ఎంత అగ్రనటుడైనా సరే… ఎంత గొప్పగా రంజింపచేయగల సామర్థ్యం ఉన్నా సరే… అది సరిగ్గా జనాన్ని రీచ్ కావాలంటే సరైన ప్లాట్‌ఫామ్ అవసరం… లేకపోతే ఆ పాపులారిటీ వేస్టు, ఆ ప్రయత్నమూ వేస్టు అనిపిస్తుంది… జూనియర్ ఎన్టీయార్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ప్రాథమిక ఫలితాలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది… తాజాగా విడుదలైన బార్క్ రేటింగుల్లో ఈ షో 10 రేటింగ్స్ సొంతం చేసుకుంది… అది ఆదివారం లాంచింగ్ రోజున… అంతే ఇక… […]
SURVIVOR… ఇది బిగ్‌బాస్‌కే తాత..! టీవీ రియాలిటీ షోలకు మరింత కొత్త థ్రిల్..!!
ఎహె, బిగ్‌బాస్-5 లో ఎవరెవరు..? ఎప్పట్నుంచి..? ఇది పెద్దగా ఆసక్తిని క్రియేట్ చేయడం లేదు ఇప్పుడు..? ఓ వార్త మాత్రం భలే పట్టేసింది.,. అదేమిటో ముందు చెప్పుకుందాం… ‘‘రియాలిటీ షోలు ఎప్పుడూ ఒకేరకంగా ఉంటే ఎవడు చూస్తాడు..? కొత్తదనం కావాలి ప్రేక్షకులకు… బిగ్‌బాస్ తాత వంటి రియాలిటీ షో ఒకటి బిగిన్ కాబోతోంది… ఆఫ్టరాల్ బిగ్‌బాస్ అంటే ఒక ఇంట్లో వదిలేస్తారు, ఇక తన్నుకొండిరా, తిట్టుకొండిరా అని చెబుతారు… ఏవో దిక్కుమాలిన ఇగోలు, పోటీలు గట్రా ఉంటయ్… […]
జెమిని వాడి కొత్త వంటలు..! ప్రేక్షకుడికి రుచి కుదిరితే సరి, లేదా ‘మాడిపోవడమే’…
అప్పుడెప్పుడో ఓ టీవీ యాంకర్ వంటల షోల గురించి మాట్లాడుతూ…. ‘‘ఛీ యాఖ్, మేమెందుకు రుచిచూస్తాం ఆ వంటల్ని… ఏదో నటిస్తాం, అంతే…’’ అని కుండబద్ధలు కొట్టేసింది… టీవీల్లో వంటల షోలు అలా ఛండాలం చేసేశారు గానీ యూట్యూబ్‌లో టాప్ జానర్లలో కుకరీ కూడా ఉంటుంది… మొన్నామధ్య చెప్పుకున్నాం కదా, పచ్చిపులుసు తయారీ వీడియో కూడా లక్షల వ్యూస్ సంపాదిస్తోంది అని… (కొన్ని కోట్లలో…) నిజంగా నిజం… వంటావార్పూ నేర్చుకోకుండానే పెళ్లి దాకా పెరిగే పిల్లలు తాపీగా […]
ఈ ట్రోలర్లను తప్పుపట్టలేం..! తెలుగు టీవీల ‘‘అశ్లీల వికారాలకు’’ వీళ్లే మొగుళ్లు..!!
అమ్మో, ట్రోలర్స్ అని సెలబ్రిటీలు ఉలిక్కిపడుతుంటారు… వణికిపోతుంటారు… ఎందుకు..? వాళ్లు చాకిరేవు పెట్టేస్తుంటారు కాబట్టి… వాళ్ల నాసిరకం పోకడల్ని బట్టలిప్పి చూపిస్తారు కాబట్టి… అఫ్ కోర్స్, ట్రోలర్స్‌లో అధికశాతం స్వార్థం, అజ్ఞానం, దురుద్దేశపూరితం… కానీ కొందరు ఉంటారు… వాళ్ల ట్రోలింగ్ సొసైటీకి మంచిదే… కావచ్చు, ఆ ట్రోలింగ్ వాళ్లకు ఉపాధి మార్గం కావచ్చు, వాళ్లకు భాష సరిగ్గా తెలియకపోవచ్చు… కానీ ఓ కంటెంటును చీల్చిచెండాడేలా, రకరకాల సంబంధిత క్లిప్పులు వెతికి, ఎడిట్ చేసుకుని, ఒక్క దగ్గర క్రోడీకరించి, […]
మోనిత పాత్రకు శోభ..! ఆ చెత్త కార్తీకదీపానికి వెలుగు, ప్రాణం, చమురు అన్నీ ఈమే…!!
