Ramesh Sharma Vuppala పోస్ట్ ఒకటి ఆసక్తికరంగా అనిపించింది… చెప్పాలంటే ఇది నిజమేనా అని కూడా అనిపించింది… ఒకసారి ఆ పోస్టు చదవండి యథాతథంగా… ముఖే ముఖే సరస్వతీ అన్నారు పెద్దలు. పనికల్పించుకొని మాట్లాడితే ఎంతోకొంత కొత్త సమాచారం జ్ఞానం దొరుకుతుందని నమ్మిన వాడిని. రెండు రోజుల కింద ఆత్మీయులైన వందేమాతరం రవీంద్ర గారితో కొద్దిసేపు ఫోన్ ద్వారా మాట్లాడాను. మానవ సంబంధాల గురించి కొంతసేపు మాట్లాడారు. ఆమధ్య తను మాజీ ఎంపీ జయపాల్ రెడ్డీ గారి […]
మనమేంటో పరిచయం చేస్తా… తెలంగాణ ‘కల్చరల్ ముద్రల’తో అమెరికా శిక్షణకు…
అనుకోకుండా అమెరికా లాంటి దేశాలకు వెళ్లాల్సి వస్తే…? ఇక్కడి మట్టి వాసన, ఛాయలు ఏమీ కనిపించకుండా అత్యంత ఆధునికులం మేమే అన్నట్టుగా వెళ్తాం కదా… కానీ ఈయన వేరు… అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన యాభై మంది ఉపాధ్యాయుల్లో మన హనుమకొండ జిల్లా ఐనవోలు హైస్కూల్ లో ఇంగ్లీష్ చెప్పే డాక్టర్ కోలా రవికుమార్… ఏమేం తీసుకెళ్తున్నారు, లిమిటెడ్ లగేజ్ తీసుకెళ్లండి అని సూచించాను… దానికి ఆయన చెప్పిన లగేజ్ జాబితాకు నోరు వెళ్ళబెట్టాల్సి […]
ప్రశాంత్, వంగా, అగ్నిహోత్రి, రాజమౌళి, మణిరత్నం…. ఈ ప్రేమకథ తీయగలరా..?
అమరప్రేమ, అపూర్వప్రేమ, అమలినప్రేమ, అద్భుతప్రేమ, అనిర్వచనీయప్రేమ… ఏ పేరైనా పెట్టుకొండి… ఇన్నివేల సినిమాలు తీశారు కదా మనవాళ్లు… ప్రతి సినిమాలోనూ ఓ ప్రేమకథ ఉంటుంది కదా… మెయిన్ కంటెంట్ ఏమున్నా సరే, ఓ తోక ప్రేమకథ తప్పనిసరి అనే సూత్రంతో మన ఇండస్ట్రీ నానా వేషాలూ వేస్తుంది కదా… ఒక ప్రేమకథను సినిమాగా తీయగలరా..? గాంధీ సినిమాకు మళ్లీ ఇంగ్లిషోడే దిక్కయినట్టు, ఇప్పుడు మనం చెప్పబోయే ప్రేమకథకూ హాలీవుడ్ డైరెక్టర్లే బెటరా..? ప్రేమకథల్ని అందంగా చెక్కే మణిరత్నం […]
సరిగమల సైరన్లు… అంబులెన్సులకు ఆదితాళం, కాన్వాయ్లకు కాలభైరవం…
Classical Siren: కేంద్ర మంత్రుల్లో నితిన్ గడ్కరీ కొంచెం భిన్నంగా ఉంటారు. చాలాసార్లు మనసులో ఏముందో పైకి చెప్పేస్తూ ఉంటారు. మహారాష్ట్రలో నాగపూర్ గడ్డ ఆయన బలం. మోడీ- అమిత్ షాల ముందు గడ్కరీ చిన్నవాడు అయిపోయారో! లేక చిన్నవాడిని చేశారో! తెలియదు కానీ… అంతకు ముందు ఆయన బిజెపి జాతీయ రాజకీయ యవనిక మీద చాలా పెద్దవారు. సామాన్యులు ఏమనుకుంటుంటారో, ఎలా మాట్లాడుతుంటారో… అలా ఆయన బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉంటారు. ఇందులో మంచీ ఉంది. చెడూ […]
అయ్యయ్యో… నెత్తిల జుత్తూ పోయెనే… అయ్యయ్యో… మొగడు తన్నీ తరిమేసెనే…
