Boomerang: వెనుకటికి ఒక బద్దకస్థుడు ఏ పనయినా చిటికెలో చేసి పెట్టే దయ్యం కోసం ఘోరమయిన వామాచార అభిచార హోమం చేశాడు. అతడి హోమానికి మెచ్చి దయ్యం ప్రత్యక్షమయ్యింది. “నాకు నా పళ్లు తోముకోవడం కూడా బద్దకమే. ఎప్పుడూ నా వెంట ఉండి…నేను నోటితో చెప్పడం ఆలస్యం…నువ్వు ఆ పనులన్నీ చేసి పెడుతూ ఉండాలి” అన్నాడు. “దానికేమి భాగ్యం! అలాగే. అయితే- ఒక షరతు. నాకు పనులు చెబుతూనే ఉండాలి. పనులు చెప్పనప్పుడు… నేను నిన్ను మింగేస్తాను…లేదా అదృశ్యం అయిపోతాను” […]
ఈనాడును అప్పట్లో వరంగల్‌లో కొట్టిపడేశాం… పాత్రికేయుడిగా అదొక కిక్కు…
Prasen Bellamkonda……. ఈనాడు విలేకరి రాలేదా, వచ్చాక ప్రెస్ మీట్ మొదలెడదాం… అనే అనుభవం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఈనాడేతర విలేకరినీ వేధిస్తూనే ఉంటుంది. ఈ చిరాకు గురించిన Murali Buddha పోస్ట్ ఈనాడు లేదా రామోజీ క్షీణ స్థితిని కళ్ళకు కడుతూ.. బాగుంది. ఈ మంట నాకూ ఉండేది. అదేంటి అలా ఎలా ప్రెస్ మీట్ ఆపుతారు అని నేను ఘర్షణ పడ్డ సందర్భాలూ ఉన్నాయి. అయినా మనం ఆఫ్ట్రాల్ ఆంధ్రభూమి ప్రతినిధి కావడంతో కేరెజాట్ […]
చైనా, బర్మా, పాకిస్థాన్… మణిపూర్ మంటలకు తలాపాపం తిలా పిడికెడు…
పార్ధసారధి పోట్లూరి ……… ఉత్తర ఈశాన్య రాష్ట్రం అయిన మణిపూర్ మండుతున్నది ! ఏదో మాట వరసకి మండుతున్నది అనే పదం వాడడం లేదు ! నిజంగానె మండుతున్నది ! May 3 న మొదలయిన ఘర్షణలు ఈ రోజుకి తీవ్ర రూపం దాల్చి చివరకి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయింది మణిపూర్ రాష్ట్రం. మణిపూర్ లో ఉంటున్న కుకీ,నాగా, మెతీ తెగల ప్రజల మధ్య తీవ్ర ఘర్షణలు జరగడం వల్ల చివరికి కర్ఫ్యూ […]
నాకు ఎన్టీయార్ ఇంటర్వ్యూ దక్కింది… నా మిత్రుడికి బిర్యానీతో కడుపు నిండింది…
Murali Buddha……… అటు బిర్యానీ -ఇటు ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఓ జర్నలిస్ట్ కు మూడు కోట్ల రూపాయల పాఠం ఓ జ్ఞాపకం …. రాక్సీ లో నార్మా షేరర్ బ్రాడ్వే లో కాంచన మాల ఉడిపి శ్రీకృష్ణ విలాస్ లో – అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ … రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలో శ్రీ శ్రీ కే కాదు ఎవరికైనా కష్టమే .. జర్నలిస్ట్ కే కాదు ప్రతి మనిషి […]
ఖమ్మంలో ఎన్టీయార్ భారీ విగ్రహం… ఎవరి ఆధిపత్య ప్రదర్శన కోసం మహాశయా..?
