Open Warning: ముందు ముందు రోగానికి మందులు దొరక్కపోయినా…నిషా మందుకు మాత్రం ఢోకా ఉండదు. మద్యానికి “మందు” అన్నమాట ఎలా అన్వయమవుతుందో నాకు అర్థం కాదు. ఆ మాటకు వ్యుత్పత్తి అర్థాన్ని సాధించడానికి నాకున్న ఆవగింజంత భాషా పరిజ్ఞానం చాలదు. తాగినవారి మాటలకు అర్థం ఎలా ఉండదో! మందు అన్న మాటకు అన్వయం కూడా అలాగే ఉండదు అనుకుని మౌనంగా ఉండడం ఒక పద్ధతి. బాగా గాయాలయినప్పుడు విశ్రాంతి కోసం మత్తు మందు- ఇంజెక్షన్ లేదా స్లీపింగ్ టాబ్లెట్స్ […]
అలా రామోజీరావు పంపిన ముందస్తు చెక్కును ఆరుద్ర వాపస్ పంపించేశారు…
Taadi Prakash ……….. June 4, ఆరుద్ర వర్ధంతి. కొండగాలి తిరిగిందీ… ఆరుద్రని గనక ఒక్కసారి కలిసి ఉంటే…ఆయనతో మాట్లాడి ఒక్కకాఫీ తాగగలిగి వుంటే, ఆరుద్రతో ఒక్కరోజు గడపగలిగి ఉంటే, ఆయన ఉపన్యాసం వినగలిగి వుంటే…దేవుడా! ఎంత బావుణ్ణు అని ఇపుడు అనిపిస్తుంది, తెలుగు సాహిత్యాన్ని ప్రేమించే వారెవరికైనా! ఆ గొప్ప సాహితీవేత్తని, ‘అపరాధ పరిశోధకుణ్ణి’ కలిశాను, మాట్లాడాను అని చెప్పుకోవడం ఎంత తియ్యగా ఉంటుందో కదా! తోట భావనారాయణ అనే సీనియర్ జర్నలిస్ట్ కి ఆ […]
కృత్రిమ మేధ… ప్రయోగపరీక్షలో ఆ డ్రోన్ ఆపరేటర్‌నే హతం చేసింది…
ఇప్పుడు టెక్నాలజీపరంగా పదే పదే వినిపిస్తున్న మాట… కృత్రిమ మేధ… అనగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్…! చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి సెర్చ్ బేస్డ్ ఏఐ ప్లాట్‌ఫారాలే కాదు… ప్రతి రంగంలోకీ ఈ కృత్రిమ మేధ వ్యాపిస్తోంది… ఇది క్రమేపీ మనిషి బుర్రను చంపేస్తుందనీ, టెక్నాలజీ మీదే మనిషి పూర్తిగా ఆధారపడి, సొంతంగా ఆలోచించే తెలివిని కోల్పోతాడనీ భయాందోళనల్ని పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే కదా… ప్రభుత్వ పాలసీల్ని నిర్దేశించే బ్యూరోక్రాట్లు, ప్రభుత్వంలో ఉండే […]
ఫాఫం రామానాయుడు… అసలు ఈ దగ్గుబాటి వారసులకు ఏమైంది హఠాత్తుగా..?
