ఇప్పటికే చాలామంది రాసేశారు… ఆ హార్లిక్స్‌లో ఏమీ లేదుర భయ్, ఓ గ్లాసు హార్లిక్స్కన్నా ఓ చపాతీ బెటర్ అని…! ఐనా మనం వినం కదా… కొంటూనే ఉంటాం, తాగుతూనే ఉంటాం… కాఫీలాగా, టీలాగా… లేదా ఓ చాకోలేట్ ఫ్లేవర్డ్ డ్రింక్‌లాగా..! వాడు ఓ కమర్షియల్ ప్రకటన ఇచ్చాడు… ఎందులో..? నమస్తే తెలంగాణలో…!! అది ఇంకెక్కడా కనిపించలేదు… చూడగానే మనకు ఏమనిపిస్తుందీ అంటే… అరె, హార్లిక్స్‌లో ఏముందిరా..? అందులో ఉన్న కాల్షియం పాలల్లో ఉంది, ఐరన్ పాలకూరలో […]
ఇంతకు మించిన ప్రేమ నివాళి ఏమివ్వగలం నీకు గాన గంధర్వుడా..?
ఇది Mohammed Khadeerbabu… విరచితం… ఎంత బాగుందో… మనమూ ఓసారి పలకరించి, పరవశించిపోదాం… అతని పాటలు పది అందరూ రాసి అక్షరాల్లోనే వెళ్లబోసుకోవాలనుకోరు. అసలు నోరు తెరిచి చెప్పాలని కూడా అనుకోరు. ఇష్టాన్ని చెప్పడం ఏంటి? సమక్షంలో కాసేపు చుబుకానికి పిడికిలి ఆన్చి కూచోవడం… నడుస్తూ ఉండగా ఊరికే చేతిని ఒక లిప్త పట్టుకు వదిలేయడం… రేపటి సాయంత్రం కోసం ఇవ్వాళ్టి రాత్రి చంద్రుణ్ణి త్వరగా తెమలమని పేచీ పడటం… ఎక్కడ ఉన్నా ఆ మెత్తటి పాదాల […]
‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…
ముందుగా ఈ ప్రేమకథను సంక్షిప్తంగా, సూటిగా చదవండి… విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్ 2010 ఇంజనీర్ కోర్స్ పాసవుట్… 2015లో బెంగుళూరులోని హూవాయ్ టెక్నాలజీస్‌లో కొలువు… తనతో పాటు పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతితో పరిచయం… కొద్దిరోజుల్లోనే ఆమెకు ఢిల్లీలో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయింది… అప్పటికే ఆమెపై మనసు పారేసుకున్నాడు ప్రశాంత్… ఉద్యోగం పక్కన బెట్టి, ఆ యువతి జాడ కోసం, మనసులోని మాట చెప్పడం కోసం ఢిల్లీకి వెళ్లాడు. ఆశ్రమాల్లో అక్కడక్కడా ఉంటూ ఆ యువతి […]
గగన పరిణయం..! గొప్పతనం కాదు, అతితెలివి..! సర్కారు కొరడా సమంజసమే…!
నిన్న లాక్ డౌన్ చెకింగు తప్పించుకోవడానికి ఓ చెక్ పోస్టు గేటు కింద నుంచి, బైక్ మీద వేగంగా పారిపోవడానికి ప్రయత్నించి, ఒక వ్యక్తి దారుణంగా, అకారణంగా మరణించిన వీడియో నిన్నంతా వైరల్…. అక్కడ తప్పు ఖచ్చితంగా వాళ్లదే… పోలీసులు పట్టుకుంటే ఉరితీయరుగా… అయితే డబ్బులు లేదంటే చలాన్లు, అంతేగా… మరి ఎందుకా దుస్సాహసం..? తమిళనాడులో కోవిడ్ ఆంక్షలను తప్పించుకోవడానికి విమానం ఎక్కి పెళ్లి చేసుకున్న తీరు కూడా అంతే మూర్ఖంగా ఉంది… అతి తెలివి అనేది […]
నేములోనేముంది..? అబ్బే, ట్వీట్లకాలమిది… నేములోనే సకలమున్నది…!!
