చాలా ఏళ్ల క్రితం… థియేటర్లో ఓ తెలుగు సినిమా… కథ సీరియస్‌గా ఉంది… ఓవైపు తల్లి, మరోవైపు అన్నయ్య… తల్లి బిడ్డను కొడుతూ ఉంటుంది… అన్న ఆపుతాడు… ఏమైంది అంటాడు… చెల్లి మీద విపరీతమైన ప్రేమ… చెల్లి నోరు విప్పుతుంది… ‘‘నేను గోపిని ప్రేమించాను అన్నయ్యా… తొందరపడ్డాం… తల్లిని కాబోతున్నాను… గోపి తండ్రి ఒప్పుకోవడం లేదు…’’ అని ఏడుస్తూ ఉంటుంది… గోపి ఫాదర్ అత్యంత సహజంగా హీరోకు పడని విలన్ అయి ఉంటాడు కదా తెలుగు సినిమా […]
నువ్వేం నాయకుడివయ్యా తండ్రీ… ఇంకా చదువుతానంటావేం..?!
చదువుకుంటే లీడర్లు ఎలా అవుతారు? ——————- మహాత్మా గాంధీ న్యాయవిద్య చదివి, అంతర్జాతీయస్థాయిలో న్యాయవాదిగా నిరూపించుకుని భారత స్వాతంత్ర్య పోరాటంలో ఊరూరు తిరిగాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా లండన్‌లో లా డిగ్రీ చదువుకుని భారత్ వచ్చాడు. పి వి నరసింహారావు చదువు సంధ్యలు, బహుభాషల్లో పాండిత్యం అందరికీ తెలిసినవే. అటల్ బిహారీ వాజపేయి హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు అంశాలతో గ్వాలియర్ లో డిగ్రీ చదివాడు. చదువుకుని రాజకీయాల్లోకి వచ్చేవారు తగ్గిపోయారు. రాజకీయాల్లోకి వచ్చాక బుద్ధిగా డిగ్రీలు, […]
రాహుల్ జవాబు వింటే… బాలయ్య, బ్రాహ్మి జాయింటుగా గుర్తొచ్చారు సుమీ…
కాలేజీ పిల్లల ఎదుట ఓ ప్రధాని అభ్యర్థి ఫుషప్స్ చేస్తున్నాడు… ఒంటి చేత్తో పుషప్స్ చేస్తూ సవాల్ విసురుతున్నాడు… చెరువుల్లో ఈతలు కొడుతున్నాడు… వంటల్లో ఉప్పు కలుపుతున్నాడు… తాటి ముంజలు తింటున్నాడు… మస్తు ప్రయాసపడుతున్నాడు… మోడీ ముదురు వేషాలతో పోలిస్తే ఇవి తక్కువేమీ కాదు… కానీ ఇండియా వంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ప్రధాని అభ్యర్థిత్వాలు తమను తాము గోసపెట్టుకున్న తీరు చూస్తే మనకే గోస అనిపిస్తుంది… ఆ వేషాలు సరే, కానీ కీలకమైన ఇష్యూస్ వచ్చినప్పుడు […]
ప్రపంచ కుబేరుల పద్దులో తెలుగువారికి అన్యాయం!
