ఫ్రీ ఆర్టీసీ బస్సులను 60 శాతం వాడుతున్న మహిళలు… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది… సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో మొత్తం 51 లక్షల మంది ప్రయాణించగా అందులో 20.87 లక్షల మంది పురుషులు… కాగా 30 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా ఆర్టీసీలో 50 లక్షల మంది ప్రయాణికులు ఎక్కితే 18 కోట్లు ఉండే ఆదాయం సోమవారం 11.74 కోట్లు […]
ఓ గోనె సంచిలో నోట్ల కట్టలు కుక్కుకుని రజినీ హైదరాబాద్‌లో వాలిపోయాడు…
నిన్న కదా రజినీకాంత్ బర్త్ డే… చాలామంది చాలా విశేషాలు షేర్ చేసుకున్నారు… ఇంత వయస్సొచ్చినా, ఇన్ని సినిమాలు చేసినా, ఇంకా అదే ‘సౌత్ సూపర్ స్టార్ సుప్రీం హీరోయిక్ యంగ్ ఇమేజీ’ బిల్డప్పు వేషాలు, సంపాదన కోసం తాపత్రయం ఏమిటని కూడా నాలాంటివాళ్లు విమర్శ కూడా చేశారు… కానీ రజినీకి మరో కోణం కూడా ఉంది… అది పదిమందికీ ఆదర్శంగా ఉంటుంది… అలాంటిదే ఇది కూడా… ప్రపంచం మెచ్చిన మన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు Nerella Venumadhav కోణంలో […]
మంకీ ట్రాప్… మనదీ ఈ ట్రాపుల బతుకే… ఏదీ వదులుకోలేకపోతున్నాం…
Rajani Mucherla.. రాసిన పోస్ట్ ఒకటి ఆశ్చర్యాన్ని కలిగించింది… మనుషులు ఇలా కూడా ఉంటారా అనే విస్మయం అది… మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలాంటి వార్తల్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేక చేతులెత్తేస్తోందని కూడా అనిపిస్తోంది… సరే, ఒకసారి ఆ పోస్టు యథాతథంగా చదువుదాం… *మంకీ ట్రాప్ * ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త … తల నుండి బయటికి పంపించేసినా.. పదే పదే మళ్ళీ వచ్చి మది తలుపు తడుతూనే ఉంది.. […]
ఆ డీఎస్పీ నళిని గుర్తుంది కదా…! ఇప్పుడామె ఏం చేస్తోంది..? ఇంట్రస్టింగ్ ఛేంజ్..!!
2012… తెలంగాణ ఉద్యమకాలం… ఈమె గుర్తుందా..? నళిని… ఏకంగా తన డీఎస్పీ కొలువునే వదిలేసింది… తెలంగాణ కోసం ఉద్యమించే అన్నాచెల్లెళ్లపై లాఠీని ఝలిపించలేేనని, తూటాల్ని ఎక్కు పెట్టలేనని చెబుతూ తన ఉద్యోగాన్నే త్యాగం చేసింది… 2003లో కాకతీయ యూనివర్శిటీలో తనకు బీఎడ్ క్లాస్మేట్ అని ఓ మిత్రుడు గుర్తుచేసుకున్నాడు ఫేస్బుక్లో… మేర (దర్జీ) కులస్థురాలు… బీసీ… అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు… ఢిల్లీలో దీక్ష చేసింది… రెండుసార్లు తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది… మరి ఇన్నాళ్లూ ఏమైపోయింది..? […]
బతుకమ్మ , శివరాత్రి, పెద్ద ఏకాదశి పండుగ ఏదయినా సరే…
మక్కసత్తు ముద్దలు ~~~~~~~~~~~~~~ మక్క సత్తు ముద్దలు అచ్చమైన ఉత్తర తెలంగాణ తిండి. ఇక్కడివాళ్లు దీనికోసం ప్రాణమిడుచుకుంటరు. అసలు సత్తువాసనకే సగం ప్రాణం ఆవిరయిపోతది. బతుకమ్మ , శివరాత్రి, పెద్ద ఏకాదశి పండుగ ఏదయినా పలారంల దీన్ని వెనుకబడేసేటిది ఒక్కటి గుడ లేదంటే లేదు. పంట మక్కలు అంటే చిన్న మక్కలు పూలుపూలుగ వేయించి ఆ ప్యాలాలను మెత్తగ విసిరి లేదా గిర్ని పట్టించి పిండిగ మార్చి మంచి బెల్లం సన్నగ చిదిమి, చిక్కటి పాలల్ల వేసి […]
సోషల్ మీడియా లేని కాలం ఒకటి ఉండేది..!!
