అచ్చ నిజామాబాద్ అమ్మాయి… నిఖత్ జరీన్… ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో గెలిచి, స్వర్ణాన్ని ముద్దాడింది… దేశవ్యాప్తంగా అభినందనల వర్షం కురుస్తోంది… ఇలాంటి విజయం అందుకున్న అయిదో భారతీయ మహిళా బాక్సర్ తను… అభినందనలు నిఖత్… జయహో… అయితే… నిఖత్ జరీన్ గెలుపు వెనుక ఓ కనిపించని కసి… పట్టుదల ఉంది… ఓ అవమానం ఉంది… అదే తనను ముందుకు నడిపించింది… అది మేరీకామ్ తనను అవమానించిన తీరు..!! నిఖత్ గెలుపు వార్త వినగానే మేరీకామ్తో […]
ఆ కుటుంబమే క్షమించేసింది… మళ్లీ ఇప్పుడు ఈ ఆగ్రహ ప్రకటనలేల..?!
‘‘ఇది ఓ దుర్దినం… బాధగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు రణదీప్ సూర్జేవాలా… రాజీవ్ గాంధీ హంతకుల్లో ఒకడైన పెరారివలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత ఈ వ్యాఖ్య చేశాడు… తను కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాబట్టి దీన్ని ఎఐసీసీ అధికారిక స్పందనగానే చూడాలి… ‘‘దీన్ని ఖండిస్తున్నాం, జీవితఖైదు అనుభవిస్తున్న లక్షల మందిని ఇలాగే విడుదల చేస్తారా… కేంద్రం ఓ చిల్లర, చవుకబారు రాజకీయంతో సుప్రీంకోర్టులో సరిగ్గా వాదనలు వినిపించలేక, విడుదల చేసే పరిస్థితికి కారణమైంది… ఇది […]
సోషల్ మీడియా దెబ్బకు పిండుడు దెయ్యం పరార్… ఇక కేజీఎఫ్ మిగిలింది…
అడ్డగోలు లెక్కలు ఏవో చెప్పి… చరిత్రకు పిచ్చి బాష్యాలు చెప్పి… ఇద్దరు పోరాటవీరుల కథల్ని తప్పుదోవ పట్టించి… 1200 కోట్లు పిండుకున్నా సరే రాజమౌళికి దాహం తీరలేదు… దూప ఇంకా పెరిగిపోయింది… ప్రేక్షకుల్ని ఇంకా పిండాలని అనుకున్నాడు… ఓటీటీలో రిలీజ్ చేసినా సరే, వంద కడితేనే చూస్తారు, లేకపోతే లేదు అని ఆంక్ష పెట్టాడు… టికెట్ పెట్టాడు… గుర్తుంది కదా… ఈ ‘పిండుడు స్కీం’ కోసం ప్రత్యేకంగా ట్రెయిలర్ కూడా రిలీజ్ చేశాడు… ఒక్కసారిగా రాజమౌళి మీద […]
ఠాణాలో ఫిర్యాదు… చెంపలేసుకున్న జీవిత… వైశ్య కులానికి క్షమాపణ…
ఏప్రిల్‌లో కావచ్చు బహుశా… జీవిత, రాజశేఖర్లపై 26 కోట్ల మోసం, ఒకే ఆస్తిని ఇద్దరికి అమ్మారనే ఆరోపణ, చెక్‌బౌన్స్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ అని వార్తలు వచ్చాయి… 2014లో కూడా ఓ చెక్‌బౌన్స్ కేసు… బతుకుజట్కా బండి టీవీ ప్రోగ్రాంకు సంబంధించి ఇంకేదో కేసు… జీవితకు వివాదాలు కొత్తేమీ కాదు… తాజాగా వైశ్యసమాజం ఆమెపై గుర్రుమంటోంది… హైదరాబాద్, చైతన్యపురి పోలీస్ట స్టేషన్లో వైశ్యసంఘాల ప్రతినిధులు ఆమెపై ఫిర్యాదు కూడా చేశారు… ఏదో టీవీ షోలో మాట్లాడుతూ […]
వాట్… ఒక పవన్ కల్యాణ్ సినిమాకు మరీ ఇంత తక్కువ రేటింగ్సా..?!
