Life- Language: భాష దానికదిగా గాల్లో పుట్టి ఊడి పడదు. మనమే పుట్టించాలి. అందుకే మాయా బజార్లో- “ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి?”-అన్న మాటల మాంత్రికుడు పింగళి సూత్రీకరణే సర్వకాల సర్వావస్థల భాషా సిద్ధాంతమయ్యింది. భాషా శాస్త్రంలో నేను చదివింది సముద్రంలో ఆవగింజంతే అయినా…మాటల వ్యుత్పత్తి, వ్యాకరణం, మాండలికాల్లో మాటలను పలికే పద్ధతుల్లో తేడాలను తెలుసుకోవడం ఉత్సాహంగా ఉంటుంది. ఉన్న భాషకు వ్యాకరణం పుడుతుందే కానీ…వ్యాకరణం ముందు పుట్టి భాష తరువాత పుట్టదు. అలా పుడితే అది జీవ భాష కాదు. నిర్జీవ […]
ఈ పిల్లలమర్రి కోలుకుంది… మరణావస్థ దాటేసి మళ్లీ లేచి నిల్చుంది…
“ఈ మఱ్ఱి యా కొకో! యేకార్ణవము నాఁడు శేషాహిశాయికి సెజ్జ యయ్యె నీ మఱ్ఱి మొదలనొకో! మహాదేవుఁ డే కాగ్రచిత్తంబున నతిశయిల్లు నీ మఱ్ఱి భావమొకో! మృగాంకుని మేనఁ బ్రతిబింబరూపమై పాయకుండు నీ మఱ్ఱి మీద నొకో! మున్ను గజకచ్ఛ పములతో లంఘించెఁ బక్షివిభుఁడు నిట్టి మఱ్ఱి యుండు నీ ద్వీపమును వట ద్వీప మనక, యేమి తెలివి యొక్కొ! తొంటి పెద్ద లెల్లఁ దొడఁగి జంబూద్వీప మనిరి నాఁగ నొప్పె న క్కుజంబు” -అనంతామాత్యుడి భోజరాజీయం. […]
“స్వచ్చ్ దూద్సే బనాహువా కలాఖండ్వాలా కోవా… సిర్ఫ్ దస్ రూపయే”
Sweet Auto: మంగళగిరి మెయిన్ రోడ్డు పక్కన ఏపిఐఐసి ఆఫీసు. దాని ముందు రోడ్డు మీదే “హలో ఇడ్లి” టిఫిన్ హోటల్. రెండు వారాల పాటు రోజూ ఉదయం ఏడు గంటలకే అక్కడ ఇడ్లీలు తినాల్సిన అనివార్య పరిస్థితి. హోటల్ దగ్గర కారు దిగగానే… పాలకోవా అమ్మే ట్రాలీ ఆటో ఒకటి రోజూ కనిపిస్తుంది. వినిపిస్తుంది. ఆటో వెనుక, ముందు సౌండ్ బాక్స్ లు. అందులో తెలుగు, హిందీలో ముందే రికార్డ్ చేసి పెట్టిన ఆడియో లూప్ లో వెంట […]
రాజమండ్రి టు భద్రాచలం… గోదావరి మీద లాంచీ ప్రయాణం జ్ఞాపకాలు…
ట్రావెలాగ్ రాయాలంటే ముందుగా ఆ అనుభూతిని మనసు నిండా నింపుకుని, తాపీగా అక్షరబద్ధం చేయాలి… అప్పుడే అందులో లైఫ్ ఉంటుంది… మన ఫీలింగ్స్ను షేర్ చేసుకోవడానికి ఇప్పుడు సోషల్ మీడియా ఉంది… మది నిండా అల్లిబిల్లిగా కదలాడే అనుభూతుల్ని కాస్త క్రమపద్ధతిలో రాస్తూ పోతే… ఇదుగో ఇలాంటి పోస్ట్ అవుతుంది… గోదావరి ప్రయాణాలు అనుభవమున్నవాళ్లు కనెక్టవుతారు… ఓ మిత్రుడు 1988లో రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లిన లాంచీ ప్రయాణం కథాకమామిషు ఇదుగో… యథాతథంగా… Mallareddy Desireddy….. ” గోదారమ్మ […]