సోషల్ మీడియా లేని కాలం ఒకటి ఉండేది!! … తాను తీయాలని అనుకున్న ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా సూపర్‌స్టార్ కృష్ణ గారు తీశారని ఎన్టీ రామారావు గారికి కోపం వచ్చింది. ఇద్దరూ కలిసి నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా శతదినోత్సవానికి రమ్మన్నా ఎన్టీఆర్ రాలేదు. కొన్నేళ్ల దాకా ఆ కోపం అలాగే మిగిలి ఆపై సమసిపోయింది. ఇద్దరూ మళ్లీ దగ్గరయ్యారు. … తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చే విషయంపై తనని సంప్రదించలేదని ఎన్టీఆర్ […]
తప్పు… కేసీయార్ మీద పగతో రేవంత్ సీఎం కాలేదు… తన లెక్కలు వేరు…
‘‘కేసీఆర్‌ను చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకుని ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదేమో… ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అధినేతగా, తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అనతికాలంలోనే ఈ స్థాయికి ఎదగడానికి పరోక్షంగా కేసీఆరే కారణం… 2014 ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ వ్యూహరచనతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి జైలుకు పంపారు… ఏకైక కుమార్తె పెళ్లి సందర్భంగా […]
అప్పుడు ఆ బక్కరైతు బోరుమంటూ వైఎస్ కాళ్ల మీద పడిపోయాడు…
ఆయన ఓ జెయింట్ కిల్లర్… రేవంత్, కేసీయార్… ఇద్దరు సీఎం అభ్యర్థులను కామారెడ్డిలో మట్టికరిపించాడు… సొంత మేనిఫెస్టో, ఆల్రెడీ ఎప్పటి నుంచో జనంలో ఉంటూ ఖర్చు పెట్టుకుంటున్నాడు… ఆయనే బీజేపీ వెంకటరమణారెడ్డి… కేటీయార్, కేసీయార్ మీద విపరీతమైన ఆగ్రహంతో ఉన్నాడు… ఆ కారణాల్ని పక్కన పెడితే… ‘‘జనంతో కనెక్ట్ కావడం’’ అంటే ఏమిటో ఓ ఉదాహరణ చెప్పాడు ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో… కేసీయార్‌కు ఈ విషయం తెలిస్తే… జనం నుంచి ఇంత ఛీత్కారం ఉండేది కాదు… […]
చౌకగా మా జియో సిమ్ పొందండి అంటూ ముఖేష్ అంబానీ తెరపై ప్రత్యక్షమైతే..!!
ఆల్ ఆఫ్ సడెన్… ముఖేష్ అంబానీ చిన్న తెర మీద ప్రత్యక్షమై… అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో మేం అందించే ఎయిర్ ఫైబర్ సేవలు పొందండి, ఆనందంగా ఉండండి, అవసరమైతే వేరే సర్వీస్ ప్రొవైడర్లతో పోల్చుకొండి, డబ్బు ఊరికే రాదు అని ప్రమోషన్ నీతులు చెప్పాడు అనుకొండి… ఎలా ఉంటుంది..? నీతులు అంటే గుర్తొచ్చింది… ఆయన భార్య నీతా అంబానీ బొమ్మలు పెద్ద హోర్డింగులపై, బిల్ బోర్డులపై కనిపించి… రిలయెన్స్ ట్రెండ్స్ ప్రచారానికి పూనుకుంటే..? పోనీ, ఆయన కుటుంబసభ్యులు […]
నాగార్జున బాబు గారూ… వీకెండ్ షోకు దిమాక్ ఇంటి దగ్గర మరిచొస్తారా..?