నిజమేనా..? పవన్ కల్యాణ్ సినిమాకు టీవీల్లో ఇంత దారుణమైన రేటింగ్సా..? ఆశ్చర్యం..! బీమ్లానాయక్ సినిమాకు దక్కిన టీవీ రేటింగ్స్ కేవలం 9.06 మాత్రమే… (హైదరాబాద్ కేటగిరీలో జస్ట్, 6.16 మాత్రమే) ఈ సినిమాకు థియేటర్లలో వచ్చిన భారీ వసూళ్లు పక్కన పెట్టేయండి, స్థూలంగా సినిమా హిట్టా, ఫ్లాపా అనే సంగతీ కాసేపు వదిలేయండి… 70 కోట్ల దాకా ఖర్చు పెడితే, 200 కోట్ల దాకా వసూలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి… సినిమా క్వాలిటీ, ఇతరత్రా గుణగణాలు […]
తెలుగు ఖూనీ ప్రక్రియలో ఈనాడుకు దీటైన సహకుట్రధారి… సాక్షి…!!
నిజంగా సాక్షిని చూస్తే జాలేస్తోంది… విపరీతంగా..! ఫాఫం జగన్ అనాలనిపిస్తోంది… తప్పేమీ లేదు… తెల్లారిలేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దుష్టచతుష్టయం, మన్నూమశానం, వీళ్ల దుంపతెగ, వీళ్లు నాశనమైపోను, ఈ మారీచ మీడియా భ్రష్టుపట్టిపోతే ఎంత బాగుండు అన్నట్టుగా తెగ శాపనార్థాలు పెడుతుంటాడు కదా… పాపం, కొన్ని విషయాల్లో ఈనాడుకన్నా ఘోరంగా తప్పులు చేసే తన సాక్షి పరిస్థితి ఏమిటో ఒక్కసారైనా ఆలోచించాడా..? అది ఏ దారిలో నడుస్తున్నదో సమీక్షించుకున్నాడా..? జనం ఎంత నవ్వుకుంటున్నారో అర్థమైందా..? ఏపీలో […]
ఇయాల్టి దినానికి ఆ భారీ బండ్ల గణేష్కన్నా ఈ చిన్న సంపూర్ణేషే తోపు..!
సెవనో క్లాక్ బ్లేడ్… నో, నో… డేగల బాబ్జీ ఉరఫ్ బండ్ల గణేష్కన్నా ఇయాల్టిదినానికి దగడ్ సాంబ ఉరఫ్ సంపూర్ణేష్ బాబు తోపు అని ప్రూవైపోయింది… అదేమిటీ, ఒకేసారి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారని అదోలా చూడకండి… పెద్ద పెద్ద స్టార్లతో భారీ భారీ చిత్రాలు తీసిన బండ్ల గణేషుడెక్కడ..? ఏవో నాలుగు స్పూఫులు తీస్తూ, పెద్ద షార్ట్ ఫిలిమ్స్‌తో ఏదో అలా అలా నెట్టుకొచ్చే సంపూర్ణేష్ ఎక్కడ..? ఇదే కదా అందరికీ వచ్చే డౌటనుమానం..! బండ్ల […]
చైనా మీద ఈగవాలితే… ఇండియన్ లెఫ్ట్ మీడియా గంగవెర్రులు…
ప్రపంచంలో ఏం జరిగినా అమెరికాను నిందించడమే వామపక్షం పని… అదేదో కమ్యూనిజం మీద చైనాకు మాత్రమే గుత్తాధిపత్య హక్కులు ఉన్నట్టుగా, చైనా ఏం చేసినా వెనకేసుకుని రావడం… ఇప్పుడూ అంతే శ్రీలంక మునిగిపోవడానికి, భ్రష్టుపట్టిపోవడానికి చైనాయే కారణమని రకరకాల విశ్లేషణలు వినిపిస్తూ ఉంటే… నో, నో, అమెరికాయే కారణం, మా చైనా శుద్దపూస, దాన్ని ఏమైనా ఉంటే బాగుండదు సుమా అన్నట్టుగా మన లెఫ్ట్ మేధావులు, పత్రికలు తెగ రాసేస్తున్నాయి… అయ్యో, అయ్యో, మా చైనా మీద […]
సో వాట్..? ప్రదీప్ అయితే తోపా..? స్టెప్పులు నేర్వాల్సిందే, గెంతాల్సిందే..!!