పృథివి కలవాడి పృష్ఠంబు పుండయిన జగతి వార్తకెక్కు- అని ఒక ప్రమాణం. అంటే బాగా డబ్బున్నవాడి పిర్ర మీద చిన్న పుండు లేచినా అది ప్రపంచానికి అతి పెద్ద వార్త అవుతుందట. అలాంటిది బాగా డబ్బున్నవారి ప్రపంచ హోదా, ర్యాంకింగ్, స్థాయి, సంపద విలువ, ఎవరికంటే ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? అన్న వార్త సకల వార్తలకు తాతలాంటి వార్త అయి తీరుతుంది. వేదాంతులకు కళ్లముందు స్పష్టంగా కనిపించే ఈ ప్రపంచమంతా ఒట్టి మిథ్య. మాయ. పుట్టినదేదయినా నశించేదే. […]
నాలుగు రామోజీ పత్రికల మూసివేత… మిగిలినవి ఈనాడు, అన్నదాత…
రామోజీరావు అనితర సాధ్యుడు ఏమీ కాదు… ఆయన పెట్టుబడుల అడుగులన్నీ సక్సెస్ ఏమీ కాదు… చేతులు కాల్చుకుని, మూసేసుకున్నవి బోలెడు… చివరకు తనకు కీర్తికిరీటాలు తొడిగిన మీడియా రంగంలోనూ బోలెడు వైఫల్యాలు… తన ఇంగ్లిష్ పత్రిక న్యూస్‌టైం ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్… చాలారోజులు నష్టాల్లో నడిపీ నడిపీ ఇరవయ్యేళ్ల క్రితం మూసేశాడు… పలు భాషల్లో తీసుకొచ్చిన ఈటీవీ న్యూస్ చానెళ్లన్నీ ఫ్లాప్… వాటిని పాత బాకీల కింద ముఖేష్ అంబానీకి ముడిపెట్టి చేతులు దులుపుకున్నాడు… మిగిలిన […]
తూచ్ మోడీ సాబ్… టీకా ఫోటోల్లో తమిళ టచ్ మిస్సయ్యింది భయ్యా…!!
మోడీ కరోనా టీకా వేసుకోవడం వెనుక అంత పరమార్థం, ఎన్నికల వ్యూహాలు ఉన్నాయా…? వావ్… మనలాంటి అల్లాటప్పా సామాన్యులకు అంతుపట్టదు గానీ… ఉండే ఉంటుంది… ఒకాయన చెప్పాడు కదా…. ప్యూర్ యాంటీ మోడీ బ్యాచ్… తెల్లారిలేస్తే హిందూ డప్పు కొట్టే మోడీ అట, తన ప్రాణాలకు సంబంధించిన ఇష్యూకు వచ్చేసరికి క్రిస్టియన్ నర్సులను నమ్ముకున్నాడట… నమో నమ…. వీళ్లు మోడీని మించిపోతున్నారు కదా… ఆయన అస్సోం ఎన్నికల నేపథ్యంలో ఆ కల్చర్‌ను ప్రతిబింబించే ఓ స్కార్ఫ్ వేసుకుని, […]
మీనా మేకప్పుపై ట్రోలింగ్..! ఆ దృశ్యం ఒప్పుకోదని చెప్పినా వినలేదుట..!!
ఒక సినిమా తారకు మేకప్ ఎందుకు..? అందంగా కనిపించడానికి… మొహంపై గుంతలు, మరకలు కప్పడిపోవడానికి… డార్క్ షేడ్ కవర్ చేసుకోవడానికి..! తెరపై కనిపించినంతసేపు ప్రేక్షకుడికి ప్లజెంటుగా అనిపించడానికి…! మేకప్ లేకుండా బయటికే రారు, డీగ్లామర్ లుక్కులో కనిపించడానికే ఇష్టపడరు… నాటకాల్లో కూడా రంగు పూసుకోవడం మస్ట్, అందంగా కనిపించడానికే కాదు… మొహంలో ఉద్వేగాలు ప్రస్ఫుటంగా ఎక్స్పోజ్ కావడానికి..! దూరంగా ఉన్న ప్రేక్షకుడికి కూడా స్పష్టంగా కనిపించడానికి..! అసలు సినిమా తారలు, సెలబ్రిటీలే కాదు… మహిళలు బయటికి వెళ్తున్నప్పుడు […]
పోనీ… ప్రతి చందాకూ ఐటీ వారి ధ్రువపత్రం జతచేయాలా కామ్రేడ్..?!
దాత విరాళంపై కేరళ ఆలయం అభ్యంతరం ధర్మబద్దమేనా? సంస్కృతంలో మొదటిసారి ఛందోబద్ధమయిన శ్లోకం వాల్మీకి నోట్లో నుండే వెలువడింది. ఆదికావ్యం రామాయణం. ఆది కవి వాల్మీకి. బోయకులానికి పర్యాయపదంగా వాల్మీకి వాడుకలోకి వచ్చింది కానీ- నిజానికి వాల్మీకి ప్రచేతస మహర్షి పుత్రుడు. పేరు ప్రాచేతసుడు. దారితప్పి అడవుల్లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటే- ఒక రుషి జ్ఞానోదయం కలిగిస్తాడు. ఈ దారి దోపిడీలు ఎందుకోసం? అన్న రుషి ప్రశ్నకు ప్రాచేతసుడు నవ్వి – కుటుంబాన్ని పోషించడం కోసం అని […]
ప్రేమ ఖతం..! ప్రియుడి హత్యకు ప్రియురాలి సుపారీ… ప్లస్ ఒక పూట..?
