Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం మిరయ్… ఆ నిర్మాతలు ఎవరో గానీ… థియేటర్ వెళ్లే పనిలేదు..!!

September 14, 2025 by M S R

mirai movie review

. ఫాఫం మిరయ్… నిర్మాతలు ఎవరో గానీ… తక్కువ ఖర్చుతోనే కల్కి, హరిహరవీరమల్లు, ఆదిపురుష్ తదితర సినిమాల క్వాలిటీలను మించిన గ్రాఫిక్స్ సినిమాను నిర్మించారు సరే… ఆ దర్శకుడు ఎవరో గానీ… గతంలో ఏం తీశాడో, ట్రాక్ రికార్డు ఏమిటో గానీ… గ్రిప్పింగ్ కథనం, కథనంపై గ్రిప్పు సూపర్బ్… ప్రతి సీనులోనూ తన ప్రతిభ కనిపించింది… ఈ దెబ్బకు మరికొన్ని సినిమాలు గ్యారంటీ, తన లైఫ్ సెటిల్… ఫాఫం అని ఎందుకు అన్నానంటే..? అమెరికా వంటి దేశాల్లో […]

నేపాల్ అల్లర్ల విశ్లేషణలోనూ… అదే యాంటీ- జగన్, అదే ఆవు వ్యాసం…

September 14, 2025 by M S R

aj rk

. ఈమధ్య… కాదు, చాన్నాళ్లుగా… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాసాలు ఆవుకథలు అవుతున్నాయి… ఈరోజూ అదే ధోరణి… తనలోని పాత్రికేయుడి పాత్రికేయ విజ్ఞత కనుమరుగవుతూ పక్కా జగన్ ద్వేషి మాత్రమే బలంగా ప్రదర్శితం అవుతున్నాడు… సోమాలియా ఆకలిచావులు, ఉక్రెయిన్ యుద్దం, అమెరికా డ్రగ్ కార్టెల్స్, పాలస్తీనా కష్టాలు దగ్గర నుంచి… ప్రపంచంలో ఏం జరిగినా… దాన్ని అర్జెంటుగా జగన్‌కు ముడివేసి ఏవో జగన్ వ్యతిరేక కథలు చెప్పడం అలవాటైపోయింది ఫాఫం… ఎస్, జగన్ పార్టీ అడ్డదిడ్డం విధానాలు, పాలన […]

‘కూలీ’ ఇచ్చి మరీ… కొరడాలతో కొట్టించుకోవడమంటే ఇదే…

September 14, 2025 by M S R

coolie

. ఈమధ్య ఒక సర్జరీ జరిగి దాదాపు వారంపాటు ఇంట్లో ఉండాల్సి వచ్చింది. పెయిన్ కిల్లర్లు, నిద్రపట్టే మందులు వాడడంవల్ల పగలుకూడా పడుకున్నట్లే ఉంటుంది. ఆసుపత్రి నుండి డిస్ చార్జ్ అయ్యేప్పుడు సాహిత్యశాస్త్రంలో కూడా అందె వేసిన చేయి అయిన నా శ్రేయోభిలాషి సర్జన్ సకల జాగ్రత్తలు చెప్పాడు. బరువులు ఎత్తవద్దు. కఠినమైన పదార్థాలు తినవద్దు. ఒక వారం తరువాత కట్లు తీద్దాం- అని. డాక్టర్ల మాటవింటే రోగులం ఎందుకవుతాం? ఒకరోజు సాయంత్రం నొప్పిగా, విసుగ్గా ఉండి […]

భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… బీమా భరోసాలే కాదు, ఈ జాగ్రత్తలూ ముఖ్యమే…

September 13, 2025 by M S R

life

. నిజానికి ఈ పోస్టు బాగా వైరల్… ఎవరు రాశారో తెలియదు గానీ సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది… ఓసారి చదవండి… అందరికీ నమస్కారం ఇది చాలామందికి ఉపయోగపడే విషయం. ఇది ఒక భార్య తన భర్త అకాల మరణం తరువాత రాసిన భావోద్వేగభరితమైన, భావప్రదమైన, జీవితాన్ని నేర్పే ఉత్తరం… దయచేసి దీన్ని పూర్తిగా చదవండి మరియు అవసరమైన వారికి షేర్ చేయండి. — ఒక భార్య రాసిన ఉత్తరం – భర్త యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత […]

గుడిమల్లం..! ఉల్కశిల నుంచి చెక్కిన తొలి శివలింగ మూర్తి..?!

