Jagan Rao…. ఎవరూ ఎవర్నీ మోసం చేయరు. మనం మోసపోయాం అంటే మనమే 100% కారణం. నాకు తెలిసిన ఒకతను సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతని వైఫ్ కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇద్దరికీ ఒక పేరు గాంచిన MNC లో ఉద్యోగాలు. ఇద్దరికీ ఏ చెడు అలవాట్లూ లేవు. 50 లక్షలు బ్యాంక్ లో ఉన్నై. అమీన్ పూర్ లో ఇళ్ళ స్థలం తీసుకుందాం అనుకున్నారు. వాళ్ళు రెంట్ కి ఉండే అపార్ట్ మెంట్ కాంప్లెక్ష్ […]
ఇన్నాళ్లూ ఈమె ఎందుకు తెలియలేదని దుఃఖంతోపాటు సిగ్గేసింది…
ఎలా రాయాలి? ఒక వారం రోజులుగా ఇదే ఆలోచన. ఆమె మరణవార్త తెలిసాకే మిగిలిన వివరాలు తెలుస్తున్నాయి. కానీ నాకింతవరకు ఆమెతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరిచయం లేదు. నా స్నేహితులు, FaceBook స్నేహితులు చాలామందికి ఆమె తెలుసు. వారు ఒక్కొక్కరు పంచుకున్న వివరాలు తెలిసాక దుఃఖంతో పాటు సిగ్గు వేసింది. ఇన్నాళ్లు ఎందుకు తెలుసుకోలేదా అని. ఒక వ్యక్తి ఇన్ని పనులు చేయగలరా అనే ఆశ్చర్యంతో పాటు ఎందరికో స్ఫూర్తి దాతగా నిలవడమంటే మాటలు […]
వర్శిటీ క్యాంపస్‌లు పోరాట క్షేత్రాలుగా మండుతున్న కాలమది…
Gurram Seetaramulu…….. తక్షణ అవసరాల మీద, సమస్యల మీద వచ్చే స్పందన లేదా ఆసక్తి ఎక్కడో ప్రాచీన అంశాల మీదనో, మధ్య యుగాల మీదనో చూపలేము. వర్తమాన అంశాల మీద మాట్లాడటానికి, దానికి సంబంధించిన మనుషులో, సమాచారమో తాజాగా మాత్రం మనకు దొరికే అవకాశం ఉంది కదా. అది ఒకరకంగా తేలికైన పని కూడా. శిలాజాల, శిథిలాల, రాతప్రతుల, శాసనాల, నాణేల వెంటపడే వారి శోధన లోకం వేరు. చరిత్ర నిర్మాణం అంటే వర్తమాన భావోద్వేగాల మీద […]
వోలమ్మా.. ఇలా వొగ్గేసారేటి..! మా యాసేది.! మా బాసేది.! మా ఊసేది.!
అన్నీ తెలంగాన పాటలేనా! మా వుత్తరాంధ్ర వుత్తిదేనా! ఇజినారం, సికాకులపోళ్లు ఆనలేదా! …. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. ఏం పిల్లో ఎల్దామొస్తవా..’ అని మా వంగపండు పాడితే తెలంగాణ గద్దర్ కూడా మురిసిపోయేవారే! ‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టుబట్టినాడా వొగ్గనే వగ్గడు..’ అంటూ మన బాడ సూరన్న పాట పాడితే ప్రపంచమే ఊగిపోయిందే! ‘అబద్దాల రాయుడా.. చంద్రబాబునాయుడా.. నీ మాటలు చిత్రమైనవో..’ అన్న మా దేవిశ్రీ పాట రాష్ట్రమంతా విన్నారే! ‘నాది నక్కిలీసు గొలుసు..’ అని […]