Gurram Seetaramulu………. ఒకప్పుడు ఈ దేశంలోకి వామపక్ష రాజకీయాలు బయలుదేరినప్పుడు ఈ దేశంలో పీడక కులాలే తమ ఇళ్ళల్లో ఆశ్రయం ఇచ్చాయి. నాయకత్వం కూడా పీడక కులాల చేతిలోనే ఉండేది. ఇది కేవలం ఒక్క ప్రాంతంలో జరిగిన కథ కాదు. ప్రతి ప్రత్యామ్నాయ మార్పు వెనక ఆధునికతను అర్ధం చేసుకున్న సమూహాలే ముందుకు వస్తాయి ఆ ఉద్యమాలకు వాన్ గార్డ్ లాగా ఉంటాయి. ఇలా పీడక కుల వాసన లేని చోట కూడా ప్రజాఉద్యమాలు పెల్లుబికాయి. అది బస్తర్ […]
ఈనాడు రిపోర్టర్ ఇంకా రాలేదా..? కాసేపు ఆగి ప్రెస్‌మీట్ స్టార్ట్ చేద్దాం…
Murali Buddha…….. ఈనాడు రిపోర్టర్ వచ్చాడా ? ఓ జ్ఞాపకం……. రెండు దశాబ్దాల క్రితం వరకు తన వృత్తి జీవితంలో ప్రతి జర్నలిస్ట్ ప్రతి రోజూ విన్న మాట ఇది … **** ఓ రోజు ఇంటికి రాగానే నా కోసం ఓ వ్యక్తి పరుగెత్తుకొచ్చి చేతిలో ఓ ఐడెంటిటీ కార్డు పెట్టాడు … కార్డు చాలా బాగుంది. నాణ్యతతో మెరిసి పోతుంది … అతను చదువుకోలేదు. అప్పుడప్పుడు డ్రైవర్ గా పని చేస్తాడు. ఏంటీ అని […]
పుతిన్ మీదకు డ్రోన్ల దాడి… జెలెన్‌స్క్ మీదకు మిసైళ్లు… పెద్ద తలలే టార్గెట్…
పార్ధసారధి పోట్లూరి …….. భౌతికంగా జెలెన్స్కీ ని అంతం చేయడమే రష్యా మొదటి లక్ష్యం ! రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ మీద డ్రోన్ దాడి జరిగింది నిన్న ! ఈ దాడి నేరుగా రష్యా అధ్యక్షుడిని హత్య చేసే ప్రయత్నంగా భావిస్తున్నామని రష్యన్ మిలటరీ ఉన్నతాధికారి ప్రకటించాడు! ప్రతిగా రష్యన్ స్పెషల్ ఫోర్స్ కమాండోలు ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదోమిర్ జెలెన్స్కీ ని చంపడమే లక్ష్యంగా ఉక్రెయిన్ లోకి [రష్యా ఆక్రమిత ప్రాంతం ] లోకి […]
వేటగాడు ఇప్పుడు జంతుప్రేమికుడు… అరుదైన జాతులకు సంరక్షకుడు…
వేటగాణ్ని ప్రేమికుడిగా మార్చిన వేక్ అప్ కాల్ కథ! బోయవాని వేటుకి గాయపడిన కోయిల పాట వింటుంటే.. వేటగాడిదెంత కరుడుగట్టిన మనస్తత్వం అనిపిస్తుంది కదా! కానీ, ఓ పక్షి వేటనంతరం.. ఓ కరడుగట్టిన వేటగాడి హృదయం చలించి.. మనిషిగా మారి… ఆ మహనీయుడే ఎన్నో జీవుల పాలిట దేవుడయ్యాడు. కోహిమాకు చెందిన రువుటో బెల్హో వేకప్ కాల్ స్టోరీలోకి ఓసారి విహంగ వీక్షణమై తెలుసుకుని వద్దాం పదండి. భక్షకుడు-రక్షకుడయ్యాడు 64 ఏళ్ల రువుటో బెల్హో. నాగాలాండ్ లోని […]
tv9 రజినీకాంత్‌కు జనం నాడి తెలుసా..? వెంకట్రావు చానెల్‌పై ఓ జ్ఞాపకం…
Murali Buddha….. జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ – టివి 9…. యజమానుల నాడియే జనం నాడి… ఓ జ్ఞాపకం సోడాబుడ్డి కళ్లద్దాలు , పెరిగిన గడ్డం , లాల్చీ, పైజామా … ఇదీ పాత తెలుగు సినిమాల్లో జర్నలిస్ట్ అనగానే కనిపించే రూపం .. జనం మనసుపై ఈ ముద్ర బలంగా పడిపోయింది. ఓసారి విశ్వనాథ్ ఆనంద్ ను ఒకరు ఏం చేస్తావ్ అని అడిగితే చెస్ ప్లేయర్ ను అని చెప్పాడట … చెస్ ఆడుతావు […]
బాబాలకూ కనిపించని బాధలేవో ఉంటయ్… కోటరీల బందిఖానాల్లో బతుకులు…
Murali Buddha…….. వ్యతిరేకంగా రాయండి ప్లీజ్ ….బాలసాయిబాబా…….. ఓ జ్ఞాపకం …. మ్యూజియంలో ఓ పుర్రెను చూసి విద్యార్థులు ఆసక్తిగా అడిగితే గైడ్ అది హిట్లర్ పుర్రె అని చెబుతాడు … మరో చిన్న పుర్రె కనిపిస్తే అది హిట్లర్ చిన్నప్పటి పుర్రె అంటాడు … ఇది చిన్నప్పుడు చదివిన జోక్ … ఈ జోక్ ప్రాణం పోసుకొని కళ్ళ ముందు కనిపిస్తే ? 1987లో ఆంధ్రభూమి రిపోర్టర్ గా సంగారెడ్డిలో … అప్పుడే అయూబ్ ఖాన్ […]
ప్రజాస్వామిక సర్పయాగం అనబడు కన్నడ పాముల కథ…
Snake – Sentiment: తమిళంలో “గరుడా! సౌఖ్యమా?” అని ఒక సామెత. పద్నాలుగు లోకాల్లో ఆగకుండా తిరిగిన విష్ణు మూర్తి వైకుంఠంలో దిగి…తన వాహనం గరుత్మంతుడికి వీక్లి ఆఫ్ సెలవు ఇచ్చాడు. మనోవేగం కంటే వేగంగా తిరగడంతో ఒళ్లు వేడెక్కింది…అలా చల్లగా హిమాలయాల కూల్ కూల్ కులూ మనాలి కాశ్మీర పర్వత సానువుల రిసార్టులో సేద తీరుదామని బయలుదేరాడు గరుత్మంతుడు. పైన దూది కొండల్లాంటి చల్లటి మేఘాలు, కింద వెండి కొండల్లాంటి మంచు పర్వతాలు. ప్రకృతి పరవశ గీతం పాడుతోంది. గరుత్మంతుడు ఒళ్లు […]
బంగారం కూడా తినేస్తున్నాం… మన ‘ఘన ఖనిజ ఆహార వైభోగం’ అట్లుంటది మరి…
Eatable Gold: “లక్షాధికారి అయినా లవణమన్నమె కానీ… మెరుగు బంగారంబు మ్రింగబోడు” అని ధర్మపురి నరసింహ స్వామి గుడి మెట్ల మీద కవి శేషప్ప కొన్ని శతాబ్దాల క్రితం అమాయకంగా అనుకున్నాడు. లక్షాధికారులు మెరుగు బంగారం మింగబోయే రోజులొస్తాయని కవి శేషప్ప ఊహించి ఉండడు. ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకులకు పెట్టింది పేరు. అక్కడి పూతరేకుల తయారీ రాకెట్ సైన్స్ కంటే గొప్పదని అనాదిగా కథలు కథలుగా లోకం చెప్పుకుంటోంది. చక్కర, బెల్లం, ఖర్జూరం, డ్రయి […]
ఓ రాజకీయ పార్టీ… పుట్టనేలేదు, ఆవిర్భావ సమావేశమే చివరి సమావేశం…
Murali Buddha………. మేధావులు పార్టీ పెడితే …. ఓ జ్ఞాపకం అసలే ఎన్నికల కాలం ఇప్పుడు ఎవరికి కోపం వచ్చినా , ఎవరికి సంతోషం వేసినా , ఎవరు ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వకపోయినా కొత్త పార్టీ పుడుతుంది . మంచి హోటల్ లో ఐదారుగురు కుటుంబ సభ్యులు డిన్నర్ కు వెళితే పది వేల బిల్ అవుతుంది . అలాంటిది ఓ పది వేల ఖర్చుతో ఒక రాజకీయ పార్టీని ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ […]
2 లక్షల కోట్ల స్టీల్ ప్లాంటుకు… 10 కోట్ల టర్నోవర్ కంపెనీతో బిడ్ వేస్తాడట సారు..!!
