. మిత్రుడు Mohammed Rafee పోస్టు ఒకటి ఆలోచనాత్మకం… ఆసక్తికరం… తను రాసింది దుశ్శల ఏకపాత్రాభినయం గురించి… నిజానికి పలు పౌరాణిక పాత్రల ఏకపాత్రాభినయాలు ఉంటాయి… కానీ దుశ్శలది పూర్తిగా భిన్నం, ఇంట్రస్టింగు… పౌరాణిక పాత్రల్లోనూ పురుష పాత్రల ఏకపాత్రాభినయాలే ఎక్కువ కదా… బుధవారం రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల దుశ్శల ఏకపాత్రాభినయం ప్రదర్శించింది… 80 నిముషాలు పాటు నాన్ స్టాప్ హావభావ అభినయ హిందీ వాచకంతో ఆమె విశేషంగా […]
నితిశ్ తరువాత బీహార్‌కు కాబోయే ముఖ్యమంత్రి…! ఇంతకీ ఎవరీయన..!?
. పాత బీజేపీ వేరు… మోడీ షా బీజేపీ వేరు… ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి ఎమర్జయిన వాళ్లకే సీఎం పదవులు, హోదాల్లో ప్రాధాన్యం అనే మాటకు ఇప్పుడు అర్థం లేదు… ఇప్పుడు ఎవరు, ఏ సమీకరణాల్లో పార్టీకి పనికొస్తారు అనేదే ముఖ్యం… పాత నేపథ్యం ఏమైనా సరే… ఉదాహరణకు… అస్సోం సీఎం హిమంత విశ్వ శర్మ… ఒరిజినల్‌గా కాంగ్రెస్… ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది… బీజేపీ పికప్ చేసింది.,. ఇప్పుడు ఈశాన్యానికి తనే బీజేపీ హైకమాండ్ ఒకరకంగా… అంత సెటిలయ్యాడు… […]
చంద్రబాబు గారండోయ్… క్షమించండి మా అజ్ఞానానికి… శపించకండి ప్లీజ్…
. నిజానికి ఒక వీడియో చూసేదాకా నాకూ నమ్మబుద్ది కాలేదు… సరే, చంద్రబాబు కంప్యూటర్లు కనిపెట్టాడు, మొబైల్స్ ఆయన సృష్టే… హైదరాబాద్ కట్టింది తనే… సర్వం తానే… అంతెందుకు..? ఆయన మామ తెలంగాణ వాళ్లకు వరి అన్నం అంటే ఏమిటో చూపించి, తినిపించాడు, పొద్దున్నే లేవడం నేర్పాడు… వర్క్ కల్చర్ నేర్పాడు… కానీ చంద్రబాబు తెలంగాణ గుళ్లను కూడా తనే కట్టాను అన్నాడంటే నమ్మలేకపోయాను… మన పిచ్చి గానీ భద్రాచలం గుడిని శ్రీరామదాసు కట్టాడని అనుకుంటాం కదా, […]
పారడాక్స్..! చమురు మార్కెట్లో అమెరికాకు ఇండియా ‘లెసన్’…!!
. రష్యాతో ఎవరైనా వ్యాపారం చేసినా, ఆ చమురు కొన్నా 500 శాతం పెనాల్టీ సుంకం తప్పదని విశ్వవిఖ్యాత వాచాలుడు ట్రంపుడు ఉరిమాడు కదా… చిన్న పారడాక్స్ ముచ్చట చెప్పుకుందాం… . వార్త తేదీ: నవంబర్ 17, 2025 ఓడలో ఉన్న సరుకు: దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల (Metric Tons) జెట్ ఫ్యూయల్ (Jet Fuel). గమ్యస్థానం: లాస్ ఏంజిల్స్ (US West Coast). ఓడ పేరు: హాఫ్నియా కలంగ్ (Hafnia Kallang) అనే పనామాక్స్ […]
వెలగపండు అందుబాటులోకి..! పర్ఫెక్ట్ సూక్ష్మ పోషకాల పండు…!!
