నిజమా… నిజమేనా..? యాంకర్ రవి బిగ్‌బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయాడా..? అదేమిటి..? ఫైనలిస్టుల్లో ఒకడు అనుకున్నాం కదా అంటారా..? ఆశ్చర్యపోతారా..? ఏమో… బిగ్‌బాస్ హౌజ్ నుంచి లీకయ్యే సమాచారం చెబుతున్నది మాత్రం అదే… ఎహె, రవి ఎవిక్ట్ కావడం ఏమిటి..? పోలింగ్ ట్రెండ్స్ చూస్తేనేమో… ప్రియాంక, సిరి, కాజల్ లీస్ట్ వోట్లతో ఉన్నారు, రవి ఎలా బయటికి వెళ్లిపోతాడు అంటారా…? ఊరుకొండి సార్, వందల కోట్ల దందా, బెట్టింగులు జరిగే క్రికెట్ మ్యాచులే ఫిక్స్ కాగా లేనిది […]
వియా..! ఈ సీజన్ బిగ్‌బాస్ విజేత..! తొలిసారిగా కాస్త కనెక్టయిన ఎపిసోడ్…
ఎంత చెత్త టీవీ ప్రోగ్రాం అయినా సరే… ఎప్పుడైతే అందులో కాస్త ఫ్యామిలీ ఎమోషన్ యాడ్ అవుతుందో జనానికి కనెక్ట్ అవుతుంది… బిగ్‌బాస్ కూడా అంతే… ఇప్పుడొచ్చే సినిమాలు, టీవీ సీరియళ్లు, ఇతర రియాలిటీ షోలు, బూతు జబర్దస్త్ షోలతో పోలిస్తే బిగ్‌బాస్ పెద్ద అనాసక్తమేమీ కాదు… అఫ్ కోర్స్, ఈ సీజన్ బిగ్‌బాస్ తెలుగు అనేది ఓ చెత్త… అందులో డౌట్ లేదు… మొదటి నుంచీ విసిగించేస్తున్నారు, అసలు కంటెస్టెంట్ల ఎంపికే సరిగ్గా లేదు… బిగ్‌బాస్ […]
భేష్ హైపర్ ఆది..! ఓ మానవీయకోణం చూపించావు… కీపిటప్…
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా హైపర్ ఆది టీవీ పాపులర్ స్టార్లలో ఒకడు.., తను సొంతంగా స్క్రిప్ట్ రాసుకుంటాడు, నటిస్తాడు, స్పాంటేనియస్‌గా పంచులు వేస్తాడు, డాన్సులు ప్రయత్నిస్తుంటాడు… అన్నీ ఫన్ కోసమే… నాగబాబు మనసుకు తగినట్టు ఆయనకు నచ్చని వ్యక్తుల మీద కొన్ని వివాదాస్పద పంచులు వేస్తూ గతంలో వివాదాల్లో ఇరుక్కున్నాడు… అవన్నీ ఒక కోణం… అంతేకాదు, మాట్లాడితే చాలు, జబర్దస్త్ స్కిట్లలో తను ‘అదిరె అభి’కి వెన్నుపోటు పొడిచాడనే వ్యాఖ్యలు, జోకులు వినిపిస్తుంటయ్… అవీ ఫన్ కోసమే… […]
దటీజ్ నాగార్జున..! తిక్క కేరక్టర్లకు మెత్తమెత్తగా భలే కౌన్సిలింగ్..!!
నో డౌట్… నాగార్జున ఓ గుడ్ టీవీ హోస్ట్… టీవీ రియాలిటీ షోలకూ స్క్రిప్టులు, రిహార్సల్స్ గట్రా ఉంటయ్ కానీ ప్రధానంగా హోస్ట్‌కు స్పాంటేనిటీ ముఖ్యం… ప్రత్యేకించి బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో హోస్టింగు అంత ఈజీ ఏమీ కాదు.., హౌజులోకి రకరకాల కేరక్టర్స్ వస్తారు.., రోజుల తరబడీ బయటి ప్రపంచానికి దూరంగా ఉంటారు.., గొడవలు, దోస్తీలు, లవ్వులు, వివాదాలు కామన్… పలుసార్లు కంటెస్టెంట్లలో ఫ్రస్ట్రేషన్ లెవల్స్ పెరుగుతూ షో నిర్వాహకులకు తలనొప్పిని కూడా క్రియేట్ చేస్తుంటయ్… […]
ఆనీ మాస్టర్ ఔట్…! కాజల్‌ను వెక్కిరించి తనే బుక్కయ్యింది..!!
