యాంకర్ ప్రదీప్ ఓ చిల్లర్… తనకు ఎలాగూ లేదు… చంద్రబోస్కు ఏం పుట్టింది..? ఈ మాట అనడానికి, ఈ విమర్శ చేయడానికి ‘ముచ్చట’ సాహసిస్తోంది… నువ్వెన్ని పాటలు రాశావో, ఏం సంపాదించుకున్నావో పక్కన పెట్టు బ్రో… నీ కూతురు వయస్సున్న ఓ పొరుగు రాష్ట్రపు సింగర్ అమాయకత్వాన్ని పరిహసిస్తూ, వెకిలి చేస్తున్నప్పుడే నీ అసలు వికృతరూపం అర్థమైపోయింది… ఇక కాస్త మూసుకో భయ్……. అరెరె, విషయం ఏమిటీ అంటారా..? కాస్త వివరంగా చెప్పాలి… జీతెలుగు టీవీలో ఓ […]
ఓ పెగ్గు వేస్తే తప్ప… అవి అంతుపట్టవు… ఇన్నాళ్లకు వాళ్లకు కనిపించినయ్…
బ్లెండర్స్ ప్రైడ్! బ్లండర్స్ హైడ్!! ———————- వాణిజ్య ప్రకటనల్లో కొన్ని ప్రమాణాలు పాటించడానికి, ఆ ప్రమాణాలు లేకపోతే ప్రకటనలను ఆపడానికి- భారత ప్రకటనల ప్రమాణాల మండలి- ASCI అని ఒక సంస్థ ఉంది. ఇలాంటిదొకటి ఉందని ప్రకటనల రంగంలో ఉన్నవారిలోనే చాలామందికి తెలియదు. వాణిజ్య ప్రకటనల్లో కనీసం కొన్ని విషయాల్లో అయినా హద్దులు దాటకుండా ASCI నియంత్రిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి వర్ణ వివక్ష, లింగ వివక్ష, జంతు హింస, దేశ గౌరవం, మతాచారాల విషయాల్లో ASCI సీరియస్ గా […]
అనుకుంటాం గానీ… చాలామంది చంద్రబాబులున్నారు దేశంలో…!!
ఆమధ్య కరోనా వేక్సిన్ మీద స్పందిస్తూ… అది బీజేపీ వేక్సిన్, కాషాయ వేక్సిన్, అది వేసుకుంటే మగతనం పోవచ్చు, ఇంకేమైనా జరగొచ్చు, నేనయితే వేసుకోను, నేను అధికారంలోకి వచ్చాక అందరికీ మంచి వేక్సిన్ ఫ్రీగా వేయిస్తా….. వంటి పిచ్చికూతలు కూసిన లీడర్ గుర్తున్నాడు కదా… ఎస్, సమాజ్వాదీ పార్టీ అగ్రనాయకుడు అఖిలేషుడు… ఆ స్పందన చదివాక… ఈ ములాయం వారసుడు సీఎంగా అంత పెద్ద రాష్ట్రాన్ని ఎలా పాలించాడుర భయ్ అని చాలామంది ఈసడించుకున్నారు… దానికి తను […]
ఫ్లెక్సీ లీడర్స్..! వింటారా కలాం చెప్పిన ధావన్ కథ..?