గ్రామబహిష్కరణ అక్కర్లేదు… పిట్టముట్టకపోతే ప్రత్యామ్నాయం వచ్చేసింది…
పిట్టముట్టుడు… బలగం సినిమాలో ఇదే కీలకం… దీనిపైనే తెలుగు సోషల్ మీడియా అంగీలు చింపుకుంటోంది… మన సమాజంలోని ఒక సెక్షన్ దీన్ని మూఢనమ్మకాన్ని ఎంకరేజ్ చేసే తిరోగమనవాదంగా చిత్రీకరించడానికి నానాపాట్లు పడుతోంది… ఆ సెక్షన్ పెద్ద పెద్ద హీరోల చెత్తా అవలక్షణాలపై మాత్రం కిమ్మనదు… అదే పెద్ద తిరోెగమనం… ఆ చర్చ పక్కనపెడితే… అది ఒక కథ… తన కుటుంబంలో ఓ కర్మకాండ స్వయంగా గమనించిన దర్శకుడు వేణు ఆ అంశం చుట్టూ ఓ కథ రాసుకున్నాడు… […]
చూడచూడ ఇడ్లీల రుచులు వేరయా… ఈయన 2547 రకాల ఇడ్లీలు చేయగలడు…
వరల్డ్ ఇడ్లీ డే… 30 మార్చి… అసలు ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని..? పేరు ఎనియావన్… కోయంబత్తూరుకు చెందిన ఈయన ఎనిమిదో తరగతి డ్రాపవుట్… పూర్ ఫ్యామిలీ… కుటుంబం గడవటానికి మొదట్లో టీ షాపుతో పనిచేసేవాడు… తరువాత ఆటో నడిపించుకునేవాడు… ఓరోజు చంద్ర అనే మహిళ కలిసింది… ఆమె రోజూ 250 ఇడ్లీలను హోటళ్లకు సరఫరా చేసేది… ఈ ఇడ్లీల చేరవేత ద్వారా ఎనియావన్కు ఓ పని చూపించింది ఆమె… రెండు… రెండే రెండు ఇడ్లీ కుక్కింగ్ […]
వివాహ భోజనంబు… వింతైన వంటకంబు… మెతుకు దొరుకుట విలోలంబు…
Vivaham-Vindu: సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. కాబట్టి పెళ్లిపనులన్నీ కాంట్రాక్ట్ ఇవ్వకతప్పింది కాదు. అందులో తప్పేమీ లేదు. పెళ్ళిమంటపం, డెకరేషన్, వంటావార్పు, కుర్చీలు షామియానాలు, మేళతాళాలు, పురోహితులు, ఫోటోలు , వీడియోలు , ఎల్ఈడీ స్క్రీన్లు, సంగీత్ నాట్యాలు సకలం కాంట్రాక్ట్ వ్యవహారాలే. పదహారు రోజుల పెళ్లిళ్లు అయిదురోజులకు, తరువాత మూడు రోజులకు, ప్రస్తుతానికి ఒక రోజుకు తమను తామే తగ్గించుకున్నాయి. ఇప్పుడు ఫంక్షన్ హాళ్లు దొరకడం ముఖ్యం […]
‘వోణీ’ కవితకి ఒక వికటానుకరణ…. A PARODY AGAINST ‘EXTREMISM’….