చాన్నాళ్ల తరువాత నిర్బంధంగా మాటీవీ వాడి కార్తీకదీపం సీరియల్ చూడబడ్డాను… చెత్త కథ, చెత్త కథనం, చెత్త కేరక్టరైజేషన్, చెత్త సీరియల్… అందులో ఇసుమంత కూడా బేధాభిప్రాయం లేదు… సరే, ఆ టీవీవాడు ఏ మాయ చేస్తున్నాడో, వాడి సీరియళ్లన్నీ అద్భుతమైన టీఆర్పీలు సాధిస్తయ్… అందులో కార్తీకదీపం ఎన్నాళ్లుగానో టాప్… పెద్ద పెద్ద స్టార్ హీరోల ప్రిస్టేజియస్ సినిమాలు కూడా ఆ రేటింగ్స్ సాధించవు… మన బార్క్ వాడి దరిద్రపు రేటింగ్ వ్యవస్థ, డొల్లతనం, లోటుపాట్ల సంగతి […]
సార్, జూనియర్ గారూ… కనీసం ఇక్కడైనా ఆ వంశచరిత్రలు ఆపండి సార్…
కేబీసీ… కౌన్ బనేగా కరోడ్‌పతి… అనేక దేశాల్లో అనేక భాషల్లో సూపర్ హిట్ షో అది… మన దేశంలో కూడా పలు భాషల్లో ప్రసారం చేస్తున్నా అమితాబ్ నిర్వహించే షో మాత్రమే అల్టిమేట్… పలువురు వేరే హీరోలు ట్రై చేశారు, తెలుగులో కూడా నాగార్జున, చిరంజీవి ప్రయత్నించారు… దాదాపుగా అందరూ చేతులు కాల్చుకున్నవాళ్లే… మరీ నాగార్జునతో పోలిస్తే చిరంజీవి ఎపిసోడ్లు ఫ్లాప్… చిరంజీవి తరువాత ఇక ఆ షోయే ఆగిపోయింది… ఇప్పుడది జూనియర్ ఎన్టీయార్ హోస్టుగా వస్తోంది… […]
విజయశాంతికి ఈటీవీ ప్రత్యేక నివాళి..! ఉలిక్కిపడకండి, ఆమెకేమీ కాలేదు..!!
Tribute అంటే..? తెలుగులో నివాళి అని రాసేస్తున్నాం కదా… నివాళి అంటే..? కేవలం మరణించినవాళ్లకు వాడే గౌరవప్రదమైన పదం మాత్రమేనా..? శ్రద్ధాంజలికి పర్యాయపదమా..? కాదు… Tribute అంటే మరణించినవాళ్లకే కాదు, బతికి ఉన్నవాళ్లకు కూడా వాడే పదమే… కాకపోతే మనం అలా పత్రికల్లో రాసీ రాసీ నివాళి అనగానే అదేదో మృతులకు మాత్రమే వాడాల్సిన పదంగా మార్చేస్తున్నాం… ఇదెందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే..? ఈటీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఓ ప్రోగ్రాం వస్తుంది… […]
సర్వేలందు ఈ పాపులారిటీ సర్వేలు వేరయా… టీవీ పర్సనాలిటీల్లో ఎవరు తోపులు..?!
