ఇక ఈ దేశాన్ని, ఈ న్యాయవ్యవస్థను బాగుచేయడం నా వల్ల కాదు అన్నట్టుగా సాగిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాసంలోకి మరీ లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు… తన బాస్ జైలులో పడితే అర్జెంటుగా బెయిల్ ఇచ్చేయాలి, క్వాష్ పిటిషన్ క్లియర్ చేసి, చంద్రబాబును బయటికి పంపించేయాలి… కేసులు పెట్టిన సీఐడీ అధికారులను, వాళ్ల బాస్ జగన్‌ను శిక్షించాలి వీలైతే… అన్నట్గుగా సాగింది తన వ్యాసం… సహజమే… చంద్రబాబు గురించి చంద్రబాబుకన్నా ఎక్కువ ఆందోళనపడే బ్యాచులో అగ్రగణ్యుడు రాధాకృష్ణ… […]
బతుకమ్మను పేర్చే గునుగు పూలు… రొట్టెలకు కూరలై… బతికించాయి,
Kandukuri Ramesh Babu ….. విను తెలంగాణ -3…. వలస కూలీల ‘గునుగు కూర’ గురించి విన్నారా? పాలమూరు ఉమ్మడి జిల్లాల్లో వలస వెళ్లడానికి గల కారణాలు అన్వేషిస్తుండగా 70 దశంలో వచ్చిన తీవ్రమైన కరువు గురించి చాలామంది వివరించి చెప్పారు. దాదాపు ఏడేళ్ల తీవ్రమైన కరువు వారిని అనేక విధాల ఇబ్బందులు పెట్టిందని చెప్పారు. అప్పటికే వలస వెళ్లడం మొదలైన వారికి అదనంగా OC కులస్తులు తప్పించి మిగతా కులాల వారంతా పెద్ద ఎత్తున వలస […]
కార్ల అంత్యక్రియలు అంత వీజీ కాదు… స్క్రాపింగ్కూ ఓ పాలసీ…
Car- Re’Cycle’: మనిషి చనిపోతే అంత్యక్రియలు తప్పనిసరి. మరి- వాహనాలు పనికిరాకుండా మూలన పడి…పాడైపోయి… రిపేరులు చేయడానికి ఏమాత్రం వీలుకాక…చనిపోతే అంత్యక్రియలు చేయాలా? వద్దా? అన్నది భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రశ్న. తప్పనిసరిగా వాహనాలక్కూడా అంత్యక్రియలు చేయాల్సిందేనని ఇన్నాళ్లకు భారత ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి ఆటోమొబైల్ స్క్రాపింగ్ పాలసీ (దీనిని అచ్చ తెలుగులో తుక్కు తుక్కుగా నలగ్గొట్టడం లేదా పచ్చడి చేయడానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన అందురు) తయారై…ఈమధ్యే అమల్లోకి వచ్చింది. ఒక కారు తయారు కావడానికి ఒకప్పుడు కొన్ని […]
వ్యభిచారం, స్వలింగ వివాహాలు ఇకపై కఠిన శిక్షార్హమైన నేరాలట…
సుప్రీంకోర్టు ఏం చెబుతోంది… స్వలింగ వివాహాలను నేరంగా పరిగణించలేం అంటోంది… అలాగే ఇష్టమున్న వ్యక్తుల సంభోగాన్ని కూడా నేరంగా చూడలేం అంటోంది… స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377 ను కొట్టిపారేసింది కూడా… సేమ్, వ్యభిచారాన్ని తప్పుగా చూసే ఐపీసీ సెక్షన్ 497 ను కూడా కొట్టేసింది… ఈ రెండు సెక్షన్లు రాజ్యాంగంలోని 14, 15, 19, 21 అధికరణాలకు వ్యతిరేకమనీ అభిప్రాయపడింది… ఐనా ఇప్పటికీ వ్యభిచారం కేసులు పెడుతూ కాలర్లు ఎగరేస్తూనే ఉంటారు […]