September 12, 2025 by M S R

gudimallam

. Narendra Guptha…   గుడిమల్లం… తిరుపతి నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది ఈ ఊరు. ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా ఈ గుడి దర్శనం కలగదు అంటుంటారు. తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళలేరు చాలామంది. మేము మొదటిసారి వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్ దెబ్బేసింది. అయినా వదలలేదు. మ్యాప్ ను మాన్యువల్ గా పరిశీలించి వెళ్ళాం. మేం వెళ్ళేసరికి రాత్రి 7 దాటింది. గుడి బంద్ అయిపోయింది. గేట్ తాళాలు వేసి ఉన్నయ్.. చాలా […]

ఒక మీడియా హౌజ్… ఆఫీస్ క్లోజ్… అందరూ కలం పోరాటయోధులే మరి..!!

September 12, 2025 by M S R

media

. Murali Buddha …. జర్నలిస్ట్ కథలు 1 …. రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వలేక పోతున్నాం . మా బాధలు అర్థం చేసుకోండి … అంటూ ఆ బాస్ దీనంగా తన మీడియా సంస్థ దీన కథ చెబుతూ పోతున్నాడు … బాస్ చెప్పడం ముగియక ముందే ఓ పాలమూరు బిడ్డ లేచి… సార్, మీరు ఇంతగా బాధ పడడం ఎందుకు ? మనం ప్రపంచ సమస్యలు పరిష్కరించే వాళ్ళం . మేధావులకు దారి చూపే […]

ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనగా… ప్రయోగశాలల్లో పెంచబడిన వజ్రాలు…

September 12, 2025 by M S R

savarna

. బొగ్గు కొన్ని వేల, లక్షల ఏళ్ళు భూమి పొరల్లో రూపాంతరం చెందితే వజ్రమవుతుందని ఒక నమ్మకం అనాదిగా ఉంది. వజ్రంలో ఉన్న కర్బన పదార్థం బొగ్గులో ఉన్న కర్బన పదార్ధం ఒకటి కాదని శాస్త్రవేత్తల వివరణ. అయినా తులం బంగారమే లక్ష దాటినవేళ వజ్రాల విలువ, తయారీ గురించి మనకెందుకు? అందుకే భూమిలో దొరికే సహజమైన వజ్రాలను వదిలి కృత్రిమంగా ప్రయోగశాలల్లో తయారుచేసిన “ల్యాబ్ గ్రోన్ డైమండ్స్” వెంట పడుతున్నాం. కంచు మోగునట్లు కనకంబు మోగునా? […]

బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…

September 11, 2025 by M S R

jhumka

. అదేదో దాసరి సినిమాలో మోహన్‌బాబు, సుజాత పాట… ఉంగరం పడిపోయింది, పోతే పోనీ పోతే పోనీ… సేమ్, అప్పట్లో… 1966లో… మేరా సాయా అనే ఓ హిట్ సినిమా… మిస్టరీ, డ్రామా కథాంశమే కాదు, ఒక పాట సూపర్ హిట్… ఝుమ్కా గిరారే బరేలీ కే బజార్ మే… (బరేలీ మార్కెట్‌లో ఝుమ్కా పడిపోయింది… చెవి కమ్మ, రింగు…) హీరోయిన్ తన ఝుమ్కాను బరేలీ మార్కెట్‌లో పోగొట్టుకుంటుంది అని అర్థం… 54 సంవత్సరాలు వేగంగా గడిచిపోయాయి… ఆ […]

2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?

September 11, 2025 by M S R

trump

. చంద్రగ్రహణం ప్రపంచంలోని నాలుగు దేశాల ప్రధానులు రెండు రోజుల్లో తమ పదవుల్ని కోల్పోయేలా చేసింది… ఇక సూర్యగ్రహణం వంతు..? మోడీయేనా..? ట్రంపుడా..? ఇప్పుడు ఈ చర్చ వైరల్ అవుతోంది… దీనికి కారణం భారతీయ వ్యాపారి హర్ష గోయెంకా పెట్టిన ఓ పోస్టు… తను ఏమంటాడంటే..? ‘‘రెండు రోజుల్లోనే… జపాన్ పీఎం దిగిపోయాడు, ఫ్రాన్స్ పీఎం దిగిపోయాడు, నేపాల్ పీఎం దిగిపోయాడు, థాయ్‌లాండ్ పీఎం దిగిపోయాడు… ఇప్పుడు అందరికన్నూ సూర్యగ్రహణంపైనే… ఓ పేద్ద నారింజనేత..?’’ Orange Man, […]

శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…

September 11, 2025 by M S R

ads

. భాష ఏదయినా భాషే. మాట్లాడే భాషకంటే రాసే భాష కొంచెం ఫార్మల్ గా, కర్త కర్మ క్రియా పదాలు సరయిన అన్వయంతో ఉండాలి. మామూలుగా రాసే భాషతో పోలిస్తే ప్రకటనల్లో భాష ఇంకా అందంగా ఉండాలి. తక్కువ మాటల్లో ఎక్కువ సమాచారమివ్వాలి. పాఠకుడిని ఆకట్టుకోవాలి. కళ్లను కట్టి పడేసేలా డిజైన్ ఉండాలి. యాడ్ చూశాక ఆ వస్తువును తప్పనిసరిగా కొనాలి అనిపించేలా ఆ యాడ్ లో భాష, భావం, డిస్ ప్లే ఉండాలి. కంపెనీల నిర్లక్ష్యమో, […]

‘‘నీ పేరే పెట్టుకున్నాం, మా డ్రగ్ రాకెట్‌ను ఆశీర్వదించు మాతా…’’

September 10, 2025 by M S R

drugs

. వాల్మీకి రామాయణం సుందరకాండ. సీతాన్వేషణలో భాగంగా వంద యోజనాల సముద్రం దాటి…చీకటి పడేవరకు ఆగి…పిల్లి పిల్లంత రూపంలోకి మారి…రావణుడు నిద్రిస్తున్న పుష్పకవిమానంలోకి వెళతాడు హనుమంతుడు. ఆ పుష్పక విమానం నేలను తాకకుండా గాల్లో తేలుతూ ఉంటుంది. అది ఒక పెద్ద నగరమంత విమానం. మందు విందు పొందులతో, గానా బజానాలతో అలసి ఒళ్ళుమరచి నిద్రిస్తున్నాడు రావణుడు. అక్కడ గదుల్లో మాంసాహారాలు, మద్యం రకాలు ఎన్నెన్ని ఉన్నాయో వాల్మీకి నిర్మొహమాటంగా పద్దు రికార్డు చేశాడు. మన మందు […]

కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…

September 9, 2025 by M S R

kavitha

. జస్ట్ ఓ షర్మిలలాగే మిగిలిపోతుందా..? కవిత ఇంపాక్ట్ ఏమైనా తెలంగాణ రాజకీయాలపై, ప్రత్యేకించి బీఆర్ఎస్ మీద ఉంటుందా..? కేసీయార్ తేలికగా కొట్టిపడేస్తున్నాడు గానీ… కవిత ప్రభావమే ఉండదా.,.? సోషల్ మీడియాలో ఆమె మీద దుష్ప్రచారం సాగుతోంది… ఆమె సోషల్ మీడియా కూడా ఎదురుదాడి చేస్తోంది… రోజుకొకరి బట్టలు విప్పుతోంది ఆమె టీమ్.,. కేసీయార్ చుట్టూ ఉన్న దెయ్యాలెవరో కూడా తేటతెల్లం చేస్తోంది… ఈ స్థితిలో తెలంగాణ రాజకీయాలపై కవిత ప్రభావం అనే అంశంపై VOTA media […]

మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!

September 9, 2025 by M S R

NEPAL

. కాదు, సోషల్ మీడియా యాప్స్‌ను నిషేధించడం వల్ల మాత్రమే జనం తిరగబడటం లేదు… అది జస్ట్, ఒక వత్తి… అది అంటించారు… జనంలో ఆగ్రహం, అసహనం ఉడికిపోెతున్నాయి చాన్నాళ్లుగా… అదిప్పుడు బయటపడింది… అంతే… అప్పట్లో 2022లో శ్రీలంక, 2024లో బంగ్లాదేశ్, ఇప్పుడు 2025లో నేపాల్…. మరీ నేపాల్‌లో అధ్యక్షుడి ఇంటిని తగులబెట్టారు… ఓ మంత్రిని వీథుల్లో ఉరికిస్తూ కొట్టారు.,. అధికార పార్టీ ఆఫీసుకు అగ్గిపెట్టారు.,. ప్రభుత్వ భవనాలు మండిపోతున్నాయి… ప్రధాని రాజీనామా చేసి దుబయ్ పారిపోవడానికి […]

ఆనందశాస్త్రం..! science of happiness … సిలబస్‌లో ఉండాల్సిన సబ్జెక్టు..!

September 9, 2025 by M S R

science of happiness

. ఆనందం; పరమానందం; బ్రహ్మానందం- మాటలకు వేదాంత కోణంలో వేరే అర్థాలున్నా – మనం లౌకిక అర్థమే తీసుకుందాం. ఆనందం వెతుక్కోవడంలోనే మనం తికమకపడుతుంటాం. ఆనందం కానిది ఆనందం అనుకుని పరుగులు తీస్తుంటాం. జీవితం ఎప్పుడూ సరళరేఖ కానేకాదు . ఒకేవేగం , ఒకే పద్ధతిలో వెళ్ళదు . ఎగుడు దిగుళ్లు ; లాభనష్టాలు ; కష్టసుఖాలు సహజం . అయితే లాభమూ సుఖమూ ఆనందించదగ్గది – నష్టమూ కష్టమూ భరించకూడనిది అవుతుంది . ఇక్కడే వస్తోంది […]

అసలు కన్సల్టెన్సీ అనగానేమి..? నిజానికి అవి ఏమి చేయును..?

September 9, 2025 by M S R

consultancy

. ఎన్నికల వ్యూహాలకు కన్సల్టెన్సీలు… పథకాల రచనకు కన్సల్టెన్సీలు… ప్రతి శాఖలో కన్సల్టెన్సీలు… ఎక్కడ చూసినా కన్సల్టెన్సీలు… . ఓ బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజీకి ఓ ఫేమస్ కన్సల్టెంట్ వచ్చాడు ఏదో గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి… ఓ విద్యార్థి తననే అడిగాడు… ‘‘కన్సల్టెన్సీ అంటే ఏమిటి సార్..?’’ . ఏ మూడ్‌లో ఉన్నాడో గానీ కన్సల్టెంట్ కాస్త అర్థమయ్యేట్టుగానే చెప్పడానికి రెడీ అయ్యాడు… ఓ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు… . ‘పర్ సపోజ్, నా దగ్గరకు ఇద్దరు వ్యక్తులు […]

ఇచ్చట అన్ని పళ్లూ సరసమైన ధరలకు ఊడపీకబడును..!

September 8, 2025 by M S R

dentist

. అమెరికాలో మాంచి ఐటీ కొలువు చేస్తుంటాడు మన హైదరాబాదీ ఒకాయన… పఠనాసౌలభ్యం కోసం తన పేరు యాదగిరి అనుకుందాం… ఓరోజు పరుగుపరుగున ఓ డెంటిస్టు దగ్గరకు వెళ్లాడు… సమయానికి వేరే రోగులెవరూ లేరు, అందుకని ముందస్తు అపాయింట్‌మెంట్ లేకపోయినా టైం ఇచ్చాడు సదరు డెంటిస్టు… ఎందుకైనా మంచిదని యాదగిరి ముందే అడిగాడు, పన్ను నొప్పితో మాట్లాడలేకపోతున్నాను అంటూ కాగితంపై రాసి చూపించాడు… ఎంత తీసుకుంటారు డాక్టర్ గారూ అని…! నిజమైన హైదరాబాదీ ఎవరైనా అంతే కదా… […]

ఒరేయ్ గుండూ… బట్టతలపై బొచ్చు పెంచే మందొచ్చిందటరా…

September 8, 2025 by M S R

bald head

. “ధర ఖర్వాటుడొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడై
త్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ తాళ ద్రుమచ్ఛాయ త
చ్ఛిరమున్ తత్ఫల పాత వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగా
బొరి దైవోపహతుండు వోవు కడకుం పోవుంగదా యాపదల్!” అర్థం:- ఒక తళతళలాడే బట్టతల వాడు నెత్తిమీద ఎండ వేడికి మాడి మసై పోతున్నాడు. కాళ్లకింద కూడా వేడి. ఎటు చూసినా ఎడారి. దూరంగా ఒక తాటి చెట్టు కనిపించింది. త్వర త్వరగా పరుగెత్తి…చెట్టుకు అనుకుని కొద్దిపాటి నీడలో నిలుచున్నాడు. ఆ చిన్న […]