ఒక్కసారి కోరికలు గాడితప్పితే చాలు… అవి సుఖాన్నివ్వడమే కాదు… తెలియని తలనొప్పుల్లో, తప్పుల్లో ఇరికించి, చివరకు ప్రాణాలు తీసినా ఆశ్చర్యం లేదు… అడుసులో కాలేయడం వరకే, అది ఎక్కడి దాకా దిగ‘జారుస్తుందో’ ఎవరూ చెప్పలేరు… ఇదీ అలాంటి కథే… ఒక యువతి, ఒక యువకుడు… వాడికి ఇంతకుముందే పెళ్లయింది… ఆమెకు పెళ్లి కాలేదు… ఇరవయ్యేళ్ల వయస్సు… ఇద్దరి నడుమ అక్రమ సంబంధం సాగుతోంది… సమాజంలో ఇలాంటివి బొచ్చెడు కనిపిస్తయ్, అది కాదు సమస్య… ఆమెకు పెళ్లి ఖాయమైంది… […]
మహానటి..! పాత్రలోకి దూరిందంటే చాలు… సహనటుడికి ప్రాణగండమే…
ద్రౌపది పాత్రలో నటి రౌద్రావతారం! చావుదప్పి బతికి బయటపడ్డ విలన్! ——————- బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్యహరిశ్చంద్ర నాటక రచయితగా జగత్ ప్రసిద్ధుడు. ఆ నాటకం ప్రదర్శించని ఊరు తెలుగు నేల మీద బహుశా ఉండదు. “భక్తయోగ పదన్యాసి వారణాసి…” “తిరమై సంపదలెల్ల..” పద్యాలు అందులోనివే. నాటకాన్ని సినిమా మింగనంతవరకు, మూడు యుగాలు గడచినా పూర్తి కాని సీరియళ్లతో టీ వీ లు వేయి తలలుగా విస్తరించనంతవరకు నాటకం పద్యాలు వినేవారు ఉండేవారు. డి వి సుబ్బారావు, […]
బిరుదు కావాలా నాయనా..? మన మార్కెట్లో చౌక సరుకే ఇది…!!
కీర్తి ప్రతిష్ఠల కోసమే లోకం బతుకుతూ ఉంటుంది. తిరుమల కొండమీది వెంకన్న కీర్తి ప్రభతో- వికారాబాద్ పక్కన అనంతగిరి కొండల్లో ప్రశాంతంగా ఉన్న అనంతపద్మనాభస్వామి ప్రభను పోల్చడానికి వీల్లేదు. ఎవరి కీర్తి వారిదే. తిరుమల వెంకన్న అన్నమయ్య అంతటి మహామహుడిని పి ఆర్ ఓ గా పెట్టుకుని పోషించగలిగాడు. అనంతగిరి స్వామికి ఆర్థికంగా అంత వెసులుబాటు లేదేమో? లేక అన్నమయ్య లాంటి కారణజన్ముడు దొరకలేదేమో? మనకెలా తెలుస్తుంది? అది పెరుమాళ్లకే ఎరుక! మనిషికయినా, దేవుడికయినా, చివరకు రాక్షసుడికయినా కీర్తి […]
సోప్ వేసిన సోప్ ప్రకటన..! తెల్లటి మాయకు తెలివైన ప్రయాస..!!
మా సోప్ శరీరం రంగు చూడదు! మా ప్రకటన భాష చూడదు!! ——————– డోవ్ అని ఒక ఒళ్లు రుద్దుకునే సోప్. ఆ సోప్ పాఠకులకు ఒక ప్రకటన సోప్ వేసింది. ఒక ఇంగ్లీషు పత్రికలో ఫస్ట్ పేజీలో సగం, రెండో పేజీ మొత్తం ఉన్న ఈ ప్రకటనలో కనిపిస్తున్న మనిషి ఊరు, పేరు కూడా వేశారు. “No digital distortion” అని అదే ప్రకటనలో ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అంటే గ్రాఫిక్స్, మార్ఫింగ్, రంగులు మార్చడం లాంటివి […]
వజ్రాన్ని నేను…! నీరవ్ మోడీ అంతరాత్మ బహిరంగ లేఖ..!