పోగుల గణేశం… నాడు ఆర్మీలో బ్రిగేడియర్… నేడు పల్లె శోధనలో బ్రిగేడియర్…
Kandukuri Ramesh Babu…….. #విను_తెలంగాణా#2 …. పామరుల జ్ఞానం విను – చాటు : అదే ‘పల్లె సృజన’ ‘ … సికింద్రాబాద్ సమీపంలోని వాయుపురిలోని ‘పల్లె సృజన’ అన్న కార్యాలయం ఒక ‘గ్రామీణ విశ్వవిద్యాలయం’ అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. దాని వ్యవస్థాపకులైన పోగుల గణేశం గారిని ఈ యూనివర్సిటీకి అనధికార వైస్ చాన్సలర్ ని మించిన విద్యావేత్త అనే చెప్పాలి. అవును మరి. ఆయన అతి త్వరలో దేశంలోని సుమారు రెండువందలా యాభై మంది […]
విను తెలంగాణ -1… బడి అంటే చదువు మాత్రమే కాదు…
విను తెలంగాణ^1 : బడి అంటే చదువు మాత్రమే కాదు! నిన్న చాంద్రాయణగుట్టలో ఉన్న ఎంవిఎఫ్ రెసిడెన్శియల్ క్యాంప్ లో ఆ సంస్థ జాతీయ కన్వీనర్ శ్రీ వెంకట్ రెడ్డి గారిని మరోసారి కలుసుకుని వారి దశాబ్దాల కార్యాచరణ నుంచి ‘బడి’ గురించి లోతైన అవగాహన పెంచుకునే ప్రయత్నం చేశాను. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక నిర్లక్ష్యం కాబడిన ‘బడి’ మాత్రమే కాదు, దశాబ్దాలుగా బడి, అది నిర్వహించిన మహత్తర పాత్ర, దానికంటే ముందు ఆ బడి కోసం […]
మన మాజీ నేవీ ఆఫీసర్లకు ఖతార్ మరణశిక్ష… అసలు కథేమిటంటే…
పార్ధసారధి పోట్లూరి ……… 8 మంది భారత మాజీ నావికదళ సిబ్బందికి మరణ శిక్ష విధించిన ఖతార్ కోర్టు! ఇది గత సంవత్సరం నుండి అనుకుంటున్నదే! నేపధ్యం ఏమిటి? ఖతార్ కి చెందిన అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ మరియు కన్సల్టెంట్ సర్వీసెన్ (Al Dahra Global Technologies and Consultancy Services ) అనే సంస్థ భారత నావికా దళంలో పని చేసి పదవీ విరమణ చేసిన అధికారులని తమ సంస్థలో నియమించుకుంది. సదరు సంస్థని ఒమన్ […]
అత్యంత ప్రజాస్వామిక భుజబల ప్రదర్శన… ఎన్నిలంటే అదే కదా…
Tight Fight: ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, ప్రజలే అత్యంత బలసంపన్నులని రాజనీతి శాస్త్రంలో ఒళ్లు పులకించే, మనసంతా నిండిపోయే పాఠాలు ఎన్నెన్నో ఉంటాయి. వాటిని చదువుకున్నవాళ్లకు ఒకలా అర్థమవుతాయి. వాటి జోలికి వెళ్లనివాళ్లకు ప్రజాస్వామ్యం ఒక బ్రహ్మపదార్థం. ప్రజాస్వామ్యం బలమయినది అవునో కాదో కానీ…ప్రజాస్వామ్యంలో కొందరు ప్రజాప్రతినితిధులు మాత్రం భీముడు చిన్నబోవాల్సినంత బలమయినవారు. మల్లయోధులు. ముష్టిఘాతాల్లో సిద్ధహస్తులు. తుపాకి కాల్చడంలో నిపుణులు. చెంప చెళ్లుమనిపించడంలో చురుకైనవారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్ టీ వీ గెలుపెవరిది? అని ప్రజల […]
మునుపటి మొసాద్ కాదు… అప్పటి బలమైన ఇజ్రాయిల్ సైన్యమూ లేదు…