అబ్దుల్ కలాం ఎక్కడికి వెళ్లినా విద్యార్థులతో మాట్లాడేవాడు. కారణజన్ముడు కాబట్టి అలా విద్యార్థులతో మాట్లాడుతూ అదే వేదికమీద నిత్య విద్యార్థిగా సాగిన దేహయాత్రకు గొప్ప ముగింపు పలికాడు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆయన తరచుగా తన అనుభవంలోనుండి ఒక గొప్ప సందర్భాన్ని ఉదహరించేవాడు. సతీష్ ధావన్ జగమెరిగిన అంతరిక్ష శాస్త్రవేత్త. ఆయన పేరే శ్రీహరికోటలో అంతరిక్ష కేంద్రానికి పెట్టారు. ధావన్ నేతృత్వంలో ఒక రాకెట్ తయారీకి శాస్త్రవేత్తలు వందలమంది అహోరాత్రాలు కష్టపడ్డారు. తీరా ఆ రాకెట్ […]
ప్రధాని దాకా కీలక పదవులు… దేశరక్షణకు మాత్రం ముందుకు రారు…
2009లో గుజరాత్ నుంచి మన సైన్యంలోకి చేరినవాళ్ల సంఖ్య 719… ఆ రాష్ట్రానికి అదే రికార్డు… 2008లో, 2007లో జస్ట్ 230 మాత్రమే… పది లక్షల మందికిపైగా ఉన్న భారతీయ సైన్యంలోకి గుజరాతీలు ఎందుకు చేరరు..? ఇదెప్పుడూ ఓ ప్రశ్నే… దేశరక్షణకు ఆ ప్రజలు ఎందుకు ముందుకు రారు..? ఇదెప్పుడూ ఓ విమర్శే… ప్రధాని పదవి దాకా ఎదుగుతారు, కానీ తుపాకీ ఎందుకు పట్టుకోరు..? ఇదెప్పుడూ ఓ పజిలే… గుజరాత్ జనాభాలో, విస్తీర్ణంలో సగం కూడా లేని […]
#కాశీలో ఓరోజు… ఆటగదరా శివా…! ‘‘నేనేం తెలుసుకున్నాను’’…
Gottimukkala Kamalakar………………. కారణం తెలియదు. ఒంటరిగా కాశీవిశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలనిపించింది. మా ఊరు నెల్లపల్లి మల్లయ్య దేవుడే చెప్పాడో..? వైరాగ్యమే వచ్చిందో..? “సంప్రాప్తే సన్నిహితే కాలే నహినహిరక్షతి..” అని భయమే వేసిందో..? హైదరాబాదు నడిమి తరగతి నడిమి వయసు భవసాగరాలే భయపెట్టాయో..? రెండు వారాల ముందు టిక్కెట్టు బుక్ చేసుకుని, రెండు గంటలు ఎయిర్ పోర్ట్ లో నిరీక్షించి, మరో రెండు గంటల్లో “వారాణసీ పురంపతిం భజ విశ్వనాథం..!” అనుకుంటూ హోటల్లోకి వచ్చేసా..! నిక్కరూ, టీ షర్టూ […]
గంజితో అధ్వా‘న్నం’- తీసేస్తే పరమాన్నం… ఈ కుక్కర్ బోధ ఇదే…
పిండితార్థం! పిండి పదార్థం!! ——————— ముందుగా ఒక విన్నపం. కడుపుకు అన్నం తినేవారెవరయినా ఈ ప్రకటన చదివి భయపడకండి. అనవసరంగా ఆందోళన పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ప్రకటన భాషలో, భావంలో ఉన్న వైరుధ్యాలు, తమాషా, చమత్కారాల మీద సరదాగా కాసేపు మాట్లాడుకోవడానికే ఈ చర్చ. ఈ ప్రకటన చూసి ఇన్నేళ్లుగా మీరు తింటున్నది అన్నం కానే కాదని- కాలకూట విషమయిన సున్నమని దయచేసి కంక్లూజన్ కు రాకండి. ఇప్పుడు విషయంలోకి వెళదాం. బాగా పేరున్న ఓ […]
కాలం ఎదురుతన్నినా… ఎవరెంత తిట్టినా సరే… ట్రంపుదీ ఓ చరిత్రే…
ప్రతీ నాయకుడిలోనూ మైనసులుంటయ్, ప్లస్సులుంటయ్… గెలిస్తే ఆహా ఓహో అని పల్లకీలు మోసే లోకమే, ఓడినప్పుడు చేతకానివాడనీ, చెడ్డవాడనీ ఆడిపోసుకుంటుంది… అంతకుముందు మంచిగా కనిపించిన కొన్ని లక్షణాలను విస్మరిస్తుంది… సేమ్, ట్రంపు విషయంలోనూ..! ఏ మెరిట్ లేకుండానే అమెరికా అధ్యక్షుడయ్యాడా..? కాదు కదా..! ఈసారి ఎన్నికల్లో తను పోరాడిన పద్ధతులు మనకు తప్పుగా తోచవచ్చుగాక.., తన పాలన పద్ధతుల్లో మనకు బోలెడు తప్పులు కనిపించవచ్చుగాక… తను అంతిమంగా ఫెయిల్ అయిపోవచ్చుగాక… రేప్పొద్దున సెనెట్ తనను అభిశంసించవచ్చుగాక… కానీ […]
ఈ పుస్తకం నిండా ఓ ‘నిశ్శబ్ద విస్ఫోటనం’ తాలూకు శిథిలాలు..!!