అనుకరణతో అల్లరి చేసే మేజిక్… పేరడీ. పైకి వొట్టి మాటల గారడీలానే ఉంటుంది. అందులోనే గిలిగింతలు పెట్టే కామెడీ పండుతుంది. మన తెలుగులో పేరడీ చాలా పాపులర్. మీరజారగలడా నా యానతి – (అనగానే) వీపు గోకగలడా… సత్యాపతి! అలా కుదరాలి. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిపించి… తన కవితనే శ్రీశ్రీ పేరడీ చేస్తూ – పొగాకు తోటలు పొగాకు తోటలు పొగాకు తోటలు పండితున్ అన్నారు. దీన్ని కంటిన్యూ చేస్తూ జర్నలిస్టు […]
‘‘ఆ క్షణంలో ప్రధాని నరేంద్ర మోడీ కళ్లల్లో నేను భయం గమనించాను…’’
Nancharaiah Merugumala…….. రాహుల్ నుంచి మరో ఏకపక్ష కావిలింతకు భయపడే నరేంద్రభాయ్ 52 ఏళ్ల బ్యాచిలర్ పై అనర్హత వేటు వేయించారా?……………………………………………………. కిందటి పార్లమెంటు ఎన్నికలకు పది నెలల ముందు.. అంటే 2018 జులై 21న రాఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, లౌకికవాదం, మహిళల భద్రత, జీఎస్టీ వంటి విషయాలపై బీజేపీ సర్కారుపై పదునైన మాటలతో దుమ్మెత్తిపోశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆయన ఆ రోజు ఖాదీ కుర్తా, పాయిజామా ధరించి ఉన్నారు. అన్ని విధాలా, […]
అది వీర బొబ్బిలి మాత్రమే కాదు… వీణ బొబ్బిలి కూడా…
Historic Veena: పల్లవి:- నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా అను పల్లవి:- మోదకర నిగమోత్తమ సామ వేద సారం వారం వారం చరణం:- సద్యోజాతాది పంచ వక్త్రజ స-రి-గ-మ-ప-ధ-ని వర సప్త-స్వర విద్యా లోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం పల్లవి:- శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా! అనుపల్లవి:- నాభి హృత్కంఠ రసన నాసాదులయందు…శోభిల్లు సప్తస్వర… చరణం:- ధర ఋక్ సామదులలో వర గాయత్రీ హృదయమున సుర భూసుర […]
మోడీ వ్యాఖ్యలు తప్పే… శూర్పణఖ అందగత్తె, మనోహరమైన నవ్వు… బాధితురాలు…
ఏదో ఒకటి మాట్లాడటమే తప్ప నేనేం మాట్లాడుతున్నాను అనే సోయి ఉండదు కొందరు నాయకులకు… సారీ, చాలామంది నాయకులు అదే ధోరణి… ఏదో ఒకటి కూయాలి, విలేకర్లు కూడా కళ్లు మూసుకుని రాసేసుకుంటారు… అచ్చేస్తారు… టీవీలు చూపిస్తాయి… సోషల్ మీడియా భజన అందుకుంటుంది… రేణుకా చౌదరిని కూడా ఆ కోవలోకి చేర్చేయవచ్చు… సుదీర్ఘ రాజకీయ జీవితం ఉండి కూడా ఏదో ఒకటి మాట్లాడేయడం ఆమె స్టయిల్… నిన్న తనది ఓ ప్రకటన… 2018వ సంవత్సరం ఫిబ్రవరి ఏడున […]
మధిరోపాఖ్యానం… తయారీ నుంచి రుచి తగిలేదాకా… ఇదొక వైనాలజీ…
మెతుకు విలువ తెలిసినోడికే బతుకు విలువ తెలిసినట్టు వైన్ తాగినోడికే దాని విలువ, వయసు తెలుస్తుందట. అందుకేనేమో ఒమర్ ఖయ్యాం మొదలు హరివంశ రాయ్ వరకు మహామహులెందరో ఈ మధిరపై మనసు పారేసుకున్నారు. పానశాలలు, మధుశాలలు, రుబాయత్లు, గజళ్లు, కవాలీల వంటివెన్నో అల్లారు. ’ముసలోడి మరణం’ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే అయితే .. తన జీవితంలో ఎక్కువ వైన్ తాగలేకపోయానే అని తెగ బాధ పడిపోయాడు. (మై ఓన్లీ రిగ్రెట్ ఇన్ మై లేఫ్ ఈజ్ దట్ […]
రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం…
1920 మార్చి 24 రాంభట్ల పుట్టినరోజు మరోసారి పెద్దాయన్ని గుర్తుచేసుకుంటూ .. ఒక బెల్జియం అద్దం – రాంభట్ల కృష్ణమూర్తి Cartoonist, critic, poet and communist —————————————————————– శాపాలతోటి కాళ తమోరాశి తూలదు ఏపాటిదైన వెల్గు ప్రసారించుతూ పద… అని వెలుతురు దారుల్లోకి నడిపించి, కొవ్వొత్తిలాగ కాలి ప్రదీపించు వారికీ చెయ్యెత్తి లాల్ సలాం సమర్పించుతూ పద… అంటూ ఉత్తేజ పరిచినవాడు రాంభట్ల. సనాతనాల బూజుపై కులం మతం రివాజుపై పురాణ నమ్మకాలపై తుఫాను రేగుతోంది […]
‘పద్దతి’ తప్పుతున్న పంచాంగాలు… ‘కత్తెర కాన్పులకూ’ ఫిక్స్డ్ ముహూర్తాలు…
ఇది ఏ పంచాంగం..? సిద్ధాంతి ఎవరు..? ప్రచురణకర్త ఎవరు..? అనే ప్రశ్నలు అనవసరం… దిగువ ఓ ఫోటో చూడండి… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? ఇప్పటికే పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు కస్టమర్ల అవసరాల మేరకు అభిజిత్ ముహూర్తాలు పెట్టేస్తున్నాం… వ్యవప్రయాసలకు గురిచేసే పెళ్లి తంతును కుదించడం చేతకాదు గానీ ఆ తంతును మరింత పెంచేస్తున్నాం… రకరకాల ఉత్తరాది ఆచారాలను కూడా నెత్తిన పెట్టుకుంటున్నాం… మాదేం పోయింది అనుకుని తెలుగు పంతుళ్లు కిమ్మనడం లేదు… ఇదంతా సరే, కానీ ప్రతి […]
హరీష్ భాయ్… సకాల స్పందన భేష్… కానీ చేయాల్సింది ఇంకా ఉంది…!
నిజంగా ఈ వార్త బాగుంది… అసలు మన మెయిన్ స్ట్రీమ్ పత్రికలు హ్యూమన్ ఇంట్రస్టింగ్ వార్తల్ని రోజురోజుకూ మరిచిపోతున్నయ్… పాపపంకిలమైన రాజకీయ, ఉద్దేశపూరిత కథనాలకు పరిమితమై మన పత్రికలన్నీ మురికి కంపు కొడుతున్నవేళ ఇలాంటి వార్తలు రావడమే అరుదు… అందుకని ఈ వార్త రాసిన ఈనాడు ఇంద్రవెల్లి విలేఖరికి అభినందనలు… వార్తను స్థూలంగా గమనిస్తే… అదొక గిరిజన గూడెం… ఉన్నవే 6 ఆదివాసీ కుటుంబాలు… ఏ చిన్న అవసరానికైనా సరే పది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి మండలకేంద్రానికి […]
ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్లో రెండు రోజుల ప్రయాణం…
ప్రయాణాలకు కూడా ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్… అఫ్కోర్స్, సౌకర్యానికే ఫస్ట్ ప్రయారిటీ… దూరాన్ని బట్టి ప్రయాణాల రకాలు… ఇప్పుడు ప్రయాణంలో వేగాన్ని, త్వరగా డెస్టినేషన్ చేరాలనే ఆతృతను కనబరుస్తున్నాం… కానీ కాస్త వెనక్కి వెళ్తే ప్రయాణం అంటే ఓ అనుభవం, ఓ తృప్తి, ఓ సరదా, ఓ థ్రిల్… అదేసమయంలో కాస్త అసౌకర్యం, ఆలస్యం కూడా… యాభైలు, అరవైలలో ఢిల్లీ నుంచి మద్రాస్ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్లో నా జర్నీని గుర్తుచేసుకుంటుంటే మళ్లీ మళ్లీ ఆనందమే… మొత్తం […]
జాలిగుండె లేని కొడుకుకన్నా కుక్క మేలురా!
