కాస్తోకూస్తో బెటర్ అనుకున్న ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌ను విజయవంతంగా భ్రష్టుపట్టించారు కదా… ఇప్పుడిక హఠాత్తుగా జీసరిగమప, ఈటీవీ పాడుతా తీయగా చాలా బెటర్ అనిపిస్తున్నాయి… నిజం… కంటెస్టెంట్లు గతంలో పలు పోటీల్లో పాల్గొన్నవాళ్లే… చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచీ పాడుతున్నవాళ్లే… కానీ ఈ షో కోసం ఎంపిక చేయబడిన పాటల్లో పెద్ద వైవిధ్యం లేదు, నిజంగా కంటెస్టెంట్లను పరీక్షించే భిన్న ప్రయోగాల పాటలు కానే కావు అవి… పైగా పాటల ట్రెయినర్ రామాచారి, ఆయన శిష్యురాలు […]
గుడ్ సుడిగాలి సుధీర్..! బేబక్క చేసిన ఓ ప్రాంక్ కాల్, కరాటే కల్యాణి అవాక్కు..!!
మామూలుగా ఫ్రాంక్ కాల్స్ మీద నాక్కొంచెం చిరాకు… టీవీ షోలలో ఇదొక దిక్కుమాలిన వినోదం… మనం హఠాత్తుగా వెనుక నుంచి ఎవరి కళ్లో మూసేసి ఎవరో చెప్పుకో చూద్దాం అంటుంటాం కదా సరదాగా… సరే, ఆటపట్టించడమో, సరదాయో… గుర్తుపడితే చెబుతాం, లేదంటే కాసేపటికి వాళ్లే ఎదుటకు వచ్చి నిలబడతారు, మొహం అదోలా పెట్టి చూస్తారు… కానీ ఈ ప్రాంక్ కాల్స్ ఇలాంటివే, డిఫరెంట్… ఎవరో ఏదో షోలో ఉంటారు, ఇంటర్వ్యూయర్ ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయండీ అంటారు… […]
విష్ణుప్రియకు బ్రెయిన్ నత్తి..! ఆమే చెప్పుకుంది… అదీ నాగార్జునతో..!!
సరే, సరే… నాగార్జున హౌజులో కంటెస్టెంట్ల పర్ఫామెన్స్ సమీక్షించి… ఇద్దరు క్లాన్ చీఫుల పదవుల్ని ఊడబీకేశాడు… అక్కడికక్కడే వోటింగు జరిపేసి ఓ కొత్త చీఫును పెట్టాడు… శనివారం మొత్తం ఇదే సమీక్ష, మార్కులు వేయడం, క్లాసులు పీకడం, ఆధారాలు చూపించడం, ఓ ఇద్దర్ని సేవ్ చేయడం… ఇక ఫన్ ఏముంది..? వీకెండ్ ఎపిసోడ్ తాలూకు వినోదం ఏముంది..? మజా ఏముంది..? ప్చ్, రాను రాను నాగార్జున కొత్త సినిమాల్లాగే మారిపోతోంది నిస్సారంగా బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ల ప్లానింగ్… […]
ఫాఫం జీతెలుగు టీవీ… స్టార్ మాటీవీ దూకుడుతో విలవిల… పూర్ రేటింగ్స్…
ఫాఫం, నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్టుగా మారింది జీతెలుగు వాడి ప్రస్థానం… ఎలాగూ జెమిని టీవీ వినోద ప్రేక్షకుల జాబితా నుంచి దాదాపు అంతర్థానమయ్యే సిట్యుయేషన్… లేదా ఉన్నదంటే ఉన్నది అన్నట్టుగా మారిపోయింది… ఈటీవీ గతంలో కనీసం రియాలిటీ షోలతో, నాన్ ఫిక్షన్ కేటగిరీలో కాస్త పోటీపడేది… ఇప్పుడు ఫాఫం, ఇప్పుడు అదీ భ్రష్టుపట్టింది… చివరకు యూట్యూబ్ రెవిన్యూ మీద ఆధారపడుతోంది… టీవీ రేటింగ్స్‌లో పూర్… ఒకప్పుడు బాగా వెలిగిన రియాలిటీ షోలు కూడా ఇప్పుడు ఎవడూ […]
అవినాష్, హరితేజ, రోహిణి, టేస్టీ తేజ… అంత గొప్ప పర్ఫార్మర్లు ఏమీ కాదు మరి..!!