IDF-ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్స్! IDF మునపటి లాగా లేదు! ఇజ్రాయెల్ గతంలో లాగా శక్తివంతంగా ఇప్పుడు లేదు…73 ఏళ్ల మాజీ IDF అధికారి వ్యాఖ్య ఇది…. ఈ 73 ఏళ్ల IDF అధికారి 2006 లో లేబనాన్ లోని హెజ్బొల్లా తో జరిగిన పోరులో తీవ్రంగా గాయపడి సర్వీస్ నుండి రిటైర్ అవ్వాల్సి వచ్చింది! సదరు IDF అధికారి గతంలో ఉన్న IDF కి ఇప్పటి IDF కి తేడా ఏమిటో చెప్పాడు… ఆయన మాటల్లో… 1948-ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడ్డ రోజులు! 1948 […]
ఇద్దరి ఇంటి పేర్లూ ఒకటే… కుల బంధువులే… మరెక్కడ పుట్టింది కీచులాట…
Nancharaiah Merugumala…….. కుత్బుల్లాపూర్ గౌడ ‘కూన’లు ఎంతగా కలబడినా ‘కొలను’ రెడ్డికి ఫాయిదా ఉండదు! ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా… కాకినాడ రూరలో, రామచంద్రపురమో కాదు… ………………………………….. బుధవారం సూరారం రాంలీలా మైదానంలో– జాబిలీ హిల్స్‌లో భూమి విలువేగాక, హైదరాబాద్ నగర శివార్లలోని నేల ఖరీదెంతో తెలిసిన ఓ కృష్ణా జిల్లా ‘సెటిలర్’ యాజమాన్యంలోని ఓ తెలుగు టీవీ న్యూజ్ చానల్ నిర్వహించిన బహిరంగ చర్చలో… ఒకే కులానికి చెందడమేగాకుండా ఒకే ఇంటి పేరున్న ప్రస్తుత ఎమ్మెల్యే […]
హలో.. పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నారా..? అడ్డగోలుగా బుక్కవుతారు సుమా..!!
ఎన్నికల కోడ్ అనేది తెలంగాణ ఎన్నికల్లో ఓ ఫార్స్లా తయారైంది… ఐటీ శాఖ డీజీ సంజయ్ బహదూర్ ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాడు… 59.93 కోట్ల నగదును పోలీసులు పట్టుకుంటే అందులో లెక్కల్లేని నగదు కేవలం 1.7 కోట్లు అట… ఇప్పటికే యజమానులకు 10.99 కోట్లు అప్పగించారట… మరోవైపు ఇంత నగదు పట్టుకున్నాం, ఇన్ని బంగారు నగలు పట్టేశాం అని గొప్పలు చెప్పుకుంటోంది అధికార యంత్రాంగం… మరి 156 కిలోల బంగారం, 454 కిలోల వెండి మాటేమిటి అంటారా..? […]
ఇదీ టైగర్ నాగేశ్వరరావు అసలు కథ… మూడు రోజులపాటు శవయాత్ర…
ఈ కథనం Amarnath Vasireddy… షేర్ చేసుకున్న ఓ పోస్టు… మొన్న మనం ఎన్కౌంటర్ పింగళి దశరథరామ్ జీవితం గురించిన కథనం చదువుకున్నాం కదా… దాని రచయిత ఎన్జే విద్యాసాగరే ఈ టైగర్ నాగేశ్వరరావు కథనూ సవివరంగా చెప్పింది… టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఏం చూపించారో వదిలేయండి… సినిమా కదా చాలా క్రియేటివ్ లిబర్టీ తీసుకుని ఏవేవో మార్పులు చేస్తారు… అసలు టైగర్ కథ ఏమిటి..? (టైగర్ నాగేశ్వరరావు గురించి తెలుసుకోవాలని 2010లో స్టువార్టుపురం చీరాల చుట్టుప్రక్కల వూళ్ళు […]