పత్రికల్లో ఒకప్పుడు హాస్యానికి ప్రత్యేకమైన కాలమ్స్ ఉండేవి…
తెలుగువారికి సంతూర్ లైమ్ ఫ్రేగ్రన్స్ రుద్దుళ్లు పత్రికల్లో ఒకప్పుడు హాస్యానికి ప్రత్యేకమైన కాలమ్స్ ఉండేవి. పత్రికల విధానాలే హాస్యాస్పదం అయ్యాక విడిగా హాస్యానికి కాలమ్స్ ఔచిత్యం కోల్పోయాయేమో!కానీ…ఆ లోటును ప్రకటనలు కొంతవరకు తీరుస్తున్నాయి. సాధారణంగా ప్రకటనలను ఎవరూ చదవరు. చదివితే ఉదయాన్నే కడుపుబ్బా నవ్వుకోవచ్చు. లైమ్ ఫ్రేగ్రన్స్ లీలలు! సంతూర్ సబ్బు వల్ల కొన్ని దశాబ్దాలుగా కాలేజీ అబ్బాయిలు అమ్మాయి వెంట పడడం; తీరా లవ్ ప్రపోజ్ చేద్దామనుకునే క్షణాన మమ్మీ! అని వాళ్లమ్మాయి ఫ్రేమ్ […]
నువ్వు సోగి, చెక్కు తొక్కు… ఇవి లేకపోతే కొత్త పచ్చళ్ల తృప్తే లేదు…
Sampathkumar Reddy Matta….. నువ్వుసోగి ౼ చెక్కుతొక్కు ~~~~~~~~~~~~~~~~~~ఇటీవల సోషల్ మీడియాలోతొక్కుల గురించిన వ్యాఖ్యానాలపైత్యం బాగనే కనవడుతంది గదా !జీవిస్తున్న ప్రాంతాన్ని బట్టినడుస్తున్న సమకాలాన్ని బట్టిపదార్థం దొరికే తీరుతెన్నుబట్టిపెద్దలు చెప్పిన సూత్రాలను బట్టిఆర్థిక సామాజిక అంతస్తులను బట్టిఅభిరుచిలో ఆధునికత స్థాయిని బట్టితొక్కులు పెట్టుట్ల వైవిధ్యాలు సహజమే గద.మూలాలు తెలియక, తెలుసుకునే ఓపిక లేకనేకొందరికి దీన్ని ట్రోల్ చేసే పిచ్చిలక్షణం ఏందోయేమో !!~•~•~•~•~•~మాకు ఎన్ని తొక్కులున్నామామిడికాయ తొక్కు పరమం.మల్ల దాంట్ల ఎన్నిరకాలు పెట్టుకున్నానువ్వుసోగి లేకపోతే అసలు తృప్తి కానేగాదు.నువ్వులు […]
ఆరోగ్యంపై కొన్ని అపోహలు, ప్రచారాలు… ఇవీ అసలు వాస్తవాలు…
ఆరోగ్య అంశాలపై అపోహలు నమ్మలేని పుకార్లతో సమానం… ఇవన్నీ అనవసర ఆందోళనలకు, గందరగోళానికి దారితీసి, వ్యాప్తి చెంది మరింత నష్టాన్ని కలుగజేస్తాయి… తామరతంపరగా పుట్టుకొచ్చిన అనేక యూట్యూబ్ చానెళ్లు, హెల్త్ సైట్లు ఇష్టారాజ్యంగా ఇలాంటివి వ్యాప్తి చేస్తున్నారు… మరీ ప్రత్యేకించి ఓ చెత్తా చానెల్ తెలుగునాట మూఢనమ్మకాలు, అనారోగ్యాంశాల మీద సమాజానికి చేస్తున్న చెడు అంతా ఇంతా కాదు… మన దరిద్రం కొద్దీ మన ప్రభుత్వాలకు ఇవేమీ పట్టవు… రాత్రిపూట ఫలానా చెట్టు కింద పడుకోకండిరా అని […]
పుస్తె కట్టిన బ్రహ్మచారి Vs పుస్తె కట్టని బ్రహ్మచారి… అసలేమిటీ పుస్తెల లొల్లి…!