రామానాయుడు తెలివిమంతుడు… పిల్లల్లో ఎవరి భవిష్యత్తు ఏమిటో తెలుసాయనకు… అందుకే అప్పట్లోనే స్టూడియో, సినిమా నిర్మాణ వ్యవహారాలు, ఆర్థికం అంతా సురేష్ బాబుకు వదిలేశాడు… వెంకటేష్‌ను నటనలోకి దింపాడు… రానాకు సినిమాల పట్ల ఉన్న ప్యాషన్ గమనించి, నీకు నచ్చిన పాత్రలు పోషించు అన్నాడు, అంతే తప్ప నిర్బంధంగా ఓ హీరోగా ప్రేక్షకుల మీద రుద్దలేదు… రానా సోదరుడు అభిరామ్‌ను హీరోగానే కాదు, అసలు సినిమా సెట్ల దగ్గరకే రానిచ్చేవారు కాదు… నటి శ్రీరెడ్డి వివాదాస్పద వీడియోలు, […]
తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…
Murali Buddha……… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళుతున్నాను .. తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగి వస్తాను .. కోట్ల మందికి విశ్వాసం కలిగించి .. ఆత్మహత్యలను ఆపిన ఒక్క మాట……… జర్నలిస్ట్ జ్ఞాపకాలు… ————————- అంతా అయ్యాక ఇప్పుడు ఏ టుంరీలు ఏమైనా మాట్లాడవచ్చు . కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఈజీగా ఏమీ రాలేదు . ప్రతి క్షణం సస్పెన్స్ .. నరాలు తెగేంత ఉత్కంఠ … ఏమవుతుందో తెలియని భయం .. మరో వైపు మాఫియా […]
ఇలేకరుల ఇజ్జత్ తీసుడు తప్పితే ఏం ఒరగబెట్టినవో చెప్పు..!?
Shankar Rao Shenkesi………. ఏం జేసినవో చెప్పు!? ‘బక్క పల్సటి ప్యాదోన్ని..’ అంటూ నువ్వు బహిరంగ సభలల్ల మాట్లాడుతుంటే మా అసంటోనివేనని మస్తు ఖుష్ అయ్యేటోళ్లం ‘తెలంగాణ వచ్చుడో.. నేను సచ్చుడో..’ అని నువ్వు స్టేజీలపైన గర్జిస్తాంటే గొంతు కలుపుతూ బిగి పిడికిళ్లను గాలిలోకి ఎత్తెటోళ్లం నువ్వు లేసి ఉర్కినప్పుడు కలాలు చేబూని నీ యెంట ఉరికొచ్చినం నువ్వు కారణం చెప్పకుండా పన్నప్పుడు ఎప్పుడు లేస్తవోనని కన్నార్పకుండా ఎదురుచూసినం ఉద్యమంల హీరోగ ఎత్తిపట్టినం ప్రజలల్ల పల్సన కాకుండా […]
భార్యాభర్తలు ఇలా సంగీతంలో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటారూ..?
Bharadwaja Rangavajhala…….. భార్యా భర్తలు ఇలా సంగీతంలో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటారూ ? మొన్న మీరేమన్నారూ …. వలచి రాగంలో వెన్నెలరేయీ ఎంతో చలీ చలీ అన్లేదూ … అదెప్పటి మాట వేసవి రాకపూర్వం … ఇప్పుడు ఇందాక వర్షం పడ్డాక పరిస్తితి చూస్తుంటే … వలచిలోనే నా రాణి కనులలోనా అని పాడాలనుంది. సర్లెండి … ఎవరేనా వింటే నవ్వుతారు… వసంతగాలికి వలపులు రేగ అని పాడే వయసా మనది వలచి రాగంలోనే … అందుకే […]
దమ్మున్న మీడియా దీవించిందా..? ఐతే మరి మటాషే… చరిత్ర చెబుతోందిక్కడ…
Murali Buddha…….. దమ్మున్న మీడియా దీవిస్తే ఎవరైనా మటాషే ….. విజయశాంతి నుంచి షర్మిల వరకు సేమ్ రిజల్ట్స్ జర్నలిస్ట్ జ్ఞాపకాలు- —————— షర్మిల పార్టీని కాంగ్రెస్ లో కలిపేయమని ఒకరు పిలుపు ఇస్తే , ఆంధ్ర కాంగ్రెస్ లో చేరమని మరొకరి పిలుపు . ప్రతిరోజు ఆంధ్రజ్యోతి మొదటి పేజీని అలంకరించి , సీఎంలను మించి ఆ మీడియాలో ప్రాధాన్యత పొందిన షర్మిలకు ఎన్ని సీట్లు అనే చర్చ నుంచి అసలు ఆమె పోటీ చేస్తుందా […]