ఇండియాటుడే సర్వేల్లాగా…. పోయిన ఎన్నికల ముందు లగడపాటి సర్వేల్లాగా… కొన్ని భలే అనిపిస్తాయి… ప్రత్యేకించి కొన్ని మీడియా సంస్థలు నిర్వహించే పాపులారిటీ సర్వేలు భలే నవ్వు పుట్టిస్తాయి… టైమ్స్ వాడి సినిమా, టీవీ పర్సనాలిటీల పాపులారిటీ సర్వేలయితే పొట్ట చెక్కలే… వాటికి క్రెడిబులిటీ ఏమీ ఉండదు… ఎంతమంది పాల్గొన్నారు, ఏ పద్ధతిలో సర్వే చేశారు, ఏం ప్రశ్నలు వేశారు, శాంపిల్ మిక్స్ ఏమిటి వంటి వివరాలేమీ ఉండవు… సరే, అనుకోకుండా ఆర్మాక్స్ అనే ఓ మీడియా కంపెనీ […]
బల్లిగుడ్డు ఆమ్లెట్… ఆమె బాబుకే అక్క మరి… అందుకే పంచ్ అలా పడింది…
ఈటీవీ, మాటీవీలలో వచ్చే కామెడీ షోలలో నాసితనం, వెకిలితనాలకు కొదువ లేదు… కానీ పత్రిక కథనాల కాలుష్యాలు, కరోనా భయాలు, టీవీ డిబేట్ల పైత్యాలు, రాజకీయ నేతల జ్ఞానగుళికలు, రీసెంటు సినిమాల బీభత్సాల నడుమ జనానికి ఉన్న ఏకైక రిలీఫ్ చివరకు ఈ కామెడీ షోలే… తిట్టుకుంటూనే చూడాలి… జనానికి ఇప్పుడు టీవీని మించిన వినోదం లేదు… విషయానికొస్తే ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ పేరిట ప్రతి ఆదివారం ఓ షో వస్తుంది… కామెడీకి అప్పుడప్పుడూ సంగీతం, […]
సో వాట్..? నేరుగా ఓటీటీల్లోనే సినిమా రిలీజ్ చేస్తే తప్పేమిటట..!!
……….. By…. Prasen Bellamkonda………… ” థియేటర్లన్నీ నలుగురి చేతుల్లోనే ఉన్నాయి. ఏ సినిమాకు థియేటర్లు ఇవ్వాలి వేటికి ఇవ్వవద్దు అనేది ఈ నలుగురి దయాదాక్షణ్యాల మీదే ఆధారపడి ఉండడం దురదృష్టం” చాలా రోజులుగా చిన్న సినిమాల హీరోలు నిర్మాతలు పడుతున్న ఈ బాధను పక్కన పెడదాం. “ఓటిటిలకు సినిమాలిస్తే ఎక్జిబిటర్ లుగా మేం రోడ్డున పడతాం. థియేటర్లకు పెద్ద సినిమాలనివ్వకుంటే వాళ్ళ సంగతి చూస్తాం” ఇప్పుడు ఎక్జిబిటర్ల వాదన లాంటి హెచ్చరిక… దీన్నీ పక్కన పెడదాం… […]
ఎవడ్రా బాబూ..? బాగా ‘‘దంచికొట్టిన’’ ఈ వరలక్ష్మీ వ్రతం బేశరం నిర్మాత..?!
మాటీవీ క్రియేటివ్ హెడ్ మీద నిజంగా కేసు వేయాలి ఎవరైనా…? మా వరలక్ష్మి వ్రతం అని పేరు పెట్టి ఓ చెత్తా, దిగజారుడు షో ప్రసారం చేసినందుకు,.!! ఇక్కడ మనోభావాలు దెబ్బతినేందుకు ఏమీ లేదు… మాటీవీ, జీటీవీ, ఈటీవీ… ఏ ఎదవైతేనేం..? అందరూ అదే రేంజ్ కదా… ప్రత్యేకించి మాటీవీ వాడిని విడిగా తిట్టడానికి ఏమీ లేదు… కాకపోతే ఆ శీర్షిక ఏమిటి..? ఈరోజు నడిపించిన షో ఏమిటి..? కనీసం అది కిట్టీ పార్టీ కూడా కాదు, […]
రియాలిటీ లేకపోతేనే రియాలిటీ షో అంటారు… షణ్ముఖప్రియ కథ చెప్పిందీ అదే…
అసలు టీవీల్లో ఏ రియాలిటీ షో అయినా సరే… అది పక్కాగా స్క్రిప్టెడ్… వెల్ మేనేజ్డ్… ఎప్పటికప్పుడు టీఆర్పీలను బట్టి, వాళ్ల సొంత ఇంట్రస్టులను బట్టి లెక్కలు మారిపోతుంటయ్… టీవీ అంటేనే వినోదదందా… గీతాల షోలు అయినా సరే, కమర్షియల్ గీతల్లోనే పరుగులు తీస్తుంటయ్… సోనీవాడి ఇండియన్ ఐడల్ అంతకుభిన్నంగా ఉంటుందని ఎందుకు అనుకుంటాం..? 12 గంటల ఫినాలేలో సంగీతం, పోటీ గట్రా గాలిలో కలిసిపోయి, గాయకులకు డాన్సుల పోటీ పెట్టారు, ఎంటర్టెయిన్మెంట్ పోటీ పెట్టారు… అదొక […]
హైపర్ ఆది, ఏందీ ఇది..? చివరకు సంపూను కూడా బురదలోకి లాగావా..?!