రాబోయే రోజుల్లో… జోస్యాలు చెప్పే స్వాములు, ప్రవచనకర్తలు, పలు డిబేట్లకు వచ్చే గెస్టులు, టీవీ న్యూస్ ప్రజెంటర్లు కూడా డాన్సులు అనబడే పిచ్చి గెంతులు నేర్చుకుంటే తప్ప టీవీ స్టూడియోల్లో అడుగుపెట్టనివ్వరేమో బహుశా…!! జోక్ అనిపిస్తోందా..? అస్సలు జోక్ కాదు… చూస్తూ ఉండండి… ఇప్పుడు ప్రతి టీవీషో ఓ తిక్కగెంతుల ప్రోగ్రామే అయిపోతోంది… డాన్స్, మ్యూజిక్, కామెడీ, ఫుడ్… ఏ ప్రోగ్రామైనా సరే, యాంకర్లకు గెంతులు తప్పవు… ఎంతటి తోపు అయినా సరే, కంటెస్టెంట్లు కూడా గెంతులు […]
ఆ తల్లిదే అలుపెరగని పోరాటం… 30 ఏళ్లుగా ఏ మార్గాన్నీ వదల్లేదు…
అర్పుతం అమ్మాల్… బహుశా మన దేశంలోని ప్రతి వ్యవస్థనూ టచ్ చేసిందామె… ఎన్నిరకాల మార్గాలున్నాయో ఏ ఒక్కటీ వదల్లేదు… తన కొడుకు పెరారివలన్‌ను వదిలిపెట్టాలని కోరుతూ ఆమె చేసిన పోరాటం వంటిది మరొకటి లేదేమో మన న్యాయవ్యవస్థలో..! తమ స్థానిక శ్రేయోభిలాషుల దగ్గర నుంచి మొదలుపెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, తమిళనాడు కేబినెట్, గవర్నర్, హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, ప్రధాని… ఎవరు సాయపడగలరని అనిపిస్తే వాళ్ల దగ్గరకు ఆమె విజ్ఞప్తి వెళ్లేది… అదీ సరైన పద్ధతిలోనే… ముప్ఫయ్ ఏళ్లుగా […]
నో స్టవ్, నో ఆయిల్, నో మసాలా, నో పోపు… ఇదీ ఒరిజినల్ ‘రా’ పచ్చడి…
పుష్కలంగా వంట దినుసులు, మసాలాలు ఉంటే… అన్నీ తరిగి పెట్టేవాళ్లు, కడిగి పెట్టేవాళ్లు, వంట చేస్తున్నప్పుడు అన్నీ రెడీగా పెట్టేవాళ్లు ఉంటే ఎన్ని వంటలైనా చేసి చూపిస్తారు మన ట్యూబ్ చెఫులు… కొత్త కొత్త ప్రయోగాలతో మన కడుపుల పాలిట డోకాసురులు అవుతారు… అలా కాదు, అసలు పొయ్యి వెలిగించే పని ఉండొద్దు… వేయించడాలు, ఉడికించడాలు, కాల్చడాలు గట్రా ఉండొద్దు… చుక్క నూనె కూడా వాడొద్దు… పోపులు, తిరగమోతలు, ఘాటెక్కించే మసాలాలు, మన్నూమశానం ఏమీ ఉండొద్దు… ఏ […]
పొయ్యి మీద ఉప్పాలి… చేతిలో మెత్తటి ముద్దవ్వాలి… ఆవకాయతో జతకలవాలి…
గ్రహచారం కొద్దీ ఓ పాపులర్ టీవీ వంటల కంపిటీషన్కు వెళ్లబడ్డాను… వంద రకాల ఇంగ్రెడియెంట్స్… కంటెస్టెంట్లు చెమటలు కక్కుతున్నారు… ఒక సగటు వంటింట్లో ఉన్నవాటికన్నా నాలుగురెట్లు ఎక్కువగా ఉన్నాయి వంట పరికరాలు, పాత్రలు, యంత్రాలు… జడ్జిల్లో ఇద్దరు ఫైవ్ స్టార్ హోటల్లో చెఫులట… ఒకాయన చాలా ఫేమస్ ఫుడ్ యూట్యూబర్ కమ్ బ్లాగర్… మరొకామె గతంలో అమెరికాలో హోటల్ నడిపించిందట… ఒక ప్లేటు… ఓ పక్కన చిన్న దోసకాయ ముక్క కోసి పెట్టాడు… మరో పక్కన అడ్డంగా […]
అధికారంలోకి వస్తే ఈవీఎంలను బంగాళాఖాతంలోకి డంప్ చేసేస్తుందా కాంగ్రెస్..?!