కేసీయార్ సార్.., పనిలోపనిగా ఇదే ఊపులో ‘బ్రాహ్మణబంధు’ ప్రకటించండి సార్…
Nancharaiah Merugumala……….. తెలంగాణ ‘విప్రహిత’ ముఖ్యమంత్రి కేసీఆర్… త్వరలో ‘బ్రాహ్మణ బంధు’ ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు! ………………….. తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు శుక్రవారం (2023 జూన్ 2) పదో ఏడాదిలోకి అడుగుబెడుతున్నారు. ఈ గొప్ప సందర్భానికి ముందు బుధవారం ఆయన హైదరాబాద్ గోపనపల్లిలో ఆరెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ‘విప్రహిత’ బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించడం డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన గొప్ప పుణ్యకార్యం. తెలంగాణ […]
మిస్సింగ్ హత్యలు… ఎన్టీయార్ సర్కారు ప్రవేశపెట్టిన కొత్తరకం హత్యాకాండ…
Bharadwaja Rangavajhala…….. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సర సందర్భంగా …. ఎన్టీఆర్ హయాంలో మొదలైన మిస్సింగ్ హత్యలు …. నక్సలైట్లే దేశభక్తులు అని ఎన్నికల సభల్లో ప్రకటించి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ …. పాలనలో అంతకు ముందున్న కాంగ్రెస్ పాలనలో లేని ఓ కొత్త పద్దతిని ఎన్టీఆర్ పోలీసులు అమల్లోకి తీసుకువచ్చారు. అదేమిటీ అంటే …. మనుషుల్ని మాయం చేసి చంపేయడం … ఎవరైనా అడిగితే మాకేం తెల్సూ అని బుకాయించడం. లాకప్పు మరణాలు , గుంపుల మీద […]
అప్పట్లో ఊ అనిఉంటే కోట్లకుకోట్లు… భయపడి ఊహూ అనేశాం…
Murali Buddha……… అప్పుడు ఊ… అని ఉంటే ఇప్పుడు రెండు వేల కోట్లకు అధిపతిని… ఉహూ అనేసి, అక్షరాలు రాసుకొని బతికేశా… ఖరీదైన జీవిత పాఠం…. జర్నలిస్ట్ జ్ఞాపకాలు ———————————————- ఊ అంటావా మామ ఊహు అంటావా మామ అని సమంత అడిగితే పాపం అమాయకురాలు అనిపించింది . ఊహు అని ఎవడంటాడు .. ఊ అనే అంటాడు కదా ? మేం అన్నాం … ఇప్పుడు కాదు మూడున్నర దశాబ్దాల క్రితం . మేం అంటే […]
మద్యమే రాష్ట్ర ఆదాయానికి ఇరుసు… ఈ ప్రగతిని ఏమని కీర్తించను..?!
ఉత్సవ తెలంగాణ – వాస్తవ తెలంగాణ….. రాష్టవిర్భావం తర్వాత ‘నీళ్ళు నిధులు నియామకాల’ యాజమాన్యం కన్నా సామాన్య జనం కష్టార్జితాన్ని కాజేసే మద్యం సరఫరా పెరగడమే ఈ పదేళ్ళ తెలంగాణా విషాద వైఫల్యం అని తొలుత చెప్పక తప్పదు. ———————— ఇంకో రెండు రోజుల్లో స్వరాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో రాష్ట్రం సాధించిన ప్రగతి విషయంలో మొదటగా చెప్పుకునే విషయం మద్యం (లిక్కర్ ) ఐతే బాగుంటుందేమో! నిజానికి రాష్టం ఏర్పాటయ్యాక మంచి చెడులు రెండూ […]
హేమిటీ… అంతటి పరిటాలను బహిరంగంగా చెంపదెబ్బ కొట్టాడా… ఎవరాయన..?