. &#నాడు అనే ఒకానొక దినపత్రికలో… ఓ వార్త కనిపించింది… అదీ సిటీ పేజీలో కనీకనిపించనట్టు ఓ ఫోటో వార్త… సీతాఫల్మండి దగ్గర వెలగపండ్లు అమ్ముతున్నారుట… అత్యంత పూర్ రైటప్… సదరు పత్రిక బాధ్యులు గర్వంగా కాలర్ ఎగరేస్తారేమో ఫాఫం… సింపుల్… వెలగపండు, పోషకాల పండు అని ఏదో పిచ్చి హెడింగ్ పెట్టి, ఓ సాదాసీదా అత్యంత నాసిరకం రైప్ పెట్టి వదిలారు… నిజానికి మంచి ఫోటో వార్త… ఎందుకంటే..? హైదరాబాద్ నుంచి అన్ని వైపులా వెళ్లే […]
కృత్రిమం కృత్రిమమే… ఏఐతో జర జాగ్రత్త… గుడ్డిగా నమ్మొద్దు…!!
. సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకం. మాట్లాడే భాష, రాసే భాష, అనువాదం లాంటి భాషాసంబంధ విషయాల్లో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా మెదడును మొద్దుబారుస్తోందని ఈమధ్య అనేక అధ్యయనాలు రుజువుచేస్తున్నాయి. మనం తప్పు టైప్ చేసినా ఆటోమేటిగ్గా సరిచేసేది- ఆటో కరెక్ట్. మనం టైపు చేయబోయే మాటలను దానికదిగా అందించేది- ప్రిడిక్టివ్ టెక్స్ట్. మనం టైపు చేసిన వాక్యంలో వ్యాకరణ దోషాలను సరిచేసేది- గ్రామర్లి. ఈ […]
‘‘రాజమౌళిని మించి తెలుగు హీరోకు ఎలివేషన్ ఇవ్వాలి ఎప్పటికైనా…’’
. Yaseen Shaikh …. పకోడీ పరాక్రమార్కుడు! వాల్కనో లోంచి ప్రవహిస్తున్నలావాలో లోటా ముంచి దాన్ని స్టౌ మీద పెట్టాడు పరాక్రమ్ రాథోడ్. కాసేపాగి అందులో చాయ్ పత్తా, చక్కెరా కలిపాడు. లావా ఇంకాస్త పొంగగానే, బుడబుడమంటున్నఆ డికాక్షన్ను దించాడు. దించి… ఆ పక్కనే పాడుబడ్డ ఇంటి కిటికీకి ఉన్న ఐరన్ మెష్‌ను ఒక్కపెట్టున లాగాడు. ఆ మెష్‌తో వడబోసి టీ తాగసాగాడు. ‘జాగ్రత్త అల్లుడూ… నోరు కాలుద్ది’ హెచ్చరించాడు పక్కనే ఉన్న లాఫానందం. ‘‘హా హా […]
నాస్తిక రాజమౌళి వారణాసి సినిమాలో… ఓ తాంత్రిక దేవత..!!
. నిజానికి వర్తమాన ట్రెండీ థంబ్ నెయిల్ జర్నలిజంలో ఈ వార్తకు పెట్టాల్సిన హెడింగ్స్… ‘‘దేవుడిని నమ్మని రాజమౌళి వారణాసిలో క్షుద్ర దేవతల ఆరాధన’’… ‘‘నాస్తిక రాజమౌళి క్షుద్రోపాసన’’… నిజమేనా..? అలా ఉందా..? టీజర్ మొత్తం శ్రద్ధగా ఆరాధనగా చూశాను కానీ ఆ క్షుద్ర పూజల జాడలు ఏమీ లేవే అని ఆశ్చర్యపోకండి… ఓ చోట కనిపిస్తుంది ఓ అమ్మవారు… ఉగ్రదేవత… దశమహావిద్యల్లో ఒకరైన చిన్న మస్తా దేవి… వారిలో ఆరో అవతారం… తాంత్రిక దేవత… ఆమె […]
సేఫ్ ప్యాసేజ్ చూసుకుని మరీ లొంగిపొండి కామ్రేడ్స్… ఖతమై పోవద్దు..!!