దాంట్లో ఏం జోక్ ఉందో… రోజమ్మ తెగ నవ్వేస్తూ ఉంటుంది… అనసూయ దాదాపు దొర్లుతున్నట్టుగా పడీ పడీ నవ్వుతుంది… పాపం, మనో… నవ్వకపోతే బాగుండదు, మళ్లీ ఎపిసోడ్‌కు పిలవరు, డబ్బు రాదు అన్నట్టుగా మొహమాటానికి ఏదో నవ్వినట్టు నటిస్తుంటాడు… దాదాపుగా జబర్దస్త్‌లో ఎక్కువసార్లు కనిపించే సీన్లు ఇవే… వారం వారం స్కిట్ల నాణ్యత మరీ ఘోరంగా పడిపోతోంది… అఫ్ కోర్స్, ఆ ప్రోగ్రాం టేస్టు, క్వాలిటీ, ప్రజెంటేషన్ అన్నీ ‘‘పడిపోయిన రేంజే’’… కానీ మరీ హైపర్ ఆది […]
బూతుల జబర్దస్త్‌లు, భీకర సీరియళ్లకన్నా నువ్వే బెటర్… వచ్చెయ్ బిగ్‌బాసూ…
మొన్నటి సీజన్లో ముక్కు అవినాష్, ఇప్పుడు ముక్కు విష్ణుప్రియ… బిగ్‌బాస్ రాబోయే సీజన్ గురించి ఒకాయన సరదాగా చేసిన కామెంట్ ఇది… బిగ్‌బాస్ మీద టీవీక్షకుల్లో ఆసక్తి పెరుగుతున్నది… సెప్టెంబరులో స్టార్ట్ చేస్తున్నట్టుగా మాటీవీ ప్రకటించడంతో ఇక కంటెస్టెంట్లు ఎవరనే ఇంట్రస్టు, ఆ వార్తలు, ఊహాగానాల హైప్ పెరుగుతున్నది… తదుపరి హోస్ట్ ఎవరు, ఎవరు అని బోలెడు వార్తలు రాసుకున్నాయి కదా సైట్లు, యూట్యూబ్ గొట్టాలు… వాటికీ తెరపడింది… ఏ అన్నపూర్ణ స్టూడియోలో ఈ బిగ్‌బాస్ సెట్లు […]
షణ్ముఖ సరే..! మగగొంతులతో పోలిస్తే మన ఆడగొంతులు ఎక్కడ ఆగిపోతున్నయ్..?!
మన షణ్ముఖ ప్రియపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతూనే ఉంది… ఎక్కువగా నార్త్ ఇండియన్లే… ఒకవైపు యూనిక్ అని షణ్ముఖను మెచ్చుకుంటూనే, మెల్లిమెల్లిగా ఇండియన్ ఐడల్ జడ్జిలు సయాలీ, అరుణితను పైకి లేపుతున్నారు… నిజానికి ఈ షో, ఈ టీవీ, ఈ జడ్జిలు, ఈ పాటలు, ఈ ఆర్కెస్ట్రా, ఇతర స్టాఫ్ అంతా నార్తరన్ వాతావరణమే… సౌత్ ఇండియా పట్ల ఏదో తెలియని వివక్ష కనిపిస్తూ ఉంటుంది… అసలు ఇదే కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, […]
రాజనందిని వచ్చింది..! తెలుగు సినిమాకు తెలిసిన మొహమే..!
మంచి ప్రైమ్ టైమ్ సీరియల్… మంచి దమ్మున్న కథ… అందులోని ప్రతి నటి, ప్రతి నటుడూ మనసుపెట్టి ప్రతిభ చూపిస్తున్నారు… ఒరిజినల్ మరాఠీ సీరియల్ తులా పహెతే రే ప్రసారం జరిగినన్నాళ్లూ ఫస్ట్, సెకండ్ ర్యాంకుల్లో ఉండేది… దాని ఆధారంగా కన్నడంలో రీమేక్ చేసిన జోతే జొతెయాలి సీరియల్ కూడా టాప్ ఫైవ్ రేటింగ్స్‌లో ఉంటుంది… కానీ తెలుగుకు వచ్చేసరికి ఎందుకో చతికిలపడిపోయింది… జీతెలుగులో ప్రేమ ఎంత మధురం పేరిట ప్రసారం అవుతుంది ఈ సీరియల్… నిజానికి […]
జగ్గూభాయ్ ఫోటో చూసి… కన్నీళ్లొచ్చినయ్… సారు, ఇంత గొప్పోడా సాక్షీ..?
