అంతే అయి ఉంటుంది… బహుశా ఇదే నిజమై ఉంటుంది… నమస్తే తెలంగాణ రాశాక తిరుగేముంది..? నిజం లేకపోతే అక్షరం కూడా రాయదు… అది రాసిందంటే పాత చారిత్రిక శిలాశాసనమే… రాజులు అంటే తండ్రుల్లాంటివాళ్లు… అందుకే రామయ్య తండ్రీ, ఓ రామయ్య తండ్రీ, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రీ అని పూజిస్తూ, గౌరవిస్తూ, ప్రేమిస్తూ ఇన్ని వేల ఏళ్లుగా ప్రజలు తరిస్తూనే ఉన్నారు… అయితేనేం..? ఇప్పుడు లెక్కలు వేరు కదా… తెలుగు గడ్డ ఇది… రామన్న, జగనన్న, […]
రామాయణం గొప్ప మేనేజ్మెంట్ పాఠ్యపుస్తకం… ఇంకా ఎక్కువే సుమా…
మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం…. మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం, భారతం, భగవద్గీతలను చెప్పడం ఒక ఫ్యాషన్. అలా చెబుతున్నవారికి ఈ ఇతిహాసాలు, పురాణాలు ఒక ఉపాధిగా అయినా పనికివస్తున్నందుకు సంతోషించాలి. ఇంగ్లీషులో మేనేజ్ అనే క్రియా పదానికి చాలా లోతయిన అర్థం ఉంది. దేన్నయినా మేనేజ్ చేయడం అన్నప్పుడు నెగటివ్ మీనింగ్ కూడా ఉంది. ఆ మేనేజ్ క్రియావిశేషణమయినప్పుడు మేనేజ్మెంట్ అన్న భావార్థక పదం పుడుతుంది. మేనేజ్మెంట్ కు తెలుగు మాట నిర్వహణ. నిర్వాకం వెలగబెట్టినట్లు వెటకారమయ్యింది కానీ- మేనేజ్ […]
లఘు పాత్రల కోణంలో రామాయణం… అదే ఈ పుస్తకం… (చివరి పార్ట్)
రామాయణం లఘు పాత్రలు మనకేమి చెబుతున్నాయి? ————————— “మీరు రామాయణం చదివారా? అయితే ఈ పుస్తకం చదవండి” ఇది ఒక పుస్తకం టైటిల్… పుస్తక రచయిత అప్పజోడు వెంకటసుబ్బయ్య. అనంతపురం, గూడూరు, నంద్యాల, హైదరాబాద్, కర్నూల్లో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైరయ్యారు. “మహాభారతం- మానవ స్వభావ చిత్రణ” అన్న విషయం మీద ఉస్మానియాలో పిహెచ్డి చేశారు. రామాయణ, భారతాల మీద తెలుగు నేల మీద కొన్ని వేల ఉపన్యాసాలు చేసి ఉంటారు. భారతి పత్రిక […]
కంచాలు పగిలిపోయినా… కొవ్వొత్తులు కాలిపోయినా… కరోనా పోయేట్టు లేదు…
అదే ఏప్రిల్! అదే కరోనా! ——————– “అదే నీవు అదే నేను అదే గీతం పాడనా? కథైనా కలైనా కనులలో చూడనా? కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము; గువ్వ గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాము; అదే స్నేహము అదే మోహము ఆది అంతం ఏదీ లేని గానము నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు; కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు; అదే బాసగా అదే ఆశగా ఎన్నిన్నాళ్ళీ నిన్న పాటే పాడను?” అభినందన సినిమాలో ఆత్రేయ గీతం. ఇళయరాజా […]
పీవీ మార్క్ ప్రశ్న… సమాధానం చెప్పలేక అంతటి అవధానీ చేతులెత్తేసి…