. అమిత్ షా…. తనకు పర్ఫెక్ట్గా తెలుసు… మావోయిస్టు కీలక నేతలకు సంబంధించిన సమాచారం ఈజీగా దొరికిపోతోంది… త్వరలో మొత్తం కొట్టేస్తామని ధీమా ప్రకటించింది అందుకే… దానికి కోవర్టులు కావచ్చు, సమాచారం అలవోకగా వస్తున్న సమాచారం మీద నమ్మకం కావచ్చు… కానీ మొండికేస్తే ఖతం చేయండి, లొంగిపోతే అంగీకరించండి… ఎలాగోలా మావోయిస్టు అనేవాడు మిగలొద్దు అనేది కేంద్రం వైఖరి… ఎస్… మావోయిస్టుల కోటల్లోకి కూడా పోలీసు బలగాలు జొరబడి మరీ కొడుతున్నాయి… సెంట్రల్ కమిటీ నేతల ప్రాణాలకే […]
500 రూపాయలకు కిలో..! అన్నమే ఆహారం- ఔషధం…! కానీ …?
. ఈమధ్య ప్రధాని మోడీ ఓ అంతర్జాతీయ వేదికపై నల్లబియ్యాన్ని (Black Rice) “సూపర్ ఫుడ్”గా, ఔషధ గుణాలు కలిగిన వరి రకంగా ప్రశంసించి…. పౌష్టిక, ఔషధ విలువల బియ్యానికి, వరి వంగడాలకు భారతదేశం ఎన్నో తరాలుగా సమృద్ధినీ, ఆ నాణ్యత, ఆ నైపుణ్యాన్ని ప్రపంచానికి అందిస్తామనీ చెప్పాడు… గుడ్… దిగుబడిలో గానీ, నాణ్యతలో గానీ, తక్కువ పంటకాలంలో గానీ, ఒకసారి నాట్లేస్తే నాలుగైదుసార్లు కోసుకోవడంలో గానీ… చైనా, ఇతర తూర్పు దేశాలు చాలాముందుకు వెళ్లిపోయాయి… గోల్డెన్ రైస్ […]
మంత్రి పదవికి 2009లో రేవంత్ రెడ్డి పైరవీ..! అదీ రామోజీరావు ద్వారా..!!
. రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు అని నిన్న ఓ కార్యక్రమం నిర్వహించారు కదా… అక్కడ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి పక్కపక్కన కూర్చుని, నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న వీడియో బిట్స్, ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి… బహుశా రేవంత్ రెడ్డి ఎప్పుడో ఓరోజు ముఖ్యమంత్రిగా మారి, తన పక్కనే కాలిమీద కాలు వేసుకుని కూర్చుని, ఇలా ముచ్చట్లు చెబుతాడని బహుశా చంద్రబాబు అప్పట్లో ఊహించి ఉండడు… (భలే ఫోటో ఇది)… సరే, గురుశిష్యుల మాటెలా […]
సాలు మరద తిమ్మక్క… 114 ఏళ్ల బతుకంతా పచ్చటి చెట్ల వరుసలే…
. ప్రకృతికి ప్రాణం పోసిన ‘చెట్ల వరుస’ తిమ్మక్క “చెట్టునురా -చెలిమినిరా తరువునురా – తల్లినిరా నరికివేయబోకురా కరువు కోరుకోకురా అమ్మనురా అమ్మకురా కొడుకువురా కొట్టకురా…” సుద్దాల అశోక్ తేజ సినిమా పాటల రచయిత కాబట్టి పరిచయం అక్కర్లేదు. ఆయన రాసిన ప్రబోధ గీతమిది. చెట్టు పాడే ఈ పాట సినిమా పాట కాదు . సినిమాల్లో వాడలేదు .అయినా, సినిమా ఇంత వాస్తవికతను, సందేశాన్ని సహించదు. సహించాలని కోరుకోకూడదు. దాని మర్యాదలు దానివి. “కొట్టు కొట్టు […]
ఓ సైంటిస్టు ఘన సృష్టి..! కానీ మన కుళ్లు వ్యవస్థ తనను చంపేసింది..!