Heavy Loss: అందానికి నెత్తిన జుట్టే కీలకం కాబట్టి… బట్టతల కనిపించకుండా విగ్గయినా పెట్టుకోవాలి. లేదంటే వేలు, లక్షలు ఖర్చు పెట్టి అత్యాధునిక హెయిర్ గ్రాఫ్టింగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ అయినా చేయించుకోవాలి. బట్టతల మాయమై నెత్తిన ఒత్తుగా జుట్టు రాగానే సహజంగా ఎవరికయినా పులకింతలు మోసులెత్తుతాయి. పదే పదే అద్దంలో మొహం చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. పూట పూటకు వయసు పదేళ్లు వెనక్కు వెళుతున్నట్లు అలౌకిక కేశ పారమార్థిక ఆనంద స్థితిలో ఓలలాడుతూ ఉంటారు. “ఊరుకున్నంత ఉత్తమం లేదు; బోడి గుండంత సుఖం లేదు” అన్న […]
వయస్సు కేవలం ఓ సంఖ్య మాత్రమే అంటున్నారు ఈ వృద్ద పర్యాటకులు…
(రమణ కొంటికర్ల)….. అబ్ తో హై తుమ్సే హర్ ఖుషీ అప్నీ.. ఇప్పుడు నా ప్రతి సంతోషమూ ఇక నీతోనే అనే 1973లో విడుదలైన అభిమాన్ సినిమాలో పాటతో పెళ్లిచూపుల్లో ఆయన మనసు కొల్లగొట్టింది. ఇప్పుడు నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా వచ్చేత్తపా డుగ్గుడుగ్గని పాడుతూ… పారాహుషార్ పారాహుషార్ తూరుపమ్మ దక్షిణమ్మ పడమటమ్మ ఉత్తరమ్మ అంటూ నలుదిక్కుల రైడ్ చేస్తున్న భర్తతో కలిసి దేశ, విదేశాల్లో పర్యటిస్తూ తన జ్ఞాపకాలను పంచుకుంటోంది. 70వ పడిలోనూ నవ దంపతుల్లా […]
బసవబంధు… తన వ్యవ‘సాయ’ నేస్తాలే ఆ పెళ్లికి ప్రత్యేక అతిథులు…
Basava the Guest: శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం నాలుగుకాళ్లతో సవ్యంగా నడవడం అన్నమాట ఇందులోనుండే పుట్టింది. కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభ ముహూర్తాన తెల్లవారకముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగుపెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి. ఆవుతోక పట్టుకుని వెనుక మనం వెళ్లాలి. ఆవు లోపలికి వెళ్లిన మరుక్షణం అక్కడ ఏవైనా […]
Komuravelli… ఆమె అచ్చు ఓ ఇంటి వేడుకలాగే దేవుడి కల్యాణానికి ‘కనెక్టయింది’…
చాలా గుళ్లల్లో కల్యాణాలు, అభిషేకాలు ఏదో కమర్షియల్ తంతులాగా సాగుతూ ఉంటయ్… ఇస్తినమ్మ వాయినం అన్నట్టుగా పూజారులు ఏదో తమ డ్యూటీ తాము చేస్తున్నాం అన్నట్టు చేసేస్తుంటారు నిర్వికారంగా… వాటిల్లో పాల్గొనే భక్తులు కూడా పుచ్చుకుంటి వాయినం అన్నట్టుగా వచ్చామా, పోయామా అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు… అన్నింటికీ మించి అభిషేకాలు, నిత్య కల్యాణాల్లో భక్తుల్ని పర్సనల్గా ఇన్వాల్వ్ చేయడం పెద్దగా ఉండదు… వీవీఐపీ, షోపుటప్, మరీ ధనిక భక్తులు అయితేతప్ప… హైదరాబాద్కు వందలోపు కిలోమీటర్ల దూరంలో ఉండే కొమురవెళ్లి […]