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అసలే లోతు మనిషి… ఎక్కువగా మాట్లాడడు… సమాధానాలు చెప్పడు… మాట్లాడింది కూడా ఏదో మార్మికత ధ్వనిస్తూ ఉంటుంది… భావం సూటిగా ఉండదు… పైగా దేశ సాహిత్యం మీద నిశిత అవగాహన, పరిశీలన, ప్రవేశం, పరిణతి ఉన్నవాడు… అలాంటి పీవీ ఓసారి ప్రధాని హోదాలోనే మాడుగుల నాగఫణిశర్మ నిర్వహిస్తున్న అవధానానికి వచ్చాడు… ‘మీరొక ప్రశ్న వేయాలి అవధానికి’ అని పలువురు పీవీకి సూచించారు… ఒకేసారి రకరకాల ప్రశ్నలు తీసుకోవడం, ఒక్కో దానికి సరైన […]
ఇదే ప్లవ ఉగాది… 60 ఏళ్ల క్రితం… నాటి ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచిక అదుర్స్…
సరిగ్గా అరవై ఏళ్ల క్రితం… అంటే అప్పట్లో ప్లవ నామ సంవత్సరం ప్రవేశించిన కాలం… అప్పటి ఇష్యూస్, సాహిత్య ధోరణులు, ప్రపంచ స్థితిగతులు ఎలా ఉంటాయో తెలియాలంటే అప్పటి పత్రికలే శరణ్యం… అప్పట్లో పండుగల సందర్భంగా పత్రికలు ప్రత్యేక సంచికల్ని వెలువరించేవి… శ్రద్ధగా తీర్చిదిద్దేవి… ఆ సంచికల్లో తమ కథలో, నాటికలో, వ్యాసాలో రావాలని ప్రముఖ రచయితలు ఆశపడేవారు… అన్ని పత్రికలూ పోటీపడేవి కూడా… ఇప్పుడు నాటి ఆంధ్రపత్రిక ఉగాది ప్రత్యేక సంచిక వాట్సప్ గ్రూపుల్లో బాగా […]
గత్తర..! పీనుగుల్ని కాల్చీ కాల్చీ దహనయంత్రాలే పీనుగులవుతున్నయ్…
యముడు ఏడుస్తున్నా, కరోనాలో కనికరం లేదు ——————– లోకంలో ఎవరు ధర్మం తప్పినా, తప్పకున్నా యమధర్మ రాజు ధర్మం తప్పుడు. యమపాశానికి తన-మన, ఉన్నవాడు-లేనివాడు తేడాలేమీ లేవు. అవతార పురుషులయినా యముడి ముందు తలవంచాల్సిందే. యముడు నిర్దయుడు. అలాంటి నిర్దయుడి గుండె కరిగి నీరవుతోంది. యముడి కంట్లో నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి. యముడి గుండె బరువెక్కి వెక్కి వెక్కి ఏడుస్తోంది. పగలు రాత్రి విరామం లేకుండా డ్యూటీ చేసి చేసి యముడు తొలిసారి అలసిపోతున్నాడు. కరకు మృత్యువు […]
తెలుగులో మంచి కథకులు ఎవరూ లేరు..! తేల్చిపారేసిన ఈనాడు..!!
తెలుగు కథకే అవమానం… కాదు, కాదు… చిన్నతనం… తెలుగు కథకులందరికీ తలవంపులు… అంత పెద్ద ఈనాడు సంస్థ కథల పోటీ పెడితే ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందడానికి అర్హత సంపాదించిన కథ ఒక్కటంటే ఒక్కటీ లేదట… 1500 కథలు పోటీపడితే, అందులో ఫస్ట్, సెకండ్ ర్యాంక్ కథలు కనిపించక… చివరకు న్యాయమూర్తులే అల్లాడిపోయి, వాళ్లే తలదించుకున్నంత పనైపోయి… నో టాప్ టు ర్యాంక్స్ అని విచారవదనాలతో ప్రకటించాల్సి వచ్చింది… ఈ పోటీ పేరు ‘ఈనాడు’ కథావిజయం… అది […]
మాస్క్ ధరిస్తే అరిష్టమట… ఏదేదో కూశాడు ప్రశాంత్ భూషణ్… ఇజ్జత్ పోయింది..!