చనిపోయినవారికే ఆత్మలు ఉంటాయనడం శాస్త్ర విరుద్ధం. అసలు ఆత్మకు చావే లేదని గీతలో శ్రీకృష్ణుడు బల్లగుద్ది మరీ చెప్పాడు. ఆత్మను కత్తి కోయలేదు. అగ్ని కాల్చలేదు. నీళ్లు తడపలేవు. గాలి ఎండబెట్టలేదు. ఆత్మ నిత్యం. ఆత్మ సత్యం. మనసులోపలి మనసును అంతరాత్మ అంటున్నాం. అంటే ఆత్మకంటే అంతరాత్మ ఇంకా గొప్పది అనుకుంటే చాలు. అంతకంటే లోతుగా వెళితే ఆత్మల అంతరాత్మల మనోభావాలు దెబ్బతింటాయి. మనస్సాక్షి కంటే అంతరాత్మ సాక్షి ఇంకా గొప్పది. అందుకే నీ అంతరాత్మను నువ్వే […]
ఇంట్రస్టింగు తీర్పు…! మహిళ పుట్టింటివారికీ ఆస్తిలో వారసత్వహక్కు..!!!
ఒకాయన… అకస్మాత్తుగా మరణించాడు… తనకు కొంత ఆస్తి ఉంది… అందులో ఎవరికి వారసత్వపు హక్కు ఉంటుంది..? మామూలుగా మనకు తెలిసిన వారసత్వపు పద్ధతులు, ఆనవాయితీలు, పెద్దల తీర్పులు, చట్టాల ప్రకారం… కొడుకు ప్రథమ హక్కుదారు… ఇప్పుడు స్త్రీలకూ ఆస్తి హక్కు వర్తిస్తున్నది కాబట్టి బిడ్డ కూడా హక్కుదారు… భర్త ఆస్తిపై సహజంగానే భార్య హక్కుదారు… కొడుకుల సంతానం, బిడ్డల సంతానం కూడా హక్కుదారులే… అంతేకదా… ఆ భార్య తరపు తమ్ముళ్లు, అన్నలు వచ్చి, ఆ ఆస్తి మీద […]
రైల్వే ప్రయాణాలు తగ్గించండి… లేకపోతే చార్జీలు ఇంకా పెంచేస్తాం…
కరోనా వ్యాప్తి నిరోధానికి రైల్వేశాఖ చిట్కా వైద్యం! ——————- ప్రజలచేత, ప్రజలకోసం, ప్రజల వలన, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం అంటారు. తెలుగులో మనం ప్రయత్నపూర్వకంగా మరచిపోయిన విభక్తి ప్రత్యయాల్లో మరికొన్ని కలిపి ప్రజల కిన్, కున్, యొక్క, లోన్, కంటెన్, వలనన్, పట్టి, చేతన్, చేన్, తోడన్, తోన్ అని కూడా గంభీరంగా అనుకోవచ్చు. ప్రజలే ప్రభువులు అన్నది ప్రజాస్వామ్య మౌలిక ఆదర్శం. పునాది. సూత్రం. సిద్ధాంతం. ప్రజలకు ఏమి కావాలో ప్రభుత్వం […]
వడ్డీ లేని అప్పు అనగానే తలొగ్గకండి… నడ్డి విరిగిపోగలదు..!!
కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ తో ఓ పది నిముషాలు: గుడ్ మార్నింగ్ సార్, బజాజ్ ఫైనాన్స్ నుండి రాజేష్ మాట్లాడుతున్నాను సార్. సుదర్శన్ గారేనా మాట్లాడుతున్నది? అవును చెప్పండి. సార్ బజాజ్ ఫైనాన్స్ నుండి 4 in 1 సూపర్ కార్డు మీకు approve అయ్యింది సార్. ఈ కార్డు స్పెషాలిటీ, దీన్ని మీరు EMI కార్డ్, లోన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గా వాడుకోవచ్చు సార్. 4 ఇన్ 1 కార్డ్! OK […]
పుస్తకావిష్కరణకు ఢిల్లీ నుంచి రాక..? ఏ కాలంలో ఉన్నారు సారూ మీరు..?