సాబుదాన… గింత కడుపుల పడితే పెయ్యి తొవ్వకు ఒస్తది…
~~~ సాబుదాన.. సాబుదాన్లు.. సాబుదాన్ బియ్యం. మాకిది ఉపాహారమూ, ప్రత్యేక వంటకమూ కాదు. వీటితోటి పాయసాలూ, నైవేద్యాలూ ఏవీవుండవు. జొన్నలు, రాగులు, సజ్జలు, చెల్కలదొరికె గడ్డలలెక్క ఆరోగ్యం కోసం కాచుకునుటానికి ఇదీ ఓ జావ మాత్రమే ! సాబుదానకు ఆషాడం, శ్రావణం ప్రత్యేకమైన నెలలు. ఒకప్పుడు ఆషాడమంటే హడల్. కక్కు బయలు కామన్. ఏది తిన్నా భయంభయంగనే చూసుకోని తినుడు ఉండేది. మామూలుగనే, ఏదో వో కారణంగ అతిసారం అంటుకునేది. రోగంనొప్పులున్నోళ్లకు గావర అంటితే పూటకే దివాలైతరు. […]
బోనం అంటే..? తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీక… ఇది చదివితే సమజైతది…
బోనం ! తాత్త్వికత !! ~~~~~~~~~~~~~~ శైవ&శాక్తేయ సంప్రదాయాలకు కేంద్రస్థానమైన తెలంగాణ సంస్కృతిలో బోనం ఒక విశిష్ట పర్వం ! ఏడాది పొడుగునా ఇక్కడ బోనాలేబోనాలు… బోనం కథ & తాత్త్వికత చాలా చాలా పెద్దది అది రాస్తే రామాయణం,పాడితే భాగవతం…!! బోనం అంటే భువనం ! సకల ప్రాణికోటికి మూలస్థానం !! బోనం అంటే వట్టి మట్టికుండే. కానీ అది నిండుకుండ. బోనం ఒక పూర్ణకుంభం. బోనం ఒక బ్రహ్మాండబాండం. బోనం ఒక ధాన్యాగారం. బోనం […]
మొత్తానికి భలే మాయలేడి… ఒకరా ఇద్దరా… ఏకంగా ఇరవై ఏడు మంది…
ఫేక్ పేర్లతో… దొంగ మాటలతో బోలెడు పెళ్లిళ్లు చేసుకున్న మోసగాడు… కట్నం తీసుకుని, పరారైపోయి, మళ్లీ ఇంకోచోట ప్రత్యక్షం… ఇలాంటి వార్తలు చాలా చదివాం… అసలు ఏమీ తెలుసుకోకుండా, వరుడి కుటుంబం వివరాలు కనుక్కోకుండా ఎలా పిల్లనిస్తారు అనే ఆశ్చర్యం కలిగేది… కానీ ఇది పూర్తి భిన్నమైన కథ… జమ్ముకాశ్మీర్లోని ఓ యువతి ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకుంది… అందరినీ మోసగించింది… ఇప్పుడు 28వ పెళ్లి కోసం ఎవరిని బకరా […]
దటీజ్ సాయిపల్లవి..! అభినందించడానికి మరో కారణం దొరికింది…
సాయిపల్లవిని చాలా విషయాల్లో మెచ్చుకున్నాం… కుంటాం కూడా… ఆ బురద ఇండస్ట్రీలో ఆమె ఓ డిఫరెంట్ కేరక్టర్… ఆ బురద లక్షణాలేమిటనేది పక్కన పెడదాం… ఒకప్పుడు అలాగా బతుకు బతికిన నటులకు మంచి చాన్సులు దొరికితే, అనుకోకుండా హిట్టయితే… ఇక ఫ్యాన్స్, అట్టహాసాలు, హంగామాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా… ఆడలేడీస్ అయితే ఇక రాణివాసపు పోకడలే… సుకుమారంగా పెరిగినట్టు పోకడలు, ఫోజులు… అడుగు తీసి అడుగేస్తే అందం ఎక్కడ కందిపోతుందో అన్నట్టుగా మేకప్పులకు తరచూ […]
ప్రేమంటే..? పెళ్లంటే..? ఈమె బాష్యం వేరు, ఆచరణ వేరు…! నమ్మలేము…!!