ఎప్పటిలాగే వచ్చాడు నాగార్జున… ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడం అనే ఓ పెద్ద బోరింగ్ సాగదీత ప్రోగ్రామ్ ఉంటుంది కదా… అలాగే ఏవో చిన్న చిన్న విషయాలపై కంటెస్టెంట్లకు తమలపాకుతో తలంటు కార్యక్రమమూ ఉంటుంది… యష్మి ఓ పెద్ద క్లాన్ చీఫ్… నామినేషన్లలోనూ ఉండదు… ఏదో అరుస్తుంది, చిత్రమైన కేరక్టర్… కానీ ఏం చేయగలడు..? కొన్నాళ్లు హౌజులో ఉండాలనే ముందస్తు ఒప్పందమేదో ఉన్నట్టుంది… అలా సుతారంగా గిల్లి వదిలేశాడు… ఎప్పటిలాగే ఓ లీక్ వచ్చేసింది… శేఖర్ బాషాను […]
శివాజీకి ఈ మోసుడు అవసరమా..? కృష్ణభగవాన్‌ను ఎందుకు తరిమేసినట్టు..!?
హైకోర్టు జడ్జి కాదు, కనీసం జిల్లా కోర్టు జడ్జి కూడా కాదు… జస్ట్, ఈటీవీలో గత ప్రాభవం కోల్పోయిన ఓ బూతు కార్యక్రమం జబర్దస్త్ షోకు జడ్జి… ఏమీ లేదు, స్కిట్లలో కమెడియన్లు వేసే తిక్క పంచులకు నవ్వు రాకున్నా పకపకా నవ్వాలి… చేతనైతే తనూ ఏదైనా దిక్కుమాలిన పంచ్ డైలాగ్ ఒకటి విసరాలి… అంతే..,. పైగా చాలా మంది జడ్జిలు వస్తుంటారు, పోతుంటారు… అప్పట్లో నాగబాబు, రోజాలు చాన్నాళ్లు ఉన్నారు… తరువాత ఈటీవీని నాగబాబు వదిలేయడం, […]
ఇండియన్ ఐడల్ షోను చెడగొట్టేశారు… బిగ్‌బాస్ బాటలో థమన్ అడుగులు…
ఈసారి తెలుగు ఇండియన్ ఐడల్ షో కోసం ఏక్‌సేఏక్ కంటెస్టెంట్లను ఎంపిక చేశారు అనేది నిజం… మంచి మెరిట్ ఉన్న గాయకులు వాళ్లు… పాటల ఎంపిక దరిద్రంగా ఉన్నా సరే, వాళ్లు వీనులవిందుగా ఆలపించగలిగారు… వీరిలో చాలామంది గతంలో పాడతా తీయగా, ఇతర టీవీ మ్యూజిక్ షోలలో పార్టిసిపేట్ చేసినవాళ్లే… మరీ కొత్త మొహాలేమీ కాదు… కాస్తోకూస్తో శాస్త్రీయ సంగీతం చిన్నప్పటి నుంచీ అభ్యసిస్తున్నవాళ్లే… కానీ ఏదో తేడా కొట్టింది… కొడుతోంది… వద్దూ వద్దని తరిమేసిన ఓ […]
ఊఁ అంటే హగ్గులు, ఓదార్పులు… లేదంటే అరుపులు… యాడ దొరికార్రా మీరంతా…!!
హైకోర్టులో విచారణ సాగుతూనే ఉంది కదా… బిగ్‌బాస్ షోలో అశ్లీలం, అసభ్యతలపై కదా ఫిర్యాదులు… పిటిషినర్లు మరో అంశాన్ని కూడా చేర్చాల్సిందేమో… హింస, క్రౌర్యం… లేకపోతే ఇదేమిటి..? ఆకలితో మాడ్చటం, క్రూడ్ వాక్సింగ్ ఎట్సెట్రా… ఆటలు గాయపడేలా, హింసాత్మకంగా ఉండటం ఏమిటి..? ఓ దశలో టాప్ కంటెస్టెంట్ నిఖిల్ బాధపడుతూ అంటున్నాడు… మొహాలకు ఏమైనా అయితే ఎలా అని..! నిజమే, దాదాపు అందరూ టీవీ, సినిమా, యూట్యూబ్‌ల మీద ఆధారపడి కెరీర్లు నిర్మించుకున్నవాళ్లే… వాళ్ల ఫేసియల్ ఫీచర్స్ […]
ఈ సీజన్ బిగ్‌బాస్ లాంచింగ్ షో రేటింగ్స్ ప్రస్తుతానికి వోకే… వాట్ నెక్స్ట్..?!