పెళ్లయితే చాలు ఇక కిచెన్ పరుగులే… ఆటల్లేవ్, పతకాల్లేవ్, షీల్డుల్లేవ్…
… మీ ఊళ్లో స్పోర్ట్స్ అసోసియేషన్లు ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. మగపిల్లలకు సమాన సంఖ్యలోనో, కాస్త తక్కువగానో ఆడపిల్లలూ ఆడుతుంటారు. బోలెడన్ని మెడల్స్, కప్పులు వచ్చి ఉంటాయి. అందులో కొందరు జాతీయ స్థాయిలోనూ ఆడి ఉంటారు. వాళ్లంతా పెళ్లయ్యాక ఎందుకు ఆడరనేది ఎప్పుడైనా ఆలోచించారా? 130 కోట్ల దేశంలో పి.టి.ఉష, అశ్విని, మల్లీశ్వరి, సానియా, మేరీకోమ్, పి.వి.సింధు, మిథాలీ, బబిత, జరీన్.. గట్టిగా చెప్పుకుంటే వంద లోపు పేర్లు. S.ఇలవళగి అనే క్యారమ్ క్రీడాకారిణి రెండు […]
ప్రజాసేవ – ప్రజాభీష్టం – ప్రజాదేశం – ప్రజామోదం – అన్నీ భ్రమపదార్థాలు…
Bharadwaja Rangavajhala……. అంతా ప్రజలే చేస్తారు… మీరు పార్టీ మారుతున్న విషయం మీద పుకార్లు వినిపిస్తున్నాయి మీరేమంటారు? పుకార్లని మీరే అన్నారు కదా … మీకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదంటారా? లేదని చెప్పలేదు కదా … మారాల్సిన టైమొస్తే మారొచ్చు … అంటే మారుతారా? ప్రజల కోరిక మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజల అభీష్టం మేరకు రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ప్రజలు కోరితే పార్టీ మారుతాను. ప్రజలు నేను ఏ పార్టీలో ఉంటే తమకు బాగా […]
రాళ్లేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు… రాళ్లేయించుకునే రచనలొస్తున్నాయా ఇప్పుడు..?
… 33 ఏళ్ల పాటు కేరళలోని Congregation of Mother Carmel (CMC)లో నన్‌గా ఉన్న సిస్టర్ జెస్మే ఆ వ్యవస్థను ‘Mafia, with a few Good Goons’ అని వర్ణించి కేరళ క్యాథలిక్ చర్చిల్లో జరిగే లైంగిక వేధింపులు, మోసాల గురించి ‘Amen – Autobiography of a Nun’ అనే పుస్తకం రాశారు. కేరళ క్రైస్తవ సమాజం ఈ పరిణామంతో నివ్వెరపోయి ఆమె మీద బోలెడు ఆరోపణలు చేసినా వెనక్కి తగ్గలేదు. చంపుతామని […]
గుడ్ టచ్, బ్యాడ్ టచ్… ‘సవతి నాన్న’ నేర్పిన పాఠం జీవితంలోనే మర్చిపోలేను…
అమ్మ… చిన్న వయస్సులోనే మా నాన్నతో లేచి వచ్చేసింది… తరువాత… ఆయనకు మా అమ్మ ఒక్కతే భార్య కాదనీ, అప్పటికే తనకు పెళ్లాలు, పిల్లలు ఉన్నారని తెలిసింది ఆమెకు… ఆ పెళ్లితో ఆమె సుఖంగా లేదు… నాన్న మోసం చేశాడనే బాధ ఆమెను పీడించేది… పెళ్లయిన ఐదేళ్ల వరకూ ఆమెను పిల్లల్ని కూడా కననివ్వలేదు… చూసీ చూసీ, వెయిట్ చేసీ చేసీ చివరకు నేను నాలుగో తరగతి చదువుతుండగా అమ్మ నాన్నను వదిలేసింది… చాలాకాలంగా తనకు ప్రపోజ్ […]
అదె వేంకటాచల మఖిలోన్నతము, అదివో బ్రహ్మాదులకపురూపము…