ప్రేమ అంటే..? ఈ పదాన్ని సరిగ్గా, సమగ్రంగా నిర్వచించినవాడు ఈ ప్రపంచంలో పుట్టలేదు… పుట్టబోడు..! ఇప్పుడు అకస్మాత్తుగా ఇండియన్ మీడియాలో ఒక లవ్ స్టోరీ వైరల్ అవుతోంది… దానికీ ఓ నేపథ్యం ఉంది… షేర్ షా అని ఓ హిందీ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది… సిద్ధార్థ మల్హోత్రా హీరో, కియరా అద్వానీ హీరోయిన్… 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ ఆర్మీ కెప్టెన్ బయోపిక్ ఇది… ఆ కథానాయకుడి పేరు విక్రమ్ బాత్రా… ఈ […]
హేమిటీ… వాళ్లింట్లో టమాట పప్పు, టమాట రసం, టమాట పచ్చడి, టమాట రైస్..?!
‘IT-Tamota’: అది బ్రాహ్మీ ముహూర్తం. ఆ ఇంట్లో ఎవరూ నిద్ర లేవలేదు. దిగువ మధ్య తరగతి ఇళ్లున్న కాలనీ కాబట్టి బైకులు, ఆటోలు తప్ప కార్లు కూడా లోపలికి రాలేవు. ఒకవేళ వచ్చినా ఒక కారుకు ఎదురుగా ఇంకో కారు వస్తే…ఎవరో ఒకరు వెనక్కు వెళ్లాల్సిందే. అలాంటి ఏరియాలో సాయుధ పోలీసులతో అధికార నిఘా విభాగం బృందాలు మెరుపు దాడి చేశాయి. ఆ ఇంటి తలుపు తట్టాయి. తెల్లవారక ముందే ఏ పాల బిల్లు కోసమో ఎవరో తలుపు తడుతున్నారనుకుని […]
ఛిఛీ… సర్కారు ఏం చేస్తున్నట్టు..? ఆదాయ ప్రదాతల్ని అవమానించడమే ఇది…
Discrimination: ఇది చూడడానికి చిన్న వార్తే కావచ్చు. కానీ… విషయం చాలా తీవ్రమయినది. పురోగామి సమాజంలో తిరోగామి చర్యలను ముక్త కంఠంతో ఖండించడానికి ఉద్యుక్తులం కావాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించే వార్త. రాకెట్లు వేసుకుని అంతరిక్షంలో పర్యాటకులుగా తిరిగి వస్తున్న ఆధునిక నవనవోన్మేష కాలంలో… ఒకానొక మందుబాబు మందు షాపుకు వెళ్లి… డబ్బులిచ్చి 90 ఎమ్మెల్ పోయమంటే పోయనంటాడా? పైగా కులం పేరుతో మందును నిరాకరిస్తాడా? వేర్ వుయ్ ఆర్ గోయింగ్? వాట్ వుయ్ ఆర్ డూయింగ్? ఈజ్ ఇట్ […]
కన్నీళ్లతో, ఉద్వేగంతో కృష్ణ వరం కోరుకున్నాడు … ఓ రేణుక కథ…
( పురాణ ప్రసిద్ధురాలైన రేణుక జమదగ్ని మహర్షి భార్య. ఆమె తన పాతివ్రత్య ప్రభావంతో ,నది నుండి ప్రతిరోజూ నీటినే కుండ ఆకారంలోకి మార్చి ఆశ్రమానికి తీసుకొచ్చేది . ఒక రోజు నది వద్ద అత్యంత సుందరుడైన కార్తవీర్యార్జున మహారాజును చూసి ఒక క్షణం … ఒకే ఒక క్షణం రేణుక మనస్సు మోహావేశంతో చెదిరింది. ఆరోజు నీరు కుండ ఆకారంలోకి గట్టిపడలేదు. రేణుక మామూలు మట్టికుండలో నీళ్లు పట్టుకుపోవడంతో జమదగ్ని తన దివ్యదృష్టితో జరిగిన సంగతిని […]
ఇలా ఆలోచిస్తాడు కాబట్టే ముఖేష్ అంబానీ అంత ప్రపంచ ధనికుడయ్యాడు…