నాగిన్ నాగిన్ అని కాజల్‌ని వెక్కిరించి, చివరికి తనే బుక్కై పోయింది ఆనీ మాస్టర్… హౌజ్ వీడిపోయింది… శుక్రవారం మరీ బ్యాలెన్స్ కోల్పోయింది ఆమె… నిజానికి ప్రియాంక వెళ్ళిపోతుంది, లేదా తక్కువ వోట్లకు ఆమెతో పోటీపడిన మానస్ లేదా కాజల్ వెళ్లిపోతారు అని అనుకున్నారు అందరూ… ఆమె పెద్ద పోటీదారు కూడా కాదు… గ్రూపులు కట్టలేదు, కుట్రలు చేయలేదు… అన్నింటికీ మించి బిగ్‌బాస్ టీంతో మిలాఖత్ లేదు… మరింకేం..? కథ ముగిసింది… సూట్‌కేసు సర్దుకుంది, బయటపడింది… నిజానికి […]
అశ్శరభ శరభ… ఓంకార్ మాయాద్వీప మంత్రదండం విరిగిపోయింది…
మొన్నొకసారి కాసేపు… నిజంగా కాసేపే మాయాద్వీపం అనబడే ఓ రియాలిటీ షోను చూడటం తటస్థించెను… ఒకింత ఠారెత్తినట్టు అనిపించెను… ఆ దిక్కుమాలిన పిచ్చి సీరియళ్లే నయం కదా, ఆ దర్శకుల సాముగరిడీలు చూస్తూ కామెడీగా పడీ పడీ నవ్వుకోవచ్చు అని కూడా అనిపించెను… అసలు ఆ మాయాద్వీపంలో వేరే దెయ్యాలు, భూతాల సెట్లు దేనికి..? ఆ బవిరిగడ్డంతో ఓంకారన్నయ్యే ఓ పెద్ద మాయల ఫకీరులాగా ఉన్నాడు కదా అని నవ్వొచ్చెను… ప్రాణభీతితో వెంటనే చానెల్ మార్చేసి, ఈసారి […]
హమ్మయ్య… కార్తీకదీపానికి త్వరలో శుభం కార్డు… రేటింగ్స్ ట్రెండ్ ఏంటో తెలుసా..?!
స్టార్ హీరోల కొత్త సినిమాల ప్రీమియర్ షోలను మించిపోయి… కొన్ని నెలలుగా తెలుగిళ్లల్లో దుమ్మురేపిన కార్తీకదీపం కథ కంచికి చేరబోతున్నట్టే…! స్టార్ మాటీవీ వాడి రేటింగ్ సాధనసంపత్తిని బట్టి చూస్తే ఏ సీరియల్‌నైనా దింపేయగలడు, ఎత్తుకోగలడు… తనే ఇప్పుడు లైట్ తీసుకుంటున్నాడు… సో, కథ ముగింపుకు రాబోతున్నదని అర్థం చేసుకోవాలి… కొద్దివారాల రేటింగ్ ట్రెండ్స్ చూసినా… వేరే సీరియళ్ల రేటింగ్స్ పెరుగుతున్న తీరు చూసినా స్పష్టంగా అర్థమవుతోంది అదే… నిజానికి ఈ సీరియల్ ఈ స్థాయిలో హిట్ […]
గుడ్… పునీత్‌కు ఈటీవీ నివాళి… చెత్తా హీరోల బర్త్‌డేలే కాదు, రియల్ హీరోల స్మరణ…
అంతకుముందు ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో అచ్చం కొన్ని జాతరల్లోని రికార్డింగ్ డాన్సులు, బూతు షోలా అనిపించేది… వెకిలి, వెగటు… అఫ్‌కోర్స్, రెచ్చిపోదాం బ్రదర్ అలాగే ఉంది… అరె, ఏందిర భయ్, ఈటీవీ డైరెక్టర్లు నితిన్, భరత్‌లను నాగబాబు ఎత్తుకుపోయాక ఇక ఈటీవీకి ఎవరూ దొరకలేదా..? ఏదో జాతర నిర్వాహకుల్ని తెచ్చిపెట్టుకున్నారా అనిపించేది… కానీ సుధీర్‌ను యాంకర్‌గా చేసి, కొన్ని మార్పులు చేశారు… కామెడీతో పాటు మ్యూజిక్, మ్యాజిక్, డాన్సులే కాదు… రకరకాల […]
ఆహా… ఇక శ్రీముఖి వండుతుంది..! ఈ షోలలో బేసిక్ తప్పులేమిటంటే..?!
