ఎల్ ఐ సి ప్రకటనలు చదివేవారికి లేదా ఒక పాలసీ? ———————- జీవితం మనదే అయినా బీమా తెలుగు పదమేనా? కాదా? అన్న చర్చ ఇక్కడ అనవసరం. తెలుగు ప్రామాణిక నిఘంటువు శబ్దరత్నాకరం ప్రకారం బీమా హిందీ పదం. ధీమా బలంగా ఉండాలనుకుని బీమాకు ఒత్తు కూడా పెట్టి “జీవిత భీమా” అని కూడా కొందరు తమకు తాము గట్టిగా ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. “యోగక్షేమం వహామ్యహం” అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అభయ వాక్కును ఎల్ […]
కలల సీతాకోకచిలకల వెంట… ఆర్టిస్ట్ మోహన్ కార్టూన్ కబుర్లు-1
కలల సీతాకోకచిలకల వెంట… Mohan’s preface to Cartoon Kaburlu ———————————————————- “నేను చాలా స్పెషల్. వ్వెరీ వ్వెరీ డిఫరెంట్. నా దారే వేరు. నా లైనే కొత్త. నేనెప్పుడూ అంతే. నే చెప్పేదే గొప్ప” అని మీ గురించి మీరెలా అనుకుంటున్నారో, నా గురించి నేనూ అలాగే చెప్దామనుకున్నా. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలాగో ఈ గొప్పతనం నిరూపిద్దామంటే ఒక్కగానొక్క ఎలిబీ అయినా దొరికిచావదే. మరి నేను రాశాను.. మీరు చదవండి అని సిగ్గులేకుండా చెప్పడమెలా? […]
అందమైన ఓ గ్రీకుదేవతే కాదు… ప్రపంచచరిత్రలోనే క్లియో‘పాత్ర’..!
By….. Jagannadh Goud……………………. ఈజిప్ట్ రాణి…: క్లియోపాత్ర ది గ్రేట్ …… ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర మహా అందగత్తెగానే ప్రపంచానికి పరిచయం. కానీ క్లియోపాత్ర అంటే ఒక ధైర్యం, క్లియోపాత్ర అంటే ఒక సాహసం, అన్నింటికి మించి క్లియోపాత్ర అంటే ఒక ఆత్మ విశ్వాసం. నాకు తెలిసి ఏ చరిత్రకారుడూ ఆమె గురించి నెగటివ్ గా రాయలేదు. కాని కొంతమంది మూర్ఖులు, అజ్ఞానులు ఆమె గురించి నెగటివ్ గా మాట్లాడటం నేను విన్నాను, అబద్ధాలు చాలా […]
మగతనాలు… రెండు వేర్వేరు క్లాసిక్ కేసులు… నవ్వొద్దు సుమీ…
నవ్వొద్దు… రెండూ వేర్వేరు వార్తలే… సోషల్ మీడియాలోనే నిన్న ఎవరి వాల్ మీదనో చూసినట్టు గుర్తు… బ్రిటిష్ కొలంబియాలో ఒకాయన ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకున్నాడట… మొత్తం 150 మందిని పిల్లల్ని కన్నాడట… ‘‘వాడు మగాడ్రా బుజ్జీ’’ అనే హెడింగుతో ఎవరో రాసిన వార్త క్లిప్పింగు కనిపించింది ఫేస్బుక్లో… ఆ తండ్రికి ఈమధ్య దూరంగా… అమెరికాకు వెళ్లి బతుకుతున్న ఓ కొడుకు సోషల్ మీడియా వేదికగా ఈ నిజాన్ని వెల్లడించాడుట… అసలు ఒక భార్యతోనే వేగలేక […]
ష్.., కేసీయార్ సారూ… నీ ఇష్టపుత్రిక డిజిటల్ దుర్గతి చూశావా..?