ప్రజెంట్ పాపులర్ రైటర్స్ మీద ఏదో వ్యాసం చదువుతుంటే… కొన్ని అంశాలు ఆసక్తికరంగా అనిపించాయి… 1) అందరూ అనుకున్నట్టు ప్రజల్లో పఠనాసక్తి ఏమీ చచ్చిపోలేదు… చేతన భగత్ పుస్తకాలు కొన్ని 70 లక్షలు అమ్ముడయ్యాయి… అమిష్ రాసినవి 50 లక్షలు… అనేక భాషల్లోకి అనువాదం… వీళ్లు రియల్ పాన్ ఇండియా స్టోరీ టెల్లర్స్… 2) పాత పురాణాలను కూడా కొత్త పద్దతుల్లో, కొత్తకొత్తగా చెబుతున్న తీరు పాఠకుడిని ఆకట్టుకుంటోంది… ఉదాహరణకు భారతాన్ని భీముడి కోణంలో, రామాయణాన్ని తార […]
ఆ దృశ్యం మళ్లీ అదిరింది..! హీరో, దర్శకుడు అభినందనలకు అర్హులే…!
ఇప్పటి ట్రెండ్ ఏమిటి..? ఒక స్టార్ హీరో సినిమా తీస్తే… కనీసం నాలుగైదు భాషల్లో… చేతనైతే ఏడెనిమిది భాషల్లో డబ్ చేసి, పాన్ ఇండియా పేరిట దేశమంతా విడుదల చేయడం… ప్రతి భాషలోనూ టీవీ రైట్లు, ఓటీటీ రైట్లు, ఓవర్సీస్ రైట్లు కలిపి కుమ్మేసుకోవాలి… థియేటర్లలో హోర్డింగులు గట్రా ఫుల్ హైప్ క్రియేట్ చేయడం… సినిమాలో ఫుల్ మాస్ మసాలా నింపేయడం… కథా మన్నూమశానం ఎలా ఉన్నా పర్లేదు, కథనం సంగతి వదిలేయండి… వేయి శాతం హీరోయిక్ […]
రాజరికం బంగారు పంజరం… ఎగిరిపోయిన జంట మళ్లీ ఎందుకొస్తుంది..?!
బకింగ్ హ్యాం ప్రిస్టేజ్ ఈజ్ ఫాలింగ్ డౌన్! ——————- బ్రిటిషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో దుకాణం తెరిచిన నాటికి బహుశా ఇంగ్లాండ్ జనాభా యాభై లేదా అరవై లక్షలు ఉండి ఉండాలి. అదే సమయానికి భారత జనాభా హీనపక్షం ఇరవై అయిదు కోట్లు దాటి ఉండాలి. ఇప్పుడు ఇంగ్లాండ్ జనాభా అయిదు కోట్లా అరవై లక్షలు. భారత జనాభా 135 కోట్లు. పట్టుమని పది నాటు పడవల్లో గాలివాటుగా వచ్చిన పాతికమంది కంపెనీ వ్యాపారులు […]
‘కొండా’ను తవ్వి..!! ఏడాదిన్నర స్టడీ, కానీ జనానికి ఎక్కితేనే కదా ఫాయిదా..?!
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓ ట్వీట్ చేశాడు… అందులో ఓ వీడియో… దాదాపు 80 వరకూ పరిశోధన వ్యాసాల్ని, పుస్తకాల్ని, డాక్యుమెంట్లను చదివి, అర్థం చేసుకుని, ఏడాదిన్నరపాటు శ్రమపడి ఈ వీడియోను చేశాను అన్నాడు అందులో… తనే తెర మీద కనిపిస్తూ ఆ డాక్యుమెంటరీ వీడియో వివరాలు చెబుతూ ప్రజెంట్ చేశాడు… దాదాపు 23 నిమిషాలున్న ఆ వీడియోలో తన శ్రమ కనిపిస్తోంది… అభినందించాలి… అదే వీడియో సారాంశాన్ని వెలుగు పేపర్లో ఓ ముప్పావు […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- …
- 9
- Next Page »