ఆహా ఓటీటీలో శ్రీముఖి హోస్టుగా చెఫ్ మంత్ర అని ఓ కొత్త ప్రోగ్రాం రాబోతోంది… ఏముంది లెండి, సింపుల్‌గా చెప్పాలంటే ఇంకో వంటలక్క… ఆ పోస్టర్ చూడగానే ఓసారి నవ్వొచ్చింది… ‘‘ఒరేయ్ బాబూ, యాంకర్ల మొహాలు చూసి, జడ్జిలను చూసి ప్రేక్షకులు వంటల ప్రోగ్రాములను చూడరుర భయ్, వంటలు సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ కావాలి, వంటల పోటీ తీరు ఆకట్టుకునేలా ఉండాలి… అంతేతప్ప, తమన్నాను పెడితే ప్రోగ్రాం క్లిక్ కాదు, ఆమె ఫ్లాప్ అయ్యిందని అనసూయను పెట్టగానే […]
ఈటీవీ జబర్దస్త్, ఢీ షోలలో హైపర్ ఆది కంటిన్యూ అవుతాడా..?!
తమ టీం పట్ల మల్లెమాల శ్యాంప్రసాదరెడ్డి ఫుల్ ఫైర్ అవుతున్నాడు… దీన్ని ఎలా చల్లబరచాలో తనకే అర్థం కావడం లేదట… ఏమిటి..? హైపర్ ఆది మంచు విష్ణును టార్గెట్ చేస్తూ ఓ పండుగ స్పెషల్ షోలో చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు, తరువాత ఉత్పన్నమవుతున్న తల్నొప్పి… హైపర్ ఆది మీద మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఫుల్లు గరం మీద ఉన్నారనేది కరెక్టు… అది ఇప్పుడప్పుడే చల్లారదనేదీ నిజం… ఇప్పటికే దాడికి ప్రయత్నించారా, దాని మీద ఆది స్పందన ఏమిటో […]
జెస్సీ ఔట్..! అసలే డల్లు, ఆపై అనారోగ్యం… సన్నీ కథ ముందుంది…
నిజానికి జస్వంత్ అలియాస్ జెస్సీ ఇన్నిరోజులు బిగ్‌బాస్ హౌజులో ఉండటమే విశేషం… తను డల్ ప్లేయర్… అందులోనూ ఓసారి కాలికి గాయం, తరువాత అనారోగ్యం… ఎప్పుడూ ఏ టాస్కులోనూ పెద్దగా ఇంప్రెసివ్ లేడు… మొదట్లో వోకే గానీ, కాంపిటీషన్ చాలా టైట్ అయ్యేకొద్దీ జెస్సీ వంటి ప్లేయర్లు నిలబడలేరు… వోటింగులో కూడా పెద్దగా నిలబడరు… దీనికితోడు బిగ్‌బాస్ ఈమధ్య తనను ఏవో సందేహాలతో సీక్రెట్ రూం పేరిట క్వారంటైన్ చేశాడు… ఏమైందో ఏమిటో, డాక్టర్లు ఏం చెప్పారో […]
తెలంగాణతనానికి అదే వెక్కిరింపు… అదే తేలికభావం… ఉత్త చిచోరాగాళ్లు…!!
తెలంగాణ సిద్ధించాక మస్తు మారిపోయింది మామా అన్నాడో మిత్రుడు మొన్నొకసారి… వాడి అల్పసంతోషం చూసి కాస్త ఆనందం వేసినా, తెలంగాణ భాష పట్ల, సంస్కృతి పట్ల వాళ్లలో పేరుకున్న వెక్కిరింపుతనం అలాగే ఉందిరా నాయనా అని చెప్పాలనిపించింది… ఆ ఒరిజినాలిటీ దాక్కునే ఉందిరా, బయటపడుతూనే ఉంటుంది అనాలనిపించింది… కానీ వాడు చెప్పనిస్తేగా… ‘‘మస్తు మారిపోయింది మామా, మన పాటకు కిరీటాలు, మన మాటకు మకుటాలు, మన భాషకు గౌరవం, మన సంస్కృతికి, మన కట్టుకు, మన బొట్టుకు […]
యాంకర్ అనసూయ ఇజ్జత్ పోయింది… జెమిని టీవీ సిగ్గుపోయింది…
ఒరేయ్ నాన్నా, మాస్టర్ చెఫ్ టీవీ ప్రోగ్రాం ఫార్ములాయే సరిగ్గా లేదు, నువ్వు ఏ వంట వండినా ఇక అది టేస్టుండదు, జనం వాంతులు చేసుకుంటున్నారు, సర్వ చేసేవాళ్లు ఎవరుంటేనేం, ముందు ఆ వండే తీరు మార్చరా బాబూ, లేకపోతే ఇంకా భ్రష్టుపట్టిపోతది ప్రోగ్రాం….. అని ‘ముచ్చట’ ముందే చెప్పింది… అనసూయ తన పరువు కోల్పోబోతుందని కూడా చెప్పింది… నిజానికి ఓ పాపులర్ హీరోయిన్ తమన్నాను తీసేసి, అనసూయను పెట్టుకున్నప్పుడే తెలుగు ప్రేక్షకగణం పకపకా నవ్వింది… ఈ […]
విశ్వ..! సూట్‌కేసు సర్దుకో… అసలే ఆడలేడీస్ తక్కువయ్యారు, నువ్వే వెళ్లిపో…!!