. ఎందుకు మన సైంటిస్టులు, డాక్టర్లు, టెక్నోక్రాట్లు విదేశాలకు వెళ్లిపోతారు…? దేశంలోనే ఉండి, ఈ దేశానికే మేలు చేయవచ్చు కదా… ఇదీ చాలామంది ప్రశ్న… కానీ పని చేయనిస్తే కదా… రాజకీయాలు, కుళ్లు, అన్‌ప్రొఫెషనల్ పోకడలు, కుట్రలు, తొక్కేయడాలు… అదనంగా కుల, మత పంచాయితీలు… ఓ సైంటిస్టు కథ చెప్పుకుందాం… మీలో చాలామంది చదివే ఉండొచ్చు, కానీ చదవని వారి కోసం, చదివిన వాళ్లకు మరోసారి గుర్తుచేయడం కోసం… ఆయన పేరు డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ… పేరు […]
కిరాతకం..! పసి పిల్లాడిపై ఓ సవతి తండ్రి దారుణ హింస..!!
. ఓ వార్త బాధనిపించింది… ఓ ఫోటో కలిచివేసేలా ఉంది… మామూలుగా సవతి తల్లులు పిల్లలను పెట్టే హింస సాధారణంగా చాలాచోట్ల చూస్తుంటాం… భర్త మొదటి పెళ్లాం పిల్లలంటేనే చంపాలన్నంత కసిని చూపిస్తుంటారు కొందరు మహా తల్లులు… మొగుళ్లు మెతకగా ఉండే కుటుంబాల్లో మరీ ఈ పిల్లల పరిస్థితి దారుణం… ఇప్పుడు చెప్పుకోబోయే వార్త భిన్నం… ఇక్కడ సవతి తల్లి కిరాతకం కాదు… సవతి తండ్రి కిరాతకం… నిజమే… వార్తలోకి వెళ్దాం… ఇది మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న […]
ఘట్టమనేని కృష్ణ… సూపర్నోవా ఆఫ్ ఏ సూపర్‌స్టార్..!
. #సూపర్నోవా_ఆఫ్_ఏ_సూపర్‌స్టార్! కృష్ణ ఓ స్టార్! సూపర్‌స్టార్!! సినీఫీల్డులో ఎంతో మంది ఆర్టిస్టులుంటారు. ప్లానెట్స్లా. సినీవినీలాకాశంలో మెర్క్యురీ, వీనస్లలా వాళ్లూ కాస్త కాస్త మెరుస్తుంటారు. కాకపోతే… స్వయంప్రకాశం కొద్దిమందికే. సినిమానంతటినీ మోసి, హిట్ చేసేవారే స్టార్స్. అలాంటి స్టార్లకు స్టార్… సూపర్‌స్టార్ కృష్ణ! ****** ‘సినీ’లాకాశపు స్టార్స్ కంటే ముందర.. అసల్సిసల్ సునీలాకాశపు నిజమైన ఓ స్టార్ గురించి కాస్త మాట్లాడుకుందాం. బీటల్‌జ్యూస్ అనే సూపర్ ‘సూపర్ స్టార్’ ఒకటుంది. అల్ల ఎక్కడో సుదూర ఓరియన్ నక్షత్రమండలంలో… […]
సోషల్ మీడియా గెలిపించదు… జుబ్లీ హిల్స్ ఫలితమే పక్కా ఉదాహరణ…
. దాదాపు ప్రతి పార్టీ చెప్పేదీ అదే… రాబోయే ఎన్నికల్ని సోషల్ మీడియా శాసించబోతోంది అని… ప్రజాజీవితంలో ఉన్న ప్రతి నాయకుడు సొంతంగా సోషల్ మీడియా టీమ్స్ మెయింటెయిన్ చేస్తున్నాడు… బోలెడు ఖర్చు… ఎన్నికలొస్తే మరింత ఖర్చు… ఇక పార్టీలయితే సోషల్ మీడియా ప్రచారంలో దిగజారని మెట్టు లేదు… అభూత కల్పనలు, అబద్ధాలు, ఫేక్ వీడియోలు, ఎఐ ఇమేజెస్, ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననాలు… (వీటికితోడు ఎన్నికల వ్యూహకర్తల పేరిట కోట్లు వసూలు చేసే గ్యాంగులు చేసే అరాచకాలు […]
ఆర్జేడీ సాధించిన వోట్లే ఎక్కువ…! మరెందుకు కొట్టుకుపోయినట్టు..?!