మంగళసుత్రాపహరణ సూత్రీకరణ! కొంచెం డొంకతిరుగుడుగా అనిపించినా మొదట మనం కరీంనగర్ జిల్లా ధర్మపురి నరసింహస్వామి గుడి మెట్ల మీద కూర్చుని దాదాపు రెండొందల యాభై ఏళ్ల కిందట లోకరీతిని తూర్పారబట్టిన కవి శేషప్ప దగ్గరికి వెళ్లి…ఆ తరువాత మోడీ మంగసూత్రాపహరణ సూత్రీకరణ సిద్ధాంతం దగ్గరికి వద్దాం. తెలుగు శతకసాహిత్యం అనంతం. అందులో కవి శేషప్ప నృసింహ శతకం సీస, తేటగీతి పద్యాలు తేటతెలుగుకు, భక్తి జ్ఞాన వైరాగ్యాలకు పెట్టింది పేరు. ఇప్పుడంటే తెలుగు జానీ పాపలు ఇంగ్లిష్ నోరు […]
అరె ఓకే అని అంటిమా ఓయోకు రమ్మంటడు… ఇప్పుడిదే ట్రెండు…
అరె పడితె లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అదిబోతే ఇంకోతొస్తది అరె ఓకే అని అంటిమా ఓయోకు రమ్మంటడు ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు అరెరెరే పడేదాకా పరేశాను జేస్తడు వాడు …. ఆమధ్య మ్యాడ్ అనే సినిమాలో ఈ పాట తెలుసు కదా… బాగా పాపులరైంది… ప్రత్యేకించి యువత నోళ్లల్లో బాగా నానింది… ఎందుకంటే..? ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది కాబట్టి… ఒక వార్త చదివాక ఇదే గుర్తొచ్చింది… ఓయో హోటళ్లు ఎంత […]
హీరో వెంకటేశ్‌కూ… మంత్రి పొంగులేటికీ ఏమవుతాడు, ఎవరీయన..?
ఎవరాయన..? రామసహాయం సురేందర్‌రెడ్డి ఆయన పేరు… పాత వరంగల్ జిల్లాలోని మరిపెడ వాళ్లది… అది మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల సరిహద్దు… ఎక్కువగా బంజారా ప్రజల తండాలు… పెద్ద గడీ… పెద్ద జమీ… అనగా సంస్థానం… తను పెద్ద దొర… ఇప్పుడు కొందరు ఎంపీ అభ్యర్థుల ఆస్తులు 5 వేలు, 6 వేల కోట్లు అని అబ్బురంగా చెప్పుకుంటున్నాం కదా… ఒక్క ముక్కలో చెబుతాను సురేందర్‌రెడ్డి ఆస్తి గురించి… తన భూమిలోకి ఒక రైలు ఎంటరైతే పావు గంట […]
అమ్మా తల్లే… నోర్మూయవే… నోటి ముత్యాల్ జార్నీయకే…
ఈమధ్య ఓ కథనం చదివారు కదా… నటి కస్తూరి నవ్వు పుట్టించే మాటల మీద… చెప్పే నోటికి వినేవాడు అలుసు అని ఇదుగో ఈమె వంటి కేరక్టర్ల వల్లే పుట్టిన సామెత… తాజాగా మళ్లీ కూసింది ఏదేదో… అవునూ, మొన్న ఏం చెప్పిందో సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే… మోహన్‌బాబుతో ఓ ప్రాజెక్టులో చాన్స్ వచ్చింది కానీ చేయలేకపోయాను… రజినీకాంత్‌తో మూడుసార్లు అవకాశం వచ్చింది, కానీ మూడుసార్లూ నటించలేకపోయాను, కాలా మూవీలో కూడా చాన్స్ ఇచ్చారు కానీ మరీ యంగ్‌గా […]
అక్షరాలకు డిజిటల్ రెక్కలు… తెలుగు పుస్తకంలో కొత్త పాత్రలు…
Taadi Prakash…….. అక్షరాలకు డిజిటల్ రెక్కలు The Fast Changing Face of Publishing in Telugu ………………………………………….. నీ ఇంట్లోనే ఉన్న నీ చిన్నారిపాప రెక్కల గుర్రం ఎక్కి చుక్కల లోకాల్లోకి ఎగిరిపోగలదా? నీ అయిదారేళ్ల బుజ్జి బబ్లుగాడు ఏనుగు మీద ఏడు సముద్రాలూ దాటివెళ్లి, కత్తియుద్ధంలో ఆకాశరాజుని ఓడించగలడా? ఎక్కడో కాలిఫోర్నియాలో ప్రేమ విఫలమైన యువతి మనోవేదనకు చలించి కరీంనగర్ లోని ఓ కాలేజీ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకోవడం అయ్యేపనేనా? రష్యాలో ఓ రైల్వే […]
దారుణం… కేకులో శాకరిన్… విలువ ఓ అమ్మాయి ప్రాణం…
ఒక వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది.. పంజాబ్ పాటియాలా, ఆమన్నగర్లో గత మార్చి 24న ఓ కుటుంబం ఓ బర్త్ డే కేకుకు ఆర్డర్ ఇచ్చింది… పదేళ్ల బాలిక మాన్వి బర్త్ డే అది… ఆనందంగా కేక్ కట్ చేశారు, అందరూ తీసుకున్నారు… అందరూ తన నోటిలో పెట్టి గ్రీట్ చేస్తారు కాబట్టి సహజంగానే ఆ అమ్మాయి కాస్త ఎక్కువగా తిన్నది… తరువాత ఒక్కసారిగా ఆమెకు నిద్ర ముంచుకొచ్చింది… వెళ్లి పడుకుంది, తరువాత లేచి నీళ్లు తాగి, మళ్లీ […]
న్యూట్రెండ్… కార్పొరేట్ కంపెనీకి మేనిఫెస్టో పనిని ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తే..?!