Neelayapalem Vijay Kumar………… బాబూ లక్ష్మి నారాయణ గారూ … విశాఖ స్టీల్ కోసం ఈ ‘బిడ్’ డ్రామాలు ఏంటి? ఆంధ్రులని ఇలా కూడా బ్రతకనిచ్చే ఉద్దేశ్యం లేదా ? FY 2021-22 లో రూ. 28,500 కోట్ల turnover తో వున్న Vizag Steel ను విజయవాడ కు చెందిన Venspra Impex అనే proprietary concern -. పోతిన వెంకట రామారావుతో కొనిపిచ్చేస్తావా ? అసలా VENSPRA ఇంపెక్ ఏమి చేస్తుందో తెలుసా సారూ […]
మూసీ గుండె చెరువు… బతుకు ఓ డ్రైనేజీ ప్రవాహం… ఓ డంపింగ్ యార్డ్…
Water Ponds to Drain Canals: “అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము; చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ” తెలుగు మీడియం మాత్రమే తెలిసిన అనాది కాలంలో ఒకటి, రెండో తరగతుల్లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పద్యమిది. అప్పిచ్చువాడు తరువాత కామాను గుర్తించని లోకం వైద్యుడికి అది విశేషణ పూర్వపదకర్మధారయంగా అనుకుని వైద్యులంటే రోగులకు అప్పిచ్చేవారని అపార్థం చేసుకుంది. వేదాంత దృక్కోణంలో వైద్యులు అప్పు చేయించేవారే అవుతారు కానీ, అప్పిచ్చేవారు కాదు. అయినా మన గొడవ […]
స్నో పౌడర్ల దందానూ వదలని ముఖేషుడు… అంబానీ అంటేనే అన్నీ…
Beauty of Business: భారతదేశంలో మొహానికి పూసుకునే పౌడర్లు, స్నోలు, గ్లోలు, వైటెనింగ్ క్రీములు, యాంటీ ఏజింగ్ క్రీములు, ఇతర సౌందర్య సాధనాల మార్కెట్ విలువ ఏటా రెండు లక్షల ఇరవై అయిదు వేల కోట్ల రూపాయలేనట. రెండు, మూడు రాష్ట్రాల వార్షిక బడ్జెట్లకన్నా ఇది ఎక్కువే. మింగ మెతుకు లేకపోయినా…మీసాలకు సంపెంగ నూనె పూయాల్సిందే కాబట్టి మరో పదేళ్లలో ఈ ఉత్పత్తుల అమ్మకం విలువ ఏటా అయిదు లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదట. ఇది ఆయా ఉత్పత్తులు […]
ఈనాడు మీద పోరాటంలో ప్రెస్ కౌన్సిల్ ను షేక్ చేశాడు…
eenadu tears
కన్నడ ప్రతిపక్షాల నెత్తిన అమూల్ పాలధార
Palu – Pali’trick’s: పల్లవి:-పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ-పాలిటి దైవమని బ్రహ్మాదులు చరణం-1రోల గట్టించుక పెద్ద రోలలుగా వాపోవుబాలునిముందర వచ్చి పాడేరుఆలకించి వినుమని యంబర భాగమునందునాలుగుదిక్కులనుండి నారదాదులు చరణం-2నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితోపారేటిబిడ్డనివద్ద బాడేరువేరులేని వేదములు వెంటవెంట జదువుచుజేరిచేరి యింతనంత శేషాదులు చరణం-3ముద్దులు మోమునగార మూలల మూలలదాగె-బద్దులబాలుని వద్ద బాడేరుఅద్దివో శ్రీతిరువేంకటాద్రీశు డితడనిచద్దికి వేడికి వచ్చి సనకాదులు అన్నమయ్య 32 వేల కీర్తనల్లో ఒక కీర్తన ఇది. పదాలతో చిత్రాలను, కదిలే దృశ్యాలను; సామాన్యమయిన మాటలు, […]
ఆవకాయ… ఓ రసనానంద యాగం… పెద్ద జిహ్వానంద కేళి… రసబ్రహ్మోత్సవం…
ఆవకాయ మన అందరిది..!! దీనిని పేరాల భరత శర్మ రాశారు.., తప్పకుండా చదవండి.., ఆ భాష ఆ భావ వ్యక్తీకరణ బాగుంది.., చాలా బాగుంది… కవి సామ్రాట్ విశ్వనాథ వారు ఆవకాయ కోసం మామిడికాయలు తరగడం ఫొటోను సామాజిక మాధ్యమాల్లో మనమందరం చూసే ఉంటాం. వారి ప్రియశిష్యుడు అష్టావధాని పేరాల భరతశర్మ కూడా తక్కువేం కాదు. వారి తనయుడు పేరాల బాలకృష్ణ, తండ్రి గారి సునిశిత పర్యవేక్షణలో వారింట్లో ప్రతి సంవత్సరం జరిగే ఆవకాయ పండుగను అద్భుతంగా […]
టైముకు ఏమున్నా లేకున్నా యింత తొక్కో కారమో ఏస్కొని బుక్కెడన్నం తింటే సాలు
Vijayakumar Koduri………. బియ్యం బస్తాలు ……… ఇస్త్రీ షాపు దగ్గర ఐరన్ చేసిన డ్రెస్సులు తీసుకోవడానికి నిలబడ్డాను – షాపు ఓనరు, అతని మిత్రుడు మాట్లాడుకుంటున్నారు. ‘ఈసారి బియ్యం బస్తాల కోసం అడిగితే కింటాలు నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నరే! కరోన తర్వాత అడ్డగోలు రేట్లు చెప్తున్నరు’ ఓనరు తన మిత్రునితో అన్నాడు ‘ఔ – బియ్యం బాగ పిరమైనయ్యే! పోయిన వారమే నేను తీసుకున్న. నలబయి ఆరొందలు పడింది. వాళ్ళను అడిగి జెప్త తియ్’ […]


