బిగ్‌బాస్ వోటింగ్ అనేది ఓ ఫార్స్… బయట అనధికారికంగా జరిగే వోటింగులు కూడా ఓ దందా… ప్రత్యేకంగా సోషల్ మీడియా గ్రూపుల్ని ఎంగేజ్ చేసుకుని, ప్రత్యర్థి కంటెస్టెంట్ల మీద విషం చిమ్మడానికి, తమ బాసులకు సానుకూల వోటింగు పెంచడానికి నానా ప్రయత్నాలూ చేస్తాయి ఈ గ్రూపులు… ఇప్పుడు కొత్తేమీ కాదు, మొదటి నుంచీ ఉన్నదే… దానికి ఆయా వ్యక్తుల పేర్లతో ఆర్మీలు, బెటాలియన్లు… పోనీ, బిగ్‌బాస్ అధికారికంగా ఏమైనా వోటింగ్ వివరాలు చెబుతాడా అంటే అదీ ఉండదు… […]
అసలు ఎవరు ఈ దీపేందర్ హుడా..? ఢిల్లీలో రేవంత్‌రెడ్డికి ఫుల్ సపోర్ట్…
ఓ మిత్రుడు పంపించిన యూట్యూబ్ షార్ట్ కాస్త ఇంట్రస్టింగ్ అనిపించింది… అందులో రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఎంపీ దీపేందర్ హుడా ఇంటికి వెళ్లడం, ఇంట్లో వాళ్లు ఆశీస్సులు అందించడం, హుడా రేవంత్‌ను గట్టిగా ఆలింగనం చేసుకుని అభినందించడం వంటి సీన్స్ ఉన్నయ్… హుడా సహకారంతోనే రేవంత్ ఢిల్లీలో నెగ్గుకొచ్చాడన్నట్టుగా ఉంది… ఐతే… కాంగ్రెస్ వంటి పార్టీల్లో హైకమాండ్ దగ్గరకు మంచి రూట్స్ కావాలి… వాళ్లు నమ్మాలి… కోర్ కమిటీలు సాయం చేయాలి… ఇవన్నీ అవసరమే… ఐతే ఎటు […]
ప్రతి బస్సులోనూ ఫ్రీ ప్రయాణం కాదు… పలు షరతులు వర్తిస్తాయి…
రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని రేవంత్ ప్రభుత్వం చెబుతోంది… తాము హామీలు ఇచ్చిన అనేకానేక పథకాల్లో అమలుకు నోచుకుంటున్న తొలి పథకం అన్నమాట… ఈ పథకం అమలు నియమనిబంధనల మీద ఇంకా క్లారిటీ లేదు… కానీ కర్నాటకలో ఈ పథకం అమలు అవుతున్నందున సేమ్, అదే విధానం ఇక్కడా పాటిస్తారని అనుకోవచ్చు… పథకం అమలు విధివిధానాలు పకడ్బందీగా రూపొందేవరకు మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు […]
సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం… కొన్ని అబ్జర్వేషన్స్…
Paresh Turlapati….. అబ్సర్వేషన్స్… తెలంగాణా ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు కదా, టీవీల్లో చూసిన తర్వాత దాంట్లో నేను గమనించిన కొన్ని దృశ్యాలు ! * రేవంత్ రెడ్డి సోనియా కుటుంబంలో మంచి మార్కులే సంపాదించుకున్నారు ! * తాజ్ కృష్ణ హోటల్ నుంచి సోనియా..రాహుల్.. ప్రియాంకలు ఎల్బీ స్టేడియానికి బయలుదేరేటప్పుడు హడావుడిలో జరిగిన ఒక చిన్న దృశ్యం నన్ను ఆకర్షించింది ! కారులో రాహుల్ ముందు కూర్చుంటే సోనియా.. ప్రియాంక […]
చలికాలంల సర్వపిండిదే సౌభాగ్యం… ఉల్లి కొత్తిమీర గుమగుమలతో ఊరిస్తది.
సర్వపిండి సనాతనం ~~~~~~~~~~~~~~~ చలికాలంల సర్వపిండిదే సౌభాగ్యం. ఉల్లి కొత్తిమీర గుమగములతో ఊరిస్తది. ఎక్కువ గట్టిపడిపోదు. చలిగదా, తాపం తక్కువ. చెడగొట్టు ముసుర్లకు చెవ్వోముక్కో అన్నట్టుగుంటంది గద, కారకారంగ రామతులసి ఆకులు వేసిపెట్టిన సర్వపిండి ఇది. నీడకుబతికే వాళ్లం, ఒక్కటితింటే ఒకపూట గాసం సమాప్తం. ~•~•~•~•~ అనుభవసారం ప్రకారం సర్వపిండిలో ప్రాంతీయత మెండు. పుట్టిన ఊర్లర్ల జిలుకరెల్లిపాయేసి,ఇంత పెసరుపప్పు చల్లేటోళ్లు. నేను పెరిగిన ఊర్ల పల్లీలు నువ్వులు దండిగనే పోసేకునే వాళ్లు. ఏ ఊరిపంట ఆవూరితిండికి మూలం […]
టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్… నిజానికి రేవంత్‌రెడ్డి ఎవరి మనిషి..?!