పెద్ద సారు ప్రపంచానికి నీతులు చెబుతాడు… తన చుట్టూ ఉన్న ప్రమథగణాలు మాత్రం ఇంకా నాటి పురాణయుగంలోనే ఉండిపోయాయి… ఏమైనా అంటే కోపం… తాండవం చేస్తాయి… మరీ అవసరమైతే తనవైపే కన్నెర్ర చేస్తూ చూస్తయ్… ఆయనకు అలవాటే కదా భస్మాసుర ప్రహసనాలు… విషయం ఏమిటంటే..? ఆయన తెలంగాణ యాసకు పట్టం కడతాడు అని అమాయకంగా నమ్మారు కదా తెలంగాణ జనం… నో, నో, ఇప్పుడు రుద్దబడిన తెలుగే మన తెలంగాణ భాష అంటూ… ప్రపంచ తెలుగు మహాసభలు […]
పట్టుచీరె కట్టేనా..? నొసటన బొట్టు పెట్టేనా..? వేళ్లకు మెట్టెల మాటేమిటో..?!
అప్పట్లో ఓ ఫేమస్ పాట… జ్యోతిలక్ష్మి చీరకట్టింది, పాపం… అని ఏదో దాసరి సినిమాలో వినిపించి ఓ ఊపు ఊపింది… నిజానికి ఓ ఇంట్రస్టింగు పాయింటే… ఎప్పుడూ పొట్టి దుస్తులు ధరించి, వయ్యారాలు ఒలకబోస్తూ, డాన్సులు అనబడే గెంతులు వేసి అలరించే ఓ ఐటం నర్తకి అకస్మాత్తుగా సంప్రదాయబద్ధంగా చీరకట్టి కనిపిస్తే ఆశ్చర్యమే కదా… అసలు జ్యోతిలక్ష్మి చీరకట్టడం ఏమిటి అనే ప్రేక్షకుడి ఫీల్ ఆ పాటను అలా పాపులర్ చేసింది… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? […]
మనం ఇంకా సింగర్ సునీత పెళ్లి దగ్గరే ఆగిపోయాం… కానీ..? కానీ..?
ఈ సృష్టిలో ఆడ, మగ రెండే ఉంటయ్… మనుషులు ద్విలింగ జీవులు… అంతే… మధ్యలో వావీవరుసా అనేది మనుషులు ఏర్పాటు చేసుకున్న సామాజిక ఆంక్షలు… అంతే… ఈ ఒప్పందాల్ని, ఈ ఆచారాల్ని, ఈ ఆనవాయితీల్ని, ఈ మర్యాదల్ని ప్రకృతి గుర్తించదు…. ఇలా అనుకునేవాళ్లు కోకొల్లలు… వావీవరుసా అనేది సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, జాతిని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది అనేది మనకు చరిత్ర చాలా సందర్భాల్లో చెప్పింది… సొంత కూతురు, మనమరాలు, మనమడు, తల్లి, తండ్రితో […]
నాలుగు చుక్కలు..! కోట్ల దేవుళ్లు అండగా కదిలివచ్చినంత విశ్వాసం..!
వచ్చిన టీకాయే దిక్కు మొక్కు! ———————- డిస్‌క్లెయిమర్ :: ఇది కరోనా వ్యాక్సిన్ శాస్త్రీయత, పనితీరులో కచ్చితత్వం మీద విశ్లేషణ కాదు. భక్తి- విశ్వాసాలకు సంబంధించిన అంశం…… ఇక పదండి…. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వ్యాక్సిన్ వచ్చింది. దేశమంతా ఒక ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన మంచి ముహూర్తంలో వ్యాక్సిన్ వేయడం ప్రారంభమయ్యింది. టీకాలు వేయడాన్ని హిందీలో చక్కగా “టీకాకరణ్” అని నామ్నీకరణ మాట టీకాలు పుట్టినప్పటినుండి వాడుతున్నారు. పోలియో చుక్కలు కాబట్టి తెలుగులో […]
కరోనా అనువాద వాణిజ్య ప్రకటనల్లో హాస్యం బాగా పండును…!