‘‘నెహ్రూ తొలి ప్రధానిగా దేశాభివృద్ధికి బాటలు వేశాడు… ఇందిరాగాంధీ దేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ శక్తిగా నిలబెట్టింది… రాజీవ్ గాంధీ టెక్నాలజీ శకంలోకి తీసుకుపోయాడు… మరి ఇప్పుడేమిటి ఆ కుటుంబం దేశాన్ని వెనక్కి తీసుకుపోతాను అంటోంది… స్వాతంత్ర్యపు పూర్వ రోజుల్లోకి నడిపిస్తారా ఏమిటి..? లేకపోతే బ్యాలెట్ బాక్సుల దశ నుంచి ఈవీఎంల దశకు చేరుకున్న స్థితిలో ఇంకా ఆధునికమైన ఎన్నికల సంస్కరణల వైపు ఆలోచించాల్సింది పోయి మళ్లీ బ్యాలెట్లు అంటారేమిటి..? కాంగ్రెస్‌ను ఉద్దరించడానికి ఉద్దేశించిన ఆ నవ చింతన్ […]
పెద్ద గంపల్లో అరిశెలు, సకినాలు, లడ్డూలు, గరిజెల భారీ ఊరేగింపు…
కోటి విద్యలూ కూటికొరకే కదా… ఆహారం మన సంస్కృతిలో ఓ భాగం… కానీ పాతవన్నీ కనుమరుగవుతున్నయ్… యాది చేసుకుందాం ఓసారి… Sampathkumar Reddy Matta సారు రాసిన సారెగంపల రచన ఇది… పక్కా తెలంగాణ ఆహార సంస్కృతి… పండుగలు, పబ్బాలు, శుభకార్యాలతో ముడిపడిన తీరు… తినాలి, తినబెట్టాలి… పెట్టిపోతలు తరువాత సంగతి… ఎంత బాగా కడుపు నింపావనేదే మర్యాద… మన్నన… సారెగంపలు – ఊరేగింపులు ~~~~~~~~~~~~~~~~~~~~ మన మానవ మనుగడ పరిణామక్రమంలో ఆహారసంస్కృతి పాత్ర అమృత తుల్యమైనది ! […]
హవ్వ… మీడియాకు ఎంత అవమానం..? ఓ పద్ధతీపాడూ లేకుండా డబ్బిస్తారా..?!
రీతిరివాజు తెలియని పీఆర్ టీం ఉంటే ఇలాగే ఏడుస్తుంది మరి… అరె, జర్నలిస్టులకు డబ్బులు ఇవ్వడం అనేది ఓ కళ… అందులో తెలివిడి, అనుభవం, వ్యవహారజ్ఞానం, లౌక్యం తెలిసినవాళ్లకు పెట్టుకుంటేనే మంచిది… ఈ దిక్కుమాలిన పబ్లిక్ యూనివర్శిటీలకు అదేమో తెలియదు… పిచ్చి ఎదవలు… అరె, సినిమా ఫంక్షన్లకు ఒకరకం… మామూలు రాజకీయ నాయకుల ప్రెస్మీట్లకు మరోరకం… ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఇంకోరకం… ఏ కార్యక్రమాలతో సంబంధం లేకుండా మేనేజ్ చేయబడేవి వేరేరకం… ఒక్కో కార్యక్రమానికి ఒక్కోరకంగా ఉంటుంది […]
కూరగాయలేమీ లేవ్… పుల్లటి రెండు మామిడికాయలు తప్ప… మరేం చేద్దాం..?!
యూట్యూబ్ చెఫులు, స్టార్ హోటళ్ల చెఫులు ఏవేవో చేతికొచ్చినవన్నీ ఉడికించి, కాల్చి, వేయించి, పోపు పెట్టేసి… చివరకు ఒరిజినల్ వంట ఏదో తెలియనంత గందరగోళం, చిత్రవిచిత్ర వంటల్ని పరిచయం చేస్తుంటారని చెప్పుకున్నాం కదా… మన కడుపులు కూడా మనకు ముఖ్యం కాబట్టి, తక్కువ శ్రమతో, తక్కువ సరుకులతో, తక్కువ సమయంలో, మంచి రుచికరమైన, ఒరిజినల్ టేస్ట్ చెడిపోని వంటల్ని మాత్రమే ఎంచుకుని చూస్తూ ఉండండి… అసలే రోజులు బాగాలేవు మరి… సరే, ప్రస్తత విషయానికొస్తే… మామిడికాయల సీజన్… […]
థమన్ నోట అంత పెద్ద వ్యాఖ్య వచ్చిందా..? రియల్లీ ‘ఆహా’శ్చర్యమే..!!