. బీహార్‌లో ఆర్జేడీకి వచ్చిన వోట్లు 1.154 కోట్ల వోట్లు… అంటే 23 శాతం… కానీ వచ్చిన సీట్లు 25 మాత్రమే… బీజేపీకి వచ్చిన వోట్లు 1.008 కోట్ల వోట్లు… అంటే 20.08 శాతం… కానీ వచ్చిన సీట్లు 89… అలాగే జేడీయూకు వచ్చిన వోట్లు 96.67 లక్షలు, అంటే కేవలం 19.25 శాతం… కానీ వచ్చిన సీట్లు 85 సీట్లు… . …….. ఎవరు గెలిచినట్టు..? ఆర్జేడీయా..? బీజేపీయా..? అన్ని పార్టీలకన్నా ఎక్కువ వోట్లు గెలుచుకున్న […]
దీనక్క పాటలో సొంగకారిన పదాలు… దీనక్క ఏం రాస్తున్నారు భయ్యా…
. స్విట్జర్లాండ్ లో ఎటు చూసినా తెల్లటి మంచు కొండలు, పచ్చటి మైదానాలు. ప్రకృతి పరవశగీతాలు పాడుకునే అక్కడైతేనే తెలుగు గీతాలకు బాణీలు చక్కగా వస్తాయని దర్శకుడు అనుకున్నాడు. నిర్మాత గంగిరెద్దులా తల ఊపాడు. సంగీత దర్శకుడు ఎగిరి గంతేశాడు. హీరో చిటికేశాడు. అంతే- ప్రత్యేక విమానం సిద్ధం. ఒక్కో పాటకు మూడు రోజుల చొప్పున ఆరు పాటలకు 18 రోజులపాటు సంగీతం మీద కూర్చోవడానికి(మ్యూజిక్ సిట్టింగ్ కు) అనువైన ఒక నైన్ స్టార్ రిసార్ట్ మొత్తాన్ని […]
‘శ్రీబాగ్ భవన్’ అలా కాపాడబడింది… ఆ రక్షణ వెనుక కూడా ఓ కథ…
. Bhavanarayana Thota …. శ్రీబాగ్ భవనం అలా మిగిలింది! తొలి తెలుగు దినపత్రిక కాకపోయినా, విజయవంతంగా నడిచిన తొలి తెలుగు పత్రిక ఆంధ్రప్రత్రిక. అమృతాంజనం వ్యాపారంలో వచ్చిన డబ్బుతో ఆంధ్రపత్రిక పెట్టి సేవ చేశారు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు. అంత చేసినా, అమృతాంజనం, ఆంధ్రపత్రిక ద్వయం మీద ఛలోక్తులకు కొదవలేదు. “చదవండి ఆంధ్రపత్రిక – వాడండి అమృతాంజనం” అని కొంతమంది అంటే .. “ఆంధ్రపత్రిక తోడ అమృతాంజనమిచ్చి తలనొప్పి బాపెడు ధన్యుడెవరు?” అంటూ కాశీనాథునివారి […]
గాన చారుశీల సుశీల..! తిరుగులేని గళమాధుర్యం… స్వర సౌందర్యం..!!
. Rochish Mon …….. ———— గాన చారుశీల సుశీల ——————— దక్షిణ భారతదేశ చలనచిత్ర గానానికి మెరుగు, సొగసు, మాధుర్యం పీ.సుశీల. భారతదేశ చలనచిత్రాలలో మహోన్నతమైన స్త్రీ గానం అన్న నాణానికి ఒకవైపు లతామంగేష్కర్ అయితే మఱువైపు పీ. సుశీల. 1953లో కన్నతల్లి పేరుతో తెలుగులోనూ పెఱ్ట్రత్తాయ్ పేరుతో తమిళ్ష్‌లోనూ విడుదలైన వెర్షన్ (అంటే పూర్తిగా డబ్బింగ్ కాకుండా రెండు భాషల్లోనూ చిత్రీకరించబడిన) సినిమాల్లో “ఎందుకూ పిలిచావెందుకు?…” అనీ, “ఏదుక్కో అళ్షైత్తాయ్…” అనీ పాడి సుశీల […]
- 1
- 2
- 3
- …
- 136
- Next Page »



