నేములోనేముంది…? అంటూ విలియమ్ షేక్ స్పియర్ నుంచి మన అచ్చ తెలుగు సినారె వరకు.. ప్రశ్నించినా..? నేములోనే… నేముందని.. ప్రశ్నలోనే ఇమిడున్న జవాబుతో సమాధానపర్చినా… పేరు ముచ్చట కాస్తా అటూఇటుగా తారుమారైతే అంతే సంగతులు..! అసలే అదును దొరికిందంటే ట్రోలింగ్ చేయకుండా వదలని సోషల్ మీడియా రోజుల్లో.. ఇక ఆ పరాకాష్ఠకంతుంటుందా…? విదేశీ వ్యవహారాల మాజీ మంత్రివర్యుల ఓ ట్వీట్.. ఇదిగో ఇప్పుడలాంటి ఉల్లాసాల నవ్వుల ట్వీటైన కథే ఇది! ఒక్క సల్మాన్ దెబ్బకు.. ముగ్గురు సల్మాన్‌లను […]
మాంచి టచింగ్ పెళ్లి స్టోరీయే… బోలెడు సినిమాటిక్ ట్విస్టులూ ఉన్నయ్…
నిజానికి ఈ పెళ్లిని చట్టం ఒప్పుకోకపోవచ్చుగాక… కానీ సమాజం హర్షిస్తుంది..! ఓ మాంచి సినిమా కథ… ఛఛ, కాదు కాదు… అంతకుమించి..! ఎందుకంటే ఈ కథలో నిఖార్సయిన ఓ అక్క ప్రేమ ఉంది, కాబోయే భార్య కోరికను తీర్చిన భర్త ఉన్నాడు, హర్షించి ఆశీస్సులు జల్లిన సమాజం ఉంది… సహజంగానే ఎప్పుడూ సొసైటీకి విరుద్ధంగానే వెళ్లే పోలీసులున్నారు, అధికారులున్నారు… అఫ్ కోర్స్, వాళ్లెప్పుడూ అంతే కదా… అదేమంటే చట్టాలు, తొక్కాతోలు… ఈ ఒక్క విషయంలోనే పెద్ద కర్తవ్యనిర్వహణ […]
మామ, అప్పు..! ‘శృతి కలిసిన బంధం’… కళ్లతోనే పాటలు కట్టిపడేసేవారు…!
Bharadwaja Rangavajhala…. పాట కట్టాలంటే అంత తేలికేం కాదు … సిట్యుయేషన్ అర్ధం చేసుకోవాల .. డైరక్టరుగారికి ఏం కావాలో ఎలా కావాలో తెల్సుకోవాల … అప్పుడు కవిగారితో కూర్చోవాల … ఇక్కడే మహదేవన్ ప్రత్యేకత … ముందు కవిగారిని రాసేయమనండి … అప్పుడే ట్యూను కడదాం … అలా చేసినప్పుడే సరస్పతికి సరైన గౌరవం ఇచ్చినట్టు అనేవారాయన. ఇక ట్యూను కట్టేసిన తర్వాత అది పాడుతున్న సింగరుకు సౌకర్యవంతంగా ఉందా లేదా అనేది కూడా చూసుకునేవాడాయన. తనతో […]
ఆ గంట కింద చిక్కుకున్న పిట్టపిల్లలు… ఈ భారతకథ చెప్పే కరోనా నీతి ఏమిటి..?!
కరోనాకూ ఈ కథకూ లంకె ఏమిటబ్బా అని ఆలోచించకుండా… ముందుగా ఈ కథ చదవండి… ‘‘కురుక్షేత్ర సంగ్రామానికి అందరూ సిద్ధం… స్థలాన్ని కూడా ఎంపిక చేశారు… ఆ మహా సంగ్రామానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు, రాక్షసులు, అనేక ఆయుధాలు, అస్త్రాలు… మాటలు కాదు… లక్షల తలలు తెగిపడతయ్… అదుగో అక్కడ ఆ రణభూమిని చదును చేస్తున్నారు… రాళ్లు రప్పలు చెట్లు తుప్పలు తొలగిస్తున్నారు… ఆ స్థల పరిశీలనకు వెళ్లాడు శ్రీ కృష్ణుడు… ఈ రణానికి ప్రధాన కారకుడు […]
అమ్మ మొక్కు కోసం… వేల కిలోమీటర్ల బహుదూరపు పాదచారులు…
మిత్రులు Prabhakar Jaini వాల్ మీద కనిపించింది ఇది… ఎవరో మిత్రుడు మరాఠీలో రాసిన పోస్టును తను తెలుగులోకి అనువదించి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు… ఇంట్రస్టింగుగా అనిపించింది… విషయం ఏమిటో ముందుగా తెలుసుకుందాం… ‘‘నాసిక్ హై వే… రోడ్డు మీద వెళ్తున్న జనాల వంక ఓ వృద్ధ జంట ఆసక్తిగా చూస్తోంది… చూడటానికి పేదవాళ్లలా ఉన్నారు… ఏదో అవసరంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు… ఆహారమో, ఇంకేదైనా సాయం కావాలో ఏమో… వెళ్లి అడిగాను… వాళ్లు మొహమాటపడుతున్నారు… వంద రూపాయల నోటు […]
ఈ చిన్న న్యూస్ వీడియో నిన్నంతా తెగ వైరల్… ఏముంది అందులో…!!