హఠాత్తుగా కొన్ని పోస్టులు వైరల్ అయిపోతుంటయ్… ఇదెక్కడో చదివినట్టుగా ఉంది, ఇది పాతదా, కొత్తదా అనే డైలమాలో కూడా పడేస్తయ్… పోస్టులో నిజానిజాలను పక్కనపెడితే… ఓ కథలాగా చదివేస్తే సరి అనుకుని చదివేయాలి… ఇదీ అలాంటిదే… ఓసారి పోస్టు చదవండి… ఇది విన్నారా అమ్మాయులూ !! రూ.100 కోట్ల వరుడు కావాలన్న, అందమైన అమ్మాయికి ముఖేష్ అంబానీ దిమ్మతిరిగే ఆన్సర్…… రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి తన సంస్థకు సంబంధించిన పెద్ద మీటింగ్లలో పాల్గొనే టైమే ఒక్కోసారి ఉండదు. […]
అనుకుంటాం గానీ… తెలుగు నుంచి ఇంగ్లిషు అనువాదాలూ కష్టమే సుమీ…
ఇంగ్లిషు నుంచి తెలుగులోకి ఈనాడు తరహా క్షుద్రానువాదాలను గర్హిస్తున్నాం… భాషను ఖూనీ చేస్తున్న ఈనాడును చూసి ఖండిస్తున్నాం సరే… ఇంగ్లిషును ఇంగ్లిషులాగే ఉంచండిరోయ్, ఈ కాష్మోరా టైపు చేతబడులు వద్దురోయ్ అని మొత్తుకుంటున్నాం… ఈనాడోడు వినడు, అది వేరే సంగతి, వాడిని చూసి సాక్షి, జ్యోతి వంటి తోకపత్రికలు కూడా వాతలు పెట్టుకుంటున్నయ్ అప్పుడప్పుడూ… అదొక విషాదం… కానీ తెలుగు నుంచి ఇంగ్లిషులోకి కూడా కొన్ని అనువాదాలుంటయ్… అవి చదువుతుంటే, బాబోయ్, ఆ తెలుగు పదాల్ని అలాగే […]
దోశ టేస్టా..? పోహా టేస్టా..? ఇడ్లీ, వడలు బెటరా..? రోటీలు, పావ్ బజ్జీ బెటరా..?
ఎప్పుడూ పాలిటిక్స్, క్రికెట్, సినిమాలు, టీవీలు, ఓటీటీ, సెలబ్రిటీలు… ఇవేనా..? టూరిజం, ఫుడ్, డ్రెస్సింగ్, ఫ్యాషన్స్ ఎట్సెట్రా కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు, సంవాదాలకు కారణమవుతుంటాయి… పెద్దగా ట్రోలింగ్ ఉండవు ఆ ట్వీట్లపై, పోస్టులపై… సరదాగా వాదాలుంటయ్… సోషల్ ట్రోలింగ్ పిచ్చోళ్లకు ఇందులో ఎలా జొరబడాలో తెలియక సైలెంటుగా ఉండిపోతారు… ఇలాంటి ఫన్నీ డిబేట్లకు, ఇంట్రస్టింగు చర్చలకు ఒక ఉదాహరణ… గబ్బర్సింగ్ అనే ఒక ట్విట్టరుడు కడక్ జిలేబీ, పోహా (అటుకులు, పోపేసిన చుడువా టైప్) […]
ఇప్పుడు ట్రెండు అరుణాచలం… గిరిప్రదక్షిణ చేయాల్సిందే… తండోపతండాలు…
Neelayapalem Vijay Kumar……… అవునూ … మా చిత్తూరు పక్కనుండే “అరుణాచలం” లో కొత్త దేవుడేమైనా వెలిసాడా ? Do you know what is the new fad in Andhra right now? తిరువన్నామలై “అరుణాచలం” గుడికి పోవడం …! వీలైతే పౌర్ణమి నాడు పోవడం …! అప్పుడెప్పుడో శబరిమలైలో దేవుడు ‘జ్యోతి’ ని కనిపింప చేస్తాడు అని లక్షల కొద్దీ పరిగెత్తే వాళ్ళు గుర్తుందా … ఇప్పుడు ‘అరుణాచలం’లో పౌర్ణమి నాడు గిరి […]
- « Previous Page
- 1
- …
- 5
- 6
- 7
- 8
- 9
- …
- 35
- Next Page »