. ( కె.శోభ ) .. … 9వ నెలలో నృత్యకారిణి సాహసం, దేవకీ పరమానందం, ‘మాతృత్వం’ నృత్య రూపకం బిడ్డ కడుపున పడింది మొదలు నెలలు నిండేకొద్దీ కదలడం తల్లికి భారమే. అయినా సాహసించి పరీక్షలకు వెళ్ళేవాళ్ళు, ప్రయాణాలు చేసేవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అయితే తొమ్మిదో నెలలో నృత్య ప్రదర్శన ఇచ్చే సాహసం ఎవరూ చెయ్యలేదు. తాజాగా బెంగళూరుకు చెందిన యగ్నికా అయ్యంగార్ అరుదైన ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించారు. […]
తెలుగు భాషకన్నా ముందుగానే… తెలుగు లిపికి మరణశాసనం…
. తెలుగును తెలుగులో రాస్తే జైల్లో పెడతారా? మాతృ భాష. అమ్మ భాష. మన భాష. మదర్ టంగ్. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. తెలుగు తల్లి/తెలంగాణా తల్లి అనగానే భావోద్విగ్నంగా ముడిపడతాం. పడాలి కూడా. భాసించేది భాష. అంటే వెలిగేది, వెలుగును పంచేది. అంటే నిజమయిన వెలుగుగురించి చెప్పాలన్నా కాంతిమంతంగా వెలిగే భాష లేకపోతే సాధ్యం కాదన్నమాట. అందుకే మండే సూర్యుడి వెలుగును సంకేతిస్తూ భాస్కరుడు అంటున్నాం. […]
గుండమ్మ కథలాగే గయ్యాళి గంగమ్మ… తెర నిండా సూర్య‘కాంతులే’…
. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) …….. ఫక్తు జంధ్యాల మార్క్ సినిమా గయ్యాళి గంగమ్మ… కక్షలు , పగలు , చంపటాలు , చంపుకోవటాలు , చాతబడులు వంటి వయలెన్స్ లేకుండా ఫేమిలీ ఓరియెంటెడ్ , వినోదాత్మక సినిమాలను పాపులర్ చేసింది జంధ్యాలే . ఒకప్పుడు విజయా వాళ్ళు ఇలాంటి వినోదాత్మక సినిమాలు తీసేవారు . 1980 ఆగస్టులో వచ్చిన ఈ గయ్యాళి గంగమ్మ కూడా విజయా వారి […]
స ని ద ప మ… పిల్లల్ని దండించే ముందు ఈ స్వరాలు గుర్తుంచుకొండి…
. ( యండమూరి వీరేంద్రనాథ్ ) ….. స, ని, ద, ప, మ: పిల్లల్ని దండించే ముందు ఐదు అంశాల్ని గుర్తుంచుకోవాలి. సులభంగా ఉండటం కోసం వాటికి స, ని, ద, ప, మ అని పేరు పెట్టుకుందాం. 1. సహేతుకత: కోపం చర్య (యాక్షన్) కాదు. అవతలి వారి చర్యకి మన ప్రతిచర్య (రియాక్షన్). మీకు ప్రమోషన్ వచ్చిన రోజు, మీ పిల్లవాడికి ఒక సబ్జెక్ట్‌లో మార్కులు కాస్త తక్కువ వచ్చినా పెద్దగా పట్టించుకోరు. […]
ఈ ఇద్దరు మహిళల జగడాన్ని సుప్రీం కూడా తీర్చలేక పోయింది…
. నెవ్వర్… ఈ ఇద్దరు మహిళల తగాదా… అదీ ఫుల్లు అహంతో కూడిన ఇద్దరు ఉన్నతాధికారిణుల పంచాయితీని చివరకు సుప్రీం కోర్టు కాదు కదా… దేవుడు కూడా పరిష్కరించలేడేమో… కర్నాటక… ఒకావిడ పేరు రోహిణి సింధూరి… తెలుగు ఐఏఎస్… 43 ర్యాంకు… మరొకావిడ పేరు రూపా మొద్గిల్… కన్నడ ఐపీఎస్… ఇద్దరూ తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు… ఒకరికి ఒకరు తీసిపోరు… అసలే ఆడ లేడీస్, ఆపై సెంట్రల్ సర్వీస్… కీలక బాధ్యతల్లో పనిచేసినవాళ్లు… ఎక్కడో తేడా కొట్టింది […]
పెళ్లి ఊరేగింపులో పార్టీ జెండాలు..! కస్సుమన్న ఐపీఎస్ వరుడు..!!
