శివారు, మహేశ్వరం నియోజకవర్గంలోని, బడంగపేట మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ దాడులు చేసింది, 30 వేలు తీసుకుంటూ టీపీఓ అశోక్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు… ఎవరీ అశోక్..? అప్పట్లో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన బుల్లెట్ బండి పాట తెలుసు కదా… అందులో పెళ్లికొడుకు… ప్రస్తుతం ఫేస్ బుక్, వాట్సపుల్లో ఈ ఏసీబీ దాడి వార్త, వీడియో, ఫోటోలు ఫుల్ వైరల్… పెద్ద పెద్ద చానెళ్లలో వార్తలు […]
టాప్- 50 ఇన్స్టాగ్రాం తోపుల్లో… ఒక్కటంటే ఒక్క తెలుగు పేరూ లేదు…
ఒక్కరు కూడా తెలుగు వాళ్లు లేరు… మన సినిమా, పొలిటికల్ తోపుల్లో ఎవరికీ అంత సీన్ లేదు… వీళ్ల పాపులారిటీ అంతా మన మీడియా మేనేజ్‌మెంట్‌లోనే… 31వ ప్లేసులో రష్మిక మంథన ఉంది కానీ ఆమె బేసిక్‌గా కన్నడ నటి… మనం ఓన్ చేసుకోవడానికి ఏమీ లేదు… 45వ ప్లేసులో ఉండే రోహిత్ శర్మ రూట్స్ తెలుగు కానీ, తనిప్పుడు జస్ట్, ముంబైకర్… 48వ ప్లేసులో ఉన్న సమంత… బేసిక్‌గా తమిళ్… మధ్యలో తెలుగింట మెట్టినా ఇప్పుడు […]