పుట్టబోయే బిడ్డకు ఒక అందమయిన రంగు! మీరు ప్రేమించేవారి కోసం ఒక యాసిడ్! ———————– ముందుగా ఒక డిస్ క్లైమర్:- ప్రకటనలు నూటికి నూరు పాళ్లు హాస్యానికే. కొన్నిట్లో హాస్యం బాగా పండుతుంది. కొన్నిట్లో పండదు. ఈ రోజు మాత్రం పాఠకులకు ప్రకటనల్లో హాస్యం తెగ పండింది! ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. హాస్య ప్రకటన- వన్:- ——————- గోడలకు వేసే రంగులు. పండంటి బిడ్డను కనబోయే మహిళ నవ్వులు చిందిస్తూ నిలుచుంది. ప్రేమగా భర్త ఆమె […]
సింగర్ సునీత కొత్తేమీ కాదు… మల్టీ పెళ్లిళ్లు అలవాటైన ఆ పాత ట్రెండే…
కాస్త సద్దుమణిగింది గానీ… సింగర్ సునీత రెండో పెళ్లి మీద సోషల్ మీడియాలో బోలెడన్ని వ్యాఖ్యానాలు… నిజానికి ఆమె చేసింది తప్పేమీ కాదు… చట్టరీత్యా, సమాజం ఆమోదించిన పద్ధతిలోనే పెళ్లిచేసుకుంది… అది ఆమె వ్యక్తిగతం… ఎదిగిన పిల్లలు, ఆమె బంధుగణం కూడా ఆశీర్వదించి అక్షింతలు వేశారు… దాన్నలా వదిలేస్తే… సెలబ్రిటీల మల్టీ పెళ్లిళ్లపై ఎప్పుడూ ఓ చర్చే… ఖండించేవాళ్లు, సపోర్ట్ చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు… ఐనా, అంతటి వయసులో ఎన్టీయార్ లక్ష్మిపార్వతిని పెళ్లిచేసుకుంటే తెలుగు సమాజం ఆమోదిస్తూ […]
ఊకో కాక… చిచ్చా ఏక్ పెగ్… విస్తరాకు… అత్తా వచ్చిపో… ఇదే ట్రెండ్..!!
మహేష్… ఆ పేరులోనే ఓ వైబ్రేషన్… ఓ జోష్… సుబ్బు అంటే ఏముంది, బాబ్బాబు అన్నట్టుగా…… అదేదో సినిమాలో ఓ హీరోయిన్ ఈ డైలాగులు వదులుతూ తెగవయ్యారాలు పోతుంది… అసహజమే అయినా ఆ పాయింట్ కాస్త సరదాగా అందరికీ నచ్చింది… నిజమే… నేములోనేముందీ అని కొందరు లైట్‌గా తీసుకుంటారు గానీ… నేమ్, సర్నేమ్ చాలా ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో… శ్రీ వెంకటేశ్వర వైన్స్, శ్రీ భద్రకాళి బార్, శ్రీ ఆంజనేయ రెస్టారెంట్, శ్రీ రామ మెన్స్ వేర్ […]
రంగు, ఒడ్డు, పొడుగు, గుణం, ప్రాంతం… మన చేతుల్లో ఏముంది బ్రదర్..?
ప్రపంచమంతా వర్ణ దురహంకారం ———————- తెలుపు తెలుపే. నలుపు నలుపే. నలుపును ఎంత నలిపినా తెలుపు కాదు. ఈ విషయం బాగా ఎరుకలో ఉండాలని ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపుగానే ఉందిగానీ- తెలుపు కాలేదని వేమన ప్రయోగ ఉదాహరణతో తేట తెల్లం చేశాడు. ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. నిజానికి ఆకాశానికి ఏ రంగూ లేదు. సముద్రం కూడా నీలి రంగులో కనిపిస్తుంది. నిజానికి నీటికి కూడా ఏ రంగూ లేదు. కాలితే […]
చదవాల్సిన కథ…! మన వ్యవస్థలపై కడుపు రగిలిపోయే వాస్తవకథనం…!!