Murali Buddha……. ఒక్క చెంప దెబ్బతో అతని దశ తిరిగింది … ఇద్దరి సీఎం అభిమానం పొందారు … జర్నలిస్ట్ జ్ఞాపకాలు -… జాతి రత్నాలు అంటూ ఎన్టీఆర్ ఫోటో చూపించి రెండవ స్థానంలో పరిటాల రవి ఫోటో చూపిస్తారు కొందరు. వన భోజనాలు, సమావేశాల్లో ఎన్టీఆర్ కటౌట్ తరువాత పరిటాల కటౌట్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది . అలాంటి పరిటాలను ఒక అధికారి చెంపదెబ్బ కొడితే ఎలా ఉంటుంది ? ఏం మాట్లాడుతున్నావు ? పరిటాలను […]
హబ్బ… ఏం వాయిస్తున్నారురా… ఒకడిది భజన డప్పు… ఇంకొకడిది దండకాల డీజే…
పెద్ద ఆశ్చర్యమేమీ లేదు ఇందులో… తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగో తరగతులు చదివే పోరగాళ్లకు సైతం తెలుసు… సాక్షి జగన్ సొంత పత్రిక… వైసీపీ డప్పు… ఎడిటోరియల్ వ్యాసాలు, ప్రత్యేక కథనాలు, బ్యానర్ స్టోరీలు… అన్నీ చంద్రబాబు మీద ద్వేషం, జగన్ కీర్తన… ఆ గీతలు దాటితేనే తనను మాలిన ధర్మం అవుతుంది… అది ఎప్పుడూ ఓ పత్రికలా ఉండలేదు… నమస్తే తెలంగాణ బీఆర్ఎస్కు ఎలా కరపత్రికో వైసీపీకి సాక్షి అలా… సో, జగన్ నాలుగేళ్ల బంగారు […]
రండి… మనసారా ఏడవండి… నాణ్యమైన కన్నీటికి మాదీ గ్యారంటీ…
Keep Crying: “ఏడ్పు జీవలక్షణమట, ఏడ్వకున్న కొట్టి ఏడ్పింతురట బిడ్డ పుట్టగానె, ఎంత ఇష్టమొ నరజాతి కేడుపన్న? అతని ఏడ్పున కసలైన యర్థమేమొ?” -ఆత్రేయ పద్యం తెలుగునాట మనసున్న ప్రతివారినీ ఆత్రేయ ఏడిపిస్తూనే ఉంటాడు. గుండె పగిలిపోవువరకు మనచేత ఏడిపిస్తాడు. గుండె ముక్కలయినా…ఆ ముక్కలు కూడా విడివిడిగా లెక్కలేని రూపాలుగా ఏడవాలంటాడు. గుండె ఏడ్చి ఏడ్చి కన్నీరు మున్నీరై పొంగిపోవాలంటాడు. తలచుకుని తలచుకుని ఏడవాలంటాడు. ఏమీ తోచక ఏడవాలంటాడు. ఉన్నది పోయినందుకు ఏడవాలంటాడు. లేనిది కోరి, దొరకక ఏడవాలంటాడు. మనసిచ్చి […]
అసలు రోగం మన ఎన్నికల వ్యవస్థలోనే… ఈ ఉచిత హామీలన్నీ ఆ రోగలక్షణాలే…
ఎవరూ తక్కువ కాదు… పోలింగ్ రోజున వోటర్లకు నగదు పంపిణీ చేయడంకన్నా ఇది తక్కువ నైచ్యమేమీ కాదు… ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం… ఇదీ ఎన్నికల అక్రమమే… కాకపోతే దేశంలో ఓ దిక్కుమాలిన ఎన్నికల సంఘం ఉంది కాబట్టి అన్ని పార్టీల ఈ దుశ్చర్యలూ చల్తా… ఓ చిన్న సంగతి చెప్పుకుందాం… చంద్రబాబు బుర్రలో ఏ(ది మెదిలితే అది ఓ కాగితం మీద రాసిపారేసి, రాబోయే ఎన్నికలకు తొలి దఫా మేనిఫెస్టో అని ప్రకటించేశాడు… అందులో తల్లులకు డబ్బులిచ్చే […]