దేశంలోకెల్లా పెద్ద పేరున్న పెద్ద లాయర్… సుప్రీంకోర్టు లాయర్… పెద్ద పెద్ద కంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి, రూపాయి జరిమానాతో తప్పించుకోగల రేంజ్… ప్రొ-సొసైటీ, ప్రొ-పూర్ అనే పేరున్న లాయర్… పేరు ప్రశాంత్ భూషణ్… అయితేనేం..? అప్పుడప్పుడూ విచిత్రమైన వ్యాఖ్యల్ని ట్వీట్ జారుతుంటాడు… ఆ ట్వీట్ పెట్టేముందు అది అవసరమా, లేదా, తన హోదాకు తగినట్టు ఉంటుందా, లేదా వంటివి ఏమీ ఆలోచించడు… ఇప్పుడు కూడా అలాగే నిర్లక్ష్యంగా ఓ ట్వీట్ పెట్టాడు… తీరా ఏం జరిగింది..? దేశమంతా […]
గుప్తనిధి అంటే..? లెక్కల్లో చూపని సంపద కాదు… దాచిపెట్టిన పాత సంపద…
గుప్త నిధులన్నీ ప్రభుత్వానివే! ——————- జనగామ జిల్లా పెంబర్తి దగ్గర పొలాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం తవ్వుతుండగా లంకె బిందె దొరికింది. అందులో బంగారముంది. అయితే- ఈ లంకె బిందెలో ఉన్నది బంగారమయినా, వజ్ర వైఢూర్యాలయినా తాజాగా భూమి యజమాని అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి కానీ, ఆ భూమిని తరతరాలుగా సాగు చేస్తూ మొన్ననే అమ్ముకున్న రైతుకు కానీ చేతికి దక్కేది మన్ను మశానమే. ఆ మన్ను కూడా కొన్ని యుగాల తరువాతే దక్కుతుంది. […]
Family Food..! కబుర్లు నంజుకుంటూ… ప్రతి బుక్కనూ ఆస్వాదిస్తూ…
ఇంట్లో అందరూ కలిసి తింటేనే ఆరోగ్యం! ——————- ఇంట్లో వారందరూ కలిసి కూర్చుని ఒకేసారి తింటే ఆరోగ్యమని బ్రిటన్ లో ఒక పరిశోధన తేల్చింది. ఇంగ్లీషు వాడు చెబితేనే ఏదయినా మనం వింటాం కాబట్టి- అందరూ కూర్చుని ఒకేసారి తినడంలో ఉన్న సౌలభ్యమేమిటో ఆలోచించాలి. నిజానికి భారత దేశంలో మొన్నటిదాకా అన్ని ప్రాంతాల్లో ఇలా తినడమే ఉండేది. ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారు. అర్బన్ లైఫ్, వేగం, ఉద్యోగాల ఉక్కిరి బిక్కిరి, డైనింగ్ టేబుళ్ల నాజూకు, టీ వీ […]
Drunken Corona..! వైరస్ అయినా, మనిషి అయినా… ‘అక్కడే విజృంభించేది’…
విన్నారా? బార్ల వల్ల కరోనా వ్యాపిస్తోందని హై కోర్టు చెబుతోంది! ——————– రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా మద్యం అమ్ముడవుతోంది. దక్షిణాదిలో కేరళ, తమిళనాడు మద్యం అమ్మకాల్లో టాప్. మొత్తం దేశంలో అమ్ముడుబోయే మద్యంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 45 శాతం. బహుశా మరో రెండేళ్లల్లో 50 శాతం కావచ్చు. ఉత్తరాదిలో పంజాబ్ టాప్. అలాగని తెలుగు రాష్ట్రాల వినియోగం తక్కువ చేయాల్సిన పనిలేదు. ఎవరి చుక్కలు వారివి. […]
హమ్మయ్య తేల్చేశారు…! హనుమంతుడు తెలుగువాడే… పుట్టింది తిరుమలలోనే..!
దేవుళ్లే కాదు, వాళ్ల జన్మస్థలాలు కూడా అప్పుడప్పుడూ వివాదాల్ని రేకెత్తిస్తుంటాయి… దేవుళ్లు ఫలానాచోట పుట్టారు అని చెప్పడానికి చారిత్రిక ఆధారాలేముంటయ్..? స్థలపురాణాలు, నమ్మకాలే ఆధారాలు… కానీ రామాయాణం అలా కాదు… రాముడి కథ నిజమైందేననీ, కల్పన కాదనీ కోట్ల మంది తరతరాలుగా నమ్ముతున్న నేల ఇది… జాతి ఆరాధ్యుడు… అయోధ్య రాముడి జన్మస్థలి వివాదం తెలిసిందే కదా… కొందరైతే అసలు రాముడు అయోధ్యలో పుట్టనేలేదని కూడా వాదిస్తారు… అవునూ, రాముడు సరే, హనుమంతుడు పుట్టిందెక్కడ..? ఇక్కడ, కాదు […]
వంశీ రాసిన మరో మేఘసందేశం..! కథ అదిరింది- మదిలోకి ‘ఆపాత’ జ్ఞాపకాలు మళ్లీ..!