సాధారణంగా పత్రికల సండే మ్యాగజైన్లు పెద్దగా పాఠకాసక్తి లేని అంశాలు, వినోదప్రధాన ముచ్చట్లకూ పరిమితం అవుతుంటాయి… లేదా సాహిత్యం గట్రా… చాలామంది పాఠకులు వాటి జోలికి కూడా పోరు… ఈనాడు సండే మ్యాగజైన్ తిరగేస్తుంటే ఓ కథ కనిపించింది… ‘ఇది… కథ కాదు’ అనే శీర్షికతో రాసిన కథ… నిజానికి అది కథ కాదు… అక్షరమక్షరమూ మనం బతుకుతున్న వ్యవస్థ వికృత, చీకటి కోణాల్ని చూపించే కథనం… రియాలిటీ… అందులో ఒక్క అక్షరమూ అబద్ధం కాదు… మనం […]
ఎదిగిన పిల్లలే తొలి అక్షింతలు చల్లాక… ఆఫ్టరాల్ సమాజానిదేముంది..?!
సినిమా పేరు… మా నాన్నకు పెళ్లి…! ఈవీవీ కేవలం బూతుల దర్శకుడిగా మారకముందు తీసిన సినిమా… అందులో కృష్ణంరాజు తండ్రి, అంబిక తన ప్రియురాలు, కొడుకు శ్రీకాంత్… తండ్రి ప్రేమకథ అనుకోకుండా తెలుసుకుని, వాళ్ల పెళ్లికి తనే పెద్దరికం వహిస్తాడు, తాత సహకరిస్తాడు… ఈ ప్రయత్నంలో తన ప్రియురాలితో బంధం భగ్నమయ్యే సిట్యుయేషన్ వచ్చినా డోంట్ కేర్ అంటాడు… అదీ కథ… 1997 నాటి కథ… సినిమా పేరు… స్వాతి… ఒకప్పుడు మంచి మంచి కథాంశాలతో క్రాంతికుమార్ […]
బ్రాహ్మి..! ఫాఫం, సోషల్ మీడియా అంటే తెగచిరాకు వచ్చేస్తోందట..!!
ఇప్పుడంటే పెద్దగా వినిపించడం లేదు గానీ… కొద్దిరోజుల క్రితం వరకూ బ్రహ్మానందం పేరు వింటేనే నవ్వొచ్చేది… తెలుగు కామెడీతో అంతగా మమేకం అయ్యాడు… ఆయన అదృష్టం, కృషి కారణంగా మంచి పాత్రలు దక్కాయి… పేరు, డబ్బు, ఆస్తులు అన్నీ సంపాదించుకున్నాడు… సన్ స్ట్రోక్‌తో కొంత పోగొట్టుకున్నాడు… అదంతా వేరే కథ… అసలు బ్రహ్మానందం లేకుండా సినిమా వచ్చేది కాదు ఒకప్పుడు… అంతటి కమెడియన్ కూడా మాటీవీలో ఏదో కామెడీ షో చేసి ఫ్లాప్ అయ్యాడు… అది ఇంకో […]
భలే వార్త..! ఓహ్… ఐటీ దాడులు, ఉల్టా దాడులు ఇలా కూడా ఉంటయా..?!
ముందుగా ఒక వార్త చదవండి… ఐటి శాఖ అధికారులపై దాడి… పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో దారుణం… క్వారీలో తనిఖీకి వెళ్ళిన ఇద్దరు ఐటి అధికారులను చితకబాదిన సిబ్బంది… గాయాలతో కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక… దాడికి పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్ చేసిన ధర్మారం పోలీసులు… పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం శివారులోని కంకర క్వారీలో దారుణం జరిగింది… క్వారీ నిర్వాహకులు ఆదాయపు పన్ను శాఖ అధికారులపై దాడి చేశారు… దాడిలో ఇద్దరు ఐటి శాఖ అధికారులు గాయపడ్డారు… వారిని […]
పెద్దపెద్ద తోపు భజన జర్నలిస్టులకే ఒత్తులు, చుక్కలు తెలియవు… వీళ్లెంత..?!