అది ఏడు చుక్కల చూడ చక్కని పూటకూళ్ల ఇల్లు. అనగా ఇంగ్లీషులో సెవెన్ స్టార్ హోటల్. స్విమ్మింగ్ పూల్ సైడ్ ఓపెన్ లాన్ పచ్చి గడ్డి కూడా పిచ్చిగా పెరగకుండా సెవెన్ స్టార్ రేటింగ్ కు తగినట్లు పెరిగీ పెరగక…పెరిగితే కత్తిరిస్తారేమో అని భయపడి…సైజ్ జీరో కోసం తినడం మానేసిన పన్నులు కట్టే లేదా పన్నులు ఎగ్గొట్టే సంపన్నుల్లా ఉంది. వెనకాల పెద్ద ఎల్ ఈ డి స్క్రీన్. దాని ముందు మైక్ పోడియం. దాని పక్కన […]
ఊరి పేరు మనదే… ఊరు మనది కాదు… అసలు ఎవరీ కావ్య పాప..?!
ఈసారి మన ఐపీఎల్ జట్టు దంచికొడుతోంది సర్, కప్పు కొట్టే చాన్స్ కూడా కనిపిస్తోంది… అని ఆనందపడిపోయాడు ఓ యువకుడు… మన అంటే ఏమిటి అన్నాను… మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సార్ అన్నాడు నావైపు ఆశ్చర్యంగా చూస్తూ… హైదరాబాద్ జట్టు అంటే మన వాళ్లదా అనడిగాను మళ్లీ అదే టోన్‌లో… పేరులోనే హైదరాబాద్ ఉంది, మనది కాదా అంటూ ఇంకా ఆశ్చర్యంగా చూశాడు నావైపు, ఇలాంటివాళ్లు ఇంకా ఈలోకంలో ఎందుకు కనిపిస్తారో అన్నట్టుగా… హైదరాబాద్ […]
ఒక వర్షాకాలపు సాయంత్రం… అప్ఘన్లో ఓచోట ఉగ్రవాదుల భేటీ…
Veerendranath Yandamoori……. అమాయక యువకుల్ని ఎలా ఉగ్రవాదులుగా మారుస్తారు? ఉగ్రవాదులు ఎందుకు అమాయకుల్ని చంపుతారు? రి-ప్రింట్ కి వచ్చిన ఈ పుస్తకంలో వివరణ ఉంది. ….ఆ కుర్రవాడు టాంక్ బండ్ పై నిలబడి ఉన్నాడు. ఈ రాత్రికి ఏమవుతుంది? కొన్ని లక్షల లీటర్ల నీరు ఒక్కసారిగా నగరం మీద పడుతుంది. ఇందిరాపార్కు నుంచి చిక్కడపల్లి వరకూ కొట్టుకుపోతాయి. కనీసం పదివేలకు తక్కువ కాకుండా మరణిస్తారు. అదే రోజు దేశంలో ఒకే సారి వంద పట్టణాల్లో అలాంటి విధ్వంసాలే […]
మరి ఏకనారీ వ్రతుడయిన రామునితో వీరికేమి సోపతి..!!