కాలం మారుతోంది… ఇప్పుడంతా డిజిటల్… పుస్తకం కావచ్చు, థియేటర్ కావచ్చు…. సినిమా అంటే, సీరియల్ అంటే ఓటీటీలో వీక్షణమే… అలాగే పుస్తకమూ ఈ ‘దారి’కొచ్చింది… ఇంగ్లిషులో అయితే డిజిటల్ పుస్తకం ఓపెన్ చేసి, రీడ్ ఇట్ అనే అప్షన్లోకి వెళ్లిపోతే… అరమోడ్పుగా కళ్లుమూసుకుని వెనక్కి వాలితే… అది కథ చదివి పెడుతుంది… ఇంకా మన తెలుగులో అది విస్తృతంగా రాలేదు… తెలుగు నవలారచనలో శైలికి, కంటెంటుకు సంబంధించి బోలెడు విజయవంతమైన ప్రయోగాలు చేసిన యండమూరి వీరేంద్రనాథ్ తొలిసారిగా […]
సగౌరవ అంత్యక్రియలూ రాసిపెట్టి ఉండాలి… కాలం మారుతోంది కదా…
విఖ్యాత తెలుగు నవలారచయిత Yandamoori Veerendranath తన ఫేస్బుక్ వాల్ మీద షేర్ చేసుకున్న ఓ పోస్టు చదవండి ముందుగా……….. ‘‘మరి కొద్ది గంటల్లో నగరం మీద పడబోయే బాoబు గురించి తెలిసిన అతి కొద్దిమందిలో అతనొకడు. కుటుంబంతో కలిసి రహస్యంగా రాష్ట్రం విడిచి వెళ్ళటానికి తయారు అవుతూ ఉండగా ‘హోమ్ ఫర్ ది ఏజ్డ్ నుంచి మాట్లాడుతున్నాం. మీ తండ్రి రామానంద, నెం 64392 అరగంట క్రితం మరణించారు” అని ఫోన్ వచ్చింది. ఈ సమయంలో తండ్రి […]
సీపీఎం తక్కువేమీ కాదు… ఓ గొప్ప ఫర్టిలిటీ డాక్టర్ను పొట్టనపెట్టుకుంది…
By…… Chada Sastry…………. డాక్టర్ టి.సి. ఆనంద్ కుమార్, పునరుత్పత్తి జీవశాస్త్రవేత్త, భారతదేశపు మొట్టమొదటి టెస్ట్-ట్యూబ్ బిడ్డను సృష్టించినందుకు ప్రసిద్ది చెందారు. ఆయన పని చేసిన ప్రాజెక్ట్ ద్వారా భారత్ లోని మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ 6వ తేదీ ఆగస్టు 1986 న ముంబైలో హర్ష చౌడా అనే బిడ్డ పుట్టుకకు దారితీసింది. అయితే డాక్టర్ ఆనంద్ కుమార్ పెద్ద మనసున్న మహా మనిషి. నాకన్నా ముందే ఎవరో కలకత్తా డాక్టర్ ముఖర్జీ ఇలా భారత్ […]
కరోనా రావచ్చు పోవచ్చు… కానీ కరోనా ట్యూన్ మాత్రం చస్తే వదలదు…
మీరు వినే కోవిడ్ వాణి రోజుకు 3 కోట్ల గంటలే! ———————– గడచిన సంవత్సరం మార్చి నెల దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ మొదలయినప్పటి నుండి సెల్ ఫోన్లలో ఏ నంబరుకు డయల్ చేసినా ముప్పయ్ సెకన్ల పాటు కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలే వినపడతాయి. హిందీ, ఇంగ్లీషుతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా డయల్ టోన్ నిర్బంధంగా వినిపించేలా ఏర్పాటు చేశారు. మొదట్లో చైతన్యపరచడానికి ఇది బాగానే ఉన్నా- ఇప్పుడు కరోనాతో సహజీవనం చేయకతప్పదని జ్ఞానం కలిగిన […]
ఓహ్ బేబీ రజినీ చాంది..! నెట్ ట్రోలర్స్కు దొరికింది తాజా ‘ఏజ్ బార్ బకరీ’..!