ఆ ఎపిసోడ్ చూస్తుంటే ఓచోట ఒక్కసారిగా హాహాశ్చర్యం ఆవరించింది… రామజోగయ్యశాస్త్రి గెస్టుగా పాల్గొన్న తెలుగు ఇండియన్ ఐడల్ తాజా ఎపిసోడ్ అది… సింగింగ్ కంటెస్టెంట్ వాగ్దేవి రంగ్‌దే పాటపాడింది… తరువాత తన అభిప్రాయం చెబుతూ థమన్… ‘‘వాగ్దేవీ, నువ్వు రాబోయే పదిహేను ఇరవై ఏళ్లు ఇండస్ట్రీని ఏలుతావు’’ అని వ్యాఖ్యానించాడు… ఆమె కూడా ఆశ్చర్యపోయింది ఆ అభినందన విని… ఎపిసోడ్ చూస్తున్న ప్రేక్షకులతోపాటు..! మ్యూజిక్ కంటెస్ట్‌కు సంబంధించిన బోలెడు టీవీషోలు ప్రతి భాషలోనూ వస్తూనే ఉంటయ్… కానీ […]
రోజూ ఒకేవేళకు పవర్ పోతోంది… ఏదో జరుగుతోంది… ఏమిటది..?
బీహార్, పూర్నియా జిల్లా, గణేష్‌పూర్… ఈమధ్య తరచూ రాత్రిపూట రెండుమూడు గంటలు కరెంటు పోతోంది… దాదాపు ఒకటే టైమ్… ప్రకటించిన కరెంటు కోత వేళలు కావు… పోనీ, అప్పుడప్పుడూ కరెంటు పోవడం సహజమే కదా అనుకుందామంటే ఒకే టైమ్‌కు కరెంటు కట్ కావడం ఏమిటి..? కొందరు గ్రామస్థులు వెళ్లి ట్రాన్స్ఫార్మర్ చూశారు… బాగానే ఉంది… పై ఆఫీసుకు ఫోన్ చేస్తే అంతా బాగానే ఉంది అంటారు… సమీపంలోని పొలాలకు వ్యవసాయ కరెంటు సరఫరా బాగానే ఉంది… మరేమిటి […]
కాజల్ కొడుకు పేరేంటి..? మియా మల్కోవా దేశమేంటి..? అలియా ఏం చదివింది..?
కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఏమిటి..? శ్రియ మొగుడి ఇంటి పేరు రాయండి..? కరీనాకపూర్ కొడుకుల పేర్ల వివాదం వివరించండి..? ప్రముఖ దర్శకుడు రాంగోపాలవర్మ మియా మల్కోవాతో తీసిన సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు..? థమన్ ఎంతవరకూ చదువుకున్నాడు..? నయనతార మొత్తం అఫైర్లు, బ్రేకప్పులను సంక్షిప్తంగా రాయండి… వనిత విజయకుమార్ నాలుగు పెళ్లిళ్లూ ఎందుకు చెడిపోయాయి..? సమంత, నాగచైతన్య విడాకులకు కారణాలు ఏమై ఉంటాయో ఊహించండి… రేప్పొద్దున మీ పిల్లల ఇంటర్ లేదా డిగ్రీ పరీక్ష పత్రాల్లో […]
శ్రీలంక బాటలో పాకిస్తాన్… చైనా సాయం, సీపీఈసీ ఎఫెక్ట్…
చైనా ఆర్థికసాయం అంటేనే ఓ విషకౌగిలి… నేపాల్‌కు అర్థమైంది… శ్రీలంకకు అర్థమయ్యేలోపు మునిగిపోయింది… బంగ్లాదేశ్ ముందుగానే జాగ్రత్తపడింది… ఇప్పుడు పాకిస్థాన్ చేతులు కాల్చుకుంటోంది… ఇండియా చుట్టూ అస్థిరత మంటలు చెలరేగడానికి కారణం చైనాయే… చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) పాకిస్థాన్‌ను తెగ ఉద్దరించేస్తుందని మభ్యపెట్టి, ఆశపెట్టి, ఆ దేశాన్ని అప్పుల్లోకి నెట్టేసింది చైనా… ఈ కారిడార్ మీదే బెలూచిస్తాన్ ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు… చైనా నిపుణులు కనిపిస్తే దాడులు చేస్తున్నారు… ఇప్పుడా సీపీఈసీ అసలు ప్రభావం స్టార్టయినట్టే కనిపిస్తోంది… […]
- « Previous Page
- 1
- …
- 86
- 87
- 88
- 89
- 90
- …
- 108
- Next Page »