సూర్యకాంతం… ఈ మాట వినగానే తెలుగువాడు మొహం చిట్లిస్తాడు… తిట్టిపోస్తాడు… ఎవరూ ఆ పేరును పిల్లలకు పెట్టుకోరు… సగటు లేడీ విలన్‌కు ప్రతీక… ప్రతి సినిమాలోనూ ఆమెకు అలాంటి పాత్రలే చేసీ చేసీ ఆమె ఓ క్రూరురాలు అయిపోయింది… కోడళ్లను రాసిరంపాన పెట్టే ధూర్త అత్తగారు అయిపోయింది… ఆ పాత్రల్నీ ఇరగ్గొట్టి ఆమె అఖండమైన పేరు సంపాదించుకుంది, అది వేరే కథ… సేమ్, రామాయణం అనగానే రావణుడికన్నా జనం అందరూ తిట్టిపోసేది కైకేయిని… సీతమ్మ కష్టాలు చూస్తూ, […]