Torchbearers : సంగీత, సాహిత్యాల్లో సమానమైన విద్వత్తు కలిగిన అతికొద్దిమందిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ (1893- 1979) ముందు వరుసలో ఉంటారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, ప్రాకృత భాషల్లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో సంగీతంలోకూడా అంతే ప్రావీణ్యం ఉంది. అన్నమయ్య కీర్తనలను రాగిరేకులనుండి ఎత్తి రాసి…తప్పొప్పులను పరిష్కరించి లోకానికి అందించిన నలుగురు మహా పండితుల్లో ఆయన ఒకరు. సాహితీ విమర్శకు, తెలుగు వ్యాసరచనకు ఆయన దారిదీపం. “అన్నమాచార్యుని కవిత” అన్న శీర్షికతో ఆయన 1955లో రాసిన వ్యాసం ఎమెస్కో సంస్థ 2017 […]
రావణదహనం కాదు… కొన్ని తమిళ ప్రాంతాల్లో రామదహనం… ఈ కథేమిటనగా…
రావణ దహనానికి వ్యతిరేకంగా శ్రీరామదహనం – ద్రవిడ అస్తిత్వవాద ప్రకటన… విజయదశమి సందర్భంగా చాలా చోట్ల రావణ దహనం చేస్తారు. ఎందుకు? రామాయణం ప్రకారం విజయదశమి నాడే రాముడు రావణుడ్ని వధించాడని నమ్ముతారు కాబట్టి. ఆ నమ్మకం ఏళ్లకేళ్లుగా సాగుతూ రావణదహనం నిరాటంకంగా సాగుతోంది. మనదేశంలో ఒకప్పుడు రామదహనం కూడా చేపట్టారని తెలుసా? రామ్‌లీలకు వ్యతిరేకంగా ‘రావణలీల’ జరిగిన కాలం ఒకటి ఉండింది. ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రం తమిళనాడులోనే. ప్రముఖ ఉద్యమకారుడు, ఆత్మగౌరవ ఉద్యమ […]
తెలుగు పాత్రికేయంలో తొలి, తుది అగ్నికలం… ప్రతి అక్షరమూ ఓ అగ్నికణం…
తెలుగు దేశంలో లుచ్ఛా ఎం.ఎల్.ఏ.లు! ది డర్టీ పొలిటికల్ క్రూక్ భవనం వెంకట్రాం! అజ్ఞాని జైల్‌సింగ్ రాష్ట్రపతా? హ్హి! హ్హి! హ్హి! ఎన్టీవోడు రాత్రిళ్ళు చీరెందుకు కడుతున్నాడు? అమ్మోరి సొమ్ము కమ్మోరికే! ఈ తరహా హెడ్డింగులతో 1980 నుండి 1985 వరకు ఒక పత్రిక ఆంధ్రప్రదేశ్‌లో వుండేది. ఆ పత్రిక పేరు ‘‘ఎన్కౌంటర్.’’ ఎడిటర్ పేరు ‘పింగళి దశరథరామ్’. యెనభయ్యవ దశకంలో అప్పటి యువతరంలో రాజకీయ సామాజిక చైతన్యం రగిలించిన ముగ్గురు యువకులు గద్దర్, కత్తి పద్మారావు, […]
అనూహ్యం… బిగ్‌బాస్ వీకెండ్ షో అదిరింది… ఓవరాల్‌గా శోభాశెట్టి గుడ్…
ఏమాటకామాట… బిగ్‌బాస్ వీకెండ్ షోలలో నాగార్జునకు భలే డ్రెస్సులు వేస్తారు… ఈమధ్య ఆయన వేసుకునే చొక్కాల ఖరీదు 60 వేలు, లక్షా 80 వేలు అంటూ ఆధారాలతో సహా కొందరు పోస్టులు పెడుతున్నారు… ఈరోజు వేసుకున్న షర్ట్ బహుశా ఏదో పాలిస్టర్ పూల చీరెను కట్ చేసి కుట్టినట్టుంది… ధర ఎంతో తెలియదు… చిన్నప్పుడు రేషన్ బట్ట దొరికేది… చౌకగా వస్త్రాలు ఇచ్చేవాళ్లు… ఎక్కువగా ప్లెయిన్ చేనేత బట్టలే ఉండేవి… కొన్ని డిజైన్లలో వచ్చేవి… శీటి బట్టలు […]
- « Previous Page
- 1
- …
- 66
- 67
- 68
- 69
- 70
- …
- 125
- Next Page »