ఎన్టీయార్ ఉసురు తగిలినోళ్లు- ఎన్టీయార్‌ను ముంచి పైకి ఎదిగినవాళ్లు…
Murali Buddha………. ఎన్టీఆర్ ఉసురు తగులుతుందా ? విగ్రహానికి వెనుక నుంచి మొక్కిన ముస్లిం మహిళా నేత…. జర్నలిస్ట్ జ్ఞాపకాలు- ————————————- శత్రువును ఎదుర్కోలేని బలహీనమైన వ్యక్తి ‘‘నిన్ను దేవుడే చూసుకుంటాడు . నాకు అన్యాయం చేశావు నా ఉసురు నీకు తగులుతుంది’’ .అని శపిస్తాడు . శాపాలు నిజం అవుతాయా ? నిజంగా ఉసురు తగులుతుందా ? ఏమో ఇది కూడా దేవుడు ఉన్నాడా ? లేడా ? దయ్యాలు నిజమా ? అబద్దమా ? […]
యుగపురుష్, శకపురుష్, అవతారపురుష్, తెలుగుజాతి మూలపురుష్…
యుగపురుష్, శకపురుష్, అవతారపురుష్, తెలుగుజాతి మూలపురుష్…. అని కొన్నిరోజులుగా మీడియా, ఒక పార్టీ తెగపొగుడుతున్న ఎన్టీయార్ మరో కోణం లేదా..? రాస్తే ఒడవనంత ఉంది… రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు Gurram Seetaramulu… ఏమంటాడంటే..? “అవతార పురుషుడివి సావి” కొందరు జనాలకు మతిమరుపు అనుకుంటారు; కాలం నమోదు చేసిన చేదు నిజాలు దాచేస్తే దాగవు, మూసేస్తే మరుగున పడవు. ఎన్టీఆర్ కు వందేళ్ళు, అందరూ ఆయన తిండి, బట్ట, కట్టు, బొట్టు గురించి మాట్లాడుకుంటారు. నేను కల్చరల్ స్టడీస్ చదువుకున్నా, […]
రాజదండం అనగా పెత్తనసూచిక కాదు… దండించునది, పాలించునది…
To Control: అప్పుడు అనంతపురం జిల్లా. ఇప్పుడు సత్యసాయి జిల్లా. లేపాక్షి- కంచిసముద్రం ఊళ్ల మధ్య వివేకానంద జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల. రోడ్డుకు ఒక వైపు సువిశాలమయిన పాఠశాల. ఎదురుగా రోడ్డు దాటగానే చెరువు కట్టదాకా కనుచూపుమేర ప్లే గ్రౌండ్. ఇప్పుడంటే ఊరికో పాఠశాల. నేను అక్కడ చదివిన 1980-84 రోజుల్లో దాదాపు ఇరవై ఊళ్లకు అది చదువుల దేవాలయం. 1400 మంది గ్రామీణ విద్యార్థులతో మిసమిసలాడుతూ, తుళ్లుతూ, పొంగుతూ ఉండేది. “గో ఇన్ ద లైన్” అని అరివీర […]
హలం… నువ్వుంటే కోలాహలం… లేకుంటే హాలాహలం…
హలం, నువ్వుంటే కోలాహలం, లేకుంటే హాలాహలం అని ఓ పాటే రాయించేశారు…
- « Previous Page
- 1
- …
- 59
- 60
- 61
- 62
- 63
- …
- 101
- Next Page »