వావ్, అపురూపం, అద్భుతం అని ఆశ్చర్యపోతారో…. అబ్బే, ఏదో యాదృచ్చికంలే అని కొట్టిపడేస్తారో మీ ఇష్టం… చిన్నవో, పెద్దవో కొన్ని అసాధారణ సంఘటనలు జరుగుతూ ఉంటయ్… ఇదీ అలాంటిదే… తమిళనాడులోని ఈరోడ్ జిల్లా, సత్యమంగళ ప్రాంతాల్లో ఏనుగుల బెడద ఎక్కువ… విలముంది అడవుల నుంచి వచ్చేసి, సమీపంలోని పంటచేలపై పడుతుంటయ్, ధ్వంసం చేస్తుంటయ్… ప్రధానంగా అరటి తోటలపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంటయ్… మొన్న అయిదారు ఏనుగులున్న ఓ మంద ఇలాగే అడవుల నుంచి వచ్చి ఓ అరటి […]
నెల్లూరు రెడ్డి గారు చెప్పాక… చద్దన్నం, మజ్జిగపై సోయి పెరిగింది హఠాత్తుగా…
ఇప్పుడు మన పోపుల పెట్టె విశిష్టత అర్థమవుతోంది… ఇప్పుడు ప్రాణాయామం ఆవశ్యకత ఏమిలో తెలుస్తోంది… ఇప్పుడు చిరుధాన్యాల అవసరం అవగాహనకు వస్తోంది… ఇప్పుడు చద్దన్నం, చల్ల ఎంత మేలో తెలిసొస్తోంది…. తరాలుగా రసాయనికి టూత్ పేస్టులు వాడీ వాడీ ఇప్పుడు ఉప్పు, బొగ్గుపొడి, వేపపుల్ల గొప్పతనం మళ్లీ వాడు చెబితేనే సమజైనట్టుగా…. అన్నం వార్చడం ఎందుకో కూడా మళ్లీ ఏ విదేశీ సైటువాడో చెబితేనే ఇప్పుడు తెలుస్తోంది… అసలు వార్చడం మరిచిపోయి ఎన్నేళ్లయిపోయింది… గంజి దేనికి మంచిదో […]
నిజంగానే నిఖిలలోకం నిండు హర్షం వహిస్తుందా శ్రీశ్రీ…?!
నిజంగానే నిఖిలలోకం నిండు హర్షం వహిస్తుందా…? నడుమ తడబడి నడలిముడుగక పడవతీరం క్రమిస్తుందా…? మానవాళికి నిజంగానే మంచికాలం రహిస్తుందా…? దారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా… ? ఇదిగో ఎంతకీ సమాధానం దొరకని అనుమానాలతో కూడిన శ్లేష ప్రశ్నలే కవి కలానికి బలం. ఆ బలమే భావకవిత్వంపై తిరుగబావుటా ఎగురేసిన అభ్యుదయ కవి శ్రీశ్రీ. ఏ ప్రశ్నలన్నింటికైనా సంతృప్తికరమైన సమాధానాలు దొరికినప్పుడు.. ఇక కలం ఆగిపోవడం తప్ప… రాయగల్గేదేముంటుంది…? అలాంటి సంతృప్తిని పొందలేకే… శ్రీశ్రీ మహాకవయ్యాడేమో బహుశా! […]
గూగుల్ తాతలు… ఫేస్బుక్ భాషానువాదాలు… ఇదేం ఖర్మరా దేవుడా..?