చెరువును ఆక్రమించి కట్టిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాలును హైడ్రా కూల్చేయడంతో నాగార్జున బాగా నిరుత్సాహానికి గురయ్యాడనీ… ఒక్కసారిగా డిప్రెస్ అయిపోయాడనీ, ఈ ప్రభావం బిగ్‌బాస్ లాంచింగ్ ప్రోగ్రామ్ మీద, తన హోస్టింగ్ మీద నెగెటివ్‌గా ఉండబోతోందనీ అనుకున్నారు… కానీ అదేమీ లేదు… తను నటుడు… మనసులో ఏమున్నా సరే, తనకు వ్యక్తిగతంగా, స్టూడియో అద్దెపరంగా మస్తు డబ్బు సంపాదించిపెడుతున్న బిగ్‌బాస్‌ను ఎందుకు ప్రభావితం కానిస్తాడు… కానివ్వలేదు… యధావిధిగా పాల్గొన్నాడు… ఎప్పటిలాగే కాస్త హుషారుగా, తనదైన స్టయిల్లో […]
బిగ్‌బాస్ బద్మాష్గిరీ… హౌజులో జరిగేది వేరు, కంటెస్టెంట్లపై తప్పుడు ముద్రలు…
పక్కా బద్మాష్గిరీ… బిగ్బాస్దే… డౌట్ లేదు… ఎన్నాళ్లుగానే ఉన్న ఆరోపణే… తను ఎవరిని ఎలా చూపించాలో అలాగే చూపిస్తాడు… ఎవరినైనా నెగెటివ్‌గా చూపాలనుకుంటే… అక్కడ జరిగేది వేరు, వాడు ప్రోమో కట్ చేసి జనంలోకి తీసుకుపోయేది వేరు… ఎవరినైనా పాజిటివ్‌గా ప్రదర్శించాలి అనుకుంటే తప్పుల్ని కట్ చేసేసి, మిగతావే చూపిస్తాడు… ఎక్కువ సేపు, పదే పదే తెర మీద కనిపించేలా… ప్రమోట్ చేస్తూ… అంతే కంటెస్టెంట్ల గేమ్ ప్లాన్ అని భ్రమపడతారు… కానీ అసలు గేమ్ ప్లాన్ […]
బుడమేరు ముంపును మించి… ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌కు బురద ముంపు..!!
అపార్థం చేసుకోవద్దు… అది ఇప్పుడు పక్కా మడ్ హౌజ్… మొదట్లో కాస్త బాగానే ఉండేది… మరీ సీపీఐ నారాయణ పదే పదే తిట్టినట్టుగా వ్యభిచార కొంపలా కాదు గానీ… మెల్లిమెల్లిగా ఆ తరహా బూతు వైపు తీసుకెళ్తున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు… గత టీమ్స్‌కు భిన్నంగా ఈసారి ఏదో ముంబై టీమ్‌ను దింపారట కదా… థూ, పాతవాళ్లకు ఏమీ చేతకాలేదు, ఇక చూడండి, మేమెంత బురదను నింపుతామో అన్నట్టుగా వెళ్తున్నారు… గతంలో సరయూను కూడా హౌజులోకి తీసుకొచ్చారని గుర్తు… […]
చివరకు బిగ్‌బాస్‌కు కూడా పిచ్చెక్కేలా… మణికంఠుడి ప్రవర్తన ఆందోళనకరం…
ఈ మాట దాదాపు అందరూ అంగీకరిస్తారు… ఈసారి బిగ్‌బాస్ ఎంపికలు దరద్రంగా ఉన్నాయి అని..! ప్రత్యేకించి నాగమణికంఠ అనే కేరక్టర్… నిన్న మొన్న ఎపిసోడ్స్ చూస్తుంటే తను తీవ్రమైన ఏదో మానసిక వ్యాధితో ఉన్నాడని తెలుస్తుంది… ఈ మాట నిర్ధారించడానికి సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు కూడా అవసరం లేదు… ఒక కంటెస్టెంట్‌ను ఎంపిక చేసేటప్పుడు ఇకపై ఆరోగ్యపరీక్షలతోపాటు మానసికారోగ్య పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుందేమో… ఈ మాట అనడానికి కారణం… మణికంఠ బిహేవియర్… చివరకు ఒక దశలో బిగ్‌బాస్ […]
వాటీజ్ దిస్ గీతా..? రియాలిటీ షో వేదిక మీద ‘కుర్ర శివమణి’కి ఆ ముద్దులేంటి..?
ప్రోమో చూస్తుంటే… మొదట సందేహం కలిగింది… చూసింది నిజమేనా అని… మరోసారి, మరోసారి చూస్తే అప్పుడు నిజమే అనిపించింది… స్టిల్, అది నిజమేనా అనే సందేహమే మెదులుతోంది… విషయం ఏమిటంటే..? అది తెలుగు ఇండియన్ ఐడల్ షో… ఆహా ఓటీటీలో ఓ రియాలిటీ షో… మూడో సీజన్ నడుస్తోంది… భారీగా ఖర్చు పెడుతున్నారు… మంచి ట్రెండింగ్‌లో ఉన్న షో… కంపోజర్ థమన్, సింగర్ కార్తీక్‌తోపాటు సింగర్ గీతామాధురి కూడా ఓ జడ్జి… ఈసారి కంటెస్టెంట్లు మంచి మెరిటోరియస్… […]
రేయ్… ఎవుర్రా మీరంతా..! బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఎంపికలోనే లోపాలు..!!
రేయ్, ఎవుర్రా మీరంతా..? అనే పాపులర్ డైలాగ్ మన టీవీల్లో, సినిమాల్లో వినిపిస్తూ ఉంటుంది కదా… బిగ్‌బాస్-8 షో కంటెస్టెంట్లను, వాళ్ల ధోరణి చూస్తే అలాగే అనిపిస్తోంది… ఎవరూ పెద్ద నోటెడ్ పర్సనాలిటీలు కారు… రఫ్‌గా చెప్పాలంటే, ఏదో హడావుడిగా కంటెస్టెంట్లను ఎంపిక చేసేసి, హౌజులోకి తోసేసినట్టుగా ఉంది… ఆర్జీవీ డెన్ నుంచి ప్రతి సీజన్లో ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తారు కదా… ఆషురెడ్డి, అరియానా, ఇనయా … ఇలా… ఈసారి ఆకుల సోనియా… మంథని రైతు […]
బిగ్‌బాస్-8 హౌజులోకి ఎంట్రీలు వీళ్లే… లైవ్… జంటలుగా హౌజులోకి ప్రవేశం…
బిగ్ బాస్ 8… లిమిట్ లెస్… జంటలుగా ఎంట్రీలు (విత్ బడ్డీస్)… ఈసారి ఏదో రొమాన్స్ మన్నూమశానం బాగానే ప్లాన్ చేస్తున్నారన్నమాట… సరే, మొదటి ఎంట్రీ ఎవరు… చాలామంది ఎదురుచూస్తున్న షో కదా… చెప్పుకుందాం… ఇద్దరూ కన్నడ నటులే… మన తెలుగు టీవీ సీరియళ్లలో డామినేషన్ అంతా వాళ్లదే కదా… యష్మి గౌడ, నిఖిల్… వీరిలో యష్మి గౌడ బిర్యానీ లవర్… ఆల్రెడీ ఓసారి బ్రేకప్, తనే వెళ్లగొట్టిందట… ఓపెన్… నిఖిల్‌కు మరో టీవీ నటి కావ్యకూ […]
ఈ డబ్బింగ్ పాటల మోజేమిట్రా బాబోయ్… అచ్చ తెలుగు పాటలకు కొరతా..?!
తెలుగు ఇండియన్ ఐడల్ షో చూసేవాళ్లకు తరచూ అర్థం కాని ప్రశ్న… అడ్డదిడ్డం డబ్బింగ్ పాటల్ని ఎందుకు కంటెస్టెంట్లపై, తరువాత శ్రోతలపై ఎందుకు రుద్దుతున్నారు అని..! ఈసారి ఎపిసోడ్ డబుల్ ధమాకా అని స్టార్ట్ చేశారు… దాదాపు అన్నీ ఆ డబ్బింగులే… ఏం టేస్టురా బాబూ..? అచ్చ తెలుగులో రాయబడి, ట్యూన్ చేయబడి, పాడబడిన పాటలే లేవా..? వాటిల్లో కంటెస్టెంట్లను పరీక్షించలేరా..? ఉదాహరణకు ఈరోజు కొండాకాకీ కొండె దానా, గుండిగలాంటి గుండే దానా. అయ్యారేట్టు పళ్లదానా, మట్టగిడస […]
రచయిత కాదు, నటుడు కాడు, కంపోజర్ కాదు… థమన్ అమ్మ ఈసారి గెస్ట్… వావ్..!!
