Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అదే… జో జీతా వహీ సికిందర్ ! వహీ చంద్రబాబు !!

September 1, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. 31 ఏళ్ల కింద ఇదే రోజు మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు . ఆ సందర్భంగా ఆయనను అభినందిస్తూ …

పడిలేచిన కెరటం . పొలిటికల్ సైన్స్ విభాగంలో Ph.D చేయతగ్గ జీవితం . అందరికీ తెలిసిందే ఆయన రాజకీయ జీవిత ప్రయాణం , ప్రస్థానం . కాంగ్రెసులో MLA అయి , అవసరం వస్తే మామ మీదే పోటీ చేస్తానని ప్రకటించి , ఒక సంవత్సరం లోనే అదే మామ పార్టీలో చేరిపోయిన ఫ్లెక్సిబుల్ లీడర్ .

Ads

చెన్నారెడ్డి అంతటి స్ట్రాంగ్ లీడరుకు వ్యతిరేకంగా రాజకీయం చేసే ధైర్యం గల యువ నాయకుడు . చెన్నారెడ్డిని మించిన టాల్ పర్సనాలిటీ , తెలుగు జన నాయకుడు యన్టీఆర్ దగ్గర నుండి పార్టీని లాక్కొని నిలదొక్కుకున్న మేధావి . మరోసారి పడి లేచిన కెరటం .

బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత భాజపాకు దూరం జరిగి, అదే భాజపాతో కలిసి 1999 లో పోటీ చేసి, రాజకీయ అధికారం చేజారకుండా మరోసారి పడిలేచిన కెరటం . వైయస్సార్ దూకుడు రాజకీయంతో 2004 లో అధికారం కోల్పోయి , పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి , 2014 లో మరోసారి పడిలేచిన కెరటం .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికే రానీయనని ప్రకటించి , అదే మోడీతో పొత్తుకు ఒప్పించి, మరోసారి పడిలేచిన నేర్పరి . వైయస్సార్ కుమారుడు జగన్ వీర దూకుడు రాజకీయంతో ఉక్కిరిబిక్కిరి అయి భాజపా నుండి విడిపోయి, వాజపేయికి భిన్నమైన మోడీ చేతిలో దెబ్బ తిని కెరటం పడిపోయింది .

అందరూ ఆయన పని అయిపోయిందని అనుకున్నారు . పార్టీ కనుమరుగు అవుతుందని అన్నారు . ఎప్పుడూ సేఫ్ జోన్ , కంఫర్ట్ జోన్ పాలిటిక్స్ చేసే కేర్ఫుల్ చంద్రబాబు 52 రోజులు జైలులో గడపవలసి వచ్చింది . అలా ఘోరంగా పడిపోయిన కెరటం, సహనంతో మోడీ చేతనే పొత్తుకు ఒప్పించి , జగనుకి రాజకీయంగా చుక్కలు చూపించిన పడిలేచిన కెరటం .

ఏ మోడీ అయితే son’s rise అని లోకేషుని విమర్శించాడో అదే లోకేషుని ప్రత్యేక ఆహ్వానం మీద మోడీ పిలిపించుకునేలా చేసిన కెరటం . ఇలా ఎన్నిసార్లు పడిందో , అన్ని సార్లూ లేచింది ఈ కెరటం . సాధారణమైన విషయం కాదు .

ఈ గెలుపులకు కారణం : అవకాశాలను రప్పించుకోవటం , వచ్చిన వాటిని మొహమాటపడకుండా వినియోగించుకోవటం . అందరూ అవకాశవాది అన్నా ఖాతరు చేయకుండా తన అజెండాతో ముందుకు సాగిపోవటం . గెలిచిన వాడే వీరుడు . అదే ఆయన ఫిలాసఫీ …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తిలక్ వర్మ రనౌట్ స్వీయ తప్పిదమే… కానీ వెస్టిండీస్ క్రీడాస్పూర్తి !?
  • వేకువ ఝామున వెన్నెల మరకలుగా… రేపటి వాకిట ముగ్గులుగా…
  • క్రాంతికుమార్ – తెలుగు సినిమా కథల ప్రయోగాల సాహసి !!
  • 3 Statues Of Liberty – మూడు విగ్రహాలకూ ‘విముక్తి’ అంతఃసూత్రం !!
  • ఆంధ్రా తూర్పు తీరాన్ని.. నువ్వుల తీరం అనీ పిలిచారని తెలుసా ?
  • ఓ అమెరికన్ గ్రౌండ్ జీరో ! మరి తెలంగాణ ‘గ్రౌండ్ జీరో’ మాటేంటి..?!
  • ఎన్టీయార్, దిలీప్‌కన్నా శివాజీ గణేశన్‌తోనే ఆ పాత్రకు న్యాయం !!
  • ఒక ఫోన్ కాల్ … ఒక అరెస్ట్ … వార్త పంపాక మొదలైన అసలు టెన్షన్…
  • దేశంలోనే మొట్టమొదటిసారి ఒక విలేకరిపై టాడా కేసు…
  • గాఢనిద్రలో ఉన్న చంద్రబోస్ తెలంగాణతనం సోయి తెచ్చుకుంది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions