ఉద్యోగ పర్వం: భారత దేశం……. అమెరికాలో నిన్న ఒక ఇండియన్ పిలగాడు *నన్ను ఉద్యోగం నుంచి తీసి ఆ ఉద్యోగాన్ని ఇండియాలో ఉన్న ఇండియన్స్ కి ఇచ్చారు అని* ఒక వీడియో చేస్తే వైరల్ అయ్యింది. ఆ పిలగాడు అమెరికాలో పుట్టిన ఇండియన్ పిలగాడులా ఉన్నాడు కానీ ఇండియాలో పుట్టిన ఇండియన్ లా లేడు. ఆ విషయం పక్కన పెడితే అమెరికాలో ఏవరేజ్ న ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి 120K – 150K డాలర్లు […]
పెద్దలకు లక్షల కోట్ల అప్పులు రద్దు… పేద రైతుల భూస్వాధీనాలు…
పల్లవి :- పల్లెల్లో కళ ఉంది – పంటల్లో కలిముంది అని చెప్పే మాటల్లో విలువేముంది ? కళ్ళల్లో నీరుంది – ఒళ్ళంతా చెమంటుంది ఆ చెమ్మకు చిగురించే పొలమే ఉంది చరణం 1 చినుకివ్వని మబ్బుంది – మొలకివ్వని మన్నుంది కరుణించని కరువుంది – ఇంకేముంది ? రైతేగా రాజంటూ అనగానే ఏమైంది ? అది ఏదో నిందల్లే వినబడుతోంది అనుదినం ప్రతి క్షణం బదులేమివ్వని ప్రశ్నగా మారెనే కొడవలి ? పైరుకా , పురుగుకా […]
ఎవరీమె..? హఠాత్తుగా మీడియా ఫోకస్… వివరాల నెట్ సెర్చింగ్…!
ఎవరీమె..? పేరు ముప్పాళ్ల స్నిగ్ధ దేవి… Muppala Snigdha Devi… నిన్న ఒకటే సెర్చింగు… చాలా మీడియా సంస్థలు ఆమె గురించి రాసుకొచ్చాయి… హఠాత్తుగా ఆమె మీద మీడియా ఫోకస్ పడింది ఎందుకో అర్థం కాదు… కాకపోతే ఆమె ఇప్పుడు బాగా వెలుగులోకి వచ్చిన అమెరికా క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్ సౌరభ్ నేత్రవల్కర్ భార్య… ఆయన గురించి సెర్చింగులో తన భార్య పేరు గట్రా కనిపించి, ఆమె వివరాల్లోకి వెళ్లి, ఆమె కెరీర్ కూడా ఇంట్రస్టింగుగా […]
తెలుగు ఇండియన్ ఐడల్… టాప్ 12 ఎంపికలో ఏవో ఎమోషన్స్…
35 కోట్లు ఖర్చు అట… కొంత అసాధారణం అనిపిస్తున్నా సరే… ఖర్చు మాత్రం భారీగా పెడుతున్నారనేది నిజం… ఆహా ఓటీటీ వాళ్లు తెలుగు ఇండియన్ ఐడల్ కోసం..! ఆర్కెస్ట్రా, థమన్, కార్తీక్, శ్రీరామచంద్ర, గీతామాధురిలకు ఇచ్చే రెమ్యునరేషనే చాలా ఎక్కువ ఈ ఖర్చులో… ఇవిగాకుండా ఆడిషన్స్ ఏర్పాట్లు, ప్రతివారం షూటింగ్ ఎట్సెట్రా… సరే, ఆమేరకు యాడ్స్, స్పాన్సరర్స్ కూడా బాగానే ఉన్నట్టున్నయ్… ఎటొచ్చీ… మొదటి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి గాయకులకు ఏవైనా ఇన్స్ట్రుమెంట్లలో ప్రవేశం ఉంటే […]
ఏనుగులకూ వేర్వేరు పేర్లుంటయ్… అవి వాటితోనే పలకరించుకుంటయ్…
పేర్లు పెట్టి పిలుచుకునే ఏనుగులు… మనుషులే ఎందుకు మాట్లాడుతున్నారు? జంతువులు, పక్షులు, క్రిమి, కీటకాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి? అని శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకోగా…కొట్టుకోగా… తేలిందేమిటయ్యా అంటే- మనుషుల్లో మాత్రమే “స్వర త్వచం” ఏర్పడిందని. మిగతా ఏ ప్రాణుల్లో స్వర త్వచం ఏర్పడలేదని. స్వర తంత్రులకు కొనసాగింపుగా అదే ప్రాంతంలో రిబ్బన్ లా ఉండే ఒక అవయవ నిర్మాణాన్ని స్వర త్వచం అంటారు. జపాన్ టోక్యోలో సెంటర్ ఫర్ ఎవల్యూషనరీ ఆరిజిన్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ లో […]
సింపుల్… ఇది బాహుబలి మార్క్ మంచు కన్నప్ప చరిత్ర..!!
టీజరో, ట్రెయిలరో… అది చూస్తుంటే హాశ్చర్యం… సింపుల్గా అర్థమైంది ఏమిటీ అంటే… మంచు విష్ణు బాహుబలి, మగధీర తరహాలో ఓ పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు… భారీగా ఖర్చు పెడుతున్నాడు… కానీ అది తను కొత్తగా రాయిస్తున్న కన్నప్ప చరిత్ర… అది మంచు కన్నప్ప చరిత్ర… కన్నప్ప ఎవరు..? తెలుగువాడు… బోయ… రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరు… అసలు పేరు తిన్నడు… తల్లిదండ్రులు భక్తులు… వేట వారి వృత్తి… ఓసారి తిన్నడు ఓ పందిని వేటాడుతూ కాళహస్తి గుడి […]
సేతుపతీ… ఇదే కదా నీ నుంచి ఆశించే పాత్ర… ఇరగదీశావ్ బ్రో…
విజయ్ సేతుపతి… మంచి నటుడు… డౌట్ లేదు, కాకపోతే మొహమాటాలకో, స్నేహం కోసమో అప్పుడప్పుడూ ఏవో పిచ్చి పాత్రలు చేసి విసిగిస్తుంటాడు… కానీ సరైన పాత్ర పడాలే గానీ ఎమోషన్స్ పండించడానికి, తనదైన నటన ప్రతిభను ప్రదర్శించడానికి తిరుగుండదు… ఇప్పుడు కొత్తగా వచ్చిన తన సినిమా… తనే ప్రధాన పాత్ర… సహాయ పాత్ర కాదు, విలన్ కాదు, సైడ్ కేరక్టర్ అసలే కాదు… ఆ పాత్రలోకి దూరిపోయాడు.,. తనకుతోడుగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నెెగెటివ్ షేడ్స్ […]
ఉఛ్వాసంలోని ఆ హేమంత పవనం నిశ్వాసంలో గ్రీష్మమవుతోంది..!
(‘పోకిరీ’ సినిమాలో ఇలాంటి సిన్ ఉంది గానీ ఇది వేరే) “…ప్రొద్దున్నవరకూ ఇది కదలదు-” అన్నాడు రవితేజ బలంగా బెల్ నొక్కుతూ. లిఫ్ట్ కదల్లేదు! ప్రియవద అయోమయంగా అతడి వైపు చూసింది. మొదటి అంతస్తు వరండాలోంచి వచ్చే గాలి, లిఫ్ట్ ఇనుప వూచలగుండా రివ్వున లోపలికి వస్తూంది. వరండా వెలుతురు కాళ్ళ మీద పడుతోంది. “ “ఇప్పుడేమి చెయ్యటం?” అంది ఆందోళనగా. “చెయ్యటానికేమీ లేదు. ఎవరికైనా పైకి వచ్చే అవసరం ఉ౦డి. మళ్ళీ లిఫ్ట్ ఉపయోగిస్తే తప్ప […]
డబ్బు సంపాదన మాత్రమే కాదు… సరైన ఖర్చు కూడా ఓ కళ…
ఫైనాన్సియల్ హెల్త్ – నా వ్యక్తిగత అనుభవం/అభిప్రాయం “ఆలోచించు, శ్రమించు, కొత్త దారి అన్వేషించు.. అప్పుడే జీవితంలో వృద్ధిలోకి వస్తావు” అంటాడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్. “నీవు దేని గురించి అయినా ఆలోచించాల్సి వస్తే అది డబ్బు గురించే అయి ఉండాలి, డబ్బు సంపాదన గురించే అయి ఉండాలి” అంటాడు ప్రపంచంలోని అతి పెద్ద రీటైల్ సంస్థ అయిన వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శ్యాం రాబ్సన్ వాల్టన్ గారు. నేను అయితే, […]
ఆమె వాయులీనంలో లీనం కావల్సిందే ముగ్ధులమై… భేష్ కామాక్షీ..!
మామూలుగా సినిమా ఫంక్షన్లు అంటేనే బోలెడంత హిపోక్రసీ… స్వకుచమర్దనాలు… కీర్తనలు, ఆహాలు, ఓహోలు, చప్పట్లు, ఫ్యాన్స్ కేకలు గట్రా… అదో ప్రపంచం… సినిమా పిచ్చి ఉన్నవాళ్లకు వోకే గానీ మిగతా ప్రేక్షకులకు బోర్, చికాకు, విసుగు… కానీ ఆహా ఓటీటీ ప్రతిష్ఠాత్మకంగా, భారీ వ్యయంతో, ప్రయాస పడి నిర్మించే తెలుగు ఇండియన్ ఐడల్ షో లాంచింగ్ కార్యక్రమం మాత్రం పూర్తి భిన్నంగా, ఆహ్లాదకరంగా అనిపించింది… అఫ్కోర్స్, ఇది రొటీన్ సినిమా ఫంక్షన్ కార్యక్రమం కాకపోయినా సరే… ఈ […]
పిల్లలకు దయ్యపు కథలు చెప్పేవాళ్లు చదవాల్సిన ట్రూ స్టోరీ..!!
(Srinivas Sarla) ….. ఇది కథ కాదు. 2016 లో మా మేనత్త కూతురి నుండి నాకొక ఫోన్ వచ్చింది . ఫోన్ లిఫ్ట్ చేసి హలొ అన్నాను, అటు నుండి ఏడుపు, ఏమైంది సునితక్క ఎందుకు ఏడుస్తున్నావ్ అన్నాను, బిడ్డకు జ్వరం వచ్చింది, ఫీట్స్ వస్తున్నాయ్ రా అని కంగారు పడుతూ చెప్పింది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఎడ్యుకేటెడ్ కాదు, తన కడుపులో పాప ఉండగానే భర్త కాలం చేసాడు.. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం […]
ఈ ఫోటో మనకు ఏం చెబుతోంది..? చదువు – విజయరహస్యమా..?!
సక్సెస్ అయ్యాక మనం రేంజ్ రోవర్ కార్ లో తిరిగినంత మాత్రాన కొత్తగా పెరిగే గౌరవం ఏమీ ఉండదు, నడుచుకుంటూ వెళ్ళినంత మాత్రాన తగ్గే మర్యాద కూడా ఏమీ ఉండదు. సక్సెస్ కావటం ముఖ్యం అది ఏ రంగం అయినా. చలి దేశాల్లో ఆ వాతావరణాన్ని తట్టుకోవటానికి కోట్లు వేసుకుంటారు. ఎండలు ఎక్కువ ఉండే శీతోష్ణ దేశాల్లో కూడా టైట్ జీన్స్, కోట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆనందంగా ఉంటే చెప్పులు లేకుండా రోహిణీ కార్తెలో […]
ఈ పాకిస్థానీ టెర్రరిస్టును 24 ఏళ్లుగా పోషిస్తున్నాం, ఈరోజుకూ సజీవుడే..!
డిసెంబరు 22, 2000… అంటే రెండు పుష్కరాలు గడిచిపోయాయి… అప్పుడు ఈ దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యతలపై దాడి అన్నట్టుగా ఎర్రకోటపై టెర్రరిస్టుల దాడి జరిగింది… ఈ దేశ ప్రతిష్ఠాత్మక, పురాతన చిహ్నాలపై దాడి ద్వారా దేశ రక్షణ, భద్రత వ్యవస్థలను అపహాస్యం చేసి, మాదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం, జాతిని భీతావహం చేయడానికి జరిగిన కుట్ర అది… ఆ దాడిలో ఎర్రకోటలో కాపలాగా ఉన్న రాజపుతానా రైఫిల్స్కు చెందిన ముగ్గురు భారతీయ ఆర్మీ సిబ్బంది […]
పాత సీఎం 24 ఏళ్ల ‘వర్క్ ఫ్రమ్ హోమ్’… కొత్త సీఎంకు ‘నో హోమ్’…
నవీన్ పట్నాయక్ అవమానకరమైన ఓటమిని పొందాడు… అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త నయం, లోకసభ ఎన్నికలకు సంబంధించి పరాజయం, పరాభవం కూడా…! సరే, అయిపోయింది… అందరూ తన వారసుడిగా చెప్పబడిన పాండ్యన్ అనే తమిళ మాజీ ఐఏఎస్ అధికారి పెత్తనం కారణంగానే ఈ ఓటమి అనే విమర్శలు వెల్లువెత్తాయి… ఒక అరవ మొహాన్ని, అంటే ఒడిశేతరుడిని నవీన్ వారసుడిగా చూడటానికి జనానికి ఇష్టం లేదు, అందుకే ఈ తిరస్కరణ అనే విమర్శలు ఒకవైపు… కాదు, అధికార యంత్రాంగంలో పాండ్యన్ […]
చదువులమ్మ చెట్టు నీడలో..! చెట్టు కింద చదువుతోనే జ్ఞానవికాసం..!
“చెట్టునై పుట్టి ఉంటే- ఏడాదికొక్క వసంతమయినా దక్కేది; మనిషినై పుట్టి- అన్ని వసంతాలూ కోల్పోయాను” -గుంటూరు శేషేంద్ర శర్మ భారత వైద్య పరిశోధన మండలి- ఐ సి ఎం ఆర్ ఒక సూచన చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మానసపుత్రిక అయిన శాంతినికేతన్ పద్ధతిలో ప్రకృతి ఒడిలో ఆరుబయట చెట్ల కింద తరగతులు నిర్వహించుకోవడం ఉత్తమమయిన మార్గమన్నది ఆ సూచనలో ప్రధానమయిన విషయం. చెట్ల కింద తరగతులను ఐ సి ఎం ఆర్ సిఫారసు చేయడానికి కారణాలు […]
‘యాదవ్’ కాదన్నా… తెలుగోడే కాదన్నా… వచ్చే ఆ గెలుపు ఆగిందా..?
మొన్నటి ఏప్రిల్ నెల వరకూ సత్యకుమార్ యాదవ్ అంటే గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో ప్రతి వారం నిలువు వ్యాసం రాసే (అది కూడా వై.సత్యకుమార్ పేరుతో) బీజేపీ నేతగానే తెలుసు. తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే సమయానికి ఈ వై సత్యకుమార్ దిల్లీలో ఉన్న తన పలుకుబడితో అనంతపురం జిల్లా ధర్మవరం టికెట్ బీజేపీ కేంద్ర నాయకత్వం ద్వారా సంపాదించడంతో అందరి దృష్టీ ఈ ‘యువనేత’పై పడింది. మాజీ ఉపరాష్ట్రపతి. […]
మెగా కంపౌండ్ కాదా…? అల్లు కంపౌండ్ వేరు- కొణిదెల కంపౌండ్ వేరా..?!