What a faith: “శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు”-శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా గొప్ప మనిషి పుట్టుక పుట్టాము అని గర్వపడతాముకానీ, నిజంగా మనిషి జన్మను సార్థకం చేసుకుంటున్నామా? అన్నది అన్నమయ్య ప్రశ్న. ఎప్పుడో 550 ఏళ్ల కిందట కాబట్టి అన్నమయ్య అలా అన్నాడు. ఇప్పుడు కుక్క బతుకు సుఖంగానే ఉంది; మనిషి […]
గజాన్ ఆరోహయామి… కానీ మత్తేభాలంటే మాటలా… ఈ యంత్రగజం చాలదా…
Robo Raman: “రథగజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే…” అని అమ్మవారిని పూజిస్తాం. రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతి దళాల కాన్వాయ్ తో శోభిల్లుతున్న అమ్మకు నమస్కారం అంటున్నాం. “గజాన్ ఆరోహయామి ” అని షోడశోపచార పూజావిధానంలో ఇంటికొచ్చిన దేవుడిని ఏనుగు మీద ఎక్కించి పూజిస్తున్నాం. పార్వతి సున్నిపిండిని నలిచి సుతుడిగా మలిస్తే శివుడు ఏదో కారణానికి మెడ విరిచేశాడు. దాంతో పార్వతి అలిగితే అర్జంటుగా ఏనుగు ముఖాన్ని అతికించి ఆ పిల్లాడికి తిరిగీ ప్రాణం పోశాడు శివుడు. ఆ గజాననుడే లేకపోతే […]
స్వామివారికి మన తలనీలాల సమర్పణ… అందులో ఆడ ఏమిటి..? మగ ఏమిటి..?
ఇంతకుముందు ఏ దేవస్థానం దగ్గరకు వెళ్లినా సరే… ప్రత్యేకించి పల్లెజనం వెళ్లే గుళ్ల దగ్గర… మగాళ్లే కాదు, ఆడవాళ్లు కూడా గుండ్లు చేయించుకునేవారు… దానికి పెద్ద మథనం కూడా ఉండేది కాదు… అసలు శిరోముండనం అంటేనే, తల వెంట్రుకలు తీయించుకోవడం అంటేనే స్వామివారికి భవభోగాల్ని సమర్పించేసి, సర్వం సమర్పించుకుంటున్నామనే అర్పణ భావన… దానికి మగ, ఆడ తేడా ఏమిటి..? కాకపోతే ఆడవారైతే గుండుతో వికారంగా కనిపిస్తామనే సందేహం, ఒకసారి గొరిగితే మళ్లీ ఒత్తుగా, పొడుగ్గా పెరగటానికి టైమ్ […]
మహిళా స్పెషల్ లగ్జరీ అపార్ట్మెంట్లు… మగ పురుగులు కూడా ఉండొచ్చు…
Luxury Peaks: కథలన్నీ ఎన్ని మలుపులు తిరిగినా…చివరికి కంచికే చేరాలి. అలా వ్యాసాలన్నీ ఎన్ని విషయాలను తడిమినా…చివరికి ఆవునే చేరాలి. ఆవు వ్యాసం సకల వ్యాసాలకు స్ఫూర్తి. ఒకప్పుడు ఆవు వ్యాసానికే పరిమితమై ఉండేది. ఇప్పుడు ఆ ఆవు మిగతా అన్ని సృజనాత్మక రచనల్లోకి కూడా వచ్చి కూర్చుంది. అడుగడుగునా అన్ని రాతల్లో ఆవులే ఉంటాయి. ఎంత ఎగతాళిగా అనిపించినా… ఆవు వ్యాసం ఒక కాదనలేని నిజం. నిజమెప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది ఉదాహరణ కావాలంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ఒక […]
- « Previous Page
- 1
- …
- 7
- 8
- 9
- 10
- 11
- …
- 35
- Next Page »