Pasalapudi Vamsy మంచి రైటరా..? మంచి డైరెక్టరా..? అనే ప్రశ్నకు క్షణంలో పావువంతు కూడా ఆలోచించకుండానే మంచి రైటర్ అని చెప్పేయొచ్చు… కథ రాస్తే అది హిట్టే… మంచి ప్రజెంటర్… తన కథల్ని చదివిన ప్రతిసారీ ఒకటీరెండు ప్రశ్నలు తొలుస్తా ఉంటయ్… తను నిజంగా జరిగిన సంఘటనల్నే మనకు కథలుగా చెబుతున్నాడా..? వాటికే కాస్త కల్పన అద్దుతున్నాడా..? ఎవరైనా చెప్పిన ముచ్చట్లను తనదైన స్టయిల్లో అక్షరీకరించి మనతో షేర్ చేసుకుంటున్నాడా..? ఏదయితేనేంలే… కథలే అనుకుందాం… పోనీ, నిజంగా […]
ముంబై పోలీస్..! వాళ్ల రాజ్యాంగమే వేరు… ఈ ఒక్కటీ చదవండి చాలు..!!
సాధారణంగా పాలకుడిని బట్టి పోలీసులుంటారు, అందరికీ తెలిసిందే… కానీ ముంబై పోలీసులు చాలా టిపికల్… వాళ్లు ఏ అంచనాలకూ అందరు… చూస్తున్నాం కదా… వాళ్లలోనే అనేక గ్రూపులు, ఏ గ్రూపును ఏ శక్తి నడిపిస్తుందో ఓ అంచనాకు రావడం కష్టం… వాళ్లు ఏదైనా చేయగలరు… ఒక్క ముంబైలోనే నెలనెలా వందల కోట్ల వసూళ్లు చేయగలరు… వాళ్లే డాన్లు, వాళ్లే లీడర్లు, వాళ్లే జడ్జిలు, వాళ్లే అన్నీ… అంతెందుకు..? అంతటి అంబానీకే స్పాట్ పెట్టేంత సమర్థులు… శివసేన ఆత్మీయ […]
New Monk..! రాజకీయ సన్యాసం అంత ఈజీ కాదు, ఐనా ఈయన సాధించాడు..!!
సన్యాసులు చాలారకాలు… ముఖ్యమంత్రుల్ని ఆడించగల కార్పొరేట్ సన్యాసులు తెలుసు మనకు… మోడీ రాజసన్యాసి… కుర్చీ మినహా అన్నీ వదిలేయగల వైరాగ్యం… యోగి మరీ మోడీ తరహాలో కుర్చీప్రేమికుడు అనలేం గానీ, కర్మ సన్యాసి… ఓ విశిష్ట సన్యాసం తనది… కొందరు ఫేక్ యోగులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఉంటారు… వాళ్లది కొంగజప సన్యాసం… ఏ హిమాలయాల్లోనో, కొన్ని నిజమైన ఆధ్యాత్మిక ఆశ్రమాల్లోనో నిజమైన సన్యాసులు కనిపిస్తారు, వాళ్లు అన్నింటినీ వదిలేసిన బైరాగులు… వాళ్లది మార్మిక సన్యాసం… ఆ బాట […]
అగ్రి సుల్తాన్..! అసలే కార్తి, అదనంగా కంగాళీ, తోడుగా అరవ అతితనం..!!