సినిమా వార్తల దరిద్రం అందరికీ తెలిసిందే… సోషల్ మీడియా పైత్యం పెరిగాక పరిస్థితి మరింత దిగజారిందనేదీ నిజమే… కానీ చివరకు ఇంత భ్రష్టుపట్టిపోవాలా అనిపించింది ఒక వార్త చూస్తే…! అదీ సాక్షి వంటి మెయిన్ స్ట్రీమ్ పత్రికకు సంబంధించిన వెబ్సైట్…!! ఎవరో జర్నలిజం బేసిక్స్, స్పిరిట్ తెలియకుండా, ఏ యూట్యూబ్ చానెలో, ఏ వెబ్సైటో పెట్టుకుని, ఇలాంటి వార్తలు రాస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు… కానీ చివరకు సాక్షి సైతం..! ఎహె, ఊరుకొండి సార్, పత్రికలు, టీవీల్లోనే బోలెడన్ని […]
ఏమండీ నాయుడు గారూ… మీ టీవీ5 చానెల్ అర్జెంటుగా అమ్మేశారట నిజమేనా..?!
‘‘టీవీ5 అమ్మేశారు… జస్ట్, వారం క్రితమే… డీల్ క్లోజ్… బీఆర్ నాయుడు ఫ్యామిలీకి టీవీ5కూ ఇప్పుడు సంబంధం లేదు… అందరూ తప్పుకున్నారు… దివ్యేష్ మానిక్ లాల్ షా, స్మృతి శ్రేయాన్స్ షా, శ్రేయాన్స్ శాంతిలాల్ షా ఇప్పుడు డైరెక్టర్లు… వీళ్లెవరో తెలుసా…? గుజరాతీ పెట్టుబడిదారులు… ఈ డైరెక్టర్లను నియమిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది… ఆన్లైన్లో ఈమేరకు మార్పులు చేసింది… టీవీ5 మాత్రమే కాదు, టీవీ5 కన్నడ, హిందూధర్మం కూడా అమ్మేసినట్టే… మరి ఏపీ సర్కారుతో […]
‘సోల్’ లేని స్టోరీ… పైగా పంటికింద రాళ్లు… టీవీ వార్తలు రాయడం ఓ కళ…!!
అసలు విడుదల అవుతుందో లేదో కూడా తెలియని ఏదైనా చిన్న సినిమా గురించి కూడా ఫుంఖానుపుంఖాలుగా రాస్తుంది మన మెయిన్ స్ట్రీమ్ మీడియా… అంతా ‘కవరేజీ’ మహిమ… ఏ పత్రిక సినిమా పేజీ చూసినా అందుకే మీకు ‘ఎక్స్‌క్లూజివిటీ’ కనిపించదు… ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు హీరో, హీరోయిన్, నిర్మాత, దర్శకుడు, లేకపోతే విలన్‌తో వరుసగా ఇంటర్వ్యూలు… అన్నింట్లోనూ సేమ్ సేమ్ కంటెంట్… ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఓటీటీలు కనిపిస్తున్నాయి మీడియాకు… అలాగే […]
ఒక టీవీ షోకు 12 గంటల ఫినాలె ప్రసారం..! ఎక్కడికో వెళ్లిపోతున్నాం..!!
అందరికీ తెలుసు, ఇండియన్ ఐడల్ ఓ ‘స్క్రిప్టెడ్ షో’ అని..! కానీ ఇండియన్ ప్రజెంట్ టాప్ ఫైవ్ షోలలో ఒకటిగా చేరి, నిజంగానే బాగా ఆదరణ పొందుతోంది… టీవీ రేటింగులు, యాడ్స్ కోసమే షో టీం కష్టపడుతూ ఉంటుంది… కానీ ఈసారి ఈ టీం క్రియేటివిటీ, థింకింగ్ స్టయిల్ టీవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది… లక్కీగా ఈసారి అద్భుతమైన టాలెంట్ ఉన్న సింగర్స్ దొరికారు… ఏక్‌సేఏక్ ఇరగదీస్తున్నారు… ఇంతకీ మనం ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే..? పంద్రాగస్టు ఈ […]
- « Previous Page
- 1
- …
- 30
- 31
- 32
- 33
- 34
- …
- 40
- Next Page »