ఫేస్ బుక్ అనువాదాన్ని నమ్మితే… ఇంతే సంగతులు! (S.Ramu)….. ఈ మధ్యన ఫేస్ బుక్ మనం తెలుగులో ఏదైనా రాసి పెడితే…. అది రాకుండా దానంతట అది ఇంగ్లిషులోకి అనువదించి పెడుతోంది. ‘Show Original’ అన్న మాటను నొక్కితే తప్ప తెలుగు లిపి కనిపించదు. ఈ అనువాదం సంగతి ఏమిటా? అని చూస్తే నాకు మతిపోయింది. ముందుగా ఫేస్ బుక్ నుంచి సంగ్రహించిన ఈ స్క్రీన్ షాట్ చూడండి. 1992లో ఈనాడు జర్నలిజం స్కూల్ లో నా […]
అంబానీ కుడిభుజం సన్యాసదీక్ష… అన్నీ వదిలేసి, నిర్వాణమార్గంలోకి…
‘‘ప్రకాష్ షా… దేశాన్ని శాసించే ముఖేష్ అంబానీ బాల్యమిత్రుడు, తన కంపెనీ వైస్ ప్రెసిడెంట్, తన కుడిభుజం… జీతం ఏటా 70 కోట్లు… వయస్సు డెబ్భయ్ దాటి… మొన్న 25వ తేదీన ఈ భౌతిక సుఖాలు, హోదాలు గట్రా అన్నీ వదిలేశాడు… అకస్మాత్తుగా సన్యాసదీక్ష స్వీకరించాడు… ఇప్పుడాయన పేరు నూతన్ మునిరాజ్… ఇక తన బాట నిర్వాణపథమే… మహాప్రస్థానమే…….’’ ఇంట్రస్టింగుగా ఉంది కదా… ఈ ట్వీట్ ఓ జాతీయవాది ట్వీట్లో కనిపించింది… కానీ ఎవరూ పెద్దగా స్పందించలేదు, […]
కరోనా కాదు… ధైర్యం సడలితే చాలు, ఆ భయమే మింగేస్తుంది… బహుపరాక్…
చిరంజీవి ఇప్పుడేమీ కాకపోవచ్చు… కానీ తను నటుడిగా బాగా బతికిన రోజులనాటి ఒక్క విషయం చెప్పుకోవాలి… 1984 కాలం కావచ్చు… మహానగరంలో మాయగాడు అనే ఓ సినిమా వచ్చింది… తనే హీరో… ఓ ఎపిసోడ్లో ధనం, ధాన్యం, సంతానం, వీరం వంటి అష్టలక్ష్ములున్నా సరే, ధైర్యలక్ష్మి లేకపోతే అందరూ వేస్ట్ అనే ఓ నీతివాక్యం బోధిస్తుంది అది… నిజం… భయం లేకపోవడం, ధైర్యంగా ఉండటం, పోరాడటమే జీవితాన్ని గెలిపిస్తుంది… కరోనా కాలం నేర్పిస్తున్నదీ అదే… నేర్చుకోవాల్సింది కూడా […]
కెవ్వు గావుకేకారుపు..! ‘అతి’కే అతితనం నేర్పే నాటి తెలుగు మూవీ సీన్లు…
…. By……. Gottimukkala Kamalakar………… అదో పూరిగుడిసె..! ఆ పక్కనే కార్ పార్కింగ్ లో ఓ ఎర్ర కాడిలాక్, ఇంకో పసుపురంగు షెవర్లే పార్క్ చేసున్నాయి. గుడిసె ముందు జాగ్రత్తగా మోన్ చేసిన లానూ, పూల మొక్కలూ ఉన్నాయి. ఇవాళ నీళ్లుపోయకపోవడం వల్లో, ఇంకెందువల్లో పూలమొక్కలు దీనంగా చూస్తున్నాయి. గుడిసె ముందు జనం జాతరలోలా మూగి ఉన్నారు. మగాళ్లు నీరుకావి ధోవతీ మీద పొందూరు చొక్కా, దానిమీద కోటూ వేసుకుని, దానిమీదింకో తువ్వాలేసుకుని బెక్కుతూ ముక్కులు […]
Destiny..! ఆరోజు తరుముకొస్తే అంతటి శ్రీకృష్ణుడికే తప్పలేదు… మనమెంత..?!