‘ఎప్పటికైనా సీఎంను అవుతా… అన్నా, నువ్వు చెప్పు, సీఎంను అవుతానా ? కాదా ?’ రేవంత్ రెడ్డి వేసిన ఈ ప్రశ్నకు ‘కమ్మ పార్టీలో రెడ్డి సీఎం ఎలా సాధ్యం అవుతుంది’ అని నా సమాధానం . అసెంబ్లీ ఆవరణలో టీడీఎల్పి , (టీడీపీ) సియల్పి (కాంగ్రెస్) ఆఫీస్ ల మధ్య దారిలో జరిగిన చర్చలో రేవంత్ రెడ్డి నేనూ మాట్లాడుకున్న విషయం ఇది … అప్పుడు అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కూడా కాదు […]
నిజమే… అతడు ఓడిపోతున్నాడు… ఈ లోకం నుంచే వెళ్లిపోతున్నాడు…
సాక్షిలో వచ్చిన ఓ వార్త పొద్దున్నుంచీ మదిలో గిర్రున తిరుగుతూనే ఉంది… మంచి వార్త… కాకపోతే మెయిన్ ఎడిషన్‌కు తీసుకోక, ఆ వార్త ప్రయారిటీ అర్థం గాక సిటీలో వేశారు… వార్త సారాంశం ఏమిటంటే..? హైదరాబాద్ నగరంలో గత ఏడాది 544 మంది ఆత్మహత్యలు జరిగితే అందులో 433 మగ ఆత్మహత్యలే… అనగా మేల్ సూసైడ్స్… సాధారణంగా సమాజంలో ఓ అభిప్రాయం ఉంది… ఆడవాళ్లే సున్నిత మనస్కులనీ, త్వరగా కుంగిపోయి అఘాయిత్యాలకు పాల్పడతారనీ, మగవాళ్లు మానసికంగా దృఢంగా […]
పాడండి… పాడించండి… పిల్లలకు అదే సాధన, అదే బోధన, అదే వినోదం…
Language by Songs: పల్లవి : వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే… వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతీ విద్యాందేహీ… భగవతి సర్వార్థసాధికే… సత్యార్థచంద్రికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే చరణం 1 : ఆపాత మధురము… సంగీతము అంచిత సంగాతము… సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము… అమృత సంపాతము… సుకృత సంపాకము సరిగమస్వరధుని సారవరూధినీ… సామనాదవినోదినీ సకల కళాకళ్యాణి సుహాసినీ… శ్రీ రాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని […]
ఆలూ లేదు, చూలూ లేదు… అప్పుడే కాంగ్రెస్ కేబినెట్ తేల్చేసిన సోషల్ మీడియా…
ఒకవేళ బీఆర్ఎస్కు 55 వరకూ సీట్లు వస్తే… మజ్లిస్ ఉండనే ఉంది… కాదంటే బీజేపీ ఉంది… మరీ కాదంటే కాంగ్రెస్‌లోని కేసీయార్ కోవర్టులు కొందరు గెలుస్తారు, వాళ్లూ ఉన్నారు… ఇవన్నీ గాకుండా బీఆర్ఎస్కే సరిపడా మెజారిటీ వస్తే ఇక ఏ రందీ లేదు… స్ట్రెయిట్‌గా కొత్త కేబినెట్ కొలువు తీరడమే… సో, రకరకాల సమీకరణాలు రేపటి ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి… నో, నో, కాంగ్రెస్‌కు సరిపడా మెజారిటీ వస్తుంది… కాంగ్రెస్‌ను చీల్చినా సరే కేసీయార్‌కు సరిపడా మెజారిటీ […]
రెడ్డి లవ్స్ కమ్మ… నో, కమ్మ వెడ్స్ బ్రాహ్మణ… షర్మిల కొడుకు పెళ్లిపై ఫుల్లు చర్చ…
తెలంగాణలో మరీ ఎక్కువేమీ కనిపించవు కానీ… ఏపీ రాజకీయాల్లో మొత్తం కులం బురదే…! చాన్నాళ్లు కమ్మ వర్సెస్ కాపు… అప్పట్లో రంగా హత్యానంతరం జరిగిన విధ్వంసం, దహనకాండలు తెలిసిందే కదా… వైఎస్, చంద్రబాబు హయాంలో కూడా రాజకీయాల్లో కులం ప్రధానపాత్ర పోషించినా సరే మరీ ఘోరంగా దిగజారలేదు… జగన్ సీఎం అయ్యాక రెడ్డి వర్సెస్ కమ్మ ఉధృతమైంది… జగన్ ప్రత్యేకంగా కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది… ఊళ్లల్లో రెడ్ల ఆధిపత్యం కూడా బాగా పెరిగింది… ఈ […]
“డాక్టరు వద్దకు తీసుకు వెళ్ళరా?” అనడిగాను… వాళ్ళు విచిత్రంగా చూశారు నా వైపు…
Kandukuri Ramesh Babu….. విను తెలంగాణ – ఒక సహజ మరణం ముందు… మూడు తరాలే కాదు, అక్కడ జీవితం సంపూర్ణం. దాదాపు నాలుగు తరాలనూ ఒక్క చోట చేర్చిన సంధ్యా సమయం అది… ఒక్క స్పర్శ తప్ప మరేమీ లేని స్థితి అది… అది సాయంత్రం వేళ… గాంధారి మండలం నేరెల్ తండా… కాయితీ లంబాడాల ఒకానొక ఆవాసం… అక్కడి వీధి వీధినీ పరిశీలిస్తూ నడుస్తుంటే ప్రతి చోటా ఆగి ఫోటో తీయాలనిపించే అందమైన జీవన […]
- « Previous Page
- 1
- …
- 44
- 45
- 46
- 47
- 48
- …
- 108
- Next Page »