అసలు పెద్ద పెద్ద పత్రికల రిపోర్టర్లకే పొట్టచీరితే కాస్త మంచి భాషలో రాయడం తెలియదు… సబ్ ఎడిటర్లకే భాష తెలియదు… మస్తు జీతాలు తీసుకుంటున్న తోపు జర్నలిస్టులకే ఏ అక్షరం పొట్టలో చుక్క పెట్టాలో, దేనికి జట పెట్టాలో, దేనికి దీర్ఘం అవసరమో, ఎక్కడ స్పేస్ అవసరమో తెలియదు… అనవసర ప్రత్యయం అనే పదానికి అర్థం తెలిసినవాళ్లు మొత్తం జర్నలిస్టుల్లోనే అయదారుశాతం ఉండరు… ప్లీజ్, నవ్వొద్దు, నేను ఎవరినీ అవమానించడం లేదు… మేం తోపు ఎడిటర్లం అని […]
ఓ తెలుగు అలెక్సా..! ఎట్లున్నవ్..?
గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేకపోతే ఎన్ని బతుకు ఇంజిన్లు ఆగిపోయేవో? గుండు సూది నుండి అణుబాంబుల తయారీ వరకు ఏదడిగినా తడబడకుండా, సిగ్గులేకుండా టక్కుమని చెబుతుంది గూగుల్. సమాచార సముద్రాన్ని కొన్ని లక్షల, కోట్ల పేజీల్లో డేటాగా ఎక్కించి గూగుల్ సమాచార గుత్తాధిపత్యాన్ని సాధించింది. గూగుల్ లో లేనిదాన్ని ఇప్పుడు ప్రపంచం ఒప్పుకోని పరిస్థితి వచ్చేసింది. సాంకేతిక పరిజ్ఞానం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించే కొద్దీ అధునాతన ఆవిష్కరణలు, సరికొత్త పరికరాలు రావడం సహజం. అలా […]
వీళ్లు సీనియర్ సింగర్సేనా..? ఆ బాలు లేకపోతే పాట మాధుర్యమే మటాష్..?!
ఇక్కడ సంగీతం అనే పదాన్ని వాడటం లేదు…! సినిమా పాటల మీద ఇంట్రస్టు ఉన్నవారికి ఈటీవీలో వచ్చే స్వరాభిషేకం వీనులవిందు… ఏళ్లుగా అది పాటలప్రియుల్ని అలరిస్తూనే ఉంది… రాష్ట్రంలోని పలు ప్రాంతాలకే కాదు, పలు దేశాలకు కూడా వెళ్లొచ్చింది… ఈటీవీలో అభిరుచి ఉన్న ప్రోగ్రాముల్లో ఇదీ ఒకటి… కాకపోతే దీనికి లిమిటెడ్ వ్యూయర్షిప్ ఉంటుంది… రేటింగ్స్ గురించి ఆలోచించకుండా రామోజీరావు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఆ బాధ్యతలు అప్పగించాడు… ఇక్కడ సీన్ కట్ చేయండి ఒకసారి… మొన్న స్వరాభిషేకం […]
దేహమా..! రేపు రా..! శ్మశానాలు ఖాళీ లేవు..!
సూర్యుడి కొడుకు యమధర్మరాజు. కూతురు యమునా నది. ఇద్దరూ నల్లగా ఉంటారు. నలుపు రంగుకు యమధర్మ రాజు ప్రాణమిస్తాడు. ఆయన వాహనం దున్నపోతు నలుపు. ఆయన డ్రెస్ పంచె, ఉత్తరీయం నలుపు, ఆయన చేతిలో యమపాశం నలుపు. భారతంలో ధర్మరాజు పేరు అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలు తీసే యముడు ధర్మరాజు కావడం ధర్మబద్దమేనా? అని కొందరి ధర్మ సందేహం. జాతకాలు, సిజేరియన్ కత్తులు, ఆసుపత్రిలో లేబర్ వార్డ్ బెడ్డుల అందుబాటు గొడవల వల్ల పుట్టడం ముందుకో, వెనుకకో […]
- « Previous Page
- 1
- …
- 28
- 29
- 30
- 31
- 32
- …
- 35
- Next Page »