కరోనాకు దూరంగా ఉండి, అంతా బాగానే ఉందిలే అని మనం అనుకుంటున్నాం… కానీ లేదు… హోం ఐసొలేషన్, హోటల్ ఐసొలేషన్, క్వాంరటైన్, హాస్పిటల్ బెడ్, ఐసీయూ… ఎక్కడో ఓచోట కరోనా నుంచి బయటపడటానికి ఆరాటపడుతున్న రోగులు, వాళ్లు బంధువులు, ఆవిరైపోతున్న ఆస్తులు, అడ్డగోలు అప్పులు… వాళ్లకు ఏమీ బాగాలేదు… ఇది సొసైటీలో నెగెటివిటీని నింపే ప్రయత్నం కాదు… నిజం… నిష్ఠురంగా ఉన్నాసరే నిజం… సర్కార్లు ఎప్పుడూ ఇంతే… సమాజమూ ఇంతే… ఒక సమయం వస్తుంది… ఆ టైం […]
రామోజీరావు గారూ ఏమిటీ వైపరీత్యం..? న్యాయదేవత ధర్మత్రాసునే అప్పగిస్తోందా..?
సార్… మీ కార్టూన్ ఏమాత్రం బోధపడటం లేదు… ఇలాంటి కార్టూన్లు గీసినప్పుడు, పాఠకుడు జుత్తు పీక్కునే అవసరం లేకుండా… ఆ కార్టూన్ అర్థ వివరణ, పరమార్థ వివరణ కూడా పనిలోపనిగా ప్రచురిస్తే మేలేమో ఆలోచించగలరు… ఎస్, గర్విద్దాం… అర్ధశతాబ్దం తరువాత ఓ తెలుగువాడు మన దేశ అపెక్స్ కోర్టుకు చీఫ్ అవుతున్నందుకు అందరమూ ఆనందిద్దాం… కానీ అభినందన మరీ విపరీత వ్యక్తి పూజ స్థాయికి అవసరమా యువరానర్..? సగటు తెలుగు హీరో అభిమాని స్థాయిలో మన పాత్రికేయం […]
కైలాసం అయితేనేం… కరోనాకు భయమా ఏం…? గేట్లు మూసేయబడినవి…
కైలాసంలో కరోనా జాగ్రత్తలు! ——————– నిత్యానంద అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు అని సాధారణ నిఘంటు అర్థం. అయితే ఒకదేశాన్నే పుట్టించి, ఆ దేశాన్ని కైలాసంగా మార్చి, దానికి ఆయనే అధ్యక్ష, ప్రధాని, మంత్రి, కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కారణజన్ముడు నిత్యానంద విషయంలో సాధారణ నిఘంటువులకు విలువ ఉండదు. పీఠాధిపతులను ఆయన అనకూడదు అని మీకు అభ్యంతరమయితే వారు/శ్రీవారు/శ్రీచరణులు/స్వామివారు అని మార్చుకుని చదువుకుంటే నాకెలాంటి అభ్యంతరం ఉండబోదు. నిత్యం ఆనందమే తానయినవాడు, నిత్యం ఆనందాన్ని పంచేవాడు, నిత్యం ఆనందం […]
గుగ్గిళ్లలో గులకరాళ్లు..! ఈనాడు సంపాదకీయానిది ఓ వింత భాష… మచ్చుకు ఒకటి…
విశ్లేషణ :: ఎస్.రాము…………. తెలుగు భాషను ప్రయత్నపూర్వకంగా అద్భుతంగా సరళీకరించి వాడుకభాషనే పత్రికాభాషగా తీర్చిదిద్దిన ఘనత ‘ఈనాడు’ ది, ఆ పత్రిక అధిపతి-చాలామంది సీనియర్ జర్నలిస్టులకు పితృసమానులు- రామోజీ రావు గారిది. తెలుగు జనజీవనంలో ఒక మధురమైన అధ్యాయంగా ఉండే ‘ఈనాడు’ లో ఎందుకోగానీ ఎడిట్ పేజీలో రోజూ వచ్చే సంపాదకీయంలో వాడే భాష గుగ్గిళ్ళలో గులక రాళ్ళలా అనిపిస్తుంది… చాలా సార్లు. ఎడిట్ అనగానే…. జనసామాన్యం వాడుకలో లేని, కఠినమైన, పడిగట్టు పదాలను వాడుతూ ట్రాన్స్ […]
- « Previous Page
- 1
- …
- 24
- 25
- 26
- 27
- 28
- …
- 35
- Next Page »