మెగా కుటుంబానికి దూరంగా అల్లు ఫ్యామిలీ..? మెగా కుటుంబానికి అల్లు ఫ్యామిలీ క్రమంగా దూరమవుతోందనే ఊహాగానాలు సాగుతున్నాయి… ఈ ఎన్నికల్లో YCP అభ్యర్థి ఇంటి కెళ్లి బన్ని మద్దతివ్వడం, ఆ తర్వాత నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేయడం తెలిసిందే… తాజాగా, సాయి ధరమ్ తేజ్ ట్విటర్ లో అల్లు అర్జున్ ను అన్ ఫాలో కొట్టారు… వీటికి తోడు జన సేనాని ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదు… అసలు ఆహ్వానం అందిందో..? లేదో..? తెలియదు.. […]
మోడీ హత్తుకున్నాడు ఆ ఇద్దరినీ… ఏదో ఇస్తున్నాడు మెగా సంకేతం..!!
సోషల్ మీడియాలో ఒకటే చర్చ… మోడీ మామూలుగా వచ్చి పోడు కదా… ఏదైనా కాస్త చర్చను అంటించి వెళ్తాడు… ఇక మీడియా, సోషల్ మీడియా వదలవు… రకరకాల క్రియేటివ్ ఊహాగానాలు… పైగా చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రపంచంలో ఎవరికీ అర్థం కారు… ఇంకేం..? బోలెడు ప్రచారాలు ఆల్రెడీ స్టార్టయ్యాయి… ఇంతకీ జరిగింది ఏమిటి..? చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి మోడీని రమ్మన్నాడు… సరే, పాత కక్షలు ఎన్నున్నా… ఒకరి మీద ఒకరికి అపనమ్మకం ప్రబలంగా ఉన్నా… ఎవరు […]
మృగరాజు ప్రమాణోత్సవానికి పులి వచ్చిందనుకున్నాం… కాదా, పిల్లేనా..?!
ప్రమాణస్వీకారోత్సవంలో పులి కాదది పిల్లి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం భారతీయ సాహిత్యంలో అత్యుత్తమమైన రచన. దుశ్యంతుడు కణ్వుడి ఆశ్రమానికి వెళ్లేసరికి అక్కడ జంతువులు జాతి వైరం మరచి…పాము- ముంగీస వన్ బై టు చాయ్ పంచుకుని ఒకే సాసర్ లో తాగుతూ ఉంటాయి. గద్ద- పాము తీరిగ్గా కూర్చుని చదరంగం ఆడుకుంటూ ఉంటాయి. పిల్లి- ఎలుక తీరుబడిగా పిట్టకథలు చెప్పుకుంటూ ఉంటాయి. పులి- జింక పక్కపక్కన కూర్చుని ఒకే సండే మ్యాగజైన్లో పదకేళి పూరిస్తూ ఉంటాయి. సింహం- […]
కనుక ఎవరికీ విద్య నేర్పని గురువు ఆనక దెయ్యమై పోవున్…
గురు శిష్య పరంపర …. పూర్వం అనగా శ్రీరాముడి తాత గారైన రఘుమహారాజు రాజ్యం చేస్తున్న కాలంలో జరిగిన కథ ఇది. పరతంతు మహర్షి గురుకులంలో సందడి సందడిగా ఉంది. గురుకులంలో విద్యాభ్యాసం ముగించుకుని వెళ్తున్న కుర్రాళ్లందరూ సెండాఫ్ విషస్ చెప్పుకుంటూ .. గురువుగారికి గురుదక్షిణ చెల్లిస్తూ … గుర్రాల నెక్కి తమ తమ ఊళ్లవైపుగా బయల్దేరి వెళ్తున్నారు. గురువుగారు కూడా శిష్యులకు చివరగా చెప్పాల్సిన విషయాలు చెప్తూ … వాళ్లిచ్చే గురుదక్షిణలు స్వీకరిస్తూ … బిజీబిజీగా […]
- « Previous Page
- 1
- …
- 32
- 33
- 34
- 35
- 36
- …
- 118
- Next Page »