. వరుడు అసలే అయిపీయెస్సూ… పార్టీ జెండా ఆపిన పెళ్ళి… “ఏ కల్యాణం కోసం ఇంతటి కల్లోలం? నీకు తెలియనిదా నేస్తమా! చెంత చేరననే పంతమా? ఖండాలుగ విడదీసే జెండాలన్నీ తలవంచే తలపే అవుదాం… ఆ తలపే మన గెలుపని అందాం” అని కంచె సినిమాలో సిరివెన్నెల చెప్పిన సందర్భం సరిహద్దులో యుద్ధానికి సంబంధించినదే అయినా… సర్వకాల సర్వావస్థల్లో పాటించాల్సిన హద్దులు చెరిపేసే ఏ సందర్భానికైనా అన్వయమయ్యే విశ్వజనీన ఆదర్శమది. ఆదర్శాలెప్పుడూ మాటల్లో గొప్పగా ఆకాశాన్ని తాకుతూనే […]
బ్యాంకు ధనం… దోచుకున్నవారికి దోచుకున్నంత మహదేవా…
. రుణ ఎగవేతానందలహరి! అప్పిచ్చువాడు లేని ఊళ్లో ఉండనే ఉండవద్దని శతకకారుడి ప్రబోధం. “ఋణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాః ఋణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా” రుణానుబంధమే లౌకిక ప్రపంచానికి అత్యంత కీలకమయినది. బ్యాంకులతో ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఉన్నది జన్మ జన్మల అలౌకిక, పారమార్థిక(పారమార్థిక అనగా పరమ ఆర్థిక సంబంధమైన అన్న వ్యుత్పత్తి అర్థం తప్ప ఇంకే అర్థమూ తీసుకోకూడదని మనవి) రుణానుబంధమే. ఆ ఎగవేత దారుణ రుణ భారం తీర్చాల్సింది బాధ్యతగల సగటు […]
నేను క్రిస్టియన్ కాను…. సోనియా మాటల అర్థమేమిటో తెలియదు…
. ‘A Maverick in Politics’… అని ఓ పుస్తకం రాస్తున్నాడు కదా మణిశంకర్ అయ్యర్… లాహోర్‌లో పుట్టిన ఈ 83 ఏళ్ల రాజకీయ నాయకుడు పూర్వాశ్రమంలో ఓ ఫారిన్ సర్వీస్ ఉన్నతాధికారి… డూన్, కేంబ్రిడ్జి విద్యాభ్యాసం సమయంలో రాజీవ్ గాంధీ ఈయనకు జూనియర్… అప్పటి నుంచే సాన్నిహిత్యం ఉంది ఇద్దరికీ… తరువాత పీఎం ఆఫీసులో కూడా పనిచేశాడు ఈయన… మూడుసార్లు లోకసభకు ఎన్నికైనా తరువాత వరుస పరాజయాలు… ఒక దఫా రాజ్యసభ సభ్యుడు… తండ్రి చార్టర్డ్ అకౌంటెంట్… […]
పుష్ప తొక్కిసలాటలో ఎవరిది తప్పు…? ఓ కథ చెప్పుకుందాం…!!
. Rajasekhar Paruchuri ……. తిలాపాపం – తలా పిడికెడు ఒక గద్ద ఒక పామును తన్నుకుని పోతూంది ఆహారంగా… చావుకి దగ్గరగా ఉన్న పాము తనలో విషాన్ని వదిలిపెడుతుంది. ఆ విషం కిందనే పాలూ, పెరుగు అమ్మకానికి పట్టుకెడుతున్న గొల్లభామ తలమీది గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది. అదే సమయానికి, గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం మూలంగా… ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణునికి అమ్ముతుంది గొల్ల భామ… […]
అనూహ్యంగా మార్పు …. మన పూర్వీకుల సూత్రాల వైపు పునఃపయనం…
. ( Nallamothu Sridhar Rao ) ……. పబ్ కల్చర్ నుండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌కి వస్తున్నారంటే.. విశృంఖలమైన జీవితం నుండి ఆధ్యాత్మికత వైపు వస్తున్నారంటే తెలీట్లేదా? ఒక చిన్న కధతో మొదలుపెడతాను. 20 ఏళ్ల యువకుడు.. ఫ్రెండ్స్‌తో రోజూ చల్లటి బీర్ తాగడం అలవాటైంది.. అది మెల్లగా శృతిమించింది. దాంతో పాటు నైట్ లైఫ్ అంటూ వేకువజాము 2- 3 గంటల దాకా తిరుగుతూ, వేళాపాళా లేకుండా తినడం అలవాటైంది. రెండేళ్లు బిందాస్‌గా గడిచింది. […]
వహ్ తాజ్ అనాలని ఆ ఉస్తాద్ ఎందుకన్నాడు..! వహ్ యాసీన్..!!
. ( యాసీన్ ఫేస్బుక్ వాల్ నుంచి స్వీకరణ ) …. వహ్_ఉస్తాద్_అని_పిల్లాడంటే… వహ్_తాజ్_అనమని_ఉస్తాద్_ఎందుకన్నాడు? ఇద్దరూ పోటాపోటీగా తబలా వాయిస్తూ ఉంటారు. అద్భుత వాద్యసంవాదం చివర్న చిన్నపిల్లాడు ‘వహ్ ఉస్తాద్’ అనగానే… ‘వహ్ తాజ్’ అనమంటూ ఉస్తాద్‌గారు సరిదిద్దే యాడ్ అది. ‘చాయ్’ కప్పును కాస్త పక్కకు పెట్టేయండి… ‘వహ్ ఉస్తాద్’ అని పిల్లాడంటే ‘వహ్ తాజ్’ అనమని జాకిర్ హుసేన్ ఎందుకన్నాడంటారూ? * * * * * అవి అమాయకమైన మా చిన్నప్పటి రోజులు. […]
అయ్యో మనోజ్… సొంత తల్లి కూడా నెగెటివ్ అయిపోయింది బ్రో…
. ఓ మంచి సినిమా కథలా… ఆ సినిమా కుటుంబం కథ కూడా చాలా ట్విస్టులు తిరుగుతోంది… ఇన్నాళ్లు తండ్రీ కొడుకులు, అన్నాదమ్ముళ్లకు పరిమితమైన తాజా కొట్లాటల కథలోకి తల్లులనూ తీసుకొచ్చారు… మోహన్‌బాబు రెండో భార్య, అనగా మంచు మనోజ్ తల్లి పేరిట ఓ లేఖ ప్రచారంలోకి వచ్చింది… రావడమే కాదు, ఏకంగా ఆ లేఖ తన కొడుక్కి వ్యతిరేకంగా ఉండటం సంచలనం… (మంచు విష్ణు, మంచు లక్ష్మి తల్లి వేరు… మంచు మనోజ్ తల్లి వేరు […]
ఆన్లైన్లో బట్టలు కొంటున్నారా..? జాగ్రత్త… నాసిరకం అంటగడతారు..!!
. ( Shankar G ) …. ఆన్లైన్ షాపింగ్… ఇవీ జాగ్రత్తలు… నేను దాదాపుగా 15 సంవత్సరాలుగా ఆన్లైన్ లోనే కొంటున్నాను. మొదట జబాంగ్ లో కొనేవాణ్ని. అది కాస్త మింత్రాగా మారిపోయింది. ఆ మింత్రా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ తో అసోసియేట్ అయ్యింది. ఇవికాకుండా అమెజాన్, అజియో, టాటా క్లిక్, NN NOW, nyaka ఫ్యాషన్ లాంటి వాటిల్లో కూడా purchase చేసేవాణ్ణి. సైజ్ సెలక్షన్… మొదట సైజ్ ఎంచుకోవటంలో బాగా ఇబ్బంది పడేవాన్ని.. ఒక్కో బ్రాండ్ […]
ఏందయా ఇదీ… ఇదేందయా ఇదీ… ఇది నేనెప్పుడూ చూడలా…
. కప్పు టీ లక్ష రూపాయలు… బంగారు టీ, కాఫీ “నీ ఇల్లు బంగారం కాను…” అని మాటవరసకు ఆశ్చర్యపోతాం కానీ… మన మాట పొరపాటునైనా నిజమవుతుందని తెలిస్తే… కలలో కూడా అనం. చరిత్రలో నిలిచిపోయినదంతా సువర్ణాక్షర లిఖితమే కావాలి. మంచిదేదయినా బంగారంతో పోల్చాల్సిందే. బంగారంలాంటి ఇల్లు; బంగారంలాంటి సంసారం; బంగారంలాంటి మనసు; బంగారు పాప; బంగారు తొడుగు; నిలువెత్తు బంగారం; బార్న్ విత్ గోల్డెన్ స్పూన్; మన బంగారం మంచిదైతే…; బంగారు గాలానికి బంగారు చేపలు పడవు; […]
యండమూరి రాస్తున్న చిరంజీవి బయోగ్రఫీ ఆగిపోయింది…
. ( యండమూరి వీరేంద్రనాథ్ ) …….. తన జీవిత చరిత్ర వ్రాయటం మరి కొంతకాలం ఆపుదాం- అన్నాడు చిరంజీవి. సగం రాసిన ఆ పుస్తకాన్ని మరి కొన్ని నెలల/ ఒకటి రెండు సంవత్సరాల పాటు ఆపడం జరుగుతుంది. ఈ లోపు ఖాళీగా ఉండకుండా మనసుకు చాలా సంతృప్తినిచ్చే మరో పుస్తకం ప్రారంభించాను. (ఫొటో: మా ఇంటికి వచ్చిన విశిష్ట అతిథులు. కోచ్ రమేష్. ఆయన తీర్చిదిద్దిన శిష్యురాలు ప్యారిస్ పారా ఒలింపిక్స్ మెడలిస్ట్ దీప్తి, మాజీ […]
మిస్టర్ ఇన్ఫోసిస్ మూర్తీ… ఎప్పుడైనా వెట్టి అనే పదం విన్నావా..!!
. అరణ్య కృష్ణ… మూర్తి గారూ మీరో సినిమా చూడాలండీ! “వారానికి డెబ్భై పని గంటలు” దేశానికి అవసరమని ఇన్ ఫోసిస్ నారాయణమూర్తి మరోసారి నొక్కి వక్కాణించారు. అన్ని పని గంటలు లేకపోవడం వల్లనే దేశం ఇలా దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నదని కూడా సెలవిచ్చారు ఆ సాఫ్ట్ వేర్ టెకీ వణిక్ ప్రముఖుడు. అన్ని పని గంటలు లేకుంటే దేశం ఎలా పేదరికాన్ని జయిస్తుందని కూడా ఆయన అడిగారు. ఆయన వేతనాల గురించి మాట్లాడకుండా కేవలం పని గంటల […]
ఓ ఫేస్బుక్ ప్రేమ కథ… సరైన దర్శకుడి చేతిలో పడితే మంచి కథే..!!
. కథో నిజమో తెలీయదు కానీ చదవగానే బాధ వేసింది… ఒకమ్మాయి అబ్బాయి Facebook లో పరిచయమయ్యారు. Hi తో మొదలై అన్ని విషయాలూ పంచుకునే స్థాయికి close friends అయ్యారు. అబ్బాయి తన photo లు upload చేసేవాడు. కానీ అమ్మాయి photo ఎప్పుడూ అడగలేదు. So ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అబ్బాయికి తెలీదు. ఒకరి వివరాలు ఒకరికి మాత్రం తెలుసు. అలా సరదాగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు అమ్మాయి చెప్పింది అబ్బాయితో.. […]
అది కన్నింగ్ నక్క కాదు… అతడు చేసిన ప్రాణదానం మరవనిది…
. మల్లన్న మహారాజు (మంగోలియన్ జానపద కథ) – డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212 ***************************** ఒక ఊరిలో మల్లన్న అని ఒక యువకుడు వుండేటోడు. వాడు చానా పేదోడు. పని చేస్తే తిండి లేదంటే లేదు. వానికి ముందూ వెనుకా నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. అంతా చిన్నప్పుడే స్వర్గానికి నిచ్చెన వేసుకొని ఎక్కేశారు. దాంతో ఒక్కడే ఊరి చివర ఒక పాడుబడిన కొట్టంలో ఒంటరిగా వుండేవాడు. వాన్ని పట్టించుకునేటోళ్ళు, పలకరించేటోళ్ళు ఎవ్వరూ లేరు. ఆ కొట్టం పక్కనే ఒక […]
మేఘా కృష్ణయ్య పిలిచాడు… చంద్రబాబు డోకిపర్రు దాకా వెళ్లాడు…
. ఒక ఫోటో… మొన్నెప్పుడో కనిపించింది… ఇంట్రస్టింగుగా కూడా అనిపించింది… అది డోకిపర్రు గ్రామంలో చంద్రబాబు, మేఘా కృష్ణారెడ్డి బాపతు ఫోటో… ఆ ఊళ్లో ఓ గుడి కట్టాడు మేఘా ఓనర్… భూసమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం… ఓ గెస్ట్ హౌజు, ఓ కల్యాణమండపం కూడా… అంతేకాదు, ఆ ఊరిని కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద 2015లో దత్తత తీసుకుని, పైప్డ్ గ్యాస్ సప్లయ్ ఏర్పాటు చేశాడు… స్మార్ట్ విలేజీగా డెవలప్ చేశాడు… ఆ గుడికి […]
భర్తలకూ తప్పని గృహహింస..! మరి భర్తలకు రక్షణ చట్టాలేవి..?!
. ఇప్పుడు కావాలి హీ టీమ్స్… భార్యాబాధితుల మొర… “బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత 40 పేజీల సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. ఆయన భార్య క్రూరత్వాన్ని ఆ లేఖ బయటపెట్టింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ 2019లో నిఖితను పెళ్లి చేసుకున్నారు. ఆమె ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మనస్పర్థలు రావడంతో భార్య నిఖిత, అత్త నిశా, బావమరిది అనురాగ్, భార్య మేనమామ సుశీల్ తనను వేధించారని అతుల్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. […]
- « Previous Page
- 1
- …
- 11
- 12
- 13
- 14
- 15
- …
- 124
- Next Page »