ముందుగా అసలు వివాదం ఏమిటో చూద్దాం… ‘‘హైపర్ ఆది బతుకమ్మ, గౌరమ్మలను, తద్వారా తెలంగాణ సంస్కృతిని కించపరిచాడు… క్షమాపణ చెప్పాలి…’’ ఇదీ వివాదం… ఈటీవీలో మొన్నామధ్య ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షో… జంబలకిడిపంబ అనే ఓ పాత సినిమాకు స్పూఫ్‌గా ఒక స్కిట్ చేశారు… అందులో ఆడవాళ్లుగా మారిన మగవాళ్లు ఓచోట బతుకమ్మ, గౌరమ్మ పాటలు పాడతారు… అదుగో అక్కడ పుట్టింది వివాదం… తెలంగాణ జాగృతి స్టూడెంట్ వింగ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు […]
చెప్పీచెప్పని బూతులేల… నేరుగానే వదిలేస్తే పోలా… ఫాఫం, హైపర్ ఆది…
రామోజీరావు ఎదిగాడు… మల్లెమాల శ్యాంప్రసాదరెడ్డి ఎదిగాడు… హైపర్ ఆది ఎదిగాడు… రోజా ఎదిగింది… మొత్తానికి తెలుగు టీవీ కామెడీ కూడా ఎదిగింది… వాళ్ల అభిరుచులకు అద్దం పడుతూ, మరింత దుర్గంధాన్ని వెదజల్లుతూ ఈటీవీ తొలి తెలుగు ‘ఏ’ గ్రేడ్ చానెల్‌గా… లేదా ట్రిపుల్ ఎక్స్ చానెల్‌గా దూసుకుపోతోంది… ఈ నర్మగర్భ బూతులు దేనికి..? ఈ గర్భమర్మ పంచులు దేనికి..? తెల్లారిలేస్తే అక్రమ సంబంధాలు, ఆడవేషగాళ్ల పైత్యాలు దేనికని… ఇప్పుడు ఇంకాస్త డైరెక్టు బూతుల్లోకే వెళ్లిపోతున్నారు… అన్నీ విడిచిపెట్టాక, […]
ఆలీ మారడు… ఈటీవీ మారదు… జబర్దస్త్ మారదు… అదే ఘాటు వెగటుతనం…
ఈటీవీ వాడి జబర్దస్త్ షో నాణ్యత, కేరక్టర్, పోకడ దరిద్రాలు అందరికీ తెలిసిందే… మల్లెమాల యూనిట్ వారి క్రియేటివిటీ లెవల్స్, టేస్ట్ రేంజ్ ఎక్కడో పది కిలోమీటర్ల దిగువన పాతాళంలో దేకుతూ ఉంటుందని కూడా తెలిసిందే… అంతేకాదు, నటుడు ఆలీ వేదికల మీద, తన షోలలో చేసే వెకిలి వ్యాఖ్యలు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం… వ్యక్తిగా అది తన లెవల్… అయితే కొత్తగా వచ్చిన డౌట్ ఏమిటంటే..? జబర్దస్త్ అనే వెగటు కామెడీ షోలో స్కిట్లు చేసీ […]
ఛలో నాగాలాండ్…! ఫ్యామిలీ మ్యాన్-3 అసలు కథ ఏమిటో తెలుసా..?!
ఇండియా రక్షణకు అత్యంత కీలక ప్రాంతం డోక్లాం… అసలే అది చికెన్ నెక్‌కు కాస్త ఎగువన, భూటాన్ సరిహద్దుల్లో ఉంటుంది… హఠాత్తుగా చైనా బలగాలు దిగుతాయి… అర్జెంటుగా రోడ్లు వేస్తుంటాడు… సైనికులకు ఇళ్లు కట్టేస్తుంటాడు… ఫైటర్ జెట్స్ ఎగురుతూ ఉంటయ్… నెలల తరబడీ ఇండియా- చైనా నడుమ ఆ ముఖాముఖి, ఆ ఉద్రిక్తత… తరువాత ఇటు లడఖ్ వైపు వస్తాడు… గాల్వన్ వ్యాలీలో ముళ్లబడితెలు పట్టుకుని దాడులు చేస్తాడు… ఇంకోసారి అరుణాచల్ ప్రదేశ్ హద్దుల్లో… నాగా తీవ్రవాదులు […]
సోనీ లెక్క వేరు- ప్రేక్షకుల ఎక్కాలు వేరు… షణ్ముఖ ప్రియపై వేలాడే కత్తి…
బిగ్‌బాస్ కావచ్చు, ఇండియన్ ఐడల్ కావచ్చు… ఇంకేదైనా రియాలిటీ షో కావచ్చు… అదొక ఆట… ఎవరైనా గెలవొచ్చు, ఎవరైనా మధ్యలోనే వెళ్లిపోవాల్సి రావచ్చు… ప్రేక్షకులకు వినోదం, అంతే… కాకపోతే ప్రతి ఎలిమినేషన్‌ను కూడా టీవీ వాడు భీకరమైన సంగీత నేపథ్యంతో… కన్నీళ్లు, కౌగిలింతలు, పరామర్శలు, విషణ్ణ వదనాలతో ఇంకాస్త మసాలా వేస్తాడు… ఒకడు వ్యూయర్స్ వోట్స్ అంటాడు, ఇంకొకడు జడ్జిల మార్కులే అల్టిమేట్ అంటాడు… నిజానికి అంతిమ విజేతల విషయానికొచ్చినప్పుడు టీవీ వాడికి తన లెక్కలే ముఖ్యం… […]
- « Previous Page
- 1
- …
- 35
- 36
- 37