Sampathkumar Reddy Matta…. రామా.. నిన్నే నమ్మినామురా… ! ~~~~~~~~~~~~~~~~~~~~~~ అర్థనారీశ్వర తత్త్వస్వరూపుడయిన శివునిపట్ల హిజ్రాలకు అవ్యాజమైన అనురాగం ఉండుడు సరే, మరి ఏకనారీ వ్రతుడయిన రామునితో వీరికేమి సోపతి, నవమినాటి రామునిపెండ్లికి అంతటి ప్రాధాన్యత ఎందుకిస్తరు ? ఈ విషయం గురించి హిజ్రాల దగ్గర ఎన్నెన్నో ఐతిహ్యాలు.. కైకేయి కోరికమేరకు రాముడు వనవాసానికి పోతున్నందుకని తల్లడిల్లిన అయోధ్యవాసులంతా అతని వెనుకే పయమయిండ్రు. రాజ్యం పొలిమేరలదాకా వెంబడించిన అభిమానులను వారించి, ఇట్లా రావటం తగదని, పద్నాలుగేండ్ల తర్వాత […]
స్పష్టంగా… సరళంగా… సూటిగా… అచ్చ తెలుగు ప్రకటనలు ఇవి…
తెలంగాణ మట్టి ప్రకటన….. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే ప్రకటనలు, ఇంగ్లీషులో రాసినవి తెలుగులోకి అచ్చు ఇంగ్లీషులాగే అనువాదం చేసే ప్రకటనలు, తెలుగే అయినా రైల్వే స్టేషన్ యంత్రం అనౌన్స్ చేసినట్లు కర్త కర్మ క్రియా పదాల అన్వయం తేలక ఇనుప గుగ్గిళ్లే నయమనిపించే ప్రకటనల గురించి లెక్కలేనన్నిసార్లు చెప్పుకున్నాం. గుండెలు బాదుకున్నాం. కంఠ శోష మిగులుతోంది తప్ప…పట్టించుకున్న పాపాత్ముడు లేడు. భాష, భావం, అనువాదం బాగాలేని ప్రకటనల గురించి పదే పదే చెబుతున్నప్పుడు…ఎలా ఉంటే బాగుంటుందో కూడా […]
కూడలిలో విస్తరి… దృష్టిదోష నివారణా…? చేతబడా..? శని మళ్లింపా..?
Sai Vamshi…… అమావాస్య – క్షుద్ర నమ్మకాలు…. పగలు కంటే రాత్రి చాలా బాగుంటుంది. ఇదేదో సరదాగానో, శృంగారాత్మకంగానో అంటున్న మాట కాదు. రాత్రిలో ఉన్నంత ప్రశాంతత, స్వేచ్ఛ పగటి వేళ దొరకడం కష్టం. నేను రాసిన 12 కథల్లో 11 కథలు రాత్రి పూట రాసినవే! వందల FB పోస్టులు అర్ధరాత్రికాడ రాసినవే! Night Shift ఉద్యోగాలు చేసే ఎవరినైనా అడిగి చూడండి, ‘మీకు చీకటంటే భయమా?’ అని. ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు. అంతగా […]
జనాల్ని వదల్లేదు… వనాల్ని కూడా వదల్లేదు… దోచేసుకున్నారు…
బీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతి మయమే… ఈ మాట అనడానికి శషభిషలు అక్కర్లేదు… రేవంత్ ప్రభుత్వం తవ్వేకొద్దీ బయటపడుతున్న అక్రమాలు మొత్తం తెలంగాణ సమాజాన్ని విస్తుపరుస్తున్నాయి… ఇలాంటి నాయకులనా పదేళ్లు మోసింది అనే ఓ విస్మయం… ఆబగా ఒక్కొక్క నాయకుడూ, ఒక్కొక్క అధికారీ జనాన్నే కాదు… వనాల్ని కూడా దోచుకున్నారు… ఇది అదే… మొన్న చెప్పుకున్నట్టు రేవంత్ ఐదేళ్లపాటు తవ్వినా సరే బీఆర్ఎస్ తాలూకు బాగోతాలు ఇంకా బయటపడుతూనే ఉంటాయి… ఈ తాజా వార్త ఏమిటంటే..? ‘‘బీఆర్ఎస్ […]
- « Previous Page
- 1
- …
- 60
- 61
- 62
- 63
- 64
- …
- 126
- Next Page »