ఒకావిడ తల్లి పాత్రలు వేస్తుంటుంది… ఒళ్లూ, కాళ్లూ డ్యాష్ డ్యాష్ బాగా కనిపించేలా డాన్సులు చేస్తూ ఓ వీడియో ఇన్స్టాలో పెడుతుంది… హేమిటీ అంటే, నేను ఇంకా ఫిట్టేనోయ్, చూడు కాస్త అని నిర్మాతలకు గట్రా ఓ మెసేజ్… మరొకావిడ పెళ్లీడుకొచ్చిన తన బిడ్డతో కలిసి షార్ట్స్లో డాన్సులు చేస్తూ, ఇన్స్టాలో పెట్టేస్తూ, నేను కూడా మస్తు ఫిట్టుగా ఉన్నానోయ్ అని సంకేతాలు పంపిస్తుంటుంది… ఎవరి వృత్తిగతం వాళ్లది… ఓ సింగర్ ఎదిగిన పిల్లల సాక్షిగా రెండో […]
చదివితే సింగిల్ కాలమ్ వార్త… వార్తాంశంలోని స్పూర్తి అంతులేనంత…!
రాస్తే నిండా పది వాక్యాలు రావు… అంత చిన్నగా ఉంటుంది వార్త… కానీ పెద్ద సంకల్పం… చదువుతుంటేనే ఆనందం కలిగే వార్త… మన రాష్ట్రాలు, కాదు, కాదు, మన సమాజాలు కులం, మతం, క్షుద్ర రాజకీయాలతో తన్నుకుచస్తున్నాయి కదా… విద్యావేత్తలు, జర్నలిస్టులు, అధికారులు గట్రా అందరినీ ఆ కంపు కమ్మేస్తోంది కదా… కేరళకు సంబంధించిన ఈ వార్త చదువుతుంటే మన చైతన్య స్థాయిని చూసి మనమే ఏడవాలి అనిపిస్తుంది… సరే, రాజకీయాలు ఎక్కడైనా ఉన్నవే… కేరళలోనూ సహజమే… […]
మనుషుల్లో పశుత్వం! పశువుల్లో మానవత్వం!
“ఇన్ద్రో విశ్వస్య రాజతి; శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే” అని వేదంలో శాంతి మంత్రం. రెండు కాళ్లున్న మనుషులకు, నాలుగు కాళ్లున్న పశువులకు సుఖశాంతులు కలుగుగాక అని ఈ మంత్రం అర్థం. మనుషులకు రెండు కాళ్లేనని ఈ మంత్రంలో ఎక్కడా లేదు. ద్విపదే అంటే రెండు కాళ్లున్న మనుషులమయిన మన గురించే అని మనం గ్రహించాలి. చతుష్పదే అంటే నాలుగు కాళ్లతో నడిచే పశువులు అని ఆ విషయం తెలుసుకోలేని పశువులకు మనం తెలియజెప్పాలి. పశువుకంటే […]
… అదుగో… వాళ్లే మన ఫేస్బుక్ పోస్టులు ప్రేమగా చదివేది…!
నగరానికి ఊళ్లో పండుగ! అప్పుడే దొంగలకు నగరంలో పండుగ!! ———————— హైదరాబాద్ విశ్వనగర పోలీస్ కమీషనర్ బాధ్యతాయుతంగా ఒక జాగ్రత్త చెప్పారు. పండగలకు పొలోమని ఊరెళ్లేవారు- ఈగ ఇల్లలుకుతూ ఇంటిపేరు మరచిపోయినట్లు ఇళ్లను మరచి ఊళ్లకు పోవద్దన్నది ఆయన చెప్పిన జాగ్రత్త సారాంశం. లేకపోతే పండగకు నగరం వదిలి వెళ్లిన ఇళ్లల్లో దొంగలు పండగ చేసుకుంటారన్నది ఆయన హెచ్చరిక. హైదరాబాద్ జనాభా కోటి. ఈ కోటిలో అరవై లక్షల మంది ఇతర ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడ్డవారే […]
తిలక్… నువ్వు లేవు… నీ పాట/ మాట/ ఆట వుంది..!
