ఎంతసేపూ ఆ చెత్తా రాజకీయాలు, నేరాలు, ఘోరాలేనా..? కాస్త ఆత్మారాముడి సంగతీ చూద్దాం… మొన్నొక ఫేస్‌బుక్ దోస్తు బాధపడిపోయాడు… యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చూసి వంటలు చేయడం చాలా కష్టం సుమీ అని…!! కానీ చాలామందికి కాస్తోకూస్తో వంటలు నేర్పిస్తున్నది యూట్యూబే… కాకపోతే సదరు వీడియోల్లో చూస్తూ మక్కికిమక్కీ చేయాలని ప్రయత్నించడంతో వస్తుంది సమస్య… ఓ ప్రధాన సూచన, సలహా ఏమిటంటే… యూట్యూబ్ వీడియోల నుంచి వివిధ పంటల బేసిక్స్ తెలుసుకోవాలే తప్ప యథాతథంగా అనుసరించొద్దు… ప్రత్యేకించి […]
అమ్మ… ఆమె చేతిలో అదే పాత చీపురు… అదే పని… నిర్వికారంగా…
పంజాబ్… బర్నాలా జిల్లాలోని ఉగోకే… ఆమె పేరు బల్దేవ్ కౌర్… ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్… అదీ కంట్రాక్టు పద్ధతిన… 22 ఏళ్లుగా కంట్రాక్టు జీతమే… ప్రతి ఏటా క్రమబద్ధీకరణకు ఆమె దరఖాస్తు చేసుకుంటుంది, ప్రభుత్వం రిజెక్ట్ చేస్తుంది… భర్త కూలీ… ఆ ఇంటికి ఆమె తీసుకొచ్చే జీతమే ప్రధాన ఆధారం… పొద్దున్నే ఓ చీపురు తీసుకుని స్కూల్ వెళ్లడం, ఆవరణతోసహా గదులన్నీ క్లీన్ చేయడం, లాంగ్ బెల్ కొట్టేదాకా అక్కడే ఉండి, ఇంటికి వచ్చేయడం… అదే […]
పొట్టలో పట్టినంత..! పదిరకాల కోస్తా స్పెషల్ టిఫిన్లు… కాస్త వెలితి ఏంటంటే..?!
ఎవరి వాల్ మీదో కనిపించి, కాసేపు మౌస్ అలా ఆగిపోయింది… అది ఫుడ్ మీద పోస్టు కాబట్టి… అలవాటైన తెలుగు టిఫిన్లు కాబట్టి… కాకపోతే కోనసీమ వంటిల్లు పేరిట హోటల్ పెట్టుకున్నాడు ఒకాయన… కూకట్‌పల్లిలో… అందుకని ఈ టిఫిన్లకూ ఆంధ్రా పేర్లే పెట్టాడు… అసలు అదికాదు, 120 రూపాయలకు అన్‌లిమిటెడ్ బఫె బ్రేక్ ఫాస్ట్ అనే స్కీమ్ ఆకట్టుకుంది… ఇలా క్లిక్ చేయగానే అలా ఇన్‌స్టాగ్రాంలో హైదరాబాద్ ఫుడ్ ట్రిప్ అనే ఖాతాకు తీసుకుపోయింది… నిజానికి బఫె […]
హబ్బ… ఏం ఇంటర్వ్యూ వేశారు సార్… భక్తిప్రపత్తులతో అద్దిరిపోయింది…
మొన్నామధ్య ఎవరో కలంవీరుడు అపరిమితమైన ఆనందభక్తివిశ్వాసాలు తాండవిస్తుండగా… రాజమౌళి వైపు అత్యంతారాధనగా చూస్తూ… జక్కన్న కాలంలో జర్నలిస్టుగా పుట్టడం ఈ జన్మకే అదృష్టం అని పులకరించి, పరవశించిపోయాడు… చాలామంది పకపకా నవ్వుకున్నారు… జర్నలిజం మరీ ఈ స్థాయికి పడిపోయిందా అని బోలెడుమంది బాధపడ్డారు… ఇక చరిత్రలో ఇంతకుమించిన దరిద్రపు ప్రెస్‌మీట్ ఇంకొకటి ఇప్పట్లో రాకపోవచ్చునని కూడా బొచ్చెడుమంది ఈసడించుకున్నారు… ఎందుకు..? అతి… ఓవర్… టూమచ్… ఆంధ్రజ్యోతి పత్రిక, నవ్య పేజీలో మహేశ్ బాబు బిడ్డ సితారతో చేసిన […]
- « Previous Page
- 1
- …
- 17
- 18
- 19