యాంకర్ ప్రదీప్ ఓ చిల్లర్… తనకు ఎలాగూ లేదు… చంద్రబోస్‌కు ఏం పుట్టింది..? ఈ మాట అనడానికి, ఈ విమర్శ చేయడానికి ‘ముచ్చట’ సాహసిస్తోంది… నువ్వెన్ని పాటలు రాశావో, ఏం సంపాదించుకున్నావో పక్కన పెట్టు బ్రో… నీ కూతురు వయస్సున్న ఓ పొరుగు రాష్ట్రపు సింగర్ అమాయకత్వాన్ని పరిహసిస్తూ, వెకిలి చేస్తున్నప్పుడే నీ అసలు వికృతరూపం అర్థమైపోయింది… ఇక కాస్త మూసుకో భయ్……. అరెరె, విషయం ఏమిటీ అంటారా..? కాస్త వివరంగా చెప్పాలి… జీతెలుగు టీవీలో ఓ అట్టర్ ఫ్లాప్ షో వస్తుంది… దాని పేరు సరిగమప… రేటింగుల్లో ఎక్కడో దిగువన కొట్టుకుంటూ ఉంటుంది… దాన్ని లేపడానికి ఆ నిర్మాత ఎవరో గానీ హారికకూ, ప్రదీప్‌కూ ఓ లవ్ ట్రాకు పెట్టి, ప్రదీప్‌తో పిచ్చి పిచ్చి పంచులు వేయిస్తూ ఏదో ప్రయాస పడుతున్నాడు… వాడి బాధ వాడిది… కానీ..?
ఒక జడ్జి స్థానంలో కూర్చున్నవాడికి ఎంత పరిణతి ఉండాలి..? ఎంత పరిపక్వత ఉండాలి..? కాదు, కాదు, విజ్ఞత ఉండాలి కదా… చంద్రబోస్‌లో అవేమీ కనిపించలేదు… తన పక్కనే కూర్చున్న సంగీత దర్శకుడెవరో గానీ… తనకు కూడా ప్చ్, అవేమీ లేనట్టున్నయ్… ఎస్పీ శైలజ చాలా నయం… విషయం ఏమిటంటే..? యుతి అనే ఓ యువ సింగర్… పాపం, ఇంకా ఇంటర్ కూడా దాటలేదు, తెల్లారిలేస్తే ఆమెకు సంగీతమే లోకం… టీన్స్ కూడా దాటలేదు పాపం… జనరల్ నాలెడ్జి తక్కువ… ఇంకేముంది..? ఈ చిల్లర్ ప్రదీప్‌కు దొరికిపోయింది… పోయిన ఎపిసోడ్‌లోనే పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ఆమెను వెకిలి చేసే ప్రయత్నం చేశాడు… పెద్ద తనకేదో అన్ని విషయాలూ తెలిసినట్టు… బేకార్ ఆద్మీ… ఆ ఎపిసోడ్ మీద ‘ముచ్చట’ రాసిన కథనం ఇదుగో… ఇదీ లింకు…
Ads
ప్రదీపా, నీకు బాగా ఎక్కువైంది బిడ్డా…! వేదిక మీద ఆమెకు ఆ ర్యాగింగు ఏమిట్రోయ్..?!
సరే, ఒక ఎపిసోడ్ అయిపోయింది… మళ్లీ అదే తంతు… ఈసారి కూడా సేమ్, మళ్లీ అదే పైత్యం… అదే యుతితో..! సూపర్ సిక్స్‌లో ఎంత మంది ఉంటారో తెలుసా అని స్టార్ట్ చేశాడు… ఇంకేదో జవాబు ఆశించి, ఇంకాస్త వెకిలి చేయాలని అనుకున్నాడు… ఆమె సిక్సే ఉంటారని చెప్పింది… ప్రదీప్ మొహం మాడిపోయింది… అసలే ఈమధ్య బాగా “అతి” చేస్తున్నాడు కదా… ఏయ్, నాగార్జున డ్యాం, ఇటురా… (అతిన్నర) ఒకసారి అని పిలిచి, హైదరాబాదులో ఏ బీచ్ ఉంది అనడిగాడు… గత ఎపిసోడ్లో వెటకారాలు గుర్తొచ్చి, హైదరాబాదులో ఉండేది మూసీ అని గుర్తొచ్చి… ఆమె మూసీ అని బదులిచ్చింది… హహహ, హెహెహె… ఇంకా నయం, ఇంకొన్నాళ్లయితే చాదర్‌ఘాట్ బీచ్, చార్మినార్ బీచ్ వస్తాయి అని వెక్కిరించాడు మన చిల్లర్… నిజానికి అది ఏదో కామెడీ పంచ్ వేసినట్టు లేదు… ఎదుటివాళ్ల అమాయకత్వం మీద జోకులు వేసి నవ్వుకునే మూర్ఖత్వం… ప్రదీప్ వేస్తే వేశాడు పంచ్… తనకెలాగూ లేదు..? ఈ షో నిర్మాతకూ లేదు… మరి జడ్జి స్థానంలో కూర్చున్న చంద్రబోస్‌కు ఏమైంది..? పకపకా నవ్వాడు.,. ఇదా నీ మెచ్యూరిటీ లెవల్ చంద్రబోసూ… పెద్దగా పనేమీ ఉండటం లేదు కదా ఈమధ్య నీకు..? వీలయితే ఇండియన్ ఐడల్ షో చూడు ఓసారి… ఆ జడ్జిలు కంటెస్టెంట్లతో ఎలా కలిసిపోతారో చూడు… ఎంత సరదాగా, ఎంత హృద్యంగా షో ఉంటుంది చూసి, ఈ సరిగమప బాధ్యులు అందరూ కట్టగట్టుకుని సిగ్గుపడండి… ఇక్కడ ఈమె వయస్సెంత..? ఇక్కడ జరిగేది పాటల పోటీలా,.? లేక హైదరాబాద్ మీద జనరల్ నాలెడ్జి పోటీలా..? పైగా ఆమె అమాయకత్వం మీద విసుర్లా..? ఫాఫం, ఈ దిక్కుమాలిన పోటీకి ఆమె రాకుండా ఉండాల్సింది… శ్రావ్యమైన కంఠం, మంచి సాధన, పొరుగు భాషే అయినా తెలుగు ఉచ్ఛారణ మీద పట్టు ఉన్నాయి నీకు… ఈ దిక్కుమాలిన వాళ్ల మధ్యకు వచ్చి పడ్డావేం తల్లీ..?!
Share this Article