Taadi Prakash……………… తిలక్… నువ్వు లేవు… నీ పాట/ మాట/ ఆట వుంది!………… Artist Mohan on film director Tilak ——————————————————— ఇవాళ పాత సినిమా దర్శకుడు కె. బీ. జీ. తిలక్ పుట్టిన రోజు. ఆయన గురించి పది సంవత్సరాల క్రితం the Sunday Indian తెలుగు రాజకీయ వార పత్రికలో ఆర్టిస్ట్ మోహన్ రాసిన వ్యాసం ఇది : నిజానికిది సినిమా దర్శకుడు కొల్లిపర బాలగంగాధర తిలక్ గారి గురించి కాదు ఆయన్ని […]
హే వాట్సాప్..! హౌ ఈజ్ మై టెలిగ్రామ్ సిగ్నల్..?
వాట్సాప్ వాడే అమాయకులకు మాయకులయిన వాట్సాప్ ఫేస్ బుక్ యాజమాన్యం ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా- 1 . మేము మీకు సేవచేసి తరించడానికి ధర్మసంస్థ కాదు. అహోబిల మఠం కాదు. ఊరిచివర తలుపు చెక్క కూడా మిగలని శివాలయం కాదు. మాది ఫక్తు అంతర్జాతీయ డిజిటల్ దిగ్గజ వ్యాపార సంస్థ. 2. భూగోళమంతా కోట్ల మందికి వాట్సాప్ అలవాటు చేసిన తరువాత- ఇక ఆ గుత్తాధిపత్యాన్ని అనుభవిస్తూ ఫలితాలు పిండుకోకుండా ఉండడానికి మేమేమీ సేవా ప్రతిఫలాపేక్ష లేని […]
కొత్త పేర్ల ట్రెండ్..! నవ్వించేవి, బుర్రచించేవి… కోహ్లీకి కూడా ఇదే తల్నొప్పి..!!
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ… అలియాస్ విరుష్క… ఫ్యాన్స్ ఇద్దరినీ కలిపి పిలుచుకునే పేరు… పాప పుట్టింది… ఈ వార్త రాయని మీడియా, సైట్లు, టీవీలు, ట్యూబ్ చానెళ్లు లేవు… హహహ… రకరకాల ఫేక్ ఫోటోలు కూడా అప్పుడే దర్శనమిచ్చాయి… సరే, ఆ ఫోటోల రియాలిటీ ఏమిటనేది పక్కన పెడితే… చర్చ ఇప్పుడు ఆ పాపకు పెట్టబోయే పేరు మీదకు మళ్లింది… బోలెడన్ని డిబేట్లు, సూచనలు… అదో ఆనందం… కొందరు విరుష్క అనే పేరే ఖాయం చేయమని […]
అయ్య బాబోయ్, ఆంధ్రప్రభోయ్… ఇదేం వింత వార్త దేవుడోయ్…
తెలుగునాట హాస్యప్రియులు ఏది మిస్సయినా సరే… కేఏపాల్, సబ్బం హరి, చంద్రబాబు, ఆంధ్రప్రభ పత్రికను అస్సలు ఇగ్నోర్ చేయలేరు… బీపీని తగ్గించి, ఒత్తిడి ద్వారా వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడే పాజిటివ్ పేర్లు ఇవన్నీ…! అబ్బే, ఆంధ్రప్రభ చాలారోజులుగా మనల్ని నిరాశపరుస్తోంది అనుకుంటామో లేదో ఓ అరివీర భజన వార్తో, ఓ అనూహ్యమైన నమ్మలేని కథనమో అచ్చేసి వదులుతుంది… ఈరోజు ఓ వార్త చదవండి… అది ప్రకటనో, వార్తో, స్పెషల్ కథనమో, చరిత్రో, భజనో ఎంతటి ఘనుడైన […]