విశ్వ… బిగ్‌బాస్ హౌజులో అన్నింట్లోనూ యాక్టివే… టాస్కుల్లో గానీ, స్ట్రాటజీల్లో గానీ… కానీ జనానికి ఎందుకో నచ్చలేదు… నిజానికి ఏ ప్రియాంకో వెళ్లిపోవాలి… కానీ బిగ్‌బాస్ టీం తిక్క ప్లానింగుతో హౌజులో ఆడలేడీస్ తక్కువైపోయారు… ప్రేమ యవ్వారాలు ఏమీ వర్కవుట్ కావడం లేదు… మానస్, ప్రియాంక లవ్వు పెద్దగా జనానికి నచ్చడం లేదు… కాజల్, యానీ మాస్టర్ మ్యారీడ్… సిరికి బయట లవర్ ఉన్నా సరే, షన్నుకు కూడా ఉన్నా సరే వారి నడుమ లవ్ ట్రాకు […]
వినోదం పేరిట హింసించేశారు… పండుగపూట ఈ వాయింపు ఏమిటి ఈటీవీ..?!
ఇదేంటి, నా టీలో ఈగ ఉంది అంటుంది ఇంద్రజ… అదేంటి, నా రేంజుకు నా టీలో ఏనుగు ఉండాలి కదా అంటుంది రోజా… అందరూ పడీ పడీ నవ్వుతారు… నవ్వాలి, లేకపోతే రోజా ఫీలవుతుంది ఫాఫం… ఈ జోకు మీకు వెగటు పుట్టించినా సరే, చచ్చినట్టు నవ్వాల్సిందే అంటుంది ఈటీవీ… దీపావళి పండుగపూట వినోదం పేరిట ఓ చిత్ర నరకాన్ని చూపించాడు రామోజీరావు సాబ్… అసలు ఈటీవీ క్రియేటివ్ విభాగాన్ని ఎవరు చూసుకుంటున్నారో గానీ పండుగపూట ప్రేక్షకుల్ని […]
చాన్నాళ్లకు మళ్లీ పాత కల్పన..! రేటింగ్స్ కోసం 4 గంటల భారీ మారథాన్ షో…
కల్పన… ఇప్పుడున్న మన సౌతిండియన్ ప్లేబాక్ సింగర్లలో మంచి విద్వత్తు ఉన్న గాయని… ఆమె పాట వింటుంటే, తెర మీద చూస్తుంటే ప్లజెంటుగా ఉంటుంది… ఏ పాటపాడినా సరే ఓ రేంజులో పర్‌ఫామ్ చేయగలదు తను… కానీ తన కూతురికి సంబంధించిన ఏదో మానసిక బాధలో ఉండిపోయి, ఈమధ్య కనిపించడం లేదు… అప్పుడప్పుడూ స్వరాభిషేకం వంటి ప్రోగ్రాముల్లో ఒకటీరెండుసార్లు కనిపించినా సరే, ఆమెలో ఆ పాత జోష్ లేదు… కానీ ఇప్పుడు మళ్లీ బిగ్‌బాస్ తెర మీద […]
లోబో ఇక బయల్దేరు… చాలు… సన్నీ మరో వైల్డ్ కేరక్టర్…
మొదట్లో కాస్త కామెడీ చేస్తూ, ఎంటర్‌టెయిన్ చేస్తూ హౌజులో సందడి చేసేవాడు లోబో… మిగతా అందరూ సీరియస్ కేరక్టర్లు, ఇగోయిస్టిక్ నేచర్ కనబడేది… అందరినీ టచ్ చేస్తూ, టీజ్ చేస్తూ సరదాగా కనిపించేవాడు… ఏమైందో ఏమిటో ఒక్కసారిగా లోబో డల్ అయిపోయాడు… కొన్నిసార్లు చిరాకెత్తేలా వ్యవహరించడం మొదలుపెట్టాడు… అరవడం, కేకలు, అనూహ్య ధోరణి… ప్రేక్షకులకు కూడా చిర్రెత్తింది… అనుకోకుండా ఎప్పటికప్పుడు సేవ్ అవుతూ వచ్చాడు… కానీ ఈసారి ఇక తప్పలేదు, సూట్ కేసు సర్దుకున్నాడు… (నిజానికి ఈసారి […]