ఓ హీరో దిగుతాడు… ఆ ఊళ్లోకి వెళ్తాడు… రైతుల కష్టాల్ని చూసి భోరుమంటాడు… వీళ్లను ఉద్దరించాల్సిందే అని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు… అబ్రకదబ్ర, హాంఫట్ అంటూ ఓ పాట వేసుకుంటాడు… పాట అయిపోయేలోపు రైతులు ఉద్దరింపబడాల్సిందే… ఖతం… రైతుల ఆనందబాష్పాలతో ఆ ఊరి చెరువు మత్తడి దూకుతుంది… ఆనందం పట్టలేక కొందరు గుండె ఆగి మరణిస్తారు……… హేమిటిది అని హాశ్చర్యపోతున్నారా..? మన హీరోలు మస్తు ఉద్దరిస్తున్నారు మరి… అప్పట్ల ఓ ల్యాప్టాప్, ఓ ఛాపర్ పట్టుకుని మహేశ్ […]
వీఆర్ అర్చనలు… ఆన్లైన్ ఆర్జితసేవలు… యూట్యూబ్ వ్రతాలు… పోస్టల్ ప్రసాదాలు…
పోస్టల్ ప్రసాదం సమర్పయామి! ——————- హమ్మయ్య. ఇక దేవుడి ప్రసాదం ఇంటికే వస్తుంది. మనం దేవుడి వైపు ఒకడుగు వేస్తే- దేవుడు మనవైపు వందడుగులు వేసి వచ్చి కాపాడతాడని కంచి పరమాచార్య మహా స్వామి చెప్పేవారు. ఆ వాక్కును నిజం చేస్తూ తెలంగాణాలో తంతి తపాలా శాఖ దేవుడి ప్రసాదాలను మన ఇళ్లకే చేర్చే బాధ్యతను నెత్తికెత్తుకుంది. తంతి ప్రసాదం బుట్టలో పడడం అంటే ఇదే కాబోలు. నిజానికి ఈ మహాప్రసాదం బట్వాడా తపాలాశాఖ ఆలోచన కాదు. […]
దిగ్గజరాజు..! ఈ శిల్పం వెనుక ఓ ఆసక్తికరమైన కథ… అది మహాభారత పాత్ర…!!
రామాయణం, భారతం, భాగవతం… వీటిల్లో ఏది గొప్పది అనడిగాడు ఓ మిత్రుడు… దేని గొప్పతనం దానిదే… కానీ రామాయణం, భాగవతాల్లో కథలు చిన్నవి… ఎక్కువగా రాముడిని, కృష్ణుడిని దేవుళ్లుగా చిత్రీకరించేవి… కానీ భారతం కథ ఓ మహాసముద్రం, దాని ఉపకథలు, ఉపోపకథలు కోకొల్లలు… ఈ కథ యావత్తూ రాజతంత్రాలు… సంక్లిష్టత, మార్మికత, ధర్మాధర్మ మీమాంస వంటివి బోలెడు… నిజమే… భారతంలో మనుషులే కాదు, పిశాచాలు, రాక్షసులే కాదు… నాగులు, ఏనుగుల పాత్రలకూ కథాప్రాధాన్యం… ఒక పాత్ర గురించి […]
అబ్బే, దేవుడనేవాడే లేడోయ్… కానీ నాకిప్పుడు ఆయన కావాలి అర్జెంటుగా…
ఒకప్పుడు దేవుడు లేడు- ఇప్పుడు దేవుడే దిక్కు! డిఎంకె భక్తి మార్గం! దేవుడి దయ వల్ల నాస్తిక సంఘం మహాసభలు దిగ్విజయంగా జరిగాయి- అన్నట్లుంది తమిళనాడులో డిఎంకె ఎన్నికల ప్రచార సారాంశం. అన్నాదురై, పెరియార్ ఈ.వి. రామస్వామి సిద్ధాంతాలతో దాదాపు ఏడు దశాబ్దాలుగా వెలుగుతున్న ద్రవిడ మున్నేట్ర కజగ గజానికి అర్ధశతాబ్దం కరుణానిధి ఒక్కడే దిక్కు మొక్కు. ఆయన తరువాత ఇప్పుడు స్టాలిన్ ఆ పార్టీ అధినేత. కాబోయే ముఖ్యమంత్రి. నాస్తికత్వానికి డి ఎం కె ఒకప్పుడు పెట్టింది […]
- « Previous Page
- 1
- …
- 31
- 32
- 33
- 34
- 35
- …
- 41
- Next Page »