తెలుగు ఇండియన్ ఐడల్ షోను సదరు ఆహా ప్లాట్‌ఫామ్ క్రియేటివ్ టీం భ్రష్టుపట్టిస్తున్నా సరే… ఓ చెత్తా సగటు సినిమా సాంగ్స్ షోలాగా మార్చేసి, అల్లు అరవింద్‌కు పంగ నామాలు పెడుతున్నా సరే… కొంతలోకొంత థమన్ దానికి బలంగా, ఆసరాగా నిలబడుతున్నాడు… అదొక్కటే దానికి ఆక్సిజెన్… ఎలిమినేషన్లు, గెస్టులు, జడ్జిమెంట్లు, పాటల ఎంపిక…. మొత్తం థమన్ చెప్పినట్టే..! గీతామాధురి, కార్తీక్… జస్ట్, ఉన్నారంటే ఉన్నారు… వోట్లు గీట్లు జాన్తా నై… గీత, కార్తీక్ అస్సలు జాన్తా నై… […]
ఆ పాత బిగ్‌బాస్ అల్లర్లు రిపీటయితే… ఈసారి అన్నపూర్ణ స్టూడియోస్‌పైనే యాక్షన్..!!
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, ఇతర తలనొప్పులతో బహుశా నాగార్జున బిగ్‌బాస్ హోస్టింగ్ ఆలస్యం అవుతుందేమో… ఏమో, చెప్పలేం… అదీ ప్రధాన ఆదాయవనరు కాబట్టి (స్టూడియో లీజ్, హోస్టింగ్ ఫీజ్) వెంటనే రెడీ అవుతాడేమో కూడా… నిజానికి ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, ఒప్పందాలు పూర్తయి ఉండాలి… ఐతే గతంలోలాగా వివరాలు లీక్ గాకుండా జాగ్రత్తపడుతున్నారు… ఈసారి ఎవరెవరు అనే ఆసక్తి, థ్రిల్ లాంచింగ్ నాటికి అలాగే ఉండేందుకేమో… ఈలోపు యూట్యూబర్లు, సైట్లు అన్నీ కలిసి దాదాపు రెండొందల మందిని […]
రాను రాను తెలుగు ఇండియన్ ఐ‘డల్’… ఇదోతరహా శ్రీదేవి డ్రామా కంపెనీ…
కేశవరామ్… ఆస్ట్రేలియా నుంచి వచ్చి మరీ తెలుగు ఇండియన్ ఐడల్ సాంగ్స్ కంపిటీషన్ షోలో పాల్గొంటున్నాడు… మొదట్లో ఇరగదీశాడు… ఈసారి నువ్వే ఎలిమినేట్ అయ్యేదంటూ ఎవరు హింట్ ఇచ్చారో గానీ ఈసారి తన రాగం శృతితప్పింది… నీరసంగా సాగాయి రెండు పాటలూ… పాడుతున్నప్పుడే అనిపించింది, జడ్జిలు నెగెటివ్ రెస్పాన్స్ ఇస్తున్నప్పుడే అనిపించింది ఈసారి పడిపోయే వికెట్ అదేనని… అలాగే ఆ వికెటే పడిపోయింది… చిత్రమేమిటంటే… జడ్జెస్ చాలెంజ్ థీమ్ ఈసారి, అంటే పూర్తి కంట్రాస్టు ఉండే రెండు […]
మిస్టర్ నవీన్ పోలిశెట్టి..! న్యూ అవతార్… చేయని పనిలేదు, చూపని కళలేదు…!
నవీన్ పోలిశెట్టి… కామెడీ టైమింగ్, డైలాగ్ డిక్షన్ తన నుంచే మిగతా వర్తమాన టీవీ, సినిమా కమెడియన్లు నేర్చుకోవాలి… ప్రత్యేకించి బొక కమెడియన్లు… మరీ వెగటు, వెకిలి, బూతు పదాలు, చేష్టలే కామెడీగా వర్ధిల్లుతున్న ఈ జబర్దస్త్ యుగంలో రియల్ హెల్తీ కామెడీ ఏమిటో తను చూపిస్తాడు… ఆమధ్య వచ్చిన జాతిరత్నాలు సినిమాకు ప్రాణం తనే… అంతకుముందు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అని మరో సినిమా… చిచోరా అని హిందీ సినిమా… చివరగా అనుష్క శెట్టితో […]
- 1
- 2
- 3
- …
- 37
- Next Page »