ఆడలేడీస్ అందర్నీ గెంటేస్తున్నారు… మాంచి తకడా కేరక్టర్లు ప్రవేశపెట్టాల్సిందే…
మొత్తం 19 మంది… అందులో 10 మందీ లేడీ కంటెస్టెంట్లే… ఒకరు ఎక్కువో తక్కువో నిష్పత్తి సరిగ్గా మెయింటెయిన్ చేశారు అనుకుందాం… కానీ ఇప్పుడు ఏం జరిగింది… ఏడు వారాలు గడిచేసరికి, సగం షో పూర్తయ్యేసరికి… ఏడుగురు ఎలిమినేట్ అయిపోతే అందులో ఆరుగురు ఆడ లేడీసే… ఫటాఫట్ వికెట్లు పడిపోయాయి… జస్ట్, ఒకటే మగ వికెట్ పడిపోయింది… ఒక్కసారి ఆ హౌజు వైపు చూస్తే ఇప్పుడు ఎనిమిది మంది మగపురుషులు… నలుగురు స్త్రీలు… అరేయ్, ఏంట్రా ఇది..? […]
పాడుతా తీయగా..! చివరకు ఈ షోను కూడా భ్రష్టుపట్టిస్తారన్నమాట..!!
పాడుతా తీయగా…. తెలుగు టీవీలో సంగీత ప్రధానమైన తొలి రియాలిటీ షో… దాన్ని కొట్టిన షో మరొకటి రాలేదు… రాదు కూడా… కారణం :: ఎస్పీ బాలు… పిల్లల దగ్గర్నుంచి, పెద్దల దాకా ఎందరో ఔత్సాహిక గాయకుల ఎదుగుదలకు అది వేదిక… ఎందుకు మెచ్చుకోవాలీ అంటే… బాలు దాన్ని నిర్వహించిన తీరు..! ఎవరినో గెస్టుగా పిలిచేవాడు, పాడుతున్నవాళ్ల తప్పుల్ని చెప్పేవాడు సున్నితంగా, సరిదిద్దేవాడు, ఆ పాట రచయిత గురించి వీలైతే చెప్పేవాడు, సంగీత దర్శకుడి గురించి ప్రస్తావించేవాడు, […]
ఒర్లీ ఒర్లీ… ‘అతి’ చేసినందుకు… ప్రియ చెంప పగిలిపోయింది… క్లీన్ బౌల్డ్….
ఎంత గేమ్ ప్లాన్ ఉన్నా సరే… బిగ్‌బాస్‌లో సూత్రం ఏంటంటే..? ‘అతి’ చేయొద్దు… సరిగ్గా అక్కడే ప్రియ తప్పులో కాలేసింది… అందరినీ రెచ్చగొట్టింది… ఒక్కొక్కరినీ ఎక్స్‌పోజ్ చేస్తున్నాను అనుకుంది… కానీ ఎక్కడ తప్పు చేసిందీ అంటే..? ‘ఒర్లుతున్నావు’ అనే పదం దగ్గర తన తెలంగాణ వ్యతిరేకతను బయటపెట్టుకుంది… దాంతో ఒక్కసారిగా ఆమె మీద ఉన్న సదభిప్రాయం కాస్తా ఆవిరైపోయింది… అందుకే జనంలో వ్యతిరేకత పెరిగిపోయింది… వోట్లు తక్కువ పడ్డయ్… యానీ మాస్టర్ బయటికి వెళ్లాల్సింది కాస్తా ప్రియకు […]
- « Previous Page
- 1
- …
- 31
- 32
- 33
- 34
- 35
- …
- 37
- Next Page »