అగ్నిపరీక్ష ఓ చెత్త తంతు… 3 గంటల లాంచింగే జీరో జోష్ నాగార్జునా…

September 8, 2025 by Rishi

bb9

. నిజానికి బిగ్‌బాస్ మీద ఈసారి పెద్ద ఆసక్తి ఏమీ లేదు ఎవరికీ… గత రెండుమూడు సీజన్లను భ్రష్టుపట్టించారు… రేటింగ్స్ దారుణంగా వచ్చాయి… బిగ్‌బాట్ క్రియేటివ్ టీమ్స్ అట్టర్ ఫ్లాప్… ఇదీ అసలు రియాలిటీ… మరీ లాస్ట్ సీజనయితే మరీ ఘోరం… ఈ నేపథ్యంలో ఏదో ఓ ప్రయోగం, కొత్త దనం కావాలని ప్లాన్ చేశారు… లేకపోతే ఈసారి మరీ ఘోరంగా ఉంటుందని భయం… అందుకని డబుల్ హౌజ్, డబుల్ డోస్ అన్నారు… చదరంగం కాదు, రణరంగం […]

అదిప్పుడు క్రిమినల్ గ్యాంగుల స్వీడన్… కిశోర బాలికలే గ్యాంగ్‌స్టర్లు…!

September 7, 2025 by M S R

teenage crimes

. స్వీడన్ అనగానే మనకు అందమైన దేశం… నేరాలు పెద్దగా లేని ఆనంద సమాజం గుర్తొస్తాయి కదా… ప్రత్యేకించి స్కూలింగ్ ఆడపిల్లలు అంటే అప్పుడప్పుడే టీన్స్‌లోకి ప్రయాణించే అమాయకపు మొహాలు గుర్తొస్తాయి కదా… కానీ సీన్ మారుతోంది… భిన్నమైన సీన్స్ కనిపిస్తున్నాయి… స్వీడన్ ప్రశాంతత ఎగిరిపోతోంది… గ్యాంగ్ వాార్స్ రోజువారీ వార్తలు అయిపోయాయి… కాల్పులు, బాంబు దాడులు తరచూ జరుగుతున్నాయి… ఈ నేర చిత్రానికి మరో చీకటి కోణం ఏమిటంటే..?  పదిహేనేళ్లలోపు బాలికలు కూడా గ్యాంగ్‌ల కోసం […]

అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!

September 7, 2025 by M S R

sadguru

. మనం చెప్పుకోవడం మరిచిపోయాం… అది సద్దురుగా పిలవబడే జగ్గీ వాసుదేవ్, ఇషా ఫౌండేషన్ సృష్టికర్త చేసిన కైలాస యాత్ర… అదేమిటి… బోలెడు మంది వెళ్తుంటారు… సద్దురు టీమ్ ఏటా చాలామందిని మానస సరోవరం, కైలాస యాత్రలకు తీసుకెళ్తుంది కదా, తనూ వెళ్లాడు, విశేషం ఏమిటీ అంటారా..? విశేషమే… అది చెప్పుకోవడానికి ముందుగా… సద్దురు పర్సనల్ లైఫ్, ఆస్తుల సమీకరణ వంటి అంశాల్లో తన మీద నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి… జనంలో కూడా ఎన్నాళ్లుగానో అవి […]

  • « Previous Page
  • 1
  • …
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • …
  • 140
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • కొన్ని సినిమా ప్రయోగాల్ని రామోజీరావే చేయగలిగాడు… కానీ..?
  • అస్తవ్యస్తత..! సినిమాలపై తెలంగాణ ప్రభుత్వ విధానరాహిత్యం..!!
  • ఇక్కడ అత్యంత భారీ విగ్రహం… అక్కడ ఓ జ్ఞాపకం తెగనమ్మకం…
  • బెంగాల్ ‘శివగామి’ స్ట్రీట్ ఫైట్… ఆ ఆకుపచ్చ ఫైలులో అసలు మర్మమేంటి..!?
  • రానున్న 48 గంటలు అత్యంత కీలకం – మధ్యప్రాచ్యం మండిపోతోంది
  • టాక్సిస్ పారడాక్స్..! ఓ అశ్లీల వ్యతిరేకి దాన్నే ఆశ్రయించడం..!!
  • యాదాద్రి, భద్రాద్రి… తెలంగాణ నెత్తిన రెండు తెల్ల ఏనుగులు…
  • సుహాసిని సరే… యాంగ్రీ రాజశేఖర్ శాకాహార సినిమాలూ చేయగలడు…
  • మర్యాద రేవంతన్న..! గౌరవనీయ కేసీయార్..! ప్రొటోకాల్ పాలిటిక్స్..!!
  • ది రాజా సాబ్..! ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్‌కూ మారుతి బలమైన దెబ్బ..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions